17, ఏప్రిల్ 2023, సోమవారం

*అదే ఆత్మ స్థితి

 💐 *శుభోదయం* 💐


*ధ్యాన యోగంతో  చాలా సులభంగా  ఆత్మ విద్యను ఎలా పొందవచ్చు?*


*ధ్యానం అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఆసనం మీద కూర్చుని ధ్యాన ముద్రలో ఉండటం కాదు.. ప్రపంచంలో ఉంటూనే, ఆ వాసనలు అంటకుండా జీవించడం...*


అదెలాగో ఆదిశంకరులు మనకు అందించిన శివ మానస పూజా స్తోత్రం మనకు చెప్తుంది.. 


*ఈశ్వరా! నా ఆత్మయే నీవు;*


*నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ శక్తి స్వరూపమైన ఆ అమ్మవారే...*


*నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు);*


*నా ఈ శరీరమే నీ ఇల్లు;* 


*ఈ శరీరముద్వారా నేను అనుభవించే విషయ భోగాలన్నీ నేను మీకు ఆచరించే పూజ;*


*నా నిద్రయే సమాధి స్థితి;* 


*నా పాదములద్వారా నేను వేస్తున్న ప్రతి అడుగూ మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే:* 


*నేను పలికే ప్రతి మాటా నీ స్తోత్రమే;*


*నేను చేసే ప్రతి కర్మా,  ఈశ్వరా, అది  నీ ఆరాధనయే!*


ప్రత్యేకమైన ధ్యాన సాధన కోసం ప్రయత్నించకుండా, *ఈ వాక్యాలు కుదిరినప్పుడల్లా ఙ్ఞప్తికి తెచ్చుకుని, ఆ భావనతో ఉండటమే ధ్యానం...* 


మొదలంటూ పెడితే, క్రమేపీ, ఈ భావనలో అనుభూతిని పొందవచ్చు.. 

ఒక్కసారి  ఆ అనుభూతి రుచి చూస్తే ఇక అదే భావనలో ఉండిపోతాము...

  

*అదే సంపూర్ణ ధ్యానస్థితి!*


*అదే ఆత్మ స్థితి...!!!* 


💐🙏💐🙏💐


*సద్గురు కరుణా కటాక్ష సిద్ధిరస్తు!!!*

కామెంట్‌లు లేవు: