15, జులై 2022, శుక్రవారం

 *_నవీన్ పట్నాయక్ కంటతడి... 12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం... _* 


నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు…


ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే..?


కిసన్ శేషదేవ్… సంబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…


చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచి, ప్లస్‌టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు…


2018… ఒడిశా నాలెడ్జ్ హబ్‌లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్‌ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్‌తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్‌డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…


గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్‌కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్‌తో చెబుతూ పోయాడు…


*‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్‌ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…*


ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్‌ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!


సేకరణ

 🌹రామాయణానుభవం_ 100


సుగ్రీవుడు వానర సైన్యం కు  *తూర్పు దిశ* భౌగోళిక పరిస్థితులు చెబుతున్నాడు .....


శాల్మలీపర్వత శిఖరాలపై "మందేహులు" అనే రాక్షసులు ఉంటారు. వారు సూర్యోదయ, మధ్యాహ్న, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుని ప్రయాణాన్ని అడ్డగిస్తారు. సంధ్యావందన తత్పరులైన భూసురులు మంత్రాలతో సూర్యునికి అర్ఘ్య జలాలను వదులుతారు. ఆ జలాలు వజ్ర బలాన్ని కలిగి మందేహ రాక్షసులను దూరం పడగొట్టుతాయి. "తా ఆప: వజ్ర భూత్వా! తాన్ అసురాన్ అపసర్పయంతి”.


ఈ ప్రాంతాన్ని “ఇక్షు” సముద్ర ప్రాంతమంటారు. ఇక్కడ సముద్ర జలాలు చెరుకు రసమువలె ఉంటాయి.


ఆ తరువాత నేయి రంగులో సముద్ర జలాలు (సర్పి సముద్రం), పెరుగువలె సముద్ర జలాలు (దధి, సముద్రము) ఉంటాయి. ఇవి దాటిన తరువాత కుశ, క్రౌంచ ద్వీపాలు ఉంటాయి.


ఆ తరువాత “పాలసముద్రము" వస్తుంది. సముద్ర జలాలు అందులో పాలవలె, ముత్యాల హారాలవలె ఉంటాయి. దాని మధ్యలో "ఋషభము” అనే పర్వతము ఉంటుంది. అందులో "శ్వేతవృక్షాలు", "రజత పద్మాలు" ఉంటాయి. వాటి మధ్య భాగము బంగారు రంగుతో ఉంటుంది.


 ఈ ప్రాంతంలో రాజ హంసలు విహరిస్తుంటాయి. ఈ ప్రాంతములో దేవతలు, యక్ష, కిన్నరులు అప్సరసలతో విహరిస్తు ఉంటారు.


ఆ తరువాత “మంచి నీటి సముద్రము” వస్తుంది. అది "జౌర్వము” అనే అగ్నితో నిండి ఉంటుంది. అది “బడబ” అనే అడగుఱ్ఱము ముఖం నుండి వెలువడుతుంది. దానితో సమీప చరాచరాలు నశించిపోతాయి.


ఈ సముద్రానికి ఉత్తర దిశలో పదమూడు యోజనాల దూరంలో "జాతరూప శైలము" అనే బంగారు కొండ ఉంటుంది. ఆ పర్వతాగ్రంపై సహస్ర శిరములుగల అనంతుడు అనే సర్పరాజు చంద్రకాంతితో, నల్లని వస్త్రంతో, సర్వభూత నమస్కృతుడై కూచొని ఉంటాడు. 


ఆమహాత్ముని ధ్వజము మూడు ముఖములు గల తాలవృక్షము. ఆ తరువాత ఉదయాచలము మహోన్నతమై సువర్ణ వర్ణమై వంద యోజనాల విస్తీర్ణంతో దర్శనమిస్తుంది. దానిపై యోజన వైశాల్యంతో దశ యోజన ఔన్నత్యము కలిగిన "సౌమనసము" అనే పర్వత శిఖరము ఉంటుంది.


 త్రివిక్రముడు మేరు శిఖరముపై ఒక పాదాన్ని, ఈ "సౌమనస" పర్వత శిఖరముపై మరొక పాదాన్ని ఉంచి నిలిచాడట.


ఈ పర్వతము ప్రక్కలో "సుదర్శన ద్వీపము" ఉంటుంది. ఇక్కడ ఉదయ పర్వత కాంతులతో అన్ని వస్తువులు చక్కగా ప్రకాశిస్తాయి. ఈ "ద్వీపము సూర్యోదయ ద్వారం"గా ఉంటుంది. ఇదే తూర్పు దిశ చివర. దీనిని దాటి ఎవ్వరు వెళ్లలేరు......

**


*దక్షిణ దిశ.*


ఈ దిశకు సుప్రసిద్ధ వీర వానరులను అంగదుని నాయకత్వంలో పంపాడు. ఆయనకు సహాయంగా అగ్నిపుత్రుడైన నీలుడు, వాయుసుతుడైన హనుమ బ్రహ్మనందనుడైన జాంబవంతుడు వెళ్లారు. 


సుహోత్ర, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధ మాదనులు కూడ అంగదుని అనుసరించారు. ఆంగదునికి సుగ్రీవుడు దక్షిణ దిశను వివరిస్తున్నాడు..


"అంగద కుమారా! వింధ్యా చల దక్షిణ ప్రాంతమే దక్షిణ దేశము. వింధ్యాచలము సహస్ర శిఖర సమేతము, దాని క్రింద నర్మదానది పాములతో నిండి ప్రవహిస్తుంది. అది దాటాక కృష్ణ, గోదావరి అనే పెద్ద నదులు మేఖల, ఉత్కల అనే నదులు ప్రవహిస్తాయి. ఇవి వింధ్యకు నైరుతి దిశలో వస్తాయి.


వింధ్యకు వాయువ్యంలో విదర్భ, ఋషిక మహిష, కళింగ, కౌశిక దేశాలు ఉంటాయి.


ఇక్కడి నుండి దండకారణ్యము ప్రారంభమవుతుంది. గోదావరి ప్రవాహ ప్రాంతమిది. 


అదే విధముగా కావేరీ, తామ్ర పర్జీనదులు ప్రవహిస్తాయి. ఇవన్నీ “అయోముఖము" అనే పేరుగల సహ్య పర్వతము నుండి బయలు దేరుతాయి.


ఈ ప్రాంతంలో చందనవనము విశేషంగా ఉంటుంది. ఇక్కడనే మలయాచలము ఉంటుంది. అక్కడ సూర్య ప్రభా భాసురుడు అయిన ఆగస్త్య మహర్షి ఉంటాడు. ఆయన ఆజ్ఞతో తామ్ర పర్ణనదిని తరించాలి. తామ్ర పర్ణ నదీ ప్రాంతంలో అనేక ద్వీపాలు ఉంటాయి.


ఆ తర్వాత పాండ్య రాజుల రాజధాని నగరము ఉంటుంది. దాని ద్వారాలు బంగారు, ముత్యాలతో అలంకరింపబడి ఉంటాయి. దీని తరువాత సముద్రము వస్తుంది. (హిందూ మహాసముద్రము) ఆ సముద్రము మధ్యలో ఆగస్త్య మహర్షి మహేంద్రునికి విడిదిగా మహేంద్ర పర్వతాన్ని నిలిపాడు. సుర, ముని, యక్ష, సిద్ధ, చారణులకు, అప్సరలకు అది విహార భూమి.


ఆ మహా సముద్రము శతయోజన విస్తీర్ణమైనది. ఆ సముద్రము మధ్యలో ఛాయా గ్రాహకమైన అంగారక రాక్షసి ఉంటుంది.


ఆ సముద్ర తీరంలోనే శత్రు విరావణుడైన రావణుని రాజధాని అయిన లంకానగర ద్వీపము శతయోజన విస్తీర్ణంగా ఉంటుంది. అక్కడికి సామాన్య నర, వానరులు వెళ్లలేరు. అనేక కోట్ల రాక్షస పరివేష్టితమై ఉంటుంది. ఆ నగరము సువర్ణమయ ద్వారాలతో, గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుంది......

 🌹రామాయణానుభవం_ 99


సుగ్రీవుడు భయవిముక్తుడై లక్ష్మణునితో కలసి రామసన్నిధానమునకు వెళ్ళాడు. అతని వెంట భీమకాయులు, అరి భయంకర విక్రములు అయిన అనేక కోట్ల వానరులు శ్రీరాముని సన్నిధికి చేరుకొన్నారు.


సుగ్రీవుడు శ్రీరామచంద్రుని చూచి "మహానుభావా! కొంత ఆలస్యం చేసినీ నిగ్రహానికి కారణమయ్యాను. నన్ను మన్నించు" మని ఆయన పాదములపై పరివార సమేతంగా వాలాడు.


శ్రీరాముడు ఆయనను లేవనెత్తి, "మిత్రమా! వరుసగా ఉదయ, మధ్యాహ్న, రాత్రులలో కాలాన్ని అనుసరించి, ధర్మార్థ, కామాచరణ చేసినవాడు నిజమైన మహారాజు. ఆయన సతతముశ్రేయస్సును పొందుతాడు. 


ధర్మార్ధములను వదలి కేవల కామాసక్తుడైనవాడు వృక్షాగ్రముపై నిద్రించి ఒడలు మరచి క్రిందపడిన వానివలె నశిస్తాడు. 

*హిత్వా ధర్మం తథార్థం చ కామం యస్తు నిషేవతే*

*స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే*


శత్రువులను సకాలంలో సంహరించి, మిత్రులను రక్షించుకొన్నవాడు, ధర్మాన్ని పాలించి ధర్మార్థ కామాలనే త్రివర్గ ఫలాలను పొందుతాడు.


సుగ్రీవా! శత్రువుపై దండెత్తే సమయము ఆసన్నమైంది.


సచివులతో ఆ విషయంలో సమాలోచన కావించుము" అని తెలిపాడు.


సుగ్రీవుడు తన వెంట ఉన్న పరాక్రమ సంపన్నులు, మహాకాయులయిన వానర మహావీరులందరు శ్రీరాముని అనుసరించి, రావణుని చంపి, సీతను కొనితెస్తారని తెలిపాడు.


శ్రీరాముడు ఆ బలమైన వానరానీకాన్ని చూచి సంతుష్టుడై, సుగ్రీవుని కౌగలించుకొని, "వానర రాజా! మా సీత జీవించి ఉందో లేదో? ఒకవేళ జీవించి ఉంటే ఆమెను రావణుడు ఎక్కడ ఉంచాడో ముందుగా తెలుసుకోవాలి. ఆ తరువాత మనము సమరానికి సమాయత్తము కావచ్చు. 


ముందుగా ఆమె ఉన్న స్థలాన్ని గురించి సమాచారాన్ని సంపాదించాలి. ఆ విషయంలో మా అన్న తమ్ములిద్దరికి తగిన పరిజ్ఞానం లేదు. దానికొరకు నీ అనుచరగణాన్ని ఎలా నియోగించుకోవాలో తెలిసినవాడవు నీవు. నీవు నామిత్రుడవు, బుద్ధి మంతుడవు, పరాక్రమవంతుడవు. అందువలన నీవే నీ వారికి తగిన ఆదేశాలివ్వుమని" కోరాడు..


**


శ్రీరాముని ఆదేశాన్ని పురస్కరించుకొని సుగ్రీవుడు ముఖ్యమైన వానర వీరులను నాలుగు దిక్కులలో పంపడానికి నిశ్చయించుకొన్నాడు.


 *తూర్పు దిశ*

 ముందు “వినతుడ”నే సేనానాయకుని, అతని అనుచరగణంతో తూర్పు దిశకు పంపడానికి నియోగించాడు. "వినతా! నీవు సమయానుకూలంగా కార్యాకార్య వివేకం కలవాడవు. సూర్య, చంద్రాంశలతో జన్మించిన లక్షమంది వానరులను తీసికొని తూర్పు వైపు వెళ్లు. తూర్పు దిశలో భాగీరధి, సరయూ, సింధూనదులు, శోణానది, మహీ, కాలమహీ నదులు ప్రవహిస్తాయి.


బ్రహ్మావర్తము, మాల, మాళవ, విదేహ, కాశీ, కోసల, మగధ, మహాగ్రామ పుండ్ర, వంగ దేశాలు ఉంటాయి. ముఖ్యంగా వింధ్య హిమాలయాలమధ్య తూర్పు దిశలో ఉన్న ప్రాంతమంతా నీ అన్వేషణకు తగిన స్థలము. కొన్ని నగరాలు, పర్వతాలు, సముద్రములోపల ఉంటాయి. వాటిలో కూడ సీతను అన్వేషించాలి. మంధర పర్వతము యొక్క అగ్రభాగంలో వెతుకాలి. అక్కడ చెవులు లేనివారు, పెదవులపై చెవులు కలవారు, అయోముఖులు, ఏకపాదులు, మనుష్యులను తినేవారు, బంగారు రంగుగల వారు, పచ్చి చేపలను తినే కిరాతులు, వ్యాఘ్రముఖులుంటారు.


ఈ ప్రాంతం దాటితే “యవద్వీపం” వస్తుంది. అది బంగారు రంగుతో ఉంటుంది. అందువలన దానిని “సువర్ణద్వీపం" అంటారు. అందులో రత్నాలు రాశులు రాశులుగా ఉంటాయి.


అది దాటితే “శిఖర" పర్వతము ఉంటుంది దాని శిఖరాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ పర్వతము దేవ దానవులకు విహారస్థలంగా ఉంటుంది. ఆ పర్వత గుహలలో సెలయేరుల ప్రక్క సీతను దాచి ఉంచవచ్చు.


ఆ పర్వతం దాటితే శోణానది వస్తుంది. ఆ నదీ జలము రక్తమువలె ఎఱ్ఱగా ఉంటుంది. అది దాటితే సిద్ధ చారణుల విహార స్థలము ఉంటుంది. అది దాటితే మహోత్తుంగ తరంగాలతో సముద్రము వస్తుంది. (బహుశః ఆ సముద్రము ఇప్పటి బంగాళా ఖాతము అయి ఉంటుంది).


ఆ సముద్రంలోపల అతికాయులైన రాక్షసులు ఉంటారు. వారు సముద్రముపై భాగంలో విహరించేవారిని వారి నీడను బట్టిలాగే ఛాయాగ్రాహులు. ఆ ప్రాంతం దాటాక సముద్రము అరుణ వర్ణంతో భయంకరంగా ఉంటుంది. అక్కడి ద్వీపాన్ని “శాల్మలీ” ద్వీపం అంటారు. శాల్మలీ వృక్షం ఉన్నందువలన ఆ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. అక్కడే "గరుత్మంతుని నివాసము" ఉంది.......

రామాయణానుభవం_ 91

 🌹రామాయణానుభవం_ 91


తార దర్శించిన రామచంద్రుని పరత్వము.....


 *త్వమప్రమేయశ్చ, దురాసదశ్చ, జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తి శ్చ, విచణశ్చ క్షితిక్షమావాన్, క్షతజోపమాక్షః।*


 *త్వమప్రమేయశ్చ*

నీవు ఊహింప శకయము కానివాడవు.


రామచంద్రా! నీవు సాటిలేని వాడివి. నీ తండ్రిగారి  నిర్దేశంవలన నీవు అడవికి బయలు దేరావు. పితృవాక్య పాలనాధర్మాన్ని నిరుపమానంగా పాటించావు.


క్రూరారణ్యములో విరాధ, ఖర, కబంధాది ఘోర రాక్షసులను అవలీలగా హతమార్చిన విక్రముడవు.


నీ కమల పత్రాక్షములు నిన్ను కమలానాథునిగా స్ఫురింపజేస్తున్నాయి.


నీ పరదుఃఖ దుఃఖిత్వము నిన్ను సకల కల్యాణ గుణాలతో సాటిలేని వాడివని నిరూపిస్తున్నది.


నీవు విల్లు అమ్ములను ధరించి నా ముందు నిలిచావు. అయితే శంఖచక్రాది సర్వాయుధోపేతుడవని నిన్ను గుర్తించగలుగుతున్నాను..


నీవు నా కనులముందే నిలిచి ఉన్నావు. కాని నీవు ఇంత వాడివని గుర్తించడానికి వీలు లేకుండా ఉంది.


“ *క ఇత్థా వేద* ” ఆయన ఇంత వాడని, పరమాత్మను వేదాలు కూడ తెలసికోజాలవు. “ *సోఽంగవేద యదివానవేద"* స్వయంగా ఆయన కూడ తన మహిమను కొంత గుర్తించగల్గుతాడో లేదో” అని భగవద్వైభవాన్ని వేదాలు వివరిస్తున్నాయి. నీ స్వభావము కూడ అటువంటిదేనని నామనస్సుకు తోస్తున్నది.


నీవు ఒంటరిగా అసహాయునివలె నిలుచున్నావు. కాని అనేక ప్రబల శత్రువులు నీపై మూకుమ్మడిగా దండెత్తి వచ్చినా నీవు అకంప్యుడవు.


నీ ప్రభావము వాఙ్మనసాతీతము.


 *దురా సదశ్చ*

ఎదురింప శక్యము కాని వాడవు.


నీ ప్రభావము వాక్కులకు, మనస్సుకు అందనిది కావచ్చు. అయినా నీవు కట్టెదుట నిలిచి ఉన్నావు కదా! బాహ్యేంద్రియాలతో నిన్ను అనుభవించవచ్చుకదా! అంటే అదీ అసాధ్యమే. మనస్సుకందిన విషయాన్నే కదా బాహ్యేంద్రియాలతో అనుభవింపగల్గేది.


“షదిల్” (“సద్”) అనే ధాతువుకు 1. (విశరణము) శిథిలము, 

2. గతి 

3. అవసాదము (దుఃఖము) అనే మూడు అర్థాలు ఉన్నాయి.


శిథిలము:- విశరణము:- స్థూల వస్తువునైతే సూక్ష్మంగా విభజించి శిథిలము చేయవచ్చు కాని నీవు "అణోరణీయాన్" అణువులకంటే అణువు అన్నట్లు "సుసూక్ష్మమైన” వాడివి. నిన్ను శిథిలము చేయడము అసాధ్యము కదా!


“గతి” అంటే “చలనము” అని అర్ధము. నిన్ను ఒక చోట లేకుండా మరొక చోటికి మారుద్దామంటే అది కూడ కుదరదు. ఎందుకంటే నీవు విభుడవు. సర్వ వ్యాపివి. అంతట వ్యాపించి ఉన్నవాడివి ఎక్కడైనా ఒకచోట లేకుండా చేయడం కుదరదుకదా!


నీకు అవసాదమును (నిర్మూలనమును) కలుగచేద్దామంటే నీవు లేకుండా పోయే వాడివి కాదు. నీవు నిత్యుడవు.


వాలి వధకు కోపించిన వానరులందరు కలిసి నిన్ను దుఃఖ పరచాలనుకొన్నా అది సాధ్యముకాదు.


నీవు ఆశ్రితులందరికి అత్యంత సులభుడవు. అనాశ్రితులందరికి అత్యంత దుర్లభుడవు


" *మహాజనో యేన గతః స పంధా”* అన్నట్లు భక్తి మార్గంలో పయనించే వారందరికి పట్టుగొమ్మ


“ *తర్కోప్రతిష్ఠః”* - హేతువాదంతో నిన్ను లేవని నిరూపిద్దామంటే “ధర్మస్య తత్వం నిహితం గుహాయాం” వేదగుహలో స్థిరంగా నిహితమై ఉన్న నిన్ను లేడని నిరూపించడం ఎవ్వరి తరముకాదు.


ఇక నిన్ను సాధించడమెలా? బాధించడమెలా? అందువలననే నీవు "నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం” అయినవాడివి. " *దురాసదుడవు”.*


తార దర్శించిన శ్రీరామ పరత్వము మరికొంత ......

**


*త్వమప్రమేయశ్చ, దురాసదశ్చ,* *జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ*। *అక్షయ్య కీర్తి శ్చ, విచక్షణశ్చ* *క్షితిక్షమావాన్, క్షతజోపమాక్షః।*


 *జితేంద్రియశ్చ....* జయించబడిన ఇంద్రియములు కలవాడు.


నీవు ఇంద్రియములను జయించినవాడివి. నీవు వాలి రావణులవలె ఇంద్రియములకు లోబడి పరదారలను ఆశించే వాడివా? కాదు.


మహేంద్రుడంతటి వాడు అహల్యా జారుడయ్యాడు. ప్రజాపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా ఆత్మ తనయ అయిన సరస్వతికి వశుడయ్యాడు. తారకాధిపతి అయిన చంద్రుడు గురుపత్ని అయిన తారవిషయంలో చోరుడయ్యాడు. విశ్వామిత్ర మహాముని మేనక విషయంలో చపలుడయ్యాడు.


కాని నీవు వాలిని చంపి కూడ రుమను సుగ్రీవునికి అప్పగించావు. సహజంగా సౌందర్య వంతులయిన స్త్రీ పురుషులు పరస్పరము ఆకర్షణకు లోబడుతారు. అప్సరసలను మించిన అందముగల నేను, భార్యా విహీనుడవైన నీకు ఇంత దగ్గరలో ఉన్నా నన్ను కన్నెత్తి కూడ చూడడంలేదు. “నరామః పరదారాన్వై చక్షుర్భ్యామపి పశ్యతి" రాముడు పరస్త్రీలను కన్నెత్తి కూడ చూడడు" అనే మాట సత్యమైనది.


ధర్మబద్ధంగా మాత్రమే అర్థకామాలను అనుభవిస్తావు. వాలిని నిరసించి ఆయన రాజ్యాన్ని ఆయన తమ్ముడైన సుగ్రీవునికే అప్పగించావు. నీవు జితేంద్రియడవు ప్రభు.


రాముడు జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు..


"పశ్యత్యచక్షుః, సశృణోత్యకర్ణః, అపాణిపాదో జవనోగృహీతా" పరమాత్మకు ఈ ప్రపంచాన్నంతటిని చూడడానికి కనులు అక్కరలేదు. సర్వ శబ్దాలను వినడానికి కర్ణాలు అవసరంలేదు. అందరికంటే ఆయన వేగంగా కదులుతాడు. అయితే అలా కదలడానికి ఆయనకు కాళ్లు అక్కరలేదు. సర్వాన్ని గ్రహిస్తాడు (పట్టుకొంటాడు). కాని అందుకు హస్తాలు అవసరం లేదు. ఆయన ఇంద్రియాధీనుడు కాదు. "సర్వేంద్రియైర్వినా సర్వం సర్వత్ర పశ్యతి". ఏ ఇంద్రియావసరము లేకుండానే ఆయన అన్నిటిని అధీనంలో

ఉంచుకొంటాడు.


 *ఉత్తమ ధార్మికశ్చ* 

ఉత్తమమైన ధర్మము కలవాడు.


రాముడు జితేంద్రియుడు కావచ్చు. కాని వైర కారణమేమి లేకుండానే వాలిని వధించాడే? ఆయన ధార్మికుడెలా అవుతాడు?


సాధారణంగా వైర కారణం లేకుండా ఏ ప్రాణిని సంహరించినా అది హింసే. అది అధర్మమే.


కాని పరులకు ఉపకారం చేయడంలో ఏ ప్రాణినైనా హింసిస్తే అది అధర్మము కాదు. "తనను కాటువేయలేదు కదా" అని తన ఇంట్లో ప్రవేశించిన నాగు బామును ఎవ్వరైనా వదలివేస్తారా? విషప్రాణిని చంపడం హింస అవుతుందా? అధర్మమవుతుందా?


"ఆనృంశంస్యం పరో ధర్మః" అన్నట్లు భూతదయ సామాన్య ధర్మము కావచ్చు. కాని


ఆశ్రిత రక్షణము అంతకు మించిన ధర్మము. ఉత్తమ ధర్మము.


1.తన స్వార్థం కొరకు ధర్మాన్ని ఆచరిస్తే అది స్వార్ధ ధర్మము. అది అథమ ధర్మము. తన కొరకు, పరులకొరకు కూడ కలిపి ధర్మాన్ని ఆచరిస్తే అది మధ్యమ ధర్మము. తన కొరకు ఎంతమాత్రము కాకుండా పరులకొరకే ధర్మాచరణ కావిస్తే అది ఉత్తమ ధర్మము. చెట్టు చాటు నుండి అధర్మంగా వాలిని హత్య కావించాడనే నిందను భరించికూడ, సుగ్రీవుని కొరకు వాలిని వధించడం రాముని ఉత్తమోత్తమ ధర్మము.


(2) వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం సామాన్య ధర్మము. చతుర్విధ భక్తులకు రక్షణ కల్పించడం అంతకంటే మించిన (ఉత్) ధర్మము. జ్ఞానులకు ఆశ్రితులకు సర్వదా సర్వథా శరణునివ్వడం దానిని మించిన "ఉత్తర" ధర్మము. ఆచార్యోపాయంతో అమ్మగారి పురుషకారంతో భక్తులకు వశం కావడం ఉత్తమ ధర్మము.


(3) వధను వైర కారణంగా చేయడం సామాన్య ధర్మము. వధను పాప పరిహారార్థము చేయడం ఉత్తమ ధర్మము. వాలి చేసిన సోదర భార్యాపహరణ పాపాన్నుండి అతనిని విముక్తుని చేయడం కొరకే అతనిని వధించానని వాలికి రాముడు సమాధానమిచ్చాడు.


"రాజభిర్ధృతదండాస్తు। నిర్మలాః స్వర్గ మాయాంతి”


రాజుల ద్వారా దండింపబడ్డవారు, తమ పాపాలనుండి నిర్మలులై స్వర్గానికి వెళ్లుతారని రాజనీతిని వాలికి రామచంద్రుడు వివరించాడు.


ఇక శాకామృగాలను చండపంలో చాటునుండి చంపినా తప్పు లేదని వేట ధర్మాన్ని శ్రీరాముడు వివరించాడు.


తార దర్శించిన శ్రీరామ పరత్వము మరికొంత .....

ప్రపంచవ్యాప్తంగా ఉన్న FM రేడియో స్టేషన్లు...

 అద్భుతం...క్రింద ఇచ్చిన మా ISRO OCLC లింక్‌పై క్లిక్ చేయండి.....అప్పుడు మీకు ఆకుపచ్చ చుక్కలు కనిపిస్తాయి...అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న FM రేడియో స్టేషన్లు...మీరు ఏదైనా ఆకుపచ్చ చుక్కపై క్లిక్ చేసినప్పుడు FM రేడియో వినండి ఆయా ప్రాంతాలు ఆనందించవచ్చు.. ఆశ్చర్యకరంగా ఇలా వినడానికి మీకు ఇయర్‌ఫోన్ అవసరం లేదు.... సింప్లీ అమేజింగ్... మన ఇస్రో గర్వానికి


http://radio.garden/live

ఉపనిషత్తులయందు

 శ్లోకం:☝️

*శ్రీహరిం పరమానందమ్-*

  *ఉపదేష్టారమీశ్వరం |*

*వ్యాపకం సర్వలోకానాం*

  *కరణం తం నమామ్యహం ||*


భావం: నేను ఉపనిషత్తులయందు ప్రసిద్ధమైన సకలజగత్కారణమైన సచ్చిదానంద రూపమగు పరమాత్మను. నేనే పరమాత్మ స్వరూపుడనని ధ్యానించుచున్నాను. ఆ లక్ష్మీసమేతుడైన శ్రీహరే ధ్యానించతగినవాడు.🙏

కపిలగోవు

 ప్ర: కపిలగోవు శ్రేష్ఠమైనది అంటారు. 'కపిల' అంటే ఏమిటి? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఒళ్ళంతా నల్లని రంగు ఉంటే కపిల గోవు అని గుర్తించాలా?


జ: ఆవులు ఏ రంగులో ఏ రూపులోనున్నా శ్రేష్ఠమైనవే. పూజ్యములే. కపిల శబ్దానికి - నలుపు అని ప్రధానార్థం. నల్లని గోవుల్ని కపిల గోవులు అంటారు. అవి మరింత శ్రేష్ఠములని శాస్త్రోక్తి.


గోవు అమృతశక్తితో దివ్యలోకాలలో ఉద్భవించినది. తొలి గోమాత సురభి. ఆమె అంశలే విశ్వములో గోవులుగా వ్యాపించాయి. ఒకసారి కొన్ని గోవులు హిమగిరి పరిసరాలలో సంచరిస్తుండగా, ఒక గోవు పాలను లేగతాగుతున్నది. ఆ సమయంలో పొదుగు నుండి స్రవిస్తున్న పాలనురగ గాలికి చింది, సమీపంలో తపస్సు చేసు కుంటున్న పరమేశ్వరునిపై పడింది. దానితో కనులు తెరచిన ధూర్జటి ఫాలనేత్రం నుండి ఎగసిన సెగ తగిలి అక్కడి గోవులు నలుపెక్కాయి.


అవి శివుని శరణు వేడి ప్రార్థించాయి. శివదృష్టి శక్తిని పొందడం చేత ఆ గోవులకు ప్రత్యేక శ్రేష్ఠత లభించింది. శివుడు వాటికి ప్రత్యేక పూజ్యతను వరంగా అందించాడు. కపిలగోవు శరీరమంతా నలుపురంగుతో (ఎరుపు కూడా) ఉండనవసరం లేదు. చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, నాసికా పుటములు, గొంతులు, ముష్కములు కపిల వర్ణంతో ఉన్నా కపిలత్వ గుణానికి చాలు. ముఖ్యంగా మూపురం, గంగడోలు ఉన్న భారతీయ గోసంతతి మన శాస్త్రాలలో వర్ణించిన ఉత్తమ గోవులుగా నిర్ణయింపబడుతున్నాయి.

లక్ష్మీదేవికి అభయమిచ్చిన విష్ణుమూర్తి*🌹

 🙏🌹 *లక్ష్మీదేవికి అభయమిచ్చిన విష్ణుమూర్తి*🌹🙏


🌹లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణు వేడుకుంది.స్వామి! మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడి తనం ఎక్కువ. కొంచం సంపద చేతిలో ఉంటేచాలు నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా? సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను కనికరించండి అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. 🌹


🌹దేవీ! నువ్వు భయపడకు. నీకు తోడుగా ఐదుగురుని పంపుతున్నాను. 

వారు వరుసగా 1. ధర్మం, 2. రాజు, 3. అగ్ని, 4.దొంగ. 5. రోగం


ఈఐదుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు.ధర్మంగా సంపాదించి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతోకాలం ఉండవు. తాత్కాలికంగా ఆపదలు కలిగినా అవి వారిని ఏమిచేయలేవు. వారు ఆచరించిన ధర్మమే వారిని నిలబెడుతుంది. 🌹


🌹ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో! ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలో సంపదను హరిస్తారు. లేక దొంగ రూపంలో వచ్చి వాడి సంపద సర్వం దోచుకొని పోతాడు. 


ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకి, రొష్టులకి తగలబెట్టేస్తారు. వీడి బాధను భరించలేక బంధువులు గాని, ఇంట్లో వారు గాని బయటికి త్రోసేయవచ్చు. లేదా చంపెసేయవచ్చు. 🌹


🌹ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 5 కూడా ఒక్కోసారి ఒక్కసారిగా పట్టేయవచ్చు. అది వాడు చేసిన అధర్మం వలన ఆయా నిమిత్తాలు వాడిని పట్టుకుంటాయి.కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. 


ధర్మం తప్పిననాడు ఈ ఐదుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. ఆనాటి నుండి ధర్మం మార్గం విడిచి అధర్మమార్గంలో నడిచేవారికి ఐదుగురు ఆపదలు సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపద కలగకుండా రక్షిస్తున్నారు.


                 🌷 *సేకరణ*🌷

           🌹🌷🌹🌷🌷🌹

                    *న్యాయపతి*

                 *నరసింహా రావు*

🙏🌴🎋🌾🌹🛕🌹🌾🎋🌴🙏

స్విట్జర్లాండ్

 _*స్విట్జర్లాండ్...!!!*_


*ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. పెళ్ళైయిన  దంపతులు ఆ దేశానికి హానీమూన్ వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితంలో గుర్తుంచుకోవడానికి.*


*భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంటుంది.. కానీ, యుద్ధం చెయ్యడానికి కాదు. రెడ్ క్రాస్ సహాయకులుగా, శాంతి బృందాలుగా పనిచేస్తారు), శత్రువులు లేని దేశం.* 


*18 ఏళ్ళు దాటితే మగపిల్లలకు నిర్బంధ సైనిక శిక్షణ ఉంది ఆ దేశంలో.*


*స్విట్జర్లాండ్ పేరు వింటే ఆ దేశపు బ్యాంకు వ్యవస్థ గుర్తుకు వస్తుంది. (చాకలెట్స్, చీజ్ కు కూడా ఆ దేశం ప్రసిద్ధి పొందింది).*


*ఈ దేశానికి ఇంకో ప్రత్యేకత ఉంది. పౌరులందరూ చదువుకున్న వారే. ప్రభుత్వం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే అది ప్రజాభిప్రాయం ప్రకారమే సాధ్యపడుతుంది. (మన దేశ చట్టసభల్లో సభ్యుల నిర్ణయం అంతిమం) అక్కడ అలా కాకుండా దేశప్రజాలకు ఉపయోగపడే చట్టాలు* *"ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) తోనే సాధ్యం."*


*ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నిర్బంధ వోటింగ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందే.*


*మిగతా దేశాల బ్యాంకులకు స్విట్జర్లాండ్ బ్యాంకులకు తేడా ఏమిటి? ఎందుకు అవి అంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి ఒకప్పుడు?*


*ఆ దేశంలో ఉన్న ఎన్నో బ్యాంకుల కంటే ప్రసిద్ధి పొందింది*


*"స్విస్ బ్యాంక్.."*

*(ఇప్పుడు పేరు మారి UBS గా అందరికి పరిచయం).*


*రెండవ ప్రపంచ యుద్ధం సమయం లో ఈ స్విస్ బాంక్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.*


*దేశాన్ని అత్యంత ధనిక దేశంగా మార్చి వేసింది*


*ఈ దేశం గురించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం...*


*అక్కడ బ్యాంకుల విధానం ఏమిటంటే ప్రపంచంలో ఏ దేశ ధనిక పౌరుడైనా స్విస్ బ్యాంకులో ఖాతా తెరవచ్చు. వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.*


*ఇతర దేశాల "ధనిక" పౌరుడు ఎలా సంపాదించాడు అన్నది ఆ బ్యాంకు అడగదు.*


*ఒక నియంత తన దేశాన్ని దోచుకుని స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు. స్మగ్లర్లు, మాఫియా డాన్లు, మాదక ద్రవ్యాలు అమ్మినవారు, లంచగొండ్లు, రాజకీయ నాయకులు, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, మోసపూరితంగా సంపాదించిన సొమ్ము, ఇలా ఎవరైనా అక్కడి బ్యాంకులో డబ్బుని దాచుకోవచ్చు.* 


*రెండే రెండు రూల్స్ మాత్రం వర్తిస్తాయి.*


*మామూలుగా మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే బ్యాంక్ మనకు వడ్డీ చెల్లిస్తుంది.*


_*కానీ, స్విస్ బ్యాంక్ మాత్రం తన ఖాతాదారుల నుంచి రుసుము వసూలుచేస్తుంది.*_


*ఖాతాదారులు డబ్బే కాదు, ఖరీదైన వజ్రాలు, బంగారం, బంగారు నగలు, పెయింటింగ్స్, వెలకట్టలేని పురాతన వస్తువులు కూడా అక్కడి వాల్ట్స్ లో భద్రపరుచుకోవచ్చు.*


*స్విస్ బ్యాంకు ఖాతాదారులకు ఒకే ఒక షరతు విధిస్తుంది.* 

*మొదటి రూల్.*

*ఖాతా తెరిచినప్పుడు ఫోటో, చిరునామా ఏది అడగదు. రీఛార్జి కార్డులా ఖాతాదారునికి అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ మాత్రం ఇస్తుంది. లాకర్ తీసుకున్న వారికి తాళం చెవి ఇస్తుంది, ఇంకో తాళం తమ దగ్గర ఉంచుకుంటుంది. లాకర్ అంటే మనకు ఇచ్చే లాకర్ సైజ్ నుంచి, కావాలంటే ఒక పెద్ద గది అంత లాకర్ కూడా అద్దెకు ఇస్తారు. ఖాతాదారుల దాచుకునే వస్తువులను బట్టి లాకర్ పరిణామం. ఈ లాకర్స్ అవి కూడా భూమిలోపల నాలుగైదు అంతస్తుల కింద ఉంటాయి పటిష్టమైన భద్రతతో. ఇప్పటి దాకా ఒక్కసారి కూడా ఆ లాకర్స్ దొంగలు దోచుకోలేక పోయారు.. అంటే ఊహించు కోవచ్చు ఎన్ని రకాల భద్రతా వలయాలు ఉన్నాయో.*


_*బ్యాంకు ఖాతాదారుని గుర్తుపెట్టుకోదు.*_


_*అకౌంట్ నెంబర్, పాస్ వర్డ్ చెప్పిన వ్యక్తికి.. ఖాతా నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంది.*_

*అలాగే, ఆ రెండూ చెప్పి లాకర్ తాళం చెవి చూపిస్తే లాకర్ తెరిచే సౌలభ్యం ఏర్పరిచింది.*


*ఇంకొక రూలు ఏమిటంటే ఖాతాలో ఎంత మొత్తం అయినా ఉండనివ్వండి, లేదా లాకర్స్ లో ఎంత విలువైన సామాగ్రి అయినా ఉండనివ్వండి. బ్యాంకు నిర్ణయించిన కాల పరిమితి లోపు ఖాతాను వాడకపోతే, అంటే ఒక పదేళ్లు లేదా ఇరవై ఏళ్ళ కాలం కావచ్చు, అప్పుడు ఆ ఖాతాను జప్తు చేసి అందులో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అందచేస్తారు.*


*రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచంలో అత్యంత ధనవంతులైన యూదులు - జర్మనీ, పోలాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, లక్సంబర్గ్, నెదర్లాండ్స్ తదితర దేశాల యూదులే కాకుండా అమెరికాలో ఉన్న యూదులు కూడా ఈ బ్యాంకులో లెక్కపెట్ట లేనంత డబ్బు, బంగారం, వజ్రాలు, పెయింటింగ్స్, కళాఖండాలు దాచుకున్నారు.*


*అది వారి కష్టార్జితం.*


*వీరే కాకుండా.. జర్మన్ నాజీ అధికారులు, సైన్యాధికారులు యూదుల నుంచి కొల్లకొట్టిన కళాఖండాలు, బంగారం, నగదు దాచుకున్నారు.*


*యుద్ధానంతరం యూదులు, అధికారులు, సైన్యాధికారులు చాలామంది తిరిగి రాలేదు.. తమ సొమ్ముని తీసుకోవడానికి.*


*ఆ తరువాతి సంవత్సరాల్లో వివిధ దేశాల అధినేతలు, నియంతలు, మాఫియా డాన్ లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, ఇతరులు తన అక్రమార్జనను ఈ బ్యాంకులో దాచుకుని.. తిరిగిరాని వారు కూడా ఉన్నారు.*


*ఆ విధంగా విపరీతంగా ధనం నిలువలు విపరీతంగా పేరుకు పోయాయి. లాకర్స్ ఎన్నో ఏళ్లుగా తెరవకుండా పడి ఉన్నాయి.* 


*క్రొత్త శతాబ్ది ప్రారంభంలో అంటే 2000 సంవత్సరంలో ఇది జరిగింది.*


*అటువంటి పరిస్థితుల్లో ఒక శుభముహూర్తాన అటువంటి ఖాతాలు అన్నిటికీ నోటీసులు ఇచ్చి నిర్ణీత సమయానికి రాకపోతే ఆ ఖాతాలు జప్తు చేసి ఖాతాల లోంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు తరలించడం జరిగింది.*


_*అలా.. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన మొత్తం ప్రపంచంలోని నల్లధనంలో నలభై శాతం.*_


*ప్రభుత్వం ఆయాచితంగా వచ్చిన సొమ్ముని ఎలా ఉపయోగించు కోవాలో అర్ధం కాక ప్రజాభిప్రాయం తెలుసు కుందాం అని తమ దగ్గర ఉన్న సొమ్ము ప్రతి పౌరునికి పంచితే ఒక మిలియన్ యూరోలు పైనే వస్తాయి, లేదా ఏ రకంగా దేశ అభివృద్ధికి ఖర్చుపెట్టవచ్చో చెప్పండి మీ అభిప్రాయాన్ని అని వోటింగ్ నిర్వర్తించింది.*


*పదిహేను రోజుల సర్వే తరువాత 99.2% శాతం ప్రజలు, దేశ సుందరీకరణకు, తమ దేశాన్ని చూడడానికి వచ్చే యాత్రికుల సౌకర్యాలకు, టూరిజం అభివృద్ధికి ఖర్చుపెట్టాలి అని అభిప్రాయపడ్డారు.*


*దేశాభిమానులైన స్విట్జర్లాండ్ ప్రజలకు ఇదో పెద్ద విషయంలా అనిపించలేదు. ప్రతి పౌరునికి మిలియన్ యూరోలు ఉచితంగా ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. దేశ సౌభాగ్యానికి ఆ దేశ ప్రజలు ఓటు వేశారంటే, మిగతా దేశ పౌరులకు ఆశ్చర్యం కలగవచ్చు.*


*ఆ దేశ పౌరుల అభిప్రాయం ఏమిటంటే ఎందరో ఎన్నో విధాలుగా అన్యాక్రాంతంగా సంపాదించింది, అమాయకుల నుంచి కొల్లగొట్టి దాచుకున్న సొమ్ము తమకు ఉచితంగా ఇచ్చినా వద్దు అనేది 99.2% ప్రజల స్థిర అభిప్రాయం.*


*ఇక్కడ ఇంకో తమాషా జరిగింది.*


*2000 జనవరి 25వ తారీఖున.. ప్రజలు ప్రభుత్వ సర్వే ఆఫీసు ముందర చేతిలో బ్యానర్స్ పట్టుకుని బారులు తీరారు.*


*ఆ గుమిగూడిన ప్రజల డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న ఉచిత ఒక మిలియన్ యూరోలు కోసం ఆశపడి అందుకోసం ఓటు వేసిన 0.8% ప్రజల పేర్లు బహిర్గతం చేయాలని వారి కోరిక.* 


*ఈ 99.2 శాతం ప్రజల అభిప్రాయం ప్రకారం ఉచిత సొమ్ముని ఆశపడిన ఆ 0.8 శాతం ప్రజలు దేశానికి మచ్చ తెచ్చారు, వారి పేర్లు బహిర్గతం చేస్తే మిగతా పౌరులు అటువంటి చీడ పురుగులకు దూరంగా ఉంటాము అన్నది వారి అభిప్రాయం.*


*ప్రభుత్వ ప్రతినిధులతో చాలాసేపు జరిగిన సంప్రదింపులతో ఒక ఒప్పందం కుదిరింది.*

*ప్రభుత్వం వారి పేర్లు బయట పెట్టదు.* 

*కానీ, వారిని తగురీతిలో శిక్షిస్తుంది అని ప్రభుత్వం చెప్పడంతో వారు శాంతించారు.*

                                                                                                                                                                                                                                          _*ఉచితాలు వద్దు అని 99.2 శాతం ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు అంటే, ఎంత తేడా మిగతా దేశ ప్రజలకు స్విట్జర్లాండ్ ప్రజలకు...!!!???*_


*సేకరణ:* 

*P.BHASKAR.* 

SMART FINANCIAL ADVISER, 

7989939963

_*...!!!*_

నడక ప్రదక్షిణం

 నడక ప్రదక్షిణం


పరమాచార్య స్వామివారి దర్శనానికి ఊబకాయంతో బాధపడుతున్న మహిళ ఒకరు వచ్చారు. ఆమె మహాస్వామివారికి నమస్కారం కూడా చెయ్యలేకపోతోంది. భక్తితో చేతులు కట్టుకుని నిలబడి ఇబ్బందిగా చూస్తోంది.


“నాకు మధుమేహం ఉంది. వైద్యులు నేను బరువు తగ్గాలని తెలిపారు. అందుకు రోజూ ఒక గంట సేపు నడవాలని సూచించారు. కాని నేను సరిగ్గా పది నిముషాలు కూడా నడవలేను” అని స్వామివారికి విన్నవించుకుంది. “స్వామివారే నాకు ఏదైనా సులభమైన మార్గం చూపాలి” అని ప్రార్థించింది.


“ఈ వైద్యులందరూ ఇంతే, వైద్యశాస్త్ర పుస్తకాలలో వ్రాసినదాన్నే చెబుతూ ఉంటారు. దాని సాధ్యాసాధ్య విషయంపై ఏమాత్రం ఆలోచించరు” అని అన్నారు స్వామివారు.


స్వామివారు ఎదో సులువైన ఉపాయం చెప్పబోతున్నారని ఆ భక్తురాలి మొహం వెలిగిపోయింది. కళ్ళల్లో ఆశ కనబడుతోంది.


“ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆరోగ్యం బాగుండాలి అంటే, భగవంతుని అనుగ్రహం ఉండాలి . . .” ఏమి చెబుతారా అని ఆవిడ గుండె వేగం పెరిగింది.


“మీ ఇంటి దగ్గర ఏదైనా ఆలయం ఉందా?”


“ఉంది పెరియవా, పెద్ద శివాలయం ఒకటి ఉంది”


“మంచిది! ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఆరు ‘ప్రదక్షిణలు’ చెయ్యి. అలాగే రోజూ చీపురతో ఒక వంద అడుగుల స్థలాన్ని శుభ్రం చెయ్యి”.


ఆమె చాలా ఆనందపడి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న సహాయకుడు నవ్వును ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

స్వామివారు చూసి, “నేను ఏమైనా తప్పు చెప్పానా?” అని అడిగారు.


“లేదు పెరియవా! వైద్యులు నడవమన్నారు, పరమాచార్యులు ప్రదక్షిణం చెయ్యమన్నారు” అని సమాధానం ఇచ్చాడు.


“ఓహ్! అంటే మేము ఇద్దరమూ ఇచ్చిన సూచన ‘అద్వైతం’, పేర్లు మాత్రమే ‘ద్వైతం’ అంటావు. అంతేనా?”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం