13, ఫిబ్రవరి 2022, ఆదివారం

సహస్ర పరమా దేవీ

 శ్లోకం:☝️

    *సహస్ర పరమా దేవీ*

 *శతమూలా శతాంకురా l*

   *సర్వగం హరతుమే పాపం*

 *దూర్వా దుస్వప్న నాశినీ ll*


భావం: శ్రుతి గరికను _దేవి_ అని ప్రస్తావించింది. ఇది దుస్వప్నాలను నివారిస్తుంది. స్వప్నతుల్యమైన జగత్తులో అజ్ఞాన ప్రేరిత స్వప్నస్థితి నుండి మెళకువను (జాగృతి) అభిలషిస్తూ కేవలం నిరాకార నిర్గుణ సద్గుణ తత్త్వబోధకై గణపతి పూజలో ఋషులు గరికను విధించారని శాస్త్ర వచనం.🙏

జీవిత పరమార్ధం

*🧘‍♂️దైవాంశ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


*ప్రతి మానవుడిలో కూడా దైవాంశ ఉంటుంది. అయితే దానినెవరూ గమనించరు. అలా గమనించకపోయినా ఆ దైవత్వ మాహాత్మ్యం అలాగే ఉంటుంది.*


*తన ఇంద్రియాలకి వశుడై, మానవుడు ఆ దైవాంశని తాత్కాలికంగా మరిచిపోయినా, ఒక అదృష్ట సమయంలో ఆ దైవాంశ తట్టి లేపిన మరుక్షణం అతనికి జ్ఞానోదయమై, మరుగున పడ్డ తన ఆత్మశక్తిని గ్రహించగల్గుతాడు.*


*తనలో ఉన్న దైవత్వం గురించిన జ్ఞానం కోల్పోవడంతో మానవుడికి తన విలువ తెలియడం లేదు. అందుకని తనలో ఉన్న ఆధ్యాత్మికత గురించి తెలుసు కోకుండా ఇతరుల అభిప్రాయాల కోసం ప్రాకులాడు తున్నాడు.*


🕉️🌞🌏🌙🌟🚩🙏🌹🕉️


_*🧘‍♂️సంతోషం అంటే🧘‍♀️*_

🕉️🌞🌏🌙🌟🚩


*_మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు,     పిల్లలు కావాలను కొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే..!_*


*_ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు..._*


*_ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి..._*


*_కానీ..._*

*_డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగు చేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు..._*


*_అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు..._*


*_అందంగా ఉంటే సంతోషం ఉంటుందా ? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి..._*


*_సకల విద్యలనూ ఆపోసన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు..._*


*_కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం..._*


*_పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం.  కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. దానికి ఒక ఉనికి లేదు..._*


*_ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని.._*


*_పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు.._*


*_ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి.._*


*_మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు._*


*_నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదన కోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి..._*


*_అంతర్యామితో అనుసంధానం కావాలి. అదే చిట్టచివరి సంతోషానికి చిరునామా..._*


*_ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం._*


*_🧘‍♂️ఇదే జీవిత పరమార్ధం..🧘‍♀️!_*


🕉️🌞🌏🌙🌟🚩🙏🌹🕉️

ప్రశ్న పత్రం సంఖ్య: 35

 ప్రశ్న పత్రం సంఖ్య: 35 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

మిత్రులారా ఇక్కడ మనం చాలా కాలం తరువాత కలుసుకుంటున్నాం. క్రింద ఇచ్చిన సరదా ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి. ( ఈ ప్రశ్నలు ఎవరిని బాధించటానికి వ్రాసినవి కావు కేవలం సరదాగా మాత్రమే తీసుకోండి) 

1) ఇంట్లో ఈగల మోత వీధిలో 

i ) విమానాల మోత  ii ) విసనకర్రల మోత iii )పల్లకీల మోత iv ) కార్ల మోత 

2) ఏదయినా కార్యక్రమం చేయించేటప్పుడు బ్రాహ్మడికి వీపు దురద పుడితే దీనితో గోక్కుంటారు. 

i ) దర్భలతో   ii ) ఉద్దరాణితో  iii ) జంద్యంతో  iv ) పీటతో 

3) తిన తిండిలేదు మీసాలకు 

i ) వేప నూనె   ii ) సంపెంగి నూనె iii )పల్లి నూనె iv ) ఆవ నూనె 

4) బ్రాహ్మణ ఇంటిలోకి దొంగలు రాకుండా ఇది కాపాడుతుందని అనుకునే వారు. 

i ) చింపిరి పుల్ల   ii ) ప్రక్క వారింటిలోని కుక్క పిల్ల iii ) తిని పారేసిన విస్తరాకు iv ) దండెం మీది మడిబట్ట 

5)వింటే భరతం వినాలి తింటే 

i ) గారెలే తినాలి   ii ) మిర్చి బజ్జిలే తినాలి iii ) శనగలు తినాలి iv ) పరమాన్నం తినాలి 

6) తాడి తన్నేవాడుంటే వాడి .

i ) కాళ్ళు తన్నే వాడుంటాడు   ii ) చెయ్యి తన్నే వాడుంటాడు iii ) ముక్కు తన్నే వాడుంటాడు iv ) తల తన్నే వాడు ఉంటాడు

7) ధోవతి ఇంకొక పేరు

 i ) పైజామా    ii ) పంచ  iii ) దుప్పటి  iv ) రుమాలు 

8) రామాయణ మహా భారతాలను ఇలా కూడా అంటారు

i ) ఇతిహాసాలు   ii ) పరి హాసాలు iii ) హాసాలు  iv ) నవ హాసాలు 

9) పూర్వం టేపు రేకార్ధరు రాక ముందు వినటానికి దీనిని పాటలు ఉపయోగించే వారు

i ) సెల్ ఫోను,   ii ) గ్రామఫోను  iii ) ల్యాండ్ ఫోను iv ) పెన్ డ్రైవ్ 

10) నోరు మంచిదయితే

i ) చెరువు మంచిదైతుంది   ii ) కారు మంచిదైతుంది iii ) ఊరు మంచిదవుతుంది iv ) పేరు మంచిదవుతుంది. 

11) పూర్వం మన దేశంలో స్త్రీ పురుషులు ఒకే రకమైన వస్త్రాన్ని ధరించే వారు అది

i ) కొక    ii ) పైజామా  iii ) పంజాబీ డ్రస్సు iv ) రుమాలు 

12) పూర్వము పిండి చేయటానికి ఈ సాధనం వాడే వారు

i )అట్లకాడ    ii ) మూకుడు iii ) విసుర రాయి iv ) పాట కారు 

13) అనువుకాని చోట ఇలా అనరాదు 

i ) ధనవంతుడ    ii ) అధికుల  iii ) జమిందార్  iv ) రాజు 

14) ఉట్టి కెక్కలేనమ్మా

i ) కొండ ఎక్కినట్లు   ii ) స్వర్గానికి ఎక్కినట్లు iii ) గోల్కొండ ఎక్కినట్లు iv ) నిచ్చెన ఎక్కినట్లు 

15) ఈ రోజుల్లో సాధారణంగా ప్రతివారి ఇంట్లో ఇది ఉంటుంది

i ) కుంపటి   ii ) గ్యాసు స్టౌవు iii ) పొట్టుపొయ్యి iv ) కట్టెల పొయ్యి 

16) అన్నిదానముల కన్నా

i ) పెన్ను దానము మిన్న   ii ) సున్నం దానం మిన్న iii ) భూదానం మిన్న iv ) అన్నదానము మిన్న 

17) ఉపనయనం ఐన బ్రాహ్మలు విధిగా ఇది పట్టాలి

i ) చీపురు    ii ) ఔపోసన  iii ) శనగలు  iv ) రోకలి 

18) అమృత మస్తు అని బ్రాహ్మలు ఎప్పుడు అంటారు

i ) తినే ముందు   ii ) త్రాగే ముందు iii ) వాగే ముందు iv ) వాదులాడే ముందు 

19) చెరపకురా 

i ) పడవు   ii ) చేడేవు  iii ) కడిగేవు  iv ) అడిగేవు 

20)

మనం లక్ష్మి పూజ చేయాలంటే ముందుగా ఈ పూజ చేయాలి

i ) రాముని పూజ   ii ) సీతాదేవి పూజ  iii ) గణపతి పూజ iv ) నైవేద్యం పూజ