28, జులై 2020, మంగళవారం

*అష్టమూర్తి లింగముల క్షేత్రాలు వాటి వివరాలు.*

ఓం నమఃశివాయ

ఈ సమస్త సృష్టి  ఎనిమిది పదార్ధములతో నిండి ఉన్నదని మన పురాణ వచనం. అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవుడు, చంద్రుడు మరియు సూర్యుడు.

సర్వ వ్యాపకుడైన పరమశివుడే ఈ ఎనిమిది రూపాలను ధరించి యున్నాడు.

అందుకనే శివార్చన లో "అష్టమూర్తి తత్వార్చన" విశేషముగా చెప్పబడినది.

1. ఓం శర్వాయ...
 క్షితి మూర్తయే నమః(భూమి)

2. ఓం భవాయ......జల మూర్తయే నమః (జలము)

3. ఓం రుద్రాయ..... అగ్ని మూర్తయే నమః (అగ్ని)

4. ఓం ఉగ్రాయ... వాయు మూర్తయే నమః (వాయువు)

5. ఓం భీమయ.... ఆకాశ మూర్తయే నమః (ఆకాశము)

6. ఓం పశుపతయే యాజమాన మూర్తయే నమః (జీవుడు)

7. ఓం మహాదేవాయ సోమ మూర్తయే నమః (చంద్రుడు)

8. ఓం ఈశానాయ సూర్య మూర్తయే నమః (సూర్యుడు)

అందుకనే జగద్గురులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం" లో ఈ ఎనిమిది పదార్థాలు శివుడే అయి ఉన్నాడని వర్ణించారు.

"....... ఇత్యాభాతి చరాచారాత్మక మిదం యస్యైవ మూర్త్యష్టకం........"

దీనికి ప్రతీకగా ఆ సదాశివుడు ఎనిమిది క్షేత్రములలో ఎనిమిది లింగ స్వరూపములు గా వెలసి యున్నాడు.

అవి
1. పృథ్వీ లింగము - కాంచిపురము

2. జల లింగము - జంబుకేశ్వరము

3. అగ్ని లింగము - అరుణాచలము

4. వాయు లింగము - శ్రీకాళహస్తి

5. ఆకాశ లింగము - చిదంబరము

6. యాజమాన లింగము - ఖాట్మండు

7. చంద్ర లింగము - సీతాకుండము (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది)

8. సూర్య లింగము - కోణార్క్

 *ఓం నమఃశివాయ*
 హర హర మహాదేవ శంభోశంకర ఓం నమఃశివాయ

కామెంట్‌లు లేవు: