#స్టేట్_బ్యాంకు_కధ
మానవ జన్మలో మనిషి చేసిన *పాపాలకు ప్రాయశ్చిత్తం* గా దాన ధర్మాలు చెయ్యడం ఒక్కటే మార్గం కాదు.
*స్టేట్ బ్యాంకులో ఖాతా తెరచి* కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు!
చిన్నా చితకా పాపాలయితే *బాలెన్స్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తే చాలు*
నాలుగు కౌంటర్ల వద్ద కుమ్ములాటలు, తోపులాటలయ్యాక తెలిసే విషయం ఏమంటే *బ్యాలెన్సు కేవలం గుప్తా మేడం గారు మాత్రమే చెప్తారని*
అయితే *గుప్తా మేడం గారి కౌంటర్ ఏదో* తెలుసుకోవడానికి *మళ్లీ ఇంకో కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది*
*ఇక్కడితో లెవెల్- 1 పూర్తయ్యింది* అంటే *మనకు గుప్తామేడం కౌంటర్ ఏదో తెలిసింది*. కానీ కొంచం వేచి ఉండాలి, ఎందుకంటే *ప్రస్తుతం మేడం సీట్లో లేరు*
అరగంట తర్వాత కళ్లజోడు పెట్టుకొని, పైట సవరించుకొంటూ *BSNL వారి 2G సేవలంత వేగంగా* నడుస్తూ గుప్తా మేడం సీట్లో విలాసంగా ఆసీనులౌతారు. మీరేమో మీ అకౌంటు నంబరు చెప్పి ఆవిడను బ్యాలెన్స్ చెప్పవలసిందిగా అభ్యర్థిస్తారు.
మొదట *మేడం గారు మిమ్మల్నెంత కోపంగా చూస్తారంటే, మీరేదో ఆవిడ కూతుర్ని మీకిచ్చి పెళ్లి చెయ్యమని అభ్యర్థించినంత* నీచపు చూపొకటి మీమీదకు విసిరేస్తారు.
మీరు కూడా *సునామీ వచ్చి మీ సర్వస్వం లాక్కెళితే ఎంత బీదగా మారిపోతారో అలాటి నిస్సహాయమైన ఫేసు పెడతారు.*
గుప్తా మేడం కు అప్పుడు మీ దీనవదనం చూసి మీ మీద జాలికలిగి, *మీకు మీ బ్యాలెన్సును వెల్లడించే మహత్తరకార్యక్రమాన్ని మొదలెడతారు*
కానీ ఈ భారీ కార్యక్రమాన్ని ఒంటరి అబల ఎలా నిర్వహించగలరు? అందుకే ఆవిడ సహాయం కొరకు ఇలా కేకేస్తారు
*"మిశ్రా గారూ, ఈబ్యాలెన్సు తెలుసుకోవడమెలా?"*
మిశ్రా గారు ఈ *అబల ఆర్తనాదాన్ని విని తనఅపురూపమేధోసంపత్తిని ప్రదర్శించడానికితనఙాన ఖజానాను తెరుస్తారు*
మొదట్లో ఖాతాలోకి వెళ్లి క్లోజింగు బ్యాలెన్సు మీద క్లిక్ చేస్తే బ్యాలెన్సు వచ్చేది. కానీ ఇప్పుడు సిస్టం ఛేంజ్ అయింది. ఇప్పుడు *F5* నొక్కి, ఎంటర్ కొడితే బ్యాలెన్స వచ్చేస్తుంది.
గుప్తా మేడం అద్దాలు సవరించుకొంటూ, *మూడు సార్లు మానిటర్ వంకా, మూడు సార్లు కీబోర్డు వంకా మార్చి మార్చి చూస్తుంది. తర్వాత ఒక మూడో తరగతి కుర్రాడు ప్రపంచపటంలో అతి చిన్నదేశం ఎక్కడుందో వెతికినంత నెమ్మదిగా తన వేళ్లను కీబోర్డు మీద ఆడిస్తుంది.
మేడం మళ్ళీ మిశ్రాగారిని కేకెస్తుంది సహాయార్థం!
*మిశ్రా గారూ ఈ F5 ఎక్కడుందండీ?*
మేడం గారి వయసు యాభై పైనే కావడం వల్ల ఆమె సీటు దగ్గరకొచ్చి ఆమెకు సహాయం చేసే కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా అక్కడే ఉండీ మిశ్రాగారు ఇలా చెబుతారు.
"కీబోర్డు మీద పై భాగంలో చూడండి మేడం"
"కానీ పైభాగంలో కేవలం మూడు లైట్లు మాత్రమే ఉన్నాయండీ"
"కదా...ఆ లైట్ల కింద ఒక పెద్ద వరస ఉంటుంది చూడండి. F1 మొదలుకొని F12 వరకు"
అలా మేడంకు ఎట్టకేలకు కీబోర్డులో F5 ఎక్కడుందో తెలిసిపోతుంది. మేడం ఆలస్యం లేకుండా ఆ కీ నొక్కుతుంది. అరగంట వరకు మానిటర్ మీద శివుడి ఢమరుకం కిందా మీదా తిరుగుతూ ఉంటుంది
*చివరకు ఇలా మెసేజ్ వస్తుంది*
*"Session expired. Please check your connection.."*
మేడం తన ఆయుధాన్ని విసిరేసి, మీ దీన వదనాన్ని చూసి ఇలా చెబుతుంది
"సారీ సర్వర్ లో ఏదో సమస్య ఉంది"
ఆ చెప్పే టోన్ అచ్చు పాత సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్ థియేటర్ బైటకు వచ్చి " సారీ మేము ఎంత ప్రయత్నించినా గుమ్మడి గారిని బ్రతికించలేక పోయాం" అని ఎలా చెబుతారో అలా ఉంటుంది ! 😋😂😆😉😁
#Courtesy #WhatsApp
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి