🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 9*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం*
*స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి |*
*మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం*
*సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ||*
అమ్మవారు మనలో కుండలినీ రూపంలో ఎలా విహరిస్తారో వివరిస్తున్నారు ఇక్కడ. మన శరీరం పంచభూతాత్మకమైనది. ఆ పంచభూతాలను నియంత్రించే కొన్ని కేంద్రాలు ఉన్నాయి.వీటిని అమ్మవారు నియంత్రిస్తుంటారు. వీటితోపాటు అంతఃకరణముల (మనసు,బుద్ధి,అహంకారము)లోని ఈశ్వర శక్తిని ధ్యానిస్తూ ఉండాలి.
మహీం మూలాధారే = మూలాధారమునందున్న భూతత్త్వమును,
కమపి మణిపూరే = కం అంటే జలము,కనుక మణిపూరము అందు జలమును
హుతవహం స్థిత స్వాధిష్టానే = స్వాధిష్టానము అందున్న అగ్ని తత్త్వాన్ని
హృది మరుతమ్ = అనాహత చక్రము అందున్న వాయుతత్త్వాన్ని
ఆకాశముపరి = దానిపైగల విశుద్ధిచక్రములోని ఆకాశతత్త్వాన్ని
మనోఽపి భ్రూమధ్యే = భ్రూమధ్యంలోకల ఆజ్ఞాచక్రములో మనోతత్త్వాన్ని ధ్యానించాలి.
సకలమపి భిత్త్వా కులపథం = కుల మార్గాన్ని ఛేదించి
మూలాధారం నుండి ఆజ్ఞాచక్రము వరకు కులము అంటారు. ఇందులో తిరిగే శక్తి అమ్మవారు.ఈ మార్గాన్ని దాటి అంటే ఛేదించి సదాశివుడు కొలువై ఉండే సహస్రారం చేరటం యోగం.శివ శక్తుల కలయిక. అదే సమయాచారం. సహస్రారపద్మం *అకులం* అనబడుతుంది.లలితా సహస్ర నామాలలో
*కులాంగనా, కులాంతస్థా, కౌళినీ, కులయోగిని*
*అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా* అనీ
*కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ*
*కులకుండాలయా కౌలమార్గతత్పర సేవితా* అని నామాలు.కుండలము అంటే మూలాధారం.
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే = సహస్రార కమలంలో సదాశివునితో కూడి ఇతరులకు గోచరించకుండా విహరిస్తున్నావు. సహస్రార పద్మము చేరటమే మోక్షము. అప్పుడు సాధకుడు జీవన్ముక్తుడవుతాడు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి