2, ఏప్రిల్ 2021, శుక్రవారం

ఒజ్జకజ్జికాయ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*నాకు నచ్చిన శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.*

              🌷🌷🌷

          *ఒజ్జకజ్జికాయ* 


    *విశ్వనాథవారి ప్రతిభ!* 

                🌷🌷🌷

నేను వారింటిలోనే దిగబడియుండగా నాకన్న సుమారు పదేండ్లు పెద్దవాడు గానుగపాటి వారబ్బాయి హరనాథ్ నాకు సహాధ్యాయిగా విశ్వనాథ వారింటికి వచ్చెడివాడు.  గురువుగారు కొద్దిసేపు భాష, వ్యాకరణము, ఛందస్సు తెలుగుపద్యములోని ప్రాణభూతములైన రహస్యములను ప్రస్తావించి ఒకటి రెండు పూర్వకవి ప్రయోగము లిచ్చి పద్యము వ్రాసి చూపించుమని తనపని తాను చూచుకొనెడివారు.  నాసహాధ్యాయి అప్పటికే నోటిచొరవ గలవాడు.(ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు) నిర్భయముగా పెద్దలతోనైన చనువుగా మాటలాడుట ఆయన స్వభావము.

ఒకనాడు 'పాతప్రయోగాలు కాపీ కొట్టటం ఎందుకండీ' అని

సూటిగా నడిగెను.  అప్పుడు గురువు ఒక మహా రహస్యమును సోదాహరణముగా చాలసేపిట్లు చెప్పిరి.

-మంచిప్రశ్నఅడిగావు.  బడుల్లో పిల్లలచేత చూచివ్రాత ఎందుకువ్రాయిస్తున్నారు?దస్తూరి గుండ్రంగా కుదరటానికి, మాటల మధ్య దూరాలు, తేడాలు, కొన్ని అరుదైనవి చిన్నతనంలోనే దృఢపడాలి.  కొన్ని అక్షరాల ఒత్తులు, పొట్టలో చుక్కలు, దంత్యాక్షరలేఖనం, గుర్తింపు, ఉచ్చారణ స్పష్టంగా తెలియటానికి పలికిస్తూ రాయిస్తారు. దానికి 'కాపీ' అనేదిదిక్కుమాలినపేరు. వాళ్ళు మన నెత్తిన రుద్దారు. 'ఒౙ్జబంతి' దాని అసలు పేరు. ఒౙ్జ అంటే ఉపాధ్యాయుడు. ఆయన గుండ్రంగా రాసిచ్చినదాన్ని అలాగే పిల్లలు నోటితో పలుకుతూ రాయాలి. అప్పుడు త్రికరణశుద్ధిగా జ్ఞానం, ఉచ్చారణ, రాత సరిఅవుతాయి. 'అక్షరజ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి, నేర్చుకొన్నది పూర్ణిమానిశలయందు 'ఇదంతా దాంట్లో చెప్పాను. తెలుగుబాససొగసు, ప్రాణం కళ్ళతో చదవటంలో పావలా వంతు ఉంటే నోటితో పలకటం, చెవులతో వినటంలో ముప్పావలా వంతుంది.  తెలుగు నవరసాలను ధ్వనితో, కాకువుతో పుట్టిస్తుంది. అందుకే మీకు ఈపని. పూర్వమహాకవులు మనకు ఒౙ్జలు.  కాలాన్నిబట్టి భాషాస్వరూపం కొంతమారినా భాషాస్వభావం తెగిపోకుండా ఉండాలంటే పూర్వకవుల రచనలను గొంతెత్తి ఆలపించాలి.

   ఇట్లింకను చెప్పిరిగాని వారికి కొంత విడుపు నిత్తుము.🙏🏻

 *పాలపర్తి* 

*రసజ్ఙభారతి సౌజన్యంతో*

మొగలిచెర్ల

 *భక్తుని బాధ..తక్షణ ఉపశమనం..*


అరుణాచలం లో వుండే శ్రీ శ్రీనివాసరావు గారు మొన్న శనివారం 4వతేదీ నాడు మొగిలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని దర్శించుకున్నారు..వారు పొందిన అనుభూతిని వారే అక్షరబద్దం చేశారు..శ్రీ శ్రీనివాసరావుగారి అనుభవాన్ని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను..ఈ ముందుమాటగా వ్రాసిన నాలుగు పదాలు..చివరలో శ్రీ స్వామివారి మందిరం చిరునామా తప్ప..మిగిలిన ప్రతి పదమూ శ్రీ శ్రీనివాసరావు గారు స్వయంగా వ్రాసి పంపినదే..


*జై గురుదత్త-శ్రీ గురుదత్త*


అయ్యా,.. నమస్కారమండీ...నా పేరు శ్రీనివాసరావు, మాది పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు గ్రామం, మేము *అరుణాచలం* లో ఉంటాము.మేము సుమారు ఆరు సంవత్సరాల క్రితం *మొగలిచెర్ల* వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామి వారి భోజన ప్రసాదం కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలాసార్లు వచ్చి స్వామివారి ని దర్శనం చేసుకుని నిద్ర చేసి వెళ్లాలని చాలా సార్లు అనిపించి తమరికి కూడా ఫోన్ చేసి తెలియచేయడం నేను రేపు శనివారం వస్తాను నాకు రూము ఏర్పాటు చేయాలని చెప్పడం తిరిగి మరలా బయలుదేరే ముందురోజు ఏదో ఒక అవాంతరం రావడం వలన ప్రయాణం ఆగిపోయేది...


ఇది ఇలా ఉండగా క్రితం నెల అనగా నవంబర్ 29 వ తేదీ రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కృష్ణాజిల్లా కైకలూరు గ్రామం నుండి సుమారు 450 మంది షిర్డీసాయిబాబా గారి భక్తులకు సేవ చేసే భాగంలో నడుస్తూ ఉండగా నాకు కాలు బెణికి క్రింద పడిపోయాను...ఊరికే పడిపోయాను కదా అని వైద్యం ఏమి చేయించకుండా నిర్లక్ష్యం చేసాను... అనుకోకుండా ఒక చిన్న పని రావడం వలన మా గ్రామమైన ఆకివీడు ఆర్జంటుగావెళ్ళవలసిన అవసరం ఏర్పడింది.. సరే కదా అని ఆకివీడు బయలుదేరి ప్రయాణం చేసే సమయంలో... కుడికాలు బరువుగా అనిపించడం జరిగింది...అక్కడ ఉన్న వైద్యుల వారిని సంప్రదిస్తే వారు మీకు ఈ ఇబ్బంది తగ్గేంత వరకూ పూర్తి మంచం మీదనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని తెలియచెప్పారు..  నేను ఆకివీడు లోనే ఉండి సుమారుగా ఇరవై రోజులు పూర్తి విశ్రాంతి తీసుకున్నాను...


నాకు తెలిసిన వారికి ఎవరికైనా మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్ధికంగా గానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్న యెడల వారికి మన "తండ్రి" మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఫోటో పంపించి.. వారిని ఫోటో పట్టుకుని మీకు ఉన్న ఇబ్బంది ఏదైతే ఉంటుందో..అది ఆ స్వామివారికి తెలియచేయండి...అలాగే "మేము మా ఇబ్బందులు నుండి బయట పడిన యెడల మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దర్శించుకుని..మీ దగ్గర నిద్రచేసి..పల్లకీ ఉత్సవం లో పాల్గొని...,మీ ప్రసాదం తీసుకుని వస్తాము"..అని నమస్కారం చేసుకోండి... అని చాలా మంది కి చెప్పేవాడ్ని. వారు అలా చేసిన తర్వాత వారు ఆ ఇబ్బందులు నుండి బయట పడడం, అలాగే వారు మ్రొక్కుకున్న ప్రకారం మ్రొక్క చెల్లించడం జరిగింది...


క్రి0దటి సంవత్సరం అనగా 26/12/2019 వ తేదీ ఉదయం 09:00 గంటల సమయంలో నా మొబైల్ ఫోన్ లో ఉన్న స్వామి వారి ఫోటో పట్టుకుని(నా తండ్రి) పాదాల మీద చేయి వేసినాకు ఈ కాలునొప్పి రెండు లేక మూడు రోజుల వ్యవధిలో తగ్గిపోయిన యెడల ఒకటి లేదా రెండు రోజుల సమయం తీసుకుని వచ్చి నా మ్రొక్కులు చెల్లించుకుంటాను అని నమస్కారం చేసుకున్నాను. నేను అడిగిన విధంగా నాకు కాలునొప్పి ని తీసేసారు. సరే కదా అని నేను మరలా పవని నాగేంద్ర ప్రసాద్ గార్కి ఫోన్ చేసి.. "అయ్యా నేను బయలుదేరి వస్తున్నాను నాకు వసతిసౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా" కోరడం జరిగింది...


శనివారం ఉదయం ఆకివీడు నుండి కారు లో బయలుదేరి రావడం తో మళ్ళీ నా కాలు కొంచెం నొప్పి చేసింది. సరే కదా అని ఏదోవిధంగా సర్దుకొని 04/01/2020 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నా *తండ్రి* శ్రీ దత్తాత్రేయ స్వామివారి దగ్గరకు వచ్చాను...నా *తండ్రి* ని చూసాను... శరీరమంతా పులకించిపోయింది. ఏదో తెలియని బాధ. అయినా.." నీ దగ్గరకు రావాలని మీరు ఆజ్ఞాపించారు.. తండ్రీ..నేను వచ్చేసాను అన్నిటికీ నీదే భారం. తండ్రీ..నువ్వుండగా నాకేంటి?"అనుకుంటున్నానే కానీ అప్పుడప్పుడు కాలు నొప్పి చేస్తున్నది...నా త0డ్రి దగ్గరకు వెళ్లే ముందు ప్రసాద్ గారిని కలిసి వారిని సంప్రదించగా వారు ఏర్పాటు చేసిన వసతి గృహానికి వెళ్లి రండి అని వారు చెప్పారు..కానీ.. మేము ముందుగా.. శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తాము అని వారికి చెప్పి నా తండ్రి ని దర్శనం చేసుకున్నాము. అప్పుడు ప్రసాద్ గారు మమ్మల్ని "మీరు తిరిగి ఆరు గంటల ముప్పై నిమిషాల కు రండి. పల్లకీ ఉత్సవంలో పాల్గొనవచ్చును"..అని చెప్పడంతో మేము కూడా వారు చెప్పినట్లుగా హాజరు అయ్యాము. 


కొంచెం సేపటికి శ్రీ దత్తాత్రేయ స్వామివారి పూజ పూర్తి అయ్యింది...పల్లకీ ఉత్సవంలో కూడా పాల్గొన్నాము. నా తండ్రి పల్లకీ సేవ కూడా పూర్తి అయ్యింది...పల్లకీ ని లోపలికి తీసుకు వచ్చి గుమ్మం దగ్గర కొంతమంది భక్తులు నా తండ్రి పల్లకీని పైకి ఎత్తి పట్టుకోవడం జరిగింది. అప్పుడు బయట ఉన్న భక్తులు ఒక్కొక్కరు పల్లకీ క్రింద నుంచి లోపలికి వస్తున్నారు. నేను కూడా వారితో కలిసి నా తండ్రి పల్లకీ క్రింద నుండి వచ్చి ఉయ్యాలలో ఉన్న నా తండ్రికి  వింజామరంతో  కొంత సమయం విసిరి..ఆ  తర్వాత కొంచెం ప్రక్కగా వెళ్లి నిలబడ్డాను. అప్పుడు ఒక మగమనిషి దొర్లుకుంటూ వచ్చారు.. అతని చేయి నా కాలు కు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ గట్టిగా తగిలింది..నాకు భరించలేని బాధ వచ్చింది...


పది నిమిషాలు సమయం గడిచిన తర్వాత నా తండ్రి ఆ అవధూత శ్రీ దత్తాత్రేయుడు నాకు ఒక అద్భుతం చేశారు. అది ఏంటో తెలుసా?...నా కాలునొప్పి పూర్తిగా తీసేసారు..."తండ్రీ..ఈ శరీరం లో శ్వాస ఉన్నంతవరకూ మీ చేయి వదలను. మరలా మీరు ఎప్పుడు అజ్ఞాపిస్తే అప్పుడు వచ్చేస్తాను..." అని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని తలుచుకుంటూ..


*జై గురుదత్త-శ్రీ గురుదత్త*


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).