28, జులై 2020, మంగళవారం

రామాయణమ్.12

తెలతెలవారుతున్నది తూర్పుదిక్కు అప్పుడే విచ్చుకుంటుంన్నది .
గడ్డిపక్కపైన పట్టుపరుపులమీద పడుకున్నంత హాయిగా రామలక్ష్ష్మణులు నిదురిస్తూఉన్నారు.
వారి ముఖాలను కనురెప్పవాల్చకుండా తనివితీరా చూస్తూ ఉన్నారు మహర్షి! 
రామునిముఖపద్మంలోని సౌందర్యము అనే మధువును గ్రోలే తుమ్మెదలా ఉన్నారాయన! .
ఆయన రాముడికి మేలుకొలుపు పాడుతున్నారు రామా నిద్దురలే అని!
.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్యా  ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికమ్!
.
కౌసల్యా సుప్రజా ...కౌసల్యయొక్క ఉత్తమ సంతానమైన
రామా.... ఓ రామా
పూర్వా సంధ్యా ప్రవర్తతే...తూరుపు దిక్కున తెలవారబోతున్నది
ఉత్తిష్ఠ.....లెమ్ము
నరశార్దూలా.. మానవులలో శ్రేష్టమైన వాడా!
కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్...ప్రతిదినము చేయవలసిన పనులు చేయాల్సిఉన్నది.
.
రామలక్ష్మణులు సంధ్యావందనాది పనులన్నియు చక్కగా ఆచరించి మరల మునివెంట బయలుదేరినారు.
.
అలా నడచినడచి సరయూ,గంగానదుల సంగమప్రదేశం చేరినారు!.
.
అక్కడ వేల సంవత్సరాల నుండి తపస్సుచేస్తున్న ఎంతోమంది ఋషీశ్వరులగుపించారు. ఆప్రదేశాన్ని అంతటిని ఆసక్తిగా చూశారు రామలక్ష్మణులు .
అక్కడ ఒక ఆశ్రమము చూశారు ,అది చూడగనే వారి మనస్సులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించింది. కుతూహలంతో మహర్షిని ప్రశ్నించారు!
"మహర్షీ ఈ ఆశ్రమము ఎవ్వరిది?".
.
ఇక్కడ పూర్వము పరమశివుడు తపమాచరించేవాడు!
ఆయనకు అప్పుడే వివాహం జరిగింది. శివుడంతటివాడు వివాహం చేసుకోవటంతో, అది నావల్లనే జరిగింది అని అహంకరించాడు మన్మధుడు ( అప్పుడు మన్మధుడికి శరీరముండేది).
శివుడు ఆతడి అహంకారాన్ని చూసి హుంకరించాడు!
మూడోకన్నుతెరచి మన్మధుని చూశాడు .అప్పుడు మన్మధుడి శరీరంలోని ఒక్కక్క అంగము కాల్చివేయబడింది!
మన్మధుడు దేహము విడిచిన ప్రదేశము కాబట్డి అంగదేశము అని పేరు వచ్చింది! 
.
పరమపావనమైన ఈ ప్రదేశంలో ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం .
రేపు తెల్లవారగనే గంగను దాటుదాం అని గంగాస్నానం చేసి శుచిగా ఆశ్రమంలో ప్రవేశించారు!
.
శ్రీ రాముని వెంటపెట్టుకొని విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి ఆశ్రమంలోని మునులందరూ సంతోషంతో పులకరించిపోయారు!.
.
వారికి తగువిధముగా సత్కారాలు చేసి అక్కడ వారు విశ్రమించటానికి కావలసిన ఏర్పాట్లు చేసినారు.
.
ఆ రాత్రి అంతా రాజకుమారులకు మనోహరమైన కధలుచెపుతూ ఆనందింపచేశారు మహర్షి!.
.
తెలవారగనే స్నానసంధ్యాదులు పూర్తిచేసుకొని ఆశ్రమవాసులు ఏర్పాటు చేసిన నావమీద గంగానది దాటుతున్నారు,గంగ మధ్యలోనికి రావడంతోనే నీరు బద్దలవుతున్నట్లుగా గొప్పశబ్దం వినిపించింది ! అదేమిటి? అని ప్రశ్నించాడు రామచంద్రుడు కుతూహలంతో!
.
అప్పుడు మహర్షి ఇలా చెప్పారు ! పూర్వం తన మనస్సులో జనించిన సంకల్పంతో బ్రహ్మదేవుడు కైలాస పర్వతప్రాంతములోఒక సరస్సు నిర్మించాడు ఆయన మనస్సంకల్పంనుండి పుట్టినది కాబట్టి దానికి మానస సరోవరమనిపేరు.
అక్కడ నుండి సరయూనది జన్మించింది! సరస్సునుండి ప్రవహిస్తున్నది కావున" సరయూ" అని పేరు వచ్చింది!
.
ఆ సరయూనది గొప్ప తరంగాల తొ గంగాప్రవేశం చేస్తున్నది అప్పుడు పుట్టే జలఘోషనే నీవు వింటున్నది అని చెప్పారు మహర్షి..
.
గంగదాటగనే ఏ మాత్రము మానవ సంచారంలేని భయంకరమైన ఒక అడవిలో ప్రవేశించారు వారు!
.
ఆ భయంకరమైన ,దుర్గమమైన అడవిని చూసి రాముడు విస్మయంతో మహర్షిని ప్రశ్నించాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

*World's Biggest Scientific research on*

*Hanuman Chalisa and Gayatri Mantra*

*Any one who knows the Hanuman Chalisa?* *In Hanuman Chalisa, it is said :* 

*"Yug sahastra yojan per Bhanu!* 
*Leelyo taahi madhur phal janu!!* 

*1 Yug = 12000 years* 
*1 Sahastra = 1000* 

*1 Yojan = 8 Miles*

*Yug x Sahastra x Yojan = par Bhanu* 
*12000 x 1000 x 8 miles = 96000000 miles* 

*1 mile = 1.6kms*

*96000000 miles =* *96000000 x 1.6kms =* 
*96000000 miles/1536000000 kms to Sun* 

*NASA has said that, it is the exact distance between Earth🌍 and Sun 🌞(Bhanu).*

*It is really interesting how accurate and meaningful our ancient scriptures are.*
*Unfortunately barely it is recognized, interpreted accurately or realized by any in today's time...*

*The GAYATRI MANTRA" the most powerful hymn in the world* 

*Dr.Howard Steingeril, an American scientist, collected Mantras, Hymns and invocations from all over the world and tested for their strength in his Physiology Laboratory&* 

*Hindu's Gayatri Mantra produced 110,000 sound waves /second...*

*This was the highest and was found to be the most powerful hymn in the world.*
*Through the combination of sound or sound waves of a particular frequency, this Mantra is claimed to be capable of developing specific spiritual potentialities.*
*The Hamburg university* *initiated research in*
*to the efficacy of the* *Gayatri Mantra both on the mental and physical plane of CREATION...*

*The GAYATRI MANTRA is broadcasted daily for 15 minutes from 7 P.M.* *onwards over Radio Paramaribo, Surinam, South America for the past two years, and in Amsterdam, Holland for the last six months.* 

*"Om Bhoor Bhuwah* *Swah, Tat Savitur* *Varenyam, Bhargo* *Devasya Dheemahi,* *Dhiyo Yo Nah Pra-chodayaat !"*

*"It's meaning:*

*God is dear to me like my own breath.*
 *He is the dispeller of my pains, and giver of happiness.*
*I meditate on the supremely adorable Light of the Divine Creator, that it may inspire my thought and understanding."*

*The above information is worth circulating and sharing with one and all!*
 *How rich and wonderful are our Vedas.*
🙏🙏🙏🙏👏👏👏🌞
తెలుగు అనువాదం:

* ప్రపంచంలోని అతిపెద్ద శాస్త్రీయ పరిశోధన *

* హనుమాన్ చలీసా మరియు గాయత్రి మంత్రం *

* హనుమాన్ చలీసా తెలిసిన ఎవరైనా ఉన్నారా? * * హనుమాన్ చలిసాలో ఇలా చెప్పబడింది: * 

* "ప్రతి భానుకు యుగ్ సహశాస్త్ర యోజన్! * 
* లీలియో తాహి మధుర్ ఫాల్ జాను !! * 

* 1 యుగ్ = 12000 సంవత్సరాలు * 
* 1 సహస్త్రా = 1000 * 

* 1 యోజన్ = 8 మైళ్ళు *

* యుగ్ x సహశాస్త్రం x యోజన్ = పార్ భాను * 
* 12000 x 1000 x 8 మైళ్ళు = 96000000 మైళ్ళు * 

* 1 మైలు = 1.6 కి.మీ *

* 96000000 మైళ్ళు = * * 96000000 x 1.6 కి.మీ = * 
* సూర్యుడికి 96000000 మైళ్ళు / 1536000000 కి.మీ * 

* ఇది భూమి మరియు సూర్యుడు (భాను) ల మధ్య ఖచ్చితమైన దూరం అని నాసా చెప్పింది. *

* మన ప్రాచీన గ్రంథాలు ఎంత ఖచ్చితమైనవి మరియు అర్ధవంతమైనవో నిజంగా ఆసక్తికరంగా ఉంది. *
* దురదృష్టవశాత్తు ఇది గుర్తించబడలేదు, కచ్చితంగా వివరించబడింది లేదా నేటి కాలంలో ఎవరైనా గ్రహించారు ... *

* గాయత్రి మంత్రం "ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శ్లోకం * 

* డాక్టర్ హోవార్డ్ స్టింగెరిల్, ఒక అమెరికన్ శాస్త్రవేత్త, ప్రపంచం నలుమూలల నుండి మంత్రాలు, శ్లోకాలు మరియు ఆహ్వానాలను సేకరించి, అతని ఫిజియాలజీ లాబొరేటరీ & * లో వారి బలం కోసం పరీక్షించారు. 

* హిందూ యొక్క గాయత్రి మంత్రం 110,000 ధ్వని తరంగాలను ఉత్పత్తి చేసింది / సెకండ్...*

* ఇది ఎత్తైనది మరియు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శ్లోకం. *
* ఒక నిర్దిష్ట పౌన frequency పున్యం యొక్క ధ్వని లేదా ధ్వని తరంగాల కలయిక ద్వారా, ఈ మంత్రం నిర్దిష్ట ఆధ్యాత్మిక సామర్థ్యాలను అభివృద్ధి చేయగలదని పేర్కొంది. *
* హాంబర్గ్ విశ్వవిద్యాలయం * * లో పరిశోధన ప్రారంభించింది
* సృష్టి యొక్క మానసిక మరియు శారీరక విమానంలో * * గాయత్రి మంత్రం యొక్క సమర్థతకు ... *

* గత రెండు సంవత్సరాలుగా దక్షిణ పారామరిబో, సురినామ్, దక్షిణ అమెరికాలో మరియు గత ఆరు నెలలుగా హాలండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ప్రసారం చేస్తూ గాయత్రీ మంత్రం ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుండి 15 నిమిషాలు ప్రసారం చేయబడుతుంది. * 

* "ఓం భూర్ భువా * * స్వా, టాట్ సావిటూర్ * * వరేన్యం, భార్గో * * దేవస్య ధీమాహి, * * ధియో యో నహ్ ప్ర-చోదయత్!" *

* "దీని అర్థం: *

* దేవుడు నా స్వంత శ్వాస లాగా నాకు ప్రియమైనవాడు. *
 * అతను నా నొప్పులను తొలగించేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. *
* దైవిక సృష్టికర్త యొక్క అత్యంత పూజ్యమైన కాంతిని నేను ధ్యానిస్తున్నాను, అది నా ఆలోచనను మరియు అవగాహనను ప్రేరేపిస్తుంది. "*

* పై సమాచారం ఒకదానితో మరియు అందరితో పంచుకోవడం విలువైనది! *
 * మన వేదాలు ఎంత గొప్పవి, అద్భుతమైనవి. *
🙏🙏🙏🙏👏👏👏🌞**************

*నాన్న ఎవరు??*

బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.

“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.

“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.

దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.

“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా

“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.

మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.

బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.

“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.

“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.

“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.

ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.

ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.

ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.

 మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.

కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.

నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.

నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.

“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.

నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.

ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.

“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.

“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.

“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.

“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.

ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.

"నా ..నాది..అన్న అహం" పోయి ..జీవితంలో  నేను పొందినది అంతా నాన్న నాకిచ్చినది అని..నాకున్న అన్నీ నాన్న అని ..నాన్న అంటే ఎవరో తెలుసుకున్న రోజుకు ముగింపు దగ్గర పడింది...
🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏

Neurological screening Test*

Note the words below. Initially, you will have difficulty reading them. However, gradually your brain will interpret the words correctly. Please give a chance for these words to speak to your brain. 
*Here we go!*

7H15                    M3554G3

53RV35          7O      PR0V3

H0W         0UR      M1ND5      C4N

D0         4M4Z1NG       7H1NG5!

1MPR3551V3            7H1NG5!

1N        7H3       B3G1NN1NG

17        WA5      H4RD      BU7

N0W,       0N    7H15       LIN3

Y0UR         M1ND      1S

R34D1NG 17         4U70M471C4LLY

W17H0U7            3V3N

7H1NK1NG      4B0U7     17,

B3      PROUD!        0NLY

C3R741N          P30PL3     C4N

R3AD           7H15!

PL3453         F0RW4RD     1F

U      C4N      R34D      7H15

This is a very good example of a Brain Study: *If you can read this, your mind is still young and has no Parkinson* Congrats!
From *Dr Justin in Jones* in Melbourne:

This is a *REAL Neurological screening Test*

శివో అభిషేక ప్రియ:

శివో అభిషేక ప్రియ: (అంటే శివుడు అభిషేక ప్రియుడు). కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి 
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర 
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం...
అభిషేక ద్రవ్యాలు... ఫలితాలు
----------------------------------------
ఆవు పాలతో..... సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు... ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి.... ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) .... దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం ... పుత్ర లాభం
పుష్పోదకం... భూలాభం
బిల్వ జలం ... భోగ భాగ్యాలు
నువ్వుల నూనె... అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం ... మహా ఐశ్వర్యం
సువర్ణ జలం ... దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం .... సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం ... సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం .... శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)... ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ ... శివ సాన్నిధ్యం
గంగోదకం ... సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం... ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం... దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ... మంగళ ప్రదం
విభూతి.... కోటి రెట్ల ఫలితం

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

(సేకరణ)

*అష్టమూర్తి లింగముల క్షేత్రాలు వాటి వివరాలు.*

ఓం నమఃశివాయ

ఈ సమస్త సృష్టి  ఎనిమిది పదార్ధములతో నిండి ఉన్నదని మన పురాణ వచనం. అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవుడు, చంద్రుడు మరియు సూర్యుడు.

సర్వ వ్యాపకుడైన పరమశివుడే ఈ ఎనిమిది రూపాలను ధరించి యున్నాడు.

అందుకనే శివార్చన లో "అష్టమూర్తి తత్వార్చన" విశేషముగా చెప్పబడినది.

1. ఓం శర్వాయ...
 క్షితి మూర్తయే నమః(భూమి)

2. ఓం భవాయ......జల మూర్తయే నమః (జలము)

3. ఓం రుద్రాయ..... అగ్ని మూర్తయే నమః (అగ్ని)

4. ఓం ఉగ్రాయ... వాయు మూర్తయే నమః (వాయువు)

5. ఓం భీమయ.... ఆకాశ మూర్తయే నమః (ఆకాశము)

6. ఓం పశుపతయే యాజమాన మూర్తయే నమః (జీవుడు)

7. ఓం మహాదేవాయ సోమ మూర్తయే నమః (చంద్రుడు)

8. ఓం ఈశానాయ సూర్య మూర్తయే నమః (సూర్యుడు)

అందుకనే జగద్గురులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం" లో ఈ ఎనిమిది పదార్థాలు శివుడే అయి ఉన్నాడని వర్ణించారు.

"....... ఇత్యాభాతి చరాచారాత్మక మిదం యస్యైవ మూర్త్యష్టకం........"

దీనికి ప్రతీకగా ఆ సదాశివుడు ఎనిమిది క్షేత్రములలో ఎనిమిది లింగ స్వరూపములు గా వెలసి యున్నాడు.

అవి
1. పృథ్వీ లింగము - కాంచిపురము

2. జల లింగము - జంబుకేశ్వరము

3. అగ్ని లింగము - అరుణాచలము

4. వాయు లింగము - శ్రీకాళహస్తి

5. ఆకాశ లింగము - చిదంబరము

6. యాజమాన లింగము - ఖాట్మండు

7. చంద్ర లింగము - సీతాకుండము (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది)

8. సూర్య లింగము - కోణార్క్

 *ఓం నమఃశివాయ*
 హర హర మహాదేవ శంభోశంకర ఓం నమఃశివాయ

*పరమ శివునకు ఐదు ముఖాలు*


⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️

పరమ శివునకు ఐదు ముఖాలు. అవి: 

*సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన* ముఖములు.

ఇవి పంచ భూతములకు ప్రతీకలు.
ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన
*సృష్టి( పుట్టుక)*
*స్థితి (పెరుగుట)*
*లయ (గతించుట)*
*తీరోధాన ( కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం)*
*అనుగ్రహములు(కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట) చేయబడును*

ఈ 5 ముఖములనుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:

*సద్యోజాత ముఖము* నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని *పూర్వామ్నాయ మంత్రములు* అంటారు.

*వామదేవ ముఖము* నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని *దక్షిణామ్నాయ మంత్రములు* అంటారు. *శైవాగమం* ఇందులోనిదే.

 *అఘోర ముఖము* నుండి *వైష్ణవాగమం* కు సంబంధించిన 
1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని *పశ్చిమామ్నాయ* మంత్రాలు అంటారు.

*తత్పురుష ముఖము* నుండి *శాక్తేయములు* అనే 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. *మహావిద్యాది మంత్రములు* ఇందులోనివే. వీటిని *ఉత్తారామ్నాయ మంత్రాలు* అంటారు.

*ఈశాన్య ముఖము* నుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 
1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని *ఊర్ధ్వామ్నాయ  మంత్రాలు* అంటారు.

అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది. వాటినే *సద్యోజాతాది పంచ బ్రహ్మ మహా మంత్రాలు* అంటారు.

✡️✡️✡️✡️✡️

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - నాలుగవ అధ్యాయము*

*గజగ్రాహముల పూర్యజన్మ వృత్తాంతములు - వాటి ఉద్ధారము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*4.1 (ప్రథమ శ్లోకము)*

*తదా దేవర్షిగంధర్వా బ్రహ్మేశానపురోగమాః|*

*ముముచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరేః॥6425॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! అంతట బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలగు దేవతలు, ఋషులు, గంధర్వులు శ్రీహరియొక్క అద్భుత కార్యమును ప్రశంసించుచు ఆయనపై పుష్పవర్షమును కురిపించిరి.

*4.2 (రెండవ శ్లోకము)*

*నేదుర్దుందుభయో దివ్యా గంధర్వా ననృతుర్జగుః|*

*ఋషయశ్చారణాః సిద్ధాస్తుష్టువుః పురుషోత్తమమ్॥6426॥*

స్వర్గమున దుందుభులు మ్రోగెను. గంధర్వులు గానము చేయుచు, నృత్యములొనర్చిరి. ఋషులు, చారణులు, సిద్ధులు పురుషోత్తముని వేనోళ్ళ ప్రశంసించిరి.

*4.3 (మూడవ శ్లోకము)*

*యోఽసౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధృక్|*

*ముక్తో దేవలశాపేన హూహూర్గంధర్వసత్తమః॥6427॥*

ఆ మొసలి వెంటనే పరమ ఆశ్చర్యమైన దివ్య రూపమును దాల్చెను. ఆ మొసలి ఇంతకుముందు జన్మలో *హూ హూ* అను గంధర్వ శ్రేష్ఠుడు, దేవలుని శాపము వలన అతనికి మొసలి రూపము ప్రాప్తించెను. ఇప్పుడు భగవంతుని అనుగ్రహమువలన అతడు శాపవిముక్తుడయ్యెను.

*4.4 (నాలుగవ శ్లోకము)*

*ప్రణమ్య శిరసాధీశముత్తమశ్లోకమవ్యయం|*
*అగాయత యశోధామ కీర్తన్యగుణసత్కథమ్॥6429॥*

*4.5 (ఐదవ శ్లోకము)*

*సోఽనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తమ్|*

*లోకస్య పశ్యతో లోకం స్వమగాన్ముక్తకిల్బిషః॥4429॥*

ఆ గంధర్వుడు పరమేశ్వరుడైన భగవంతుని పాదములకు శిరసా ప్రణమిల్లెను. పిమ్మట శాశ్వతుడు, సర్వోత్తమ కీర్తి సంపన్నుడు ఐన శ్రీమహావిష్ణువు యొక్క మనోహర లీలలను, ఉదాత్త గుణములను శ్లాఘింపసాగెను. భగవంతుని కృపాపూర్ణ స్పర్శచే అతని పాపతాపములు నశించెను. శ్రీహరికి ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లి, బ్రహ్మాదిదేవతలు చూచుచుండగనే అతడు తన లోకమునకు చేరెను.

*4.6 (ఆరవ శ్లోకము)*

*గజేంద్రో భగవత్స్పర్శాద్విముక్తోఽజ్ఞానబంధనాత్|*

*ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః॥6430॥*

గజేంద్రుడు గూడ భగవంతుని కరస్పర్శచే అజ్ఞానబంధమునుండి విముక్తుడాయెను. అతనికి భగవద్రూపము ప్రాప్తించెను. అతడు   చతుర్ముజుడు, పీతాంబరధారి అయ్యెను.

*4.7 (ఏడవ శ్లోకము)*

*స వై పూర్వమభూద్రాజా పాండ్యో ద్రవిడసత్తమః|*

*ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః॥6431॥*

ఆ గజేంద్రుడు పూర్వజన్మమున ద్రవిడ దేశమును ఏలిన ఇంద్రద్యుమ్నుడను పాండ్యవంశ ప్రభువు. అతడు భగవానుని ఉత్తమ ఉపాసకుడు, మహాయశస్వి.

*4.8 (ఎనిమిదవ శ్లోకము)*

*స ఏకదాఽఽరాధనకాల ఆత్మవాన్ గృహీతమౌనవ్రత ఈశ్వరం హరిమ్|*

*జటాధరస్తాపస ఆప్లుతోఽచ్యుతం   సమర్చయామాస కులాచలాశ్రమః॥6432॥*

ఆ మహారాజు ఒకసారి తన రాజ్యమును విడిచి, మలయ పర్వతమునందు నివసింపసాగెను. అతడు జటాధారియై, తాపసవేషమును ధరించెను. ఒకనాడు స్నానాదికములను ముగించుకొని, పూజాసమయమున  ఏకాగ్రచిత్తుడై మౌన వ్రతమును పూని సర్వశక్తిమంతుడైన భగవానుని ఆరాధించుచుండెను.

*4.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యదృచ్ఛయా తత్ర మహాయశా మునిః సమాగమచ్ఛిష్యగణైః పరిశ్రితః|*

*తం వీక్ష్య తూష్ణీమకృతార్హణాదికం   రహస్యుపాసీనమృషిశ్చుకోప హ॥6433॥*

అదే సమయమున దైవికముగా పరమ యశస్వియైన అగస్త్యముని శిష్యగణముతో అచటికి ఏతెంచెను.  ఆ రాజు ప్రజాపాలనమును, అతిథిసేవ మొదలగు గృహస్థాశ్రమ ధర్మములను వీడి, తాపసి వలె ఏకాంతముగా మౌనవ్రతమును బూని ఉపాసించు చుండుటను చూచెను. అందువలన అగస్త్యుడు ఇంద్రద్యుమ్నునిపై కుపితుడాయెను.

*4.10 (పదియవ శ్లోకము)*

*తస్మా ఇమం శాపమదాదసాధురయం  దురాత్మాకృతబుద్ధిరద్య|*

*విప్రావమంతా విశతాం తమోఽన్ధం యథా గజః స్తబ్ధమతిః స ఏవ॥6434॥*

ఆ ముని రాజును ఇట్లు శపించెను: "ఈ రాజు గురువుల యొద్ద శిక్షణను  పొందలేదు. అభిమానముతో పరోపకారము నుండి నివృత్తుడై స్వేచ్ఛాచారియై యున్నాడు. ఇతడు  ఏనుగు వలె జడబుద్ధియై బ్రాహ్మణులకు అవమానము నొనర్చినారు. కనుక, ఇతనికి అజ్ఞానియైన ఏనుగు జన్మ ప్రాప్తించునుగాక"

*శ్రీశుక ఉవాచ*

*4.11 (పదకొండవ శ్లోకము)*

*ఏవం శప్త్వా గతోఽగస్త్యో భగవాన్ నృప సానుగః|*

*ఇంద్రద్యుమ్నోఽపి రాజర్షిర్దిష్టం తదుపధారయన్॥4435॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! అగస్త్యుడు శపించుటకును, వరములను ఇచ్చుటకును సమర్థుడు. ఆ మహర్షి ఈ విధముగా ఇంద్రద్రుమ్నుని శపించి, అచటి నుండి తన శిష్యులతో గూడి వెళ్ళిపోయెను. ఆ రాజర్షియు అది అంతయును తన ప్రారబ్ధకర్మయని భావించెను.

*4.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఆపన్నః కౌంజరీం యోనిమాత్మస్మృతివినాశినీమ్|*

*హర్యర్చనానుభావేన యద్గజత్వేఽప్యనుస్మృతిః॥6436॥*

అనంతరము ఇంద్రద్యుమ్నుడు ఆత్మస్మృతిని కోల్పోవు ఏనుగు జన్మను పొందెను. కాని, అతడు ఏనుగుగా జన్మించినను భగవతారాధన ప్రభావమున (అంతిమ సమయమున) అతనికి భగవంతుని స్మృతి కలిగినది. 

*4.13 (పదమూడవ శ్లోకము)*

*ఏవం విమోక్ష్య గజయూథపమబ్జనాభస్తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః|*

*గంధర్వసిద్ధవిబుధైరుపగీయమానకర్మాద్భుతం స్వభవనం గరుడాసనోఽగాత్॥6437॥*

శ్రీహరి గజేంద్రుని ఈ విధముగా ఉద్ధరించి, అతనిని తన పార్షదునిగా చేసుకొనును. దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఆ పరమాత్ముని లీలలను కీర్తించిరి. పిమ్మట ఆ పరమ పురుషుడు పార్షదుని రూపములో ఉన్న గజేంద్రుని తనతో తీసికొని, గరుఢారూఢుడై తన దివ్యధామమునకు చేరెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - నాలుగవ అధ్యాయము*

*గజగ్రాహముల పూర్యజన్మ వృత్తాంతములు - వాటి ఉద్ధారము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్|*

*స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్॥6438॥*

కురువంశ శిరోమణివైన పరీక్షిన్మహారాజా! నేను నీకు శ్రీకృష్ణభగవానుని మహిమను, గజేంద్రమోక్షమును గూర్చిన వృత్తాంతమును వినిపించితిని. ఈ కథను విన్నవారికి కలిదోషములు, దుస్వప్నములు తొలగిపోవును.  అంతేగాదు, వారికి యశస్సు, అభ్యుదయము, స్వర్గము మొదలుకొని ఊర్ధ్వలోకములు ప్రాప్తించును.

*4.15 (పదునైదవ శ్లోకము)*

*యథానుకీర్తయంత్యేతచ్ఛ్రేయస్కామా ద్విజాతయః|*

*శుచయః ప్రాతరుత్థాయ దుఃస్వప్నాద్యుపశాంతయే॥6439॥*

తమ శ్రేయస్సును కోరుకొను ద్విజులు దుస్స్వప్నము మొదలగునవి తొలగి పోవుటకై, ప్రాతః కాలముననే లేచి పవిత్రులై ఈ స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనితో ఇట్లు పలికెను.

*4.16 (పదహారవ శ్లోకము)*

*ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురుసత్తమ|*

*శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః॥6440॥*

కురుశ్రేష్ఠా! గజేంద్రుని స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనతో ఇట్లు పలికెను.

*శ్రీభగవానువాచ*

*7.17  (పదిహేడవ శ్లోకము)*

*యే మాం త్వాం చ సరశ్చేదం గిరికందరకాననమ్|*

*వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్॥6441॥*

*శ్రీభగవానుడు నుడివెను*- ప్రాతఃకాలమున లేచి, ఏకాగ్రచిత్తముతో నన్ను, నిన్ను,ఈ సరోవరమును, ఈ పర్వతగుహలను, వనములను, వేము, వెదుళ్ళ పొదలను, దివ్య వృక్షములను, ఈ గిరి శిఖరములను, నాయొక్క శివబ్రహ్మలయొక్క నివాస స్థానములను, నాకు ప్రియధామమైన క్షీరసాగరమును, తేజోమయమైన శ్వేతద్వీపమును, శ్రీవత్స చిహ్నమును, కౌస్తుభమణిని, వనమాలను, నా కౌముదీగదను, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును, పక్షిరాజైన గరుడుని, నా సూక్ష్మాంశయైన ఆదిశేషుని, నిత్యము నన్ను ఆశ్రయించుకొని యుండెడి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, నారదమహర్షిని, పరమశివుని, అట్లే భాగవతోత్తముడైన ప్రహ్లాదుని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలలో నేను చేసిన పవిత్ర లీలలను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఓంకారమును, సత్యవచనములను, మూలప్రకృతిని, గోవులను, బ్రాహ్మణులను, శాశ్వతమైన సనాతన ధర్మములను, సోమునకు, కశ్యపునకు, (ధర్మునకు) భార్యలైన దక్షుని పుత్రికలను, అలకనందను, గంగా, యమునా, సరస్వతీ నదులును, ఐరావతమును, భక్తశిరోమణియైన ధ్రువుని, సప్తర్షులను, నలుడు, యుధిష్ఠిరుడు జనకుడు మొదలగు మహాపురుషులను భక్తి శ్రద్ధలతో స్మరించెడివారు సకల పాపములనుండి విముక్తులయ్యెదరు. ఏలయన, ఇవి అన్నియును నా రూపములే.

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్|*

*స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్॥6438॥*

కురువంశ శిరోమణివైన పరీక్షిన్మహారాజా! నేను నీకు శ్రీకృష్ణభగవానుని మహిమను, గజేంద్రమోక్షమును గూర్చిన వృత్తాంతమును వినిపించితిని. ఈ కథను విన్నవారికి కలిదోషములు, దుస్వప్నములు తొలగిపోవును.  అంతేగాదు, వారికి యశస్సు, అభ్యుదయము, స్వర్గము మొదలుకొని ఊర్ధ్వలోకములు ప్రాప్తించును.

*4.15 (పదునైదవ శ్లోకము)*

*యథానుకీర్తయంత్యేతచ్ఛ్రేయస్కామా ద్విజాతయః|*

*శుచయః ప్రాతరుత్థాయ దుఃస్వప్నాద్యుపశాంతయే॥6439॥*

తమ శ్రేయస్సును కోరుకొను ద్విజులు దుస్స్వప్నము మొదలగునవి తొలగి పోవుటకై, ప్రాతః కాలముననే లేచి పవిత్రులై ఈ స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనితో ఇట్లు పలికెను.

*4.16 (పదహారవ శ్లోకము)*

*ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురుసత్తమ|*

*శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః॥6440॥*

కురుశ్రేష్ఠా! గజేంద్రుని స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనితో ఇట్లు పలికెను.

*శ్రీభగవానువాచ*

*7.17  (పదిహేడవ శ్లోకము)*

*యే మాం త్వాం చ సరశ్చేదం గిరికందరకాననమ్|*

*వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్॥6441॥*


*4.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ|*

*క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరమ్॥6442॥*

*4.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ|*

*సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరమ్॥6443॥*

*4.20 (ఇరువదియవ శ్లోకము)*

*శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయామ్|*

*బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవ చ॥6444॥*

*4.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మత్స్యకూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే|*

*కర్మాణ్యనంతపుణ్యాని సూర్యం సోమం హుతాశనమ్॥6445॥*

*4.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయమ్|*

*దాక్షాయణీర్ధర్మపత్నీః సోమకశ్యపయోరపి॥6446॥*

*4.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*గంగాం సరస్వతీం నందాం కాలిందీం సితవారణమ్|*

*ధ్రువం బ్రహ్మఋషీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్॥6447॥*

*4.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ఉత్థాయాపరరాత్రాంతే ప్రయతాః సుసమాహితాః|*

*స్మరంతి మమ రూపాణి ముచ్యంతే హ్యేనసోఽఖిలాత్॥6448॥*

*శ్రీభగవానుడు నుడివెను*- ప్రాతఃకాలమున లేచి, ఏకాగ్రచిత్తముతో నన్ను, నిన్ను, ఈ సరోవరమును, ఈ పర్వతగుహలను, వనములను, వేము, వెదుళ్ళ పొదలను, దివ్య వృక్షములను, ఈ గిరి శిఖరములను, నాయొక్క శివబ్రహ్మలయొక్క నివాస స్థానములను, నాకు ప్రియధామమైన క్షీరసాగరమును, తేజోమయమైన శ్వేతద్వీపమును, శ్రీవత్స చిహ్నమును, కౌస్తుభమణిని, వనమాలను, నా కౌముదీగదను, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును, పక్షిరాజైన గరుడుని, నా సూక్ష్మాంశయైన ఆదిశేషుని, నిత్యము నన్ను ఆశ్రయించుకొని యుండెడి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, నారదమహర్షిని, పరమశివుని, అట్లే భాగవతోత్తముడైన ప్రహ్లాదుని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలలో నేను చేసిన పవిత్ర లీలలను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఓంకారమును, సత్యవచనములను, మూలప్రకృతిని, గోవులను, బ్రాహ్మణులను, శాశ్వతమైన సనాతన ధర్మములను, సోమునకు, కశ్యపునకు, (ధర్మునకు) భార్యలైన దక్షుని పుత్రికలను, అలకనందను, గంగా, యమునా, సరస్వతీ నదులును, ఐరావతమును, భక్తశిరోమణియైన ధ్రువుని, సప్తర్షులను, నలుడు, యుధిష్ఠిరుడు జనకుడు మొదలగు మహాపురుషులను భక్తి శ్రద్ధలతో స్మరించెడివారు సకల పాపములనుండి విముక్తులయ్యెదరు. ఏలయన, ఇవి అన్నియును నా రూపములే.

*4.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*యే మాం స్తువంత్యనేనాంగ ప్రతిబుధ్య నిశాత్యయే|*

*తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిమ్॥6449॥*

గజేంద్రా! బ్రాహ్మముహూర్తమున మేల్కొని, నీవు చేసిన నా ఈ ప్రస్తుతితో నన్ను స్తుతించిన వారికి మరణ సమయమున నిర్మల బుద్ధిని అనుగ్రహించెను.

*శ్రీశుక ఉవాచ*

*4.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఇత్యాదిశ్య హృషీకేశః ప్రధ్మాయ జలజోత్తమమ్|*

*హర్షయన్ విబుధానీకమారురోహ ఖగాధిపమ్॥6449॥*

*శ్రీశుకుడు వచించెను* మహారాజా! శ్రీమహావిష్ణువు ఇట్లు పలుకగా దేవతలు పరమానందభరితులైరి. పిమ్మట ఆ ప్రభువు తన శంఖమును పూరించి, పక్షిరాజగు గరుడునిపై ఆసీనుడయ్యెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్థోఽధ్యాయః (4)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు నాలువ అధ్యాయము (4)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

పోత‌న త‌ల‌పులో...(3)


బ్ర‌హ్మ‌గారి మీద  బ్ర‌హ్మాండ‌మైన ప‌ద్యాన్ని అందించి , స‌క‌ల‌జ‌నుల‌కు సంతోషం క‌లిగించాడు పొత‌న‌. ల‌క్ష్మీదేవి ప్ర‌స‌న్నం కావాలంటే విష్ణుమూర్తిని కూడాప్ర‌స‌న్నం చేసుకోవాలంటారు. అలాగే స‌ర‌స్వ‌తీ క‌టాక్షానికి బ్ర‌హ్మ‌గారిని భ‌క్తితో సేవించాడు  . ఎవ‌రిని సేవించినా,  ఎవ‌రిని కొలిచినా, ఎవ‌రిని పిలిచినా
ఆ ఆకారాన్ని క‌ళ్ల‌ముందు నిల‌ప‌డ‌మే పోత‌న ర‌చ‌నా శైలిలోని మ‌హాద్బుతం
                         *****
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
                         ***** 
చరాచర జ‌గ‌త్తునంతా చక్కగా సృష్టించే నేర్ప‌రికి, సరస్వతీదేవి హృద‌యానికి సంతోషం చేకూర్చువానికి, వేద రాశిని సమకూర్చిన వానికి, సమస్త దేవ‌తా బృందానికి నాయకుడై తీర్చిదిద్దువానికి, భక్తుల పాపాలను పోగొట్టే వానికి, దీనజనులను ఓదార్చువానికి, తపోధను లందరికీ శుభాలు చేకూర్చువానికి,... ఆ బ్రహ్మదేవుని  అనంత‌ భ‌క్తి తో సంసేవిస్తున్నాను.
🏵️*పోత‌న ప‌ద్యం  స‌ర్వ‌పాప హ‌రం*

సంధ్యావందనం

సంధ్యావందనం అంటే సమస్త వేద సారమైన శక్తి ఉపాసన. తత్వమసి  తెలుసుకొనే దారి. యిందులో నాలుగు వేదాలు ఉపనిషత్ సారము కూడి యుండునది. బ్రహ్మ పదార్ధ నిరూపణయే దీని సారము. యిక గాయత్రీ మంత్రం అనగా సృష్టికి మూల ప్రకృతిని తెలియుట. యిది వెనుక నుండి పఠనం చేసిన బ్రహ్మాస్రమే. అనగా బ్రహ్మ పదార్ధ నిరూపణ. ఆత్మ తత్వం దాని వెలుగు దాని చైతన్యం ప్రత్యక్షంగా ప్రకృతి ద్వారానే కనిపించు చున్నది. కాంతి ద్వారా అట్టి కాంతి యెుక్క మూల తత్వాన్ని మనో నేత్రములు దర్శించుట.అందుకు సంధ్యావందనం ప్రక్రియనే మూల తత్వం.
****************
 మారీచమాయ లేడి సంహారము వక సూక్మా పరిశీలన. సీతమ్మ కోరిక . అది ప్రకృతి మాయ యని ప్రకృతి రూపంలో అమ్మకు తెలిసు. కాని ఆ భాసము మాయ యని తెలియును. మాయ ఎప్పుడూ అనంతమైన వెలుగు రూపంలో లక్షణము. మాయ కనిపించదు వశము కాక తప్పదు. అయినా బధ్దులై యుండిరి. పోనీ సంహరణచేసిన ఉపయెూగమా! సంహరిస్తాడు ఉపయెూగంలేదు. సంహరిచుట క్షత్రియ ధర్మం కాదు. రక్షణయే ధర్మం. అధర్మ నాశనం. పోనీ ఆ మాంసం భక్షణకా. ముని వృత్తి దీక్ష. మాంస భక్షణము  నిషేధం. మరి యిచ్చట రెండు తత్వములు విరుద్ద తత్వములు మాయ యని తెలుసు బధ్దులై యుండిరి. దాని కర్మ అనుభవించాలని జీవ లక్షణమే మాయ.
***************[
 నా అనుభవం యిక్కడ వివరిస్తాను. నాకు ఏవిధమైన వేద విహితమైన చదువు లేదు. కాని నా 18 వ సంవత్సరము నుండి నమ్మకంతో బీజాక్షర మంత్రంతో యంత్రంతో గురువు ద్వాపా నే తోచిన విధంగా ఆరాధన జపం చేస్తున్నాను. కాని యింతవరకు ఏవిధమైన మరణభయంగాని ఏమీ కలగలేదు. దయచేసి నమ్మండి.నమ్మితే కలిగనది ఏదీ లేదు. కోరికలు లేకుండా సాధన చేయాలి. గరుముఖంగానే మంత్ర జపం తీసుకుని చెయ్యాలి. ప్రతీ అక్షరం బీజాక్షరమే . రామ కృష్ణ పంచాక్షరీ మెుదలగునవి అక్షరములే మంత్రములు.

జీవిత సత్యం🙏

చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు  విసిగి వేసారి, అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.

అన్నీ అంటే అన్నీ ...సమస్యలు ,ఉద్యొగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాకా తాను నమ్మిన దైవాన్ని ,చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.

చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు.

" భగవంతుడా ! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా " అని అడుగుతాడు 

దానికి భగవంతుడు వాత్సల్యంగా " నాయనా !ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి ,వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"

"అవును .కనిపిస్తున్నాయి."

"నేను ఆ గడ్డి విత్తనాలు వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి ,నీరు సూర్యరశ్మి ...అన్ని అవసరమైనవి అన్నీ అందించాను."

గడ్డి వెంటనే మొలకెత్తింది.

భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా ...

కానీ వెదురు మొలకెత్తనే లేదు.

కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు .

విస్మరించనూలేదు .
ఒక సంవత్సరం గడిచింది .
గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది 
అందంగా ఆహ్లాదంగా...
కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు .
రెండు , 
మూడు , 
నాలుగు  సంవత్సరాలు గడిచాయి 
వెదురు మొలకెత్తలేదు
కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు 
ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది .

గడ్డి కన్నా ఇది చాల చిన్నది 

కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ..
ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది.
పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి .
ఆ బలం వాటికి లేకపోతె వెదురుమనలేదు(నిలబడలేదు).
నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను.
ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ ,ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి .
వెదురు మొక్కను విస్మరించలేదు.
నిన్నుకూడా విస్మరించను.
నిన్ను నువ్వు ఇతరులతో 
ఎన్నటికీ పోల్చుకోకు .
రెండూ అడవిని అందంగా మలచినప్పటికీ ...
గడ్డి లక్ష్యం వేరు ..
వెదురు లక్ష్యం వేరు ..
నీసమయం వచ్చ్చినప్పుడు 
నువ్వూ ఎదుగుతావు."
"ప్రభు ! మరి నేను ఎంత ఎదుగుతాను??"
"వెదురు ఎంత ఎదిగింది?"

'అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."

"నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు"

నీతి:  భగవంతుడు ఎప్పుడూ..  ఎవరినీ ... విస్మరించడు. విడిచిపెట్టడు.
మనం కూడా భగవంతునిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్నీ  ఎన్నటికీ విడిచిపెట్టకూడదు.

నీ సమస్య ఎంత పెద్దదో దైవానికి చెప్పకు.

నీ దైవ০ ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.

👉"మౌనం" మనస్సును  శుద్ధి  చేస్తుంది.
👉"ధ్యానం" బుద్ధిని  శుద్ధి  చేస్తుంది.
👉"ప్రార్ధన" ఆత్మను  శుద్ధి  చేస్తుంది.
👉"దానం" సంపాదనను  శుద్ధి  చేస్తుంది.
👉"క్షమాపణ"  సంబంధాలను  శుద్ధి చేస్తుంది.

కోపం , ద్వేషం ,అసూయ వంటి పనికిమాలిన విషయాలతో నింపడానికి మనసు చెత్త కుండి కాదు .

శాంతం ,సంతొషం ,ప్రేమ వంటి విలువైన భావాలతో నింపవలిసిన వజ్రాలపెట్టే. 🙏

చదువు

*ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళయింది!! మిమ్మలిని మీరు ప్రశ్నించుకోండి. రోజూ పత్రికలు తిరగేస్తారు. నన్నారకాల చానల్స్ చూస్తారు. విందు భోజనాలు చేస్తారు. మందు పార్టీలకు వెళతారు. కానీ మనసును ఉత్తేజపరిచే ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళయింది. నిత్యం గంటల తరబడి ఏదో కార్యక్రమంలో మునిగి తేలుతుంటారు. మరి రోజుకు ఒకగంట, కనీసం అరగంట పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారా. రోజుకు అరగంటపాటు చదివినా నెలకు 15 గంటలు, ఏడాదికి 180 గంటలు చదివినట్టు అవుతుంది. అదే గంటపాటు చదివితే ఏడాదికి 360 గంటలు చదువుతారు. ఎన్ని పుస్తకంలో చడవచ్చు. చడవడమంటే దినపత్రికలు, వారపత్రికలు చదవడం కాదు. పుస్తకాలు చదవాలి. మీరు ఏ రంగంలో వున్నా, ఏం చేస్తున్న, ఏ వయసులో ఉన్నా మీకు నచ్చిన అంశాలకు సబంధించిన పుస్తకాలని  ఆసక్తితో చదవడం ఎంతగానో ఉపకరిస్తుంది. చదవడం మీ మెదడుకు మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. హృదయ సంస్కారానికి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. బతుకుని మరింత సృజనాత్మకంగా మలచుకోవడం ఎలానో తెలుస్తుంది. మార్కెట్కి వెళ్లి సరుకులు కొన్నట్టుగా పుస్తకాలు కొనడం అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక సారి వెరైటీగా విందు భోజనం చేయలనుకున్నట్టుగా వైవిధ్య భరితమైన పుస్తకం చదవాలని తపించాలి. అక్షరం వృధా పోదు. చదివిన పుస్తకానికి సంబంధించి జ్ఞానం, అనుభవం జీవిత పర్యంతం వరకు వెన్నంటే ఉంటుంది. సినిమాలు చూడాలని ఆరాటపడినట్లుగా పుస్తకాలు చదవాలనే జిజ్ఞాస, ఉత్సుకత మిమ్మలిని నడిపించాలి. పుస్తకాలపై ఈ రకమైన కుతూహలాన్ని  పిల్లల్లో చిన్నప్పటినుండి ప్రోదిచెయ్యాలి. ఇంట్లో పెద్దవాళ్ళు చదవడానికి అలవాటు పడితే పిల్లలు కూడా చదువుతారు. పుస్తకం మన ఇంటి అలంకారం కావాలి.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి
*********************

జాగ్రత్త - అతి ముఖ్యమైన సందేశం

మీ రక్తం లో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్‌లోడ్ చేయడానికి మనలో చాలామంది ఒక మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో  ఆక్సిజన్ స్థాయి, బిపి, హార్ట్ బీట్ మొ..కోవిడ్ టైం లో చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ ఆప్ ఉపయోగకరంగా ఉంది అని చెపుతున్నారు.

కానీ ఇటువంటి APPS ని డౌన్‌లోడ్ చేసే ముందు ఇది చదివి జాగ్రత్తగా ఉండండి.

 ప్రస్తుత సంక్షోభం (కోవిడ్ 19) కారణంగా ప్రజలు ఇటువంటి మోసపూరితమైన వాటికి త్వరగా  బలైపోతారు 

ఇది మరొక కోవిడ్ 19 సంబంధిత సైబర్ క్రైమ్ 

మీ చూపుడు వేలు (వేలిముద్ర) వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించండి. అంటే ముఖ్యంగా, ఇ వాలెట్ లావాదేవీలు అంటే గూగుల్ పే వంటివి, మరియు మొబైల్ స్క్రీన్ లాక్ "పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా ఇలా చాలా చోట్ల మన వెలిముద్ర తాళంగా వాడుతున్నాం " అnna సంగతి మరిచిపోకండి.

 ఈ ఆప్స్ ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి, ఇక్కడ నుండి మన వేలిముద్రలను దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని దుర్వినియోగం చేయవచ్చు.

ఈ ఆప్స్ మీ వ్యక్తిగత ఫోటోలు మరియు డేటాను ఇన్‌స్టాలేషన్ సమయంలో మీ ఫోన్/మెమరీ స్టోరేజ్ మరియు గ్యాలరీ అనుమతులను అడుగుతుంది.

ఇది మీ SMS ఇన్‌బాక్స్‌ను కూడా చదవగలదు మరియు బ్యాంక్ ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా మీ బ్యాంక్ ఖాతాల్లో మీకు ఎంత డబ్బు ఉందో హ్యాకర్లు తెలుసుకోవచ్చు.

అటువంటి ఆప్స్ డౌన్‌లోడ్ చేయవద్దని నేను వినయంగా కోరుతున్నాను, బదులుగా 1400 రూపాయలకు సులభంగా లభించే ఒక ఆక్సిమీటర్‌ను కొనండి.

-డాక్టర్. అనంత్ ప్రభుజి 
సైబర్ లా అండ్ సెక్యూరిటీ ట్రైనర్
************************

జ్యోతిషం - కరోనా విజృంభణ- ఒక వివరణ

An #Astrological overview of #CORONA. 
#కొరోనా వ్యాధి ప్రకోపం - #గ్రహ_స్థితి.

               అసలు జ్యోతిష గ్రంథాలలో ఇటువంటి మహా మారి గురించి ఉన్నదా? ఏయే గ్రహ స్థితి ఉన్నప్పుడు ఇటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదో తెలుసుకోవచ్చు నా? అన్న విషయాలని పరిశీలించి నపుడు నా దృష్టికి వచ్చిన అంశాలను జ్యోతిష విద్యార్థుల తోనూ, జ్యోతిష అభిమానుల తోనూ పంచుకోవాలని అనిపించింది. 
                      జ్యోతిష శాస్త్రం సిద్ధాంత, సంహితా, హోరా లనే 3 భాగాలలో ఉంది. ఇందులో #సంహితాభాగము నే ప్రస్తుతం మనం పరిశీలించాలి. 

#యదా_జీవయుతో_మందో_జీవాద్వా_సప్తమే_స్థితః
#తదా_ప్రజా_వినశ్యంతి_భూయాశ్చాన్న_పరిక్షయః 

       అంటే  - "గురుడు శని తో కలిసి ఉన్నా, శని నుండి సప్తమం లో ఉన్నా ప్రజా నాశనము , ఆహార ధాన్యాల కొరత అనే ఫలితాలు కలుగుతాయి. "

            #గ్రహస్థితి లో కింద చూపించి నట్లుగా (  left chart) గురుడు 20 అక్టోబరు 2019 న శని తో కలవడం జరిగింది. 
              శని, గురు, కేతువులు ఎప్పుడు ఒకే రాశిలో ఉన్నా యుద్ధాలు, దుర్భిక్షాలు, అంటువ్యాధులు కలుగుతూ ఉంటాయి. అందులోనూ  మిథున, కన్య, ధనుస్సు, మీనా లలో అయితే చెప్పనక్కరలేదు. ఈసారి ధనుస్సు లో ఆ 3 గ్రహాల కలయిక 20 Oct 2019 న జరిగింది. 
             చైనా లో ఈ వ్యాధి అప్పుడే ప్రారంభమైనా , చైనా బయటపెట్టలేదని అమెరికన్ రిపోర్ట్ చెబుతోంది. 

     #రవిరాహుమహీపుత్రాః_శశిశుక్రశనైశ్చరాః
    #ఏకరాశింగతాహ్యేతే_తథా_పృథివీ_భయాకులా

    #పూర్వదేశే_మహాపీడా_నృపాణాంసంక్షయోభవేత్
   #ప్రజానాశో_వ్యాధిభయం_తస్మిన్_కాలే_నసంశయః

"రవి, చంద్ర, కుజ, రాహు, శుక్ర, శనులు  ఏకరాశిగతులైతే భూమండలమందు భయము, తూర్పు దేశాలలో మహాపీడ, నాయకుల నాశనం, వ్యాధిభయం, ప్రజా నాశము నిస్సందేహంగా కలుగుతాయి".

             26 Dec 2019 నాటికి రవి, చంద్ర, శని, కేతువులు ధనురాశిగతులైనారు. అదృష్టం కొద్దీ కుజ, శుక్రులు ధనుస్సు లో లేరు. ఈ గ్రహస్థితి వలన పై శ్లోకాలలో చెప్పినట్లు మహా మారి ప్రారంభ, ప్రజా వినాశనానికి బీజం పడింది. 
             
            తరువాత #మకరసంక్రమణం తరువాత చైనాలో తారాస్థాయికి చేరుకుని ప్రపంచ దేశాలకు పాకింది. మకర సంక్రమణం  #శనివారం ( 11 జనవరి 2020) నాడు రావడం వలన అత్యంత దుఃఖాన్ని కలుగజేసింది. 

     #యదా_కర్కస్యసంక్రాంతిరథ_మకరస్యసౌ
     #భవత్యర్కార్కిభౌమానాంవారే_దుఃఖప్రదామతా

 NOTE :- దృక్ తుల్య అయనాంశలద్వారా చేసిన గణితం వలన మాత్రమే గత మకర సంక్రాంతి #శనివారం వచ్చింది. 
పూర్వ పధ్ధతి, గవర్నమెంట్ పంచాంగాలవారికి బుధవారం రావడం గమనార్హం. 

                          అందువలన మకర సంక్రాంతి తరువాత తీవ్రరూపం దాల్చింది. కుజుడు కూడా మకరం లోని శని-గురులతో 19 March న కలిసిన తరువాత మనదేశంలో ప్రారంభమైంది. అనంతరం... 

📌 శని వక్రారంభం (10 మే) తరువాత ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అయ్యింది. 

📌 గురుని వక్రత్వం (12 మే) వలన ఆధ్యాత్మిక బలం కలిగిన మనకు ప్రజా నష్టము ఎక్కువగా జరుగకుండా కాపాడింది. 

📌 గురుడు వక్రించి తిరిగి ధనుస్సు లోని కేతువు తో కలియ డంతో జూలై 1 నుండి తిరిగి విజృంభిస్తోంది. 

📌 14 Sept 2020 న గురుని వక్రత్యాగం జరుగుతోంది.   కావున  అనంతరం  Corona vaccine  వస్తుందని జ్యోతిష పరంగా నా అంచనా. 

📌 29 Sept 2020 న శని వక్రత్యాగం అవుతోంది కావున అక్టోబరు నాటికి  vaccine పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో కి వచ్చి కొరోనా తగ్గుముఖం పడుతుంది. 

📌 18 Nov 2020 నాటికి కేతువు ధనుస్సును వీడి వృశ్చికానికి వెళతాడు. ఆ తరువాత కొరోనా కనుమరుగు కానున్న దని తెలుస్తోంది. 

       పై గ్రహగణితమంతా కీ. శే. శ్రీపాద వేంకట దైవజ్ఞ శర్మ గారి దృక్తుల్య అయనాంశలద్వారా కీ. శే. మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారు బోధించిన రీత్యా చేయడమైనది. 

✍ Dr. Tukaram 
dr.tukaram.almanac@gmail.com
రామాయణమ్ 13
.
ఆ అడవిలో కాలుపెట్టే సందులేనంతగా అల్లుకొనిపోయి ఉన్నాయి వృక్షాలు,లతలు .దానికి తోడు పురుగులు ఈలవేసుకుంటూ చేసే ధ్వని!అత్యంత కర్ణకఠోరంగా అరిచే వివిధరకాల జంతువులు ,క్రూరమృగాలు ,  
సామాన్యుడి గుండె జలదరించేటట్లున్నదా వనము .
.
మహర్షిని కుతూహలంతో అడిగాడు!రాముడు! ఏమిటిది ? ఈవిధంగా ఎందుకున్నది? అని
.
రామా ,పూర్వము ఇది రెండు దేశముల సముదాయము 
అవి ఒకటి మలదము,రెండు కరూశము .
.
ఈ రెండు దేశాల ప్రజలు సుఖశాంతులతో ,ధనధాన్యసమృద్ధితో హాయిగా జీవనంసాగించేవారు..
.
మహర్షీ ఈ దేశాల పేర్లు వింతగా ఉన్నవేమిటి? మలదము,కరూశమా? ఆ పేర్లెట్లా వచ్చినవి? అని రాముడు ప్రశ్నించాడు.
.
రామా ! పూర్వము  వృత్రాసుర వధ అయిన పిదప ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకున్నది .
అతనిని తీవ్రమైన ఆకలి బాధించింది! ,శరీరమంతా మలినమయై అసహ్యకరంగా మారిపోయాడు!.
అప్పుడు సకలమునిసంఘాలు,దేవతలు ఆయన శరీరమలాన్ని కడిగివేసి మలాన్ని తొలగించారు ,అదేవిధంగా ఆకలిని (కారుశాన్నికూడా) తొలగించారు.
.
 ఆతని మలాన్ని ,ఆకలిని స్వీకరించిన భూమి కావున మలాదము,కరూశము అని పేర్లు ఈ ప్రాంతానికి!.
.
దేవేంద్రుడు సంతోషంతో ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండేటట్లు వరమిచ్చాడు!.
.
కొంతకాలానికి ఒక యక్షిణి ,స్వేచ్ఛారూపధారిణి, వేయి ఏనుగుల బలమున్నది,తాటక నామధేయురాలు ఈ ప్రాంతంలో  జనులను పీడిస్తూ వారిని భయభ్రాంతులను చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నది.
.
దాని భర్త సుందుడు ,కొడుకు మారీచుడు! కొడుకు కూడా తల్లివలెనే మహాబలవంతుడు వాడి బారినపడి బాధపడని వాడు లేడు! .
.
తల్లీ కొడుకులంటే ఉన్నభయం చేత ఈ ప్రాంతంలో అడుగు మోపే సాహసం ఎవ్వరూ చేయటంలేదు. మనమున్న ప్రదేశం నుండి ఒకటిన్నర ఆమడల దూరంలో దాని నివాస స్థానం !
.
రామా ! అలాంటి ఘోరతాటకను నీవు వధించాలి! అని విశ్వామిత్రుడు పలికాడు!.
.
రాముడప్పుడు వినయంగా, మహర్షీ యక్షులకు ఇంతటి బలములేదని విన్నాను ఈవిడకింత బలమెక్కడిది? అని ప్రశ్నించాడు! .
.
నీవన్నది నిజమే రామా ! ఇది సుకేతుడు అనే గొప్పయక్షునకు బ్రహ్మ వరప్రసాదం వల్ల జన్మించింది.
 వేయిఏనుగుల బలంపొందింది. 
.
దీని భర్త సుందుడు అగస్త్య మహర్షికి చేసిన అపచారం వల్ల ఆయన శాపానికి గురి అయి మరణించాడు.
.
అందుకు ఆగ్రహించి తల్లీకొడుకులు ఇరువురూ ఆయనను భక్షించబోగా ఇరువురినీ రాక్షసులు కమ్మని శపించాడు !
.
అప్పటినుండి అది ఈ ప్రదేశాన్ని నాశనంచేస్తూ వస్తున్నది! 
ఈ ప్రదేశం ఒకప్పుడు అగస్త్యుడు నివసించినప్రాంతం!
.
రామా !నీవు తప్ప ముల్లోకాలలో దానిని వధింప సమర్ధుడు లేడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

*వేదాంత తత్వాలలో మర్మం*

పాశ్చాత్యులు ఇంకా బట్ట కట్టడం నేర్వక ముందే మన భారతీయులు తత్త్వవిచారణలో మునిగి వుండేవారు. వారికి బాహ్య వేషధారణ కంటే అంత:శౌచం గురించి ఎంతో లోతుగా విచారణ చేసేవారు. మనకన్నా మన పూర్వులు ఎంతో గొప్పవారు, తాత్త్వికులు, దార్శనికులు.
క్రైస్తవంలోకానీ, ముస్లింమతం లో కానీ మరే ఇతర మతాలలోను ఇంత లోతైన విచారణ కనబడదు. వారి పరిధి కేవలం స్వర్గంతో ఆగిపోతుంది. మనకు స్వర్గానికి ఆవల వున్న లోకాలు దాటి కైవల్యం, మోక్షం గురించి తెలుసుకున్నారు. మనకు వేదాంతంలో మూడు రకాల పద్ధతులు వున్నాయి.

💐 *1.అద్వైతం:*

మహావాక్యాలు వాటికి మూలాధారాలు. అంటే "మనలోనే భగవంతుడు వున్నాడు. అసలు మనమే భగవంతుల౦" అన్నది ఈ దర్శనం. దీనిని విస్తృతంగా ప్రచారం చేసి బౌద్ధాన్ని మన దేశంలో అంతమొందించినది సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా శ్రీ ఆదిశంకరులు జగద్గురువులు. వారు సుమారు 800 AD లో వున్నారని చరిత్రకారులు అంటారు. జోషి మఠ్ వారు 400 BC గా చెబుతారు. అప్పటి ప్రజలు, పండితులు వీటిని అవగాహన చేసుకుని అనుష్టించగలిగే బుద్ధి కుశలత కలవారు.

క్రమేణా మన బుద్ధి వికాసం కుచించుకుపోయినది. అవి చాలా అర్ధం కాని తత్వాలగా కేవలం పండితులకు మాత్రమె అర్ధమయ్యే తత్త్వాలుగా చెలామణి అయ్యాయి.

 *2. విశిష్టాద్వైతము:* 

వేదాంత చింతన అర్ధం కాని వారి కోసం ఆదిశేషుని అవతారంగా శ్రీ భగవద్రామానుజులు అవతరించి సుమారు 1135 AD లో మరల వేదమతాన్ని పునరుద్ధరించారు. అప్పటికి జైనం బాగా వేళ్ళూనుకున్నది. ఆయన ప్రస్తావించినది పూర్తి అద్వైతం కాదు, పూర్తి ద్వైతం కాదు. "మనం దేవునిలోని భాగం" అన్నది వారి బోధ. మనలోని దేవుని తెలుసుకోవడం కోసం పరిపూర్ణ శరణాగతి చేసి తద్వారా మనం భగవంతుని చేరుకోవడం అన్నది వీరి పద్ధతి. అప్పటికి చాలా బాగా అర్ధమయ్యి ఎందరో మరల వేదమతాన్ని అవలంబించారు. ఎందరినో వాదనలలో ఓడించి మన హైందవాన్ని పునరుద్ధరించారు. కానీ క్రమేణా ఈ భాష్యంలో రెండు వాదనలు బయలుదేరాయి. వడగలై, తేన్గలై అని. ఒకటి మనం కోతిపిల్లల్లాగా తల్లి కోతిని పట్టుకున్నట్టు మనం దేవుని ఆశ్రయించాలని, మరొక వాదం మనం దేవుని నమ్ముకుంటే పిల్లి తన పిల్లలను పోషించినట్లు దేవుడే మానను కాచుకుంటాడని. ఇలా ఎవరి మతం వారితో మరల ప్రజలలో అపోహలు సృష్టించబడ్డాయి.

🌹 *౩. ద్వైతం :*

ఇక అసలు వాదనలెందుకు దేవుడు వేరు, మనం వేరు. మనం కేవలం ఆయనను ఆశ్రయించి ఆయనను సేవించాలని వాయుదేవుని అవతారంగాభావించే మధ్వాచార్యుల (1450 AD) ప్రతిపాదన. ఇక మరే అనుమానం పెట్టుకోకుండా కేవలం భగవంతుని కైంకర్యం చేస్తూ మోక్షం పొందాలని ఆయన ఉవాచ.

ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం 500 సంవత్సరాల వ్యవధిలో మానవ మేధస్సు తరుగుతూ వస్తున్నది. వారు భౌతికమైన ప్రగతిని పొందుతూ ఆధ్యాత్మిక చింతన తగ్గించుకుని చాలా విషయాలు గ్రహించలేకపోయారు. 
అప్పటినుండి 700 సంవత్సరాల తరువాత మనం ఎంతగా ఎదిగి పోయామంటే అసలు దేవుడే లేదు, నాస్తికమే పరమ మతము అన్న చార్వాక వాదన ఎక్కువైపోయింది.

తరచి చూస్తె ఈ మూడు పద్ధతులు ఒకభక్తుని ప్రస్థానాన్ని తెలియచేస్తాయి. ముందుగా దేవుని తననుండి వేరుగా (ద్వైతం) భావించి, క్రమేణా ఆయన లక్షణాలు మనలో వున్నాయని గ్రహించి (విశిష్టాద్వైతము) చివరికి దేవుడు మరెక్కడా లేడు కేవలం తనలోనే వున్నాడు, తానే దైవమని (అద్వైతం) గ్రహించే ఈ ప్రస్థానం మన ఆధ్యాత్మిక జీవితం. ఎందరో మహానుభావులు ఈ పద్ధతి చూపించారు మనకు. కంచి పరమాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, ఇలా ఎందరో మన భారతావని పద్ధతులను ఆచరించి చూపి దేశ విదేశాలలోనుండి కూడా ఎందరో వీరిని శరణుజొచ్చి ప్రశాంతత పొందారు.
మనదౌర్భాగ్యం ఏమిటంటే ఎక్కడో పాశ్చాత్యులు వచ్చి మీదగ్గర ఎంతో విజ్ఞాన గని వున్నది అని చెప్పేంత వరకు మనం నమ్మము. 
ఆ భగవంతుడు మన వేదాల మీద, వేదవాక్కు మీద మనకు నమ్మకం కలిగించి ఉద్ధరించాలని ఆయన పాదాలను శరణాగతి వేడుకోవడం మన తక్షణకర్తవ్యం

#సర్వరోగనివారిణి ...మహాఔషధి #శొంఠి

👉అల్లం పై పొట్టుని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే శొంఠిగా మారుతుంది.

👉శొంఠిని సంస్కృతంలో  #మహాఔషధి, #విశ్వభేషణం అని కూడా అంటారు.

👉 ఈ భూమి మీద అతి భయంకరమైన అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి.

👉దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేషణం అని నామకరణం చేశారు.

👉ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది.

👉దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది.

👉మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది.

👉కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది.

👉మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది.

👉పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది.

👉శ్వాస రోగాలను, ఉదరశూలాలను, దగ్గును, హృదయ రోగములను, బోధకాలను, వాత రోగములను తగ్గిస్తుంది.

👉ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది.

👉దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి.

👉ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది.

👉జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పితో బాధపడేవారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదు గా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది.

👉అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి  సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది.

👉కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని  రోజూ రెండుపూటలా 5గ్రా మోతాడుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది.

👉 ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి.

👉రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా  తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును.

👉పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది.

👉మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైన్ధవ లవణం కలిపి తీసుకుని పల్లెరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది.

👉నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి.

👉వర్షాకాలం శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది.

👉జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడికి చిటికెడు బెల్లం ముక్క కలిపి రోజూ రెండు మూడు సార్లు తినాలి. అలాగే చెంచా శొంఠి పొడికి చిటికెడు లవంగాల పొడి, ఉప్పు ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

👉 అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే అజీర్తిపోయి ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. శొంఠి, మిరియాలు, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేయాలి. దానికి చక్కెర కలిపి వేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#శొంఠి
#Sonti