सुभाषितम्
సుభాషితము
SubhAshitam
कल्पान्त एतदखिलं जठरेण गृह्नन् शेते पुमान् स्वदृगनन्तसखस्तदङ्के।
यन्नाभिसिन्धुरुहकाञ्चनलोकपद्मगरभे द्युमान् भगवते प्रणतोस्मि तस्मै।।
కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్నన్ శేతే పుమాన్ స్వదృగన్తసఖస్తదఙ్కే।
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మగర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోఽస్మి తస్మై౹౹
(శ్రీమద్భాగవతము చతుర్థస్కన్ధము నవమోఽధ్యాయము)
'ఓం నమో భగవతే వాసుదేవాయ' - ఈ ద్వాదశాక్షరీ మంత్రమును ఉపదేశముగా దేవర్షి నారదుని నుండి పొంది అకుంఠిత దీక్షచే జపించి సాక్షాత్కారమైన ఆ శ్రీమన్నారాయణుని దర్శించిన ధృవుడు ఆయనను ఈ విధముగా స్తుతించుచున్నాడు:
ఓ పరమపురుషా! కల్పాంతకాలమునందు ఈ అఖిల విశ్వమును జఠరముచే గ్రహించి తమరివలెనె అనంతుడై సఖుడైన ఆ శేషుని అంకశయ్యపై పవళ్ళింతురు. ఎవరి నాభి సరోవరము కాంచనలోకమై పద్మగర్భమై దివ్యాకాశమైనదో భగవంతుడైన ఆ తమరికి ప్రణమిల్లుచున్నాను.
సీ. సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ యఖిల ప్రపంచంబు నాహరించి
యనయంబు శేషసహాయుండవై శేష పర్యంక తలమునఁ బవ్వళించి
యోగనిద్రా రతినుండి నాభీసింధుజ స్వర్ణలోక కంజాత గర్భ
మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు రుచినొప్పు బ్రహ్మస్వరూపివైన
తే. నీకు మ్రొక్కెద నత్యంత నియమొప్ప
భవ్యచారిత్ర! పంకజ పత్రనేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీ విహార!
యవ్యయానంద! గోవింద! హరి ముకుంద!
(పోతనామాత్యులు - ఆంధ్రమహాభాగవతము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి