*మనకు తోడుగా...*
ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వస్తారు
ఈ
అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:
నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను,
ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను ”
కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు....
తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు...
"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు ...! " అన్నాడు బాలుడు కొంచెం అసహనం తో...
రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా:
బాబూ, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు! ......
ట్రైన్ బయలుదేరింది...
ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి ...
అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తాడు ..
అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు... కొంతమంది దిగుతున్నారు..., అటూ ఇటూ చూస్తున్నాడు అన్ని కొత్త మొహలు తెలిసిన మొహం ఒక్కటీ లేదు.... అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వస్తుంది ..
ఒక వ్యక్తి విచారకరమైన మొహం తో తననే చూస్తూన్నాడు...
ఆది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది...
ఇప్పుడు ఒక్క సారిగా భయపడటం ప్రారంభించాడు... రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలవుతుంది మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది....
సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....
ఆ సమయంలో అతని కి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తు....
వణుకుతున్న చేతితో అతను ఆ కాగితాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు, అందులో ఇలా ఉంది: "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను ..."
ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యం తో మొహం మెరిసిపోయింది.... గుండె నిండా దైర్యం... చిరునవ్వు తో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు... అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు.
నీతి
అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి...
దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనమందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు:
"నేను మీతో ప్రయాణిస్తున్నాను" అని.
కాబట్టి భయపడవద్దు,
నిరాశ చెందకండి,
ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రస్తుతం ప్రపంచం లో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.
ఆయనను విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు.
ఓం నమో నారాయణాయ🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి