19, సెప్టెంబర్ 2024, గురువారం

హైందవం వర్ధిల్లాలి 5*

 *హైందవం వర్ధిల్లాలి 5*




మన గ్రూప్ లో నాలాంటి సాధారణ సభ్యులతో పాటు ఆధ్యాత్మిక పండితులు, వారి వారి రంగాలలో శిఖరాగ్రాన ఉన్న మరియు విశ్రాంత మాన్యులు, జ్ఞానులు, విజ్ఞానులు ఉండవచ్చును. *మళ్ళీ ఈ బాలశిక్ష పాఠాలు ఎందుకని విస్మయం చెందగలరేమో*, దయచేసి మన దేశంలో *హైందవ ధర్మానికి మరియు ఆచారాలకు విఘాతం కలుగుచున్న ప్రస్తుత ప్రయత్నాలను ఒకసారి అవలోకించగలరు*. 


విధర్మీయమైన/అధర్మయుక్త ఆలోచనలతో, విదేశీయమైన (పాశ్చాత్య) అలవాట్లతో కలుషితమైన మనుష్యుల మనస్సులు ఒక పట్టాన సనాతన ధర్మ ప్రబోధాలను, సాంస్కృతిక సదాచారాలను వంటబట్టిచ్చుకోలేక పోవుచున్నాయి. పైపెచ్చు మన *సమోన్నత సనాతన ధర్మ విలువలను జీర్ణించుకోలేక ఈర్ష్య అసూయలతో మన హైందవ ధర్మనాశనానికి ముప్పేట(ఇస్లాం, క్రిస్టియన్, కమ్యూనిస్టు) దాడి* జరుగుచున్నది.


 అధునాతనులు పెద్దల ప్రవచనాలను అంతరంగమున ఒప్పుకున్నా, బహిరంగంగా వారి స్వప్రయోజనాలు, స్వార్ధము కొరకు దైహిక మరియు మానసిక బలహీనతలకు తల ఒగ్గి విదేశీ సంస్కృతికి లోబడుతూనేఉన్నారు. ధర్మ మరియు దేశ ప్రయోజనాలను ఉపేక్షిస్తున్నారు.


ఆధ్యాత్మిక సాధనకు, వ్యక్తిగత సంస్కారాలకు (ఉపాధి, జీవన యాత్ర ఇత్యాది) మాత్రమే మతాన్ని, ఋజు వర్తనను అన్వయించుకునే హిందువులకు *మతాన్ని రాజకీయము కొరకు మరియు సామాజిక ప్రాబల్యము కొరకు వినియోగించుకునే స్వభావము ఉండదు*. ఈ ధోరణి *అన్యులకు గూడా ఉంటే అన్ని మతాలు, వర్గాలు సామరస్యముతో ఉంటాయి*.


*కాని, ఆలా జరుగడము లేదు*. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశాన్ని ఏలాలనే ఉద్దేశ్యంతో, దేశాభిమానము కల నాయకులపై (పార్టీలకతీతంగా) ప్రత్యర్థి వర్గము వారు, హైందవ ధర్మానికి, దేశానికి హాని కల్గిస్తూనేవున్నారు. *హైందవ వ్యతిరేకతను అడుగడుగునా ప్రత్యక్షంగాకూడా ప్రకటిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు*. 

ఇంతే కాదు కదా దేశ భద్రతను, రక్షణను విస్మరించి కొందరు రాజకీయ నాయకులు ముష్కర మూకలను/విధ్వంసకారులను హద్దు దాటించి మనదేశంలోకి నిస్సిగ్గుగా దొంగ దారిలో ప్రవేశం కల్పించి మితిమీరి బుజ్జగించడము, ఓటు బ్యాంకుగా వాడుకుని 

వారి అకృత్యాలను నిర్లజ్జగా సమర్థిస్తున్నారు గూడా. *క్రమం తప్పకుండా నేటి దేశ సమాచారాన్ని గమనించే వారికి పైవన్నియు కరతలామకములే*.


హిందువులకు ఐకమత్యము పట్ల ధృఢ సంకల్పము, భావన లేదని, రాదని గట్టి నమ్మకము అన్యులకు కల్గుతున్నది. ఇందుకు కారణము ముమ్మాటికీ అధిక భాగము, అధిక శాతము హిందువులే. ఆశ్చర్యకరంగా కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా తమ ఉనికి, మనుగడ, అభివృద్ధి నిమిత్తమై ఎవరికీ హాని కూడా తలపెట్టిని *హిందు వ్యతిరేకతను బలంగా, బాహాటంగా చాటుతున్నాయి. సెక్యులర్ అనే పదము వీటన్నిటినీ సమర్థిస్తున్నది, దీనికి సగటు పౌరుడు నిశ్చేష్టుటవుతున్నాడు*. ఈ సెక్యులర్ *అనే పదము దేశ ద్రోహులకు భేదింపబడని కవచము*.


ఈ నేపథ్యంలో దేశ మరియు ధర్మ రక్షణ కొరకు భారతీయులు ముఖ్యంగా *హిందువులు తమ ఐక్యతను, బలాన్ని స్పష్టంగా, సంఘటితంగా* కుహానా రాజకీయ నాయకులకు, అందులోనూ హిందు దేవుళ్ళను కించ పర్చే మరియు ధర్మాన్ని బలహీనపర్చే కుత్సితులకు, *స్వదేశీ, విదేశీ ఉగ్రవాదులకు తెలియజేయాలి*. 


*హిందువులై ఉండి హిందు ధర్మాన్ని వ్యతిరేకించే వారిని, చేరదీసే బుజ్జగించి స్వధర్మ ఔనత్యము గురించి వివరించాలి, సరైన దారిలో పెట్టే బాధ్యత మన ప్రతి భారతీయుడికి ఉన్నది*, ఉంటుంది. ఉండాలి కూడా.... *లేకుంటే భారత దేశవాసులు ముఖ్యంగా మన భవిష్యత్తరాల హిందువులకు "తమ ఉనికికి తామే ప్రమాదము కలిగించుకున్న వారవుతున్నారు"*.  

తమకే కాక దేశ భద్రతకు, సమగ్రతకు విఘాతము కల్గించిన వారు కూడా అవుతారు. *ఇది క్షమించలేని నేరము*. 


*గమనిక*

స్వధర్మ రక్షణ అంటే పర ధర్మజన హింస కాదు. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, ఐకమత్యంమే మనముందున్న ఏకైక సాధనం, తద్వారా హిందూ మతానికి పునర్వైభవం తేవాలి* 

ఇప్పుడే పూనుకోకపోతే..... *ఆలస్యం అమృతం విషం* 


ధన్యవాదములు.

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: