శశి...
ఎంతగానో మనసు పడ్డాను
నీవు పక్షానికోసారి కానరావు
నేనెంత వేదన పడతానో
పున్నమివేళ ఎంత ఆనందమో.
రాత్రంతా చల్లని కబుర్లు
తెల్లవారేసరికి వెళ్ళిపోతావు
నీలిమేఘాలు అడ్డుతెర వేస్తే
నీ అందం మసక మబ్బులో..
ఎన్నేళ్ళ నుండో నిను చేరాలని
నీ అచ్చటముచ్చట తీర్చాలని
నా మనో వేదన వినిపించాలని
దరిచేరి ప్రేమ కధ చెప్పాలని.
నా విక్రమార్క ప్రయత్నం
ప్రయత్నం వమ్ము కాలేదు
నిను చేరాను ఎట్టకేలకు
ఇక మాటాడుకుందాం రా.
ఊరించి లాలించి ఉన్నావుగా
కవ్వించి నా కైపు పెంచావుగా
అందాలన్నీ చాటు చేశావుగా
ఇక ఆరబోయి నీ అందాలు.
నీ హృదయంలో ఎన్ని భావాలో
నీకు ద్రవించే గుణముంటే
నీతో చేస్తాను ప్రణయం
నా చరమాంకం దాకా ప్రేమిస్తా!.
శశి... నీ వదనం అద్బుతం
శివయ్యకు చేరావు నెలవంకవై
జాబిల్లివై మా మనసు దోచావు
అందాల భామా నీ ప్రేమ కధ ఏమిటమ్మా!.
తెలిసిందిలే నీ మనసు తెలిసిందిలే...
అందుకు నా రాకను స్వాగతించినావు...
మనసు తెరలు విడిచి
ఎన్ని కబుర్లు చెప్పబోతున్నావు.
శశి.. నిన్ను వదిలి పోలేనులే
మన ప్రేమకు పట్టం కడదామిక.
శశి చెంతన విక్రముడు
కాలమంతా ప్రేమకధలే
ఏ అడ్డంకి రానంత వరకు
పాడుకుందాం ప్రేమ పాటలు.
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
9391456575.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి