*ఆత్మ స్వయం...ప్రకాశమానము !*
*ఆత్మ స్వయం ప్రకాశమానము. దానిని మనకు తోచినట్లు భావించకూడదు. ఆత్మను వేరే విధంగా భావించడమే బంధము. ఆత్మకు చీకటి వెలుగులు వుండవు. కేవలము తేజోమయమై వుంటుంది అనే ఆ భావనే బంధాలను తొలగిస్తుంది. ఆత్మ తనకుతానే అఖండ ప్రకాశమై భాసిస్తూ వుంటుంది. అలాంటి ఆత్మానుసంధానమైన దేహము, భక్తి రూపధ్యానముచే పరిపక్వమై 'సమాధి' అనబడే నిరతిశయానంద మోక్షగతి చేకూరుస్తుంది.*
*మహాత్ములు' స్వానుభవ సంధానశక్తి వలననే మోక్షము పొందడం సాధ్యము' అని చెప్పారు. అలాకాకుండా, నేను అనే తద్బోధ నాశనము కానంతవరకు, మాయావృక్షము నీడలోనే సాధకుడు వుంటున్నాడు. ఒకసారి తద్బోధ తొలగగానే, మాయావృక్షము వేరుతెగిన వృక్షమువలె నశించును.*
ఏ మార్గమును అనగా భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గములలో దేనిని అభ్యసించినను, అహంకారము నాశనము చేసుకునే సులభమైన మార్గమును ఎంచుకోవాలి.*
*'దేహమునే నేను అనుకోవడం' పంచకోశ మాత్రమైన మూడు దేహములను ఉద్దేశించి చెప్పినట్లు అవుతుంది. ఆ ఒక్కభావము తొలగిపోతే, మిగిలిన దేహభావనలు తమంతతామే తొలగిపోతాయి. అందువలన, నేను అనే తలంపుతో పరమేశ్వరునికి
*ఆత్మతో అనుసంధానము చేసి, నిశ్చలంగా వుండడమే, శ్రేష్టమైన సాధన. ఇదే వేదాంతము చేప్పే ఆఖరి సిద్ధాంతం.*
*02. మనస్సు*
*మన హిందూ శాస్త్రములు చెప్పే విధానం ప్రకారం, మనము భుజించే ఆహారమే, సూక్ష్మరూపంలో ఘనీభవించి, రాగ ద్వేష కామ క్రోధాలచే వృద్ధిచెంది, మనస్సు బుద్ధి చిత్తము, అహంకారము అనే అంత:కరణ సముదాయముగా యేర్పడి, మనస్సు అనే ఏకవచన నామముతో గ్రహించబడుతుంది. ఏ విషయమైనా చెయ్యాలని అనిపించడం, చేసే విధంగా నిశ్చయించు కోవడం, మొదలైన ధర్మాలు మనస్సుకే చెప్పబడతాయి.*ఆదిత్యయోగీ*
*ఒక పదార్ధము తిన తగినదేనా అని భావన చేయడం మనోరూప సంకల్పవృత్తి. అది మంచిదే అని భుజింప దగినదే అని భావించుట బుద్ధిరూప నిశ్చయవృత్తి. అలాగే, ఈ మనస్సే సర్వ తత్మాత్మక జీవేశ్వర జగద్రూపమై వుండడం చేత, ఎప్పుడైతే ఆ మనస్సు అసలైన జ్ఞానమును సంపాదించి, ఆత్మాకారమును చెందుతుందో, అప్పుడే సమస్తము బ్రహ్మమే అనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది..*
.
ఇంద్రియ నిగ్రహం.ఆధ్యాత్మిక ప్రస్థానం
కర్మ
"ఇంద్రియాలని నిగ్రహించాలి" అని అనుకున్నప్పుడే. అసలు అవి మన అదుపు లో ఉండటం లేదు అనే విషయం అవగాహనకు వస్తుంది..
ఒక "మాట " మాట్లాడిన తరువాత " నా వాక్కు అదుపు లో ఉంటే ఎంత బాగుండేదిఅనుకుంటాము...
ముఖ్యంగా నింద విమర్శ హేళన గా ఎదుటి వారు మాట్లాడిమెప్పుడు మన మనస్సు ఎంతో గాయ పడుతుంది. అదే పని మనం చేసినప్పుడు .ఎందుకు ఈ విషయం జ్ఞాపకం రాదో.
బహుశా చాలా తెలివిగా ఇంకొళ్ళ తప్పులు చెప్పామని అనుకుంటాము. ఇది ఎంత దుష్కర్మ అవుతుందో,
అది ఒకనాడు మన కి తిరిగి రాబోతోందని .గ్రహించము. కర్మ ఫలం చాలా విశేషం గా మనపై పని చేసి, ఇలా వాక్కు దుర్వినియోగం చేయడం మహా పాపం అనే విషయాన్ని మన జీవాత్మకి నేర్పుతుంది.
అలాగే రుచి కోసం ఆకాలం లో మధుర పదార్ధాల ని తినడంమానవుడి లక్షణం..అయిదుఇంద్రియాలు
ఇలాగే నిత్యం ఒక సుఖాన్ని భోగాన్ని కోరుతూ ఉంటాయి..
ఆధ్యాత్మిక ప్రస్థానం లో వేగం గా ప్రయాణించాలని తపించే వారు ముందు ఈ విషయాన్ని గమనించి వీటిని నిగ్రహించాలి.
ఇలా కాక పోతే, వారు సాధించిన తపశ్శక్తి కానీ ఇంద్రియాలపై పొందిన కొద్దీ పట్టు సడలి పోతుంది.
.ప్రతి ఒక్కరి లోను ఎంతో శక్తి
దాగి ఉందనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి..మనం కేవలం డబ్బు అనవసరం గా ఖర్చు కాకూడదని మాత్రమే అనుకుంటాము.ఆదిత్యయోగీ.
వాస్తవానికి లౌకికమైన ధనం కన్నా జన్మ జన్మ లకి వెంట వచ్చే ఈ తపోధనం ఇంకా ఎన్నో రెట్లు గొప్పది .
యోగాభ్యాసం చేసే వారు ఈ విషయం ఎప్పుడు మరిచి పోరు..
బ్రహ్మ నారదుడికి శ్రీ మహావిష్ణువు
అవతారాల గురించి వివరిస్తూ. నర నారాయణుల అవతారం .వారి తపశ్శక్తి మహిమ , వారి నిగ్రహాన్ని ప్రస్తుతించాడని
పరీక్షిత్తుకు శుక మహర్షి ఇలా బోధించాడు.
" ధర్మానికి రూపమైన ధర్ముడికి, దక్షుడి
కుమార్తె అయిన మూర్తి యందు. నర నారాయణులు. జన్మించారు..
"అనఘులు బదరీ వనమున, వినుత తపోవృత్తి నుండ, విబుదాధిపుడున్
మనమున నిజ పద హానికి , ఘనముగ
జింతించి దివిజ కాంతామణులన్ "
ఆ పరమ పావనులైన ఋషులు బదరికా వనానికి వెళ్లి నిశ్చల తపస్సు లో నిమగ్నమయ్యారు. వారి తపస్సు ఫలిస్తే తన పదవికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని ఇంద్రుడు మనస్సు లో ఎంతో చింతించి, తన అప్సరస లందరినీ పిలిపించాడు...
నర నారాయణుల తపస్సుకి విఘ్నం కలిగించమని చెప్పి పంపాడు..వారు. మన్మధ సేన లా మహోత్సాహం తో. బదరికా వనానికి చేరుకున్నారు.
" నర నారాయణులున్న చోటికి మరున్నారీ సమూహంబు భా
స్వర లీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారగా ..
పరిహసోక్తుల నాట పాటల చరింపం జూచి నిశ్చింతతన్
భరిత ధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.."
ఆ అప్సరసలు ఆతపోప్రాంగణానికి
సవిలాసంగా దిగివచ్చారు.సౌందర్యాల తీరు ,కళా నైపుణ్యాల సౌరూ అద్భుతం గా ప్రకాశించేటట్లు , పరిహాసాలతో ఆటలాడుతూ , పాటలు పాడుతూ అక్కడ విహరించారు..
ఆ అప్సరసలని నర నారాయణులు గమనించారు..కానీ ఏ మాత్రం చలించ లేదు.కామానికి లోను
కాలేదు. నిశ్చింతులై, నిర్మొహులై ధ్యానం లో మహా తపస్సు లో లీనమై పోయారు.
" క్రోధము తమ తపములకు , బాధక మగు టేరిగి దివిజ భామ ల పై న
మేధాత్మకు లొ క యింతయు , క్రోధము దేరై రి సత్త్వ గుణ యుతు లగుటన్ "
క్రోధం తమ తపస్సులకి లోపం కలిగిస్తుందని, తపశ్శక్తిని క్షీణింప చేస్తుందనే సత్యం తెలిసిన ఆ సత్త్వ సంపన్నులు, బుద్ధిమంతులు మహర్షులు అయిన నరనారాయణులు ఆ అప్సరస లపై క్రోధం చూప లేదు.ఆదిత్యయోగీ.
" నారాయణుడ ప్పుడు దన యూరువు
వెస జీర , నందు నుద యించెను బెం
పారంగ నూర్వశీ ముఖ , నారీ జన కోటి దివిజ నారులు మెచ్చన్ "
అప్పుడు నారాయణుడు వెంటనే తన యూరు ( తొడ) భాగాన్ని చీరాడు. అతని తొడ లోనుండి అమర కాంతలు మెచ్చేటట్లు ఊర్వశి మొదలైన అప్సరః స్త్రీ గణం ఉద్భవించింది...
నారాయణుడి ఊరువు లో నుండి
జన్మించింది కాబట్టి ఆమె " ఊర్వశి అనే
పేరు తో కీర్తి పొందింది..ఇంద్రుడు పంపగా వచ్చిన దేవతా స్త్రీలు , ఈ ఊర్వశి. ఆమె తో పాటు జనించిన ఇతర సౌందర్య రాసులైన స్త్రీ ల హావ భావాలు , వినోద విహారాలు చూసి సిగ్గు తో తల దించుకున్నారు.
నర నారాయణులు కామాన్నీ గెలిచారు. క్రోధాన్నీ జయించారు...
ఆధ్యాత్మిక ప్రస్థానం లో మనకు ఇవి మహోన్నత మార్గ దర్శకాలు...
.
1...మనిషికి గొప్ప సంపద జ్ఞానం ( మంచితనం )
2...గొప్ప ఆయుధం ఓపిక
3...గొప్ప రక్షణ నిజాయితీ
4...మంచి ఔషధం చిరునవ్వు
1... మనిషి గొప్ప సంపద జ్ఞానం ... ఇదైతే నిజమే నేను నమ్ముతాను .... డబ్బు ఇప్పుడు ఉంటుందో రేపు వెళ్ళిపోతుంది మన దగ్గర ఉంటుందని కచ్చితంగా చెప్పలేం.... అది జ్ఞానం అయితే మనం పెంచుకునే కొద్ది పెరుగుతుంది కాబట్టి అది సంపదలాగా పెరుగుతూనే ఉంటుంది
2... గొప్ప ఆయుధం ఓపిక...ఇది నూటికి నూరుపాలు నిజం... ఓపికతో ఏదైనా సాధించవచ్చు అని నేను కూడా నమ్మాను... కానీ ఆ ఓపిక కూడా ఒకసారి మనకి విరక్తిగా అనిపిస్తుంది... మనం అనుకున్నది జరగకపోతే ఓపిక అనేది నశిస్తాది అలాంటప్పుడు కొంచెం సహనం కూడా తోడైతే అప్పుడు ఓపిక ఆయుధంగా పనిచేస్తది
3...గొప్ప రక్షణ నిజాయితీ...yes ఇది నూటికి 100% నిజం.. ఎందుకంటే పేరులోనే ఉంది గొప్ప రక్షణ నిజాయితీ.... ఈ పనిలో అయినా నిజాయితీగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నిజాయితీ ఒక బలం ఇస్తుంది మనుషులు ఏదైనా సాధించవచ్చు....
4...మంచి ఔషధం చిరునవ్వు.... ఎంత కష్టమొచ్చిన చిరునవ్వుతో స్వీకరించాలి అంటారు... ఇది చాలా కష్టం నాకు తెలిసి... కష్టం వచ్చినప్పుడు చిరునవ్వు నవ్వడమే మరచిపోతారు...ఎందుకంటే మనసులో నుండి చిరునవ్వు బయటకు రావాలి అప్పుడే ఔషధంగా పనిచేస్తుంది చిరునవ్వు..*
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి