పెరటి గడప పేద ముతైదువు..!
ఓం నమః శివాయ..!!🙏
ఇంటి వెనక పెరటి గుమ్మాన్ని పేద ముత్తైదువు అంటారు...
ఎందుకంటే అందరూ ముందర గుమ్మానికి
బాగా అలంకరిస్తారు పూజ చేస్తారు కానీ
వెనుక గుమ్మానికి పెద్దగా పట్టించుకోరు...
లక్ష్మీ దేవి ముందు గడప నుండి వస్తుంది,
జేష్ఠ దేవి ఎట్టి పరిస్థితుల్లో ముందు గడపలో
అడుగు పెట్టదు..
వెనక గుమ్మంలో నుండి వస్తుంది..
ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటంవల్ల ధనము వస్తుంది
వచ్చిన ధనము వెంటనే నిలవకుండా పోతూ ఉంటుంది, నగలు వస్తుంటాయి
తాకట్టులోకి పోతుంటాయి
జేష్ఠ దేవి ఆవిడ ప్రతాపం చూపిస్తుంటుంది..
వెనక గుమ్మం నుండి జేష్ఠ దేవిని రాకుండా
అడ్డుపడగల శక్తి పెరటి గుమ్మానికి ఉంది..
అందుకే కాస్త పసుపుకుంకుమ వెనుక గుమ్మానికి
కూడా పెడితే లక్ష్మీ దేవి వచ్చే సమయానికి..
జేష్ఠదేవిని వెనక గుమ్మానికి రాకుండా అడ్డుపడి
ఈ ఇంటి ఇల్లాలు నాకు పసుపు కుంకుమ ఇచ్చింది
కనుక నేను నిన్ను ఈ ఇంట రానివ్వను..
అని అడ్డు పడుతుంది...
ఎవరైనా పెరటి గుమ్మానికి కాస్త పసుపు కుంకుమ
కూడా పెట్టకుండా పట్టించుకోకుండా వదిలేస్తారో..
వారి ఇంట్లోకి కూడా జేష్ఠదేవి వస్తున్నప్పుడు
పెరటి గుమ్మం పట్టించుకోదు ఆహ్వానిస్తుంది..
అందుకే ముందర సింహ ద్వారాన్ని ఎంతగా అలంకరిస్తారో..పెరటి గుమ్మానికి కూడా
అంత మర్యాద చేయాలి.
కనీసం పసుపు కుంకుమ అయినా పెట్టాలి...
అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ ఇల్లు కావడం వల్ల
చాలా మందికి పెరటి గుమ్మలూ ఉండటం లేదు...
అలాంటి వారికి ఒక ఉపాయం ఉంది..
వారు గుమ్మానికి దగ్గరగా కానీ బోల్కనీ లో కానీ
తులసి మొక్కను పెట్టి పూజ చేయలి ,
పెరటి గుమ్మం పూజ కూడా నీకే చేస్తున్నాము తల్లి
అని తులసికి మొక్కినా సరిపోతుంది...
పెరటి గుమ్మానికి ఉన్న శక్తి విలువ తెలుసుకుని.. మర్చిపోకుండా అంత పసుపు కుంకుమ పూలు పెట్టండి..
మంచి ఫలితాలు పొందండి..!!
ఓం నమః శివాయ..!!🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!!🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి