10, ఆగస్టు 2024, శనివారం

ఉద్దండ కవితా విన్యాసము -2

 



ఉద్దండ కవితా విన్యాసము -2


                    కొందరు పుట్టుకవులుంటారు. మరికొందరు పెట్టుకవులుంటారు. పుట్టుకవులలో  ప్రఖ్యాతిగన్న మహాకవి  వేముల వాడ భీమ కవి! దక్షారామ భీమేశ నందనుడైన  యీకవి  'ఉద్దండ కవితా వేశము కలవాడు. గద్దరించి బెదరించి శాపదిగ్ధమైన  కవితలతో  నాటిప్రభువుల భరతమును బట్టి  తనజీవనమును  మహోజ్వలముగా  గడపిన మహనీయుడు. 


                           భీమ కవి సంచార శీలుడు. అతడొక మారు కళింగ చొక్కరాజు  యాస్థానమునకేగినాడు. ఆప్రభువు  వేశ్యాలంపటుడు. భీమకవి యొచ్చువేళకతడు  రాజోద్యాన వనమున  వేశ్యా సమేతుడై  విహరింుసాగెను. ద్వారపాలకుడు  భీమకవి యరుదెంచిన విషయమును విన్నవింపగా  పొగరుబోతుతనమున  ఇక్కడికేరమ్మని కబురంపెను. భీమకవి యరుదెంచి వాని వాలకమునుగాంచి  తలవంచి నమస్కరించెను. 


                                        " భీమకవీ ! నీగురించి చాలవిన్నాము. నీ టక్కుటమారములు మా*కడ సాగవు. నీవెదియన్న నది జరుగునా?  ఓహో! అటులైన  యీపందిరి గుంజను  మహావృక్షముగావింపుమని "--పల్కెను. ఆసమయమున చొక్కరాజుకాలు మల్లెపందిరి గుంజకానుకుని

యుండెను. భీమకవి  గంభీరముగా  గళమెత్తి--


                      "శా:  "  ఆనీతాభ్యుపదాన శృంఖల  పదాభ్యాలంబిత  స్తంభమా!


                                  నేనే వేములవాడ  భీమకవినేనిం  జిత్రకూటంబులో


                                 భూనవ్యాపృత  పల్లవోప లతికా  పుష్పోప గుఛ్ఛంబులన్


                                 నానా పక్వ ఫల  ప్రదాయి వగుమా !  నాకల్ప వృక్షాకృతిన్."---- అనిపద్యం చెప్పాడు.  అంతే  ఆపందిరి గుంజ కాస్తా మహా వృక్షమైపోయింది.  రాజుగారికాలు  ఆచెట్టులో యిరుక్కుపోయింది. దెబ్బతో భీమకవి  మహిమెంతో ఆరాజుకు  తెలిసింది.

"మహాకవీ నాతప్పు మన్నించు. మళ్ళీ వృక్షాన్నిపందిరికి గుంజగాజేసి  నన్నుకాపాడమని " ప్రార్ధించాడు. కవి కరుణాళుడై. చొక్కరాజా!

కవుల నెన్నడు నవమానింపకుము. బుధ్ధిగలిగిప్రవర్తింపు మనుచు----


  

                ఉ: "  శంభువరప్రసాద  కవిసంఘ వరేణ్యుడ నైన  నావచో


                          గుంభన  మాలకించి  యనుకూలత నొంది  యనూన భావనన్


                          కుంభిని  జొక్కనామ  నృపకుంజరు  పందిటి  మల్లెసాలకున్


                           స్తంభమురీతి  నీతనువు  దాలిచి   యెప్పటియట్ల  నుండుమా! "--- అనేపద్యం  చెప్పాడు. వృక్షం పందిరి గుంజయిపోయింది.రాజుగారి  పాదానికి  విముక్తి లభించింది.


                                               భీమకవి  మహిమకు అక్కడివారందరూ  ఆశ్చర్యంలో  మునిగిపోయారు.


                                                                  ఇదండీ  భీమకవిగారి  ఉద్దండ కవిత్వం !🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Panchaag

 


మన బాధలెన్నో

 *సెవన్టీ ప్లస్  (70+) నాటౌట్*


నాకు ఆకుకూరలలో తేడా తెలియదు. ఆ విషయం అమ్మేవాడికి తెలియకూడదని గంభీరంగా మొహం పెట్టి అడుగుతా! “చుక్కకూర ఉందటోయ్?" అంటూ అటు ఇటు చూస్తూ.

అలా అడగ్గానే "మీముందే ఉంది కదండీ,  మీక్కావాల్సినన్ని తీసుకోండి అంటాడు."


అన్నీ ముందే ఉంటాయి కానీ క్యారంబోర్డుకి అటు ఇటు ఉన్నట్టు అమ్మేఅతను ఆ చివర నేను ఈచివర.  

తీసివ్వడానికి అతను ఇవతలకి రాడు, నేనేమో ఆ ఆకుకూరల గుట్టలో చుక్కకూర కనిపెట్టలేని అసమర్థుడిని.


పోనీ ధైర్యం చేసి ఏదో ఒకటి తీయగానే  "మీరు చుక్కకూర అడిగారుగా, తోటకూర తీస్తారే?" అంటాడు. 

"అబ్బె..తాజాగా అనిపిస్తేనూ... చూస్తున్నా! అని తడబడి తప్పించుకుంటా. 


సర్లే, ఈసారికి ఇది తోటకూర అని తెలిసిందిగా, తీసుకెళ్తే సరి , వచ్చేసారి చుక్కకూర సంగతి చూద్దాం! అనుకుని ఇంటికివెళ్తే 

"అదేమిటీ ! చుక్కకూర తెమ్మంటే తోటకూర తెచ్చారు?"


"తినాలనిపించి తెచ్చాలే!" అని నా సమర్థింపు.


అలాగే ఏ కూర ని ఎలా ఎన్నిక చేయాలో అన్న అంశం లో కూడా నేను అంతoత మాత్రమే!


ఉదాహరణకు బెండకాయలు చివర విరవాలిట! దానికి వాడు ఒప్పుకోడు.

సొరకాయ గుచ్చాలిట ... లేతదనం తెలియడం కోసం! నాకు గోళ్లు ఎప్పుడూ ఉండవు. ఒక రవ్వ పెరగ్గానే తీసేస్తూంటా! 


దొండ తెస్తే సగం పండిపోయుంటాయి అంటారు. దోస తెస్తే అబ్బా ... సగం చేదు లే! అన్ని తిట్లు.  ములక్కాడలు ముదుర్లని, మామిడికాయలు పుల్లగా లేవని విమర్శలకు గురవుతుంటా!


ధర్మా మీటర్! అదొక పితలాటకం!

ఎలా చూడాలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పాదరసం ఎక్కడుంటుందో నా ఈ సుదీర్ఘ జీవిత ప్రస్థానంలో ఇప్పటికీ తెలియదు. పైగా అందరూ నన్నే చూడమంటారు ... నా బుర్ర పాదరసం లా పనిచేస్తుందని వాళ్ళ అభిప్రాయంకాబోలు!


హోటల్స్ ,హాస్పిటల్స్ ఇలా చాలా చోట్ల డోర్స్ మీద పుష్, పుల్ ఈ రెండూ రాస్తారు కదా!

ఇక్కడే నేను Confuse అవుతా! ఖచ్చితంగా Pull  అన్న చోట తోస్తా, Push ఉన్నది లాగుతా! సరిగ్గా అప్పుడే ఎవరో రావడం, ఆ డోర్ తగలడం, వాళ్లు చూపుల్తోనే నన్ను అసహ్యించుకోవడం సర్వసాధారణం!


నేను బి.యస్. సి మాథ్స్. కాని కొన్ని లెక్కలు అయితే బొత్తిగా సున్నా!

మీ టీవీ ఎన్ని అంగుళాలు అంటాడు ఒకడు, ఫ్రిడ్జ్ ఎన్ని లీటర్లు అడుగుతాడు మరొకడు! ఎన్నో తెలిసి ఏడిస్తేగా! కాస్త టెక్నికల్  నాలెడ్జ్ ఉన్న మా క్రిష్ణా రావు లాంటి వాళ్లని తీసుకెళ్లి కొనుక్కున్నవి అవన్నీ! వాడుకోవడం తప్ప వివరాలేమీ నా బుర్రకెక్కవు!


ఇక సిలిండర్  లో గేస్ అయిందంటే భయం.

కొత్త సిలిండర్ సీల్  తీసే టెక్నిక్ ఏదో ఉంటుందట! మా ఆవిడకి ఏది రాకపోయినా ఇది మాత్రం మహాబాగా వచ్చు. ఠక్కున తీసేస్తుంది. నాకా కిటుకు చెప్పనేలేదు. పైగా బలవంతంగా తీస్తుంటే పేలిపోతుందేమోనని భయం, చెమటలు. 

నాదృష్టిలో సిలిండర్ నాకో గుదిబండ!


అలాగే సామెతలలో నా మటుకు నాకు కొన్ని మహా తికమకగాఉంటాయి.


ఉదాహరణకు 'అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరమా' లేక  'ఆది నిష్టూరం  కంటే   అంత్యనిష్టూరమా' ఏది మేలు?


అలాగే 'కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందా?' 'ఉన్న నాలుకకి వేస్తే కొండ నాలుక పోయిందా??'


'ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములా లేక రివర్సా' .. ఇలా సామెతల విషయంలో కూడా ముందు వెనకలవుతూ తప్పుచెప్పి అభాసుపాలయ్యా చాలాసార్లు !


కొత్తగా ఈ మధ్య  కట్టిన బాత్రూమ్ముల్లో స్టీల్ పంపులుంటాయి.

అవి ఏదో ఒకవైపు తిప్పాలి వేడి, చన్నీళ్లకు. నేనెప్పుడూ అటో ఇటో తిప్పగానే పైన ఉన్న  షవర్ లోంచి గబుక్కున వచ్చి బట్టలు తడిసిపోతాయి! తడిసిన బట్టలతో బయటకు వచ్చిన నన్ను చూసి మా ఎనిమిదేళ్ళ మనవడు అదేపనిగా నవ్వుతాడు!


ఒక్కోసారి సడెన్ గా వేడినీళ్లు పడి ఒళ్ళు మండిన సందర్భాలూ లేకపోలేదు. వెధవ టెక్నాలజి!


ఇక ఈప్రపంచంలో “ఆద్యంతాలు“ కనిపెట్టలేనిది ఒకటి ఉంది.


 అదే సెలో టేప్. మొదలు ఎక్కడుందో చివరెక్కడుందో తెలియదు!  కష్టపడి “మొదలు" అనుకుని పట్టుకుని కట్ చేసి అతికించి చూద్దును కదా! తర్వాత భాగం అప్పటికే అతుక్కుపోయి మళ్లీ మొదలు కనపడదు. మళ్లీ కుస్తీ!


చెప్పాలే గాని..ఇలా ఇంకా ఎన్నెన్నో....


నేనొక్కడినే రైతుబజార్ కి వెళితే ఆవిడ తీసుకు రావద్దు అన్న కూరలు, పండ్లు తెచ్చేస్తాను. తెమ్మని చెప్పినవి మరిచి పోతాను.


ఇలా కాదని లిస్ట్ రాసిస్తుంది. అది భద్రంగా జేబులోనే ఉంటుంది. అది ఉందనే విషయం గుర్తు ఉండదు!


స్కూటర్ మీద వెళ్ళి ఎన్నిసార్లు హెల్మెట్ మరిచి పోయానో?


ఇలా రాసుకుంటూ పోతే మరీ నా అప్రయోజకత్వాన్ని బహిరంగం చేసుకోవడమే అవుతుందేమో!!


*అయినా పైకి గొప్పగా "సెవెన్టీ + నాటౌట్! అని చెప్పుకుంటామే గానీ ... మన బాధలెన్నో?*😞

మహాభారతం

 * ఐదు లక్షల శ్లోకాలతో కూడిన మహాభారతం యొక్క సారాంశాన్ని కేవలం తొమ్మిది పంక్తులలో అర్థం చేసుకోండి:*


 మీరు హిందువు అయినా లేదా మరే ఇతర మతానికి చెందిన వారైనా..

 మీరు స్త్రీ అయినా, పురుషుడైనా..

 మీరు పేదవారైనా, ధనవంతులైనా,

 మీరు మీ దేశంలో ఉన్నా లేదా విదేశాలలో ఉన్నా, సంక్షిప్తంగా,

 మీరు మానవులైతే, దిగువ మహాభారతం నుండి విలువైన "9 ముత్యాలు" చదివి అర్థం చేసుకోండి:


 1. మీరు మీ పిల్లల అసమంజసమైన డిమాండ్లను & కోరికలను సమయానికి నియంత్రించకపోతే, మీరు జీవితంలో నిస్సహాయంగా ఉంటారు...

 **"కౌరవులు"**


 2. నువ్వు ఎంత బలవంతుడైనా అధర్మానికి మద్దతిస్తే నీ బలం, ఆయుధాలు, నైపుణ్యాలు, & దీవెనలు అన్నీ పనికిరాకుండా పోతాయి...

 **"కర్ణుడు"**


 3. మీ పిల్లలు తమ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసి సర్వనాశనానికి కారణమయ్యేలా ఆశావహులుగా మార్చకండి... 

**"అశ్వత్థామ"**


 4. అధర్మానికి లొంగిపోవాలని ఇలాంటి వాగ్దానాలు ఎప్పుడూ ఇవ్వకండి... **"భీష్మ పితామః"**


 5. సంపద, అధికారం, అధికార దుర్వినియోగం & తప్పు చేసేవారి మద్దతు అంతిమంగా సర్వనాశనానికి దారి తీస్తుంది...

 **"దుర్యోధనుడు"**


 6. అంధుడికి అధికార పగ్గాలు అప్పగించవద్దు, అంటే స్వార్థం, సంపద, అహంకారం, జ్ఞానం, అనుబంధం లేదా కామంచే అంధుడైన వ్యక్తి, అది వినాశనానికి దారి తీస్తుంది కాబట్టి... **"ధృతరాష్ట్రుడు"**


 7. జ్ఞానంతో పాటు జ్ఞానం ఉంటే, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు... **"అర్జునా"**


 8. మోసం మిమ్మల్ని అన్ని సమయాలలో అన్ని విషయాలలో విజయం వైపు నడిపించదు... 

**"శకుని"**


 9. మీరు నీతి, ధర్మం, & కర్తవ్యాన్ని విజయవంతంగా నిలబెడితే, ప్రపంచంలోని ఏ శక్తి కూడా మీకు హాని చేయదు...

**"యుధిష్ఠిర"**


 ఈ వ్యాసం ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, కాబట్టి దయచేసి ఎలాంటి మార్పులు లేకుండా షేర్ చేయండి. మీ అందరివాడు 


 *సర్వే జనా సుఖినో భవన్తు. *

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

బాధపడితే

 🚩మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు. మనం ఎప్పుడు బాధ పడతామా అని ఎదురు చూసే వాళ్ళు మరి కొందరు. మౌనంతో ఏబంధం లేక పోయినా మన ఆనందాన్ని తమదిగా భావించే వారు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు.

🟧ఆపదకు సంపద నచ్చదు. సంపదకి బంధం నచ్చదు. బంధానికి బాధ నచ్చదు. బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకి చావు నచ్చదు. కానీ అనుభవించాలి... *తప్పదు* అని *రాగో* అంటాడు. 

🟣మనుషులు మారిపోతారు అనుకోవటం అజ్ఞానం!ముసుగు తీసి నిజ స్వరూపం చూపిస్తారు అంతే. ఇది జీవిత సత్యం.

   🚩 *ధర్మో రక్షతి రక్షితః* 🚩

       *శుభోదయం*🙏🙏

   *🌜సత్యమేవ జయతే🌛*

సకలము తెలిసిన

 సీ

సకలము తెలిసిన సాక్షివి మాతవు

చెప్పెడిదేమింక చెవుల వినగ

పండిపోయినమేనుపై నాశయే లేదు 

వాంఛనుచూప నా వశము కాదు 

కన్నులజూసినకారణమర్థము

మాకు కానందున మర్మమేమొ

మనసుకెంతయుతోచమంత్రరహస్యమై

వెతుకు చున్నదికర్మ వేల్పు జేర!


తే.గీ.

ధర్మ మేదియులేదుగ తరచి చూడ 

కాసులకుబానిసలగుచుకష్టపడుచు 

భక్తి యనునది పోయెనె రక్తి మీద 

నాశచెందిమానవుడునిరాశ పొందె

కర్మ సిధ్ధాంతం

 కర్మ సిధ్ధాంతం అనేది నేను నమ్ముతాను నేను నమ్మను నేను నమ్మనిది అసలు ఉండదు ఉండలేదు ఉండబోదు అని ఆలోచించే అజ్ఞాన మూర్ఖత్వానికి పరాకాష్ట. 

       కనబడని ప్రాణవాయువు ద్వారా నీ గుండె గమనం అన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో ప్రాణం పోయాక ఏ ప్రాణ వాయువూ నీ గుండెని ఎలాగ కొట్టుకునేలా చేయలేదో అన్న విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో కర్మ సిధ్ధాంతం పై జరిగే R&D మనము నేర్చుకునే పాటించే ఈ కర్మాచరణ, కర్మ ఫల ప్రాప్తి, నిష్కామకర్మ, కర్మ నివృత్తి, కర్మ శేషమ్, క్రియా యోగం వంటివి అంతే నిజం.


జన్మకి కారణం కర్మ.


జన్మ మరణ చట్రానికి (Loop) కారణం కర్మ.

సుఖదుఖ కర్మాచరణలకు, జీవి యొక్క కర్మఫల భోగభాగ్యాలకు కారణం కర్మ.

కర్మ నిశ్శేషమే మోక్షం.


కర్మ లేదా కర్మ సిధ్ధాంతం అన్నవి అర్ధం చేసుకోవడం ఎంత సులభమో అంతే COMPLEX.

ఈ కర్మ జనితమైన జనన మరణ మాయా నిర్మితమైన పరమాత్మ సృష్టిని దాటడం కూడా ఎంత సులభమో అంతే COMPLEX. 

కొన్ని కోట్ల జన్మల సంచిత కర్మ రాశి ఎంత ఉందో ఇంకా ఎన్ని కోట్ల జన్మల ఫలానుభవం మిగిలి ఉందో అర్ధం కావాలంటే ఈ చిన్న Trial చేసిన తెలుస్తుంది.


కళ్ళు మూసుకుని ఆలోచనా రహితంగా ఎలాగ ఉండలేమో ఆయా ఆలోచనలు మన కర్మరాశికి positive మరియూ negative balance add చేస్తూ జీవి అనుభవించాల్సిన కర్మరాశిని పెంచుతూ ఉన్నాయి. అలాంటిది ఇక మన మూర్ఖత్వంతో ప్రతీ రోజూ ప్రతీ క్షణం చేస్తూన్న కర్మ క్రియలను ఎలాగ గణిoచగలము.


భక్తి యోగం క్రియా యోగం జ్ఞాన యోగం కర్మ యోగం వంటి అనేక యోగాలలో ఏ ఒక్క దానిద్వారానైనా పరిపూర్ణత సాధించిన మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుంది.


నిష్కామ కర్మ అన్నది ఎంతో జ్ఞానంతో గానీ పరిపక్వతతో గానీ అర్ధం కాదు ఆచరణకి అంతు బట్టదు. చేసే లేదా చేస్తున్న కర్మ ఫలప్రాప్తికి తన చిత్తం అంటకుండా చేసేదే నిష్కామకర్మ. కృష్ణార్పణం అనేది దానికీ ఒక simple solution. చేస్తున్న చేసిన కర్మ జీవునికి అంటకుండా చేసే ప్రక్రియ. కర్మ మరియూ కర్మ బంధనమే జీవునికి పునర్జన్మ హేతువు. 

సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని మూడు విధాలు.

సంచిత - ఎన్నో కోట్ల జన్మలలో చేసి పోగు చేసుకున్న కర్మ ఫలితం .

ప్రారబ్ధ - ఈ జన్మలో అనుభవించదగిన కర్మ ఫలితం.

ఆగామి - ఈ జన్మ కర్మ ఫలితం ద్వారా మిగిలే Total Balance Left Out.

NOTE: నిష్కామ, క్రియా యోగ తదితర పద్దతుల ద్వారా Zero out చేసుకోవచ్చు.


మన ఋషులు "ప్రారబ్ద కర్మ" ను మూడు విధాలుగా

విభజించారు .......


1. ధృతకర్మ 2. ధృతాధృత కర్మ 3. అధృత కర్మ అని.


పూర్వజన్మలో మన్నించడానికి ఏ మాత్రం

వీలులేని ఘోర తప్పిదం చేసినవాళ్ళు -

"ధృత కర్మ" విభాగంలోకి వస్తారు ....

ఒకరిని హత్యచేయటం, మోసం చేయటం వంటివన్నీ ఈ భాగంలోనే వస్తాయి. 

వీళ్ళు ఆ తప్పుకు శిక్షను అనుభవింల్సిందే ఎంత శాంతి చేసినా ఏమి ఫలితం ఉండదు, 


ధృతాధృత కర్మ. అనగా క్రిందటి జన్మలో చేసిన తప్పు క్షమించబడటానికి వీలున్నది, అంటే బొంబాయికి టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణీకుడు పొరపాటున ఢిల్లీ వెళ్ళే రైలు ఎక్కి, TCకి అది పొరపాటున జరిగినదని చెప్పటంతో అతను జరిగిన తప్పు ఒప్పుకొని ప్రయాణీకుడికి జరిమానా వేయకుండా వదిలి వేయటం.


ఇక మూడవది అధృత కర్మ. పూర్వజన్మలో చేసిన చాలా చిన్న పొరపాటు చేసినవ్యక్తికి సంప్రాప్తించేది, మనస్సులోకి ఏదో చిన్న చెడు తలంపు ప్రవేశిస్తుందే కానీ కార్య రూపంలోకి వెళ్ళదు.

సుందరాచారి జన్మదినం

 ఈ రోజు శంకరం బాడి సుందరాచారి జన్మదినం 

    (10-08-1914) 


            తెలుగు తల్లికి మల్లెపూదండవేసి అక్షరాలతో అర్చన చేసిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన శంకరం బాడి సుందరాచారి. వీరు 1914 ఆగస్ట్ 10 న జన్మించినారు. వీరి మాతృ భాష తమిళం. కడుపేదరికంతో ఎన్నో కష్టాల కోర్చి, వాటిని ఇష్టాలుగా మార్చుకొని ఆత్మ విశ్వాసం తో ముందుకు నడిచిన మహనీయుడు.

     వీరికి పద్య కవిత్వమ0టే చాలా ఇష్టం. అందులో "తేటగీతి "ఆయన ఇష్టపడ్డ చందస్సు. మన రాష్ట్ర గీతమైన "మాతెలుగు తల్లికి మల్లె పూదండ " గీతాని తేట గీతి చందస్సు లో రచించారు. వీరి రచనలలో ముఖ్యమైనవి బలిధానం, రవీంధ్రుడి గీతాంజలి అనువాదం, సుందర భారతం, శ్రీనివాస శతకం, సినిమాపాటలు.

       మాతెలుగు తల్లికి మల్లె పూదండ గీతాన్ని 1942 లో "దీనబందు " సినిమా కోసం రచించాడు. అలనాటి ప్రముఖ గాయిని టంగుటూరి సూర్యాకుమారి. ఈమె టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడైన శ్రీరాములు కుమార్తె. ఈమె 1972సం " లో గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం మధురంగా పాడిన తరువాతనే ఈ పాటకు గుర్తింపు వచ్చింది. శంకరంబాడి వారిని శ్రీ వెంకటేశ్వర విశ్వావిద్యాలయం వారు "ప్రసన్న కవి "అనే బిరుదు ఇచ్చి గౌరవీంచినారు.  1977 ఏప్రిల్ 8న తిరుపతి లో వారు నివాసం ఉంటున్న ఇంట్లో కాలం చేసినారు. ఈ మహనీయునికి నివాళులు అర్పిస్తూ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


        -- *ఇందిరా బాలాజీ రావు కోన*

ఆదర్శవ్యక్తి, ధర్మాచరణ*

 *ఆదర్శవ్యక్తి, ధర్మాచరణ*


ప్రతి మనిషి తన జీవితంలో ఒక ఆదర్శవ్యక్తిని అనుసరించవలెను. ఆ ఆదర్శ వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఆయనను అనుసరించిన న్యాయ, ధర్మ మార్గములను మనము కూడా జీవితములందు అలవరచుకోవాలి అన్న తీర్మానమును తీసుకొన వలయును. శ్రీమద్రామాయణమునందు శ్రీరామచంద్రుడిని "గుణవాన్ ధర్మజ్ఞఃచారిత్రేణ యుక్తః, సర్వభూతేషుహితః, విద్వాన్, సమర్థః, ఆత్మవాన్, జితక్రోధః, అనసూయకః" మొదలైన గుణములున్న వానిగా వర్ణించారు. అనగా శ్రీరామచంద్రుడు సద్గుణ సంపన్నుడు, ధర్మమును తెలిసినవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు కోపమును జయించినవాడు, అసూయ లేనటువంటి వాడు అని అర్ధం. ఈ గుణములు శ్రీరామచంద్రుని యందు సంపూర్ణముగానున్నట్లు శ్రీమద్రామాయణము తెలుపుచున్నది. మనము కూడా శ్రీరామచంద్రునివలె జీవితమును గడపవలయున్నచో ఈ గుణములను మన నిత్య జీవితమునందు అలవరచుకొన వలయును.


రామావతారము యొక్క ప్రధానోద్దేశ్యము మానవజన్మయందు సర్వాత్మనా ధర్మాచరణము సాధ్యము అని నిరూపించుటయే. ధర్మమును గురుంచి చెప్పుట సులభము కాని ఆచరించుట కష్టము అని చాలా మంది భావన. శ్రీరామచంద్రుని చరిత్రను చదివినచో ఇటువంటి భావనకు అవకాశమే లేదు. ఏదో ఒక విధముగా మన జీవితము అభివృద్దికి రావలయును అన్న భావన సరికాదు. ధర్మమార్గమును అనుసరించి అభివృద్ధికి వచ్చుటయే సరియైన విధానం. రావణాసురుడు మొదలైనవారు అధర్మమార్గమును అనుసరించి అభివృద్దికి వచ్చిననూ చివరకు పతనము చెందిరి. ధర్మమార్గమును అనుసరించిన శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టములు అనుభవించిననూ చివరకు జయమునే పొందెను. ఈ న్యాయము, అన్యాయము అనునవి ప్రాచీన కాలమునకు మాత్రమే సంబంధించినవి కావు ఇవి సర్వకాలముల యందు ఉండును. వీటిని మనము అలవరచు కొన్నచో మనకే కాదు, మనము నివసించుచున్న సమాజమునకు కూడా మంచిది.


ధర్మాచరణమును విడుచుటవలనే ప్రస్తుత కాలములో అనర్ధములు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి ఎక్కువగా వచ్చుచున్నవి. అధర్మం తక్కువైనచో ప్రకృతి వికోపములు తగ్గును. దానికి మనము భగవదనుగ్రహమును పొందవలయును. శాస్త్రప్రకారము ఒకే పరమాత్మ మనలను అనుగ్రహించుటకు అనేక రూపములను ధరించినాడు. మనకు ఇష్టమైనటువంటి రూపమును ఉపాసించి భగవదనుగ్రహమును పొందవచ్చును. ప్రతియొక్కరూ ఈ సత్యమును గ్రహించి భగవదనుగ్రహపాత్రులై ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడిని ఆదర్శముగా నుంచుకొని జీవనముయందు ధర్మమార్గమును అనుసరిస్తూ శ్రేయోవంతులగుదురుగాక.


|| हर नमः पार्वती पतये हरहर महादेव ||


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు*

మనలో మనమాట-20

 మనలో మనమాట-20 


అంద మినుమడింప నార్భాట మదియేల? 

సుగుణరాశి నీకు సోకు కాదె? 

పరిమళింప మనసు భవ్యగుణములీని 

గొప్పతనము రాదె? కువలయాన 




మనలో మనమాట-21 


శత్రుషట్క మీకు శాశ్వతనష్టమ్ము 

జేయు నెపుడు వాని పాయ వలయు 

ప్రక్కలోని పాము లాలన జేయునే? 

కాటు వేయకుండ కనికరించి 

*~శ్రీశర్మద*

శ్లోకం

 👆శ్లోకం 

మహేశ్వాసో మహీభర్తా                          

శ్రీనివాసః సతాంగతిః |                       

అనిరుద్ధః సురానందో                        

గోవిందో గోవిదాం పతిః ||


ప్రతిపదార్ధ: 


మహేష్వాసః -తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.

మహీభర్తా -భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.

శ్రీనివాసః -సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.

సతాంగతిః -సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.

అనిరుద్ధః -ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.

సురానందః -దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.

గోవిందః -దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.

గోవిదాం పతిః - వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.

మనకు తోడుగా..

 *మనకు తోడుగా...*


ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వస్తారు

అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:

నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను,

ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను ”


కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు....


తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు,  ట్రైన్ ప్లాట్ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు...


"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు ...! " అన్నాడు బాలుడు కొంచెం అసహనం తో... 

రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా:


బాబూ, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు! ......


ట్రైన్ బయలుదేరింది... 


ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి ...


అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తాడు ..


అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు... కొంతమంది దిగుతున్నారు..., అటూ ఇటూ చూస్తున్నాడు అన్ని కొత్త మొహలు తెలిసిన మొహం ఒక్కటీ లేదు.... అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వస్తుంది ..


ఒక వ్యక్తి విచారకరమైన మొహం తో తననే చూస్తూన్నాడు...


ఆది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది... 


ఇప్పుడు ఒక్క సారిగా భయపడటం ప్రారంభించాడు... రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలవుతుంది మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.... 


సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....


ఆ సమయంలో అతని కి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తు.... 


వణుకుతున్న చేతితో అతను ఆ కాగితాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు, అందులో ఇలా ఉంది: "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను ..."


ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యం తో మొహం మెరిసిపోయింది.... గుండె నిండా దైర్యం... చిరునవ్వు తో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు... అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు. 


 నీతి


అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి...


దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనమందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు:    


       "నేను మీతో ప్రయాణిస్తున్నాను" అని. 


కాబట్టి భయపడవద్దు,

నిరాశ చెందకండి,

ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.


ప్రస్తుతం ప్రపంచం లో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.


ఆయనను విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు.


ఓం నమో నారాయణాయ🙏

దేవాలయాలు - పూజలు 6*.

 *దేవాలయాలు - పూజలు 6*.


సభ్యులకు నమస్కారములు.


భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన కర్తగా ఉండుటనే దీక్షగా పొందిన వారు, భావించిన వారు మాత్రమే అర్చకులు. అర్చకుల సంస్కారము దైవ కార్యముల యందు శ్రద్ధ, నిమగ్నత, విశిష్టత వలన భగవంతుడు అర్చకులకు సన్నిహితుడవుతాడు. అర్చక వ్యవస్థలో గూడా రెండు విధానాలు.

 1) అనువంశిక అర్చకులు 

2) వేతన అర్చకులు.


దేవాలయాలు ప్రజలందరికీ చెందిన కేంద్రీకృతమైన వ్యవస్థ కాబట్టి దేవాలయాలలో దైవ సంబంధిత విషయాలే గాకుండా లౌకిక వ్యవహారాలు గూడా ఉండుట పరిపాటి. దైవ సంబంధమైన కార్యక్రమాలు అర్చకులు నిర్వర్తించాలి, లౌకిక సంబంధమైన వ్యవహారాలపై ధర్మ కర్తలు, పాలక మండలి అజమాయిషీ ఉంటుంది, ఇది సాధారణ కట్టుబాటు. 


గర్భాలయములోనికి, సాధారణ పరిస్థితులలో అర్చక స్వాములకు తప్ప ఇతరులు  అనగా...ధర్మకర్తలు, పాలక మండలి సభ్యులు, సామాజిక పెద్దలు  మరియు ప్రభుత్వ అధికారులు ప్రవేశించరాదు. అర్చక కుటుంబాలు తయారు చేసిన వంటకాలు తప్ప ఇతరుల వంటకాలను భగవంతునికి ఆరగింపుగా(నైవేద్యం )ఉంచరాదు. భక్తుల వంటకాలను  భగవత్ ఆరగింపుకు అనుమతించ రాదు. *ధర్మ స్మూక్షము ప్రకారము గడప దాటిన వంటకాలు భగవత్ నివేదనకు పనికి రావు*. 


*గర్భ గుడిలోనికి అన్యులు ప్రవేశించుట, అన్య వంటకాలు భగవంతునికి సమర్పించుట దోష భూయిష్టమే గాక దేవాలయ ప్రాభవము తగ్గుతుంది*.  వేయేల,  అర్చక స్వాములు తమ గుణ గణములు, పూజాదికాలలో చూపే శ్రద్ధ వలన మాత్రమే గర్భ గుడిలో ఉన్న  భగవన్ మూర్తి, శిల లేదా ప్రతిమ దైవత్వానికి శక్తి సమకూరుస్తాడు. *దేవాలయ మరియు పూజా నిర్వహణలు ఆషామాషి వ్యవహారము కాదు*.


*మాన్యులు విజ్ఞప్తి*

*దేవాలయాలు - పూజలు* అను విషయంపై ధారా వాహిక రచనా వ్యాసంగం బహు సున్నితమే గాక బహు విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.


ధన్యవాదములు.

*(సశేషము)*!*

ఆత్మ స్వయం...ప్రకాశమానము !*

 *ఆత్మ స్వయం...ప్రకాశమానము !*


*ఆత్మ స్వయం ప్రకాశమానము. దానిని మనకు తోచినట్లు భావించకూడదు. ఆత్మను వేరే విధంగా భావించడమే బంధము. ఆత్మకు చీకటి వెలుగులు వుండవు. కేవలము తేజోమయమై వుంటుంది అనే ఆ భావనే బంధాలను తొలగిస్తుంది. ఆత్మ తనకుతానే అఖండ ప్రకాశమై భాసిస్తూ వుంటుంది. అలాంటి ఆత్మానుసంధానమైన దేహము, భక్తి రూపధ్యానముచే పరిపక్వమై 'సమాధి' అనబడే నిరతిశయానంద మోక్షగతి చేకూరుస్తుంది.*


*మహాత్ములు' స్వానుభవ సంధానశక్తి వలననే మోక్షము పొందడం సాధ్యము' అని చెప్పారు. అలాకాకుండా, నేను అనే తద్బోధ నాశనము కానంతవరకు, మాయావృక్షము నీడలోనే సాధకుడు వుంటున్నాడు. ఒకసారి తద్బోధ తొలగగానే, మాయావృక్షము వేరుతెగిన వృక్షమువలె నశించును.* 

ఏ మార్గమును అనగా భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గములలో దేనిని అభ్యసించినను, అహంకారము నాశనము చేసుకునే సులభమైన మార్గమును ఎంచుకోవాలి.*


*'దేహమునే నేను అనుకోవడం' పంచకోశ మాత్రమైన మూడు దేహములను ఉద్దేశించి చెప్పినట్లు అవుతుంది. ఆ ఒక్కభావము తొలగిపోతే, మిగిలిన దేహభావనలు తమంతతామే తొలగిపోతాయి. అందువలన, నేను అనే తలంపుతో పరమేశ్వరునికి

*ఆత్మతో అనుసంధానము చేసి, నిశ్చలంగా వుండడమే, శ్రేష్టమైన సాధన. ఇదే వేదాంతము చేప్పే ఆఖరి సిద్ధాంతం.*


*02. మనస్సు*

*మన హిందూ శాస్త్రములు చెప్పే విధానం ప్రకారం, మనము భుజించే ఆహారమే, సూక్ష్మరూపంలో ఘనీభవించి, రాగ ద్వేష కామ క్రోధాలచే వృద్ధిచెంది, మనస్సు బుద్ధి చిత్తము, అహంకారము అనే అంత:కరణ సముదాయముగా యేర్పడి, మనస్సు అనే ఏకవచన నామముతో గ్రహించబడుతుంది. ఏ విషయమైనా చెయ్యాలని అనిపించడం, చేసే విధంగా నిశ్చయించు కోవడం, మొదలైన ధర్మాలు మనస్సుకే చెప్పబడతాయి.*ఆదిత్యయోగీ*


*ఒక పదార్ధము తిన తగినదేనా అని భావన చేయడం మనోరూప సంకల్పవృత్తి. అది మంచిదే అని భుజింప దగినదే అని భావించుట బుద్ధిరూప నిశ్చయవృత్తి. అలాగే, ఈ మనస్సే సర్వ తత్మాత్మక జీవేశ్వర జగద్రూపమై వుండడం చేత, ఎప్పుడైతే ఆ మనస్సు అసలైన జ్ఞానమును సంపాదించి, ఆత్మాకారమును చెందుతుందో, అప్పుడే సమస్తము బ్రహ్మమే అనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది..*

.

ఇంద్రియ నిగ్రహం.ఆధ్యాత్మిక ప్రస్థానం


                  కర్మ

                         

      

           "ఇంద్రియాలని నిగ్రహించాలి" అని అనుకున్నప్పుడే. అసలు అవి మన అదుపు లో ఉండటం లేదు అనే విషయం అవగాహనకు వస్తుంది..


    ఒక "మాట " మాట్లాడిన తరువాత " నా వాక్కు అదుపు లో ఉంటే ఎంత బాగుండేదిఅనుకుంటాము...


      ముఖ్యంగా నింద విమర్శ హేళన గా ఎదుటి వారు మాట్లాడిమెప్పుడు మన మనస్సు ఎంతో గాయ పడుతుంది. అదే పని మనం చేసినప్పుడు .ఎందుకు ఈ విషయం జ్ఞాపకం రాదో. 


      బహుశా చాలా తెలివిగా ఇంకొళ్ళ తప్పులు చెప్పామని అనుకుంటాము. ఇది ఎంత దుష్కర్మ అవుతుందో, 


      అది ఒకనాడు మన కి తిరిగి రాబోతోందని .గ్రహించము. కర్మ ఫలం చాలా విశేషం గా మనపై పని చేసి, ఇలా వాక్కు దుర్వినియోగం చేయడం మహా పాపం అనే విషయాన్ని మన జీవాత్మకి నేర్పుతుంది.


     అలాగే రుచి కోసం ఆకాలం లో మధుర పదార్ధాల ని తినడంమానవుడి లక్షణం..అయిదుఇంద్రియాలు 

ఇలాగే నిత్యం ఒక సుఖాన్ని భోగాన్ని కోరుతూ ఉంటాయి..

       


      ఆధ్యాత్మిక ప్రస్థానం లో వేగం గా ప్రయాణించాలని తపించే వారు ముందు ఈ విషయాన్ని గమనించి వీటిని నిగ్రహించాలి.

ఇలా కాక పోతే, వారు సాధించిన తపశ్శక్తి కానీ ఇంద్రియాలపై పొందిన కొద్దీ పట్టు సడలి పోతుంది.


     .ప్రతి ఒక్కరి లోను ఎంతో శక్తి 

దాగి ఉందనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి..మనం కేవలం డబ్బు అనవసరం గా ఖర్చు కాకూడదని మాత్రమే అనుకుంటాము.ఆదిత్యయోగీ.


   వాస్తవానికి లౌకికమైన ధనం కన్నా జన్మ జన్మ లకి వెంట వచ్చే ఈ తపోధనం ఇంకా ఎన్నో రెట్లు గొప్పది .

          

    యోగాభ్యాసం చేసే వారు ఈ విషయం ఎప్పుడు మరిచి పోరు..

           


        బ్రహ్మ నారదుడికి శ్రీ మహావిష్ణువు

అవతారాల గురించి వివరిస్తూ. నర నారాయణుల అవతారం .వారి తపశ్శక్తి మహిమ , వారి నిగ్రహాన్ని ప్రస్తుతించాడని

పరీక్షిత్తుకు శుక మహర్షి ఇలా బోధించాడు.


       " ధర్మానికి రూపమైన ధర్ముడికి, దక్షుడి

కుమార్తె అయిన మూర్తి యందు. నర నారాయణులు. జన్మించారు..


 "అనఘులు బదరీ వనమున, వినుత తపోవృత్తి నుండ, విబుదాధిపుడున్

మనమున నిజ పద హానికి , ఘనముగ 

జింతించి దివిజ కాంతామణులన్ "

        

      ఆ పరమ పావనులైన ఋషులు బదరికా వనానికి వెళ్లి నిశ్చల తపస్సు లో నిమగ్నమయ్యారు. వారి తపస్సు ఫలిస్తే తన పదవికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని ఇంద్రుడు మనస్సు లో ఎంతో చింతించి, తన అప్సరస లందరినీ పిలిపించాడు...


    నర నారాయణుల తపస్సుకి విఘ్నం కలిగించమని చెప్పి పంపాడు..వారు. మన్మధ సేన లా మహోత్సాహం తో. బదరికా వనానికి చేరుకున్నారు.

      

" నర నారాయణులున్న చోటికి మరున్నారీ సమూహంబు భా


స్వర లీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారగా ..


పరిహసోక్తుల నాట పాటల చరింపం జూచి నిశ్చింతతన్ 


భరిత ధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.."


     ఆ అప్సరసలు ఆతపోప్రాంగణానికి 

సవిలాసంగా దిగివచ్చారు.సౌందర్యాల తీరు ,కళా నైపుణ్యాల సౌరూ అద్భుతం గా ప్రకాశించేటట్లు , పరిహాసాలతో ఆటలాడుతూ , పాటలు పాడుతూ అక్కడ విహరించారు..


     ఆ అప్సరసలని నర నారాయణులు గమనించారు..కానీ ఏ మాత్రం చలించ లేదు.కామానికి లోను 

కాలేదు. నిశ్చింతులై, నిర్మొహులై ధ్యానం లో మహా తపస్సు లో లీనమై పోయారు.


" క్రోధము తమ తపములకు , బాధక మగు టేరిగి దివిజ భామ ల పై న

మేధాత్మకు లొ క యింతయు , క్రోధము దేరై రి సత్త్వ గుణ యుతు లగుటన్ "


         క్రోధం తమ తపస్సులకి లోపం కలిగిస్తుందని, తపశ్శక్తిని క్షీణింప చేస్తుందనే సత్యం తెలిసిన ఆ సత్త్వ సంపన్నులు, బుద్ధిమంతులు మహర్షులు అయిన నరనారాయణులు ఆ అప్సరస లపై క్రోధం చూప లేదు.ఆదిత్యయోగీ.


" నారాయణుడ ప్పుడు దన యూరువు 

వెస జీర , నందు నుద యించెను బెం

పారంగ నూర్వశీ ముఖ , నారీ జన కోటి దివిజ నారులు మెచ్చన్ "


         అప్పుడు నారాయణుడు వెంటనే తన యూరు ( తొడ) భాగాన్ని చీరాడు. అతని తొడ లోనుండి అమర కాంతలు మెచ్చేటట్లు ఊర్వశి మొదలైన అప్సరః స్త్రీ గణం ఉద్భవించింది...

      

    నారాయణుడి ఊరువు లో నుండి

జన్మించింది కాబట్టి ఆమె " ఊర్వశి అనే 

పేరు తో కీర్తి పొందింది..ఇంద్రుడు పంపగా వచ్చిన దేవతా స్త్రీలు , ఈ ఊర్వశి. ఆమె తో పాటు జనించిన ఇతర సౌందర్య రాసులైన స్త్రీ ల హావ భావాలు , వినోద విహారాలు చూసి సిగ్గు తో తల దించుకున్నారు. 

       

    నర నారాయణులు కామాన్నీ గెలిచారు. క్రోధాన్నీ జయించారు...

ఆధ్యాత్మిక ప్రస్థానం లో మనకు ఇవి మహోన్నత మార్గ దర్శకాలు...

.

1...మనిషికి గొప్ప సంపద జ్ఞానం ( మంచితనం )

 2...గొప్ప ఆయుధం ఓపిక

3...గొప్ప రక్షణ నిజాయితీ

4...మంచి ఔషధం చిరునవ్వు

    


1... మనిషి గొప్ప సంపద జ్ఞానం ... ఇదైతే నిజమే నేను నమ్ముతాను .... డబ్బు ఇప్పుడు ఉంటుందో రేపు వెళ్ళిపోతుంది మన దగ్గర ఉంటుందని కచ్చితంగా చెప్పలేం.... అది జ్ఞానం అయితే మనం పెంచుకునే కొద్ది పెరుగుతుంది కాబట్టి అది సంపదలాగా పెరుగుతూనే ఉంటుంది


2... గొప్ప ఆయుధం ఓపిక...ఇది నూటికి నూరుపాలు నిజం... ఓపికతో ఏదైనా సాధించవచ్చు అని నేను కూడా నమ్మాను... కానీ ఆ ఓపిక కూడా ఒకసారి మనకి విరక్తిగా అనిపిస్తుంది... మనం అనుకున్నది జరగకపోతే ఓపిక అనేది నశిస్తాది అలాంటప్పుడు కొంచెం సహనం కూడా తోడైతే అప్పుడు ఓపిక ఆయుధంగా పనిచేస్తది


3...గొప్ప రక్షణ నిజాయితీ...yes ఇది నూటికి 100% నిజం.. ఎందుకంటే పేరులోనే ఉంది గొప్ప రక్షణ నిజాయితీ.... ఈ పనిలో అయినా నిజాయితీగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నిజాయితీ ఒక బలం ఇస్తుంది మనుషులు ఏదైనా సాధించవచ్చు....


4...మంచి ఔషధం చిరునవ్వు.... ఎంత కష్టమొచ్చిన చిరునవ్వుతో స్వీకరించాలి అంటారు... ఇది చాలా కష్టం నాకు తెలిసి... కష్టం వచ్చినప్పుడు చిరునవ్వు నవ్వడమే మరచిపోతారు...ఎందుకంటే మనసులో నుండి చిరునవ్వు బయటకు రావాలి అప్పుడే ఔషధంగా పనిచేస్తుంది చిరునవ్వు..*

.