5, నవంబర్ 2020, గురువారం

శివానందలహారీ

 🙏శివానందలహారీ 🙏


నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా

పశుత్వం కీటత్వం భవతు విహగ త్వాదిజననమ్

సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహారీ 

విహారాసక్తం చేద్తృదయ మిహ కిం తేన వపుషా 10



భువియందు నరునైన దివియందు సురనైన

           నగ వనముల మధ్య మృగము నైన

చీమ దోమనె కాదు చిఱుపుర్వు నైనను

          పక్ష్యాదిగా నైన పశువు నైన

ఏ తనువందైన నే జన్మమిచ్చినన్                         

           నెంతమాత్రము నాకు చింత లేదు

సతతంబు నీపద స్మరణమ్మనెడు హర్ష

           జలధి తరంగాల కులుకు లందు 

చింత లేకుండ విహరించు చిత్త వృత్తి

పాద సంసేవనా సక్తి భక్తి యుండ 

యెట్టి పుట్టువు నందినన్ నేమి చింత ?

భక్త చిత్తవశంకరా ! భవ విదూర ! 10 #



✍️ గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: