28, ఆగస్టు 2023, సోమవారం

తెలుగు భాషా వారోత్సవాలు

 ఏప్రిల్ 23-29 తెలుగు భాషా వారోత్సవాలు


తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు

ముహమ్మద్ అజ్గర్ అలీ.

శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు

తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది

తొలి తెలుగు కవి - నన్నయ

తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం

తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము

తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము

తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము

తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క

తొలి తెలుగు వ్యాకరణము - ఆంధ్రభాషాభూషణము

తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము

తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము

తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము

తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము

తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని

తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు

తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము

తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము

తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము

తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన

తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము

తొలి తెలుగు ఉదాహరణకావ్యము - బసవోదాహరణము

తొలి తెలుగు పత్రిక - సత్యదూత

తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము

తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం

తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య

తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన

తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ

తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము

తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము

తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము - సకల నీతి సమ్మతము

తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం

తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర

తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు (1925)

తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).

తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు - ఐ.కొండలరావు 1938


                    

  

      

తెలుగు ఆవిష్కరణలు

తెలుగువారి ఆస్తులు, ఆవిష్కరణలు వారికొక గుర్తింపునిచ్చాయి. వాటిలో కొన్ని.

మువ్వన్నెల జెండా- పింగళి వెంకయ్య తయారుచేసింది

ఒంగోలు గిత్త

తిరుపతి లడ్డు

అమృతాంజనం -దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 'ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది.

కూచిపూడి నృత్యం

అవధానం అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, శతసహస్రావధానం

ఔషధాలు-మెథోట్రెక్సేట్‌.టెట్రాసైక్లిన్ ‌.అరియోమైసిన్‌.హెట్రాజన్‌.విటమిన్‌ బి 12 ఫోలిక్‌ ఆమ్లం .వీటన్నిటిని ప్రపంచానికి అందించింది ఓ తెలుగు వ్యక్తే, డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు .

స్టెంట్ ..అబ్దుల్‌ కలామ్‌ సహకారంతో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ సోమరాజు రూపొందించిన 'స్టెంట్‌' హృద్రోగులకు ఓ వరం.

కోహినూరు వజ్రము-గుంటూరు సీమలోని కొల్లూరు లో పుట్టింది.

ఆవకాయ బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.మాగాయ. తేనె ఆవకాయ

పీవీ సరళీకరణ విధానం, ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదం.బాలమురళి శాస్త్రీయం, బాలూ లలితగానం.చిరంజీవి నటన, వి.వి.యెస్.లక్ష్మణ్ అద్భుతాల క్రికెట్టు, శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు.నాయుడమ్మ వైద్యం, బాపూ చిత్రం.

గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, చిరాల, నారాయణపేట, మచిలీపట్నం చేనేతలు.

బంగినపల్లి మామిడిపళ్లు, పలాస జీడిపప్పులు,ఆత్రేయపురం పూతరేకు లు, బందరు లడ్డూలు, తాపేశ్వరం కాజా లు.

గోంగూర పచ్చడి . 

తెలంగాణ బతుకమ్మ పండగ

తెలంగాణ సమ్మక్క-సరలమ్మ జాతర

కామెంట్‌లు లేవు: