28, జులై 2020, మంగళవారం

*పరమ శివునకు ఐదు ముఖాలు*


⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️

పరమ శివునకు ఐదు ముఖాలు. అవి: 

*సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన* ముఖములు.

ఇవి పంచ భూతములకు ప్రతీకలు.
ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన
*సృష్టి( పుట్టుక)*
*స్థితి (పెరుగుట)*
*లయ (గతించుట)*
*తీరోధాన ( కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం)*
*అనుగ్రహములు(కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట) చేయబడును*

ఈ 5 ముఖములనుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:

*సద్యోజాత ముఖము* నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని *పూర్వామ్నాయ మంత్రములు* అంటారు.

*వామదేవ ముఖము* నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని *దక్షిణామ్నాయ మంత్రములు* అంటారు. *శైవాగమం* ఇందులోనిదే.

 *అఘోర ముఖము* నుండి *వైష్ణవాగమం* కు సంబంధించిన 
1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని *పశ్చిమామ్నాయ* మంత్రాలు అంటారు.

*తత్పురుష ముఖము* నుండి *శాక్తేయములు* అనే 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. *మహావిద్యాది మంత్రములు* ఇందులోనివే. వీటిని *ఉత్తారామ్నాయ మంత్రాలు* అంటారు.

*ఈశాన్య ముఖము* నుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 
1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని *ఊర్ధ్వామ్నాయ  మంత్రాలు* అంటారు.

అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది. వాటినే *సద్యోజాతాది పంచ బ్రహ్మ మహా మంత్రాలు* అంటారు.

✡️✡️✡️✡️✡️

కామెంట్‌లు లేవు: