**దశిక రాము**
**హిందూ ధర్మం - 37**
అస్తేయం గురించి మరికొంత చెప్పుకుందాం. ఈ శరీరం మన పూర్వీకులు నుంచి తీసుకున్న అప్పు అయితే, ఈ ప్రకృతి మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు అన్నాడు ఒక మహానుభావుడు. మనం చెడు తిండ్లకు, ధూమపానం, మద్యపానంకు అలవాటు పడి, ఆరోగ్యాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటే, అది మన తరువాత వచ్చే మన పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మనం ఏం చేస్తున్నాం? రాబోయే తరానికి కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే హక్కు ఉన్నది, మనం లేనిపోని అలవాట్లకు బానిసలమై వారి హక్కులను కాలరాస్తున్నాం. మనకు వారి హక్కులను కాలరాసే అధికారం ఎక్కడిది? అస్తేయం అంటే రాబోయే తరాలవారి హక్కులకు విఘాతం కలుగకుండా జీవించడం, లేనిపోని రోగాలను మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వకపోవడం.
పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది అంటుంది వేదం. అది మగపిల్లవాడైనా, ఆడపిల్లైనా వేదం అందులో మినహాయింపు ఏమీ ఇవ్వలేదు. ఆడపిల్లవి, నీకు చదువు ఎందుకు, ఇంతవరకు చదివింది చాలు, ఇక ఇంట్లో కూర్చో అని చెప్పి, ఆమెను నిలువరించడం, ఆమె చదువుకునే హక్కును మీ చేతుల్లోకి తీసుకోవడం, కాలరాయడం స్తేయం. దానికి విరుద్ధంగా ఉండడం అస్తేయం.
కొందరు రోడ్డు మీద నడుస్తూ సిగిరెట్టు కాలుస్తారు, అక్కడున్న గాలిని కలుషితం చేసి, తద్వారా ఇతరల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. మీకు ఇతరుల ఆరోగ్యాలను, జీవితాలను నాశనం చేసే అధికారం మీకు లేదు. మీరు వారు జీవించే హక్కును కాలరాస్తున్నారు. మీది కానీ దాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అంటే అస్తేయాన్ని విడిచిపెడుతున్నారు అంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడైనా చాలా లోతుగా చెప్తుంది, ధర్మానికి పరిమితి, పరిధి అన్నవి ఉండవు. ధర్మం స్పృశించని విషయం అంటూ ఉండదు.
తరువాయి భాగం రేపు.......
🙏🙏🙏
సేకరణ
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
https://t.me/SANAATANA
**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
https://t.me/Dharmamu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి