తులసి ఔషధగని . తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు . తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు , దోమలు , పాములు రావు . అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు , వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు , ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి . తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు . తులసి ఏ ఇంటిలో ఉంటే , ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు . తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే , ఆరోగ్యం చేకూరుతుంది , అందుకోసమే తులసమ్మకు నీరు పోసి , చుట్టు ప్రదక్షిణం చేయాలి . అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా , ఆరికాళ్ళలోకి చేరి , నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది . తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి . దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు . తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది . తాజ్ మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం , తాజ్ మహల్ పక్కనే , లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం , ధ్యానం , యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి . కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి