17, ఏప్రిల్ 2023, సోమవారం

చాణిక్యుని మూడు జల్లెడ్ల పరీక్ష

 ఒక సారి *ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యుని*దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను"మూడు జల్లెడ్ల పరీక్ష *(Triple Filter Test)"* అంటాను అని అడగటం మొదలు పెట్టాడు…..

మొదటి జల్లెడ *"నిజం"* - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు."అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట సరే ..::

రెండో జల్లెడ *"మంచి "* - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,"కాదు" అన్నాడు అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం….-

సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు…

మూడో జల్లెడ *"ఉపయోగం"* - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు."లేదు" అన్నాడు ఆ మిత్రుడు."అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది* కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, *మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.**శుభంభూయాత్ః...*🙏

ముక్కు తెగినప్పుడు

 ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 


      చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 


          ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి  సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.


       ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.

 

           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

 .

సుభాషితమ్

              _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*యత్ర వేదధ్వని శ్రాంతం* 

*న చ గోభిరలంకృతమ్*

*యన్నబాలైః పరివృతం*

*శ్మశానమివ తద్గృహమ్!!* 

                            ~అత్రిస్మృతి


తా𝕝𝕝 

*ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది.*


: *శ్రీ సూక్తము-12*


*ఆపః సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే౹*

*నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే॥*


తా॥

దేవతలు స్నేహయుక్తములగు కార్యములను సృజింతురుగాక! లక్ష్మీ పుత్రుడవగు నో చిక్లీతుడా! నా గృహమునందుండుము. ప్రకాశించుచున్న నీ తల్లియగు లక్ష్మీదేవి నా వంశమున నివసించునట్లు చేయుము.

 

    *శ్రీ శంకర ఉవాచ*

           గురువు ~ శిష్యుడు

    (నిన్నటి దానికి కొనసాగింపు)



2. అట్టి గురువును భక్తితో ఆరాధించుతూ, సేవ, వినయము, ప్రణతులచే అతడు ప్రసన్నుడై నపుడు శిష్యుడు అతనిని సమీపించి తాను తెలియదోరిన విషయములను అడుగవలెను.

ఖర్చులేని స్వర్గం!*

 *ఖర్చులేని స్వర్గం!*

               ➖➖➖✍️


 *వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*


*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*


*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*


*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 


కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*

 

 *దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


 *సత్సంగత్వే నిస్సంగత్వం !* 

 *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

 *నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

 *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషులు ..*  *మార్గదర్శనం* 

*సత్సంగత్యం ..* *సహవాసం* 

*సత్ప్రవర్తన ..* *జీవించడం* 

*మించి, ఈ భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ..*✍️

🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

*అదే ఆత్మ స్థితి

 💐 *శుభోదయం* 💐


*ధ్యాన యోగంతో  చాలా సులభంగా  ఆత్మ విద్యను ఎలా పొందవచ్చు?*


*ధ్యానం అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఆసనం మీద కూర్చుని ధ్యాన ముద్రలో ఉండటం కాదు.. ప్రపంచంలో ఉంటూనే, ఆ వాసనలు అంటకుండా జీవించడం...*


అదెలాగో ఆదిశంకరులు మనకు అందించిన శివ మానస పూజా స్తోత్రం మనకు చెప్తుంది.. 


*ఈశ్వరా! నా ఆత్మయే నీవు;*


*నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ శక్తి స్వరూపమైన ఆ అమ్మవారే...*


*నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు);*


*నా ఈ శరీరమే నీ ఇల్లు;* 


*ఈ శరీరముద్వారా నేను అనుభవించే విషయ భోగాలన్నీ నేను మీకు ఆచరించే పూజ;*


*నా నిద్రయే సమాధి స్థితి;* 


*నా పాదములద్వారా నేను వేస్తున్న ప్రతి అడుగూ మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే:* 


*నేను పలికే ప్రతి మాటా నీ స్తోత్రమే;*


*నేను చేసే ప్రతి కర్మా,  ఈశ్వరా, అది  నీ ఆరాధనయే!*


ప్రత్యేకమైన ధ్యాన సాధన కోసం ప్రయత్నించకుండా, *ఈ వాక్యాలు కుదిరినప్పుడల్లా ఙ్ఞప్తికి తెచ్చుకుని, ఆ భావనతో ఉండటమే ధ్యానం...* 


మొదలంటూ పెడితే, క్రమేపీ, ఈ భావనలో అనుభూతిని పొందవచ్చు.. 

ఒక్కసారి  ఆ అనుభూతి రుచి చూస్తే ఇక అదే భావనలో ఉండిపోతాము...

  

*అదే సంపూర్ణ ధ్యానస్థితి!*


*అదే ఆత్మ స్థితి...!!!* 


💐🙏💐🙏💐


*సద్గురు కరుణా కటాక్ష సిద్ధిరస్తు!!!*

చేయకూడదు

 శ్లోకం:☝️

*అకర్తవ్యం న కర్తవ్యం*

 *ప్రాణైః కంఠగతైరపి ।*

*కర్తవ్యమేవ కర్తవ్యం*

 *ప్రాణైః కంఠగతైరపి ॥*


భావం: అధర్మమైన కర్మను ప్రాణంమీదకి వచ్చినా ఎప్పుడూ చేయకూడదు; ధర్మబద్ధమైన కర్మను ప్రాణంమీదకి వచ్చినప్పటికీ తప్పక చేయాలి.

ఈ శ్లోకంలో ఒకే వాక్యాన్ని ధర్మానికి అధర్మానికి రెండింటికీ ఉపయోగించారు.

Bజీవితంలో* వెనుకే ఉంటారు

 సూర్యోదయ శ్లోకః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥


      మనల్ని అవసరానికి వాడుకొని *వదిలేసే* వాళ్లు *దగ్గరగా* ఉన్నా ఒకటే *దూరంగా* ఉన్నా ఒకటే? అలాంటి వాళ్ళకి మనం *అవసరం* ఉన్నపుడు మాత్రమే *మనుషులుగా* అనిపిస్తాము, తర్వాత *గడ్డిపరక* కన్నా *హీనంగా* అనిపిస్తాము.


.      నీ *ఎదురుగా* నీ గురించి మాట్లాడటం *చేతకాని* వారే నీ వెనుక నీ *వ్యక్తిత్వాన్ని* విమర్శిస్తూ *మాట్లాడతారు* అలాంటి వారెప్పుడూ *జీవితంలో* వెనుకే ఉంటారు 


     ఏం *జరిగినా* దానికి ఒక *కారణం* ఉంటుంది, అలా ఎందుకు *జరిగిందో* ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ *సమయం* వచ్చినప్పుడు తప్పకుండా *తెలుస్తుంది* అన్నింటికి *కాలమే* సమాధానం చెప్తుంది,... కొంచెం *ఓపిక పట్టు* .


     నిన్ను *విమర్శించే* ప్రతి వ్యక్తికి *సంజాయిషీ* చెప్తూ పోతే, నీవు ముందుకు సాగేదెప్పుడు *ధైర్యంగా* ముందడగు వేయి అప్పుడే *ఏ విమర్శ* నీ దరిచేరదు.


.      *నిజాయితీ* లేని *నూరు* మంది వెనుక *నడవటం* కన్నా నిజాయితీ ఉన్న *ఒక్కరి* వెనుక నడవటం *మిన్న*, పదిమంది బాగుకోసం ఒకసారి *తల* వంచినా *తప్పులేదు*..కానీ ఒకరి మెప్పుకోసం *నీ వ్యక్తిత్వాన్ని* మాత్రం *తాకట్టు* పెట్టకు .


    *ఉప్పు* నీరు ఉన్న *సముద్రం* 

గర్జిస్తూ ఉంటుంది *మంచి* నీరు ఉన్న *బావి* నిర్మళంగా ఉంటుంది,,,చిల్లర *డబ్బులు* గల గల *శబ్దం* చేస్తాయ్ , ఖరీదైన *నోట్లు* నిశ్శబ్దంగా ఉంటాయి,, 


.    *మాట* కి విలువ ఉండాలి   

 మాట కి విలువ *పెరిగితే* మనిషి విలువ *పెరుగుతుంది*.


ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో    మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కొరుకుంటూ..

ఋణను బంధాలు

 🌻గత జన్మ ఋణను బంధాలు  ఈ జన్మలో  ఎలా కలుస్తారో  అద్భుత సందేశం 🔥


🌹🌹🌹🌹🌹🌹🌹


ఇతరులతో పూర్వజన్మలో  మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా,


 భర్తగా,....


సంతానంగా,....


తల్లిదండ్రులుగా,....


మిత్రులుగా,....


 నౌకర్లుగా,....


ఆవులు,.... గేదెలు,.....కుక్కలు.....


 ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. 


ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,.....


మరణించడమో  జరుగుతుంది.  


ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే.....


 మన జీవితకాలంలో మనకి  ఏర్పడే సంబంధాల  మీద మోజు కలుగదు. 


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


--  మనం పూర్వ జన్మలో  ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా,.....


లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో.....


మన సంపాదనతో పోషించబడే భార్యగా,.....


 సంతానంగా,......


మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


--  ద్వేషం కూడా బంధమే....


పూర్వజన్మలోని  మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా.....


 లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


--  మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి.....


ఈ జన్మలో శత్రువులుగానో,.....


 దాయాదులుగానో,......


ఏదో ఒక రకంగా మనకు  అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి......


ఈ జన్మలో మిత్రులుగానో తరసపడతారు 


ఉదాహరణకు ఒక జరిగినకథ:-


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర....


 అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం  అడుక్కుంటూ ఉండేవాడు.


ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు.


 కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ,


రోడ్డు పక్కన ఎవరి పంచలోనో  పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.  ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...


పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు  ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా  ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను  బాధలు  పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. 


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: 


ఒకసారి సత్యసాయిబాబా  బస చేసిన అతిథిగృహం  బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో    ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా  దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు  స్వామి.


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి  వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే,.....


ఆయన వెనక్కి  పిలిచి నీ చేతి సంచి  ఏది అని అడిగితే, 


పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు.


అప్పుడు మలయాళ స్వామి వారు *...


”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు  చేత సంచీని మోయిస్తె.....


వచ్చే జన్మలో  నువ్వు అతని బియ్యం  బస్తాను మోయాల్సి ఉంటుంది!”   అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.


మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో,


 మర్యాదకో, కృతజ్ఞత గానో,


గౌరవంతోనో  లేదా మరే ఇతర కారణాల ద్వారానో....


 ఉచితంగా  స్వీకరించిన వన్నీ  కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. 


కొత్త వాళ్ల నుంచి పెన్ను  లాంటి వస్తువులను  తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం,


 పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే  నాకు ఫలానాది తీసుకురా  అని చెప్పడం,....


ఇలాంటివి అనేక  సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.  


అవి కర్మ బంధాలవుతాయి  అని తెలియక మన  జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.


ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో,...


 అలాగే  అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం.


అలాగే కర్మ ఎంత పెద్దదైనా,....


 చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.


కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా  మనం తప్పించుకో గలమా......?


🙏సర్వేజనాసుఖినోభవంతు 🙏