ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
28, ఆగస్టు 2023, సోమవారం
జైశ్రీరామ్
జైశ్రీరామ్ మన హిందూ బంధువుల్లో ఉన్న సాయి భక్తులకు నాదొక చిన్న వివరణ సాయిబాబా హిందువా ముస్లిమా అనేది కొంచెం సేపు పక్కన పెడదాం కానీ షిరిడీలో ఉన్న సాయి మందిరాన్ని నిర్వహిస్తున్నది ముస్లిమ్స్ వాళ్లు పూర్తి ఆధారాలతో సహా సాయిబాబా మా ముస్లిం వ్యక్తి ఇక్కడికి వస్తున్న హిందువుల డబ్బులు మేము మా ముస్లింల రక్షణ కొరకు మాత్రమే మాకు ఇష్టం వచ్చిన వారికి మాత్రమే వాడుకుంటాము అని కోర్టులో వాదించి గెలిచారు దాన్లో భాగంగానే మసీదులకి మక్కా యాత్రలకు కొన్ని కోట్ల రూపాయలు హిందువుల ద్వారా వచ్చిన షిరిడీలోని హుండీ ఆదాయాన్ని పంచారు అంటే మన హిందువులం అమాయకంగా మనకు ఉన్న దేవుళ్లను వదిలేసి శిరిడీలోని ఆ ముస్లిం సాయిబాబా దేవాలయంలో డబ్బులు కుమ్మరించి మన తల నరకటానికి ముస్లింసు కత్తి కొనుక్కోమని సహకరించినట్టుగా ఉంది దయచేసి అర్ధం చేసుకొని మీకు సాయిబాబా మీద భక్తి ఉంటే మీ ఇంట్లోనే మీ మనసులోని ధ్యానించుకొని దేవాలయానికి వెళ్లాలంటే కాశీ రామేశ్వరం తిరుపతి శ్రీశైలం అరుణాచలం వంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జైహింద్
Sri Sri:
ముస్లిం ఫకీర్ సాయిబ్ బాబా* నే short Cut లో *సాయి బాబా* అని అంటున్నాము.
సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.
ముస్లిం అయినా, సాయిబు బాబా కు, హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..
1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,,
మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం.. ఇది . ప్రధాన దేవుళ్ళ పై జరుగుతున్న జిహాద్..
1950 వరకు షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే..
హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ ను హిందువులు,. హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..
(దర్గా/ సమాధి అంటే Extention ఉండదు.. కానీ దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు.. అందుకే 1950 తర్వాత ఈ సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు.... అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం ప్రారంభం అయ్యింది )
*సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత అజ్ఞానము లోకి పోయిన్నారు.
*సాయి అంటే ఫకీర్* అని* అర్ధం..*
*సాయిరాం / సాయి కృష్ణ అంటే ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ. అని అర్ధం..
ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ చేస్తూ, ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..*
విచిత్రం ఏమిటంటే.. ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న హిందువులే..
1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ, సాహిత్యం లో కానీ ఎక్కుడ కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి వ్రాయలేదు.. 1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు విజయం సాధించారు..
ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు.. కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..
కానీ, విచిత్రం ఏమిటంటే, శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది బ్రాహ్మణులూ ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం..
దేశం, ధర్మం అంటూ ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు చాలా మంది, ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..
ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి.. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..
హిందువులు, ముఖ్యం గా జాతీయ వాదులు ఈ ప్రమాదం ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.
* *
సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),
ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ పూజించని ఫకీర్ బాబా( ముస్లిం) ను, "హిందూ దేవుడు" గా హిందువులు పూజించడం ఏమిటి?,, కొంచెం అయినా ఆలోచన ఉండాలి కదా?
శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ వారు ప్రచురించిన " శ్రీ సాయి సచ్చరిత్రము "
ఫకీర్ కు, సాయి అనే పేరు ఎలా వచ్చేను,, పేజీ no.41, 42, 43
సాయిబాబా కు కోపం వచ్చినప్పుడు భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,. etc.
( దేవుడు అయితే, కోపం వస్తే, భక్తులపై రాళ్లు, ఇటుకలు విసిరి వేయడం ఏమిటి?, భక్తులను తిట్టడం ఏమిటి? )
" నేనొక ముసల్మాన్ (ముస్లిం ) ", అని, ఒక మహమ్మదియున్ అని సాయి బాబా నే స్వయంగా చెప్పినారు
" పేజీ No. 103 &
" సాయి బాబా ఒక మహమ్మదియున్ ( ముస్లిం ) అని చెప్పినారు
" పేజీ No. 112, 226, 232, ( బాబా గారే తను ముస్లిం అని చెప్పిన, హిందువుల దేవుడు ఎలా అయినారు )
సాయిబాబా, పొగాకు పీల్చుట / తాగుట ,, పేజీ no.48, 126, etc.
* *
సాయి బాబా అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,
ఫకీర్ లను పర్షియన్ భాష లో " సాయి ' అని అంటారు,, ఆవిధంగా ఫకీర్ పేరు క్రమం గా " సాయి" గా మారినది.
తన జీవితాంతం మసీదు లోనే గడిపినారు. ఎప్పుడు "అల్లా మాలిక్ " అని చెప్పేవారు.
* * *
ఏ ఒక్క రోజు సాయి బాబా హిందు దేవుళ్ళ ను పూజించలేదు.
తను ముస్లిం కాబట్టి, మసీదు లోనే ఉండి అల్లా ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,
**
త్రిమూర్తుల అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం ధాత్తాత్రేయ,,
అవతారం నకు మరో అవతారం ఉండదు,,
విష్ణు మూర్తి అవతారం శ్రీ రాముడు, కానీ శ్రీ రాముడు కి మరో అవతారం ఉండదు.
విష్ణు మూర్తి అవతారం శ్రీ కృష్ణుడు,, కానీ శ్రీ కృష్ణుడు కి మరో అవతారం లేదు,,
అదే విధంగా దాత్తత్రేయ స్వామీ నే ఒక అవధూత అవతారం,, మళ్ళీ ఒక అవతారం నకు మరో అవతారం ఉండదు,,
కానీ, సాయిబాబా ధాత్తాత్రేయ అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,, కొంచెం అయినా ఆలోచించాలి గదా?
ఇందులోనే పెద్ద కుట్ర ఉన్నది..!!
అయినా మనకు ఎంత మంది గురువు లేరు...,
ఇప్పుడిప్పడే
మన హిందువులు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం చూడటానికి తిరువన్నామలై వెళ్తున్నారు,
ఆదిశంకరాచార్యులు వారు నడయాడిన ప్రదేశాలు చూడటానికి కాలడీ వెళ్తున్నారు, బేలూరు రామకృష్ణ మఠంకు వెళ్తున్నారు, శృంగేరి మఠంకు వెళ్తున్నారు,
ఇకనుంచైనా
****షిరిడి వెళ్ళకండి*****
ఆలోచించండి...👍🏻👍🏻👍🏻👍🏻
డబ్బుకి పెళ్ళికి ముడి పెట్టకండి*
*త్వరపడండి మీ పిల్లల వయస్సు ముదరక ముందే పెళ్లి చెయ్యండి*
*మనిషికి జీవితంలో బాల్యం యవ్వనం చాల ముఖ్యమైనవి ఈ టైంలోనే చదువుకోవడం మంచి ఉద్యోగం సంపాదించుకోవడం లేదా లైఫ్ లో సెటిల్ అవడం చాల ముఖ్యం అంతే కాదు మంచి యవ్వనం లో ఉండగానే జీవితం లో స్థిరపడితే వివాహం చేసుకోవడం అత్యంత అవసరం*
*ఆ కారణం ఈ కారణం చెప్పి వివాహం వాయిదా వెయ్యడం క్షమించరాని
శిక్షలేని నేరం*
*మంచి యవ్వనంలో ఉండగా అంటే మొగ పిల్లలకు 25 నుండి 28 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు 23 నుండి 26 లోపు చేస్తే ఆ జంట చూడముచ్చటగా ఉంటుంది. అంతే కాదు వారి మధ్య మంచి బంధం అవగాహాన ఏర్పడి ఆ జంట తమ దాంపత్య జీవితాన్ని చక్కగా కొనసాగించే వీలుంటుంది* *పెళ్ళికి ముందే సొంత ఇల్లు వస్తువులు కొనేసుకుంటే పెళ్లయ్యాక ఇంకేమి కొనుక్కుంటారు ఒక ధ్యేయం లేకపోవడం వలన తిట్టుకోవడం ఒకరినొకరు ఈసడించుకోవడం జరుగుతుంది*. *ముప్ఫయ్ నలభై సంవత్సరాల క్రితం ఒక ఫ్రిజ్ లేదా టీవి లేదా ఏసీ కొనుక్కుంటే ఆ భార్యాభర్తల మొహాలలో ఎంతో సంతోషం కనిపించేది.* *మరి నేడు డబ్బులెక్కువై ప్రేమలు అనురాగాలు తగ్గిపోతున్నాయి కాదు తరిగిపోతున్నాయి*
*నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తాను.*
1. *జీతాల్లో వ్యత్యాసం : కుటుంబం అంటే భార్యాభర్తల జీతాలు రెండు కలసి లెక్కించాలి అప్పుడు సరిపోవడం అనే సమస్యే ఉండదు*
2. *పిల్ల/పిల్లాడు అంత అందంగా లేరు నిజానికి చూసె మనస్సువుండలే గాని ప్రతి వాళ్ళు కొన్ని కోణాల్లో చాల బాగుంటారు. అందరికి ఫొటోజెనిక్ పేస్ ఉండదు ఫొటోలో బాగున్న ప్రతి వాళ్ళు బయట బాగుండరు అలాగే బయట బాగున్నవాళ్ళు ఫొటోల్లో బాగుండక పోవచ్చు అందుకే పిల్ల/పిల్లాడిని ఒరిజినల్ గ చూసి నిర్ణయానికి రావాలి*. *అందమంటే కేవలం మొహం మాత్రమే కాదు ఎత్తు రంగు మాట్లాడే విధానం అణకువ కుటుంబ పద్ధతి అన్ని లెక్క లోకి తీసుకోవాలి. అందమనేది జీవితాంతం ఉండదు*. *మనింట్లో మన అమ్మానాన్న అందంగానే కనిపిస్తారు భార్య/భర్త కూడా అంతే వాళ్ళ చర్యలు ప్రేమాభిమానాల వలన అందం అనేది మరుగున పడిపోతుంది*. 3.*జాతకాలు : మొన్న 35 ఏళ్ళ అమ్మాయికి జాతకం నప్పలేదని వివాహం వద్దన్నారు. నిజంగా ఆ అమ్మాయి జాతకం బాగుంటే ఇంతకాలం ఎందుకు పెళ్లి కాలేదు. అందరికి వివాహం మంచి ముహుర్తానికే చేస్తారు* *మరి వాళ్ళెవ్వరు విడాకులు తీసుకోకుండా చక్కగా కాపురాలు చేసుకుంటున్నారా? మన దేశంలో హిందువుల్లో కూడా చాల మంది జాతకాలు అంటే తెలీకుండానే పెళ్లి చేసుకుంటున్నారు మరి వాళ్ళు చక్కగా అన్యోన్యంగా జీవించటంలేదా? మీ కుటుంబంలో ఎవరికో ఏదో అయిందని అందరికి అలానే అవదు. జాతకాలూ అనేది మీ ఇష్టం కానీ దాన్ని పిచ్చిగా గుడ్డిగా నమ్మి మీ పిల్లల జీవితాలు పాడు చెయ్యకండి ఎందుకంటె జాతకాలు నమ్మి పెళ్జి జరగకుండా నలబై యబయ్ యేళ్ళున్న అమ్మాయిలను నేను చూసాను*
4.*చేద్దాములే కంగారేముంది మనమ్మాయికి ముప్పయ్యేల్లెగా అమ్మాయికి ముప్పయినాలుగే కదా అనుకోకండి* *ఇంకా చూద్దాం అని ఛాన్స్ తీసుకోకండి. మీ పిల్లల గురించి మీరు గొప్పలు చెప్పుకోకండి*
5. *పిల్లలు సంపాదించే డబ్బు పై ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి* *వాళ్ళు ఇస్తే తీసుకోండి*
*డబ్బుకి పెళ్ళికి ముడి పెట్టకండి*
5.*పిల్లలకి తొందరగా పెళ్ళిచేస్తే వాళ్ళ వివాహబంధం ఎక్కువ కాలం ఉంటుంది మీరు కూడా అమ్మమ్మ/మామ్మ/తాత అయ్యి మీ జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు. తల్లితండ్రులారా మీ వల్లే నా పెళ్లి ఆలస్యం అయింది లేదా పెళ్లి కాలేదు అని మిమ్మల్ని మీ పిల్లలు ప్రశ్నించకుండా చూసుకోండి*
*పెళ్లంటే రాజి పడటం అని గుర్తుంచుకోండి*
*శుభం వివాహమస్తు*
పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు
పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*
*ఇదీ భారతదేశ వ్యవస్థ!!*
*మీరే చూడండి ....*
సేకరణ:- పాల క పురుషోత్తం.
1- ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలను కుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయ వచ్చు.
కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయ లేరు.
2- ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు.
కానీ అదే వ్యక్తిరాజ కీయ నాయకుడు కావాలను కుంటే మాత్రం జైలులో ఉన్న ప్పుడు కూడా ఎన్నికల్లో పోటీచేయవచ్చు.
3-ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు,
కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు
4- ఒక వ్యక్తి నిరాడంబర మైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు.
5-ఒకవ్యక్తి సైన్యంలో చేరటానికి మైనర్ అయి ఉండాలి10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.
కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడు, పిరికివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు.
6 ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైన ప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు
ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా?
నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా?
కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావ డానికి మీమద్దతు ఇవ్వండి.
మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....
కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.
30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా?
కేవలం 5 సంవత్సరాలు కూడా రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా?
ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా??
న్యాయం ఎక్కడ ఉంది ...?
శ్రీ డి. కె. శ్రీవాస్తవ
చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
బొంబాయి హైకోర్టు.
ముంబై .....
ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి తొలగించ వద్దు, ఈ వ్యవస్థను మార్చటం నిజంగా అవసరం కాదా???!
Think and Forward Pls...
తెలుగు భాషా వారోత్సవాలు
ఏప్రిల్ 23-29 తెలుగు భాషా వారోత్సవాలు
తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు
ముహమ్మద్ అజ్గర్ అలీ.
• శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
• తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
• తొలి తెలుగు కవి - నన్నయ
• తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
• తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
• తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము
• తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము
• తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
• తొలి తెలుగు వ్యాకరణము - ఆంధ్రభాషాభూషణము
• తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
• తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము
• తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము
• తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము
• తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని
• తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు
• తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
• తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము
• తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము
• తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన
• తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
• తొలి తెలుగు ఉదాహరణకావ్యము - బసవోదాహరణము
• తొలి తెలుగు పత్రిక - సత్యదూత
• తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము
• తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం
• తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
• తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
• తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
• తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
• తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము
• తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము - సకల నీతి సమ్మతము
• తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం
• తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర
• తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు (1925)
• తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).
• తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు - ఐ.కొండలరావు 1938
తెలుగు ఆవిష్కరణలు
తెలుగువారి ఆస్తులు, ఆవిష్కరణలు వారికొక గుర్తింపునిచ్చాయి. వాటిలో కొన్ని.
• మువ్వన్నెల జెండా- పింగళి వెంకయ్య తయారుచేసింది
• ఒంగోలు గిత్త
• తిరుపతి లడ్డు
• అమృతాంజనం -దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 'ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది.
• కూచిపూడి నృత్యం
• అవధానం అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, శతసహస్రావధానం
• ఔషధాలు-మెథోట్రెక్సేట్.టెట్రాసైక్లిన్ .అరియోమైసిన్.హెట్రాజన్.విటమిన్ బి 12 ఫోలిక్ ఆమ్లం .వీటన్నిటిని ప్రపంచానికి అందించింది ఓ తెలుగు వ్యక్తే, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు .
• స్టెంట్ ..అబ్దుల్ కలామ్ సహకారంతో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ సోమరాజు రూపొందించిన 'స్టెంట్' హృద్రోగులకు ఓ వరం.
• కోహినూరు వజ్రము-గుంటూరు సీమలోని కొల్లూరు లో పుట్టింది.
• ఆవకాయ బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.మాగాయ. తేనె ఆవకాయ
• పీవీ సరళీకరణ విధానం, ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం.బాలమురళి శాస్త్రీయం, బాలూ లలితగానం.చిరంజీవి నటన, వి.వి.యెస్.లక్ష్మణ్ అద్భుతాల క్రికెట్టు, శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు.నాయుడమ్మ వైద్యం, బాపూ చిత్రం.
• గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, చిరాల, నారాయణపేట, మచిలీపట్నం చేనేతలు.
• బంగినపల్లి మామిడిపళ్లు, పలాస జీడిపప్పులు,ఆత్రేయపురం పూతరేకు లు, బందరు లడ్డూలు, తాపేశ్వరం కాజా లు.
• గోంగూర పచ్చడి .
• తెలంగాణ బతుకమ్మ పండగ
• తెలంగాణ సమ్మక్క-సరలమ్మ జాతర
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం భాగం 3/12
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
భాగం 3/12
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
--------------------
2. సార్వభౌమత్వము - సామ్రాజ్య విధానము
ప్రస్తుత సామ్రాజ్యవాదం
ప్రస్తుత ప్రపంచంలో, స్వార్థంతో ఒక ప్రభుత్వం
- ఇతర దేశాలపై దాడిచేసి,
- వలస రాజ్యాలనేర్పరచి,
- తమ జాతిలో అల్పులైనవారిని కూడా ఉన్నతాధికారులను చేసి,
- వారి పరిపాలన ద్వారా అనేక విధాలుగా ఆ దేశాల ప్రజల ధన మాన ప్రాణాలను కొల్లగొట్టటం నేటి సామ్రాజ్యవాదం.
బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పాలించడం వీటికి ఒక గొప్ప ఉదాహరణ.
వ్యాపార విస్తరణ పేరుతోనూ, మానవ వనరులు సంపదలు ఉపయోగించుకుంటూనూ, ఇతర దేశాల సంపద దోచుకొనడం మరొక విధమైనది. దీనిని మనం ప్రస్తుతం చూస్తున్నాం.
రామాయణం - ఇక్ష్వాకు వంశ సార్వభౌమత్వం
వాల్మీకి రామాయణంలో, ఈ భూమండలమంతా ఇక్ష్వాకు వంశీయులది అని పేర్కొనబడింది.
అయోధ్య కేంద్రంగా ప్రత్యక్ష పరిపాలన అందిస్తూ సార్వభౌమత్వాన్ని వారు కలిగియున్నారు.
కానీ వారంతటవారు ఇతర రాజ్యాలపై ఆధిపత్యానికి ఎప్పుడూ సంకల్పించలేదు.
శ్రీరాముని పరిపాలన.
శ్రీరాముడు -
* తనంతట తాను ఏ దేశము మీదా దండయాత్ర చేయలేదు.
ఆయా దేశాల రాజ కుటుంబీకుల సభ్యులుగానీ, మహర్షులుగానీ కలసినమీదటనే, ఆయా దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నాడు.
* కిష్కింధను గానీ, లంకను గానీ, ఏ ఇతర రాజ్యాలనుగానీ కొల్లగొట్టలేదు.
* వారి భూములను ఆక్రమింపలేదు.
* ఆ రాజ్యములలో తనవారిని ఉద్యోగాలలో నియమింపలేదు.
* కప్పములు కోరలేదు.
* పరిపాలనాధికారములందు జోక్యము కలిగించుకోలేదు.
* ఒక్కసారియైన వారి రాజధానీ నగరములలో ప్రవేశింపలేదు.
* గంధర్వులు ప్రవేశించిడంవంటి ప్రత్యేక పరిస్థితులలోతప్ప,
ఆ రాజ వంశములకు చెందినవారినే ప్రభువులను గావించాడు.
భారతీయత
సర్వ శక్తిమంతులుగా ఉంటూ,
దురాక్రమణలు చేయక - చేయబడక,
ఇతర దేశాలపై నియంత్రణ - పరిపాలనాధిపత్యాలు లేకుండా,
సర్వస్వతంత్ర దేశంగా,
ప్రపంచదేశాలకు మార్గదర్శిగా,
సార్వభౌమత్వాన్ని కలిగి ఉండడమే "భారతీయత" అనేది శ్రీమద్రామాయణం ద్వారా తెలుస్తుంది కదా!
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
పేద విద్యార్దులకు
స్కూల్ బుక్ అవసరమైన
పిల్లలు
మరియు స్కూల్ ఫీజు కట్టలేని
పిల్లలు ఈ క్రింది
నంబర్లలో సంప్రదించగలరు
9460031554
9826858785
9001236414
7489587851
9549677770
9098321420
9314459474
9879537809
9828926151
9825700070
9328620003
9727215130
9826267649
9879200245
9888989746
8107371224
9653150004
9406824074
8889712233
8889995731
9926311234
9752033255
8889995733
9826813756
వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని పంపండి.
పిల్లల జీవితాన్ని మార్చడానికి మీ సహాయం
అవసరం చదివి ఇతరులకు పంపండి "ప్రార్థించే
చేతుల కంటే సహాయం చేసే చేతులు మేలు
+91 97037 40212: తల్లి తండ్రులు లేని పిల్లలు ఎవరయినా డిగ్రీ చదివి ఉంటే వారికి ఉచితంగా IAS 2020 బ్యాచ్ లో Dr. Kalam IAS Academy, Bangalore నందు ఉచిత శిక్షణ ఇవ్వబడును.
దయచేసి మీ మీ మిత్రులతో లేదా గ్రూప్ లలో షేర్ చేయగలరు అనాధ పిల్లల కోసం.
Dr. Kalam IAS Academy, Bangalore.
95352 16127
Plz forward
🙏
అన్ని గ్రూప్ లకు తొందరగా పంపించండి
తెలియనివాళ్ళు తెలుసుకొని apply చేస్తారు
BC, SC, ST, OC & Minority విద్యార్దిని/ విద్యార్థులకు
ఉచిత రెసిడెన్సియల్
NURSING TRANING GNM COURES: AVELABLE
NURSING చదవాలని ఆశక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలియజేయండి
& Inter pass any group Qualification Candidates Eligible
*Well equipped labs.
*Qualified faculty members
వివరాలకు:
*Cell : 9963287740*
ముఖ్య గమనిక:
1.నో హాస్టల్ ఫీజు
2. నో కాలేజ్ ఫీజు.
3.నో బిల్డింగ్ ఫీజ్.
ఇతర గ్రూపులకు పంపండి
పేద విద్యార్దులకు సహాయంచేయండి.🙏
*కాసింత పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!*✍✍✍✍✍✍✍✍
శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-31
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-31🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా!
అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో.
అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంతవరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు.
రాజు అర్పించిన బంగారు పూలను వద్దని, మహాభక్తుడైన కురువనంబి (కుమ్మరిదాసు) అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వేంకటేశ్వరుడు! ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు! అనంతాళ్వార్ల వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి!
తిరుమలనంబిని బ్రోచినవాడు! భక్తుడైన తిరుకచ్చినంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు! అట్టి వేంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యులవారు అంటున్నారు.
కుమ్మరిదాసుకు మోక్షమొసగుట
శ్రీవేంకటాచలమునకు నాలుగు మైళ్ళ దూరములో ‘‘గుర్వాకము’’ అనే పల్లెగ్రామము వుంది! ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు. ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు.
భీముడు మన్ను త్రొక్కినా, కుండలు చేసినా శ్రీనివాసుణ్ణే నిరంతరం జపిస్తూండే వాడు. వారికి తమ వృత్తి, వేంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరో ఆలోచనగానీ మరో పనిగానీ లేదు. మట్టితో సింహాసనము చేసి దాని మీద మట్టితో చేసిన వేంకటేశ్వరస్వామిని పెట్టి, మట్టి పువ్వులతో పూజించేవారు. ఒక్కొక్కసారి శ్రీస్వామివారి నామస్మరణలో శరీరము మరచిపోయేవారు.
భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయముగా తన భక్తుడైన తొండమానునకు చెప్పాడు.
శ్రీనివాసుడు భోజన ప్రియుడు. భక్త జన ప్రియుడు.. ఘుమ ఘుమ లాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్లేదు.
స్వామి వారి కృపకు పాత్రులు కావాలంటే చిడికెడు ప్రసాదం పెట్టినా చిన్న బుచ్చుకోరు కానీ శ్రీవారు భక్తి రసం తగ్గితే మాత్రం అస్పలు ఒప్పుకోరు.
ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో స్వామిని పూజించే వారు. నా అంత భక్తి పరులు లేరని ఒకింత గర్వంతో ఉండేవారు.
ఓ రోజు శ్రీనివాసుని పాదాల చెంత స్వర్ణ పుష్పాల స్థానంలో మట్టిపూలు కనిపించాయి. ఇదేమి స్వామీ అంటూ శ్రీవారిని ప్రశ్నించాడు
తొండమానుడు. దానికి స్వామి ఇవి కురువనంబి అనే భక్తుడు సమర్పించాడు. అతడి భక్తి అనితరసాధ్యం అని మెచ్చుకున్నారు స్వామి వారు. స్వామిని ఇంతగా పరవశింపజేసిన ఆ భక్తుడెవరో చూద్దామని తొండమాన్ చక్రవర్తి వెళ్ళారు. కుండలు చేసుకుంటున్న కురవనంబిని చూసి వెంటనే అతడి పాదాలమీద పడి నా ఆహాన్ని కన్నీళ్లుగా కరిగించుకుంటాను అనుమతినివ్వు భక్తా అని వేడుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోయారు తొండమానుడు.
ఇంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతున్నారు. స్వామివారికి కుమ్మరిదాసు భక్తి, ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టిమూకుడులో సద్ది సంకటి పెట్టాడు.
స్వామి వారు ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు
మట్టి పాత్రలో భోజనము పెట్టి మట్టిచెంబుతో దాహమిచ్చింది.
ఆ పరంధాముడు ఆనందముగా విందు ఆరగించేడు. ఆ తరువాత స్వామి కరుణ వల్ల స్వర్గం నుండి విమానము వచ్చింది.
ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయముగా కూర్చుండబెట్టి స్వర్గలోకానికి సాగనంపేడు.
ఇప్పటికీ తిరుమలలో మహామహ ప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతలినుంచే సమర్పిస్తారు.
కానీ ఓటికుండలోని దద్యోదనం మాత్రం నేరుగా శ్రీవారి పాదాల చెంతకు చేరుతుంది. పరమ భక్తుడి పట్ల శ్రీవారి ప్రేమకు నిదర్శనం.
ఏరోజుకారోజు కొత్తకుండ నైవేద్యం కాబట్టి పాత్రలను తోమాల్సిన పనిలేదు. అందుకే అన్నమాచార్యుని సంకీర్తనలలో శ్రీవేంకటేశ్వరుడు తోమని పళ్లేలవాడయ్యాడు.
ఆమని మ్రొక్కుల వాడు ఆది దేవుడే వాడు తోమని పళ్లేల వాడే దురిత దూరుడే.. వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని అంటూ తన్మయత్వం చెందాడు అన్నమాచార్యుడు.
బ్రహ్మాండ రూప గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ చక్ర భూషణ గోవిందా, శ్రీ శంఖ రంజిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||
*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
మనసు పడ్డాను
శశి...
ఎంతగానో మనసు పడ్డాను
నీవు పక్షానికోసారి కానరావు
నేనెంత వేదన పడతానో
పున్నమివేళ ఎంత ఆనందమో.
రాత్రంతా చల్లని కబుర్లు
తెల్లవారేసరికి వెళ్ళిపోతావు
నీలిమేఘాలు అడ్డుతెర వేస్తే
నీ అందం మసక మబ్బులో..
ఎన్నేళ్ళ నుండో నిను చేరాలని
నీ అచ్చటముచ్చట తీర్చాలని
నా మనో వేదన వినిపించాలని
దరిచేరి ప్రేమ కధ చెప్పాలని.
నా విక్రమార్క ప్రయత్నం
ప్రయత్నం వమ్ము కాలేదు
నిను చేరాను ఎట్టకేలకు
ఇక మాటాడుకుందాం రా.
ఊరించి లాలించి ఉన్నావుగా
కవ్వించి నా కైపు పెంచావుగా
అందాలన్నీ చాటు చేశావుగా
ఇక ఆరబోయి నీ అందాలు.
నీ హృదయంలో ఎన్ని భావాలో
నీకు ద్రవించే గుణముంటే
నీతో చేస్తాను ప్రణయం
నా చరమాంకం దాకా ప్రేమిస్తా!.
శశి... నీ వదనం అద్బుతం
శివయ్యకు చేరావు నెలవంకవై
జాబిల్లివై మా మనసు దోచావు
అందాల భామా నీ ప్రేమ కధ ఏమిటమ్మా!.
తెలిసిందిలే నీ మనసు తెలిసిందిలే...
అందుకు నా రాకను స్వాగతించినావు...
మనసు తెరలు విడిచి
ఎన్ని కబుర్లు చెప్పబోతున్నావు.
శశి.. నిన్ను వదిలి పోలేనులే
మన ప్రేమకు పట్టం కడదామిక.
శశి చెంతన విక్రముడు
కాలమంతా ప్రేమకధలే
ఏ అడ్డంకి రానంత వరకు
పాడుకుందాం ప్రేమ పాటలు.
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
9391456575.
తెలుగు వాడిగా
ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....
నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.
1. తెలుగు భాష సుమారు క్రీ. పూ.1 400 క్రితం నుండి వుంది.
2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.
మొదటి లిపిగ కొరియన్ భాష.
3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.
4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.
5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.
6. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాష లో కూడా పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి చెందిన నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .
7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.
ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.
8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.
9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.
10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.
11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.
12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.
13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.
14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.
కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.
15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.
16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే.
తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.
పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి ఆంగ్లం లో తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన.
ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం.
ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు.
తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం.
ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేయండి.
బసవ పురాణం 16 వ భాగము......!!
🎻🌹🙏 బసవ పురాణం 16 వ భాగము......!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఆయన చూచి జంగమయ్యకు సేవ చేసి మాట్లాడాడు. సంభాషణలో జంగమయ్య తాను దరిద్రుణ్ణనీ కిన్నర బ్రహ్మయ్యగారిని దర్శించి వారి అనుగ్రహంతో శ్రీమంతుడు కావాలనే ఉద్దేశం ఇంత శ్రమపడి వచ్చానని చెప్పాడు.
🌿అది విని కలకౌత బ్రహ్మయ్య చాలా బాధపడ్డాడు.జంగమయ్యా! సంపద కొరకే అయితే కలకౌత బ్రహ్మయ్య గారి వద్దకే పోనక్కరలేదు.
🌸ఇలారా అని పిలిచి ఒక రాళ్ళ గుట్టను తనచేతిలోని కోలతో తాకించాడు. మరుక్షణమే గుట్ట మొత్తం నిధి క్రిందికి మారిపోయింది.
🌿అది చూచి జంగమయ్య ఆనందాశ్రువులు జాలువార్చుతూ బ్రహ్మయ్యకు శరణు చేసి నగరంలోకి పరుగెత్తుకుంటూ పోయాడు.
🌸 నేరుగా బసవన్నను కలిసి జరిగినదంతా చెప్పి ‘కలకౌత బ్రహ్మయ్య నాకిచ్చిన ధనం మోయడానికి నా ఒక్కడివల్ల సాధ్యం కావడంలేదు.
🌿ఎవరినైనా ఒక భటుణ్ణి సాయం పంపు’ అని కోరాడు.అది విని బసవన్న ఆశ్చర్యపడ్డడు.ఇంద్రజాలాన్ని తన
🌸కాయకవృత్తిగా స్వీకరించిన కలకౌత బ్రహ్మయ్య ఇంత నిధిని నీకుఇచ్చాడంటే అది శివభక్తులకు మాత్రమే సాధ్యం.
🌿చింతామణికి కల్పవృక్షానికీ కామధేనువుకూకూడాసాధ్యంకాదుఅవి ఏవో ఒక్కటే ఇవ్వగలుగుతాయి. మేరువు చిన్న బంగారానే్న ఇవ్వగలుగుతుంది.
🌸కాని కలకౌత బ్రహ్మయ్య సర్వార్థసిద్ధి చేయగలడు అని బసవన్న జంగమయ్యకు ఒక సేవకుణ్ణి ఇప్పించి తాను స్వయంగా వెళ్లి కలకౌత బ్రహ్మయ్య పాదాలను శరణు చేశాడు.
🌿ఈ విషయం తెలిసి కిన్నర బ్రహ్మయ్య కూడా వచ్చి కలకౌత బ్రహ్మయ్యను ప్రస్తుతించాడు. కలకౌత బ్రహ్మయ్య వారందరికీ విందు భోజనం పెట్టాడు.
🌸మోళిగ మారయ్య కథకల్యాణ నగరంలో మోళిగ మారయ్య అనే శివభక్తుడు మరొకడు ఉన్నాడు.
🌿ఆయన కట్టెలు కొట్టడం తన కాయకంగా స్వీకరించాడు. అడవి నుండి తెచ్చిన కట్టెల మోపును అంగడిలో విక్రయించి ఆ ధనంతో జంగమార్చన చేస్తూ వుండేవాడు. ఇలా
🌿వుండగా ఒకసారి శివభక్తులు బసవన్న ఇంట భుజిస్తూ వున్న సమయంలో ‘బసవన్నా! మేము లోగడ మోళిగ మారయ్య ఇంట శివపూజ చేశాము.
🌸ఆయన మాకిచ్చింది అంజలి మాత్రమే. అయితేనేమి అది పృథ్విలోని సమస్త మధురాతిమధురమైన పదార్థాలన్నిటికన్నా గొప్పగా వుందయ్యా అని ప్రశంసించారు.
🌿బసవన్నకు ఒకసారి మారయ్య ఆతిథ్యం చూడాలని కోరిక గలిగింది. అందుకని మారువేషం వేసుకొని మోళిగ మారయ్యగారింటికి వెళ్లాడు.
🌸అప్పుడు మారయ్య అడవికి వెళ్లాడు. మారయ్య భార్య ఎవరో జంగమయ్య వచ్చాడని భావించి శరణు చేయడానికి వచ్చింది.
🌿మారయ్య భార్య బసవన్నకు అర్ఘ్యపాద్యాదులిచ్చి ‘అమ్మో! మా లింగయ్య ఆకలితో వున్నాడమ్మ! వడ్డించాలి’ అని ఇంట్లోకివెళ్లింది.
🌸ఆ సమయం చూచి రెండు వేల మాడలను ఒక మూల బసవన్న ఉంచాడు. తర్వాత మారయ్య భార్య చేసిన ఆతిథ్యం స్వీకరించి బసవన్న వెళ్లిపోయాడు.
🌿తర్వాత మారయ్య వచ్చాడు. కట్టెల మోపు దింపి కాళ్ళు చేతులు కడుక్కొని జంగమయ్యలను పిలిచి అర్చించి తాంబూలాలు సమర్పించి గినె్నను చూచేసరికి దాని కింద రెండు వేల మాడలు అతికించబడి వున్నాయి.
🌸మారయ్య ఆశ్చర్యపడి భార్యను పిలిచి ‘ఈ ధనమెక్కడి’దని ప్రశ్నించాడు. ‘ఏమో నేనెరుగను. ఇందాక ఒక జంగమయ్య వచ్చి శివ పూజ చేసి వెళ్లాడు’ అన్నదామె.
🌿మారయ్య తన్మయంతో చేతులు జోడించి ‘‘పిచ్చిదానా! మామూలు జంగమయ్య కాదే ఆ వచ్చింది. బసవేశ్వరుడే మారువేషంలో మనలను పరీక్షించడానికి వచ్చాడు.
🌸పేద భక్తుల వ్యధలు తనవిగానే భావించే బసవన్న మాత్రమే ఇలా రహస్యంగా ఇస్తుంటాడు. బసవా! నీ బిడ్డలమీద ఇన్నాళ్ళకు దయ వచ్చిందా తండ్రీ!
🌿ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చి నా యిల్లును పావనం చేశావా? అని పరవశంతో బసవన్నను స్మరిస్తూ వుండిపోయాడు.
🌸ఆవేశం తగ్గాక మారయ్య బసవా! నీవు ధనమిచ్చావు కాని నాకు దానితో మాత్రమే పనిలేదయ్యా! నాకీ కాయకముండగా ఇంకో ధనమెందుకు?
🌿అని ఇద్దరు జంగమయ్యలకు ఆ రెండు వేలూ తాంబూలాలతో అందించాడు.వారా ధనాన్ని తీసుకొన్నాక పోతూ మారయ్య భక్తిని బసవని ముందు ప్రశంసించారు.
🌸కట్టెలు కొట్టుకునే మారయ్య జంగమయ్యలు వస్తే రెండు వేల మాడలిచ్చాడు. ఇంతటి భక్తులెవరుంటారు?’ అన్నారు వారు.
🌿బసవడిది విని పరుగుపరుగున మారయ్య ఇంటికి మళ్లీ వచ్చాడు.బసవన్న రాగానే ఆయన పాదాలపై మారయ్య పడి బసవా భక్త పరాధానా! కరుణించు తండ్రీఅని వేనోళ్ల పొగిడాడు.
🌸బసవన్న కంటి వెంట అశ్రువులు దొర్లాయి. మారయ్యా! నన్ను క్షమించు. నా పాడు బుద్ధితో నీకేదో సంపద లిద్దామని వచ్చాను.
🌿ఇచ్చాననుకున్నాను. కాని నీవు పరధనాన్ని స్వీకరింపని భక్త శిఖామణివనీ, నేనిచ్చిన ధనం అప్పుడే జంగమయ్యల కిచ్చావనీ తెలిసి నివ్వెరపోయాను.
🌸మారయ్యా! నీ గొప్ప గుణం నేనెట్లా తెలుసుకోగలను? నీవు కనకాద్రివి- నేను కాకిని; నీవు పరుసవేదివి, నేను ఇనుమును; నీవు గుణనిధివి, నేను దుర్గుణడను.
🌿నాలో చిన్న మంచి గుణం కూడా లేదు మారయ్య తండ్రీ! వెలివాడలో వేదఘోష విన్పడదు. ఆవములో రాగిచెంబులుండవు. నిప్పుల కుంపటిలో తామర దుంపలు మొలవవు...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
పుష్పకవిమానాల గురించి
మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -
ఈ ప్రపంచం లో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు . నా పరిధిని అనుసరించి కొంతసమాచారం నేను సేకరించాను . అది ఇప్పుడు మీకు తెలియచేస్తాను.
ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు . ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు భయపడ్డాడు . అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాల్ని అత్యంత రహస్యముగా ఉంచాడు.
అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు. వాటిలో ఒక అద్బుత గ్రంథం " గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు " దీని గురించి చరిత్రకారులు కు తెలుసు కాని వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు . ఈ పుస్తకం ప్రధానంగా "గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ" సమాచారం కలిగి ఉంటుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంధాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు .దీనికోసం చాలామంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు.
కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి. అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి . వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు. వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియచేసారు.
లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్థ్రాలుగా పేర్కొన్నారు . ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేసారు. అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకొనే "యాంటిమ" చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే "గరిమ" , పెద్ద వస్తువుని సైతం బరువుతక్కువ గా చేయగల "లగిమ" రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి.
చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్ గా తీసుకోలేదు . ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది . యాంటి గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి .
గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలు లో అంత వివరంగా లేదు . కాని మొత్తంమీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి . భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంతో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది . రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడి పైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదరభాగంలో ప్రతిష్టించింది . ఇది రామాయణంలో నేను కూడా చదివాను.
నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ , ఏరోస్పేస్ టెక్నాలజీ కి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే . వారి పూర్తిపరిజ్ఞాన్ని మనం అర్ధం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకి వెళ్లవలిసిందే .
ఉత్తర భారతదేశం ,పాకిస్తాన్ లో ఉండేది అని చెబుతున్న "రామరాజ్యం" పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది. ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి. వీటిలో చాలామటుకు నగరాలను పాకిస్తాన్ , ఉత్తరపశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మద్యభాగంలో "అట్లాంటియన్ " నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరత ఖండంలో రాముడు రాజ్యం చేసాడు .రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో "సప్తఋషి" నగరాలుగా ప్రసిద్ది చెందాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ఉపయోగించే వారని ప్రాచీన బారతీయ గ్రంథాలలో ఉన్నది . భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు , పైభాగాన గుమ్మటం ( డోము ) బయట చుట్టూరా రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియచేశాయి .
ఈ విమానం అనేది వాయువేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడినది. అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి . ఈ విమానాల్ని తయారుచేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు. ఈ విమానాల్లో కొన్ని సాసర్ ఆకారంలో మరికొన్ని సిగిరెట్ ఆకారం లో నిలువుగా కూడా ఉండేవి .
విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం "సమరసూత్రధార" ఈ గ్రంధంలో విమానం తయారి , అది బయలుదేరే తీరు , వేలాది మైళ్ళు ప్రయాణించుటకు కావలిసిన వివరాలు , బలవంతంగా దానిని కిందకి దించే విధానం , ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టటానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విశదపరిచే 230 శ్లోకాలు ఈ గ్రంధరాజంలో ఉన్నాయి.
క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్బుత గ్రంథం "భరద్వాజ వైమానిక శాస్త్రం" ఈ గ్రంధాన్ని 1875 వ సంవత్సరం లో ఒక ఆలయంలో కనుగొన్నారు. విమానాల పనితీరుపైన ఇందులో చాలా ఆసక్త్తికరమైన ముఖ్యవిషయాలు ఉన్నాయి . విమానాన్ని ఎలా నడపాలి , దూరప్రాంతానికి ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు , మెరుపులు నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్యవిషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి . విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరోక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవడం పై విస్కృత సూచనలు ఉన్నాయి . బహుశా ఆ ఉచిత ఇంధనవనరు యాంటి గ్రావిటి కావొచ్చు అని పరిశోధకుల అభిప్రాయం . ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి .
"వైమానిక శాస్త్ర " లో నిప్పంటుకోని,విరగని సామగ్రి , పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు , బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . ఈ వాయువాహనాల్లో ని 31 ప్రధాన భాగాలను , వాటి తయారీకి ఉపయోగించే 16 పదార్థాలు , సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రధాన భాగాల తయారికి ఉపకరించే సామాన్లు , పదార్థాలు వేడిమికి , మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించాడు .
ఈ విమానాలు ఒక రకమైన యాంటి గ్రావిటీ తో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కరలేదు అని చెప్పుకోవచ్చు. విమానాలు నిలువుగా గాలిలో లేచేవి . ప్రాచీన కాలంలో గగనవిహారం పైన దాదాపు 70 మంది సాధికార వ్యక్తులు , 10 మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు.కాని వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు .
విమానాలని విమానగృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరచేవారు. విమానాలను కొన్నిసార్లు పసుపుఛాయతో ఉండే తెల్లనిద్రవంతో మరికొన్నిసార్లు ఒకరకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది . ఈ ఇంధనం విషయంలో చాలమంది పరిశోధకులు సరైన అవగాహనకి రాలేకపోయారు . ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయొగించుటకు పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేసి ఉంటారు .
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ V -8 "బజ్ బాంబులు" కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేశారు . ప్రాచీన భారతావని , టిబెట్ అంటే నాజీలు , వారి అధినాయకుడైన హిట్లర్ కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు . ఈ దేశాల్లోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్ కి నమ్మకం .
ప్రాచీన భారతావని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం . ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన "రహస్య సాక్ష్యాధారాలు" కోసం వాటిని సేకరించడానికి 30 వ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు.
మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలో ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉన్నది. విమానం గుండ్రంగా ఉన్నది. పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోధకుడు దానిని అన్నివైపులా తిప్పగలిగేలా ఉండేది . మరో ప్రాచీన గ్రంథం "సమర" లో లో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి . వెనుక భాగంలో మండే అగ్నికీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది.
" సమరాంగణ సూత్రధార " ఈ వాహానాలని ఎలా నిర్మించారో వర్ణించింది. పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలీయమైన సంభంధం ఉన్నది. నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉన్నది.
సోవియట్ పరిశోధకులు తుర్కుమెనిస్థాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు . వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది . ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలిన్ తో తయారుచేసిన అర్ధగోళాలు వీటిచివర్లు మొనదేలి ఉన్నాయి . లోపల కొన్నిచుక్కల పాదరసం లభించింది.
రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయ్యింది .కాని ఆ లిపి యొక్క అర్థం ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. మొహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపి ని రాంగో లిపి అంటారు. ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
భవభతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదోవ శతాబ్దం నాటిది . ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది. అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాలు గురించి ఎన్నో విషయాలు తెలియచేశాయి . అట్లాటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాలు గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది.
భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి. ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు . ఇవి వివిధ ఆకారాల్లో , పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలురకాలుగా వివరించాయి.
"అగ్నిహోత్ర విమానం" రెండు ఇంజన్ల తో ఉంటుంది. "గజవిమానం" అనేక ఇంజన్లతో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాలకొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి. పరిశోధకుల అబిప్రాయం ప్రకారం ఇవి 80,000 హార్స్ పవర్ శక్తితో నడిచేవి .
పది నుంచి పన్నెండువేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉన్నది. ఆనాటి యుద్ధంలో భయంకరమైన విద్వంసక ఆయుధాలు ఉపయోగించారు . వాటిలో అప్పుడు జరిగిన యుద్దం గురించి ఈ విధంగా వివరణ ఉన్నది.
" ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది. కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలుని ఆవరించిన పొగ ...ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలవంతమైన వెలుగులతో నిండిన అగ్నికీలలు ...మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మన్దమైన మృత్యుసందేశ వాణి ఇవన్ని కలిసి అంధకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి " .
పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి. మట్టివస్తువులు ,ఇళ్లు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి. పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారపదార్థాలు అన్ని ఆ ప్రళయ బీభత్సానికి గురిఅయ్యాయి. దానిబారి నుంచి రక్షించుకొనుట కొరకు , తమ దేహాలు , ఆయుధాలు, వస్తుసామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు , కాలువల్లోకి దూకారు . ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణు యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉన్నది.
గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలలో కొన్నిటికి చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు. వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమ్మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయ్యినట్టుగా తేల్చారు. ఇటుకలు, గాజు కరిగి ముద్దలా పడివున్నాయి . ఒకరకంగా చెప్పాలి అంటే హిరోషిమా , నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబులు కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది.ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ప్రాన్స్ , టర్కీ , స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి .
మహేంజదారో వీధులలో గాజు గోళాల వంటి నల్లటి పదార్థం పెద్దమొత్తంలో పేరుకొనిపోయింది. వీటిని పరిశీలించగా అత్యంత వేడిమిదగ్గర కరిగిన మట్టికుండలు అని తేలింది . ఇక్కడ ఇంకొ ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉన్నది . మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండువేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినపుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్లెం వంటి ఆకారాలు కలిగిన వాయువాహనాలు విరుచుకుపడ్డాయి అని కాని ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారుల తమ గ్రంథాలలో రాశారు.
ఆధునిక పరిశోదకుల అబిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు. పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉన్నది . బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటారు.
మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
శాశ్వతైశ్వర్య మిచ్చి
శాశ్వతైశ్వర్య మిచ్చి సదా నను బ్రోచునో
సకల బాధలను పెట్టి సంకట బడచూచునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
ఎందు కొరతలేని బ్రహ్మానంద మొసగునో
ఎప్పటికీలాగుననే హింసపరచి యేచునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
నందనునిగ భావించి నన్ను గౌరవించునో
నలుగురి లోపల మిక్కిలి నగుబాటొనరించనో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
వెరువకుమని అభయమిచ్చి వేగమే రక్షించునో
వీడధముడు దుష్టుడనుచు విడువక శిక్షించునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
- శ్రీ మళైకొండ రామదాసు
గానం - శ్రీ యం బాలమురళీకృష్ణ
🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-31🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-31🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా!
అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో.
అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంతవరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు.
రాజు అర్పించిన బంగారు పూలను వద్దని, మహాభక్తుడైన కురువనంబి (కుమ్మరిదాసు) అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వేంకటేశ్వరుడు! ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు! అనంతాళ్వార్ల వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి!
తిరుమలనంబిని బ్రోచినవాడు! భక్తుడైన తిరుకచ్చినంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు! అట్టి వేంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యులవారు అంటున్నారు.
కుమ్మరిదాసుకు మోక్షమొసగుట
శ్రీవేంకటాచలమునకు నాలుగు మైళ్ళ దూరములో ‘‘గుర్వాకము’’ అనే పల్లెగ్రామము వుంది! ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు. ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు.
భీముడు మన్ను త్రొక్కినా, కుండలు చేసినా శ్రీనివాసుణ్ణే నిరంతరం జపిస్తూండే వాడు. వారికి తమ వృత్తి, వేంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరో ఆలోచనగానీ మరో పనిగానీ లేదు. మట్టితో సింహాసనము చేసి దాని మీద మట్టితో చేసిన వేంకటేశ్వరస్వామిని పెట్టి, మట్టి పువ్వులతో పూజించేవారు. ఒక్కొక్కసారి శ్రీస్వామివారి నామస్మరణలో శరీరము మరచిపోయేవారు.
భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయముగా తన భక్తుడైన తొండమానునకు చెప్పాడు.
శ్రీనివాసుడు భోజన ప్రియుడు. భక్త జన ప్రియుడు.. ఘుమ ఘుమ లాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్లేదు.
స్వామి వారి కృపకు పాత్రులు కావాలంటే చిడికెడు ప్రసాదం పెట్టినా చిన్న బుచ్చుకోరు కానీ శ్రీవారు భక్తి రసం తగ్గితే మాత్రం అస్పలు ఒప్పుకోరు.
ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో స్వామిని పూజించే వారు. నా అంత భక్తి పరులు లేరని ఒకింత గర్వంతో ఉండేవారు.
ఓ రోజు శ్రీనివాసుని పాదాల చెంత స్వర్ణ పుష్పాల స్థానంలో మట్టిపూలు కనిపించాయి. ఇదేమి స్వామీ అంటూ శ్రీవారిని ప్రశ్నించాడు
తొండమానుడు. దానికి స్వామి ఇవి కురువనంబి అనే భక్తుడు సమర్పించాడు. అతడి భక్తి అనితరసాధ్యం అని మెచ్చుకున్నారు స్వామి వారు. స్వామిని ఇంతగా పరవశింపజేసిన ఆ భక్తుడెవరో చూద్దామని తొండమాన్ చక్రవర్తి వెళ్ళారు. కుండలు చేసుకుంటున్న కురవనంబిని చూసి వెంటనే అతడి పాదాలమీద పడి నా ఆహాన్ని కన్నీళ్లుగా కరిగించుకుంటాను అనుమతినివ్వు భక్తా అని వేడుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోయారు తొండమానుడు.
ఇంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతున్నారు. స్వామివారికి కుమ్మరిదాసు భక్తి, ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టిమూకుడులో సద్ది సంకటి పెట్టాడు.
స్వామి వారు ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు
మట్టి పాత్రలో భోజనము పెట్టి మట్టిచెంబుతో దాహమిచ్చింది.
ఆ పరంధాముడు ఆనందముగా విందు ఆరగించేడు. ఆ తరువాత స్వామి కరుణ వల్ల స్వర్గం నుండి విమానము వచ్చింది.
ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయముగా కూర్చుండబెట్టి స్వర్గలోకానికి సాగనంపేడు.
ఇప్పటికీ తిరుమలలో మహామహ ప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతలినుంచే సమర్పిస్తారు.
కానీ ఓటికుండలోని దద్యోదనం మాత్రం నేరుగా శ్రీవారి పాదాల చెంతకు చేరుతుంది. పరమ భక్తుడి పట్ల శ్రీవారి ప్రేమకు నిదర్శనం.
ఏరోజుకారోజు కొత్తకుండ నైవేద్యం కాబట్టి పాత్రలను తోమాల్సిన పనిలేదు. అందుకే అన్నమాచార్యుని సంకీర్తనలలో శ్రీవేంకటేశ్వరుడు తోమని పళ్లేలవాడయ్యాడు.
ఆమని మ్రొక్కుల వాడు ఆది దేవుడే వాడు తోమని పళ్లేల వాడే దురిత దూరుడే.. వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని అంటూ తన్మయత్వం చెందాడు అన్నమాచార్యుడు.
బ్రహ్మాండ రూప గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ చక్ర భూషణ గోవిందా, శ్రీ శంఖ రంజిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||
*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 9*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 9*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం*
*స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి |*
*మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం*
*సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ||*
అమ్మవారు మనలో కుండలినీ రూపంలో ఎలా విహరిస్తారో వివరిస్తున్నారు ఇక్కడ. మన శరీరం పంచభూతాత్మకమైనది. ఆ పంచభూతాలను నియంత్రించే కొన్ని కేంద్రాలు ఉన్నాయి.వీటిని అమ్మవారు నియంత్రిస్తుంటారు. వీటితోపాటు అంతఃకరణముల (మనసు,బుద్ధి,అహంకారము)లోని ఈశ్వర శక్తిని ధ్యానిస్తూ ఉండాలి.
మహీం మూలాధారే = మూలాధారమునందున్న భూతత్త్వమును,
కమపి మణిపూరే = కం అంటే జలము,కనుక మణిపూరము అందు జలమును
హుతవహం స్థిత స్వాధిష్టానే = స్వాధిష్టానము అందున్న అగ్ని తత్త్వాన్ని
హృది మరుతమ్ = అనాహత చక్రము అందున్న వాయుతత్త్వాన్ని
ఆకాశముపరి = దానిపైగల విశుద్ధిచక్రములోని ఆకాశతత్త్వాన్ని
మనోఽపి భ్రూమధ్యే = భ్రూమధ్యంలోకల ఆజ్ఞాచక్రములో మనోతత్త్వాన్ని ధ్యానించాలి.
సకలమపి భిత్త్వా కులపథం = కుల మార్గాన్ని ఛేదించి
మూలాధారం నుండి ఆజ్ఞాచక్రము వరకు కులము అంటారు. ఇందులో తిరిగే శక్తి అమ్మవారు.ఈ మార్గాన్ని దాటి అంటే ఛేదించి సదాశివుడు కొలువై ఉండే సహస్రారం చేరటం యోగం.శివ శక్తుల కలయిక. అదే సమయాచారం. సహస్రారపద్మం *అకులం* అనబడుతుంది.లలితా సహస్ర నామాలలో
*కులాంగనా, కులాంతస్థా, కౌళినీ, కులయోగిని*
*అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా* అనీ
*కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ*
*కులకుండాలయా కౌలమార్గతత్పర సేవితా* అని నామాలు.కుండలము అంటే మూలాధారం.
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే = సహస్రార కమలంలో సదాశివునితో కూడి ఇతరులకు గోచరించకుండా విహరిస్తున్నావు. సహస్రార పద్మము చేరటమే మోక్షము. అప్పుడు సాధకుడు జీవన్ముక్తుడవుతాడు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సోమవారం, ఆగస్టు 28, 2023*🌹రాశి ఫలాలు
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*
. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*సోమవారం, ఆగస్టు 28, 2023*
*శ్రీ శాలివాహన శకం: 1945*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*
*తిధి* : *ద్వాదశి మ3.28* వరకు
. *🌹రాశి ఫలాలు🌹*
*మేషం*
కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
*వృషభం*
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
---------------------------------------
*మిధునం*
ధన వ్యవహారాలలో చిన్న పాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు.
---------------------------------------
*కర్కాటకం*
గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
---------------------------------------
*సింహం*
ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు కార్యరూపందాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
---------------------------------------
*కన్య*
దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.
---------------------------------------
*తుల*
కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు . పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.
---------------------------------------
*వృశ్చికం*
చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
---------------------------------------
*ధనస్సు*
ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.
---------------------------------------
*మకరం*
ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
---------------------------------------
*కుంభం*
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.
---------------------------------------
*మీనం*
అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*
👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻
*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻
*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻
🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
The Sky Gets Dark Slowly"*
*లక్షల కాపీలు అమ్ముడుపోయిన*
*"The Sky Gets Dark Slowly"* అనే పుస్తకం
*ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం .......*
*'వృద్ధాప్యంలో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ సారాంశాన్ని ప్రస్తావించారు. నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి*.
*నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.*🌠
*నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు.*
*నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.*
*నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు.*
*కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.*
*దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు.*
*నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది*.
*యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు.*
*మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు.అందరితో ”నా కొడుకు అమెరికాలో… కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది” అని గర్వంగా చెప్తూ ఉంటావు.*
*”ఎన్నేళ్ళకు ఒకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది” మాత్రం చెప్పవు.*
*అమెరికా నుంచి పిల్లలు సెల్ ఫోన్ లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తారు. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. కానీ… వాడు చా….లా బిజీ.*
*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. “పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా..?” అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.*
*పక్క మీద గంటల, రోజుల తరబడి పడుకొని ఉండటం సాధారణం అవుతుంది.*
*”పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి” సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే… చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది.*
*ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో… వారు కూడా ఉండరు.*
*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా.., అసలు తినకపోయినా… మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో ఎందుకు తిరిగావనీ.., జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం ఎందుకు చేశావనీ.., కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.*
*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.*
*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే..,*
*నువ్వు సంపాదించిన డబ్బే..! అయినా… “నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా… చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా..?” అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.*
*మరేం చెయ్యాలి?*
*THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే… పై సమస్యల్లో ”కనీసం కొన్ని తగ్గించుకోవచ్చు” అంటాడు.*
*“ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.*
*ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు.*
*నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ ఉండు.*
*ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది… “అతి తొందరలో ఒంటరితనంగా” మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.*
*ప్రతి మనిషి చుట్టూ ఒక “తావి” ఉంటుంది... వయసు పెరిగే కొద్దీ అది “సుగంధ సౌరభ పరిమళంగానో.., దుర్గంధ పూరితoగానో…” మారుతుంది.*
*ఎలా మారుతుందనేది “నీ హుందాతనాల / నీ చాదస్త ప్రవర్తన” మీద ఆధారపడి ఉంటుంది.*
*పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు..! ఒక “వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం”.*
*వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు.*
*వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు. వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు.*
*నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు*.
*ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు.📖*
*ఏకాంతంలో సంగీతాన్ని విను.*📻🎼🎤
*ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు.*🌱🪴🌳
*చిన్న పిల్లలతో కొద్ది సేపు “వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్” కబుర్లు చెప్పు.* 🪅🧸🧮
*అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.*❤️
*“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు”*
*అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తక రచయిత...*
*జీవితం భళ్లున తెల్లవారుతుంది… మెల్లగా చీకటి పడుతుంది*
*సర్వేజనా సుఖినోభవంతు*🙏😊
బుధగ్రహ జననం - 1*
*నవ పురాణం - 38 వ అధ్యాయం*
🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*బుధగ్రహ జననం - 1*
ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వరుసలుగా కూర్చున్న విద్యార్థులు. వేదమంత్రాలను వల్లె వేస్తున్నారు. వాళ్ళపైన చెట్ల రెమ్మల్లో దాక్కున్న చిలుకలు వాళ్ళను అనుకరిస్తూ మంత్రాలు పలుకుతున్నాయి.
ఆగకుండా వినవస్తున్న పక్షుల కిలకిలరావాలూ , అప్పుడప్పుడు వినవచ్చే నెమళ్ల అరుపులూ ఆశ్రమ వాతావరణానికి నేపథ్య సంగీతం అందిస్తున్నాయి.
వల్లెవేస్తున్న విద్యార్థుల స్వరాన్ని ఏకాగ్రతతో గమనిస్తూ , ఆకర్షిస్తున్న బృహస్పతి కనుబొమలు ఎవరో కదిలించినట్టు కదిలి - ఒకదానికొకటి దగ్గరవుతూ - మధ్యలో కలుసు కుంటున్నాయి. ఆయన చూపులు - వయ్యారంగా , అందంగా మెలికలు తిరుగుతూ - పచ్చిక తీసుకున్న పాపటలా కనిపిస్తున్న కాలిబాట మీద నడుస్తూ వస్తున్న యువకుడి మీద కేంద్రీకృతమయ్యాయి.
చక్కటి శరీర నిర్మాణం. మెరిసిపోతున్న శరీర వర్ణం. చూపుల్ని ఆకర్షించి , పట్టివుంచే అందం. మగవాళ్లకు కూడా మళ్లీ చూడాలనిపించే చక్కదనం. ఎవరా యువకుడు ? ఇంద్రలోకంలో కూడా ఇంత అందగాడు. తారసిల్లలేదే !
తన వైపే చూస్తూ , ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుణ్ణి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు బృహస్పతి. యువకుడు బారులుగా కూర్చున్న విద్యార్థుల వెనక నిలబడి , వినయంగా బృహస్పతి వైపు చూస్తూ ఉండిపోయాడు.
*"ఎవరు నాయనా ?"* బృహస్పతి ప్రశ్నించాడు.
*“మీ దర్శనానికి వచ్చాను...”* చంద్రుడు వినయంగా అన్నాడు.
బృహస్పతి చేతిని పైకెత్తుతూ , శిష్య బృందాన్ని చూశాడు. శిష్యుల పఠనం ఆగిపోయింది. అలవాటు కొద్దీ చెట్టు మీద చిలుకలూ మౌనం ధరించాయి.
*"ఇలా దగ్గరగా రా !”* బృహస్పతి అన్నాడు. శిష్యుల తలలు ఒకసారి వెనుకకు తిరిగాయి. అందరి కళ్ళూ ఆ యువకుడి మీద నిలిచిపోయాయి. యువకుడు బృహస్పతి ముందు ఆగి , వినయంగా చూశాడు.
*"అనసూయ , అత్రిమహర్షి దంపతులు పుత్రుణ్ణి... నా పేరు చంద్రుడు...”.*
*“ఓహ్...ఆత్రేయుడివా !”* బృహస్పతి అడ్డు తగుల్తూ అన్నాడు.
*“చిత్తం. నా తండ్రిగారి ఆదేశం మేరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం మీ సన్నిధికి వచ్చాను. దయచేసి...”*
*"అలాగా !”* బృహస్పతి మళ్ళీ అడ్డొస్తూ అన్నాడు. అత్రి అనసూయ దంపతుల పుత్రుడిది అసామాన్య సౌందర్యం !
*"దయచేసి విద్యార్థిగా స్వీకరించి , విద్యాదానం అనుగ్రహించండి !"* అంటూ చంద్రుడు బృహస్పతికి పాదాభివందనం చేశాడు..
*"సుఖీభవ !"* బృహస్పతి దీవిస్తూ అన్నాడు.
*చంద్రుడు లేచి , ఆశ్చర్యంగా బృహస్పతి వైపు చూశాడు. "గురుదేవా ! నేను.... విద్యాదానం కోసం వచ్చాను..."*
బృహస్పతి కళ్ళు చిట్లించాడు. తన ఆశీర్వాదంలో సందర్భ శుద్ధీ , సమయ స్ఫూర్తీ , ఔచిత్యమూ లోపించాయని చంద్రుడు పరోక్షంగా గుర్తు చేస్తున్నాడు ! ఆయన మొహం మీద చిరునవ్వు మెరిసింది.
*"ఔను , విద్యార్థికి సుఖం ఉండదు. ఉండకూడదు !"* బృహస్పతి తనను దిద్దుకుంటూ అన్నాడు. కుడిచేతిని పైకెత్తి చంద్రుడి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. *"సకల విద్యా ప్రాప్తిరస్తు !"*
*“ధన్యోస్మి !"* చంద్రుడు పునరభివాదం చేస్తూ అన్నాడు.
*"చంద్రా ! అనుష్టానాలు పూర్తి చేసి , మార్గాయాసం తీర్చుకో... తదనంతరం...”*
*"అనుష్ఠానాలు మార్గంలోనే పూర్తి చేసుకున్నాను. ఈ ప్రశాంత వాతావరణంలో అడుగు పెట్టగానే మార్గాయాసం మాయమైపోయింది గురుదేవా !"* ఆశ్రమాన్ని కలియజూస్తూ అన్నాడు చంద్రుడు.
బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. *"సంతోషం నాయనా ! ఆ... అత్రి మహాశయులు కుశలమే కదా !"*
*"నాన్నగారు కుశలంగా ఉన్నారు...”*
*"సాధ్వి అనసూయా దేవి...”*
*"నాన్నగారి సేవే అమ్మకు సత్కాలక్షేపం గురుదేవా !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.
*"ఆ ఆదర్శ దంపతులు అదృష్టవంతులు ! వాళ్ళ పుత్రుడైన నువ్వు అదృష్టవంతుడివి ! సరే... చంద్రా... అలా కూర్చో... సాయంత్రం నిన్ను ప్రత్యేకంగా పరీక్షిస్తాను. నువ్వు ఆర్జించిందీ , నీ వద్ద ఉన్నదీ ఏదో తెలుసుకుంటాను ! లేనిదీ , అవసరమైనదీ నిర్ణయిస్తాను !”* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన చూపులు ఆశ్రమం వైపు తిరిగాయి.
ఒక యువతి , నీటి పాత్రతో చకచకా వచ్చి , చంద్రుడికి తాగడానికి నీళ్ళు అందించింది వినయంగా.
*"ఆశ్రమ పరిచారిక పుంజికస్థల !"* బృహస్పతి పరిచయం చేశాడు. *"విద్యార్థుల విడిది గృహాల్ని చక్కగా చూసుకుంటుంది. ఆశ్రమంలో చేదోడు వాదోడుగా ఉంటుంది !"*
చంద్రుడు దాహం తీర్చుకుని పాత్ర పుంజికస్థలకు ఇచ్చివేశాడు. విద్యార్థుల వరుసల వెనుక వైపుకి అడుగులు వేశాడు. రెండు కళ్ళు చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్నాయి.
అవి బృహస్పతి కళ్ళు కావు !
అవి ఏ విద్యార్థి కళ్ళూ కావు !
అవి ఆశ్రమ గవాక్షంలోంచి చూస్తున్న కళ్ళు ! అవి కలువ రేకుల్లాంటి విశాలమైన కాటుక కళ్ళు !
అవి బృహస్పతి సతి కళ్ళు !
అవి మదవతి తార కళ్ళు !
బృహస్పతి శయనాగారంలోకి వచ్చాడు. తార మంచం మీద కూర్చుని ఉంది. వాతాయనంలోంచి దూసుకొస్తున్న గాలి , ఆమె పైట చెంగుతో ఆడుకుంటోంది. మధురమైన పూల సుగంధాన్ని మోసుకొస్తున్న గాలి శయనాగారమంతా వ్యాపిస్తోంది.
*"ఇంకా మేలుకునే ఉన్నావా , తారా ?"* ప్రశ్నించాడు బృహస్పతి.
భర్త రాకను అప్పుడే గమనించినట్లు తార తటాలున లేచి , నిలబడింది. “నిద్ర రావడం లేదు..." అందామె.
బృహస్పతి మంచం మీద నడుం వాల్చాడు విశ్రాంతిగా , అప్రయత్నంగా ఆయన చెయ్యి తార చేతిని పట్టుకుంది. తార , మంచం అంచున కూర్చుంది. ఆమె కళ్ళు బృహస్పతి ముఖంలోకి చూశాయి.
*"ఆ నూతన విద్యార్థి... చంద్రుడు..."* అంటూ ఏదో చెప్పబోయింది తార. *"చంద్రుడా ?!"* బృహస్పతి ప్రశ్నించాడు.
*"ఆ... అతని పేరు అదే కదూ... మన విద్యార్థులందరిలోనూ , అతనే పెద్దవాడ నిపిస్తోంది... పెద్దవాడేగా , స్వామీ ?"* అడిగింది.
*“చంద్రుడు వయసులోనే కాదు , తారా ! వినయంలోనూ , విద్యలోనూ , బుద్ధిలోనూ పెద్దవాడే !"* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
*"అలాగా...".*
*"చంద్రుడు ఎవరనుకుంటున్నావు ? బ్రహ్మ మానస పుత్రుడు అత్రిమహర్షికీ , సాధ్వీమణి అనసూయకూ అనుంగు పుత్రుడు !"*
*"తల్లిదండ్రులిద్దరూ గొప్పవారేనే !"* తార చిరునవ్వుతో అంది..
*"ఔను ! అత్రిమహర్షి చంద్రుణ్ణి ప్రత్యేకంగా నా వద్దకు పంపించారు. శిష్యరికం చేయమని !"* బృహస్పతి సగర్వంగా అన్నాడు.
*"పోనీ లెండి ! మీ శిష్యుల్లో యువకుడు ఉండడం మంచిది ! ఇప్పుడున్న వాళ్లంతా , చిన్నపిల్లలు ! నది నుండి నీళ్ళు తీసుకురాలేకపోతున్నారు !"* తార నర్మగర్భంగా అంది.
*"స్వామీ... ఆ చంద్రుడి చేత నదీజలం తెప్పించుకోవచ్చుగా !"*
బృహస్పతి నవ్వాడు. *"అడగాలా , తారా ! గురుకుల వాసం చేసే విద్యార్థులకు గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"*
తార అసంకల్పితంగా తృప్తిగా నిట్టూర్చింది.
*"పడుకో తారా ! మళ్లీ వేకువజామునే లేవాలి !"* బృహస్పతి ఆమె చేతిని సున్నితంగా లాగుతూ అన్నాడు.
తార మంచం దిగి నిలబడింది. సున్నితంగా ఆయన పట్టులోంచి తన చేతిని విడిపించుకుంది. *"మీరు పడుకోండి ! ఎందుకో నిద్ర రావడం లేదు. కాసేపు తోటలో తిరిగి... త్వరగా వచ్చేస్తా లెండి !"* అంటూ తార భర్త మాట కోసం ఎదురు చూడకుండా వెలుపలికి నడిచింది.
చాంద్రమానం, సౌరమానం,
ॐ ॐ చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం అనేవి వరుసగా చంద్ర, సూర్య, బృహస్పతి ఆధారంగా గణించబడేవి.
నక్షత్రాలు ఆధారంగా నక్షత్రమానమూ ... ఇలా వివిధ మానాలు ఉన్నాయి.
తమిళనాడు వంటి దక్షిణ భారతంలో సౌర మానమూ,
తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలలో చాంద్రమానమూ,
కాశీవంటి ఉత్తరభారతంలో బార్హస్పత్య మానమూ ఆచరిస్తారు.
బార్హస్పత్యమానం - చాంద్రమానం కన్నా 12 సంవత్సరాల ఒక పక్షం ముందు నడుస్తుంది.
నక్షత్ర మానం జ్యోతిష్యంలో ఉపయోగిస్తారు.
ఇంకా చాలా వివరాలు ఉన్నాయిగానీ, ఇక్కడ తెలపడం కొంచెం కష్టం.బార్హస్పత్యమానం అనేవి వరుసగా చంద్ర, సూర్య, బృహస్పతి ఆధారంగా గణించబడేవి.
నక్షత్రాలు ఆధారంగా నక్షత్రమానమూ ... ఇలా వివిధ మానాలు ఉన్నాయి.
తమిళనాడు వంటి దక్షిణ భారతంలో సౌర మానమూ,
తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలలో చాంద్రమానమూ,
కాశీవంటి ఉత్తరభారతంలో బార్హస్పత్య మానమూ ఆచరిస్తారు.
బార్హస్పత్యమానం - చాంద్రమానం కన్నా 12 సంవత్సరాల ఒక పక్షం ముందు నడుస్తుంది.
నక్షత్ర మానం జ్యోతిష్యంలో ఉపయోగిస్తారు.
ఇంకా చాలా వివరాలు ఉన్నాయిగానీ, ఇక్కడ తెలపడం కొంచెం కష్టం.
భక్తితత్త్వ మని తెలియగనౌ
కం.
ఆత్మకు నేది కులము? పర
మాత్మకు నేది కులము? నరయంగా సృష్టిన్
స్వాత్మాపరమాత్మలకును
నాత్మీయత భక్తితత్త్వ మని తెలియగనౌ
*~శ్రీశర్మద*
ఓం శాంతి - శాంతి - శాంతి:
🕉️ ఓం శాంతి - శాంతి - శాంతి: - అనగా అర్థం ఏమిటి!!?🕉️
🌸మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రం లోనైనా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి.. శాంతి.. శాంతిః అని ముగుస్తాయి,
దాని అర్థం ఏమిటి??? - దాని వలన లాభం ఏమిటి??? - ఒకసారి పరిశీలిద్దాం..
🌿ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ... శాంతి మంత్రంలో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో తెలియదు..
🌸కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు...
మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది
🌿1.ఆది దైవిక, 2.ఆది భౌతిక, 3.ఆధ్యాత్మిక..ఇక వీటి విశేషము.... ఏమిటంటే..
🌸మొదటి "శాంతి" పదం మనం మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని,
శారీరక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి, అందరికీ దేవుని అనుగ్రహ, ఆశీస్సులు ఉండాలని, ప్రార్థించేదే... దీన్ని "ఆదిదేవిక" అంటారు.
🌿రెండవ "శాంతి" పదం ఇతర జీవరాశులనుండీ, మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి, దీన్ని "ఆదిభౌతికము" అంటారు,
🌸మూడవ "శాంతి" పదం ప్రకృతి పరంగా సంభవించే (భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి. దీన్ని "ఆధ్యాత్మిక" అంటారు,
🌿ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ "శాంతి" మంత్రం చివర్లో "శాంతి" పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు..స్వస్తి..🚩🌞🌹🙏
ప్రతి ఆలోచన విశ్వం లోకి వెళ్లబడుతుంది... అలాగే ప్రతిరోజు లక్షలాది మంది శాంతి మంత్రం పాటిస్తే విశ్వ శాంతి చేకూరుతుంది.. విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు మనందరం విశ్వ శాంతి కొరకు శాంతి మంత్రం (వైబ్రేషన్) జపిద్దాం,
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
భగవద్గీత
*నిత్యాన్వేషణ:*
భగవద్గీత ను చదివాక మీ జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా ?
భగవద్గీత మూలం కేవలం వంద శ్లోకాలతో వేదముల పిమ్మట భారతీయ తత్వ చింతన( ఫిలాసఫీ ) షడ్దర్శన ఉపనిషత్తులు నుండి సంగ్రహించిన రచన.
శ్రీ కృష్ణుడు అర్జునుడుకి యుద్ధ సమయమున భోదించినట్టుగా మహా భారత రచనలో కూర్చబడినది. ఆ కూర్పు వలన గీత మకరందం ది సాంగ్ అఫ్ ది గాడ్ గా విశ్వవ్యాపితం జరిగింది. ఒక ఉన్నతమైన ప్రయత్నం. కానీ అప్పటి బ్రాహ్మణులు/పండితులు వేరు వేరు మత శాఖలుగా విడిబడి ఒకిరినొకరు సంవాదించుకున్నారు. ఆ సంవాదాలలో గీతా మకరందం rivalry forces ఎవరికి ఇష్టమొచ్చిన మార్పులు -కూర్పులు చేసి దాదాపు ఆరు వందల శ్లోకాల తో పొడిగించి తమ తమ ఆధిక్యత చాటుకున్నారు. వేల సంవత్సరాలుగా గీత భారత దేశమున అత్యంత ప్రామాణిక -ఆధ్యాత్మిక -యోగ -భక్తి -తత్వ మున్నగు విభాగాలతో విలసిల్లుతూ , ఎందరో గీతా సందేశం -భోదన -లతో వ్యాఖ్యానాలు వచ్చినవి -ప్రస్తుతము కూడా వచ్చుచున్నవి. ఎవరి వ్యాఖ్యానం వారిదే !
కొన్ని అధ్యయాలు మార్పు చేర్పు లను తొలగించుకుంటూ పారాయణం ఒక అద్భుత తత్వ లోకం. భారతీయ ప్రామాణిక తత్వ భోదన.
కానీ ఇన్ని వేల సంవత్సరములుగా కఠోర పరిశ్రమ పారాయణం చేసి తమ జీవితాల దశను మార్చుకున్నవారు బహు తక్కువ. అసలు యావత్ హిందూ ప్రజానీకం ఇప్పటికే మార్పు చెంది ఉండాలి. ఒకదానికొకటి కాంట్రవర్సియల్ !
ఏది మార్పు ? కలహాలతో , అసమానతలతో , అసూయ ద్వేషాలతో , స్వార్ధముతో , కుటిలత్వం , తో కునారిల్లుతున్న హిందూ సమాజం మార్పు జరిగిందా ?
నేను అధ్యయనం చేసి నాకు పనికి రాదని నా స్వతంత్ర ఆలోచన -ఎటువంటి రిజర్వేషన్స్ లేని నాకు ఉపయోగపడు మార్గమును ఎన్నుకుని పయనిస్తున్నాను.
అంత మాత్రమున గీత మకరంద జ్ఞాన , వైరాగ్య , గుళికలను తక్కువ చేసే సాహసం చేయను. హిందూ గా నా పూర్వీకుల ఆస్తి ని గౌరవిస్తాను.
పునర్జన్మ గురించి భగవద్గీత ఏమి చెబుతోంది?
*జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ*
*తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితు మర్హసి.* 2–27
అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. 6–4
*బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే*
*వాసుదేవః స్సర్వ మితి స మహాత్మా సుదుర్లభః* 7–19
*బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున!*
*తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప!* 4–5
మొదలైన శ్లోకాలెన్నో భగవద్గీత లో ఉన్నాయి. కేవలం మానవులకే గాదు పునర్జన్మలు.. లోకాలకు లోకాలే పుడుతూ అంతరిస్తూంటాయి
*ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినోర్జున!* అంటాడు కృష్ణుడు.
*హతోవా ప్రాప్స్యసి స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీం* 2- 37.
అని ధర్మ యుద్ధం లో మరణిస్తే స్వర్గం తప్పక చేరుతారని గూడా గీతలో ఉంది.
*క్షీణే పుణ్యే మర్త్య లోకం విశన్తి…*
..చేసిన పుణ్యం స్వర్గలోకంలో అనుభవించేసి అయిపోతే మళ్ళీ కర్మ భూమియైన భూమండలంలో పుట్ట వలసిందే. జీవుడు తన వాసనల (ఇచ్ఛలు) కనుగుణంగా అనేక స్థావర జంగమ రూపాలూ పొంద గలడు. నిష్కామంగా తన విధులను నిర్వర్తిస్తూ ఉంటే పూర్వజన్మల కర్మ ఫలం అనుభవించేసి ఋణాలు అన్నీ తీరి పోయి ముక్తి ని పొందుతాడు జీవుడు.
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ … ఎక్కడికి చేరి తిరిగి రారో — అది ముక్తి.
అనేక జన్మల సంస్కారఫలంగా వాసుదేవః సర్వం ..అనే వివేకం ఏర్పడుతుంది. (అంతటా భగవంతుడున్నాడు. )
ఇహైవ.తైః జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః .. అని మరోమాట ఉంది. మనసు తన ఇష్టం వచ్చినట్లుగా కర్మ లవైపు సాగుతూ ఉంటుంది ప్రారబ్ధ (వెనకటి) కర్మల వశాన. కానీ దాన్ని బుద్ధి తో నిగ్రహించి, సన్మార్గంలోకి నడిపితే జన్మను జయించినట్లే.. తస్మాత్ యోగీ భవార్జున ..అంటే నీ విధిని భగవన్నిర్ణీత శాస్త్ర విధిప్రకారం చేయి. అపుడు పాపపుణ్యాలనుంచీ విడుదల లభిస్తుంది..
కర్మ ఏదో అకర్మ ఏదో తెలుసుకోవడం కష్టం.
*కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః
స బుద్ధిమాన్ మనుష్యేషు…* 4–18 అంటుంది గీత .
మహాత్ముల చరిత్రలే సత్ మార్గాన్ని చూపిస్తాయి .సద్గతి కలిగిస్తాయి.
శివపార్వతులమధ్య వ్యత్యాసము!
శివపార్వతులమధ్య వ్యత్యాసము!
కవిసామ్రాట్ విశ్వనాధ!
11. నీవో యౌవనమూర్తి వౌదు వసురానికంబు మ్రదించు శి
క్షావైశద్యము పొల్చు నీతనువు నీశా! అన్నపూర్ణాంబికా
దేవిం జూచిన వృద్ధవోలె మదికిన్ దీపించు దాంపత్య మీ
భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ! విశ్వేశ్వరా
ఓ విశ్వేశ్వరా! పార్వతీప్రాణనాథా!
ఈశా!
నీవా- అసురసమూహములను శిక్షించు స్పష్టతగల యౌవనము
గల శరీరముగలవాడవు.
అన్నపూర్ణమ్మతల్లియో- తలపండినవృద్ధ!అనిపించును.
మీదాంపత్య రహస్యంబెరిగినవాడెవ్వరయ్యా?!
దేవదేవుడవు.
సదాత్రిదశులకు ఆదిదేవుడవు.
యౌవనముగూడుగట్టినదొరవి.
రాక్షసశిక్షా దక‌్షుడవు. వారినిమ్రందించుబలశాలివి.
కనుక యౌవనము రూపుగట్టిన దార్ఢ్యమునీది!
ఇక అన్నపూర్ణమ్మ --
శ్రీనాథుడనినట్లు---
"వేదపురాణశాస్త్రపదవీనదవీయసియైన పెద్దముత్తైదువ!"
యుగయుగాలుగాఎందరు జీవులకో ప్రాణదాత్రియై తలపండిన వృద్ధ!
తిలతండులన్యాయమునచెప్పదగు కేశపాశమనినాడు కవిసార్వభౌముడు!
కాశీ క్షేత్రంలో శివునికేఅన్నభిక్ష ఇడిన మహామాత- అన్నపూర్ణాదేవి!
ఎంత వింత దంపతులుమీరు!
విశ్వేశ్వర శతకము-🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🙏
వేదధ్వని
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*యత్ర వేదధ్వని శ్రాంతం*
*న చ గోభిరలంకృతమ్*
*యన్నబాలైః పరివృతం*
*శ్మశానమివ తద్గృహమ్*
𝕝𝕝తా𝕝𝕝
ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది అని అత్రిస్మృతి హెచ్చరించింది.
దుష్టుల ఉపద్రవం
శ్లోకం:☝️
*యస్య రాష్ట్రే ప్రజాః సర్వాః*
*త్రస్యన్తే సాధ్వ్యసాధుభిః |*
*తస్య మత్తస్య నశ్యంతి*
*కీర్తిరాయుర్భగో గతిః ||*
- శ్రీమద్భాగవతం 1.17.10
భావం: దుష్టుల ఉపద్రవం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న దేశంలో, ఆ మత్తుడైన రాజు యొక్క కీర్తి, ఆయుష్షు, ఐశ్వర్యం మరియు పరలోకం (పుణ్యం) నాశనం అవుతాయి.
పంచాంగం 28.08.2023 Monday
పంచాంగం 28.08.2023 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: ద్వాదశి తిధి ఇందు వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం ఆయుష్మాన్ తదుపరి సౌభాగ్య యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
ద్వాదశి సాయంత్రం 06:18 వరకు.
ఉత్తరాషాఢ రాత్రి 02:41 వరకు.
సూర్యోదయం : 06:05
సూర్యాస్తమయం : 06:29
వర్జ్యం : మధ్యాహ్నం 12:23 నుండి 01:49 వరకు.
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:42 నుండి 01:31 వరకు తిరిగి మధ్యాహ్నం 03:11 నుండి 04:00 వరకు.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
28-08-2023 రాశి ఫలితాలు
ర28-08-2023
రాశి ఫలితాలు
మేషం
కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
--------------------------------------
వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
------------------------------------
మిధునం
ధన వ్యవహారాలలో చిన్న పాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు.
---------------------------------------
కర్కాటకం
గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
------------------------------------
సింహం
ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు కార్యరూపందాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
-------------------------------------
కన్య
దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.
--------------------------------------
తుల
కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు . పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.
---------------------------------------
వృశ్చికం
చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
---------------------------------------
ధనస్సు
ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.
---------------------------------------
మకరం
ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
---------------------------------------
కుంభం
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది
---------------------------------------
మీనం
అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
---------------------------------------