20, నవంబర్ 2023, సోమవారం

River nilu


 

Alexandria


 


 

Siva puja


 

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 03*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *3. ఇళయాంగుడి మార నాయనారు*


ఇళయాంగుడి అనే శైవక్షేత్రంలో మారన్ అనే పేరుతో ఒక శివభక్తుడు జన్మించాడు. 

అతడు తన ఇంటికి వచ్చిన శివభక్తులను సాదరంగా

ఆహ్వానించి షడ్రసోపేత భోజనంతో వారిని సంతుష్టులను గావిస్తూ వచ్చాడు.

మార నాయనారు పేదరికం వచ్చినపుడు కూడ భక్తులను సంతృప్తి పరచే

దాన స్వభావి అని అందరికీ తెలియజేయడానికి అన్నట్లు పరమేశ్వరుడు

అతన్ని నిరుపేదగా మార్చాడు. 


పేదరికంలోనూ అతడు శివభక్తులకు అతిథి

సత్కారాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఒకరోజు వర్షాకాలం రాత్రివేళలో అణచుకోలేని ఆకలిని ఎలాగో అణచుకొని మారనాయనారు, అతనిభార్య

ఇరువురూ పడుకోనుండగా అతని భక్తిని పరీక్షించడానికై ఒక మునివరుని

వేషంలో పరమేశ్వరుడు వచ్చాడు.


అతనికి ఏదైనా పెట్టాలనే ఉద్దేశంతో "ఈ శివభక్తునికి భోజనం పెట్టడానికి ఏదైనా మార్గముందా?” అని మార నాయనారు తన భార్యను

నాయన్మారులు

అడిగాడు. ఆమె తన భర్తను చూసి “ఇంట్లో ధాన్యపుగింజ ఒక్కటీ లేదు.

ఇరుగుపొరుగువాళ్లు కూడ ఇచ్చేట్లుగా తోచలేదు. 


మీరు ఈరోజు పగలు

పొలంలో విత్తిన సంబావరి గింజలను ఏరి తీసుకు వచ్చారంటే నేను

ప్రయత్నించి అన్నం వండుతాను” అని చెప్పింది. భార్య ఈ మాటలను

చెప్పగానే పెన్నిధి దొరికిన వాడివలె సంతోషించి మారనాయనారు తన

పొలానికి బయలుదేరాడు. మెరుపులు నిండిన ఆకాశం నుండి వర్షం

ధారలుగా కురుస్తోంది. అంతటా గాఢాంధకారం వ్యాపించి ఉంది.


మారనాయనారు తన తలమీద ఒక తట్టను బోర్లించుకొని పొలం లోపలికి

ప్రవేశించాడు. కాళ్లతో తడుముకుంటూ తన చేతులతో పొలంలో మొలకెత్తి

నీటిలో తేలుతున్న వరి విత్తనాలను తట్టనిండుకూ ఎత్తుకొని ఇంటికి వచ్చాడు.

మారన్ భార్య ఆ వరి విత్తనాలను నీళ్లలో బాగా కడిగింది. పొయ్యి

అంటించడానికి కట్టెలు లేవని చెప్పగా నాయనారు తన ఇంటి పైకప్పులో

ఎండిన పొడవాటి కర్రలను కత్తితో నరికి భార్యకు అందించాడు. 


ఆమె ఆ కట్టెలను పొయ్యిలో పెట్టి వరి విత్తనాలను పక్వంగా వేయించి వాటిని

బియ్యంగా దంచి అన్నం వండింది. పొలంలో మొలకెత్తి ఉన్న ఆకుకూరలను

కోసుకొని ఇంటికి వచ్చి భార్యకందించగా ఆమె దానిని కూరగా వండింది.

తన ఇంటికి వచ్చిన అతిథి సత్తముని దగ్గరికి వెళ్లి ఆహారం

స్వీకరించవలసిందిగా నాయనారు మునివరుని ప్రార్ధించాడు.


సమయంలో ఇళయాంగుడి మారనాయనారు దంపతులకు శివగామి వల్లీ

సమేతుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై "మీరు నా అనుగ్రహానికి

పాత్రులయ్యారు. మీరిరువురూ శివలోక పదవిని అందుకొని సంతోషంగా

ఉండగలరు" అంటూ వాళ్లను ఆశీర్వదించాడు.

 

   *మూడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *81వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ చరిత్ర - 8*


నారదుడు బ్రహ్మను దర్శించుకొనడానికి వెళ్ళాడు. 'ఇల' అనే పేరుతో స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడిని బుధుడు వివాహం చేసుకున్న విషయం చెప్పాడు. 


బ్రహ్మ చిద్విలాసంగా నవ్వాడు. *"ఇలా , బుధుడూ కలుసుకోవడంలోనూ.. భార్యాభర్తలుగా రూపొందడంలోనూ నీ ప్రయత్నం ఎంత ఉందో నాకు తెలియదా. కుమారా !"*


*"సుద్యుమ్నుడు ఇంక శాశ్వతంగా స్త్రీగానే ఉండిపోవాలా జనకా ?"* నారదుడు అడిగాడు.


*“ఎవరి నుదుట ఏ భవిష్యత్తు లిఖించి ఉందో ఎవరికి తెలుసు నారదా ?"* బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు.


*“మీకు తెలియదా ?”* తండ్రీ కొడుకుల మాటలను వింటున్న సరస్వతి అడిగింది. 


*"ఇంతకూ మీరు ఏం చేశారు ? ఒక పురుషుణ్ణి స్త్రీగా మార్చి బుధుడికి కట్ట బెట్టారా!”* 


*"ఆ విచిత్రం మా పనితనం కాదు , దేవీ ! పార్వతీ పరమేశ్వరులది. వాళ్ళ శాపం , పాపం సుద్యుమ్నుడిని స్త్రీగా మార్చివేసింది. మన నారదకుమారుడు ఆ స్త్రీ రత్నాన్ని తెలివిగా బుధుడి ఆశ్రమం వైపు మళ్ళించాడు."* 


*“ఇక వివాహం - అందులో ఈ బ్రహ్మచారి చేతి చలవ ఏమీ లేదు ! బుధుడు ఇలనూ , ఇల బుధుజ్జీ వివాహం చేసుకున్నారు అంతే !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


*“ఒక వేళ భవిష్యత్తులో ఆ ఇల మళ్ళీ పురుషుడుగా మారిపోతే ?"* సరస్వతి సందేహం వెలిబుచ్చింది.


*“నారాయణ ! దానికి జనకపాదులే సమాధానం చెప్పాలి ,"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


*"సమీప భవిష్యత్తులో జరగబోయేది ప్రధానం. 'ఇల'గా మారిన సుద్యుమ్నుడి ద్వారా బుధుడి సంతతిగా 'చంద్రవంశం' వృద్ధి చెందుతుంది."* బ్రహ్మ చిరునవ్వుతో సరస్వతిని చూస్తూ వివరించాడు.


ఇల సాహచర్యంలో , ఆమె సేవలో బుధుడి జీవితం ఆనందమయంగా సాగిపోతోంది. ఇల గర్భవతి అయింది. తమ అన్యోన్యతకు ఫలంగా సంతానం కలుగబోతోందన్న సూచన బుధ దంపతుల్ని సంతోష తరంగాల మీద ఊయలలూగించింది.


ఒక శుభదినాన ఇల పుత్రుణ్ణి ప్రసవించింది. శిశువు అన్ని శుభలక్షణాలనూ తనలో ఇముడ్చుకుని ఉన్నాడు. బుధుడు కుమారునికి 'పురూరవుడు' అని నామకరణం చేశాడు.


పురూరవుడు ఆరోగ్యంగా బలంగా ఎదుగుతున్నాడు. తల్లిదండ్రుల ఒడిలోంచి నేల మీదికి జారి ఆశ్రమంలో పాకడం ప్రారంభించాడు. కొన్నాళ్ళ అనంతరం పరుగు నటించే అమ్మనూ , నాన్ననూ దోగాడుతూ ఆశ్రమంలో తరిమాడు. కొన్నాళ్ళు గడిచాక తప్పటడుగుల్తో వాళ్ళను వెంటాడాడు.


పురూరవుడు అయిదేళ్ళ బాలుడయ్యాడు. ఆశ్రమ ప్రాంగణంలో లేళ్ళనూ , నెమళ్ళనూ వెంటాడుతూ ఉల్లాసంగా ఆడుకుంటున్నాడు.


భర్తతో , పుత్రుడితో హాయిగా జీవించడానికి అలవాటు పడిపోయిన ఇల - తన పురుష రూప గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. పురుష రూపంలో తన అనుభవానికి రాని జీవిత మాధుర్యం ఆమెకు ఇప్పుడు అరచేతిలో అమలకంలా ఉంది ! పురూరవుడికి తల్లి అయిన ఇల తన తల్లిదండ్రుల్ని మరిచిపోయింది.


వైవస్వత మహారాజూ , ఆయన ధర్మపత్ని శ్రద్దాదేవీ తమ ఏకైక పుత్రుడైన సుద్యుమ్నుడిని మరిచిపోలేకుండా ఉన్నారు. చారులచేతా , భటులు చేతా యువరాజు కోసం వైవస్వతుడు సాగిస్తున్న అన్వేషణ సాగుతూనే ఉంది.


పుత్రవియోగంతో క్షోభించిపోతున్న వైవస్వతుడు తన కుల గురువు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు. *"గురుదేవా ! మీరు సర్వజ్ఞులు ! అయిదు సంవత్సరాల క్రితం వేటకు వెళ్ళిన సుద్యుమ్నుడు పరివార సమేతంగా అంతర్థానమైపోయాడు. ఏకైక వారసుడి కోసం నేను సాగించిన అన్వేషణ నిష్పలమైపోయింది. నా బిడ్డడు సజీవంగా ఉన్నాడా ? మరణించాడా ? ఆ మాత్రం చెప్పి నాకు మనశ్శాంతి కలిగించండి !”*


*"మహారాజా ! ఇన్నేళ్ళూ కుమారుడి కోసం స్థూల పరిదిలో - అంటే దైహికంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండిపోయారు. యువరాజు సుద్యుమ్నుడు ఏమయ్యాడో సూక్ష్మ పరిధిలో అంటే ధ్యానంతో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను !"* అంటూ మాట ఇచ్చాడు వశిష్ఠ మహర్షి.


వైవస్వతుడికి చెప్పిన విధంగా వశిష్ఠ మహర్షి ధ్యాన నిమగ్నుడైపోయాడు. అంతర్నేత్రంతో సుద్యుమ్నుడి గురించి దర్శించాలన్న ఆయన సంకల్పం అచిరకాలంలోనే నెరవేరింది. ధ్యాన నిమగ్నుడైన వశిష్ఠ మహర్షి జ్ఞాననేత్రంతో తన మనోయవనిక మీద సుద్యుమ్నుడి గతాన్నీ , వర్తమానాన్నీ స్పష్టంగా చూడగలిగాడు.


రాజ దంపతులను కలుసుకుని వశిష్ఠుడు తాను దర్శించిన *"సుద్యుమ్నగాథ”* వివరించాడు. *"మహారాజా ! మీ సుపుత్రుడు సజీవంగా ఉన్నాడు...".*


*“గురుదేవా... !”* వైవస్వతుడు అడ్డుతగిలాడు ఆనందోద్రేకంతో *“ఎంత మధురవార్తో !”*


*"పూర్తిగా ఆలకించండి , మహారాజా !"* వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు. *"సుద్యుమ్నుడు ప్రస్తుతం సుద్యుమ్నుడిగా లేడు. స్త్రీగా మారిపోయాడు ! ఆశ్రమంలో ఒక యువకుడికి భార్యగా , ఒక బాలుడికి తల్లిగా జీవిస్తున్నాడు. పేరు ఇల !"* 


*"గురుదేవా ! ఇది నిజమా గురుదేవా ?"* వైవస్వతుడు నమ్మలేకపోయాడు. 


*"ప్రభూ ! మన పుత్రుడు మొదట పుత్రికగానే జన్మించాడు కద !"* మహారాణి శ్రద్ధ వైవస్వతుడికి గుర్తు చేసింది.


వైవస్వతుడు తలపంకించి , మళ్ళీ వశిష్ఠుని వైపు తిరిగాడు. *“మా పుత్రుణ్ణి మీరే మాకు అప్పగించాలి , గురుదేవా ! మాకు మరొకసారి పుత్రభిక్ష ప్రసాదించండి !"*


*"రేపే ఇల ఆశ్రమానికి వెళ్తాను !"* అంటూ వశిష్ఠుడు కూర్చున్న చోటు నుండి లేచాడు.


*"హు ! ఆడపిల్ల పుట్టింది. మగపిల్లవాడుగా మారింది. మళ్ళీ ఆడపిల్ల అయింది !"* వైవస్వతుడు విరక్తిగా అన్నాడు రాణి వైపు చూస్తూ.


**************************


*"అమ్మా ! నేను వశిష్ఠుడిని...”* ఆశ్రమం ముందు నిలుచుని , ద్వారం వద్ద నిలుచున్న ఇలను చూస్తూ , అమాయకత్వం నటిస్తూ అన్నాడు వశిష్ఠుడు.


ఇల ఆయనను చూడగానే కలిగిన కలవరపాటును అణచుకుంటూ , ఆహ్వాన సూచకంగా చిరునవ్వు నవ్వింది. *"ప్రణామం మహర్షీ ! దయచేయండి ! నా పతిదేవులు నివ్వరిధ్యానం కోసం వెళ్ళారు...”*


*"అలాగా !"* అంటూ వశిష్ఠుడు అప్పుడే లోపల నుంచి పరుగున వచ్చి , అమ్మ దగ్గరగా ఆగిన పురూరవుణ్ణి పరిశీలనగా చూశాడు. *"బాలుని ముఖంలో సార్వభౌమ లక్షణాలు ఉట్టిపడుతున్నాయి , సాధ్వీ !",*


లోపలకి వచ్చిన వశిష్ఠుడు ఇల వేసిన దర్భాసనం మీద కూర్చున్నాడు. ఇల వైపు చిరునవ్వుతో చూశాడు.


*“అయితే , నన్ను ఇంత వరకూ చూడలేదా అమ్మా , నువ్వు ?"*


వశిష్ఠుడి ప్రశ్న ఇలను చిన్నగా కుదిపింది. ఆమె రెప్పల్ని దించుకుంది. *"లే...లేదు... స్వామీ !”* 


*"బాగా గుర్తుచేసుకో ! సుద్యుమ్నుడుగా ఉన్నప్పుడు నన్ను చక్కగా ఎరిగిఉండాలే !"*


*"స్వామీ...!"* ఇలా ఆశ్చర్యంగా అంది.


*"నాకు అంతా తెలుసు ! ధ్యానమార్గాన అన్వేషించి , నిన్ను కనుగొన్నాను. నీకు స్త్రీ రూపం ఎందుకు ప్రాప్తించిందో చెప్పు"* వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు.


ఇల బరువుగా నిట్టూర్చింది. తన ఉనికి తెలిసి పోయింది. వశిష్టమహర్షి ముందు దాచి ఉపయోగంలేదు. కుమారవనంలో ప్రవేశించాక జరిగిందంతా వివరించింది ఇల. పార్వతీ పరమేశ్వరుల శాపం వల్ల తన రూపం మారిపోయిందంది. ఆ కఠోర సత్యాన్ని చెప్పి , ఎవ్వర్నీ నమ్మించలేని నిస్సహాయ స్థితిలో బుధుడి ధర్మపత్ని అయ్యానంది.


అంతా విన్న వశిష్ఠుడు నిట్టూర్చాడు. *"నువ్వు పూర్వ రూపంలో యువరాజుగా రాజధానికి తిరిగి రావాలి ! వైవస్వత మహారాజు నుండి రాజ్యపాలనాధికారాన్ని స్వీకరించి , ప్రజలను పాలించాలి !"*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 04*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *4. మెయ్ పొరుళ్ నాయనారు*


తిరుక్కోవలూరును రాజధానిగా చేసుకొని మెయ్పిరుళ్ నాయనారు

చేదినాడును న్యాయవర్తనుడై పాలిస్తూ వచ్చాడు. శివాలయాలన్నింటిలోనూ

రోజూ ఆరుకాలాల్లో పూజలు జరిగేలా కట్టడి చేశాడు.

అటువంటి మెయ్పిరుళ్ నాయనారును జయించి అతని రాజ్యాన్ని

ఆక్రమించుకోవాలని ముత్తనాథుడనే శత్రురాజు చేదినాడుపై యుద్ధాన్ని

ప్రకటించాడు. ఆ యుద్ధంలో ముత్తనాథుడు పరాజితుడై అవమానంతో

పారిపోయాడు. 


ఈ విధంగా సర్వస్వమూ కోల్పోయిన ముత్తనాథుడు

యుద్ధంలో మెయ్పిరుళ్ నాయనారును జయించడం అసాధ్యమని

తెలుసుకొన్నాడు. నాయనారుకు శివ భక్తులపై గల ప్రీతిని తెలుసుకొని

తాను ఒక శివ భక్తునివలె, మెప్పొరుళ్ నాయనారును జయించాలనే

ఆలోచనతో తిరుక్కోవలూరుకు వచ్చాడు. ముత్తనాథుడు మాయా తాపసి

వేషంతో ఒక కరవాలాన్ని తాళపత్ర గ్రంథమున్న సంచిలో దాచుకొని నాయనారు భవనాన్ని సమీపించాడు. 


రాజుగారి పడక గదిముందున్న

దత్తుడు అనే రక్షకభటుడు “ఇప్పుడు రాజుగారు నిద్రపోతున్నారు” అని

చెప్పాడు. దానిని విన్న ముత్తనాథుడు “నేను రాజుగారికి జ్ఞానబోధ

చేయడానికి వచ్చాను, నీ విక్కడే ఉండు" అని చెప్పి లోపలికి వెళ్లాడు.


అక్కడ రాజుగారు నిద్ర పోతుండగా పక్కనే ఉన్న రాజుగారి భార్యను

చూశాడు. నాయనారు భార్య మాయ తాపసిని చూసి తన భర్తను లేపగా రాజు మేలుకొని పరమేశ్వరుని భక్తుడితడు అంటూ లేచి ముత్తనాథునికి

భక్తితో నమస్కరించాడు. ముత్తనాథుడు నాయనారుతో “ఈ భూమండలంలో

మరెక్కడా లేనటువంటి ఒక శైవాగమశాస్త్రాన్ని మీకు చెప్పడానికి వచ్చాను.

నీ భార్యను ఇక్కడినుండి వెళ్లమని చెప్పు. మనిద్దరం ఏకాంతంగా ఒకచోట

 ఆసీనులం కావాలి" అని చెప్పాడు. 


నాయనారు తన భార్యను అంతఃపురానికి వెళ్లమని ఆజ్ఞాపించి, తాను ప్రాంజలియై నేలమీద కూర్చొని ఇక

శైవాగమ శాస్త్రాన్ని పఠించండి" అని ప్రార్ధించాడు. ముత్తనాధుడు తాళపత్ర

గ్రంథాన్ని విప్పే వాడిలాగ నటిస్తూ మెప్పొరుళ్ నాయనారు తనకు

నమస్కరిస్తున్న సమయంలో కరవాలాన్ని తీసుకొని నాయనారు శిరసును

ఖండించాడు. 


ఆ సమయంలో రాజుగారి అంగ రక్షకుడైన దత్తుడు పడకగది

లోనికి ప్రవేశించి తన కరవాలంతో ముత్తనాథుని ఎదుర్కొన్నాడు. అప్పుడు

నాయనారు తన శరీరమంతా రక్తధారలు స్రవిస్తుండగా నేలకు వాలుతూ

"దత్తుడా! పరమేశ్వరుని భక్తుడైన ఇతడు వెళ్లేటప్పుడు ఇతనిని ఎవరూ

నిరోధించకుండా నీవు వీరిని జాగ్రత్తగా నగరం పొలిమేరల వరకు తీసుకు

వెళ్లి వదలిపెట్టు" అని ఆజ్ఞాపించాడు. 


తన చేతిలో పొడవాటి కరవాలాన్ని

ధరించిన దత్తుడు తాపసిని వెంట బెట్టుకొని తిరుక్కోవలూరు నగరం

పొలిమేరలకు చేరుకొని అక్కడ శత్రురాజైన ముత్తనాధుని వదలిపెట్టి

అంతఃపురానికి వచ్చాడు. 


శివభక్తునికి ఎలాంటి అపకారం రానీయక సురక్షిత

ప్రాంతంలో వదిలాడన్న వార్తను వినాలనే ఆకాంక్షతో కొట్టుమిట్టాడుతున్న

తన ప్రాణాలను పోనీయకుండా ఓర్చుకొని పడి ఉన్న మెప్పొరుళ్

నాయనారు దగ్గరికి వెళ్లి దత్తుడు “ముత్తనాథునికి ఎలాంటి అపకారం

లేకుండా పంపించాను" అని చెప్పాడు. మెయ్ పొరుళ్ నాయనారు

సంతోషించి పరమేశ్వరునికి భక్తితో నమస్కరించారు.


తనను హృదయంలో నిలపుకొని ధ్యానిస్తున్న మెయ్పిరుళ్

నాయనారుకు శివగామవల్లీ సమేతుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు.

దేవతలకు కూడ చేరరానిదైన తన తిరు చరణాల సన్నిధిలో తనను సదాసేవిస్తూ ఉండేలాగ నాయనారును అనుగ్రహించాడు.


     *నాల్గవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 91*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 91*


శ్రీరామకృష్ణుల పావన భౌతికకాయం కాశీపూర్ శ్మశాన వాటికలో దహించబడింది. ఒక కంచు పాత్రలో అస్థికలు సేకరించి గురుదేవుల పడక మీద ఉంచారు.


 ముప్ఫై మూడేళ్లు మాత్రమే నిండిన మాతృదేవి ఆ సాయంత్రం వితంతు వేషధారణకు ఉపక్రమించారు. కాని ఆమె భర్త మరణించారా? ఆయన అమరులు కదా! మాతృదేవి తమ బంగారు గాజులు తీసివేయబోతున్నప్పుడు ఆమె ఎదుట శ్రీరామకృష్ణులు సాక్షాత్కరించారు: 

 

"నేను మరణించాననా నీ సుమంగళీ వేష ధారణను తీసివేస్తున్నావు? నేను మరణించలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాను" అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని నిలిపివేశారు. ఆ తరువాతి రోజుల్లో మళ్లీ రెండుసార్లు - మాతృదేవి తమ గాజులు తీసివేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా గురుదేవులు మునుపటి మాదిరే ప్రత్యక్షమై ఆ ప్రయత్నాలను వారించారు. 


ఆ తరువాత మాతృదేవి గాజులను, సన్నని అంచుగల చీరను ధరించి నిత్యం సుమంగళిగానే జీవించారు.


కాశీపూర్ శ్మశానం నుండి శ్రీరామకృష్ణుల అస్థికలను ఒక కలశంలో సేకరించి దానిని మోసుకొని కాశీపూర్ ఉద్యాన గృహం చేరుకొన్నారు భక్తులు. "భగవాన్ శ్రీరామకృష్ణదేవకీ జై" అనే నినాదంతో దానిని శ్రీరామకృష్ణుల మంచం మీద ఉంచినప్పుడు, శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకొన్నా, వారి మనస్సులను శూన్యం ఆవరించింది. 


కాని వారు, ఆయన జీవితకాలంలో ఎలాంటి వినాశం లేని ప్రేమతో పెనవేసుకొని ఉన్నారో అదే ప్రగాఢ ప్రేమ  ఇప్పుడు సైతం వారిని పెనవేసి ఉంచింది. ఒకే లక్ష్యంతో జీవించిన వారు పరస్పరం సాంత్వనపరచుకొంటూ, మెల్లగా తేరుకొంటూ గట్టి నమ్మకంతో ముందుకు సాగారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ – శ్లోకం – 5*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 5*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ*

*పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |*

*కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే*

*పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయవిభో  5*


స్మృతులయందుగానీ , శాస్త్రములయందుగానీ , వైద్యమునందుగానీ , శకునములు చెప్పుటయందుగానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందుగానీ , సంగీతము పాడి రంజింపజేయుటయందుగానీ , పురాణములు చెప్పుటయందుగానీ , మంత్రశాస్త్రమందుగానీ , స్తోత్రములు చేయుటయందుగానీ , నాట్యము చేయుటయందుగానీ , హాస్యములు చెప్పి నవ్వించుటయందుగానీ  నేర్పులేనివాడను . ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎట్లు కలుగును ? ఒకవేళ వారు ఆదరించిననూ వారిచ్చు ఫలములు నాకు వద్దు . వేదప్రసిద్ధుడవూ , సర్వజ్ఞుడవూ అయిన ఓ మహేశ్వరా ! నే నెవ్వడినో నాకేతెలియని పశువునైన నన్ను దయతో రక్షించుము .


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 81*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 81*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్*

*నితంబా దాచ్ఛిద్య త్వయి  హరణరూపేణ నిదధే l*

*అతస్తే విస్తీర్ణో గురు రయ మశేషాం వసుమతీం*

*నితంబప్రాగ్భారః స్థగయతి  లఘుత్వం  నయతి  చ ||*



ఈ శ్లోకములో అమ్మవారి నితంబ వర్ణన చేస్తున్నారు. 

అమ్మా, శైలరాజ తనయా నీ జనకుడు హిమవంతుడు తన నితంబ (కొండపైనున్న చదునైన ప్రదేశము) నుండి గొప్ప బరువైన వైశాల్యమును గ్రహించి నీకు అరణముగా ఇచ్చాడు . కాబట్టే నీ నితంబము (పృష్ఠ భాగము) ఘనమై, విశాలమై ఈ భూమండలాన్నంతా కప్పుతూ, తన బరువుచే ఈ భూమండలాన్ని తేలికైన దానిగా చేస్తున్నది, సందేహం లేదు.


శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రములో చెప్పబడిన *భాస్కరీమ్ బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్* *వసుంధరాముదారంగామ్ హరిణీం హేమమాలినీమ్* ఇటువంటి వర్ణనే. వరారోహ అనగా ఘనమైన నితంబము కలిగినది.


ఈ శ్లోకాలలో చెప్పబడిన అమ్మవారి సౌందర్యము మానవీయమైన దృష్టితో చూడరాదు. అమ్మవారు శృంగార రస నాయిక. శృంగము అంటే కొమ్ము, కోణము. అర అంటే వృత్తము. రసము నవ సంఖ్యను సూచిస్తుంది. మొత్తముగా అమ్మవారు కోణములతో, వృత్తములతో, నవావరణలపై అధిష్టించియున్న తల్లి అని గమనించాలి.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ధ్యానం సంబంధ 42 పుస్తకాలు(

 *రాజ యోగం/యోగ/ధ్యానం సంబంధ 42  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------         

కుండలినీ యోగ రహస్యము www.freegurukul.org/g/RajaYogam-1


యోగసర్వస్వము www.freegurukul.org/g/RajaYogam-2


ధ్యాన యోగం www.freegurukul.org/g/RajaYogam-3


యోగదర్శనము-పతంజలి యోగ సూత్రములు www.freegurukul.org/g/RajaYogam-4


పతంజలి యోగ సూత్రములు www.freegurukul.org/g/RajaYogam-5


ధ్యాన పద్ధతి www.freegurukul.org/g/RajaYogam-6


శ్వాస ధ్యానము www.freegurukul.org/g/RajaYogam-7


యోగాతత్త్వదర్శనము-1 www.freegurukul.org/g/RajaYogam-8


యోగాతత్త్వదర్శనము-2 www.freegurukul.org/g/RajaYogam-9


హఠ యోగ ప్రదీపిక www.freegurukul.org/g/RajaYogam-10


యోగ సర్వస్వము www.freegurukul.org/g/RajaYogam-11


యోగాసనాలు www.freegurukul.org/g/RajaYogam-12


శ్రీ విద్యా రహస్యము www.freegurukul.org/g/RajaYogam-13


యోగ వ్యాయామ విద్య www.freegurukul.org/g/RajaYogam-14


మాస్టర్ c.v.v గారి ఎలక్ట్రానిక్ యోగం www.freegurukul.org/g/RajaYogam-15


యోగా www.freegurukul.org/g/RajaYogam-16


శ్రీ కుండలినీ యోగశక్తి రహస్యము www.freegurukul.org/g/RajaYogam-17


యోగాసనములు యోగవిద్య www.freegurukul.org/g/RajaYogam-18


యోగ సాధన www.freegurukul.org/g/RajaYogam-19


యోగ - సత్య దర్శనము www.freegurukul.org/g/RajaYogam-20


జపము - ధ్యానము www.freegurukul.org/g/RajaYogam-21


పతంజలి యోగదర్శనము www.freegurukul.org/g/RajaYogam-22


ధ్యాన పుష్పం www.freegurukul.org/g/RajaYogam-23


యోగ ప్రసంగములు -పతంజలి యోగ సూత్రములు-3 www.freegurukul.org/g/RajaYogam-24


ప్రాణ శక్తి అమూల్యమైన విభూతి www.freegurukul.org/g/RajaYogam-25


జ్ఞాన నిధి www.freegurukul.org/g/RajaYogam-26


ధ్యానం www.freegurukul.org/g/RajaYogam-27


ధ్యానం www.freegurukul.org/g/RajaYogam-28


ప్రాణాయామము www.freegurukul.org/g/RajaYogam-29


తారకామృత పరమహంస ప్రభోదిని www.freegurukul.org/g/RajaYogam-30


ధ్యాన మార్గము www.freegurukul.org/g/RajaYogam-31


ధ్యానం చేసేది కాదు - జరిగేది www.freegurukul.org/g/RajaYogam-32


ధ్యాన పద్ధతి www.freegurukul.org/g/RajaYogam-33


ధ్యానం www.freegurukul.org/g/RajaYogam-34


యోగాసనములు-1 www.freegurukul.org/g/RajaYogam-35


యోగ www.freegurukul.org/g/RajaYogam-36


యోగాసన ప్రదీపిక www.freegurukul.org/g/RajaYogam-37


యోగాబ్యాసం www.freegurukul.org/g/RajaYogam-38


యోగ సాధన www.freegurukul.org/g/RajaYogam-39


యోగాసనములు యోగశక్తి www.freegurukul.org/g/RajaYogam-40


యోగ సంకలనము-హఠ రాజ భక్తి యోగం www.freegurukul.org/g/RajaYogam-41


యోగాభ్యాస దర్పణము www.freegurukul.org/g/RajaYogam-42


రాజ యోగం/యోగ/ధ్యానం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

అవధూత అభయం

 *అవధూత అభయం..*


"మొగలిచెర్ల గ్రామంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నదని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి భక్తుల రాకపోకలు నిషేధించారని మీరు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ చూశానండీ..మా దంపతులము గురుపౌర్ణమి రోజు మీరు ఆనవాయితీగా నిర్వహించే దత్తహోమములో  పాల్గొనాలని ఎంతగానో ఆశపడ్డాము..కానీ పరిస్థితుల ప్రభావం వల్ల దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది..సరే గురువుగారూ..మరలా మీరు ఎప్పుడు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారో ముందుగా తెలిపితే..మేము ఆరోజుకు అక్కడికి వస్తాము..ఒకరోజు ఆ స్వామి సన్నిధిలో నిద్ర చేయాలి..ఆ దత్తయ్య ఏరోజు మాకు వీలు కల్పిస్తాడో..అంతవరకూ ఎదురు చూస్తాము..ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే..అందుకు ఆ అవధూత దత్తాత్రేయుడే కారణం..ఆ స్వామి కృప చూపబట్టే..మేము సమస్యల నుంచి బైట పడ్డాము..మరలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు..స్వామివారి దర్శనానికి ఎప్పుడు వీలుకుదురుతుందో ముందుగా తెలియచేయండి..మా తరఫున స్వామివారి పాదాలకు నమస్కారాలు తెలియ చేయండి.." అంటూ..దాదాపుగా దుఃఖం తో కూడిన స్వరంతో మూర్తిగారు ఫోన్ లో తెలిపారు..


2017 వ సంవత్సరం గురుపూర్ణిమ నాడు మూర్తిగారు తన భార్యతో కలిసి మొదటిసారి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆనాటికి మూర్తిగారికి స్వామివారి గురించి పెద్దగా అవగాహన లేదు..ప్రకాశం జిల్లా లో ఒక పల్లెటూరు సమీపం లో ఒక అవధూత మందిరం ఉన్నదట..అక్కడికు వెళ్లి భక్తి విశ్వాసాలతో ఆ అవధూత సమాధి వద్ద మొక్కుకుంటే..కోర్కెలు తీరుతాయట..అని కొందరు చెపుతుంటే..ఆలకించి..ఒకసారి వెళ్లి వద్దాము..అనే ప్రయత్నం తో వచ్చారు..కాకుంటే..మూర్తిగారు రావడమూ...ఆరోజు తిధి ప్రకారం గురుపౌర్ణమి కావడమూ.. కేవలం కాకతాళీయంగా జరిగింది...గురుపూర్ణిమ సందర్భంగా ఆరోజు స్వామివారి మందిరం ఉదయం నుంచే కోలాహలంగా ఉంది..ఒక ప్రక్క దత్తహోమము లో పాల్గొనే భక్తులు సంప్రదాయానుసారంగా దుస్తులు ధరించి కూర్చుని వున్నారు..మరోప్రక్క హోమగుండాల వద్ద పురోహితులు సామాన్లు సర్దుకుంటున్నారు..


ఈ హడావుడి చూసిన మూర్తిగారు నా వద్దకు వచ్చి.."అయ్యా..ఇక్కడేదో హోమము నిర్వహిస్తున్నారు..వివరాలు తెలుపుతారా"? అని అడిగారు..ప్రతి గురుపౌర్ణమి నాడు దత్తహోమము నిర్వహిస్తామని..ఆ ప్రకారమే ఇప్పుడూ జరుపుతున్నామని చెప్పాను..భార్యతో కలిసి ఒక ప్రక్కకు వెళ్లి ఓ ఐదు నిమిషాలు మాట్లాడి వచ్చారు.."మేము తీవ్రమైన సమస్యల్లో వున్నాము..ఆ సంగతి మళ్లీ తమరికి చెప్పుకుంటాము..ఈరోజు మేము కూడా ఈ హోమములో పాల్గొనే అవకాశం ఉందా?.." అని అడిగారు..మా ప్రధాన అర్చక స్వామిని పిలిచి అడిగాను..ఈ దంపతులను కూడా హోమము వద్ద కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయమని..అర్చకస్వామి నా వైపు చూసి..ఒకే ఒక్క హోమగుండం ఖాళీ ఉంది..నిజానికి నెల్లూరు నుంచి వస్తామన్న రెడ్డిగారు ఇంట్లో ఇబ్బంది వల్ల రాలేకపోతున్నాను..అన్నారు..వారి స్థానంలో ఈ దంపతులకు అవకాశం ఇద్దాము.."అన్నారు.."మీ అదృష్టం అండీ.." అని చెప్పాను..దంపతులిద్దరూ సంతోషంగా హోమములో పాల్గొన్నారు..హోమ కార్యక్రమం పూర్తి అయిన తరువాత..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చారు..


ఆరోజు సాయంత్రం ఆరుగంటల వరకూ స్వామివారి మందిరం వద్దే వున్నారు..ఆరుగంటల బస్సుకు తిరిగి వెళ్లేముందు నా వద్దకు వచ్చి.."ఏదో చాలా చిన్న గుడికి వెళుతున్నాము..అక్కడ ఏర్పాట్లేవీ ఉండవు..కనీసం మనకు భోజనం పెట్టె దిక్కు ఉందొ లేదో.."అని నా భార్యతో అన్నానండీ.."వెళ్ళేది దత్తుడి దగ్గరకు..అన్నీ ఆయనే చూస్తాడు.." అని నాతో ఆవిడ చెప్పింది..ఇంతమాత్రపు గుడి అని అనుకోలేదు..స్వామివారు తనకోసం సరైన స్థలమే ఎన్నుకున్నారు..చాలా తృప్తిగా ..సంతోషంగా వుందండీ..మాకున్న బాధలన్నీ మర్చిపోయాము..మనసారా మొక్కుకున్నాము..ఈ అవధూత పాదాల వద్ద మా సమస్య చెప్పుకొన్నాము..ఈ అవధూత స్వామి అభయం ఇచ్చాడనే నమ్మకం తో వెళుతున్నాము.." అని చెప్పి వెళ్లిపోయారు..


సరిగ్గా ఏడు మాసాల తరువాత..మూర్తిగారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..ఆ దత్తుడే మాకు దారి చూపాడండీ..ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న మా ఆస్తి సమస్య పూర్తిగా తీరిపోయి..మా ఆస్తి మాకు కలిసి వచ్చింది..స్వామివారు కరుణించారు.." అని ఉద్వేగంతో చెప్పారు..ఆ ప్రక్కవారమే ఆ దంపతులు తమ ఆస్తి కాగితాలు తీసుకొచ్చి..స్వామివారి సమాధి వద్ద పెట్టి నమస్కారం చేసుకొని వెళ్లారు..ఆ తరువాత వరుసగా రెండేళ్లు గురుపౌర్ణమి కి ఆ దంపతులు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడిని దర్శించుకొని..దత్తహోమము లో పాల్గొని..ఆ తరువాత గురువారం నాడు అన్నదానం చేయించి వెళ్లేవారు..ఈ సంవత్సరం ఆ అవకాశం కలుగలేదని బాధపడ్డారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380..మరియు..99089 73699).

వ్యాసంలోని ముఖ్యాంశాలు

 చలం‌ -- శ్రీరమణ మహర్షి"

గొల్లపూడి మారుతీరావు, వారి స్వీయచరిత్రలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. 1965లో శ్రీమారుతీరావు చలం గారికి ఒక లేఖ రాసారు! మీరు రాసిన పుస్తకాలు గూర్చి మీ భావన ఏమిటి? అని. దీనికి చలంగారు "వాటిని బుద్ధిలేక రాశాను. అవన్నీ ఎందుకు రాశానా? అనుకుంటున్నాను" (పుట 120) అని స్ఫురింపచేసే మాటలతో సమాధానం రాశారు. చలంగారి సొంత అక్షరాలతో ఆయన లేఖా ప్రతికృతి మారుతీరావు స్వీయచరిత్రలో ప్రచురించారు. ఈమధ్య పిల్లుట్ల ఆంజనేయులు (వీరిది బాపట్ల) గారి స్వీయచరిత్రలో చలం ప్రబోధాలకు లోనై కష్టాలపాలైన ఒకరి జీవితోదంతం చదవవచ్చు. చాలామంది తెలుగు పాఠకులకు గుడపాటి వేంకట చలం, భగవాన్ రమణ మహర్షి ప్రభావితుడై గడిపిన జీవితం తెలియదు!

ఈమధ్య "శ్రీరమణ కరుణా విలాసం" అనే పుస్తకం చదివాను‌. ఈ పుస్తకం 295 పుటలో చలం అనుభవం ఒకటి ఉంది. చలం అరుణాచలం వచ్చేశాక పాత స్నేహితులైన శ్రీశ్రీ మొదలగు మిత్రులు "చలానికి స్కాచ్ విస్కీ త్రాగి ఉత్తరం రాస్తున్నాము" అని హేళనగా, వ్యంగ్య పూర్వకంగా ఉత్తరం రాశారు. వారికి చలం జవాబు ఇట్లా వ్రాశాడు "ఇక్కడ సాటిలేని దివ్యోన్మత్తతను ప్రసాదించే పానీయాన్ని కనుగొన్నాను! దీనిని ఒకసారి సేవిస్తే శాశ్వత ఆనందంలో నిలిచిపోతారు! అనంతర దుష్ఫలితాలు ఉండవు. ఇది స్వయంప్రకాశమానమైనది! మీరు కూడా ధైర్యం ఉంటే వచ్చి సేవించండి" అని వ్రాశాడు.

అసలు చలం ఎట్లా అరుణాచలం చేరగలిగాడు.... చింతా దీక్షితులు, చలం పరమమిత్రులు. ఇద్దరూ విద్యాశాఖలో ఉద్యోగులు. దీక్షితులు గారు ఎట్లానైనా ఒకసారి చలాన్ని అరుణాచలం దర్శింపచేయాలని తెగ ఆరాటపడేవారు! ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఒకరోజు చలం... తన ఇష్టం వచ్చినట్లు శ్రీరమణాశ్రమంలో ప్రవర్తించడానికి ఒప్పుకుంటే వస్తానన్నాడు. ఇద్దరూ అరుణాచలం చేరారు. ఒకరోజు రమణ మహర్షి అరుణాచలం కొండ దిగి వస్తుండగా అందరూ భక్తితో ఆయనకు దారి ఇచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. మన కథానాయకుడు చలం ఆయన వచ్చే దారికి అడ్డం నిలబడి నిర్లక్ష్యంగా సిగరెట్ పొగ వదులుతున్నాడు! చింతా దీక్షితులు 'ఈ దుర్మార్గుడిని ఎందుకు తీసుకుని వచ్చాను?' అని తల పట్టుకున్నాడు.

శ్రీరమణ మహర్షి చలం దగ్గరకు రాగానే ముఖం మీద సిగరెట్ పొగ వదులుదామనుకున్నాడు! శ్రీరమణ మహర్షి ప్రక్కకు తప్పుకుని ఒక్క క్షణం సూటిగా చలం కళ్ళలోకి చూసారు. ఆ క్షణం ఏమి జరిగిందో తెలియదు!! చలం ఆయన కాళ్ళమీద పడి ఉన్నాడు!! ఏం జరిగిందో చలమే చెపుతున్నాడు.

""ఆకాశాన్నంటే గంభీర శ్యామలాకృతి నాపై దృష్టి నిలిపింది! ఇనుమును చీల్చే విపరీతాగ్నికీల వలే, పాషాణాన్ని కరిగించే కేంద్రీకృత సూర్యరశ్మి వలే ఆ తేజోమయ వీక్షణం నా హృదయాంతరాళంలోకి దూకి భగ్గున మండింది. నేను లేను... నేను లేను... నేను భావించుకున్నది ఏదీ లేదు" అంటున్నాడు చలం!! ఆ క్షణం నుండి చలం జీవితం అరుణాచల రమణునికి అంకితం అయిపోయింది! అక్కడే తనువు చాలించాడు! అదృష్టవంతుడు.

శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణ మహర్షి, అరవింద యోగి, పరమహంస యోగానంద, కంచి పరమాచార్యులు వంటి దివ్యులు, ప్రాచీనకాలపు ఋషి సమానులు ఈనాటికీ ఈ హిందూ దేశంలో ఉండటంవలనే ఈదేశం అన్యమతాక్రాంతం కాలేదు. ఏనాటికీ కాదు...🚩


-- అక్కిరాజు రమాపతిరావు (ఆంధ్రభూమి దిన పత్రికలో 16-7-2018 వ్యాసంలోని ముఖ్యాంశాలు)

కొన్ని ప్రశ్నలు

 నికృష్టుడు:- యజ్ఞాలు చేసి నెయ్యి అంతా నేలపాలు చేస్తున్నారు. దాని బదులు పేదలకు పంచవచ్చు కదా.?


సనాతన భారతీయుడు:- తప్పకుండా అలాగే చేద్దాం. దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు.


నికృష్టుడు:- అడగండి.


సనాతన భారతీయుడు:- నువ్వు ఆంగ్ల సంవత్సరానికి బాణసంచా కాల్చేబదులు పేదలకు ఆడబ్బుతో తిండి పెట్టొచ్చు కదా.?


నికృష్టుడు:- ఆడబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నాను. నాకు నచ్చినట్లు నేను ఖర్చు చేసే హక్కు నాకుంది😡.


సనాతన భారతీయుడు:- సరే, నువ్ నీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు , రెస్టారెంట్లకు వెళ్తావ్ కదా.?


నికృష్టుడు:- వెళ్తాను, అయితే ఏమిటి.?


సనాతన భారతీయుడు:- అలా షికార్లు వెళ్లి డబ్బులు తగలేసే బదులు పేదలకు ఇవ్వొచ్చు కదా.?


నికృష్టుడు:- 😡😡😡 నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను.? 

నా డబ్బులు నేను ఎలా ఖర్చుపెట్టుకోవాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా.?


సనాతన భారతీయుడు:- 😊😊😊 లేదు లేదు, నేను నిర్ణయించను, అయితే ఇంకొకప్రశ్న.! రోజూ ఆఫీసుకు నువ్ కార్లో వెళ్తావ్ కదా ఆ పెట్రోల్ వల్ల వాయుకాలుష్యం వస్తోంది కదా, అలాగే నువ్ నడిచి వెళ్తే నీకు ఆరోగ్యం, వాయు కాలుష్యం తగ్గుతుంది, ఆ డబ్బుతో పేదవాడి కడుపు నింపొచ్చు కదా.?


నికృష్టుడు:- 😡😡😡 అసలు నీకు బుద్ధి ఉందా.? నేనెందుకు నడిచి వెళ్ళాలి. నా డబ్బుతో కొనుక్కున్న కార్, నా డబ్బుతో పోయించుకునే పెట్రోల్, మధ్యలో నీ అధికారం ఏమిటి.?


సనాతన భారతీయుడు:- 😡😡😡 ఓరి ఎర్ర(ర్రి) పుష్పం. మరి వాళ్ళ సొంత డబ్బుతో యజ్ఞాలు చేస్తే నీకొచ్చిన నొప్పి ఏమిట్రా వెధవ.! వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము కాదు కదా, మధ్యలో నీకెందుకు అంత ఏడుపు.?


నికృష్టుడు :- మీ అగ్రకులాలకు అహంకారం ఎక్కువ, మీరు యజ్ఞ యాగాల పేరుతో నిమ్న కులాలను తొక్కేస్తున్నారు.


సనాతన భారతీయుడు:- ఇప్పుడే సొమ్ము వృధా అన్న వాడివి మళ్ళీ కులాల్లోకి దూకావేమిట్రా పిల్లి మొహమా.? 

అసలు ఒక యజ్ఞం మొదలు కావాలి అంటే ఎంతమంది కులాల సహకారం కావాలి అనేది తెలుసా నీకు.

మొట్ట మొదట యాగశాల నిర్మాణం చేసేది మేదరి వారు, తర్వాత కుండాలను నిర్మించేది మెస్త్రీలు(ఇందులో దాదాపు అన్ని రకాల కులాల వారు ఉన్నారు.) వాటికి కావాల్సిన సమిధలు తెచ్చేది గిరిజనులు. (సమిధలు అంటే ఏంటో తెలియక పిచ్చి చూపులు చూస్తావ్ ఏమిట్రా పుల్కా, సమిధలు అంటే కట్టెలు.)

వాటికి కావాల్సిన నెయ్యి ఇచ్చేది గొల్ల వారు.

యజ్ఞ దీక్షా వస్త్రాలు ఇచ్చేది శాలి వారు.

కావాల్సిన మట్టి కలశాలు ఇచ్చేది కుమ్మరి వారు. ఇత్తడి,వెండి, బంగారం మొదలైనవి అమర్చేవారు స్వర్ణకారులు. దీక్షకు కూర్చోవాలి అంటే ముందుగా వపనం చేయించాలి, దానిని చేసేవారు మంగలి వారు.

యజ్ఞమునకు కావాల్సిన ధాన్యమును ఇచ్చువారు రైతులు.( మళ్ళీ ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు.)

దీనికి అంతటికీ ధనాన్ని ఇచ్చేవారు వైశ్యులు. రక్షణ బాధ్యత క్షత్రియులది. నిర్వహణ బాధ్యత బ్రాహ్మణులది. ఇన్ని సామానులు ఎక్కడినుండో తీసుకు రావటానికి రవాణా వారు ఎంత కష్టపడతారు. వీళ్ళందరికి ఇందులో ఉపాధి దొరికిందా లేదా.? ఇందులో ఒక్కరు లేకపోయినా యజ్ఞం అవ్వదు రా ఎర్ర కుక్క.! గొర్రెల చదువు వంట బట్టించుకుని సమాజంలో చీలిక తెచ్చి అందరి మధ్యలో వైషమ్యాలు తెస్తావా ఊరపంది.!  పోయి ఉచిత పథకాలను అనుభవించడం మానేసి కష్టపడి బ్రతకరా అక్కుపక్షి.! తర్వాత పేదలకు సహాయం చేయించే పని చేద్దువు కానీ.!


నికృష్టుడు:- మీరంతా ఇలాగే చెప్తారు, మా ఎర్ర పుస్తకంలో ఉన్నదే వాస్తవం. మీరంతా మోసగాళ్ళు,  ఎప్పటికైనా మా నికృష్టులే ఈ దేశాన్ని ఏలుతారు.


సనాతన భారతీయుడు:- సరే మంచిది. పోయి బావిలో దూకు.


జరుగుతున్న యజ్ఞాలను, మహనీయుల విగ్రహ ఆవిష్కరణలు తప్పు పడుతున్న నికృష్టులకు ఈ పోస్టు అంకితం.


 *సేకరణ*

ఆలోచనాలోచనాలు౦

 *****౦ ఆలోచనాలోచనాలు౦*****                                              The crown of the house.                                The beauty of the house is order.                 The blessing of the house is contentment.     The glory of the house is hospitality.                    The crown of the house is GODLINESS.     ------ Anonymous.             Be a man of value.....         Try not to become a man of success, but rather try to become a man of value. He is considered successful in our day, who gets more out of life than he puts in. But a man of value will give than he receives. ---- Albert Einstein.                             ------* Think it over *------.                                   Peace begets prosperity;.                        Prosperity begets pride;.                                 Pride begets prejudice;.                         Prejudice begets war;.         War begets " poverty.".           ~~~Life is Arithmetic ~~~.                                  Life is Arithmetic, such that.                           Friends are to be added,.                               Enemies are to be subtracted,.                      Joys are to be multiplied,.                         Sorrows are to be divided.                              ------ lt makes- - - -  ------- Poverty makes people lose their friends and relatives,.                           Love makes them lose their fear and shame.                                Study makes them lose their comfort and sleep.                                 And hunger makes them lose their taste and nourishment. ----- Subhashitha.                    Dt 20--11--2023, Monday, Good morning.

అమృతంగమయ - జ్ఞానయోగం*

 *అమృతంగమయ - జ్ఞానయోగం*


దీక్ష - జీవిత రక్ష


శ్రీ భగవానువాచ ।


అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 


భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం


శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.


అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః - యోగ దర్శనం


‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.’


పుట్టుకతోనే ఏ మనిషీ సర్వోన్నతుడు కాలేడు. సర్వోన్నతమైన స్థానాన్నీ అందుకోలేడు. దీనికై నిరంతర సాధన అవసరం. తనను తాను ఉద్ధరించుకోవాలన్న ఆలోచన ఏ క్షణమైతే మనిషికి కలుగుతుందో ఆ క్షణం నుంచే అతడిలో పరివర్తనకు శ్రీకారం చుట్టుకుంటుంది. లౌకిక జీవనంలో అనేక మాయల వలలో చిక్కుకున్న మనిషి క్రమంగా తెలివి తెచ్చుకుంటూ వాటి నుంచి క్రమంగా బయటపడి శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. వీటన్నిటిలో మనిషి అన్ని రకాల లౌకిక బంధాల నుంచి విడిపడేలా చేసి, దైవత్వానికి దగ్గర చేసేందుకు మేలైన మార్గం 'దీక్ష'. 


దీక్ష అంటే నియమాల సమాహారం. పట్టుదల అనే పేరు కూడా దీనికి ఉంది. ఒక ఆచారాన్ని లేదా  నియమాన్ని పాటించాలని సంకల్పించడం, దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకొని, దైహికంగా, మానసికంగా మండల కాలం పాటు నిష్ఠాపూరితమైన జీవనాన్ని నిరాడంబరంగా గడపడం దీక్షలోని ప్రధానమైన అంశం. దీనివల్ల భౌతికమైన క్రమశిక్షణతోపాటు మానసికమైన నిబద్ధత ఏర్పడుతుంది. అది ఆదర్శప్రాయమైన జీవనానికి మార్గదర్శకమవుతుంది.


ఏమిటి ఈ దీక్ష 


దీయతే జ్ఞానం విజ్ఞానం క్షీయంతే పాప నాశనం


తేన దీక్షా ఇతి ప్రోక్తా ప్రాప్తాచ్చేత్‌ సద్గురోర్ముఖః ||


దీ - అంటే జ్ఞానం, క్ష - అంటే పాపక్షయం అని అర్థం. జ్ఞానాన్ని ఇచ్చి పాపాన్ని పోగొట్టేది దీక్ష అవుతుంది. దీక్షకు ఇదమిత్థంగా ఇదీ భౌతిక స్వరూపం అంటూ ఏదీ ఉండదు.  మనసులో దర్శించిన అనుభూతి, ఎంచుకున్న లక్ష్యం, కలిగిన ప్రేరణ బట్టి దీక్ష ఆచరించే విధానం మారుతుంది. బయటకు ఇదంతా విభిన్నమైన పద్ధతులు అనిపించినా అన్ని దీక్షలూ చేరే గమ్యం పరమాత్మ పాదాలు మాత్రమే.


దీక్ష అనే పదం - ద, ఇ, క, ష, అ అనే ఐదు అక్షరాల కలయికతో ఏర్పడింది. 'ద' అంటే ఇచ్చేది, 'ఇ'  అంటే  లక్ష్మి లేదా సంపద. 'క' అంటే బ్రహ్మానందం. 'ష' అంటే సమృద్ధి. 'అ' అంటే పరమాత్మ లేదా పరబ్రహ్మ. ఇలా బ్రహ్మానందం, సంపద, సమృద్ధి, పరమాత్మని ఇచ్చేది దీక్ష అవుతుంది. దీక్షను ఆచరిస్తే పరమ జ్ఞానం కలుగుతుంది. పాప పరంపరలను పోగొట్టి సంసార పాశ బంధాలను ఛేదించి, తత్త్వ చింతనను కలిగిస్తుంది. దీక్ష అంటే నియమబద్ధ ప్రవృత్తి. మనస్సు, శరీరం, వాక్కుతో సహా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించటాన్ని దీక్ష అంటారు. దీక్షకు మించిన పవిత్రమైన వస్తువు, జ్ఞానం, తపస్సు ప్రపంచంలో మరెక్కడా లేవు.


మరోవిధంగా చెప్పాలంటే నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడింటిని సమన్వయం చేసి నిర్వహించే పనుల్నే 'మనోవాక్కాయకర్మలు' అంటారు. అహింస (హింస చెయ్యకుండా ఉండటం), సత్యం (దేవుని మీద నిజమైన భక్తి కలిగి ఉండటం), ఆస్తేయం (అవలంబించేందుకు తగిన విధానాన్ని ఎంచుకోవటం), బ్రహ్మచర్యం (శారీరక వ్యామోహాలు లేకపోవటం), అపరిగ్రహం (తన భోగాల కోసం ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించకపోవటం) అనే మహావ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించటాన్ని కూడా దీక్ష అంటారు.


దీక్షలో రకాలు


దీక్షల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి ఆణవీ, శాక్తేయీ, వైష్ణవి. మంత్రం, అర్చన, ఆసనం, ధ్యానం, స్థాపన, ఉపాసన అనే ఆరు అంగాలు కలిగిన దీక్ష అణవి అవుతుంది. శక్తిని ఆరాధించే దీక్ష శాక్తం లేదా శాక్తేయం అవుతుంది. చివరిది వైష్ణవీ దీక్ష. గురుశిష్యులిద్దరూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రవర్తించటం వైష్ణవీ దీక్ష అవుతుంది. శిష్యుడిని మంచి దారిలో ప్రవర్తింపజేయటం, తత్త్వం, హితం, పరమార్థం మొదలైన విషయాల్ని బోధించటం మొదలైనవన్నీ ఇందులోకి వస్తాయి. గురువునే పరమాత్మగా ఆరాధించటం, ధన, మాన, ప్రాణాల్ని కూడా గురువుకే అర్పించటం ఈ దీక్షలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. గురువు గారిని దర్శించటం, స్పృశించడం, మాట్లాడటం వల్లనే తత్త్వ జ్ఞానము కలుగుతుంది. గురువు జ్ఞాన మార్గంతో శిష్యదేహంలో ప్రవేశించి శిష్యుడి జ్ఞాన నేత్రాన్ని తెరిపించి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం వైష్ణవి దీక్ష అవుతుంది. దీన్నే జ్ఞానదీక్ష లేదా బ్రహ్మచర్య దీక్ష అని కూడా అంటారు. ప్రతి దీక్షలోను కలశ స్థాపన ప్రధానమైన అంశంగా ఉంటుంంది. 'క' అనగా పరబ్రహ్మ, 'ల' అంటే లక్ష్మీ, 'శ' అంటే శాంతి, శక్తి అని అర్థం. కలశం బ్రహ్మాండానికి, అందులో ఉన్న జలం సకల దేవతలకు, ఆకులు సకల ప్రాణులకు ప్రతీకలుగా ఉంటాయి. కొబ్బరికాయ మనం ఏర్పరచుకునే స్థిరమైన సంకల్పానికి, దానిపై వేసిన వస్త్రం మన శరీరానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. ఈవిధంగా త్రికరణాలతో త్రిమూర్తుల్ని, త్రిలోకాలని, తత్త్వ త్రయాన్ని ఆరాధించటమే కలశస్థాపన అవుతుంది. మొత్తంగా దీక్షలో ప్రధానంగా స్థాపించే కలశం మనల్ని తత్త్వాతీతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పునాది వేస్తుందని అర్థం చేసుకోవాలి.  ఈ విధంగా కలశస్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని, మంత్రములతో చేస్తే మాంత్రి అని అంటారు.


దీక్షలు క్రియావతి, కళావతి, వర్ణమయి, బోధమయి అని నాలుగురకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశ స్థాపన చేసే విధానం క్రియావతి అవుతుంది. కలశంలో దేవతాకళలను ఆవాహన చెయ్యటం కళావతి. మంత్రాలు చదువటం, ఉపదేశించటం వర్ణమయి. తత్త్వ జ్ఞానాన్ని బోధించటం బోధమయి అవుతాయి. ఈవిధమైన దీక్షానియమాలతో దేవతల్ని ఆరాధించాలని, వారికి సంబంధించిన దీక్షావిధానాల్ని పాటించాలని వివిధ శాస్త్రాలతో పాటు ఆచార సంప్రదాయాలు కూడా చెబుతున్నాయి


దీక్ష ఎందుకు?


పేరేదైనా సరే దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికృత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని మన ఇష్టదైవంగా భావించి ఆ పేరుతోనే పలుకరిస్తాం. ఇంకా మరెన్నో పద్ధతుల ద్వారా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాం. ఇదంతా జరగటానికి దీక్షకు సంబంధించిన నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి క్షణం మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించుకోవటం ద్వారా దీక్ష తీసుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం సులభమవుతుంది.


దీక్ష అంటే కేవలం కొన్ని కఠినమైన నియమాల్ని పాటించటం మాత్రమే కాదు. అందుకు ఆంతరిక శుద్ధి తప్పనిసరి. దీక్ష ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరూ పరిశుద్ధమైన మనస్సు కలిగిఉండాలి. లేదంటే దీక్ష అనే మాటకే అర్థం మారిపోతుంది.


పాలను ఏదైనా గిన్నెలో పొయ్యాలనకున్నప్పుడు ముందుగా ఆ గిన్నె శుభ్రంగా ఉందో లేదో చూస్తాం. శుభ్రంగా ఉంటే సరి. లేదంటే గిన్నెను శుభ్రపరిచిన తర్వాతనే పాలను అందులోకి పోస్తాం. లేదంటే పాలు విరిగిపోతాయి. దీక్ష కూడా పాలవంటిదే. ఇక్కడ శరీరం గిన్నె వంటిది. శుభ్రమైన శరీరం (బాహ్యంగాను, మానసికంగాను) లేకపోతే అందులోకి పోసే (స్వీకరించే) దీక్ష కూడా మలినమవుతుంది. కాబట్టి, ఏవిధమైన దీక్ష చెయ్యాలని నిశ్చయించుకున్నా ముందుగా మన శరీరాన్ని మానసికంగాను, శారీరకంగాను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత సద్గురువును ఆశ్రయించి, ఆయన సూచనల ప్రకారం దీక్ష తీసుకోవాలి. అంతేకానీ ఏ వ్యక్తీ తనకు తానుగా దీక్ష తీసుకుంటున్నానని ప్రకటించకూడదు. ఆచరించకూడదు. ప్రత్యేకించి మంత్ర దీక్షల విషయంలో గురు అనుగ్రహం తప్పనిసరి.  


కార్యసాధనకు దీక్ష తప్పనిసరి అనే అంశాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఆరో అధ్యాయంలో చెబుతాడు. 


అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ |


అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గహ్యతే ||


 అర్జునా! మనస్సును నిగ్రహించటం చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత దాన్ని సాధించవచ్చంటాడు పరమాత్మ. ఇక్కడ అభ్యాసం అంటే దీక్ష. మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే సాధారణ దీక్ష సరిపోదు. అకుంఠితమైన దీక్ష కావాలి. అకుంఠితం అంటే ఏ ఒక్కరోజూ కుంటుపడనిది అని అర్థం. దీక్ష తీసుకున్న తర్వాత మన నిర్ణయం మారకూడదు. మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. అలాచేసినప్పుడే స్వీకరించిన దీక్ష కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది. 


'దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః'. దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించటం కోసం దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్మాత్మిక సందేశం ఇది. 


దీక్షను స్వీకరించిన వారు స్వయంగా దైవ భావన కలిగి నిరాడంబరులై అరుణోదయ, తపనోదయ, సంగమ, మధ్యాహ్న, సాయం, అర్థనిశా సమయాల్లో పూజలు ఆచరించాలి. వీటినే షట్కాలార్చన అంటారు. (ఆరు కాలాల్లో అర్చన చేయలేని వారు కనీసం ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా అర్చన చెయ్యాలి). దీక్ష పూర్తయ్యేవరకు సాధ్యమైనంత సేపు మౌనం వహించాలి. ఏ దీక్షనైతే స్వీకరిస్తారో దానికి సంబంధించినటువంటి అన్ని నియమాలను పాటించాలి.

కార్తీక పురాణము-- 8

 కార్తీక పురాణము-- 8


*కార్తీక పురాణము- ఎనిమిదవ అధ్యాయము*


వశిష్ట మునీంద్రా!నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది.ఆ సందేహమును తెలిపెదను,దానిని నశింపజేయుము.


మీరు నాకు ధర్మసూక్ష్మమును చెప్పితిరి.పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారు.అది ఎట్లు సంభవమగును?ఓ మునీశ్వరా! అనంత పాతకములు చేసి, ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీకదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణము చేయసాధ్యమా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పడకుండునా?ఇట్టి దృష్టాంతములనుబట్టి చూడగా అధికములయిన పాపములను చేసి స్వల్పపుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును?నాకీ సంశయమును నశింపజేయుము.నాకే కాదు, వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే.


కార్తీక, మాఘ, వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పారు.అది ఎట్లు సిద్ధించును? అని అడిగిన రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యముచేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను.


ఓరాజా! వినుము. మంచి విమర్శ చేసితివి.నేనుగూడ విచారించితిని.వేద,శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్షములున్నట్లు తెలిసినది.అట్టి సూక్ష్మ ధర్మములు ఎంతపనినైన చేయ సమర్థములు.


ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము గూడా స్వల్పమై పోవును.ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును.కనుక ఈవిషయమందు సందేహము పొందకు చెప్పెదను సావధానముగా వినుము.


ధర్మములు గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును.గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈమూడు గుణములును ప్రకృతివలన గలిగినవి. ప్రకృతియనగా మాయ.అందులో సత్వగుణమువలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు.


ప్రాయశ్చిత్తములన్నియు తమస్సువలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి.తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును.ఇది నిష్ఫలము.


ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినొందును, దేశమనగా పుణ్యక్షేత్రము. కాలమనగా పుణ్యకాలము,పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు.ఈమూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను, మంత్రరహితముగాను, చేయి దానాదికము తామసమనబడును.ఇది ఎంతగొప్పదయినను సర్వపాపనాశన సామర్థ్యము గలది గాదు.


ఓ జనకమహారాజా! దేశ,కాల, పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును.ధర్మము అధికమో, స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. దేశ,కాల విచారణ చేసిన ధర్మమువలన సుఖమును పొందుదురు.కాబట్టి జ్ఞానముచేతగాని, అజ్ఞానముచేతగాని దేశకాలపాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయఫలము ఇచ్చును.ఇందుకు సందియములేదు.


పర్వతముయెత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచినయెడల ఆ కట్టెలన్నియు బూడిదయగును.గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును.చిక్కగా ఉన్న బురదనీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన యెడల ఆ మురికిపోవును.అట్లే, అల్ప పుణ్యముచేత అధికపాపములు నశించగలవు.అజ్ఞానముచేతగాని, జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధికములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనమువలన నశించును.


మహిమ తెలియక చేయబడినదయినను హరినామ సంకీర్తనముచే పాపములన్నియు వెదురు పొదలను అగ్నివలె దహించును.పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము.


పూర్వకాలమునందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగపారంగతుడైన సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడుగలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు, ధర్మాత్మురాలు అగు భార్య కలదు.వారిరువురకు చివరికాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను.అజామిళుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడై యుండెను.

అట్టివాడు స్వల్పపుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ


అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన, అజామిళునకు యౌవనము రాగానే దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది.దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను.ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరు అతనిని గృహమునుండి వెళ్ళగొట్టిరి.


అజామిళుడు ఆ ఊరిలోనే యొక చండాలుని ఇంటిలో నివాసము చేసికొని నిత్యము దాసీతోగూడి కుక్కలను ఉచ్చులువేసి, మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను, పక్షులను, మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను.


ఇట్లుండగా ఒకనాడు ఆ దాసీ కల్లుద్రాగుదమను యాశతో తాటి చెట్టెక్కి కొమ్మవిరిగి క్రిందబడి మృతిబొందెను.తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణములకంటె అధికప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని, వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి ఇంటికిబోయెను.తరువాత అజామిళుడు యౌవనవంతురాలయిన దాని కూతురుని చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను.తరువాత అజామిళునకు ఆ కూతురియందు కొందరుపుత్రులు గలిగి నశించిరి.అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి 'నారాయణ ' అను నామకరణము చేసి అజామీళుడు నడుచునప్పుడును, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనముచేయునప్పుడును, తిరిగుచున్నప్పుడును పుత్రపాశముచేత బద్ధుడై నిరంతరము ఆనామమునే పలుకుచుండెను.


కొంతకాలమునకు అజామీళునకు మరణకాలము సమీపించగా అతనిని తీసుకొనిపోవుటకు ఎర్రనిగడ్డములు, మీసములు గలిగి చేతులందు దండములను రాళ్ళను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి.


అజామీళుడు తనను దీసుకొని పోవవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందు ఆటలోనున్న కుమారుని "నారాయణా, నారాయణా!' అని పిలిచెను.


ఆ పిలుచునప్పుడు భయముచేత, దీనస్వరముతో, పెద్దగా "ఓ!నారాయణా!" అని పలుమారులు పిలిచెను.


రాజా! దైన్యముతోగూడి నారాయణ నామసంకీర్తనమును మరణకాలమందు అజామీళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రా వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి.


అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను జూచి ఓయీ! ఈ అజామీళుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి.


రాజా! ఆ విష్ణుదూతలు పద్మములవలె విశాలములయిన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మమాలాలంకృతులును, కిరీటవంతులును, కుండలధారులును, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, నాలుగు చేతులు గలవారును, సుందరదేహులును, శంఖచక్రములను ధరించినవారును, తమ కాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి.


ఇట్టి విష్ణుదూతలను జూచి యమదూతలు మీరుఎవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? అని యడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామీళుని తమ పుష్పకవిమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవుకోర్కెగలవారై, ఇట్లు పలికిరి.


*ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టమోధ్యాయసమాప్తః*

కార్తికపురాణము - 7

 కార్తికపురాణము - 7


వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని, మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణుసన్ిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను, ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.


ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః

పంచాంగం

 ॐశుభోదయం, పంచాంగం ॐ  

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

 *_నవంబరు 20, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం**శరదృతువు*

*కార్తీక మాసం**శుక్ల పక్షం*

తిథి: *అష్టమి* తె3.15

వారం: *ఇందువాసరే*

(సోమవారం)

నక్షత్రం: *ధనిష్ఠ* రా10.15

యోగం: *ధృవం* రా10.05

కరణం: *విష్ఠి* సా4.26

*బవ* తె3.15

వర్జ్యం: *తెల్లవారితే*

*మంగళవారం 4.57నుండి*

దుర్ముహూర్తము: *మ12.07-12.52*

*మ2.21-3.06*

అమృతకాలం: *మ12.32-2.02*

రాహుకాలం: *ఉ7.30-9.00*

యమగండం: *ఉ10.30-12.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *మకరం*

సూర్యోదయం: *6.09*

సూర్యాస్తమయం: *5.21*

 లోకాః సమస్తాః* సుఖినోభవంతు*

ఆచారవ్యవహారాల పై వివరణ..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఆచారవ్యవహారాల పై వివరణ..*


*(ముప్పై మూడవ రోజు)*


శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారితో విపరీతమైన అనుబంధం ఏర్పడింది..ఆ దంపతుల ఇంట్లో రమారమి 21 రోజుల పాటు శ్రీ స్వామివారు బస చేశారు..ఎన్నో బోధలు చేశారు..అలాగే శ్రీధరరావు గారి తల్లిగారు సత్యనారాయణమ్మ గారికి కూడా శ్రీ స్వామివారి పై అచంచల విశ్వాసం కుదిరింది..రోజూ శ్రీ స్వామివారు చెపుతున్న విషయాలకు ఆవిడగారు విపరీతంగా ఆనందపడేవారు.."నాయనా!..నువ్వు ఇక్కడికి రాకపోతే..నాకెవరు ఇన్ని సంగతులు చెపుతారు?.." అనేవారు వాత్సల్యంతో..


"అమ్మా..మృత్యువు పెద్దపులిలా పొంచివుంది..ఎప్పుడూ రామనామం జపిస్తూ వుండు!.." అని చెప్పారు శ్రీ స్వామివారు..శ్రీధరరావు దంపతులతో కూడా అదే మాట చెప్పారు ఆవిడ గురించి..ఎక్కువ సమయం లేదని కూడా అన్నారు..


ఈలోపల ప్రభావతి గారు బహిష్టు అయ్యారు..ఇప్పుడు ఆ ఇంట్లో సమస్య వచ్చి పడింది..శ్రీ స్వామివారికి ఏర్పాట్లు, వంట ఎలా జరగాలి?..ఆయన యోగి..సిద్ధ పురుషుడు..అలాంటి వారికి మైల తో కూడిన ఆహారం పంపకూడదు..శ్రీధరరావు గారు కూడా మధనపడుతూ.. నేరుగా శ్రీ స్వామివారిని కలిసి..సమస్య చెప్పి.."మీకు అపవిత్రత జరుగుతుందేమో..మిమ్మల్ని ఈ నాలుగు రోజులూ మాలకొండలో ఉండేవిధంగా ఏర్పాటు చేస్తాను..ఐదవ రోజు ప్రభావతి స్నానం అయ్యాక..మిమ్మల్ని మరలా ఇక్కడికి పిలిపిస్తాను..కొద్దిగా సహకరించండి.." అన్నారు ప్రాధేయపూర్వకంగా..


శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు.."అమ్మ ఎక్కడుంది?.." అన్నారు..


"పెరట్లో కూర్చుని ఉంది..అక్కడే భోజనం చేస్తుంది..అక్కడే పడుకుంటుంది..మీకేమీ ఇబ్బంది ఉండదు..ఈపూటకు మీ స్నానానికి నీళ్లు అవీ పని వాళ్ళ చేత నేను పెట్టిస్తాను.." అన్నారు..


"అమ్మ దగ్గరకు పోదాం పదండి.." అంటూ శ్రీధరరావు గారిని వెంటపెట్టుకుని..ప్రభావతి గారున్న చోటికి వచ్చారు..కూర్చుని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్టు లేచి నిలుచున్నారు..


"అమ్మా!..నెలసరి అయితే..మీ పనులు మీరు చేసుకోకుండా..నాకేదో అపవిత్రం జరుగుతుందని..చాటుగా వెళ్లి కూర్చున్నావా?..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..నీవు స్వయంగా నా పనులు చేయవద్దు..ఈ సమయంలో అది మంచి నిర్ణయం..కానీ నీవు నాకుఎదురుపడినా..నీవు సహజంగా చేసుకునే ఇంటిపనులు చేసుకుంటున్నా..నాకు అపవిత్రం అని ఎవరన్నారు?..నీకెవరు చెప్పారు?..ముందు ఇంట్లోకి వెళ్లి..నీవు చేసుకునే అన్ని పనులూ చేసుకో..ముందుగా మీకు ఈ అజ్ఞానం వదిలించాలి.."అన్నారు నవ్వుతూనే..


శ్రీధరరావు గారు..ఆయన వెనుకాల ప్రభావతి గారూ..వారిద్దరి కంటే ముందు శ్రీ స్వామివారు..ఇంట్లోకి వచ్చారు..అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చుని వున్నారు..ఆవిడ కూడా శ్రీ స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమో నని భయపడుతూ వున్నారు..


ముందుగా వస్తున్న శ్రీ స్వామివారిని చూసి.."అమ్మాయి దూరంగా వుంది నాయనా!.." అని చెప్పబోతున్నారు..శ్రీ స్వామివారు చేయెత్తి ఆవిడను వారించి.."అమ్మా!..ఆ విషయాలే చెబుదామని వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఇక్కడకు వచ్చానమ్మా.." అన్నారు..


శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని..కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు..కళ్ళు తెరచి..ఆ ముగ్గురిని నిశితంగా చూసారు..ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది..ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు..ధ్యానముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు..


"అమ్మా!..అందరూ శ్రద్ధగా వినండి.." అంటూ..మొదలుపెట్టారు..


ఋతుక్రమం..ఊర్ధ్వ అధో లోకాలు..అజ్ఞాన నివృత్తి..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శివ మహిమ-- ధూర్జటి !

 శు భో ద యం 🙏



         చొప్పకట్ల.


శివ  మహిమ-- ధూర్జటి !


             మ:  తన యిల్లా లఖిలైక  మాత ,  తన  సంతానంబు  భూతవ్రజం ,


                     బను లాపంబులు  వేదముల్ , తన  విహారాగారముల్  మౌనిహృ


                      ద్వనజంబుల్ , తన  సేవకుల్  కమలజాత  శ్రీధరుల్గాఁ  జెలం


                       గిన  దేవోత్తము  నమ్మహాత్ముఁ  దరమే  కీర్తింపఁగా   నేరికిన్ ?


                             శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము- అవతారిక -10 వపద్యము:  మహాకవి  ధూర్జటి .


                                     శ్రీ కృష్ణరాయ సార్వ భౌముని భువన విజయమునలంకరించిన యష్టదిగ్గజ కవులలో  నొకడు ధూర్జటి!


పరశివ తత్వము ననుసరించెడి శైవుడు. అయిన నేమి యతడు మానసికముగా నద్వైతి. శివకేశవుల యెడ నారాధనా భావముగలవాడు. శ్రీ కాళహస్తీశ్వర శతకము. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము  ఇతని రచనలు. రెండును పరమేశ్వరాంకితములే!

ఇదియాతని స్వతంత్రతకు నిదర్శము. రాయల కొలువున నున్నను రాచరికమును తూర్పారబట్టిన ఘనుడు ధూర్జటి.


                 " రాజుల్ మత్తులు  వారిసేవ  నరకప్రాయంబు"- అంటూ రాజసేవ యెంత  దుర్భరమైనదో వివరించినాడు.


                ప్రస్తుత పద్యము శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున  అవతారిక లోనిది. తన గ్రంధమునకు కృతిపతియగు పరమశివుని

గూర్చి సభక్తికముగా చేసిన విన్నపమిది.  స్వామీ  సర్వశక్తి సమన్వితుడవే , నిన్నేమని ప్రస్తుతించనయ్యా! అదినాతరమా! అంటూ

పరమ శివునకు గల ప్రత్యేకతలను  యీవిధముగా ప్రకటించుచున్నాడు.


             తనయిల్లా లఖిలైకమాత !  లోకమాత  యైన  జగజ్జననినియగు  పార్వతీమాత  నీకు భార్య. 


                  లోకంలో  అందరూ అనేమాట - "యిల్లాలివల్ల యింటికి పేరని'  పార్వతి జగజ్జనని . 'ఆకీట బ్రహ్మ పర్యంతం' యీసృష్టకంతకూ

ఆమెయే జనని ,అంటే విశ్వజనని."యాదేవీ సర్వ భూతేషు ప్రాణరూపేణ సంస్థితా  నమస్తస్యై  నమస్తస్యై  నమస్తస్యై నమోనమః" అంటున్నాయి పురాణాలు. కాబట్టి సర్వలోక సంరక్షణాభారమును మోసేతల్లి నీయిల్లాలు. ముగురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మకు అనుశాసకుడవీవు స్వామీ ! నీవైభవమేమని చెప్పను?


                     ఇక  నీ సంతానమా  సర్వ భూత సముదాయము. ఇక్కడ భూతమనగా పిశాచమని భావింపరాదు. ప్రకృతిని నడిపించు శక్తులుగా  భావించాలి. ఫలితార్ధం . సర్వప్రకృతిని శాసింపగల వారు నీసంతానం.తద్వారా ప్రకృతియంతా నీవశంస్వామీ!

నీకు గనక కోపంవస్తే లోకాలన్నీ  మాయమే! 


         "  అనులాపంబులు   వేదముల్"-        


   నీ నోట పలికే మాటలన్నీ  వేదములే!  నీవు వేద ప్రచోదకుడవు. నీయనుగ్రహము వలననే వేద విజ్ఙానమంతా  లోకంలో వ్యాపిస్తోంది. శబ్దానికి అనుశాసనం ముఖ్యం. అంటే నియమం. అదివ్యాకరణంవల్ల కలుగుతుంది. ఆవ్యాకరణం మాహేశ్వర ప్రోక్తం. సంస్కృత వ్యాకరణమంతా  మాహేశ్వర సూత్రముల ననుసరించియే నడుస్తుంది. 


                          "తన విహారాగారముల్  మౌనిహృద్వనజంబుల్:"  నీవు నిరంతరం  మహామునుల హృదయకమలాలలో విహరిస్తూఉంటావు స్వామీ! నిన్ను దర్శించాలంటే మునులకే సాధ్యం మావంటి వారికది యెలా సాధ్యమౌతుంది? మాలో సద్భక్తిని గలిగించు. మమ్ము గూడా మునులను చేయి మాహృదయాలలోగూడ విహరించు. అంతవరకూ నీదర్శనం మాకుసాధ్యమా?స్వామీ!


                 తన సేవకుల్  కమలజాత  శ్రీధరుల్"- ఇక  నీ సేవకులా  బ్ర హ్మ , విష్ణువులు.వారు సామాన్యులా? సకలజగత్ సృష్టికర్త బ్రహ్మ. సకల లోక పోషకుడు విష్ణువు.వీరిద్దరూ నీసేవకులు. నీయాజ్ఙకులోబడి సృష్టి బ్రహ్మ నిర్వహిస్తే , నీయానతో పరిపోషణ విష్ణువు కొనసాగిస్తాడు. అంతా నీవశం.


                           ఇలాంటి సర్వ శక్తి సమన్వితుడవైన నిన్ను  యేమని వినుతించ గలను? స్వామీ!


                                        నేనశక్తుడను. స్వామీ నమస్కారమయ్యా! పరమేశ్వరా! నమస్కారము!


                                                                      అంటున్నాడు ధూర్జటి!


                                                      ఓం  నమః  శివాయ!  ఓం నమః  శివాయ!


                                                                             స్వస్తి!🙏🙏🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పంచాంగం 20.11.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 20.11.2023  Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: అష్టమి తిధి ఇందు వాసర: ధనిష్ఠ నక్షత్రం ధ్రువ యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


ఆష్టమి రాత్రి 03:16 వరకు.

ధనిష్ఠ రాత్రి 09:25 వరకు.

సూర్యోదయం : 06:27

సూర్యాస్తమయం : 05:35

వర్జ్యం : రా.తె 04:11 నుండి 05:42 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:23 నుండి 01:08 వరకు తిరిగి మధ్యాహ్నం 02:37 నుండి 03:21 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30  నుండి 09:00 వరకు.


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.29.11..2023

సోమ వారం (ఇందు వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే శుక్ల పక్షే అష్టమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  శుక్ల పక్షే అష్టమ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.11

సూ.అ.5.21

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

శుక్ల పక్షం అష్టమి తె.3.18 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం ధనిష్ఠ రా.10.19 వరకు. 

అమృతం మ.12.36 ల 2.06 వరకు. 

దుర్ముహూర్తం మ.12.09 ల 12.53 వరకు. 

దుర్ముహూర్తం మ.2.23 ల 3.07 వరకు. 

వర్జ్యం  తె. 5.00 ల మరునాడు ఉ.6.29 వరకు. 

యోగం ధృవం రా.10.08 వరకు. 

కరణం విష్ఠి ఉ.సా.4.28 వరకు. 

కరణం బవ తె. 3.18 వరకు. 

సూర్యోదయము ఆరోగ్య ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ.1.30 ల 3.00  వరకు. 

యమగండ కాలం ఉ.10.30 ల 12.00  వరకు. 

***********

పుణ్యతిధి కార్తీక శు.అష్టమి.

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏