10, జులై 2021, శనివారం

జాతకం కుదిరింది కథ*

 క్రమసంఖ్య 137/2021



*జాతకం కుదిరింది కథ*


రచన - విజయలక్ష్మి తెలికచెర్ల


“ఒరేయ్, చాల్లేరా ఆ చీకటం! ఎంతసేపని చీకుతావు, ఆ వేలుని? చీకి చీకి వేలు సన్నగా అయిపోయింది. మూతి చూస్తే వంకర పోయింది. ఈ సంగతి తెలిస్తే నీకు పిల్లని ఎవరు ఇస్తారురా? ఇంక ఆపు ఆ చీకుడు!” అంది బామ్మ.


“నేనేమీ పెళ్లి చూపుల్లో చీకటం లేదు కదా?” అన్నాడు పండు, సంతోషం వచ్చినా, బాధొచ్చినా, తోచకపోయినా వేలు చీకే పండు.


“పెళ్ళిచూపుల్లో చీకకపోయినా, మనకి తెలిసిన వాళ్ళందరూ, ‘ఆ అబ్బాయా వేలు చీకుతాడు ఇప్పటికీ’ అని వెక్కిరిస్తారురా” అంది బామ్మ.


“పోనీలే బామ్మా, వెక్కిరిస్తే వెక్కిరించనీ. వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి, తప్పించేస్తున్నావు కదే?” అన్నాడు ఏడుపు గొంతుతో పండుగాడు.


“ఓరి నీఅసాధ్యం కూలా! నింద నామీద వేస్తావా? నేను ఎక్కడ తప్పిస్తున్నానురా?” అంటూ ముక్కున వేలేసుకుంది బామ్మ.


“కాకపోతే మరేంటి? అమలాపురం అమ్మాయి ఎంత బాగుందో, ఒద్దని రాగాలు తీసి మరీ ముక్కు చీదింది నువ్వే కదా!” అన్నాడు పండుగాడు కోపంగా.


“అవునురా, వద్దన్నాను. ఆ అమ్మాయిది మఖ నక్షత్రం. మావగారి గండంరా. నా కొడుకు ప్రాణం మీద కొస్తుందంటే నేనెందుకు ఒప్పుకుంటాను?” అంది బామ్మ.


“నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయి, పిల్లల తండ్రులు కూడా అయ్యారు. ఇంకా నాకే ఏదీ లేదు. అవును కానీ, విజయనగరం అమ్మాయికి ఎందుకు వద్దన్నావే బామ్మా?” అన్నాడు పండు.


“ఆ అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం. నాకయితే ఒకే, మరి నీ యిష్టం అని మీ అమ్మ తో అనగానే,


‘ఆశ్లేష అత్తగారి గండం. నేను ఛస్తే పీడ విరగడ అవుతుందని, మీరు ఆ సంబంధానికి ఒకే అంటున్నారు’ అంటూ మీ అమ్మ రాద్ధాంతం చేసిందిరా!” అంది బామ్మ.


“మరి మున్నంగి పిల్లని ఎందుకు వద్దన్నావు?” అంటూ మూలిగేడు పండు.


“మూలా నక్షత్రం ఆ పిల్లది. మూల మూలలా కొడుతుందనిరా” అంటూ మనవడిని బుజ్జగించింది బామ్మ.


“జగిత్యాల పిల్ల ఎంత బాగుంది. పెద్ద కళ్ళు, సొట్ట బుగ్గలతో జాంపండులా ఉంది. ఆమెని వద్దన్నావెందుకు?” అన్నాడు పండు కోపంగా.


“ఆ పిల్లది జేష్ఠ నక్షత్రం, ఇంటికి పెద్దది జేష్టురాలు. నువ్వేమో ఇంటికి పెద్ద, జేష్టుడివి. మూడు జేష్టలు ఒక చూరు కిందన ఉండకూడదురా నాన్నా! అందుకే ఆఅమ్మాయిని వద్దన్నాను.” అంది బామ్మ.


“విశాఖపట్నం అమ్మాయిది విశాఖ నక్షత్రం, విసిరి విసిరి కొడుతుందని వద్దన్నావు. నక్షత్ర మండలంలో ఉండే నక్షత్రాలన్నిటితో, నా పెళ్లి ముడిపెట్టి ఫుట్బాల్ ఆట ఆడించుతున్నావు.” అంటూ గఁయ్య్ మన్నాడు బామ్మ మీద పండు.


“అదేంటిరా, అలా అంటావు? శాస్త్రాన్ని తప్పు పట్టకూడదురా!” అంటూ ఓదార్చింది బామ్మ.


“నెత్తి మీద జుట్టంతా పలచన అయిపోయింది. అక్కడక్కడా వెండి వెంట్రుకలు కూడా తొంగిచూస్తున్నాయి మేము ఉన్నాం అంటూ, నాకు ఈ జన్మకి పెళ్లి అయే యోగం ఉన్నట్టు లేదు” అని మనవడు బాధ పడుతుంటే,


మనవడి మీద జాలేసింది బామ్మకి. చిన్నప్పుడు పండు గాడి విపరీతమైన అల్లరి భరించలేక, నోట్లో వేలు అలవాటు చేయించింది బామ్మ. స్కూల్లో పాఠాలు వినకుండా అటూ ఇటూ తిరుగుతూంటే, నోట్లో వేలుంచితే ఒకే చోట కూర్చుంటాడని, వేలు తియ్యనియ్యద్దని మాస్టర్లకి చెప్పింది కూడా బామ్మే. నోట్లో వేలు తీస్తే లోంగేవాడు కాదు. అలా స్కూల్, కాలేజ్ పూర్తి అయి ఇప్పుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు మనవడు. పండు ఇప్పుడు కూడా వేలు చీకుతుంటే నచ్చక అప్పుడప్పుడూ కసురుతుంది బామ్మ.


“బాధ పడకురా! మొన్ననే పంతులుగారిని కలిసాను. కల్యాణ యోగం త్వరలోనే ఉంది. మంచి ఈడు జోడు అయిన అమ్మాయితో మీ మనవడికి పెళ్ళవుతుంది అని చెప్పేరు!” అంది మనవడితో ఓదార్పుగా బామ్మ.


****


“అత్తయ్యా, ఈ ఫోటో చూడండి. అమ్మాయిది పాలకొండట. చాలా మంచి వాళ్ళు అని మా వదిన చెప్పింది. పిల్ల బాగుంది కదా ?” అంటున్న కోడలితో,


“పిల్ల బాగుండే సరికి మనం మురిసిపోయి, వాడికి చూపిస్తున్నాము. వాడు ఫోటో చూసి మనసులో ఫిక్స్ అయిపోయేక, మనం జాతకాలు పడలేదని, వద్దంటున్నాము. పాపం వాడి మనసు దెబ్బతింటోంది. ముందు జాతకాలు చూపించి, అన్నీ సరిపడ్డాకే వాడికి తెలియచేద్దాము.” అంది బామ్మ.


“మా వదిన పండు గాడి జాతక వివరాలన్నీ ఇచ్చిందిట ఆడపిల్ల వాళ్ళకు. జాతకం కూడా సరిపోయింది. మీకు ఇష్టమైతే ఎల్లుండి మాటలకి వస్తాము అన్నారత్తయ్యా వాళ్ళు.” అంది కోడలు.


అప్పుడే డ్యూటీ పూర్తి చేసుకొని లోపలకు వస్తున్న పండు బామ్మ చేతిలో ఫొటో చూసి,


“మళ్ళీ మరొక సంబంధమా?” అన్నాడు నిరుత్సాహంగా నోట్లో వేలేసుకొంటూ.


****


పండు గాడికి పెళ్ళి చూపులు అవటం, జాతకాలు పడటం జరిగింది. పిల్ల కాస్తా లావుగా ఉందని నీలిగేడు పండు.

“ఒళ్ళెక్కడ ఉందిరా? పిల్ల బొద్దుగా బంగిని పల్లి మామిడి పండులా ఉంది.” అని చెప్పి ఒప్పించింది బామ్మ.


పండుకి పెళ్ళి కుదిరింది. రోజూ డాబా ఎక్కి, నవారు మంచం మీద పడుకుని, నోట్లో వేలుపెట్టుకొని చీకుతూ, కాబోయే పెళ్ళాంతో కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోయేవాడు.


“ఒరేయ్, పెళ్ళిలో మాత్రం నోట్లో వేలేసుకొని కూర్చోకు. నలుగురూ నవ్వుతారు” అని గట్టిగా మనవడికి ముందే హెచ్చరించింది బామ్మ.


ఆఖరికి అనుకున్న రోజు రానే వచ్చింది. ఆడ పెళ్ళివారు వాళ్ళ విశాలమైన సొంత ఇంట్లోనే పెళ్ళి ఏర్పాట్లు చేసేరు. పెళ్లి చక్కగా జరుగుతోంది. అందరూ అలిసిపోయారు. ఆ అలసటతో పండుకి వేలు చీకాలని మహా కోరికగా ఉంది. బామ్మవైపు ఒక్కసారి వేలు చూపించేడు రిక్వెస్ట్ గా. బామ్మ గుడ్లురుమి చూసేసరికి ఊరు కున్నాడు.


పెళ్ళి ఆఖరుకు వచ్చింది. అరుంధతిని చూపించేరు. పండుగాడి అవస్థ చూసి బామ్మ,


“మా మనవడు అలిసిపోయాడు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు.” అని పంతులికి చెప్పింది.


“అలాగేనమ్మా! పెళ్ళి కొడుకూ పెళ్ళికూతురూ ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకోండి, నేనూ చిన్న కునుకు తీస్తాను” అన్నాడు పంతులు.


బామ్మ పండుగాడితో పాటూ విడిది గదికి వచ్చింది. విడిది గది కాస్తా తాళం వేసి ఉంది. ఆ పక్కనే మరొక గది తలుపు కాస్తా తీసి ఉండేసరికి, అందులోకి తీసుకు వెళ్ళి,


“చీక్కొరా వెధవా, సైగలు చేసి చేసి చంపుతున్నావు నన్ను ” అంది మనవడిని. పండుగాడు తృప్తిగా రాజ్యాన్ని జయించినంత ఆనందంగా వేలు చీక్కుంటూ తన్మయత్వంలో మునిగి పోయాడు.


పండుగాడి పక్కన కూర్చున్న బామ్మకు ఏదో శబ్దం వినిపిస్తోంది. ‘ఏమిటా శబ్దం?’ అని జాగ్రత్తగా వినేసరికి, పిల్లి పాలు గబగబా తాగుతున్నట్టు ‘లప లప్ లప్’ మని శబ్దం. ‘పిల్లి ఎక్కడైనా వుందేమో?’ అని విశాలమైన గదిలో తలుపు పక్కకి వెళ్ళి, తొంగి చూసింది.


తలుపు వారగా కూర్చొని బొటకనవేలు గబ గబ చీకుతున్న పెళ్ళికూతుర్ని గుడ్లప్పగించి చూసి నవ్వుకుంటూ, జాతక రత్న, ‘జాతకం అమోఘం, గుణాలు అద్వితీయం’ అంటే మరీ ఇంతలా కలవాలా జాతకాలు అనుకొని,


“వేలు చీకింది చాల్లే అమ్మాయ్, రా వెళదాం!” అంటూ మనవడి పెళ్ళాన్ని నవ్వుకుంటూ దగ్గరకు తీసుకుంది బామ్మ.


🙏🙏🙏🙏🙏🙏

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట

 పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట


ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. 

 

ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. 

 

అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. శాస్త్రం మాత్రం పితృ కార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది. ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది


పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించే రోజున ముగ్గు పెట్టకూడదని పండితులు అంటున్నారు. వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు.

 

అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి.


****సేకరణ

మందార మకరంద

 

మందార మకరంద మాధుర్యము 

భాషావగాహన, భాషాభిమానం, పాండితీ గరిమ వున్న ప్రతి తెలుగు వాడి హృదయంలో ముద్రవేసుకున్న పద్యం అంటే పోతనామాత్యుని మందార మకరంద పద్య కుసుమమే అనుటలో లేశమైయినా అతిశయోక్తి లేదు.

 

మందార కుసుమాలలో మాధుర్యం ఉంటుందో లేదో మదుపాలకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ మన సాహితీ మదుపాలకు మాత్రం మాధుర్యాన్ని అందించిన మహానుభావుడు పోతనగారు.

 

మందారకుసుమం ఒక కంటికి ఇంపైన పుష్పం అందులో సందేహం లేదు నిజానికి మందారానికన్నా ఎన్నోరెట్లు అందమైన, సువాసనా భరిత, సుకుమారమైన  సుమములు ఎన్నో వున్నాయి కానీ పోతరాజు మందారాన్నే ఎంచుకున్నారు మాధుర్యాన్ని మనకు పంచారు. ఒక్క సారి సీస పద్యాన్ని అవలోకిద్దాము 

 

మందార మకరంద మాధుర్యమునఁ దేలు

మధుపంబు వోవునే మదనములకు?      

నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు

రాయంచ సనునె తరంగిణులకు

లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు

కోయిల చేరునే కుటజములకుఁ

బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక

మరుగునే సాంద్ర నీహారములకు

 

నంబుజోదర దివ్యపాదారవింద 

చింతనామృతపానవిశేషమత్త 

చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు

వినుతగుణశీల! మాటలు వేయు నేల?” 

ప్రతి పదార్ధము 

మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగము లందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; = అయ్యుండి; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడుఅంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టన గలవాడు), విష్ణువు}.

దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కిలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; = ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములు గల; శీల = వర్తన గలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.

 

భావము:

 

సుగుణాలతో సంచరించే గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”

 

 

 

కవిపుంగవుడైన చక్కటి కవిత చెప్పాలంటే ఒక మంచి ఉపమానం నుడవటం సర్వ సాధారణం. కానీ బహు ఉపమానాలు ఒక వస్తువిశేషాన్ని ప్రకటించటానికి చేయటం కేవలం పోతనగారికే చెందింది. అటు శబ్దాలంకారాలు, ఇటు అర్దాలంకారాలను గుప్పించి మెప్పించగల నేర్పరి, అతను పద్య శర ప్రయోగంలో నిష్ట్నాతుడైన కవి సవ్యసాచి అనదగునేమో 

సందర్భం:-

 

తండ్రి హిరణ్యాక్షుడుహరి గిరి అనకుఅన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కులవారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. సందర్భంలోది అమృత గుళిక. మాధుర్యానికే మాధుర్యం చేర్చే మధురాతి మధురమైన పద్యరత్న మిది మనసును మైమరిపింప జేసెడి మనందరి పోతన్న ఉత్తమోత్తమైన సీస పద్యం.   ప్రహ్లాదుడు తన తండ్రిని ఇలా సంబోధిస్తూ చెపుతున్నాడు. ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశించిపోతూ  ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు, వంకల దరి చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు సుమా.


ప్రతీఇంట్లో ఉండాలి.

 కూల్ డ్రింక్ ప్రతీఇంట్లో ఉండాలి. 

దీనివలన 16 చాలా పెద్ద లాభాలు


ఈ పోస్టును షేర్ చెయ్యండి, ఎందుకంటే కూల్ డ్రింక్ పై ఉన్న దురభిప్రాయం పోవటానికి, దీని బాటిల్ ఒకటి ప్రతీ ఇంట్లో ఉండితీరాలి.


(1) పింగాణీ పాత్రలపై ఉన్న అన్నిరకాల మచ్చలు, మరకలను దూరం చేస్తుంది.

(2) ప్రతీ ఇంటిలో ఉన్న కంబళ్ళు, రగ్గులకు ఉన్న మురికిని పోగొడుతుంది.

(3) అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రంచేస్తుంది.

(4) బట్టలపై ఉన్న జిడ్డును సబ్బుకూడా పోగోట్టలేని దానిని ఇది దూరం చేస్తుంది.

(5) జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలిస్తుంది.

(6) ఏ రకమైన లోహం పైన పడిన రంగును వంటనే పోగోడుతుంది.

(7) కార్ బ్యాటరీ, మరియు ఇన్ వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగోిడుతుంది.

(8) అన్నిటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తుంది.

(9) టవల్స్ మీద మరకలను వదిలిస్తుంది.

(10) టాయ్ లెట్స్ ను బాగా శుభ్రపరుస్తుంది.

(11) పాత నాణాలను శుభ్రపరపస్తుంది.

(12) అల్యూమినియమ్ ఫాయల్ ను శుభ్రపరుస్తుంది.

(13) చ్యూయింగ్ గమ్ మరకలను వదిలిస్తుంది.

(14) బట్టల పైవున్న రక్తం మరకలను వెంటనే పోగొడుతుంది.

(15) మురిగావున్న జుట్టును బాగా శుభ్ర పరపస్తుంది.

(16) ఇంటిలో దీనిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే చాలా బాగుంటుంది మరియు క్రిమి కీటకాలను పారద్రోలుతుంది.

(17) దీని వలన ఇంకో లాభం కూడా కలదు. ఎవరైతే త్వరగా చనిపోవాలనుకుంటారో వారు దీనిని తరచూ సేవించటం వలన ప్రేగులు పాడైపోతాయి, యమధర్మరాజుకు శీఘ్రంగా కానుక అవుతారు.


దీనివలన లాభాలే – లాభాలు, అందుకని తప్పనిసరిగా ప్రతీ ఇంటిలో కూల్ డ్రింక్ ఉండాలి😅

@@@ త్రాగటానికి కాదండి బాబు @@@


Pesticide Percentage (%) in cold drinks released from IMA (Indian Medical Association) recently*


_1     Thums up      7.2%_ 


_2     Coke              9.4%_    


_3     7 UP             12.5%_    


_4     Mirinda         20.7%_    


_5     Pepsi            10.9%_   


_6     Fanta              29.1%_     

 

_7    Sprite                 5.3%_


_8    Frooti               24.5%_


_9    Maaza              19.3%_


*It's very dangerous to the Human Liver, Results in Cancer*

*Please pass it to all known persons in your contact*

మనదేవాలయాలు_మనసంపద

 #మనదేవాలయాలు_మనసంపద 

#మనదేవాలయాలు #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి 


ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దేవాలయ లు గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


https://www.facebook.com/groups/2185637145027700/?ref=share


మన దేవాలయాలు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.సమాచారం అందరితో షేర్ చేయండి.


https://t.me/joinchat/GfLCAnisG1gSQZkc


సేకరన: Srikanth Chennamadhavuni  గారి పోస్ట్


ద్వాపరయుగాంతములో "నారదుడు","బ్రహ్మ" వద్దకు వెళ్ళి,రాబోవునది "కలియుగము" కదా?మరి నేను భూమి మీద "కలి ప్రభావమున పడకుండా" ఎలా తిరగగలను? అని అడిగెను.


అప్పుడు బ్రహ్మ ఆ ప్రశ్నకు చాలా సంతసించి జీవులందరికీ ఉపయోగపడే ఒక ప్రశ్న అడిగావు అని మెచ్చుకుని,వేదములో నిగూఢంగా దాగి ఉన్న ఈ విషయమును తెలియజేస్తున్నాను.ఎవరి నామమును ఉచ్ఛరించిన మాత్రముననే కలి ప్రభావంనుండే కాక,జీవన్ముక్తి దొరుకు అని తెలియజేస్తూ,"శ్రీహరి యొక్క నామము" జపిస్తూ తరించుమని సెలవిచ్చెను.


అప్పుడు నారదుడు "ఏ నామమును" నేను తలచవలెను?అని అడగగా?


బ్రహ్మ చెబుతూ...


హరే రామ హరే రామ రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


ఈ "16 నామాలు" కలి దుష్ప్రభావాలనుండి కాపాడును.వేదములలో తరచి చూచిన దీనికి మించిన సాధనం లేదు.


ఇక నారదుడు దీనిని ఎలా జపించవలెను అనే దానికి బ్రహ్మ పద్దతులు చెబుతూ...చివరగా...


"పరమాచార్యుని ద్వారా ఉపదేశం" పొంది,ఈ 16(షోడశ) నామ మంత్రమును "మూడున్నర కోట్ల" సార్లు జపించిన సర్వ పాప రహితుడై చతుర్విధ మోక్షములలో ఏదో ఒక మోక్షమును పొందును.


- కృష్ణ యజుర్వేదం - కలి సంతారణోపనిషత్.


Translation:


At the end of Dvapara-Yuga, Narada went to Brahma and addressed him thus: “O Lord, how shall I, roaming over the earth, be able to across Kali ?” To which Brahma thus replied: “Well asked. Hearken to that which all Shrutis (the Vedas) keep

secret and hidden, through which one may cross the Samsara (mundane existence) of Kali. He shakes off (the evil effects of) Kali through the mere uttering of the name of the Lord Narayana, who is the primeval Purusha”. Again Narada asked Brahma: “What is the name ?” To which Hiranyagarbha (Brahma) replied thus:


Hare Rama Hare Rama Rama Rama Hare Hare


Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare


These sixteen names (words) are destructive of the evil effects of Kali. No better means than this is to be seen in all the Vedas.


These (sixteen names) destroy the Avarana (or the centripetal force which produces the sense of individuality) of Jiva surrounded by the sixteen Kalas (rays). Then like the sphere of the sun which shines fully after the clouds (screening it) disperse, Parabrahman (alone) shines.”


Narada asked: ‘O Lord, what are the rules to be observed with reference to it ?” To which Brahma replied that there were no rules for it. Whoever in a pure or an impure state, utters these always, attains the same world of, or proximity with, or the same form of, or absorption into Brahma.


Whoever utters three and a half Crores (or thirty-five millions) times this Mantra composed of sixteen names (or words) crosses the sin of the murder of a Brahmana. He becomes purified from the sin of the theft of gold. He becomes purified from the sin of cohabitation with a woman of low caste. He is purified from the sins of wrong done to Pitris, Devas and men. Having given up all Dharmas, he becomes freed at once from all sins. He is at once released from all bondage. That he is at once released from all bondage is the Upanishad.


- Krishna Yajurveda - Kali Santaranopanishat.

Constitution of India was written by hand.

 How many Indians know that the Constitution of India was written by hand. No instrument was used to write the whole constitution. Prem Bihari Narayan Rayzada, a resident of Delhi, wrote this huge book, the entire constitution, in italic style with his own hands.


Prem Bihari was a famous calligraphy writer of that time. He was born on 16 December 1901 in the family of a renowned handwriting researcher in Delhi. He lost his parents at a young age. He became a man to his grandfather Ram Prasad Saxena and uncle Chatur Bihari Narayan Saxena. His grandfather Ram Prasad was a calligrapher. He was a scholar of Persian and English. He taught Persian to high-ranking officials of the English government.


Dadu used to teach calligraphy art to Prem Bihari from an early age for beautiful handwriting. After graduating from St. Stephen's College, Delhi, Prem Bihari started practicing calligraphy art learned from his grandfather. Gradually his name began to spread side by side for the beautiful handwriting. When the constitution was ready for printing, the then Prime Minister of India Jawaharlal Nehru summoned Prem Bihari. Nehru wanted to write the constitution in handwritten calligraphy in italic letters instead of in print. That is why he called Prem Bihari. After Prem Bihari approached him, Nehruji asked him to handwrite the constitution in italic style and asked him what fee he would take.


Prem Bihari told Nehruji “Not a single penny. By the grace of God I have all the things and I am quite happy with my life. ” After saying this, he made a request to Nehruji "I have one reservation - that on every page of constitution I will write my name and on the last page I will write my name along with my grandfather's name." Nehruji accepted his request. He was given a house to write this constitution. Sitting there, Premji wrote the manuscript of the entire constitution.

Before starting writing, Prem Bihari Narayan came to Santiniketan on 29 November 1949 with the then President of India, Shri Rajendra Prasad, at the behest of Prince Nehruji. They discussed with the famous painter Nandalal Basu and decided how and with what part of the leaf Prem Bihari would write, Nandalal Basu would decorate the rest of the blank part of the leaf.


Nandalal Bose and some of his students from Santiniketan filled these gaps with impeccable imagery. Mohenjo-daro seals, Ramayana, Mahabharata, Life of Gautam Buddha, Promotion of Buddhism by Emperor Ashoka, Meeting of Vikramaditya, Emperor Akbar and Mughal Empire, Empress Lakshibai, Tipu Sultan, Gandhiji's Movement, Netaji Subhas Chandra Bose and Rupachitra is all reflected in their drawing ornaments. All in all, it is a pictorial representation of the history and geography of India. They painted the pictures very thoughtfully according to the content and paragraphs of the constitution.

Prem Bihari needed 432 pen holders to write the Indian constitution and he used nib number 303. The nibs were brought from England and Czechoslovakia. The nibs will be made there. He wrote the manuscript of the entire constitution for six long months in a room in the Constitution Hall of India. 251 pages of parchment paper had to be used to write the constitution. The weight of the constitution is 3 kg 650 grams. The constitution is 22 inches long and 16 inches wide.

Prem Bihari died on February 17, 1986. The original book of the Indian Constitution is now preserved in the library of the Parliament House, Delhi. Later, a few books were published in print under the supervision of the Survey of India in Dehradun.

దేవుడు అడగని ప్రశ్నలు .

 *దేవుడు అడగని ప్రశ్నలు .⁉️*


*మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు .*

*నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు .*


*నీది ఎన్ని అంకెల జీతం ? అని దేవుడు అడగడు .*

*నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది ?అని అడుగుతాడు .*


*నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు ? అని అడగడు .*

*నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలగుతున్నావని అడుగుతాడు .*


*నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావని దేవుడు అడగడు .*

*నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు .*


*నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు .*

*నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావని అడుగుతాడు .*


*నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు .*

*నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు ? అని అడుగుతాడు .*


*నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు .*

*నీవు ఎంత మానవ సేవ చేసావని అడుగుతాడు .*


*నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు .*

*ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .*


*ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేసామేమని దేవుడు అడగడు .*

*నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు*

పెరటి గడప పేద ముతైదువు..!

 పెరటి గడప పేద ముతైదువు..!

ఓం నమః శివాయ..!!🙏


ఇంటి వెనక పెరటి గుమ్మాన్ని పేద ముత్తైదువు అంటారు...

ఎందుకంటే అందరూ ముందర గుమ్మానికి 

బాగా అలంకరిస్తారు పూజ చేస్తారు కానీ 

వెనుక గుమ్మానికి పెద్దగా పట్టించుకోరు...


లక్ష్మీ దేవి ముందు గడప నుండి వస్తుంది, 

జేష్ఠ దేవి ఎట్టి పరిస్థితుల్లో ముందు గడపలో 

అడుగు పెట్టదు..

వెనక గుమ్మంలో నుండి వస్తుంది.. 

ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటంవల్ల ధనము వస్తుంది 

వచ్చిన ధనము వెంటనే నిలవకుండా పోతూ ఉంటుంది, నగలు వస్తుంటాయి

తాకట్టులోకి పోతుంటాయి 

జేష్ఠ దేవి ఆవిడ ప్రతాపం చూపిస్తుంటుంది..


వెనక గుమ్మం నుండి జేష్ఠ దేవిని రాకుండా 

అడ్డుపడగల శక్తి పెరటి గుమ్మానికి ఉంది..


అందుకే కాస్త పసుపుకుంకుమ వెనుక గుమ్మానికి 

కూడా పెడితే లక్ష్మీ దేవి వచ్చే సమయానికి..

జేష్ఠదేవిని వెనక గుమ్మానికి రాకుండా అడ్డుపడి 

ఈ ఇంటి ఇల్లాలు నాకు పసుపు కుంకుమ ఇచ్చింది 

కనుక నేను నిన్ను ఈ ఇంట రానివ్వను..

అని అడ్డు పడుతుంది...


ఎవరైనా పెరటి గుమ్మానికి కాస్త పసుపు కుంకుమ 

కూడా పెట్టకుండా పట్టించుకోకుండా వదిలేస్తారో..

వారి ఇంట్లోకి కూడా జేష్ఠదేవి వస్తున్నప్పుడు 

పెరటి గుమ్మం పట్టించుకోదు ఆహ్వానిస్తుంది..


అందుకే ముందర సింహ ద్వారాన్ని ఎంతగా అలంకరిస్తారో..పెరటి గుమ్మానికి కూడా 

అంత మర్యాద చేయాలి.

కనీసం పసుపు కుంకుమ అయినా పెట్టాలి...


అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ ఇల్లు కావడం వల్ల 

చాలా మందికి పెరటి గుమ్మలూ ఉండటం లేదు...

అలాంటి వారికి ఒక ఉపాయం ఉంది..

వారు గుమ్మానికి దగ్గరగా కానీ బోల్కనీ లో కానీ 

తులసి మొక్కను పెట్టి పూజ చేయలి , 

పెరటి గుమ్మం పూజ కూడా నీకే చేస్తున్నాము తల్లి 

అని తులసికి  మొక్కినా సరిపోతుంది...


పెరటి గుమ్మానికి ఉన్న శక్తి విలువ తెలుసుకుని.. మర్చిపోకుండా అంత పసుపు కుంకుమ పూలు పెట్టండి..

మంచి ఫలితాలు పొందండి..!!


ఓం నమః శివాయ..!!🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏

శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!!🙏

తెలంగాణ ఉద్యోగ ఖాళీలు*

 *తెలంగాణ ఉద్యోగ ఖాళీలు* 


 *పోలీస్‌ శాఖ –* 37,820 పోస్టులు

2. విద్యుత్ శాఖ- 12,961 పోస్టులు

3. గురుకులాలు – 12,438 పోస్టులు

4. విద్యాశాఖ(టీచర్లు) – 12,005 పోస్టులు


5. వైద్యారోగ్యశాఖ- 8,347 పోస్టులు

6. సింగరేణి – 7,785 పోస్టులు

7. టీఎస్‌ ఆర్టీసీ – 3,950 పోస్టులు

8. పంచాయతీరాజ్‌ శాఖ – 3,528 పోస్టులు

9. రెవెన్యూశాఖ – 2,506 పోస్టులు

10. అటవీశాఖ – 2,033 పోస్టులు

11. పురపాలక పఠనాభివృది శాఖ – 1,952 పోస్టులు

12. ఉన్నత విద్యా శాఖ – 1,678 పోస్టులు

13. నీటిపారుదల శాఖ – 1,058 పోస్టులు

14. ఆర్ధిక శాఖ – 720 పోస్టులు

15. మహిళా, శిశుసంక్షేమ శాఖ – 587 పోస్టులు

16. రోడ్లు, భవనాలశాఖ – 513 పోస్టులు

17. రవాణాశాఖ – 182 పోస్టులు


 *పోలీస్‌ శాఖ ఖాళీలు :* 

సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ – 1739 పోస్టులు

పోలీస్‌ కానిస్టేబుల్స్‌ – 38,081 పోస్టులు


 *పాఠశాల విద్యాశాఖ :* 

మోడల్‌ స్కూల్‌ ప్రీన్సిపాల్స్‌ – 88 పోస్టులు

పీజీటీ – 477 పోస్టులు

టీజీటీ – 985 పోస్టులు


 *టీచర్‌ పోస్టుల ఖాళలు :* 

స్కూల్‌ అసిస్టెంట్స్‌ – 1,950 పోస్టులు

సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌ – 5415 పోస్టులు

లాంగ్వేజీ పండిట్స్‌ – 1,011 పోస్టులు

ప్రీఈః – 416 పోస్టులు

డైట్‌ కాలేజీ లెక్కరర్లు – 49 పోస్టులు

డైట్‌ సీనియర్‌ లెక్కరర్లు – 19 పోస్టులు

ఐఏఎస్‌ళ లకృరర్లు – 18 పోస్టులు

ఇతర పోస్టులు – 2197 పోస్టులు

గురుకులపారతాలలటీచర్లు – 541 పోస్టులు


 *వైద్యారోగ్యశాఖ:* 

డాక్టర్లు (అన్ని రకాలు) – 4347 పోస్టులు

ల్యాబ్‌ ఆసిస్టెంట్లు – 4347 పోస్టులు

ఇతీర పోస్టులు – 4000 పోస్టులు


 *టీఎస్‌ ఆర్టీసీ:* 

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఫైనాన్స్‌) – 39 పోస్టులు

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (పర్శనల్‌) – 39 పోస్టులు

మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌టైనీ – 123 పోస్టులు

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ టైన్‌ – 84 పోస్టులు

ఆఫీస్‌ అండర్‌ ట్రైనీ జనరల్‌ – 39 పోస్టులు

ఆర్టీసీ కానిస్టేబిల్స్‌ – 280 పోస్టులు

ఇతర పోస్టులు – 615 పోస్టులు


 *రెవెన్యూశాఖ :* 

జూనియర్‌ అసిస్టెంట్‌/టైపస్ట్‌ – 421 పోస్టులు

డిప్యూటీ కలర్స్‌ – 08 పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్లు – 38 పోస్టులు

వీఆర్వోలు – 700 పోస్టులు

డిప్యూటీ సర్వేయర్లు – 210 పోస్టులు

కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ – 50 పోస్టులు

డిస్‌ రిజిస్తార్‌ – 07 పోస్టులు

సట్‌ రిజ్ట్తార్‌ – 22 పోస్టులు

ఇతర పోస్టులు – 1,000 పోస్టులు


 *వ్యవసాయశాఖ:* 

ఏువోలు – 1911 పోస్టులు

హార్టికల్చర్‌ ఆఫీసర్స్‌ – 75 పోస్టులు

అగీకలార్‌ ఆఫీసర్‌, – 120 పోస్టులు


 *అటవీశాఖ:* 

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ – 200 పోస్టులు

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ – 816 పోస్టులు

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 1,000 పోస్టులు

అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 217 పోస్టులు


అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ – 79 పోస్టులు

ఏఈ /ఎంపఈ/టీవో పోస్టులు – 202 పోస్టులు

ట్వలీవో – 123 పోస్టులు

టీస్‌ – 200 పోస్టులు

పుడ్‌ ఇన్‌స్నెక్ట్స్‌ – 20 పోస్టులు

మేనేజర్స్‌ ఇంజీనీర్‌(నోటిఫైడ్‌) – 146 పోస్టులు

అసిస్టెంట్‌ ఎఫ్‌ఏ(నోట్‌ఫైడ్‌) – 115 పోస్టులు

జనరల్‌ ఎంప్లాయిస్‌ – 858 పోస్టులు

ఇతర కిందస్టాయి ఉద్యోగాలు – 415 పోస్టులు


 *ఉన్నతవిద్యాశాఖ* :

జూనియర్‌ లెక్బరర్లు – 392 పోస్టులు

ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 88 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 50 పోస్టులు

ల్యాబ్‌ అటెండర్స్‌ – 429 పోస్టులు


కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌:

ఫిజీకల్‌ డైరెక్టర్స్‌ – 25 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 21 పోస్టులు

ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ – 301 పోస్టులు


 *సాంకేతిక విద్యా శాఖ:* 

లె్బరర్చ్‌ – 192 పోస్టులు

ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 31 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 28 పోస్టులు

ల్యాబ్‌ అటెండర్స్‌ – 141 పోస్టులు


 *నీటిపారుదలశాఖ* :

ఇంజినీర్స్‌ అండ్‌ ఆఫీసర్స్‌ స్టాఫ్‌ – 1,058 పోస్టులు


ఆర్ధికశాఖ:

ఆడిట్‌ ఆఫీసర్స్‌/ ట్రజరీ ఆఫీసర్స్‌ – 720 పోస్టులు


                                                                                                   

మహిళా, శిశుసంక్షేమ శాఖ:

సూపర్‌ వైజర్స్‌ ఎ – 58 పోస్టులు


 *రోడ్లు, భవనాలశాఖ :* 

ఇంజినీర్‌ అండ్‌ ఆఫీసర్స్‌స్టాఫ్‌ – 513 పోస్టులు


ఎక్సైజ్ శాఖ:

కొనిస్టేబుల్స్‌, ఎ – 340 పోస్టులు


 *రవాణాశాఖ* :

ఏఎంవీ ఇన్‌స్పెక్ట! – 5 పోస్టులు

కానిస్టేబుల్స్‌ – 197 పోస్టులు


 *పంచాయతీరాజ్‌ శాఖ:* 

ఇంజినీర్‌ అండ్‌ ఆఫీస్‌ స్టాఫ్‌ – 3528 పోస్టులు..✍️

Advocates protection Bill

 https://drive.google.com/file/d/1HDwnBaec6wUChd_RO2wgn7sD6loFdQ-n/view?usp=drivesdk

పుస్తకాలు ఉచితంగా లభించే వెబ్‌సైట్లు

 

తెలుగు పుస్తకాలు ఉచితంగా లభించే వెబ్‌సైట్లు (Websites To Download Telugu Books For Free)

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా1 ప్రాజెక్ట్ భాగంగా, భారతదేశంలోని పలు విద్యా సంస్థలు పబ్లిక్ డొమైన్ పుస్తకాలను డిజిటైజ్ చేశాయి. ఈ సైట్ లో ఉచితంగా చదవడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి 40,000 కు పైగా తెలుగు పుస్తకాలు ఉన్నాయి.

ఉచిత భక్తి పుస్తకాలు

సాయి రామ్ ఆటిట్యూడ్ మానేజ్మెంట్ వారు అంతర్జాలంలోని(ఇంటర్నెట్) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేని భక్తి పుస్తకాలను సేకరించి ఉంచారు. ఇందులో 4200 లకు పైగా పుస్తకాలు వున్నాయి.

pusthakalu.com

స్వదేశానికి దూరంగా ఉండి ఈ పుస్తకాలు అందుబాటులో లేనివారి కోసం, pusthakalu.com లో తెలుగు సాహిత్యానికి సంబందించిన 1800 లకు పైగా పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు.

TTD ePUBLICATIONS

తిరుమల తిరుపతి దేవస్థానం వారు 750 కు పైగా పుస్తకాలను, వార పత్రికలను సేకరించారు. ఇందులో దాదాపు 500 ల పుస్తకాలు తెలుగులో వున్నాయి.

Kinige

కినిగె వెబ్ సైట్ లో దాదాపు 400 ఉచిత పుస్తకాలు వున్నాయి.

Telugu Thesis

పాండు రంగ శర్మ అను ప్రొఫెసర్ 2007 నుంచి అంతర్జాలంలోని వివిధ సైట్ల నుండి దాదాపు 400 పైగా పుస్తాకాలు సేకరించారు.

మిగతా వెబ్ సైట్లు

తెలుగుతల్లి సేవలో...

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

కథానిలయం

సిద్ధాశ్రమము

సుందరయ్య విఙ్ఞాన కేంద్రం

శ్రీ రామకృష్ణ సేవా సమితి

సాధకుడు

స్టేట్_బ్యాంకు_కధ

 #స్టేట్_బ్యాంకు_కధ


మానవ జన్మలో మనిషి చేసిన *పాపాలకు ప్రాయశ్చిత్తం* గా దాన ధర్మాలు చెయ్యడం ఒక్కటే మార్గం కాదు. 


*స్టేట్ బ్యాంకులో ఖాతా తెరచి* కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు!


చిన్నా చితకా పాపాలయితే *బాలెన్స్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తే చాలు*


నాలుగు కౌంటర్ల వద్ద కుమ్ములాటలు, తోపులాటలయ్యాక తెలిసే విషయం ఏమంటే *బ్యాలెన్సు కేవలం గుప్తా మేడం గారు మాత్రమే చెప్తారని*


అయితే *గుప్తా మేడం గారి కౌంటర్ ఏదో* తెలుసుకోవడానికి *మళ్లీ ఇంకో కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది*


*ఇక్కడితో లెవెల్- 1 పూర్తయ్యింది* అంటే *మనకు గుప్తామేడం కౌంటర్ ఏదో తెలిసింది*. కానీ కొంచం వేచి ఉండాలి, ఎందుకంటే *ప్రస్తుతం మేడం సీట్లో లేరు*


అరగంట తర్వాత కళ్లజోడు పెట్టుకొని, పైట సవరించుకొంటూ *BSNL వారి 2G సేవలంత వేగంగా* నడుస్తూ గుప్తా మేడం సీట్లో విలాసంగా ఆసీనులౌతారు. మీరేమో మీ అకౌంటు నంబరు చెప్పి ఆవిడను బ్యాలెన్స్ చెప్పవలసిందిగా అభ్యర్థిస్తారు.


మొదట *మేడం గారు మిమ్మల్నెంత కోపంగా చూస్తారంటే, మీరేదో ఆవిడ కూతుర్ని మీకిచ్చి పెళ్లి చెయ్యమని అభ్యర్థించినంత* నీచపు చూపొకటి మీమీదకు విసిరేస్తారు.


మీరు కూడా *సునామీ వచ్చి మీ సర్వస్వం లాక్కెళితే ఎంత బీదగా మారి‌పోతారో అలాటి నిస్సహాయమైన ఫేసు పెడతారు.*


గుప్తా మేడం కు అప్పుడు మీ దీనవదనం చూసి మీ మీద జాలి‌కలిగి, *మీకు మీ బ్యాలెన్సును వెల్లడించే మహత్తరకార్యక్రమాన్ని మొదలెడతారు*


కానీ ఈ భారీ కార్యక్రమాన్ని ఒంటరి అబల ఎలా నిర్వహించగలరు? అందుకే ఆవిడ సహాయం కొరకు ఇలా‌ కేకేస్తారు


*"మిశ్రా గారూ, ఈబ్యాలెన్సు తెలుసుకోవడమెలా?"*


మిశ్రా గారు ఈ *అబల ఆర్తనాదాన్ని విని తన‌అపురూపమేధోసంపత్తిని ప్రదర్శించడానికి‌తన‌ఙాన ఖజానాను తెరుస్తారు*


మొదట్లో ఖాతాలోకి వెళ్లి క్లోజింగు బ్యాలెన్సు మీద క్లిక్ చేస్తే బ్యాలెన్సు వచ్చేది. కానీ ఇప్పుడు సిస్టం ఛేంజ్ అయింది. ఇప్పుడు *F5* నొక్కి, ఎంటర్ కొడితే బ్యాలెన్స వచ్చేస్తుంది. 


గుప్తా మేడం అద్దాలు సవరించుకొంటూ, *మూడు సార్లు మానిటర్ వంకా, మూడు సార్లు కీబోర్డు వంకా మార్చి మార్చి చూస్తుంది. తర్వాత ఒక మూడో తరగతి కుర్రాడు ప్రపంచపటంలో అతి చిన్నదేశం ఎక్కడుందో వెతికినంత నెమ్మదిగా తన వేళ్లను కీబోర్డు మీద ఆడిస్తుంది.


మేడం మళ్ళీ మిశ్రాగారిని కేకెస్తుంది సహాయార్థం! 

*మిశ్రా గారూ ఈ F5 ఎక్కడుందండీ?*


మేడం గారి వయసు యాభై పైనే కావడం వల్ల ఆమె సీటు దగ్గరకొచ్చి ఆమెకు సహాయం చేసే కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా అక్కడే ఉండీ మిశ్రాగారు ఇలా చెబుతారు. 


"కీబోర్డు మీద పై భాగంలో చూడండి మేడం"


"కానీ పైభాగంలో కేవలం మూడు లైట్లు మాత్రమే ఉన్నాయండీ"


"కదా...ఆ లైట్ల కింద ఒక పెద్ద వరస ఉంటుంది చూడండి. F1 మొదలుకొని F12 వరకు"


అలా మేడంకు ఎట్టకేలకు కీబోర్డులో F5 ఎక్కడుందో తెలిసిపోతుంది. మేడం ఆలస్యం లేకుండా ఆ కీ నొక్కుతుంది. అరగంట వరకు మానిటర్ మీద శివుడి ఢమరుకం కిందా మీదా తిరుగుతూ ఉంటుంది


*చివరకు ఇలా మెసేజ్ వస్తుంది*

*"Session expired. Please check your connection.."*


మేడం తన ఆయుధాన్ని విసిరేసి, మీ దీన వదనాన్ని చూసి ఇలా చెబుతుంది

"సారీ సర్వర్ లో ఏదో సమస్య ఉంది"


ఆ చెప్పే టోన్ అచ్చు పాత సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్‌ థియేటర్ బైటకు వచ్చి " సారీ మేము ఎంత ప్రయత్నించినా గుమ్మడి గారిని బ్రతికించలేక పోయాం" అని ఎలా చెబుతారో అలా ఉంటుంది ! 😋😂😆😉😁


#Courtesy #WhatsApp

పశ్యన్ జన్మాని సూర్యః

 పశ్యన్ జన్మాని సూర్యః అని మహా సౌరంలోగల అరుణ మంత్రం తెలుపుచున్నది. దీనికి మూలం అణువు సప్త వ్యాహృతమై సప్త సంఖ్యకు మూలమైన సంఖ్య 7 వ్యాహృతులు 79°E అక్షాంశము వద్ద గల కాశ్మక్ జీవ తత్వమైన శివ/విష్ణు రూపమైన మార్పు చెందిన శక్తియే. అది సూర్యశక్తిని ప్రధానము చేసుకొని యీ అక్షాంశం వద్ద శక్తని కలిగియున్నదని మహర్షులుఆచరణలో భౌతికంగా ఆలయాల రూపంలో తెలిపారు. దానిని విలక్షణమైన పదార్ధ రూపంలో యనగా మార్పు చెందుతూ శక్తిని భద్రపరచి యున్న పదార్ధ తత్వంగా తెలియును. దానిని గ్రహించుటకై యనగా పశ్యతి దర్శించుటకు బాహ్య/ అంతర్ముఖం గా సూత్రము జీవుడని నిర్వచనం. జీవుని తత్వమును యింత స్పష్టంగా సూర్య శక్తిని తెలుపుచున్నది. అగ్నీశ్ఛ జాత వేదాః. అగ్ని తత్వము ఈశ్వర తత్వము  వేదమని. వేదమనగా  విశిష్ట తత్వమును సమ్యక్ దృష్టితో తెలుపు సూత్రము. నిశిత పరిశీలన వేదమని తెలుపుచున్నది. అది చూచుటయను ప్రక్రియ ఆఖరి వంతు సూక్మంగా పరమాణు రూపముగా తెలియుటయనే లక్షణము. అదియును స్వల్పమే. అనంతమైన శక్తిని  స్వల్పంగా సూక్షమంగా రూప పరిమాణముగా మాత్రమే లక్షణ,రంగు, రూప రస, ప్రకారముగా తెలియుచున్నది. అది జీవ తత్వం.అణు శక్తియే సూర్య పరమైన జీవ శక్తి. మనకు ఏమీ తెలియనప్పుడు శరణాగతి మాత్రమే.శరణాగతికి మూల తత్వము ఎవరో వారిని, అదియును ఙ్ఞానముద్వారా  తెలియుట కొరకు  మాత్రమే. సంహిత, సంహితము పూర్ణ తత్వ ఙ్ఞానమును క్రమ పద్ధతిలో తెలుపుటకు సూత్రము. సర్వు లలో యున్న పూర్ణమైన హితమైన తత్వము. అనగా మూల తత్వం. సత్ హితము  సహితము లో ౦ పూర్ణము లేదు. సంహితము పూర్ణమై యున్నది యని తెలియుట ఙ్ఞానము. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కొవ్వు గురించి విశేషాలు - 2

 శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు - 2 . 


 *  కొవ్వు శరీరం యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది  

 

 *  కొవ్వులో రెండు రకాలు ఉన్నాయి. 


       *  శాచురేటేడ్ ఫాట్ 

       

       *  అన్ శాచురేటెడ్ ఫాట్ . 


 *  శాచురేటెడ్ ఫాట్ సాధారణముగా రూము ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిపోతుంది  . ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ జంతుసంబంధ ఆహారంలో ఉంటాయి. మాంసం , చికెన్ , పాలు , వెన్న , గుడ్లు మొదలైన వాటిలో కొబ్బరినూనె , పామాయిల్ వంటి వృక్ష సంబంధ ఆహారంలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. 


 * అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టకుండా ద్రవస్థితిలోనే ఉంటుంది. ఇది ఎక్కువుగా వృక్షసంబంధ ఆహారంలో లభించును. వేరుశెనగ నూనె , నువ్వులనూనె , ఆలివ్ ఆయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , సోయాబిన్ ఆయిల్ మొదలయిన వాటిలో ఉండును. 


 *  మనం తిన్న ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే వాటిని కాలేయం కొలెస్ట్రాల్ కింద మార్చును . 


 *  ఆహారంలో మీరెంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంత ఎక్కువుగా మీ రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగి గుండెకి రక్తాన్ని తీసుకొనివెళ్లే కరొనరీ ధమనుల లోపలి గోడల మీద నిలువ అవుతాయి. అప్పుడు ధమని ఇరుకుగా అయ్యి గుండెజబ్బులకు , గుండెపోటుకు దారి తీయును . 


 *  కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే మైనంలా తెల్లగా ఉండే కొవ్వులాంటి పదార్థం . 


 *  శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఎంతో ఉంటుంది . కొలెస్ట్రాల్ అడ్రెనాల్ గ్రంధులలోను , పురుషుల వృషణాలలోను , స్త్రీల అండాశయాలలోను నిలువ అయ్యి "steroid harmons " కింద మార్పు చెందటానికి ఉపకరించును. 


 *  కొలెస్ట్రాల్ పిత్తరసం ( bile ) తయారీకి ఉపయోగపడును. ఆహారం జీర్ణం అవ్వడానికి ముఖ్యముగా ఆహారంలో కొవ్వు పదార్ధాలు జీర్ణం అవ్వడానికి పిత్తరసం ( Bile ) అవసరం ఉండును. 


 *  కొవ్వు నరాల చుట్టూ ఇన్సులేషన్ లా ఉపయోగపడటమే కాకుండా శరీరపు మిగతా అవసరాలకు ఉపయోగపడును. 


 *  30 సంవత్సరాల లోపు మనిషిలో కోలెస్ట్రాల్ 

150 m/g  dl లోపల ఉండాలి . 


 *  30 సంవత్సరాల పైన ఉన్న మనిషిలో కొలెస్ట్రాల్ 

 180 m/g dl లోపల ఉండవలెను . 


 *  ఏ వ్యక్తిలో నైనా కోలెస్ట్రాల్ 200 m/g dl మించి ఉండరాదు. 


                             సమాప్తం 


     పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వాయిదా..ఉపసంహరణ..*


2007వ సంవత్సరం డిసెంబర్ నెల లో నాపై నా ఋణదాతలు వేసిన ఒకానొక కేసు నిమిత్తం విశాఖపట్నం లోని కోర్టుకు హాజరు కావాల్సివున్నది...రేపుదయం వాయిదా అనగా విశాఖపట్నం లోని మా లాయర్..ముందురోజు మధ్యాహ్నం ఫోన్ చేసి..నన్ను తప్పకుండా హాజరు కమ్మని చెప్పివున్నారు..ఆ ఫోన్ వచ్చే సమయానికి నేను మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం లో వున్నాను..ఇంకొక వాయిదా..అదికూడా మరో నెలరోజులపాటు ఏమైనా తీసుకునే అవకాశం వున్నదా అని లాయర్ గారిని అడిగాను..ఒక నెల వాయిదా దొరికితే..వాళ్లకు కొంత నగదు జమ చేయొచ్చు అని నా ఆలోచన.. కానీ..ఆయన..కుదరదు అని తేల్చిచెప్పారు..పైగా హాజరు కాకపోతే..జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారేమో అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చారు..ఇక చేసేదేమీ లేదు..విశాఖపట్నం వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని.."స్వామీ! నీదే భారం!.." అని మనసులో గట్టిగా అనుకొని వచ్చేసాను..


ఆరోజు రాత్రే విశాఖపట్నం కు రైలులో బయలుదేరి..మరుసటిరోజు ఉదయానికి చేరుకున్నాను..ఉదయం 10 గంటల కల్లా కోర్టు ఆవరణకు చేరి..మా లాయర్ గారిని కలిశాను.."ఈరోజు వాయిదా అడగాలని అనుకున్నాను కానీ..కుదరదండీ..జడ్జి గారు ఇటువంటి కేసులకు వాయిదాలు ఇవ్వటం లేదు..త్వరగా ముగించేయాలని చూస్తున్నారు.." అన్నారు..సరే..కానివ్వండి..జరిగేది జరుగుతుంది అని మాత్రం అన్నాను..


మరొక్కసారి శ్రీ స్వామివారి కి మనసులోనే నమస్కారం చేసుకొని ఓ ప్రక్కగా కూర్చున్నాను..ఎటువంటి ఆలంబన లేని పరిస్థితి లో ఆ దైవమే మనకు తోడుగా ఉంటాడు..కాకుంటే..మనం సర్వస్య శరణాగతి చెందాలి..ఆరోజు నేనున్న స్థితి లో నేను శ్రీ స్వామివారిని వేడుకోవడం తప్ప మరో మార్గం కనుపించలేదు..


మామూలుగా కోర్టు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది..నా వంతు కోసం ఎదురు చూస్తున్నాను..పదకొండు గంటలు గడిచినా కోర్టు లో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు..విచారిస్తే..ఇంకా జడ్జి గారు రాలేదు..అన్నారు..మరి కొద్దిసేపటికే.."12 గంటల తరువాత అత్యవసర కేస్ లు మాత్రం విచారిస్తారు..మిగిలినవన్నీ వాయిదా వేయమన్నారు.." అని జడ్జి గారి దగ్గరుండే గుమాస్తా గారు చెప్పారు..నా తాలూకు కేస్ ను అత్యవసర జాబితా లోనే ఉంచారు కనుక..నేను కోర్టు లోనే ఉండిపోయాను..సరిగ్గా ఒంటిగంటకు జడ్జి గారు వచ్చారు..వరుస క్రమంలో పిలుస్తారు కనుక..నా వంతు వచ్చేసరికి..మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందని చెప్పారు..భోజనం చేసి తిరిగి కోర్టు వద్దకు వచ్చాను..


మూడు గంటలకు నా కేస్ విచారిస్తారని ఎదురుచూస్తూ వున్నాను..మూడున్నర అయింది..నాలుగయింది..జడ్జి గారు వేరే కేసుల విచారణ లో వున్నారు కానీ..నన్ను మాత్రం పిలవలేదు..కోర్టు లోనే వేచి చూస్తూ వున్నాను..సాయంత్రం 5.30 గంటలకు కూడా నా కేసు విచారణ కు రాలేదు..జడ్జి గారు బెంచ్ దిగి వెళ్లి పోయారు..ఏమీ అర్ధం కాలేదు..గుమాస్తా వద్దకు వెళ్లి..మధ్యాహ్నం నుంచీ వేచి ఉన్నాననీ.. కేస్ పిలువలేదనీ..కారణం చెప్పమని అడిగాను..నన్ను అక్కడే వుండమని చెప్పి..జడ్జి గారి దగ్గరకు వెళ్లి కనుక్కుని వస్తాను..అన్నారు..ఇంకొక ఐదు నిమిషాల్లో..జడ్జి గారు నన్ను తన చాంబర్ కు రమ్మన్నారని చెప్పారు..వెళ్ళాను..


జడ్జి గారికి నమస్కారం చేసి..నిలబడ్డాను.."ఈరోజు మీ కేస్ తీసుకోలేదు.." అంటూ..ప్రక్కనే ఉన్న కేలండర్ చూసి..మళ్లీ మార్చి నెలకు వాయిదా వేస్తున్నాను..అప్పుడు విచారణ చేస్తాను.." అని చెప్పి..వాయిదా వేసేశారు..నేను నెల వాయిదా దొరికితే చాలు అనుకున్నాను..కానీ..ఏకంగా మూడు నెలలు ఇచ్చారు..నమస్కారం పెట్టి ఇవతలికి వచ్చేసాను..


అక్కడితో శ్రీ స్వామివారి లీల అయిపోలేదు..కోర్టు నుంచి బైటకు రాగానే..అనుకోని సంఘటన ఒకటి జరిగింది..


కోర్టు బైట నాకోసం..నా మీద కేస్ వేసిన కంపెనీ ప్రతినిధులు..వాళ్ళ లాయర్ గారూ..మా లాయర్ గారూ అందరూ వేచి చూస్తున్నారు..


మా లాయర్ గారు.."ప్రసాద్ గారూ మీతో మాట్లాడి కేస్ ఇంతటితో ముగిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు..మీరొక మాట చెపితే..."అన్నారు..


ఇప్పటికిప్పుడు డబ్బు కట్టాలంటే...కష్టం కదా..అన్నాను..ఈసారి కంపెనీ ప్రతినిధే నేరుగా మాట్లాడాడు.."మనం స్థిమితంగా కూర్చొని మాట్లాడుకుందాము..మీకూ ఇబ్బంది లేకుండా..మాకూ ఇబ్బంది లేకుండా ఒక పరిష్కారం చూసుకుందామండీ.." అన్నాడు..నేనూ సరే అన్నాను..కొద్దిసేపటిలోనే ఒక అంగీకారానికి వచ్చాము..నేను ఇవ్వగలిగింది స్పష్టంగా చెప్పాను..అదికూడా ఒక నెల లోపు చెల్లిస్తానని చెప్పాను..వాళ్ళూ ఒప్పుకున్నారు..కేసు ఉపసంహరణ కు కావాల్సిన సంతకాలు కూడా పూర్తి అయ్యాయి..అంతా ఒక గంటన్నర లోపలే జరిగింది..


నాకు ప్రతి నిమిషం నా వెనుక శ్రీ స్వామివారు నిలబడే ఉన్నట్లు అనిపిస్తోంది..లేకపోతే కేసులో ఇరుక్కుని..కోర్టుకు లాగబడ్డ నాకు..ఏమాత్రం శ్రమ లేకుండా కేసు తొలగిపోవడం నా తో సాధ్యమయ్యే పనేనా?..కేవలం ఆ దత్తుడి కృపే కారణం..ప్రక్కరోజు ఆ కేసు మూసివేయడం కూడా చక చకా జరిగింది..


వాయిదా దొరికితే చాలు అని అనుకున్న నాకు..అసలు కేసు కు  హాజరే కాకుండా పూర్తి స్థాయి మినహాయింపు దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).