🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 03*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*3. ఇళయాంగుడి మార నాయనారు*
ఇళయాంగుడి అనే శైవక్షేత్రంలో మారన్ అనే పేరుతో ఒక శివభక్తుడు జన్మించాడు.
అతడు తన ఇంటికి వచ్చిన శివభక్తులను సాదరంగా
ఆహ్వానించి షడ్రసోపేత భోజనంతో వారిని సంతుష్టులను గావిస్తూ వచ్చాడు.
మార నాయనారు పేదరికం వచ్చినపుడు కూడ భక్తులను సంతృప్తి పరచే
దాన స్వభావి అని అందరికీ తెలియజేయడానికి అన్నట్లు పరమేశ్వరుడు
అతన్ని నిరుపేదగా మార్చాడు.
పేదరికంలోనూ అతడు శివభక్తులకు అతిథి
సత్కారాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఒకరోజు వర్షాకాలం రాత్రివేళలో అణచుకోలేని ఆకలిని ఎలాగో అణచుకొని మారనాయనారు, అతనిభార్య
ఇరువురూ పడుకోనుండగా అతని భక్తిని పరీక్షించడానికై ఒక మునివరుని
వేషంలో పరమేశ్వరుడు వచ్చాడు.
అతనికి ఏదైనా పెట్టాలనే ఉద్దేశంతో "ఈ శివభక్తునికి భోజనం పెట్టడానికి ఏదైనా మార్గముందా?” అని మార నాయనారు తన భార్యను
నాయన్మారులు
అడిగాడు. ఆమె తన భర్తను చూసి “ఇంట్లో ధాన్యపుగింజ ఒక్కటీ లేదు.
ఇరుగుపొరుగువాళ్లు కూడ ఇచ్చేట్లుగా తోచలేదు.
మీరు ఈరోజు పగలు
పొలంలో విత్తిన సంబావరి గింజలను ఏరి తీసుకు వచ్చారంటే నేను
ప్రయత్నించి అన్నం వండుతాను” అని చెప్పింది. భార్య ఈ మాటలను
చెప్పగానే పెన్నిధి దొరికిన వాడివలె సంతోషించి మారనాయనారు తన
పొలానికి బయలుదేరాడు. మెరుపులు నిండిన ఆకాశం నుండి వర్షం
ధారలుగా కురుస్తోంది. అంతటా గాఢాంధకారం వ్యాపించి ఉంది.
మారనాయనారు తన తలమీద ఒక తట్టను బోర్లించుకొని పొలం లోపలికి
ప్రవేశించాడు. కాళ్లతో తడుముకుంటూ తన చేతులతో పొలంలో మొలకెత్తి
నీటిలో తేలుతున్న వరి విత్తనాలను తట్టనిండుకూ ఎత్తుకొని ఇంటికి వచ్చాడు.
మారన్ భార్య ఆ వరి విత్తనాలను నీళ్లలో బాగా కడిగింది. పొయ్యి
అంటించడానికి కట్టెలు లేవని చెప్పగా నాయనారు తన ఇంటి పైకప్పులో
ఎండిన పొడవాటి కర్రలను కత్తితో నరికి భార్యకు అందించాడు.
ఆమె ఆ కట్టెలను పొయ్యిలో పెట్టి వరి విత్తనాలను పక్వంగా వేయించి వాటిని
బియ్యంగా దంచి అన్నం వండింది. పొలంలో మొలకెత్తి ఉన్న ఆకుకూరలను
కోసుకొని ఇంటికి వచ్చి భార్యకందించగా ఆమె దానిని కూరగా వండింది.
తన ఇంటికి వచ్చిన అతిథి సత్తముని దగ్గరికి వెళ్లి ఆహారం
స్వీకరించవలసిందిగా నాయనారు మునివరుని ప్రార్ధించాడు.
సమయంలో ఇళయాంగుడి మారనాయనారు దంపతులకు శివగామి వల్లీ
సమేతుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై "మీరు నా అనుగ్రహానికి
పాత్రులయ్యారు. మీరిరువురూ శివలోక పదవిని అందుకొని సంతోషంగా
ఉండగలరు" అంటూ వాళ్లను ఆశీర్వదించాడు.
*మూడవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి