An #Astrological overview of #CORONA.
#కొరోనా వ్యాధి ప్రకోపం - #గ్రహ_స్థితి.
అసలు జ్యోతిష గ్రంథాలలో ఇటువంటి మహా మారి గురించి ఉన్నదా? ఏయే గ్రహ స్థితి ఉన్నప్పుడు ఇటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదో తెలుసుకోవచ్చు నా? అన్న విషయాలని పరిశీలించి నపుడు నా దృష్టికి వచ్చిన అంశాలను జ్యోతిష విద్యార్థుల తోనూ, జ్యోతిష అభిమానుల తోనూ పంచుకోవాలని అనిపించింది.
జ్యోతిష శాస్త్రం సిద్ధాంత, సంహితా, హోరా లనే 3 భాగాలలో ఉంది. ఇందులో #సంహితాభాగము నే ప్రస్తుతం మనం పరిశీలించాలి.
#యదా_జీవయుతో_మందో_జీవాద్వా_సప్తమే_స్థితః
#తదా_ప్రజా_వినశ్యంతి_భూయాశ్చాన్న_పరిక్షయః
అంటే - "గురుడు శని తో కలిసి ఉన్నా, శని నుండి సప్తమం లో ఉన్నా ప్రజా నాశనము , ఆహార ధాన్యాల కొరత అనే ఫలితాలు కలుగుతాయి. "
#గ్రహస్థితి లో కింద చూపించి నట్లుగా ( left chart) గురుడు 20 అక్టోబరు 2019 న శని తో కలవడం జరిగింది.
శని, గురు, కేతువులు ఎప్పుడు ఒకే రాశిలో ఉన్నా యుద్ధాలు, దుర్భిక్షాలు, అంటువ్యాధులు కలుగుతూ ఉంటాయి. అందులోనూ మిథున, కన్య, ధనుస్సు, మీనా లలో అయితే చెప్పనక్కరలేదు. ఈసారి ధనుస్సు లో ఆ 3 గ్రహాల కలయిక 20 Oct 2019 న జరిగింది.
చైనా లో ఈ వ్యాధి అప్పుడే ప్రారంభమైనా , చైనా బయటపెట్టలేదని అమెరికన్ రిపోర్ట్ చెబుతోంది.
#రవిరాహుమహీపుత్రాః_శశిశుక్రశనైశ్చరాః
#ఏకరాశింగతాహ్యేతే_తథా_పృథివీ_భయాకులా
#పూర్వదేశే_మహాపీడా_నృపాణాంసంక్షయోభవేత్
#ప్రజానాశో_వ్యాధిభయం_తస్మిన్_కాలే_నసంశయః
"రవి, చంద్ర, కుజ, రాహు, శుక్ర, శనులు ఏకరాశిగతులైతే భూమండలమందు భయము, తూర్పు దేశాలలో మహాపీడ, నాయకుల నాశనం, వ్యాధిభయం, ప్రజా నాశము నిస్సందేహంగా కలుగుతాయి".
26 Dec 2019 నాటికి రవి, చంద్ర, శని, కేతువులు ధనురాశిగతులైనారు. అదృష్టం కొద్దీ కుజ, శుక్రులు ధనుస్సు లో లేరు. ఈ గ్రహస్థితి వలన పై శ్లోకాలలో చెప్పినట్లు మహా మారి ప్రారంభ, ప్రజా వినాశనానికి బీజం పడింది.
తరువాత #మకరసంక్రమణం తరువాత చైనాలో తారాస్థాయికి చేరుకుని ప్రపంచ దేశాలకు పాకింది. మకర సంక్రమణం #శనివారం ( 11 జనవరి 2020) నాడు రావడం వలన అత్యంత దుఃఖాన్ని కలుగజేసింది.
#యదా_కర్కస్యసంక్రాంతిరథ_మకరస్యసౌ
#భవత్యర్కార్కిభౌమానాంవారే_దుఃఖప్రదామతా
NOTE :- దృక్ తుల్య అయనాంశలద్వారా చేసిన గణితం వలన మాత్రమే గత మకర సంక్రాంతి #శనివారం వచ్చింది.
పూర్వ పధ్ధతి, గవర్నమెంట్ పంచాంగాలవారికి బుధవారం రావడం గమనార్హం.
అందువలన మకర సంక్రాంతి తరువాత తీవ్రరూపం దాల్చింది. కుజుడు కూడా మకరం లోని శని-గురులతో 19 March న కలిసిన తరువాత మనదేశంలో ప్రారంభమైంది. అనంతరం...
📌 శని వక్రారంభం (10 మే) తరువాత ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అయ్యింది.
📌 గురుని వక్రత్వం (12 మే) వలన ఆధ్యాత్మిక బలం కలిగిన మనకు ప్రజా నష్టము ఎక్కువగా జరుగకుండా కాపాడింది.
📌 గురుడు వక్రించి తిరిగి ధనుస్సు లోని కేతువు తో కలియ డంతో జూలై 1 నుండి తిరిగి విజృంభిస్తోంది.
📌 14 Sept 2020 న గురుని వక్రత్యాగం జరుగుతోంది. కావున అనంతరం Corona vaccine వస్తుందని జ్యోతిష పరంగా నా అంచనా.
📌 29 Sept 2020 న శని వక్రత్యాగం అవుతోంది కావున అక్టోబరు నాటికి vaccine పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో కి వచ్చి కొరోనా తగ్గుముఖం పడుతుంది.
📌 18 Nov 2020 నాటికి కేతువు ధనుస్సును వీడి వృశ్చికానికి వెళతాడు. ఆ తరువాత కొరోనా కనుమరుగు కానున్న దని తెలుస్తోంది.
పై గ్రహగణితమంతా కీ. శే. శ్రీపాద వేంకట దైవజ్ఞ శర్మ గారి దృక్తుల్య అయనాంశలద్వారా కీ. శే. మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారు బోధించిన రీత్యా చేయడమైనది.
✍ Dr. Tukaram
dr.tukaram.almanac@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి