23, ఫిబ్రవరి 2021, మంగళవారం

శ్రీవిష్ణు_సహస్ర_నామ_స్తోత్ర_పారాయణ_విశిష్టత

 *#శ్రీవిష్ణు_సహస్ర_నామ_స్తోత్ర_పారాయణ_విశిష్టత*


🌹🌷🐚🔔🛕🐚🌷🌹


*"ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటి? " అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు.. భీష్మపితామహులు  మానవ జాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.*

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలుంటాయి. సహస్రం అంటే "వెయ్యి (1000)" అని అర్థం. వెయ్యి నామాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి. ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది. అందుకే...*

**ధనాభివృద్ధికి - విష్ణు సహస్రనామమే..*

*మంచి ఆరోగ్యానికి - విష్ణు సహస్రనామమే..*

**విద్యాభివృద్ధికి - విష్ణు సహస్రనామమే..*

*మనశ్శాంతికి - విష్ణు సహస్రనామమే..*

*ఇంతేనా..! ఇలా నిత్య జీవితంలో మానవులేదుర్కొనే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపింది మన "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం".*

*అందుకే  ప్రపంచదేశాలలో సైతం  ఈనాడు జాతి, మత, భాషలకు అతీతంగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం నేర్పిస్తున్నారు.. పఠిస్తున్నారు.*

*కాబట్టి సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము. ఎవరి కోరికనను అనుసరించి వారు ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు  జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:*

*1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)*

**----------------------------------------*

*సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹*

**వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹*


*2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)*

**----------------------------------------*

*భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹*

**అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹*


*3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)*

**----------------------------------------*

*వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹*

**అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹*


*4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)*

**----------------------------------------*

*మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹*

**అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹*


*5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)*

**----------------------------------------*

*అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹*

**సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹*


*6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)*

**----------------------------------------*

*అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹*

**సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹*


*7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)*

**----------------------------------------*

*భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹*

**కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹*


*8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)*

**----------------------------------------*

*వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹*

**పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹*


*9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)*

**----------------------------------------*

*వైకుంఠ: పురుషః ప్రాణః   ప్రాణదః ప్రణవః పృథుః ౹*

**హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹*


*10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)*

**----------------------------------------*

*విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹*

**అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹*


 *11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)*

 **----------------------------------------*

*యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹*

**సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹*


*12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)*

**----------------------------------------*

*అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹*

**శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹*


*13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)*

**----------------------------------------*

*శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹*

**శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹*


*14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)*

**----------------------------------------*

*ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹*

**భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹*


*15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)*

**----------------------------------------*

*సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹*

**శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹*


 *16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)*

 **----------------------------------------*

*సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹*

**న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹*


*17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)*

**----------------------------------------*

*సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |*

**అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||*


*18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)*

**----------------------------------------*

*సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹*

**స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹*


*19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)*

**----------------------------------------*

*అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹*

**శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹*


*అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹*

**విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹*


*20. దుస్వప్న నాశనమునకు:(99 వ శ్లోకం)*

**----------------------------------------*

*ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹*

**వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹*


*21. పాపక్షయమునకు: (106 వ శ్లోకం)*

**----------------------------------------*

*ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹*

**దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ౹౹*


****🙏 *జై శ్రీ మన్నారాయణ* 🙏****

🌹🌷🐚🛕🔔🐚🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మన మహర్షులు - 31

 మన మహర్షులు - 31


 మైత్రేయ మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మైత్రేయుడు ఎంత గొప్పవాడంటే తల్లి గర్భంలో వుండగానే ధర్మశాస్త్రాలు, వేదవేదాంగాలు అన్నీ నేర్చేసుకున్నాడు.


 చిన్నతనంలోనే రాక్షసులందర్నీ నాశనం చేసే యజ్ఞం చేశాడు. పులస్త్య బ్రహ్మర్షి దగ్గర దివ్యజ్ఞానసిద్ధి పొందాడు.


ఒకసారి గురువు పరాశర మహర్షిని మీ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను. విష్ణుమూర్తె  తత్త్వాన్ని నాకు వివరించండని అడిగాడు మైత్రేయ మహర్షి -


ఇవే కాకుండా భూమి మొదలైన భూత ప్రమాణాలు, సప్తసాగరాలు, సప్తద్వీపాలు సప్తకులపర్వతాలు, సూర్యగ్రహం మొదలైన వాటి సంచారాలు, చతుర్విధ భూత నిర్మాణం, చతుర్ధశ మన్వంతరాలు, చతుర్యుగ ప్రమాణాలు, కల్పకల్ప విభాగం, యుగధర్మాలు, దేవర్షి చరిత్రలు, బ్రాహ్మణ వర్ణధర్మాలు, బ్రహ్మచర్యం మొదలైన వాటి గురించి కూడ చెప్పమన్నాడు


పరాశరుడు ఆనందంతో విష్ణుతత్త్వం గురించి చక్కగా వివరంగా చెప్పాడు మైత్రేయుడికి.  అదే విష్ణు పురాణం..

--- పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇవన్నీ ఏ జీవికి ఒకే చోట జరగదు. ఎవరి కర్మని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది.


ధనం సంపాదించడం, దాచడం, ఖర్చు పెట్టడం, ఇదంతా దుఃఖానికే, కాని, ఎవరికేనా చాలా డబ్బుంది అంటే అది సంతోషపడే విషయం కాదు స్త్రీలు, స్నేహితులు, చుట్టాలు, పిల్లలు, ఇళ్ళు, పొలాలు ఇవన్నీ పోవడం రావడం

వల్ల కష్టమే గాని సుఖముండదు.


అసలు దుఃఖానికి కారణం మనం చేసే పని. అది విత్తనం. అదే చెట్టులాగ పెరిగి పెద్దదవుతుంది.


పుడుతూ ఉండడం, రోగాలు, వృద్ధాప్యంతో బాధపడుతూ ఉండడం ఇవన్నీ లేకుండా భగవన్నామం చేసుకుని మోక్షానికి ప్రయత్నించడమే మంచిదని జ్ఞానులు చెప్తున్నారని అన్నీ వివరంగా పరాశరుడు మైత్రేయ మహర్షికి చెప్పాడు..


మైత్రేయుడు అన్ని తీర్థాలు తిరుగుతూ కామ్యకవనంలో పాండవుల్ని చూసి బాధపడి దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలని వాళ్ళదగ్గరకి వెళ్ళాడు.


 ధృతరాష్ట్రుడు మహర్షిని సత్కరించి పాండవులెలా వున్నారని అడిగాడు. 


మహామునుల దీవనలందుకుంటున్న పాండవులకి కష్టాలెందుకుంటాయి? వాళ్ళు ధర్మం తప్పితే సూర్యచంద్రులు గతులు తప్పుతారు. బలంలో ఒక్కక్కడు నూరేసి ఏనుగులకి సమానమని చెప్పాడు మైత్రేయుడు


మైత్రేయ మహర్షి చెప్తుంటే దుర్యోధనుడు తొడలు కొట్టుకుంటూ కూర్చున్నాడు.


దుర్యోధనా! నా మాట లక్ష్యపెట్టక నన్ను గౌరవించని నువ్వు భీముడితో తొడమీద గదతో కొట్టించుకుని ఛస్తావ్! అని శపించాడు మైత్రేయుడు.


దృతరాష్ట్రుడు మైత్రేయుడి కాళ్ళమీదపడి క్షమించమన్నాడు.


 మైత్రేయుడు వినకుండా కోపంతో వెళ్ళిపోయాడు


కొంతకాలం తర్వాత విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి గంగానది దగ్గర ఇసుక మీద పద్మాసనం వేసుకుని ఇంద్రియాల్ని అరికట్టి ఆచార, వ్రతాల, ఉపవాసాల్లో కృశించిపోయిన పుణ్యపురుషుడయిన మైత్రేయ మహర్షి పాదాలకి నమస్కారం చేసి మహర్షీ భగవంతుడు స్వతంత్రుడైనా ఎన్నో అవతారాలెత్తుతాడు కదా.... ఏ పన్లు చేశాడు? సవివరంగా తెలియజేయండి...అంటూ అడిగాడు.


మైత్రేయ మహర్షి విదురుడితో లోకానికంతకి ఈశ్వరుడు హరి. జీవుడు భగవంతుడి మీద ఆధారపడ్డాడు. నారాయణుడు అన్నింటికీ తాను ఆధారమవుతాడు కానీ, తాను ఆధారపడడు. హరి భజన వల్ల సమస్త కష్టాలు పోతాయని చెప్పాడు. ఇంకా విష్ణుమూర్తి అవతారాలు అన్నింటి గురించి కూడా చెప్పించుకుని విని విదురుడు ఆనందంగా వెళ్ళిపోయాడు.


ఒకసారి మైత్రేయుడి ఆశ్రమానికి వ్యాసుడు చెప్పకుండా వచ్చాడు. మైత్రేయుడు భక్తితో పూజచేసి చక్కటి భోజనం పెట్టి స్వామీ! మీరాక నాకు చాలా ఆనందంగా వుంది మీరాకకు కారణం చెప్పండన్నాడు.


మహర్షీ! తపము, దానము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసా! దానమే గొప్పది. అలాగే దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పది


ఎందుకంటే ప్రాణం శరీరంలో ఉంటుంది. శరీరానికి బలం అన్నం వల్లనే వస్తుంది. జ్ఞానవంతులు అన్నదానం చేస్తారు. తపము, విద్య, దానము, ధర్మగుణాన్ని పెంచుతాయి ఉన్నతమైన విద్య భగవంతుణ్ణి చూపించే మార్గం. నువ్వు చేసిన అన్నదానం వల్ల నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి వ్యాసుడు మైత్రేయుణ్ణి అభినందించి

వెళ్ళిపోయాడు .


మైత్రేయ మహర్షి కధ చదవడం వల్ల మనం కూడా శ్రీహరితత్వాన్ని...అన్నదాన మహిమను..అహంకారం లేకుండా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాము..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

సంఘంలో జరుగుతున్న సంఘటనలు

 *ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు చూసి విసిగి పోయినవారి స్పందన మాత్రమే* .!!!!


*ప్రస్తుత వివాహ  వ్యవస్థ* *ఆడపిల్లలు, వారి తల్లి దండ్రులదే  పైచేయి!*


కావలసిన అర్హతలు: BTech, Software, America

అబ్బయికి సొంత ఇల్లు, 

తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.

సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.

ఆడపిల్లల తల్లితండ్రులకు 

సపోర్ట్ గా  ఉండాలి.


💥ఇంటర్వ్యూ: 


ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.


"అబ్బాయి చదువు, తెలివి తేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు".  కాని, 10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి  ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. (అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో)  మీ అబ్బాయి ఫోటో,  వివరాలు whatsapp లో పంపండి ,  మా అమ్మాయిది పంపుతాము అంటుంది !  మనం పంపిస్తే వారు పంపరు. తరవాత  మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం:  "ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం :

"అమ్మాయి లేట్గా వస్తోందండి. 

ఇంకా చూడలేదు". మూడవ వారం: "ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి".  నాలుగో  వారం: శని, ఆదివారాలలో" అమ్మాయి తలనోప్పని పడుకుందండి" . ఐదో వారం: అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.


💥అమ్మాయిల విషయాని కొస్తే:  తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా  జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:


"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా? మీ ఇంట్లో  వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా? మీ ఇంట్లో రాహు కేతువులు వున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,

 

"మీ అమ్మ నాన్నలు మనతో 

ఉండడానికి వీలు లేదు,


నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు.  నీ సెల్ నేను ముట్టుకోను! 


నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చు కుందాము! లేదా వంటమనిషి పెట్టుకుందాం..

 

నా జీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో,  నీ జీతం ఖర్చుపెడదాము!"


ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం.


లేకపోతె తాంబూలాలు లేవు. 

కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి.


పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక..... విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టా లంటే లక్షలు పరిహారం.

అప్పటికే అబ్బాయి క్రెడిట్, డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది... విడాకులైనా ఏ మాత్రము  మార్పు, బాధ లేకుండా కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు. సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.


వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! 


ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా?


ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం.


ప్రమాదమేమంటే, మగవారికి సంతానోత్పత్తి 90 వత్సరాలు దాకా ఉంటుంది. కాని ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లి తండ్రులు ఈ సంగతి  తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఆడ పిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు.


 కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగి పోతుంది) ఇవండీ!  మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు!  అనుభవించిన వారు చెప్పిన నగ్న సత్యాలు!


నేను రాసినవి మాట్రిమొని కన్వెక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు ,  ఆడపిల్లలు వేదనతో చెప్పిన  యదార్ధ సత్యాలు. అంతేకాని,  ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు.


 👉ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!👈

 

🌹30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,

🌹పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,

🌹ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ

అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,

🌹18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు.


🌹అబ్బాయిలకు 

🌹తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు  

ఈ పోస్ట్ అంకితం.👍


🌷పోయిన వయసు రాదు.


*"పురుషుడు-స్త్రీ- వయస్సు"* ఇవి మూడే ముఖమైనవి. 

*జీతం, చదువు కాదు*

ఒక వ్యక్తి ఆవేదన.అందరూ... ఆలోచించండి.*

👉పై ప్రవృత్తి కలిగిన... మన గ్రూప్ లో లేని వారికి అందరికీ పంపండి... కొంచమైనా ఆలోచిస్తారు..👈.

*సర్వేజనాసుఖినోభవంతు*


రాసిన వారికి వేల వేల కృతజ్ఞతలతో.

*తల్లి ఋణం

 *తల్లి ఋణం - తీర్చలేనిది* 


 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.

తల్లి నవ్వి ఊరుకుంది. 

కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో- తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు  అవసరం లేదు, 

నీవు ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు అంది.

ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. 


అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది.

కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు.

రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.


అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.


తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. 

కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో  కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.

తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. 

ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... 

అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది

 ఇలా వేధించడానికేనా నన్ను 

నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? 

చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. 


అప్పుడు తల్లి ..... 

బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... 

నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.


నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు- నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.


ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు ,ఆమె చేసే సేవలకు ,ఆమె త్యాగాలకు , కష్టానికి , సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం తీర్చుకోలేరు .మాతృదేవో భవ 

లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ 🙏

బ్రాహ్మణుడు



1.వశిష్ఠుడు బ్రాహ్మణుడు...

సేవ చేసింది సూర్య వంశానికి,


2.చాణక్యుడు బ్రాహ్మణుడు...

పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి,


3.విధ్యారణ్యుడు బ్రాహ్మణుడు

పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు..


4.సమర్థ రామదాసు బ్రాహ్మణుడు..

పట్టం కట్టింది శూద్ర శివాజీకి..


5.గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు.. 

పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి..


అంతిమంగా- బ్రాహ్మణులు అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు.😡


మేము బ్రాహ్మణులమ్😇😇


మేము క్షత్రియుడైన శ్రీరాముని

ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం

🙏🙏

గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని

పరమాత్ముడు అని ఆరాదిస్తాం🙏🙏


స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.🙏🙏🙏


బ్రాహ్మణుడైన బ్రహ్మకు 

నమస్కారం చేయము..🤬


బ్రహ్మణుడైన రావణుడి..

దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.👹👺


ఇంతచేసినా కూడా పరుల

కళ్ళకు జాతీయవాదులం

ఎందుకంటే,....


మేము బ్రాహ్మణులం..😭😇


ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.🏹💐💐


కళా, సాంసృతులను ఆరాదిస్తాం..🪐🪐


ఎవరైనా ఎదుగుతుంటే వారికి 

నిచ్చెన వేస్తాం..🧗‍♂️


ఇంత చేసినా కూడా పరుల 

కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం..😡😡😡


ఎందుకంటే..

మేము బ్రాహ్మణులం..!!😢


అన్నo పెట్టకున్నా గంజిని 

పెట్టి ఆకలి తీరుస్తాం.🙏


అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..👺

ఎందుకంటే...


మేము బ్రాహ్మణులం.😇


గవర్నమెంట్ పథకాలు లేకున్నా

దేవుడు ఇచ్చాడని అనుకుంటాo

😴😴


రిజర్వేషన్లు లేకున్నా మా 

పిల్లలను అప్పుచేసి చదివించి

సర్కారు బళ్లకు,కంపినిలకు

పంపిస్తాం.👨‍🎓👷‍♂️


మేము దేశానికి సేవకులై,శ్రామి

కులమై ఈ మట్టికోసం పోరాడు

తాం..👩‍🦲🙏

ఎందుకంటే,...


మేము బ్రాహ్మణులo.!!


అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..

అందరితోనూ... "మెప్పు"పొందుతాం💪🤝🙏


        👍Proud up to be a Brahmin✌️✌️

Forwarded message as received from another group 

Tbramarao

ఋణానుబంధం

 "" ఋణానుబంధం -  అంతా ఋణానుబంధం  -  జగమంతా  ఋణానుబంధం ""


ఈ విషయం చదివేముందు ఒక్కమాట !

ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు  వయస్సు 40, రెండవకొడుకు  వయస్సు  37, మూడవ కొడుకు వయస్సు 33, నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే...


అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే , చివరి నాలుగవ కొడుకుతో  30 ఏళ్ళు మాత్రమే వున్నాడు . ఎందుకు ?


మీ అనుభవంలో ............ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము , కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో  డబ్బులున్నా వాడి కోరిక   తీర్చాలనిపించదు ఎందుకని ?


అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం  ఎందుకని ?


ఇక చదవండి !


మనకు పూర్వ జన్మ కర్మల వలననే 

ఈ జన్మలో...

తల్లి, 

తండ్రి, 

అన్న, 

అక్క, 

భార్య, 

భర్త, 

ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, 

శత్రువులు మిగతా సంభంధాలు...

ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి. 


ఎందు కంటే మనం వీళ్లకు...

ఈ జన్మ లో...

ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.


# *మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు.*


మనకు....

*పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే*

ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. వాటినే  మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...


 *ఋణాను బంధం*:-

 గత జన్మ లో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసు కుని వుండచ్చు  లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు. 


అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపం లో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు.


# *శత్రువులు - పుత్రులు*:-

మన పూర్వ జన్మ లో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు. 


అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, 

నానా గొడవలూ చేస్తారు. 


జీవిత మంతా ఏదో ఒక విషయంలో ఏడి పిస్తూనే వుంటారు. 


ఎల్లప్పుడును తల్లితండ్రులను 

నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడు తుంటారు.


# *తటస్థ పుత్రులు* :- 

వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు... 


మరో వైపు సుఃఖం గా కూడా వుంచరు, 

వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు.


వాళ్ళ వివాహా నంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగి పోతారు.


# *సేవా తత్పరత వున్న పుత్రులు*:-


గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి వుండవచ్చును, 


ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు. 


అలా వచ్చి బాగా సేవను చేస్తారు. 


మీరు గతం లో 

ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. 


మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే, 

ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు. 


లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద వుండరు.


ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.

అని అనుకోవద్దు. 


ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును. 


ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును.

వాళ్ళే మీ  కొడుకు లేదా, కూతురుగా 

మీ ఇంట పుట్ట వచ్చును. 


ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు. 


లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపం లో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.


అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు. 


ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...


దానికి ఈ జన్మ లో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం  అనుభవం లోకి తెస్తుంది.  


మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్య బడతాయి. 


ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి. 


(అనగా పాప పుణ్యాలు)

 కొద్దిగా ఆలోచించండి " 

మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.


మళ్లీ ఎంత ధనాన్ని 

మీ వెంట తీసు కెళ్తారు..? 


ఇప్పటి వరకు పోయిన వాళ్లు ఎంత బంగారం, 

వెండి పట్టుకు పోయారు..? 


చివరగా ఒకమాట !


తాతగారు  సంపాదించిన ఆస్తినంతా  తగిలేసి  మాకు ఏమి మిగల్చలేదని  ఒక కొడుకు బాధపడతాడు .

దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే  యోగం లేదన్నమాట !


అతి బీద కుటుంబంలో  పుట్టిన  మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి  చనిపోతాడు. దీనికి కారణం ఆ తండ్రి , తన కొడుకుకు  చెల్లించాల్సిన  అప్పన్నమాట !


మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి .


నేను, 

నాది, 

నీది అన్నది.

అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది. 


ఏది కూడా వెంట రాదు. 

ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంట వస్తుంది. 


జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.


కావున మీరు వాస్తవాలను గ్రహించి , వాస్తవాలను తెలుసుకొని , ఎంత వీలయితే అంత *మంచికర్మలు* చెయ్యండి.


   📙  శుభం భూయాత్ !!

ధృవపథం

 ధృవపథం  అంటే శివుని శక్తి గల చోటు. ధృవం సత్యమని. సత్యం కొలమానం కలదా. ధృవ అనగా విష్ణు తత్వం కలిగిన వాడుగా సమస్తమైన ఆకర్షణ శక్తియని. సత్యం శక్తియైన ఆశక్తికి గరిమనాభి థృవమని అది నారాయణతత్వ నిరూపణయే. ధృవ చరిత్ర అనగా అది ఆదినుండి యున్నదియే ధృవుని వలన దాని శక్తి లక్షణము పదార్ధ రూపంలో అనగా సూత్ర రూపంలో మనకు అందించుటకు మాత్రమే. భక్తి అనేది దృఢంగా వుండిన గాని ఫలించదు. లేనియెడల దానిని మాయ ఆవరించి   అహంకారము తో భక్తి నశించును. డం ఢాం చైతన్య లక్షణము జీవుడు గా అయినది. యీ  డ అనే అక్షర శక్తిని పూర్ణ లక్షణము ఢాం అనే చైతన్య సూత్రరూపంలో ధృవం అని పూర్ణమైన వెలుగుగా  భాసయతి ప్రకాశించుచున్నది. అది ఫల రూపం దాల్చింది. బ్రహ్మాండమంతా వ్యాప్తమైనది. దత్త సత్తు యని దాని కిరణ శక్తి త్రిగుణాత్మకమైన జగత్తు యని భ అనే భూమి శక్తి దాని అణు పదార్ధ లక్షణముగా మారి ధారయతి ధరణియై ధరించినది. అది ధృడమని  అది పదార్ధ లక్షణముగా  ధృఢ మని సత్యమని ఢ లక్షణమని ఆత్మ శక్తి లేక అణువు ధృఢమని తెలియును. ఈశ్వర ధ్యానశ్లోకశక్తి ద్వారా ఏమీ తెలియని తత్వం యిదం ధ్యావాం...వ్యాప్తి యని బ్రహ్మాండ వ్యాప్తిని ధృవ పదమని తత్ శక్తియే ప్రకాశించుచున్నది. దాని పదార్ధ లక్షణము ధ్యాయేత్ ఈప్సిత సిధ్దయే ధృవపథం విప్రోభిషించేత్ శివం.అయిననూ దాని లక్షణము పూర్తిగా తెలియలేదు. అప్పుడు దాని రూపమును పదార్ధ ముగా తెలుపుటకు బ్రహ్మాండ వ్యాప్తదేహా అని రూప వర్ణన వలన శివ లక్షణము తెలిసినది. యిది అంతయు శక్తి యెుక్క వ్యాప్తి లక్షణ సూత్రమే గాని మరి యెుకటిగాదు. పురాణ మనగా అణువు యెుక్క చైతన్య లక్షణ మైన నీటి తత్వమను గ్రహించు సాధనా మార్గం. సాధనకు కొంత కర్మ కావలె. ఆ కర్మ ధృవమని, ధృఢమని ధృవశక్తివలె సత్యమని తెలియుటయే ఙ్ఞానం అందుకే పై వివరణ ఙ్ఞానులచే తెలపబడింది. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

_సుభాషితమ్_

 🙏!!శుభోదయమ్!!*🙏

🌸 *!!ॐ _సుభాషితమ్_ ॐ!!* 🌸


శ్లో|| రథః శరీరం పురుషస్య దృష్టమ్

ఆత్మా నియన్తేన్ద్రియాణ్యాహురశ్వాన్ |

తైరప్రమత్తః కుశలీ సదశ్వైః

దాన్తైః సుఖం యాతి రథీవ ధీరః ||


*మహాభారతమ్. :: ధర్మవ్యాధోపాఖ్యానమ్.*


తా|| "కంటికి కనబడే ఈ స్థూలశరీరం రథం అనీ, ఆత్మ (బుద్ధి) సారథి అనీ, ఇంద్రియాలను గుర్రాలు అనీ, శ్రుతివాక్కులు చెపుతున్నవి..... 

నేర్పరి జాగ్రత్తకల ధీరుడయిన సారథి ఎట్లయితే ఉత్తమాశ్వములను తన వశంలో ఉంచుకొని సుఖంగా ప్రయాణం చేస్తాడో అట్లే అప్రమత్తుడు, కుశలుడు ధీరుడు అయిన పురుషుడు మాత్రమే ఇంద్రియాలను తన వశం చేస్కొని సుఖంగా జీవితమార్గంలో ప్రయాణిస్తాడు"....

మొగలిచెర్ల

 *జ్వరం కాదు దుష్ట గ్రహం..*


"అయ్యగారూ మా అబ్బాయి పెళ్లి స్వామివారి సన్నిధిలో చేయాలని అనుకున్నాము..వచ్చేనెలలో మూడో ఆదివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం వున్నదని పూజారిగారు చెప్పారు..ఖాయం చేసుకున్నాము..ఇక్కడ వివాహం చేయాలంటే..వరుడు, వధువు ఇద్దరూ మేజర్లు అయివుండాలని..అందుకు సంబంధించిన పత్రాలు కావాలని మీ సిబ్బంది చెప్పారు..అన్నీ సిద్ధంగా ఉన్నాయి..మీకు ఒకమాట చెప్పి..మీరు సరే అంటే..మా ఏర్పాట్లలో మేము ఉంటాము..అన్నట్టు మరో విషయం..మా అబ్బాయి పెళ్లి ఆదివారం నాడు అన్నాముకదా..ఆరోజు మధ్యాహ్నం మా పెళ్ళివాళ్ళతో పాటు ఈ గుడికి వచ్చిన భక్తులకు కూడా మేమే భోజనాలు ఏర్పాటు చేస్తాము..వీడి పెళ్లి పుణ్యమా అని ఆ అవకాశం మాకు కల్పించండి.." అని వెంకటరత్నం నాతో చెప్పాడు..


వెంకటరత్నం కుమారుడు వెంకట రమణ..అతని వివాహం స్వామివారి సన్నిధిలో జరపడానికి ఒక కారణం ఉన్నది..వెంకటరమణ కు పన్నెండేళ్ల వయసులో జ్వరం వచ్చింది..కందుకూరులో డాక్టర్ల కు చూపించారు..రెండురోజులకు తగ్గినట్లే తగ్గి మళ్లీ జ్వరం వచ్చింది..ఆరోజుల్లో అందుబాటులో ఉన్న పరీక్షలు (ఆరోజుల్లో అంటే 2004, 2005 సంవత్సరాల సమయం లో) చేశారు..మందులు వాడుతున్నారు..ఒక వారం జ్వరం తగ్గడం..మళ్లీ రావడం..పిల్లవాడు బలహీనపడుతున్నాడు..కానీ ఫలితం కనబడలేదు..ఒంగోలు లోని డాక్టర్లు చెన్నై తీసుకెళ్లామన్నారు..చెన్నై విజయా హాస్పిటల్ కు తీసుకెళ్లారు..సుమారు 10 రోజుల వైద్యం అనంతరం..పిల్లవాడికి తగ్గింది..తీసుకెళ్లండి అని వైద్యులు చెప్పారు..తమ ఊరికి తీసుకొచ్చారు..మళ్లీ వారం కల్లా జ్వరం వచ్చింది..వెంకటరత్నం దంపతులకు దిక్కు తోచలేదు..డబ్బుకు డబ్బు ఖర్చు అయింది..ఫలితం కనబడలేదు..


ఏం చెయ్యాలో తెలీని పరిస్థితుల్లో..వెంకటరత్నం భార్య.." పిల్లవాడిని తీసుకొని మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి దగ్గరకు తీసుకుపోయి మొక్కుకుందాము..స్వామివద్ద నిద్ర చేస్తే ఏ పీడలు వున్నా పోతాయని అంటున్నారు..ఒక్కసారి అక్కడకు పోదాము.." అని భర్తతో చెప్పింది.."ఎంతోమంది వైద్యులకు చూపించినా తగ్గని జబ్బు, ఆ స్వామి సమాధి వద్దకు పోయి మొక్కుకుంటే తగ్గుతుందా..?.." అన్నాడు వెంకటరత్నం.."ఇంత డబ్బు ఖర్చు పెట్టాము..నా మాటవిని ఒక్కసారి స్వామి దగ్గరకు మన బిడ్డను తీసుకొని పోదామయ్యా.." అని గట్టిగా చెప్పింది..వెంకటరత్నం ఎట్టకేలకు సరే అన్నాడు..ఆ మరుసటి రోజే ఆ దంపతులు తమ బిడ్డను తీసుకొని మొగిలిచెర్ల దత్తాత్రేయుడి సన్నిధికి చేరారు..స్వామివారి మంటపం లో పిల్లవాడిని పడుకోబెట్టారు..ఆ సమయం లో పిల్లవాడికి బాగా జ్వరం గా ఉన్నది..వెంకటరత్నం దంపతులు ఇద్దరూ మందిరం బైట ఉన్న బావి వద్దకు వెళ్లి తలారా స్నానం చేసి..ఆ తడి బట్టలతోనే మంటపం లోకి వచ్చి..స్వామివారి సమాధికి ఎదురుగా సాగిలపడి..మొక్కుకున్నారు..పూజారి గారు సాయంత్రం హారతి ఇచ్చి..అందరికీ తీర్ధం ఇస్తూ..ఈ దంపతలకూ ఇచ్చారు.."పంతులు గారూ మా అబ్బాయికి కూడా తీర్ధం ఇవ్వండి "అని వెంకటరత్నం భార్య అడిగింది.."మీ అబ్బాయి పేరేమిటి..?" అన్నారు పూజారి గారు.."వెంకట రమణ.." అన్నది.."వెంకటరమణా..వచ్చి తీర్ధం తీసుకో.." అన్నారు పూజారి గారు..మంటపం లో జ్వరం తో పడుకొని ఉన్న వెంకటరమణ..లేచి వచ్చి..పూజారి గారి వద్ద తీర్ధం తీసుకున్నాడు..ఆ రాత్రికి ఆ పిల్లవాడు మంటపం లోనే ఏ బాధ లేకుండా నిద్ర పోయాడు..ప్రక్కరోజు ఉదయం వెంకటరమణ కొద్దిగా ఉషారుగా వున్నాడు..కొద్దిగా ఆహారం తీసుకున్నాడు..మూడు పూటలా స్వామివారి హారతి బిడ్డకు ఇప్పించడం..స్వామివారి తీర్ధాన్ని ఇవ్వడం..స్వామివారి విభూతి ని తమ కుమారుడి నుదుటిపై పెట్టడం చేయసాగారు..వెంకటరత్నం దంపతులు స్వామివారి సన్నిధిలో వారం రోజులు వున్నారు..ఒక్కరోజు కూడా తమ బిడ్డ జ్వరం తో బాధపడలేదని..తమ బిడ్డకు తాము ఇన్నాళ్లూ జ్వరం అని భ్రమ పడ్డామని..అది జ్వరం కాదు..ఏదో గ్రహ పీడ అనీ..స్వామివారి వద్దకు వచ్చిన తరువాత ఆ దుష్టగ్రహం వదలిపోయిందనీ..ఒకరికొకరు చెప్పుకొని సంతోషించారు..వారం తరువాత స్వామివారికి పొంగలి నైవేద్యం గా పెట్టి..తమ ఊరు వెళ్లారు..ఆరోజు తరువాత ఆ పిల్లవాడికి అనారోగ్యం దరి చేరలేదు..చక్కగా చదువుకున్నాడు..


వెంకటరత్నానికి తన భార్య ఇచ్చిన సలహా ఎంత విలువైనదో అర్ధం అయింది..ఒక్కగానొక్క కుమారుడు లక్షణంగా తన కళ్ళముందు తిరుగుతుంటే..ఏ తండ్రికి ఆనందం ఉండదు.?..తమ కుమారుడి వివాహం మొగిలిచెర్ల దత్తాత్రేయుడి సన్నిధిలో జరుపుతామని ఆనాడే ఆ దంపతులు గట్టిగా మొక్కుకున్నారు..అనుకున్న విధంగానే కుమారుడి వివాహం స్వామివారి సన్నిధిలో జరిపించి..వధూవరులను స్వామివారి సమాధివద్దకు తీసుకెళ్లి నమస్కారం చేయించారు..


"మా బిడ్డ లక్షణంగా వున్నాడు అంటే కారణం ఈ దత్తాత్రేయుడే.." అని ఆ దంపతులు ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ధర్మానికి

 హిందూ ధర్మానికి మించినది ప్రపంచంలో ఏదైనా ఉందా?

1)సూర్యుడి నుంచి వెలువడుతున్న ఓంకారమని నాసా ఎందుకు పేర్కొన్నట్టు?

2) మన దేశీయ గోమూత్రం మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు.?

3) న్యూజెర్సీ "సిటాన్ హాలు" యూనివర్సిటీలో భగవద్గీత తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది.?

4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు "గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్" అని, జాతీయ ఎంబ్లెమ్ కు "గరుడ పంచశిల" అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?

5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద వినాయకుడి బొమ్మ ఉంటుందేం?

6) అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా తన జేబులో ఎప్పుడూ హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?

7) యోగ, ప్రాణాయామాలకు ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది?

8) వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు భూమి గుండ్రంగా ఉందని చెప్పారేం?

9) 'లుప్త', 'హంస' అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు 'లుఫ్తాన్సా' అని పేరెందుకు పెట్టారు?

10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను "హిందూకుష్" పర్వతాలని ఎందుకంటారు?

11) హిందువుల పేర్లతో

హిందీ భాష

హిందూస్తాన్

హింద్ మహాసాగర్ (ఇండియన్ ఓషన్)

అని ఎందుకంటున్నారు?

12) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి శ్రీమహావిష్ణు విగ్రహం ఎలా కనిపించింది?

13) అమెరికా శాస్త్రవేత్త డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్ పరిశోధన చేసి గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు. దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?

14) స్వామి దయానంద సరస్వతి రాసిన "సత్యార్థ ప్రకాశ్" చదివి భగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో "మహేంద్ర పాల్ ఆర్య" పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ.. డా. జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?

15) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క "కుష్వాహా" కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది?

16) ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది. వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?

17) అమెరికా నటి, నిర్మాత జూలియా రాబర్ట్స్ హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?

18) రామాయణం మిథ్య అయితే, ప్రపంచంలోని రాళ్ళలో రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు నీటిపై తేలుతున్నాయి?

19) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో 80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది?

20) 5000 సంవత్సరాల పురాతనమైనది, మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది?

21) అన్నిటికంటే ముఖ్యంగా... "జై హింద్" అనే అంటాం కానీ "జై ఇండియా" అని ఎందుకు అనలేము?

అందుకే, ప్రియమైన హిందూ బంధువులారా...

హిందువుగా పుట్టినందుకు గర్వించండి. హిందువుగానే మరణించండి.

ఇతర మతాలను విమర్శించడం, తక్కువగా చూడడం హిందూ ధర్మ నైజం కాదు. (ధర్మం జోలికి వచ్చిన ఏ ఒక్కడినీ ధర్మం మాత్రం వదిలిపెట్టదు.)

జై హింద్...🛕🚩🙏✊

భీష్మ ఏకాదశి

 *భీష్మ ఏకాదశి*


*రేపు 23-02-2021 న భీష్మ ఏకాదశి సందర్భంగా* 


🌺 *భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు?*🌺


మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.


అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.


సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.


తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.


అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.


కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.


ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.


భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.


కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.


నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.


భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వరా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.

Debet








 

Telugu