5, నవంబర్ 2020, గురువారం

ధార్మికగీత - 71*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 71*

                                    *****

              *శ్లో: పరివర్తిని    సంసారే ౹*

                    *మృతః కో వా న  జాయతే ౹*

                    *న జాతో యేన జాతేన  ౹*

                    *యాతి  వంశ స్సమున్నతిమ్ ౹౹*

                                       *****

*భా:- "పుట్టిన వాడు గిట్టక తప్పదు. గిట్టిన వాడు పుట్టక తప్పదు" అంటున్నది భగవద్గీత. చావు పుట్టుక లనేవి మానవుని జీవన యానంలో చక్ర భ్రమణము వంటివి. సుదీర్ఘమైన రైలు ప్రయాణంలో ఎక్కే,దిగే ప్రయాణీకులను గురించి యేమాత్రం ఎలా  పట్టించు కోమో, మన జీవన యానంలో కూడా చావుపుట్టుకలను కూడా అలాగే పట్టించుకోనంత నిగ్రహం అలవరచు కోవాలని తాత్త్విక గ్రంథాలు ఉగ్గడిస్తున్నాయి. పుట్టుక ఎంత సాధారణమో, మరణము కూడా అంత సాధారణమే గదా!  అయితే ఎవని పుట్టుక చేత వంశము కీర్తి ప్రతిష్ఠలతో  దేదీప్య మానంగా ప్రకాశిస్తుందో, అతడు ఉత్తముడు. అలాంటి వాని జన్మయే నిజమైన జన్మము. అతని వంశమే ధన్యము. మిగతా వారి పుట్టుక నామ మాత్రమే. అలాంటి వారు పుట్టినా, గిట్టినా కులానికి,  లోకానికి ఉపకార మేమీ లేదు గదా!  "రఘు కులాన్వయ రత్నదీపమని" వాల్మీకి మహర్షిచే కొనియాడబడిన శ్రీరాముడు మనందరికి ఆదర్శము, ఆరాధ్యదైవ మవుతున్నాడు. రామాయణము మన నిత్య పారాయణ గ్రంథము. ఆయన "సత్య ధర్మ నిరతి" ప్రతి భారతీయునికి అనుసర ణీయము. ఆచరణీయము. మహత్తర మైన రామాయణ కావ్య మందలి ధర్మాలు,ధర్మ సూక్ష్మాలు ఆచంద్ర తారార్కము ప్రాతః స్మరణీయములు.చిర స్మరణీయములై భాసిస్తున్నాయి.*

                                    *****

                     *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: