5, నవంబర్ 2020, గురువారం

హిందూ ధర్మం - 37**

 **దశిక రాము**


**హిందూ ధర్మం - 37** 


అస్తేయం గురించి మరికొంత చెప్పుకుందాం. ఈ శరీరం మన పూర్వీకులు నుంచి తీసుకున్న అప్పు అయితే, ఈ ప్రకృతి మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు అన్నాడు ఒక మహానుభావుడు. మనం చెడు తిండ్లకు, ధూమపానం, మద్యపానంకు అలవాటు పడి, ఆరోగ్యాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటే, అది మన తరువాత వచ్చే మన పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మనం ఏం చేస్తున్నాం? రాబోయే తరానికి కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే హక్కు ఉన్నది, మనం లేనిపోని అలవాట్లకు బానిసలమై వారి హక్కులను కాలరాస్తున్నాం. మనకు వారి హక్కులను కాలరాసే అధికారం ఎక్కడిది? అస్తేయం అంటే రాబోయే తరాలవారి హక్కులకు విఘాతం కలుగకుండా జీవించడం, లేనిపోని రోగాలను మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వకపోవడం.


పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది అంటుంది వేదం. అది మగపిల్లవాడైనా, ఆడపిల్లైనా వేదం అందులో మినహాయింపు ఏమీ ఇవ్వలేదు. ఆడపిల్లవి, నీకు చదువు ఎందుకు, ఇంతవరకు చదివింది చాలు, ఇక ఇంట్లో కూర్చో అని చెప్పి, ఆమెను నిలువరించడం, ఆమె చదువుకునే హక్కును మీ చేతుల్లోకి తీసుకోవడం, కాలరాయడం స్తేయం. దానికి విరుద్ధంగా ఉండడం అస్తేయం.


కొందరు రోడ్డు మీద నడుస్తూ సిగిరెట్టు కాలుస్తారు, అక్కడున్న గాలిని కలుషితం చేసి, తద్వారా ఇతరల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. మీకు ఇతరుల ఆరోగ్యాలను, జీవితాలను నాశనం చేసే అధికారం మీకు లేదు. మీరు వారు జీవించే హక్కును కాలరాస్తున్నారు. మీది కానీ దాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అంటే అస్తేయాన్ని విడిచిపెడుతున్నారు అంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడైనా చాలా లోతుగా చెప్తుంది, ధర్మానికి పరిమితి, పరిధి అన్నవి ఉండవు. ధర్మం స్పృశించని విషయం అంటూ ఉండదు.


తరువాయి భాగం రేపు.......

🙏🙏🙏

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

సుభాషితము

 सुभाषितम्

సుభాషితము

SubhAshitam


कल्पान्त एतदखिलं जठरेण गृह्नन् शेते पुमान् स्वदृगनन्तसखस्तदङ्के।

यन्नाभिसिन्धुरुहकाञ्चनलोकपद्मगरभे द्युमान् भगवते प्रणतोस्मि तस्मै।।


కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్నన్ శేతే పుమాన్ స్వదృగన్తసఖస్తదఙ్కే।

యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మగర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోఽస్మి తస్మై౹౹

(శ్రీమద్భాగవతము చతుర్థస్కన్ధము నవమోఽధ్యాయము)


'ఓం నమో భగవతే వాసుదేవాయ' - ఈ ద్వాదశాక్షరీ మంత్రమును ఉపదేశముగా దేవర్షి నారదుని నుండి పొంది అకుంఠిత దీక్షచే జపించి సాక్షాత్కారమైన ఆ శ్రీమన్నారాయణుని దర్శించిన ధృవుడు ఆయనను ఈ విధముగా స్తుతించుచున్నాడు:


ఓ పరమపురుషా! కల్పాంతకాలమునందు ఈ అఖిల విశ్వమును జఠరముచే గ్రహించి తమరివలెనె అనంతుడై సఖుడైన  ఆ శేషుని అంకశయ్యపై పవళ్ళింతురు. ఎవరి నాభి సరోవరము కాంచనలోకమై పద్మగర్భమై  దివ్యాకాశమైనదో  భగవంతుడైన ఆ తమరికి ప్రణమిల్లుచున్నాను.


సీ. సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ యఖిల ప్రపంచంబు నాహరించి

     యనయంబు శేషసహాయుండవై శేష పర్యంక తలమునఁ బవ్వళించి

     యోగనిద్రా రతినుండి నాభీసింధుజ స్వర్ణలోక కంజాత గర్భ

     మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు రుచినొప్పు బ్రహ్మస్వరూపివైన


తే. నీకు మ్రొక్కెద నత్యంత నియమొప్ప

     భవ్యచారిత్ర! పంకజ పత్రనేత్ర!

     చిరశుభాకార! నిత్యలక్ష్మీ విహార!

     యవ్యయానంద! గోవింద! హరి ముకుంద!

(పోతనామాత్యులు - ఆంధ్రమహాభాగవతము)

నిజమైన ధనవంతుడు

 Sreenivasa Murthy Chittamuri:

నిజమైన ధనవంతుడు

ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.

రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కార్మాగారాలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”


“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.

చిట్టికథ

 ✍️..నేటి చిట్టికథ




ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఎర దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు.


 గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ ఆ పేదవాడు కలత చెందుతున్నాడని అతని పై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది.


 వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.


కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. 


అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను చంపేసాడు.


హంస కింద పడి చనిపోతూ, ఇలా అన్నది...


నేను నీకు సేవ చేస్తున్నాను, నీకు నీడ ఇస్తున్నాను, నీవు నన్ను చంపావు.. ఇందులో నా తప్పు ఏమిటి.. అని.


అప్పుడు వేటగాడు ఇలా అన్నాడు...


http://T.me/namonarayana


నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు, నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి, నీ ఆచారాలు స్వచ్ఛమైనవి, నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.


అందుకే మన పూర్వీకులు, పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని...



🍁🍁🍁🍁🍁


ఆది శంకరులు తమ భజగోవిందం లో ఇలా అంటారు...



సత్సంగత్వే నిః సఙ్గత్వం 

నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |

నిర్మోహత్వే నిశ్చలతత్త్వం

నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||



 జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.


🍁🍁🍁🍁🍁

S

























 

ఇంకా మెదలు








 

ప్రవచనములు










 

చిరుతతో


 

Shankar


 

ఆచరించే ధర్మం ,

 నువ్వు కట్టుకున్న వస్త్రాం , నువ్వు తిరిగే వాహనం, నువ్వు అనుకున్నే  నీ శరీర అందం,

ఇవి అన్నీ ఏదోఒక రోజు ఉండకపోవచ్చు కానీ, నువ్వు ఆచరించే ధర్మం , భగవంతుడి పట్ల  

ఎల్లపుడూ నీకు ఉన్న భక్తి , నీ సత్బుద్ధి , 

నీ సత్ప్రవర్తన , నీ నిజాయితీ ,ప్రతీ ప్రాణిలో భగవంతుని చూసే నీ గుణం, ప్రతీ స్త్రీ లోని 

అమ్మవారి చూడగలగడం. ఈ గుణాలు అన్నీ

కలగడం నిజంగా మహా మనిషిని చేస్తాయి,అది అసలైన మనిషికి అందం , అభరణం. అంతేకానీ నువ్వు కంటితో చూసేది కాదు అందం,హోదా, అంటే ... ఇంకా ఎన్ని రోజులు లౌకికవాటి పట్ల ఆకర్షణతో, మోహాలతో, వెంపర్లలాడుతూ      తిరిగుతావు............       

*దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. *            శరీరపటుత్వం, ఆరోగ్యం, ఓపిక , బలం , ఉండగానే, ఈ మానవజన్మ , ఈ చక్కటి శరీరం నీకు ప్రాసాదించినందుకు భగవంతుడి పట్ల కృతఙ్ఙతతో , భక్తిశ్రద్ధలతో ,ఇష్టాతో ఎంతో, విధేయుడై ఉండి జీవితాని సార్ధక్యం చేసూకో................


                    🙏 శ్రీ ఆదిశంకరాచార్యులు🙏

దేవుడి వైపు కు


దేవుడి వైపు కు నడుద్దాం....


   ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి  రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా  గుర్తుందా ? అందుకే దేవస్థానానికి  రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే  ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే  నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. ''  


   అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు  దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా.  నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం  దైవ సాక్షాత్కారం  [ God realisation] అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.


🌷🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳

[

: 💐💐#అష్టాదశశక్తిపీఠాలు.!!

#విశిష్టఫలితాలు💐💐

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.


 💐ఆ క్షేత్రాల గురించిన వివరాలు...💐


1.శాంకరీదేవి💐

లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.


2.కామాక్షి💐


సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.


3.శృంఖల💐


అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.


4.చాముండి💐


హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.


5.జోగులాంబ💐


మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.


6.భ్రమరాంబిక💐


విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.


7.మహాలక్ష్మి💐


రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.


8.ఏకవీరాదేవి💐


మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.


9.మహాకాళి💐


సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.


10.పురుహూతిక💐


పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.


11.గిరిజాదేవి💐


గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.


12.మాణిక్యాంబ💐


సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.


13.కామాఖ్య💐


అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.


14.మాధవేశ్వరి💐


అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.


15.సరస్వతి💐


పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.


16.వైష్ణవీదేవి💐


అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.


17.మంగళగౌరి💐


సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.


18.విశాలాక్షి💐


సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.


ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.


కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

ఓం..శనైశ్చ రాయనమః.


సద్గురుదేవుని దివ్య గుణాల చింతన వల్ల శిష్యుని చిత్తం కూడా అలాంటి గుణాలు కలదిగా మారుతుంది.గురువు లేకపోవడం వల్లనే మనిషి దుఃఖితుడౌతాడు,గురువుని పోందితేనే సుఖంగా ఉంటాడు.అందుకే గురువు యందు సంపూర్ణ ఆత్మ సమర్పణ గావించుకుని గురుభావాన్ని సోంతం చేసుకోవాలి.కోద్దిగా ధ్యానం అయ్యింది,కోద్దిగ క్రియలు జరిగాయి,కోద్దిగ జ్యోతి కనిపించింది ఇది గురు భావం కానేకాదు,గురుభావం దీనికంటే ఎంతో దూరాన ఉంటుంది.నువ్వు నీ గురువు పట్ల ఎంతగా భావాన్ని పెంచుకుంటావో అంతగానే ఉన్నత భూమికలోకి చేరుకుంటారు .అలాంటి గురువు పట్ల ఎలా నడుచుకోవాలి,నువ్వే ఆలోచించుకో.!*🌹

*సర్వం గురు చరణారవిందార్ప నమస్తు.*🌹🙏🌹

*🙏జై సద్గురుదేవ*🙏

*🌹అజ్ఞాన అంధకారాన్ని తోలిగించి ఆత్మ ప్రకాశాన్నిచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉండేవారిని గురువు సద్గురువంటారు.*🌹

*సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్ప నమస్తు*

*🙏జై సద్గురుదేవ*🙏

🙏🌹🌹👣🌹🌹🙏

[: *🌹

సద్గురుదేవుని దివ్య గుణాల చింతన వల్ల శిష్యుని చిత్తం కూడా అలాంటి గుణాలు కలదిగా మారుతుంది.గురువు లేకపోవడం వల్లనే మనిషి దుఃఖితుడౌతాడు,గురువుని పోందితేనే సుఖంగా ఉంటాడు.అందుకే గురువు యందు సంపూర్ణ ఆత్మ సమర్పణ గావించుకుని గురుభావాన్ని సోంతం చేసుకోవాలి.కోద్దిగా ధ్యానం అయ్యింది,కోద్దిగ క్రియలు జరిగాయి,కోద్దిగ జ్యోతి కనిపించింది ఇది గురు భావం కానేకాదు,గురుభావం దీనికంటే ఎంతో దూరాన ఉంటుంది.నువ్వు నీ గురువు పట్ల ఎంతగా భావాన్ని పెంచుకుంటావో అంతగానే ఉన్నత భూమికలోకి చేరుకుంటారు .అలాంటి గురువు పట్ల ఎలా నడుచుకోవాలి,నువ్వే ఆలోచించుకో.!*🌹

*సర్వం గురు చరణారవిందార్ప నమస్తు.*🌹🙏🌹

*🙏జై సద్గురుదేవ*🙏

[: అంతర్దర్శనం.....


మన కళ్ళు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు. కనిపించే ఈ బాహ్య ప్రపంచాన్ని విశ్లేషిస్తే దీనితో మన సంబంధం అంతా మనసులోనే జరుగుతుందని తెలుస్తుంది. అంతరేంద్రియంగా ఉన్న మనసు లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని అనుభవించలేం.


మన పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం ద్వారా విషయాలను గ్రహించటం చేత మనసు తాను దేహాన్నని భావిస్తోంది. దేహస్మృతి వల్ల ఏర్పడ్డ దేహ భావన, మన సత్యమైన ఉనికిని తెలుసుకోనివ్వటంలేదు.


అందుకే శ్రీ రమణ మహర్షి వారు ఇలా చెప్పారు...


దేహస్మృతి లేకపోతే ప్రపంచం లేదు..

మనసు లేకపోతే దేహస్మృతి లేదు..

చైతన్యం లేకపోతే మనసు లేదు..

సత్యవస్తువు లేకపోతే చైతన్యం లేదు..

మనకి.. ఈ ప్రపంచానికి మూలంగా ఉన్న సత్యవస్తువును తెలుసుకోవటమే 'ఆత్మ విచారణ'...

[05/11, 8:56 am] +91 93913 24915: శివానందలహరి

76_ వ   శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":

శ్లోకం:

  " భక్తిర్మహేశపదపుష్కర మావసంతీ

     కాదంబనీవ కురుతే పరితోష వర్షమ్

     సంపూరితో భవతి యస్యమనస్తటాకః

     తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్ ".


తాత్పర్యము :


భక్తి   పరమేశ్వరుని పాదాలనే ఆకాశాన్ని ఆశ్రయించి

మేఘమాలవలె ఆనంద వర్షాన్ని కురుస్తుంది.  ఎవరి

మనస్సనే తటాకము ఆ ఆనంద వర్షంతో నిండు తుందో వారి పుట్టుక అనే పైరంతా సఫలమవుతుంది.

ఇతరమైనది నిష్ఫలము. పరమేశ్వరుని పాదము లందు భక్తి కల్గి యున్నవారి జన్మము ఆనందమయమై 

సార్థకము చెందుతుంది. ఇతరులది కాదు.


వివరణ :


ಓ ప్రభూ ! శంకరా! నా భక్తి ఎక ౘక్కని మేఘమాల.

అది విలాసంగా  పరమేశ్వరుడవైన నీ పాదములనే 

ఆకాశంలో విహరిస్తుంది. అది ఆనందమనే అమృత వర్షాన్ని కురుస్తుంది.  ఆ ానందవర్షంలో ెవరి మనస్సనే చెరువు నిండుకుందో , వారి జన్మమనే పంట, సర్వమూ సఫలమవుతుంది.  తక్కిన వారి

జన్మలకు ఆ సౌభాగ్యం కలుగదు.


ఈ శ్లోకం లో శంకర భగవత్పాదులు భక్తిని మేఘంగా

వర్ణించారు.  మేఘము ఆకాశంలో షుండి వర్షము

కురిపిస్తుంది.  భక్తి భగవంతుని పాదంలో ఉండి

ఆనందమును వర్షిస్తుంది. వర్షం కురిస్తే  ఆనీటితో

చెరువు నిండుతుంది. ఆచెఱువు నీటితో మాగాణి

పొలాలు ౘక్కగా పండుతాయి. భక్తి మేఘం కురిపించే

ఆనంద వర్షంతో హృదయం నిండి జన్మ సాఫల్యం

అవుతుంది. భగవంతుని పాదములందలి భక్తి చేతనే

ఆనందము ప్రాప్తిస్తుంది.  ఆనంద ప్రాప్తి వల్లనే జన్మ 

సాఫల్య మవుతుందని శంకరులు చెప్పారు.

[: *

🌺🙏ఉన్నదంతా ఈ క్షణమే🙏🌺*


*_🌴 లోకంలో శాశ్వతమైనదంటూ ఏదీలేదు. బంధుమిత్రులంతా మనలను ఏదో ఒక రోజు వదలిపోవాల్సిందే. చివరికి 'నేను.. నాది' అనే మమకారం పెంచుకున్న ఈ శరీరాన్ని కూడా మనం వదలిపోవాల్సిందే. సంపద ,అందం , అధికారం మనం పోయాక మనతో వచ్చేవి కావు. మన మంచి చెడ్డల ఫలమే మనల్ని వెంటాడుతూ వస్తుంది. మనిషి జీవితంలొే తరువాత అనేదంటూ మన చేతిలో లేదు. ఉన్నదంతా ఈ క్షణమే. కనుక మంచిని చేయాలి. మంచినే ఆశ్రయించాలి. నాస్తికత అనేది ఒక పెద్ద అంటువ్యాధి. దానిని దగ్గరికి రానివ్వొద్దు. మన వలన పదిమంది సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. నిస్వార్ద పరులకే భగవంతుడు చిక్కుతాడు. కనుక ఇకనైనా మేల్కొందాం. భగవంతుడు చూపిన మార్గంలో నడుచుకుందాం.🌴_*

: 🎊💦🌹🦚🌈💦🎊

      

         *పుష్పం నుంచి సుగంధాన్ని,*    

     

  *నువ్వులనుండి నూనెను,* 

  

  *పాలనుండి వెన్నను,* 


     *ఫలం నుంచి రసమును,* 


     *ఆరణి నుంచి అగ్నిని* 


    *ఏ విధంగా తగిన*


 *ఉపాయాలతో వేరుచేసుకోవచ్చో,* 

     *అలానే* 


 *మనదేహంలో గల ఆత్మ జ్ఞానాన్ని వేరుపరచి,* 


 *ఉపయోగించి గొప్పవారు కావచ్చును*.........


   🎊💦🌹🌈🦜💦🎊


: *తుంగభద్ర పుష్కర సమాచారపు మెసేజ్ 1*

🌅💐🌹🌈☔🍇🔥📗🙏

*తుంగభద్రా నది పుష్కరములు.*


*తుంగభద్రమ్మ చెంతలో పుష్కరుడు తేదీ.20.11.2020 (శుక్రవారము) నాడు చేరి తేదీ.01.12.2020 (మంగళవారము) వరకు ఉంటున్నాడు.  జీవనదిగా పేరున్న "తుంగభద్రమ్మ '' పుష్కరాలకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.*


భారతదేశపు పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రములోని సహ్యాద్రి పర్వతముల మీదుగా ప్రవహించి *"గంగ మూల''* వద్ద మొదటగా తుంగ, భద్ర లు రెండు వేరు వేరు నదులుగా  పేరొంది అక్కడ నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రంలో *" కూడలి ''*  వద్ద ఒకటిగా కలిసి *" తుంగభద్ర నదిగా ''*  రూపాంతరము చెంది శృంగేరి , హౌస్ పేట్(తుంగభద్ర) రిజర్వాయర్లలో మజిలీ చేసి  హంపి మీదుగా ప్రవహిస్తూ బళ్ళారి జిల్లాలో ప్రవహించే *" హగరి ''*  నదిని కలుపుకొని అక్కడి నుండి 250 కిలోమీటర్లు ప్రవహించి , కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లోని కౌతాళం మండలము *" నదిచాగి ''*  అనే గ్రామము నుండి  ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టింది. 


అక్కడనుండి రామాపురం, మంత్రాలయం, నాగలదిన్నె ,గురజాల, సంఘాల, గుండ్రేవుల , ఈర్లదిన్నె, కే సింగవరం, *" కొత్తకోట రాఘవేంద్ర స్వామి మరియు గుంటి రంగస్వామి దేవాలయముల సమీపములో ''*  నుండి సాగుతూ  *" సుంకేసుల (కోట్ల విజయభాస్కర్ రెడ్డి) రిజర్వాయర్లో ''* సేదతీరి ఆర్. కొంతలపాడు, జి సింగవరం, మామిదాల పాడు, కర్నూలు నగరముల మీదుగా ప్రవహించి  *" అలంపూర్ క్షేత్రానికి ''*  ఆరు కిలోమీటర్ల దూరములో *" సంగమము ''* వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.ఈ నది మొత్తము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులలో దాదాపు 85 మైళ్ళ దూరము పప్రవహించుచున్నది.


*తుంగభద్రా నది ''*  అతి ప్రాచీనమైన మహానది. అత్యంత పురాతనమైనది అని చెప్పవచ్చు. ఇందుకు రామాయణ కాలముకంటే ముందుగానే నదీ ఉండేదిని చెప్పడానికి ఆధారాలున్నాయి.


 వాల్మీకి రామాయణములో *" శ్రీరాముడు ''* సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవునితో చెలిమి చేసిన *" ఋష్యమూక పర్వతము ''*  తుంగభద్రా నది తీరంలోని నేటి *" హంపి  క్షేత్రములో ''*  ఉన్నది.  రామాయణములో పేర్కొన్నందున తుంగభద్రా నది రామాయణ కాలముకంటె ముందునుంచే ఉన్నట్లు మనకు స్పష్టమవుతున్నది.


*తుంగభద్రా నది పరివాహక ప్రాంతములో అనేక " ఔషధ లక్షణములు '' గల వృక్షములు ఉన్నాయని  ఈ వృక్షముల మీదుగా ప్రవహించిన నీరు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నదని చెబుతారు. ఉత్తరాదిన స్నానమునకు " గంగ '' ఎంత ముఖ్యమైనదో, పవిత్రమైనదో దక్షిణమున "తుంగ '' అంతటి ముఖ్యమైన, ఔషధ లక్షణములుగల నీరు కలిగినదని ప్రఖ్యాతి పొందినది.*


*అందువలననే " గంగా స్నానము తుంగా పానము '' అనబడే నానుడి పుట్టినది.*


భారత కాలమానము ప్రకారము దేశము లోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయములో  వస్తాయి. బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్నంతకాలము ఆ నదిలో పుష్కరము ఉన్నట్లు లెక్క. ఒక సంవత్సర కాలముపాటు ఆయా రాశుల్లో ఉండటము జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగాను, సంవత్సరములోని చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగాను పిలుస్తారు. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడము జరుగుతున్నది.

🌅💐🌹🌈☔🍇🔥📘🏵️

⚫🟠🟤🟢🟠⚫🟤🟢🟠⚫🟤🟢

సమర్పణ :—

*🦅శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చరస్వామి దేవస్థానము - వినుకొండ. (రి.నం-14/2018)*

*( 🛕మన 2️⃣ తెలుగు రాష్ట్రాల లోనే తొలిసారిగా  ఆగమశాస్త్ర విధి విధానాలతో నిర్మాణమౌతున్న సతీ సమేత ఆలయం)*

{సంగండెయిరి పాలకేంద్రం పక్కన , నరసరావుపేట రోడ్డు - వినుకొండ  - గుంటూరుజిల్లా ఆంద్రప్రదేశ్ }

*👉వ్యవస్థాపక అధ్యక్షులు:- పరమేశ్వర జానపాటి (శని ఉపాసకులు - శివగురుస్వామి వివరములకై Cell : 8520096175)*

🟠⚫🟤🟢🟠⚫🟤🟢🟠⚫🟤🟢

[05/11, 8:56 am] +91 93913 24915: *గురువారం --: 05-11-2020 :--*

  

         *జననానికీ , మరణానికి* ఒక *టైం* ఉన్నట్లే , మన జీవితంలో జరిగే *ప్రతి* పనికి ఒక *టైం* రాసిపెట్టి ఉంటుంది . అది రానిదే ఎంత *ఆరాటపడిన* ప్రయోజనం ఉండదు 

      

         మిత్రమా నీకు *గౌరవం* వచ్చాక మన *గతం* మరువకు మన అవసరం *తీరాక* మనకు *సాయం* చేసిన *వ్యక్తిని* మరువకు .


       నేను తగ్గుతున్నాను అంటే *తప్పు* చేశానని కాదు *బంధానికి* విలువ ఇస్తున్నానని *అర్థం* తప్పు చేయకుండా తలవంచను *నమ్మకం* లేని *చోట* వాదించను . *నమ్మకమైనా గౌరవమైనా ప్రాణమైనా* ఒక్కసారి *పోతే* మళ్ళీ తిరిగి రావు *బతకటం* గొప్ప కాదు *నిజాయితీగా* బతకడం గొప్ప .


     *అబద్ధాలు* చెప్తే ఒకరి మీద *నిందలు* వేస్తే ఈ *క్షణం* నీలాంటి *పది* మందికి నువు *కరెక్ట్* అనిపించవచ్చు కానీ *కాలం* నీకు *వ్యతిరేకంగా* మారే *రోజొకటివస్తుంది* ఆ రోజు మాత్రం ఖచ్చితంగా *వందలాదిమందిలో* నువు *దోషిగా* నిలబడాల్సిందే .


    *గొప్పతనం* అంటే ఏదో *సాధించడం , సంపాదించడం* కాదు మన మాటల వల్ల *కానీ* చేతల వల్ల కానీ ఎవరిని *హింసించకుండా* బతకగలిగితే మనం *గొప్పోళ్ళమే*

[05/11, 8:58 am] +91 93913 24915: *5.11.2020   ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*నవమ స్కంధము - ఇరువది నాలుగవ అధ్యాయము*


*విదర్భుని వంశ వృత్తాంతము*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*24.56 (ఏబది ఆరవ శ్లోకము)*


*యదా యదేహ ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః|*


*తదా తు భగవానీశ ఆత్మానం సృజతే హరిః॥8208॥*


భూమండలమున ధర్మము క్షీణించినప్ఫుడును, పాపము పెచ్చు పెఱిగినప్పుడును, ధర్మసంస్థాపనకై సర్వేశ్వరుడైన శ్రీహరి స్వయముగా అవతరించుచుండును.


*24.57 (ఏబది ఏడవ శ్లోకము)*


*న హ్యస్య జన్మనో హేతుః కర్మణో వా మహీపతే|*


*ఆత్మమాయాం వినేశస్య పరస్య ద్రష్టురాత్మనః॥8209॥*


పరీక్షిన్మహారాజా! ఆ శ్రీహరి మాయను (ప్రకృతిని) నియంత్రించువాడు, అసంగుడు (పుణ్యాపుణ్యకర్మల ఫలములు అంటనివాడు) , సర్వసాక్షి (సకలప్రాణుల యందును అంతర్హితుడై సర్వమునకును సాక్షీభూతుడై యుండువాడు), స్థావరజంగమాత్మకమయిన విశ్వమునందు అంతటను వ్యాపించి యుండువాడు. అట్టి పరమాత్మయైన శ్రీహరి యొక్క అవతారములకు, లీలావినోదములకు ఆ సర్వేశ్వరుని సంకల్పము దప్ప మరియొక హేతువు ఉండదు.


*24.58 (ఏబది ఎనిమిదివ శ్లోకము)*


*యన్మాయాచేష్టితం పుంసః స్థిత్యుత్పత్త్యప్యయాయ హి|*


*అనుగ్రహస్తన్నివృత్తేరాత్మలాభాయ చేష్యతే॥8210॥*


జీవులయొక్క ఉత్పత్తి, స్థితిలయములు అన్నియును ఆ పరాత్పరుని సంకల్ప ప్రభావములే. భగవంతుని మాయావిలాసమే జీవునియొక్క పుట్టుక, జీవనము, మృత్యువులకు కారణము. ఆ భగవంతుని అనుగ్రహమే మనకు ఆ  మాయను పోగొట్టి ఆత్మస్వరూపమును పొందింపచేయుటయే.


*24.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*


*అక్షౌహిణీనాం పతిభిరసురైర్నృపలాంఛనైః|*


*భువ ఆక్రమ్యమాణాయా అభారాయ కృతోద్యమః॥8211॥*


*24.60 (అరువదియవ శ్లోకము)*


*కర్మాణ్యపరిమేయాణి మనసాపి సురేశ్వరైః|*


*సహసంకర్షణశ్చక్రే భగవాన్ మధుసూదనః॥8212॥*


అసుర ప్రవృత్తిగలవారు (అసురులు) మహారాజుల రూపములలో విలసిల్లుచు, పెక్కు అక్షౌహిణుల సైన్యములకు అధిపతులై భూమండలమును ఆక్రమించి, పెక్కు ఆగడములకు (అకృత్యములకు) పాల్పడుచుండిరి. అట్టి స్థితిలో భూభారమును తొలగించుటకై శ్రీహరి (శ్రీకృష్ణుడు) బలరామునితో గూడి అవతరించెను. బ్రహ్మేంద్రాది దేవతలకును ఊహింపరాని లీలలను ప్రదర్శించి భూభారమును తగ్గించెను. (కంసాది దుష్టులను సంహరించి, భూభారమును తొలగించెను.


*24.61 (అరువది ఒకటవ శ్లోకము)*


*కలౌ జనిష్యమాణానాం దుఃఖశోకతమోనుదమ్|*


*అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం వ్యతనోద్యశః॥8213॥*


ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ అవతరించిన లక్ష్యము మిగుల విస్తృతమైనది. రాక్షస సంహారమొనర్చుట ద్వారా భూభారమును తొలగించుటకు దాని ముఖ్య ప్రయోజనమే యైనను, కలియుగమున జన్మించునట్టి భక్తులు ఆ స్వామియొక్క పవిత్రయశమును కీర్తించినను, వినినను వారి యొక్క దుఃఖశోకములను, అజ్ఞానమును రూపుమాపుచు వారికి పరమశ్రేయస్సును ఒనగూర్చుటద్వారా వారిని (భక్తులను) అనుగ్రహించుటయు దాని పరమప్రయోజనము.


*24.62 (అరువది రెండవ శ్లోకము)*


*యస్మిన్ సత్కర్ణపీయుషే యశస్తీర్థవరే సకృత్|*


*శ్రోత్రాంజలిరుపస్పృశ్య ధునుతే కర్మవాసనామ్॥8214॥*


భగవంతుని యశోగానము సత్పురుషుల కర్ణములకు అమృతప్రాయమైనది. అట్టి పవిత్ర (పరమ) యశస్తీర్థమును చెవులనెడి దోసిళ్ళద్వారా (చెవులార) ఒక్కసారి సేవించినను అట్టి వారి కర్మవాసనలు అన్నియును ప్రక్షాళితములగును.


*24.63 (అరువది మూడవ శ్లోకము)*


*భోజవృష్ణ్యంధకమధుశూరసేనదశార్హకైః|*


*శ్లాఘనీయేహితః శశ్వత్కురుసృంజయపాండుభిః॥8215॥*


*24.64 (అరువది నాలుగవ శ్లోకము)*


*స్నిగ్ధస్మితేక్షితోదారైర్వాక్యైర్విక్రమలీలయా|*


*నృలోకం రమయామాస మూర్త్యా సర్వాంగరమ్యయా॥8216॥*


భోజ, వృష్ణి, అంధక, మధు, శూరసేన, దశార్హ, కురు, సృంజయ, పాండు మొదలగు వంశములకు చెందినవారు శ్రీకృష్ణలీలలను సర్వదా శ్లాఘించుటకే ఆరాటపడుచుందురు. సర్వశ్లాఘనీయుడైన ఆ కృష్ణపరమాత్మ సౌహార్దపూర్వకములైన చిరునవ్వుల తోడను, చల్లని చూపులతోను, అనుగ్రహవచనములతోను, పరాక్రమ లీలలచేతను సర్వాంగ సుందరమైన రూపవైభవము చేతను మానవలోకమును ఆనందింపజేయుచుండును.


*24.65 (అరువది ఐదవ శ్లోకము)*


*యస్యాననం మకరకుండలచారుకర్ణభ్రాజత్కపోలసుభగం సవిలాసహాసమ్|*


*నిత్యోత్సవం న తతృపుర్దృశిభిః పిబంత్యో నార్యో నరాశ్చ ముదితాః కుపితా నిమేశ్చ॥8217॥*


శ్రీకృష్ణుని వదన వైభవము అపూర్వమైనది. ఆ స్వామియొక్క మనోజ్ఞములైన కర్ణములయందు శోభిల్లుచున్న మకర కుండలముల కాంతులు చెక్కిళ్ళపై ప్రతిఫలించుచు వాటి అందచందములను, ఇనుమడింప జేయుచున్నవి. విలాసవంతములైన  ఆ స్వామి చిరునవ్వులు అనుక్షణము కనువిందు గావించుచు, చూచెడి వారి మనస్సులను దోచుకొనుచున్నవి. ఆ విధముగా విరాజిల్లుచున్న ఆ ప్రభువు ముఖసౌందర్యామృతమును తమ చూపులద్వారా ఎంతగా ఆస్వాదించుచున్నను స్త్రీలకును, పురుషులకును తనివిదీరకుండెను. ఆ సంతోష సమయమున తమ దర్శనానందమునకు విఘాతమును  కలిగించుచున్న ఱెప్పపాటులను గూడ వారు సహింపలేకుండిరి. అందువలన వారు తమ ఱెప్పపాట్లపై కుపితులగుచు, 'దేవతలవలె మనమును అనిమిషులమై యున్నచో ఎంత బాగుండెడిది'  అని అనుకొనుచుండిరి.


*24.66 (అరువది ఆరవ శ్లోకము)*


*జాతో గతః పితృగృహాద్వ్రజమేధితార్థో  హత్వా రిపూన్ సుతశతాని కృతోరుదారః|*


*ఉత్పాద్య తేషు పురుషః క్రతుభిః సమీజే  ఆత్మానమాత్మనిగమం ప్రథయన్ జనేషు॥8218॥*


శ్రీకృష్ణుడు మధురయందు దేవకీ వసుదేవుల ముద్దులపట్టియై అవతరించెను. పిమ్మట నందగోపుని ఇంటికి చేరి, గోకులమునందు తన లీలలచే గోవులను, గోపాలురను, గోపికలను ఆనందింపజేసెను. వ్రేపల్లెలోనూ, మధురలోను, ద్వారకయందును దుష్టులైన శత్రువులను హతమార్చెను. రుక్మిణి మొదలగు ఎనిమిదిమంది రాకుమార్తెలను, పదునారువేలమంది తరుణీమణులను పెండ్లియాడెను. వారియందు వందలకొలది పుత్రులను బడసెను. ఆ ఆది పురుషుడు తనను శరణుజొచ్చినవారిని కరుణించెను. యజ్ఞపురుషుడును, యజ్ఞకర్తయును, యజ్ఞఫలభోక్తయును తానే ఐనను, వైదిక మర్యాదలను పరిరక్షించుటకును, వాటియెడ ప్రజలలో ఆదరాభిమానములను కల్గించుటకును ఆ స్వామి పెక్కు యజ్ఞములను ఆచరించెను.


*24.67 (అరువది ఏడవ శ్లోకము)*


*పృథ్వ్యాః స వై గురుభరం క్షపయన్ కురూణామంతఃసముత్థకలినా యుధి భూపచమ్వః|*


*దృష్ట్యా విధూయ విజయే జయముద్విఘోష్య  ప్రోచ్యోద్ధవాయ చ పరం సమగాత్స్వధామ॥8219॥*


శ్రీకృష్ణుడు కౌరవపాండవుల మధ్య సంభవించిన కలహము నిమిత్తముగా భూభారమును తొలగించెను. యుద్ధరంగమున తన చూపులతోడనే రాజుల సైన్యములను తుదముట్టించి, అర్జునునకు విజయమును చేకూర్చెను. ఉద్ధవునకు తత్త్వోపదేశమును గావించెను. ఇట్లు కృష్ణపరమాత్మ తస అవతార లీలలను ప్రదర్శించి, తన పరంధామమునకు చేరెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్వింశోఽధ్యాయః (24)*


ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  ఇరువది నాలుగవ అధ్యాయము (24)


🙏🙏🙏 ఇతి నవమస్కంధః సమాప్తః🙏🙏🙏

🌹🌹🌹ఓం తత్సత్🌹🌹🌹


*🌹🌹🌹తరువాయి దశమస్కంధము🌹🌹🌹*


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[05/11, 8:59 am] +91 93913 24915: *నేర్చుకొనే స్వభావం ఉన్నవాడికి, లోకం అంతా గురువులే*.


సజ్జనులందరూ మనిషికి గురువులే. వారి ప్రవర్తనే మనకు పాఠం. ‘చల్లగా సవ్యంగా బతకాలంటే శ్రీరామచంద్రుణ్ని ఆదర్శంగా తీసుకొని, ఆయనలా జీవించేందుకు ప్రయత్నించు. అన్ని విధాలా బాగుపడతావు. రావణుడి లాగా జీవించకు. నాశనమైపోతావు’ అని రామాయణం లాంటి గ్రంథాలు బోధించే నీతి. ఇది, ‘నాయనా, మీ బడిలో ఫలానా మంచి కుర్రవాడున్నాడన్నావే, వాడిలా చదువు. వాడితో తిరుగు. వాడిని అనుకరించు, విద్యాబుద్ధులు అలవడతాయి!’ అని తల్లిదండ్రులు 

తరచుగా తమ పిల్లలకు ఏదో ఒక రూపంలో చెప్పటం లాంటిదే. మంచివాడిని అనుసరిస్తే మనమూ మంచి మార్గంలోనే నడుస్తాం. మన పురాణాల్లో ఇతిహాసాల్లో కనిపించే కథలన్నీ చేసే ఉపదేశం ఇదే.


సజ్జనులు గురువులంటే, దుర్జనులు కూడా గురువులే అవుతారు. రాముడు గురువైతే, రావణుడూ గురువే. ఒకరు ఎలా నడుచుకొంటే బాగుపడతావో నేర్పిస్తారు. మరొకరు ఏం చేస్తే నాశనం కొని తెచ్చుకోవచ్చో చూపిస్తారు.


ఆ మాటకొస్తే- అటు పూర్తిగా సజ్జనులు, ఇటు పూర్తిగా దుర్జనులు కాని అత్యధిక శాతం మధ్యస్థులూ గురువులే. లోకంలో లోకులెవరో చేస్తున్న పనుల్లో మంచి చెడ్డలు వేడిగా వాడిగా విశ్లేషిస్తూ మనం జరుపుకొనే తెరపిలేని చర్చల వెనక ఉద్దేశం మంచిని గుర్తించి, దాన్ని సమర్థించాలనే. మనం ఎరిగిన బంధుమిత్రులో, ఎరుగని మరెవరో చేసిన పనుల్ని చెరగటంలో, జల్లెడ పట్టడంలో అర్థవంతమైన ప్రయోజనం ఒక్కటే. రేపు మనకు అలాంటి పరిస్థితి ఎదురైతే, వాళ్లు చేసిన ‘పొరపాట్లు’ మనం చేయకుండా, వాళ్ల అనుభవం నుంచి మనకు తోచిన పాఠం మనం నేర్చుకోవటం. ఈ పాఠాలన్నీ కలిస్తే అదే లోకానుభవం, లోకజ్ఞానం, లోకజ్ఞత. ఈ జ్ఞానం కలిగించే లోకులు గురువులు కాదనలేం!


ఇతరులు నేర్పేవేకాక, మన సొంత గుణగణాలూ మనకు చాలా నేర్పుతాయి. మన సద్గుణాలు మన గురువులు. ఉదాహరణకు, కష్టపడటం అనే సుగుణం వల్ల సత్ఫలితాలను, సంతృప్తిని పొందుతున్నామంటే- ఇక్కడ కృషి అనే సద్గుణం, ‘కృషి వల్ల సంతృప్తి కలుగుతుంది’ అన్న పాఠాన్ని మనకు నేర్పిస్తున్నట్టే. పట్టుదల వల్ల కార్యసిద్ధి పొందవచ్చు అనే పాఠాన్ని పట్టుదల అనే సద్గుణమే మనకు బోధిస్తున్నది.


సద్గుణాల్లాగే దుర్గుణాలూ గురువులే! మితిమీరి తినటం వల్ల, తాగటం వల్ల వెంటనే దుష్ఫలితాలు అనుభవిస్తాం. అలాంటి బాధాకరమైన అనుభవాలు మళ్ళీ ఎదురుకాకుండా జాగ్రత్త పడమని, ‘అతి భోగం’ అనే దుర్గుణం మనకు సోదాహరణంగా నేర్పుతున్నట్టే. అతి వ్యయం వల్ల అప్పులపాలై అష్టకష్టాలు పడ్డవాడికి ‘ముందెప్పుడూ ఆదాయాన్ని మించిన వ్యయం కూడదు!’ అన్న పాఠం నేర్పేది- దుబారా ఖర్చులు చేసే దుర్గుణమే! కోపం వల్ల మనకు కలిగే అనర్థాల ద్వారా, కోపం అనే దుర్గుణం ’నన్ను వదిలిపెట్టు మిత్రమా సుఖపడతావు!’ అని గురువులా బోధ చేస్తుంటుంది.


గురువుల రూపంలోనే తారసిల్లి మార్గదర్శనం చేయించే మహనీయులు సరేసరి. వారిలో కొందరు లౌకిక విద్యలు నేర్పి పుణ్యం కట్టుకొనే ఉపాధ్యాయులు. మరి కొందరు, జ్ఞాన నేత్రాన్ని తెరిపించే సద్గురువులు. సద్గురువులు శిష్యులనుంచి ఏ ప్రతిఫలమూ ఆశించకుండా, నిస్వార్థంగా కేవలం లోకోపకార దృష్టితో తమ అనుభవాలను పంచుకొంటారు. అలాంటి సద్గురువులు దొరకటం అరుదైన మహాభాగ్యం.


కొన్ని సందర్భాల్లో అతి సామాన్యులైన సాటి మనుషులే గురువులుగా నిలుస్తారు. కొన్ని విపత్సమయాల్లో సాటివారిపట్ల సామాన్యుల ప్రవర్తనలో కనిపించే భావౌన్నత్యం లోకానికే గుణపాఠంగా నిలుస్తుంది.


ఒక్కొక్కప్పుడు, అధ్యాపక వృత్తిలో ఉండి శిష్యులకు పాఠాలు నేర్పుతూ ఉండే అయ్యవారు తమ శిష్యుల నుంచి ఎంతో నేర్చుకొంటారు. వినయంగల విద్వాంసుడికి ఒక్కోసారి శిష్యుడు కూడా గురువే!

- మల్లాది హనుమంతరావు

[05/11, 9:03 am] +91 93913 24915: _*శ్రీ దేవి భాగవతం - 76 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*దైవమే బలవత్తరమను నుపాఖ్యానము*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




అట్లు శుక్రాచార్యుడు తన మదిలో నాలోచించుకొని నవ్వుచు దైత్యులతో నిట్లు పలికెను. ఓ దైత్యులారా! మీరు నా రూపుదాల్చి వచ్చిన దేవగురుని నమ్మి మోసపోసితిరి. వాస్తవ శుక్రుడను నేను. నా యాజ్యులు మీరు. ఇతడు దేవకార్యము సాధింపవచ్చిన బృహస్పతి. మీరితని చేత నిజముగ వంచితులైతిరి. ఇతడు నా రూపరేఖలు దాల్చిన దాంభికుడు. ఈతని మాటలు నమ్మకుడు. ఈ బృహస్పతిని వీడి నన్ననుసరింపుడు' అను శుక్రుని మాటలు విని వారెల్లరును పరమ విస్మయమందిరి. వారా యిరువురి యాకారములను సరిగ పోల్చుకొనలేకపోయిరి. తమకు బోధించుచున్న గురుని వారు శుక్రునిగ భావించిరి. అంత బృహస్పతి మాయామోహితులైన రాక్షసులను గని యిట్లు పలికెను, దైత్యులారా! ఇతడు శుక్రుడు గాడు. ఆ బృహస్పతి నా రూపమున నిపుడు మీ కడకు వచ్చెను. ఇతడు దేవతల పని నెరవేర్ప మీ కడకు వచ్చి మిమ్ము వంచింపజూచుచున్నాడు. ఇతని మాట నమ్మకుడు. నేను శంభునినుండి విద్య బడసితిని. దానిచే మీకు దేవతల తోడి యుద్ధమున జయము గల్పింతు'నని శుక్రరూపుడైన గురువు పలికెను. దానవులును అతడే తమ గురువగు శుక్రుడని తమ మదిలో నిశ్చయించుకొనిరి. అపుడు శుక్రుడు వారి కెంతయో నచ్చజెప్పి చూచెను. కాని, వారు గురుమాయా మోహితులై కాల విపర్యయమున శుక్రుని మాటలు పెడచెవిపెట్టిరి. వారట్లొక నిర్ణయమునకు వచ్చి శుక్రునితో నిట్లనిరి : ఇతడే మా గురువు. ధర్మాత్ముడు. మాకు మంచిబుద్ధి నొసగి మా మేలుగోరువాడు. ఈ శుక్రుడే పదేండ్లనుండి మమ్మెడబాయక శాసించుచున్నాడు. నీవు టక్కరివలె బొడగట్టుచున్నావు. నీవు మా గురువు గావు. ఇచ్చోటు వదలి వెళ్ళుము.


అట్లు మూఢదైత్యులు నిజమైన శుక్రుని పలుమారులు నిందించిరి. శుక్రరూపముననున్న గురుని నమస్కరించి యతనిని ప్రేమతో గురునిగ దలచిరి. అతని మాటలే నమ్ముచు తన్మయులై యున్నారని శుక్రుడు కోపాతిరేకమున వారినిట్లు శపించెను: నేనెంతగ చెప్పినను మీరు నా మాట నమ్ముటలేదు. కనుక చైతన్యరహితులై తిరస్కార మొందుదురుగాక! నన్ను నిందించిన దాని ఫలితముగ కొలదికాలములోనే మీరు తగిన ఫలితమనుభవింతురుగాక! ఇతని కపట వర్తనము లానాడుగాని మీకు బోధపడవు' అని యిట్లు శుక్రుడు పలికి కోపముతో నచ్చోటువదలి వెళ్ళెను. అంత బృహస్పతి ముదముతో నచటనే స్థిరచిత్తుడై యుండెను. అట్లు శుక్రుడు దానవులను శపించిన విషయము గురునకు తెలిసెను. ఆతడు వెంటనే యచ్చోటు వదలి నిజరూపము దాల్చి వెడలి ఇంద్రునిజేరి యతనితో నిట్లనియెను: ఓ సురసత్తమా! నేను నా పని నెరవేర్చితిని. శుక్రుడు వారిని శపించెను. నేను వారిని వదలి వచ్చితిని. ఇపుడు దానవులు నిరాశ్రయులు. నావలన శాపదగ్ధులు. కనుక నిపుడు పోరాటమున కాయత్తపడుము అను గురువాక్యము లాకర్ణించి యింద్రుడు ప్రమోదభరితుడయ్యెను. సురలు సంతసిల్లిరి. వారు గురుని పెక్కు రీతుల బూజించిరి. అపుడు దేవతలెల్లరు పరస్పరము మంతనము జరుపుకొనిరి. యుద్ధమే కర్జమని యెల్లరు నిశ్చయించుకొనిరి. వారు మూకుమ్మడిగ దానవులపై బడిరి. అట్లు దేవతలు గొప్ప బలముతో ముందు ప్రయత్నముతో బవరమునకు గడంగుటయును తమ గురువు వెళ్ళిపోవుటయు గని దానవులు చింతాక్రాంతులైరి.



వారు తమలో తామిట్లనుకొనిరి: మనము గురుని మాయచే విమోహితులమైతిమి. శుక్రుడు కోపమువచ్చి వెళ్ళిపోయెను. ఇపుడా మహాత్ముని శుక్రుని ప్రసన్నుని జేసికొనుట మన కర్తవ్యము. ఆ గురువు కపటచతురుడు - పాపి - భ్రాతృభార్యాగామి. లోన మలినము బయట నైర్మల్యము గలవాడు. మనమిపుడేమి చేయుదము? ఎచటికేగుదము? శుక్రుడు కోపముతో మండిపడుచున్నాడు. మనకిపుడు సాయ మవసరము. మఱి యతనిని మనమెట్లు ప్రసన్నునిగ జేసికొనగలము? ఇట్లు దైత్యులు తమలో తామాలోచించుకొని భయకంపితులైరి. వారు ప్రహ్లాదుని ముందిడుకొని శుక్రాచార్యుని సన్నిధి కరిగిరి. వారందఱు మౌనముగ నున్న శుక్రుని చరణములకు నొకేసారి నమస్కరించిరి. శుక్రుడు నిప్పులు గురియుచు వారికిట్లు పలికెను. నేనానాడు మీకు హితముగ నెంతయో చెప్పితిని. కాని, మీరు గురుమాయా మోహితులై నాడు నా మాట పెడచెవిని బెట్టితిరి. మూఢాత్ములై నన్ను తూలనాడితిరి. మదోన్మత్తులగు మీరు తత్ఫలితము వెంటనే పొందితిరి. ఈనాడుగూడ మీరు కపటాకృతి - వంచకుడు. సురకార్యార్థియైన మీ గురుని చెంతకే వెళ్లుడు. మీరు భ్రష్టులైపోతిరి. నేనతనివలె వంచకుడనుగాను.' అట్లు శుక్రుడు సందిగ్ధ వాక్యములు పలుకగ ప్రహ్లాదుడ తని పాదములు పట్టుకొని యిట్లు పలికెను:' ఓ భార్గవమునీశ! నీవు సర్వజ్ఞుడవు. మేము నీ యాజ్యులము. నీకు హితకరులము. పుత్రతుల్యులము. భయాతురులమై వచ్చినవారము. అట్టి మమ్ము నీవీ పరిస్థితిలో విడువ తగదు. నీవు మంత్రార్థ మరిగితివి. అపుడా దురాత్ముడు కపట నటునివలె నీ వేష భాషలతో వచ్చి తియ్యగ బలుకరించుచు మమ్ము వంచించెను. తెలియక పొరపడిన వారి దోషములకు శాంతులు కోపింపరు.' నీవు సర్వవిదుడవు. మా చిత్తములు నీయందే లగ్నమైనవని నీవెఱుగుదువు.


నీ తపఃప్రభావ మతీతము. కోపముడుగుము. సాధుసత్తములు క్షణకోపులని మునులందురుగదా! నీరు సహజముగ చల్లగా నుండును. అది నిప్పుతో గలిసిన వేడియగును. వేడిమి తగ్గిన నీరు మరల చల్లబడును. క్రోధము చండాలుని వంటిది. బుధులు దాని నెల్లవిధముల వదలిపెట్టుదురు - కాన నీవు నటులే రోషము విడనాడి మాపట్ల ప్రసన్నుడవు గమ్ము. నీవు కోపము విడువక దుఃఃతులమైన మమ్ము వదలినచో మేము పాతాళమున కేగుదుము అను ప్రహ్లాదుని మాటలు విని శుక్రుడు జ్ఞాననేత్రముతో సర్వము నెఱింగి సుమనస్కుడై చిరునగవుతో వారితో నిట్లనెను: దానవులారా! మీరు భయపడి పాతాళమునకు వెళ్ళవలదు. మీరు నా యాజ్యులు. నా మంత్రబలముచే మిమ్ము రక్షింతును. పూర్వము బ్రహ్మ సత్యము హితకరమునైన యొకమాట చెప్పెను. అది మీకు వినిపింతును వినుడు. ఈ నేలపై మేలుగాని కీడుగాని జరుగవలసినది తప్పక జరిగితీరును. దైవమునకు విరుద్ధముగ నెవ్వడు నేమియు జేయజాలడు. మీరిపుడు కాలయోగమున నిజముగ బలహీనులైతిరి. దేవతలచేత నోటమిచెంది యొకమారు పాతాళ మేగవలయును. కాలము కలిసివచ్చినప్పుడు మీరు సర్వసమృద్ధమైన త్రైలోక్య రాజ్యమనుభవింతురని తొల్లి బ్రహ్మ వచించెను. మీరొకప్పుడు దైవయోగమున దేవతలను తలదన్ని పదియుగముల వఱకు పూర్తిగ త్రైలోక్య సంపద లనుభవించితిరి. సావర్ణిక మన్వంతరమందు మరల సామ్రాజ్యము మీ కైవసమగును. అపుడు ప్రహ్లాదుని మనుమడైన బలి విజయుడై ముల్లోకముల కేలిక గాగలడు.


మున్ను విష్ణువు వామనావతారమున బలి సర్వస్వము హరించెను. అప్పుడు హరి బలితో నేను దేవ వాంచాసిద్ధికి లోకత్రయ సామ్రాజ్య మిపుడు హరించితిని. ఇకముందు సావర్ణిక మన్వంతరమందు నీవే యింద్రుడవగుదువు' అని పలికెను. ఓ ప్రహ్లాదా! ఆనాడు విష్ణువట్లుపలుక నీ పౌత్రు డెల్ల భూతముల కదృశ్యుడై గుప్తముగ భీతునివలె నేడు చరించుచున్నాడు. ఒకప్పుడు బలి యింద్రుని భయమున గర్దభరూపముదాల్చి యొక శూన్యగృహమందు తలదాచుకొనెను. ఒకనాడింద్రుడు బలినిగని ఓ రాక్షస సత్తమా! నీవు సర్వలోక భోక్తవు. దానవ శాస్తవు. అంతటి నీకీ గాడిదరూపు సిగ్గు గల్గించుటలేదా? అన విని దైత్యరాజిట్లనియెను: ఓ శతక్రతూ! ఇందు వింతేమి గలదు? విష్ణువంతటివాడు చేప-తాబేలు మున్నగు రూపులు దాల్చెనుగదా! తొలుత నొకప్పుడు నీవును బ్రహ్మహత్యవలన మానస సరోవమందలి కమలమున లీనమై దాగియుంటివి కదా! అట్లే నేనును కాలవశమున యీ ఖరరూపమున నున్నాను. దైవపరాధీనునకు సుఖమెక్కడికి? దుఃఖమెక్కడికి? అఖండమైన కాలము నిజముగ నెట్లు దలచునో యట్లు జరిగితీరును! ఇట్లు బలి యింద్రుడు తమలో తాము సంభాషించుకొనిరి. వారు పిదప తెలివొంది నిజనివాసముల కరిగిరి. ఈ యుపాఖ్యానము దైవమే బలవత్తరమైనదను విషయము తెలుపుచున్నది. దీనిని మీకు తెలిపితిని. ఈ సురాసుర నరజంతుయుతమగు జగమెల్ల దైవాధీనమే.



*ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు దైవమే బలవత్తరమను నుపాఖ్యానముగల చతుర్దశాధ్యాయము.*

[05/11, 9:03 am] +91 93913 24915: *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ  శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

203 మరియు 204 శ్లోకములు     

**************************

"సిద్ధు లిట్లనిరి."



”క్రుద్ధుండై యణిమాదిక

సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి; మహా

యోద్ధవు నీ కృప మాకును

సిద్ధులు మరలంగఁ గలిగె శ్రీనరసింహా!”


 *భావము* : “  సిద్ధులు నరసింహుని ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు.”


“శ్రీ నరసింహావతారా! నీవు యోధానుయోధుడవు. ఆగ్రహోదగ్రుడై హిరణ్యకశిపుడు మా అణిమ, మహిమ, గరిమ మున్నగు సిద్ధులు అన్నింటిని లాక్కున్నాడు. ఆ రాక్షసుడిని చీల్చిచెండాడి సంహరించావు. మేలయ్యను. నీ దయ వలన మరల నా సిద్ధులు మాకు లభించాయి.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.

+++++++++++++++++++++

 *ఈరోజు హరి సంకీర్తన* 

+++++++++++++++++++++

" అదిగో తిరుమల 

అదిగదిగో తిరుమల "

+++++++++++++++++++++

[05/11, 9:03 am] +91 93913 24915: _*శ్రీరమణీయం* *-(701)*_

🕉🌞🌎🌳😷🇮🇳🚩


_*"ధ్యాస, ధ్యానం ఒక్కటేనా, వాటి మధ్య ఏమైనా వైవిధ్యం ఉందా !?"*_


_*సాధారణ జీవనంలో ధ్యాస అని దేనిని అంటామో, ఆధ్యాత్మిక సాధనలో దాన్నే ధ్యానం అంటారు. ధ్యాస అంటే అనుకున్న విషయంపై మనసు నిలిపి ఉంచటం. దీన్నే ధ్యానం అని కూడా వ్యవహరిస్తారు. ఏ ధ్యాస లేకపోతే అది సమాధి అవుతుంది. అనుకున్న విషయంపై ధ్యాస నిలుపలేకపోవచ్చు. కానీ రోజూ అనేక విషయాలపై ధ్యాస పెడుతూనే ఉన్నాం. అలా చేయకుంటే జీవనమే లేదు. ఎందుకంటే దేన్ని గుర్తించాలన్నా ధ్యాస కావాల్సిందే. అంటే ప్రతిరోజూ అనేక విషయాల్లో ధ్యానం చేస్తునే ఉన్నాం. సమాధానాన్ని ఊహించకుండా "నేనెవరు ?"అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు క్షణకాలం పాటు మనసు ఆ స్థితినే పొందుతుంది. ఆ క్షణంలో మనసు తన గుణాలన్నింటిని వదిలేస్తుంది. నిజానికి ఆత్మశక్తి అయిన మనసు అనేక గుణాలు కలిగివుండటం చేతనే దాని స్వరూపం తెలియటంలేదు. "నేనెవరు ?" ప్రశ్నతో ఆ గుణాలు మాయమైన మరుక్షణం అక్కడ నిలిచి ఉండేది శుద్ధమనసే. అదే ఆత్మదర్శనం అంటే !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"*_

_*"మనసును ఖాళీచేసే మహామంత్రం -"నేనెవరు" !''*- *(అధ్యాయం -86) {శ్రీరమణభాషణలు సత్సంగ ప్రవచన మాలిక }*_

_*రచన/బోధన : -తత్వదర్శి/శివశ్రీ గెంటేల వెంకటరమణ,*_ 

_*శ్రీగురుధామ్, బలుసుపాడు, కృష్ణాజిల్లా.*_

[05/11, 9:03 am] +91 93913 24915: నిందా స్తుతి సమయంలో ..


సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే 

" ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు.


 కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో

 "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. 


ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ‘ "ఈ సముద్రం

నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి " అని

రాసింది. 


ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి   ఆ ఇసుకలో 

"‘ఈ సముద్రం ఒకటి చాలు  జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను " అని రాశాడు.


అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. 

వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. 


రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో  తుడిచేసుకుంది అలానే 

మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు...


ఇంకా

 ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని  ఎవరిపైనా చెడు  

అభిప్రాయానికి రాకూడదు.  

వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.


ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి.

దాని తొలగించి ముందుకు

 అడుగు వేయండి.

భగవంతుని తోడుగా చేసుకోండి..


విజయం విజయం అన్నిటా విజయం మీ సొంతం అవుతుంది. 


మనస్సాక్షి , భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి.


సర్వే  జనా: సుఖినోభవంతు🙏

[05/11, 11:37 am] +91 93913 24915: 17-09-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసాహార మేదియో వివరించి చెప్పచున్నారు–


కట్వామ్ల* లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః | 

ఆహారా రాజసస్యేష్టా  దుఃఖశోకామయప్రదాః || 


తాత్పర్యము:- చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, మిగుల దాహము గలుగజేయునవిగాను ఉండునవియు; (శరీరమునకు) దుఃఖమును, (మనస్సునకు) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును.


వ్యాఖ్య:- ఈ శ్లోకమున తెలుపబడిన ఆహాపదార్థములు రాజసములని  పేర్కొనుట వలన అవి సర్వథా త్యాజ్యములే అయియున్నవి.


“దుఃఖశోకామయప్రదాః” - ఇచట దుఃఖమనగా భుజించినవెంటనే శరీరాదులకు గలుగు బాధయనియు, శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు గలుగు క్లేశమనియు గ్రహించవలెను.

కొందఱు "ఉష్ణ” అను పదమునకు ముందున్న "అతి” యను విశేషణమును కట్వాది పదములకన్నిటికిని అన్వయించి అర్థము చెప్పిరి. కాని అట్లుచేయుట సమీచీనముగ  కనబడుటలేదు. ఏలయనిన, అత్తఱి "అతికటుత్వము నిషిద్ధమని అల్పకటుత్వము గ్రాహ్యమని” అర్థమువచ్చును. అది అసమంజసమే యగును. (కొద్ది చేదుకూడ ఎవరును కోరరుగదా).


 మఱియు "విదాహినః” అను పదమునకు ‘అతి’ చేర్చినచో, "అతివిదాహినః” అగును. అపుడు "వి" అను ఉపసర్గమీద మఱల ‘అతి' అను విశేషణమును జోడించుట అప్రస్తుతముగ నుండగలదు. (రెండును ఒకే అర్థమును సూచించును గావున).

రాజససుఖముయొక్క లక్షణము - ప్రారంభమున అమృతతుల్యముగనుండి తుదకు విషప్రాయముగ పరిణమించుటయే యని 18వ అధ్యాయమున భగవానుడు చెప్పబోవుదురు - "విషయేన్ద్రియ సంయోగాత్  యత్తదగ్రేఽమృతోపమమ్, పరిణామే మిషమివ తత్సుఖం రాజసం స్మృతమ్" అని అట్లే  ఈ రాజసాహారమున్ను ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును, కాని భుజించిన కొంతసేపటికి గొప్పదుఃఖమును, వ్యాకులత్వమును గలుగజేయును. నిత్యజీవితమున ఈ విషయమును పెక్కురు అనుభవించుచునే యున్నారు. మఱియు రజోగుణాత్మకమగు ఈ ఆహారమును భుజించువారికి ధ్యానమున్ను సరిగా జరుగదు. చిత్తము వికారవంతమై, చంచలమైయుండును. అత్తఱి కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగానుండదు. జంతువులలోగూడ రజోగుణాహారమగు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగుగొడ్డు, అతిచంచలములై క్రూరములై యుండును. తృణాదులను భుజించు గోవు, మేక మొదలైనవి సాత్త్వికచిత్తవృత్తి గలిగియుండును.


“ఆమయప్రదాః” - అని చెప్పుటవలన రాజసాహారము ఆరోగ్యమునుగూడ చెడగొట్టి వ్యాధులను గలుగజేయునని తెలియుచున్నది. కాబట్టి ఆరోగ్యభంగకరములును, దుఃఖ, శోకప్రదములును, ధ్యానప్రతిబంధకములునునగు అట్టి రాజసాహార పదార్థములను ముముక్షువు లెన్నడును గ్రహించరాదు. అట్టియాహారముపై ఎపుడైన ఇష్టము గలిగినచో తనయందింకను రజోగుణము ఏ కోశమందునో గలదని నిశ్చయించి దానిని తొలగద్రోయుటకై యత్నించవలెను.


“దాః"  అని చెప్పక “ప్రదాః” అని చెప్పుటవలన రోగాదుల నవి లెస్సగ గలుగజేయునని అర్థము. 

ప్రశ్న:- రాజసాహార మెట్టిది?

ఉత్తరము:- (1) చేదు, పులుపు, ఉప్పు, కారము వీనితో గూడినది (2) మిక్కిలి వేడిగా నున్నది (3) చమురులేనిది (4) మిగుల దాహమును గలుగుజేయునది.

ప్రశ్న:- కావున ముముక్షు వేమి చేయవలెను?

ఉత్తరము:- ఆ యాహారమువలన కలుగు దుష్పరిణామమును మఱల మఱల భావించుచు దానిని త్యజించివేయవలెను.

~~~~~~~~~~~~~

* కట్వమ్లలవణాత్యుష్ణ - పాఠాన్తరము.

[05/11, 11:38 am] +91 93913 24915: 🅱️➕ 

*నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి* నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి *కూర్చుని త్రాగండి*

🅱️ ➕ 

వేగంగా తిరిగే *ఫ్యాన్ గాలి క్రింద* లేదా *A. C.లో* పడుకుంటే శరీరం పెరిగి *లావై పోతారు.*

🅱️ ➕ 

*70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు ఏ పేన్ కిల్లర్ కూడా అంతగా చేయదు.

🅱️ ➕ 

*కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.

🅱️ ➕ 

*అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలు అనారోగ్యం చేయటానికి చేసేవారు.

🅱️ ➕ 

*షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు అమృతం వలె పనిచేస్తాయి.అ

🅱️ ➕ 

*పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగా అవుతారు*

🅱️➕ 

*దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.

🅱️➕ 

మంచి మాటలు, మంచివారికి, తమ ఇష్ట మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారిమి అవుతాం.

😇 !!!!! ధన్యవాదములు !!!!!

మౌనం అంటే ఏమిటి?*

 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹   

                                      

*మౌనం అంటే ఏమిటి?*


మౌనం ఒక మానసిక నిశ్శబ్దం.

మాట ఓ భౌతిక శబ్దం.

 మౌనం ఓ సమస్యకు పరిష్కారం .

మాట ఒక సమస్యకు కారణం .

 మాట హద్దులు దాటితే యుద్ధం.

 మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం.

 కొన్నిటికి సమాధానం మౌనం.

 కొన్నిటికి సమాధానం మాట.

 మాట మౌనం రెండు అవసరం.

వాటిని వాడే విధానం తెలుసుకోవాలి.

 అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు.


 మాట్లాడక పోవడం మౌనం   కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు.విజృంభణ ఆపడం.


మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.


మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ.


*'యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః* 'అన్నారు శ్రీ శంకరులు.


మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి.అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.


ఈ మౌనం మూడు రకాలు.


*1. వాజ్మౌనం*


వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట, అసత్యమాడుట,పరనింద చేయుట,చాడీలు చెప్పుట,అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.


*2. అక్షమౌనం*


కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట.ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి.


*3. కాష్ఠ మౌనం*


దీనిని మానసిక మౌనమంటారు.మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.


 *'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది.మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.*


*మౌనం...*


దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.


గురువు మౌనం జ్ఞానానుగ్రహం.


జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.


భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.


ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. 

ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది.


మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది.అంతర్ముఖ పయనం చేయిస్తుంది.అంతర్యామిని దర్శింపజేస్తుంది.మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు.


మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి.


మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహా మునులే అని మహాత్ములు పేర్కొంటారు.


'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది.


 భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. 

దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. 


మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. 


మౌనమే సత్యం, శివం, సుందరం. 

ఇదే అఖండానందం, ఎన్నో సమస్యలకు పరిష్కారం

ఇదే ఆత్మసాక్షాత్కారం,ఇదే మోక్షం.

లింగం ఉద్భవిస్తుంది ...

 సృష్టి మొదట్లో అది అంతం లేని ఒక పెద్ద లింగం ఉద్భవిస్తుంది ...అందులో 14 లోకాలతో కలిపి ఒక బ్రహ్మాండాన్ని సృష్టించినాడు మహాశివుడు (  దాన్నే ఇప్పుడు String Theory of 14 dimensions అంటున్నారు ) 

లింగం అంటే సంస్కృతంలో symbol ,, గుర్తు ,, అనావాలు ,, గుణగణాలు ...శివలింగం Ellipsoid shapped egg రూపంలో ఉంటది దానికి మొదలు చివరా ఉండదు ....

శివలింగం అంటే Structure of universe or Cosmos .... శివలింగం Niels Bohr ప్రతిపాదించిన Bohr Atomic Model ని సూచిస్తుంది ... The molecules made up of Atom which consists of Protons , Electrons & Neutrons ...Lord Shiva means Neutron without an electric charge ,, Lord Brahma means an Electron with a positive charge ,, Lord Vishnu means Protons with positive electric charge & Shakti means Energy ...బ్రహ్మాండం ( Atom )లో మహావిష్ణువు బొడ్డులో నుండి ఒక కమలం పుట్టి అందులో నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు ...ఆ కాడతో వున్నా కమలంలో వున్నా బ్రహ్మ మహావిష్ణువు చుట్టూ తిరగటాన్ని electrons revolving around the protons surrounded by neutrons that spin rapidly ...This shows Electrons are attracted to the Protons due to its opposite electric charge in an atom where Neutron remains no change .....అందుకే మహావిష్ణువుని ( protons ) స్థితి కారకుడు ,, బ్రహ్మని ( electrons)  లయకారకుడు అంతారు .... ఎప్పుడైతే No electric charged Neutrons ( శివుడు ) is disturbed ,, added & separated by Energy ( Shakti ) with valancy of a molecule into two molecules in an atom results in destruction ( kali or Rudrudu )...అందుకే శివుడు ప్రళయకారకుడు ...ఆ అదిశక్తిని ( energy / shakti ) ని శివుడి ( Neutrons) భార్యా గా చెప్పినారు మన ఋషులు .... ఇ scientific theory మన ఋషులు ఒక శివలింగం రూపంలో మనకి అందించారు ....Atomic destruction means collidal of atoms results in mass destruction with high energy... అందుకే శివలింగానికి అభిషేకాలు చేయటానికి గల పరమార్ధం శాంతస్వభావమే....

తథాస్తు దేవతలుంటారు

 ✋ *తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది..*✋

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*



👉 తథాస్తు దేవతులుంటారు జాగ్రత్త.. అంటూ పెద్దలు అంటూ వుంటారు. అది ముమ్మాటికీ నిజమే. ముఖ్యంగా సంధ్యావేళల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెప్తుంటారు. అలాంటి తథాస్తు దేవతల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. సాధారణంగా ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అది ఫలిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.


👉 మన మనస్సు మంచినే ఆశిస్తే అదే జరుగుతుంది. కీడును తలిస్తే కీడే జరిగి తీరుతుంది. ఇబ్బందులు తప్పవు. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి. తథాస్తు దేవతలూ ఆశీర్వదిస్తారు.


👉 ఇక తథాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడదని.. అలా అనుకుంటే దేవతలు తథాస్తు అని అంటారు. దీంతో జరగాల్సిందంతా జరిగిపోతుంది. అందుకే నెగటివ్‌గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కోసారి జరిగిపోతూ వుంటాయి.


👉 ధనం వుండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు చెప్తూ వుంటే.. నిజంగానే లేకుండా పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ నటిస్తూ అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదు. అందుకే మంచి గురించే ఆలోచించాలి. మంచే మాట్లాడాలి. ధర్మాన్నే ఆచరించాలి. అప్పుడు మనకు మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.


*-- వరలేఖరి.నరసింహశర్మ.*



Received as forwarded

లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత*

 *లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత*

=====================


 ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు.లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది, రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని, రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది.ఈమెకు అనేక అవతారాలు కూడా ఉన్నాయి (అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత).విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా, అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా,మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా,కలియుగంలో వెంకటేశ్వరస్వామి భార్య పద్మావతిగా అవతరాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది:లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు.ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం, వరమహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మిదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మి పూజలు జరుపుకుంటారు.శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యం యొక్క దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్ష్యం పొందినట్లేనని భావన.

ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?

 ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి  ఒక జర్నలిస్ట్  వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక. 

అక్కడే ఉన్న ఒక  భక్తుడిని ఇలా అడిగింది. 

జర్నలిస్ట్ :మీ  వయసు ఎంతుంటుందండి? 

భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి 

జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు? 

భక్తుడు : నాకు  బుద్ది వచ్చినప్పటి నుండి 

జర్నలిస్ట్ : మరి దేవున్ని  చూసారా? 


#భక్తుడు : లేదండి 

జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు? 

భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు? 

జర్నలిస్ట్ :సిటీ నుండి 

భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా? 

జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు 

భక్తుడు :మాది  చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు, 

జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం? 

భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర  ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా  ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే  మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. 

అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు  యోచనా శక్తి లేని కుక్కలే  ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !

తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను. 

జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా  మాట్లాడిన  జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.

*ఓం నమో శివాయః*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దగ్గుకి మిరియాలు ఉప్పు వాము

 దగ్గుకి మిరియాలు ఉప్పు వాము


1. గొంతునొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతోపాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడిచేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధతగ్గిపోతుంది. మిరియాల సాంబారు పడిశాన్ని అదుపులో ఉంచుతుంది.


 2. మిరియాలని, ఉల్లిపాయన్ని కలిపి నూరుకుని తింటే జలుబు, దగ్గు వేధించవు. నేతితో మిరియాలని వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల పొడి చారుకి మించిన గొప్ప వైద్యం లేదు.


3. మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడూ తాగుతుంటే శరీర వేడి తగ్గుతుంది.

 

4. అజీర్ణవ్యాధితో బాధపడేవారికి కూడా మిరియాలు ఎంతో మేలుచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు గలవారికి మిరియాలు గొప్ప ఔషధం.

 

5. తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వలన రుచితో పాటు ఆరోగ్యమూ కల్గుతుంది. మతిభ్రమ, మూర్భ, హిస్టీరియా లాంటి వ్యాధులు ఉన్నవారు మిరియాల ఘాటును పీల్చితే ఎంతో మంచిది.

 

6. మిరియాల పొడి, ఉప్పు పొడి సమంగా కలిపి, ఆ పొడిని కొండనాలుకకు బాగా అద్దుకుంటే కొండనాలుగ తగ్గి, విపరీతంగా వచ్చే దగ్గు నివారణమవుతుంది.

దాశరథి - కవి'తాగ్నిధారా' శరధి

 దాశరథి - కవి'తాగ్నిధారా'

శరధి

తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి  ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి ఉద్యమించినకృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు.  పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. 

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది.

సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.


డా|| దాశరధి పేరు వినగానే ''నా తెలంగాణ కోటిరత్నాల వీణ'' అని గర్జించిన కలం - కాదు గళం గుర్తుకు వస్తుంది - ఎవరికైనా. ఆనాటి నిజాం రాజును ''జన్మజన్మాల బూజు'' అంటూ కురిపించిన కవి''తాగ్నిధార'' స్ఫురిస్తుంది. ఏ చదువరికైనా. ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న కాలంలో కలిగిన కష్టాల ''తిమిరం''తో చేసిన ''సమర'' యోధునిగా కనిపిస్తారాయన - సాహితీవేత్తలకు. ఆయన మ్రోగించిన ''రుద్రవీణా'' స్వరాలు తిరోగమన వాదులకు విడువని జ్వరాలు. ఉర్దూ సాహిత్యంలోని రుబాయీలను, గజల్స్‌ను తెలుగులోనికి తెచ్చిన ఆదికవి దాశరథియే. ''ఏను స్వయముగా కవితన్‌ వరించలేదు! తానె వరియించె కైతలరాణినన్ను'' అని విలక్షణంగా చెప్పుకున్న దాశరథి - ''ఎంత తియ్యని పెదవులే ఇంతి! నీవి; తిట్టుచున్నప్పుడుంగూడ తీపికురియు''ని విశిష్టంగా భావ వ్యక్తీకరణ చేశారు. ఆయన తెలుగుగాలిబు. తాత్త్విక చింతన కు ఆయన ''గాలిబ్‌ గీతాలు'' నిజంగా ఒక ''కవితా పుష్పకమే'' అన్నట్లు ''కవితా పుష్పకం'' అన్న పేరుతో ఆయన ఒక కవితా సంపుటిని కూడా సమకూర్చారు. ఇంతకూ-రాజకీయాలకు అతీత మైన సర్వమానవ సౌభ్రాత్రం ఆయన కవిత్వ సిద్ధాంతం. దమననీతిని-అది ఏరూపంలో ఉన్నా - ఎదిరించడం, కవిత్వానికి ప్రయోజనం ఉందని నిరూపించడం, కళామూల్యాలను వదులు కోకపోవడం - అన్నది తన కమిట్‌మెంట్‌ అని - ఆచార్య తిరుమల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ''ఆధునిక కవిత- అభిప్రాయ వేదిక'' అన్న గ్రంథంలో పేర్కొన్నారు - దాశరథి.

''ఎవ్వడు గట్టిగా అరచు, నెవ్వడు మోసము చేయజాలు - నింకెవ్వడు కాళ్ళు పట్టుకొనియే క్షణమాత్ర గ్రహించు జుట్టు - వాడివ్వ సుధాస్థలిన్‌ గణుతికెక్కు ధురంధరుడంచు - వానికిన్‌ తవ్వల కొద్ది రవ్వలట - దాశరథీ! కరుణాపయోనిధీ!''. ఇత్యాదిగా అనేక పద్యాల్లో నేటి సంఘ స్వరూప స్వభావాలను కళాత్మకంగా బద్దలుకొట్టి మరీ చెప్పడంతో పాటు ఈ దాశరథి ఆ దాశరథికి కర్తవ్యాన్ని ప్రబోధించిన ''అభినవ దాశరథీ శతకం'' తెలుగు శతక ప్రపంచంలో నిజంగా మాసిపోని (నిప్పు) రవ్వల శతకం.

''తలనిండ పూదండ దాల్చిన రాణి...'', ''నడిరేయి ఏ జాములో స్వామి నిను చేరదిగి వచ్చెనో.... ''ఇత్యాదిగా వాణి వీణ వాయించి నట్లుగా ఎన్నెన్నో సినిమా పాటలను పలికినా, పెట్రోలుబాంబులా పద్యాన్ని మ్రోగించినా - దాశరధి నిజంగా నాటికీ, నేటికీ, ఏనాటికైనా సర్వాంధ్ర హృదయాస్థాన కవియే. ''ఉద్యమ స్ఫూర్తితో కవిత రాసిన ఆవేశకవి దాశరథి'' అని కుందుర్తి, ''మనోహర పద్యకవితా శిల్పి, పద్యశిల్ప మయ బ్రహ్మ'' అని గుంటూరు శేషేంద్రశర్మ దాశరధిని గూర్చి తమ అభిప్రాయాలను వ్యక్తీకరిం చారు. అసలు - ఆయన ప్రతిపదమూ పఠితల మనస్సులకు ఒక ''ఆలోచనాలోచనమే''.

ఒకప్పుడు తెలంగాణా జంటకవులుగా పేరు పొందిన వారు-దాశరధి -డా|| సి.నారా యణరెడ్డి.

''దాశరథీ! మనోజ్ఞ కవితాశరధీ! శరదిందు చంద్రికా పేశల కావ్యఖండముల పిండిన నీ కలమందునన్‌ మహోగ్రాశని పాతముల్‌ వెలయు నౌర! మహేశుని కంటిలో సుధా రాశితరంగముల్‌ కటు హలాహలకీలలు పొంగినట్లుగన్‌'' అని సి.నా.రె. దాశరథి కవిత్వానికి గొప్ప పోలిక చెప్పారు. ఇది ఎవ్వరూ కాదనరాని పోలిక. ''మహాంధ్రోదయా''న్ని దర్శించిన దాశరధిని ''కమనీయ కోమల మహోదయు''నిగా ఉత్పల సత్యనారాయణాచార్యులు సంభావిం చారు. ఆయనవి ''మాధ్వీకఝరీధురీణ పదవీథుల'' న్నారు. ''దాశరథి బోలుకవియొక దాశరథే...'' అనీ, ''దాశరథి కవిత విప్లవ కోశమె...'' అని డా|| తిరుమల శ్రీనివాసాచార్య పేర్కొన్నారు.

దాశరథి మరణించినపుడు మల్లెమాల అక్షర పద్య నివాళిని సమర్పిస్తూ ''తాను రూపాన వామనుడైననేమి? విశ్వమానవ కవిగ త్రివిక్ర ముండు'' అన్నాడు. ఇది - కవితకు ''అమృతాభి షేకం'' చేసిన దాశరథి వ్యక్తిత్వానికి పట్టిన అక్షర దర్పణం. దాశరథి మరణానంతరం డా|| అక్కిరాజు సుందర రామకృష్ణ 165 పద్యాలతో ''కవితాశరథి దాశరథి'' అన్న పేరుతో సూటిగా, తుపాకీ ధాటిగా ఒక పద్య కావ్యాన్నే రచించి, ఉత్పల సత్యనారాయణాచార్యులు, డా|| తిరుమల శ్రీనివాసా చార్యలకు అంకితం చేశారు. ఇది 2003 జనవరిలో రచింపబడింది. సంఘంలోని కుల మతాచారాల్ని తూర్పారపట్టిన జాషువా వంటి వాడు దాశరథి అనీ, కవిత్వంలో పేద ధనికుల భేదాలను చెప్పడంలో రెడ్డి వేమన కూడా దాశరథి ముందు చాలడనీ అంటూ దాశరథిపై తమకున్న అత్యంతాభిమానాన్ని అక్షరాక్షరంలోనూ వ్యక్తీ కరిస్తూ, ''ధరణి నీ సాహసపుగాథలను విన్న పేడివానికి సైతంబువేడిపుట్టునని''అన్నారు- అక్కి రాజు వారు. ఇది మాత్రం అక్షరాలా నిజం.

 వీరి రచన  "తిమిరంతో సమరం" కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

1987 నవంబర్ 5 న దాశరథి తుది శ్వాస విడిచారు.


సేకరణ:

మరో లాక్ డౌన్ తప్పదు...సీసీఎంబి డైరెక్టర్ సంచలనం!*

 *మరో లాక్ డౌన్ తప్పదు...సీసీఎంబి డైరెక్టర్ సంచలనం!*



కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సిసిఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.


మానవ తప్పిదాల వల్ల కరోనా చాలాచోట్ల విజృంభిస్తుందన్న ఆయన ప్రస్తుతం భారత్ లో ఢిల్లీలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు.


సెకండ్ వేవ్ అంటే భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయన్న ఆయన వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే కరోనా పట్ల అప్రమత్తంగా ఉండడం ఈ పరిస్థితుల్లో మంచిదని అన్నారు.

సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టమన్న ఆయన ఢిల్లీలో సెకండ్ వుందని అన్నారు.


అలానే ఈ వైరస్ మన చుట్టూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దు అని ఆయన పేర్కొన్నారు. కొన్ని సార్లు ఈ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, పండగలు - పెళ్లిళ్లలో జాగ్రత్తలు పాటించక పోతే మరలా లాక్ డౌన్ తప్పనిసరి అవుతుందని ఆయన పేర్కొన్నారు.


60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హెర్డ్ ఇమ్మ్యూనిటీ లేదా వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ వేవ్ లు వస్తూనే ఉంటాయని రాకేశ్ పేర్కొన్నారు.


దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే ఈ ఏడాది నుంచి మరో రెండేళ్లు పడుతుందని అందుకే మాస్క్ శానిటేషన్ బూత్ కి దూరం తోనే వైరస్ ని జయించాలని ఆయన పేర్కొన్నారు.

దేహ భావన

 దేహ భావన 

నేను అనే దేహంను (శరీరంను) చెతన్యవంతం చేసే దేహి (ఆత్మా) అనే శక్తి వున్నదని ఇంతకుముందు తెలుసుకున్నాం. మరి ఈ చెతన్యమే నేనా లేక జఢమైన శరీరమా నేను అనే ప్రశ్న ఉదయించినప్పుడు మనం చేతన్యాన్ని కలిగించే ఆత్మే నేను అని అనుకుంటాము ఎందుకంటె ఈ శరీరం ఈ భూమి మీద పుట్టింది, మరియు భూమిలో వున్న పంచభూతాలతో తయారయింది. అంతే కాకుండా ఈ శరీరం కొంత కాలం ఉండి తరువాత ఈ భూమిలోనే కలిసిపోతుంది. కాబట్టి ఇది అశాశ్వితం. అశాశ్వితం అయింది ఏది కూడా నేను అనటానికి వీలు లేదు ఎందుకంటె నేను శాస్వితుడిని అంటే నాకు ఈ కాలంతో పని లేదు కాలం కొంత వరకు మాత్రమే ఉంటుంది. 

మరి జడమైన శరీరం నేను కాదన్నప్పుడు మరి ఈ శరీర భావన ఎందుకు కలిగి ఉండాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన కారునే ఉదాహరణగా తీసుకుందాము. కారు వేరు డ్రైవరు వేరు. కానీ డ్రైవరు లేకుండా కారు చెతన్యవంతం కాలేదు అంటే డ్రైవరుకు కారుకు సంబంధం వుంది. డ్రైవరుకు కారు ఉపాధి స్థానం.  కారు లేకుండా డ్రైవరు జీవించ లేడు.  డ్రైవరు లేకుండా కారు కదల లేదు. అంటే రెంటికి మధ్య సంబంధం వుంది. కానీ ఆ సంబంధం ఏర్పరచుకుంది మాత్రమే. ఈ కారు మీద ఉద్యోగం పొతే డ్రైవరు ఇంకొక కారుమీద ఉద్యోగం చేస్తాడు. అంటే ఏ కారు కూడా డ్రైవరుది కాదు. ఇదే విశ్లేషణ మనం శరీరముకు ఆత్మకు అన్వయించుకోవాలి. 

డ్రైవరు రోజు కారుని పరిశుభ్రంగా కడిగి చక్కగా నీటుగా ఉంచుతాడు ఎందుకంటె అతని ఉపాదాన స్థానం కారే కాబట్టి. కానీ డ్రైవరుకు తెలుసు ఈ కారు తనకు కొంతకాలమే ఆసరాగా ఉంటుందని, ఐనా కానీ దానిని శుభ్రంగా ఉంచటం మాత్రం మానడు.  అదే విధంగా ప్రతి మనిషి కారు లాంటి శరీరాన్ని ఏ లోపంలేకుండా చూసుకోవాలి కానీ తాను  శరీరం అనే భావన మాత్రం ఉండకూడదు. 

ఈ శరీరం అశాశ్వితం ఆయన దాని యోగ క్షేమాలు చూడటం మాత్రం మానకూడదు. శరీరం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ వుంటూ, సమయానికి అన్న పానీయాలు సమకూరుస్తూ, ఇతరులతో సత్సంబందాలు కలిగి రాగ ద్వేషాలు లేకుండా ఎల్లప్పుడు ఆత్మలోనే చరిస్తూ ఉండటమే ఆత్మ జ్ఞానీ చేయవలసిన పని. సమాజంలో కలిగే వడిదుడుకులు తనకు కావని అంటే లాభం వస్తే ఆనందించటం, నష్టం వస్తే బాధపడటం, సుఖ దుఃఖాలకు లోను కాకుండా కష్ట సుఖాలు ఈ శరీరానికే కానీ నాకు కాదనే భావనలో ఉండటమే సాధకుడు చేయవలసినది. 

ఓం తత్సత్ 

సర్వ్యే జానా సుఖినో భవంతు.