సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥
మనల్ని అవసరానికి వాడుకొని *వదిలేసే* వాళ్లు *దగ్గరగా* ఉన్నా ఒకటే *దూరంగా* ఉన్నా ఒకటే? అలాంటి వాళ్ళకి మనం *అవసరం* ఉన్నపుడు మాత్రమే *మనుషులుగా* అనిపిస్తాము, తర్వాత *గడ్డిపరక* కన్నా *హీనంగా* అనిపిస్తాము.
. నీ *ఎదురుగా* నీ గురించి మాట్లాడటం *చేతకాని* వారే నీ వెనుక నీ *వ్యక్తిత్వాన్ని* విమర్శిస్తూ *మాట్లాడతారు* అలాంటి వారెప్పుడూ *జీవితంలో* వెనుకే ఉంటారు
ఏం *జరిగినా* దానికి ఒక *కారణం* ఉంటుంది, అలా ఎందుకు *జరిగిందో* ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ *సమయం* వచ్చినప్పుడు తప్పకుండా *తెలుస్తుంది* అన్నింటికి *కాలమే* సమాధానం చెప్తుంది,... కొంచెం *ఓపిక పట్టు* .
నిన్ను *విమర్శించే* ప్రతి వ్యక్తికి *సంజాయిషీ* చెప్తూ పోతే, నీవు ముందుకు సాగేదెప్పుడు *ధైర్యంగా* ముందడగు వేయి అప్పుడే *ఏ విమర్శ* నీ దరిచేరదు.
. *నిజాయితీ* లేని *నూరు* మంది వెనుక *నడవటం* కన్నా నిజాయితీ ఉన్న *ఒక్కరి* వెనుక నడవటం *మిన్న*, పదిమంది బాగుకోసం ఒకసారి *తల* వంచినా *తప్పులేదు*..కానీ ఒకరి మెప్పుకోసం *నీ వ్యక్తిత్వాన్ని* మాత్రం *తాకట్టు* పెట్టకు .
*ఉప్పు* నీరు ఉన్న *సముద్రం*
గర్జిస్తూ ఉంటుంది *మంచి* నీరు ఉన్న *బావి* నిర్మళంగా ఉంటుంది,,,చిల్లర *డబ్బులు* గల గల *శబ్దం* చేస్తాయ్ , ఖరీదైన *నోట్లు* నిశ్శబ్దంగా ఉంటాయి,,
. *మాట* కి విలువ ఉండాలి
మాట కి విలువ *పెరిగితే* మనిషి విలువ *పెరుగుతుంది*.
ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కొరుకుంటూ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి