కళ్యాణ ఘడియలు తెలుసుకోవడం ఎలా..?
మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. పెళ్లి ఎప్పుడు జరుగుతుందని వయసు వచ్చిన ప్రతి వ్యక్తిలో ఆలోచన మొదలవుతుంది. కొందరిలో అనుకున్న సమయంలో వివాహం కాక.. అది ఒక సమస్యగా మారుతుంది. జాతకం ప్రకారమే వివాహ సమయం నిర్థేశించబడుతుందని గమనించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం.
తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కారణం
లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వల్ల, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా
శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జలతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.
ఆలస్య వివాహానికి గల కారణాలు
లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా.. శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానమందు 2 గాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు. లేదా శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు. లేదా శుక్రుడు రవి గ్రహానికి 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు. లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు. లేదా సప్తమ భావముపై, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.
ఇలా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవచ్చు.
వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చు దశ అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాంశమందున్న రాశి నాథుని యొక్క దశ, అంతర్దశలలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి జరిగే సమయం నిర్ణయించిన తర్వాత గురు గ్రహం గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగే సంవత్సరం నిర్ణయించాలి. వరుడి జాతకంలో శుక్రుడు, వధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.
ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించిన వారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన మాసంలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు మాసం నిర్ణయించాలి. తర్వాత చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పెళ్లి జరిగే రోజు నిర్ణయించాలి.
జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలు చేయాలి. అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి