28, జులై 2020, మంగళవారం

చదువు

*ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళయింది!! మిమ్మలిని మీరు ప్రశ్నించుకోండి. రోజూ పత్రికలు తిరగేస్తారు. నన్నారకాల చానల్స్ చూస్తారు. విందు భోజనాలు చేస్తారు. మందు పార్టీలకు వెళతారు. కానీ మనసును ఉత్తేజపరిచే ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళయింది. నిత్యం గంటల తరబడి ఏదో కార్యక్రమంలో మునిగి తేలుతుంటారు. మరి రోజుకు ఒకగంట, కనీసం అరగంట పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారా. రోజుకు అరగంటపాటు చదివినా నెలకు 15 గంటలు, ఏడాదికి 180 గంటలు చదివినట్టు అవుతుంది. అదే గంటపాటు చదివితే ఏడాదికి 360 గంటలు చదువుతారు. ఎన్ని పుస్తకంలో చడవచ్చు. చడవడమంటే దినపత్రికలు, వారపత్రికలు చదవడం కాదు. పుస్తకాలు చదవాలి. మీరు ఏ రంగంలో వున్నా, ఏం చేస్తున్న, ఏ వయసులో ఉన్నా మీకు నచ్చిన అంశాలకు సబంధించిన పుస్తకాలని  ఆసక్తితో చదవడం ఎంతగానో ఉపకరిస్తుంది. చదవడం మీ మెదడుకు మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. హృదయ సంస్కారానికి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. బతుకుని మరింత సృజనాత్మకంగా మలచుకోవడం ఎలానో తెలుస్తుంది. మార్కెట్కి వెళ్లి సరుకులు కొన్నట్టుగా పుస్తకాలు కొనడం అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక సారి వెరైటీగా విందు భోజనం చేయలనుకున్నట్టుగా వైవిధ్య భరితమైన పుస్తకం చదవాలని తపించాలి. అక్షరం వృధా పోదు. చదివిన పుస్తకానికి సంబంధించి జ్ఞానం, అనుభవం జీవిత పర్యంతం వరకు వెన్నంటే ఉంటుంది. సినిమాలు చూడాలని ఆరాటపడినట్లుగా పుస్తకాలు చదవాలనే జిజ్ఞాస, ఉత్సుకత మిమ్మలిని నడిపించాలి. పుస్తకాలపై ఈ రకమైన కుతూహలాన్ని  పిల్లల్లో చిన్నప్పటినుండి ప్రోదిచెయ్యాలి. ఇంట్లో పెద్దవాళ్ళు చదవడానికి అలవాటు పడితే పిల్లలు కూడా చదువుతారు. పుస్తకం మన ఇంటి అలంకారం కావాలి.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి
*********************

కామెంట్‌లు లేవు: