23, ఫిబ్రవరి 2021, మంగళవారం

ధృవపథం

 ధృవపథం  అంటే శివుని శక్తి గల చోటు. ధృవం సత్యమని. సత్యం కొలమానం కలదా. ధృవ అనగా విష్ణు తత్వం కలిగిన వాడుగా సమస్తమైన ఆకర్షణ శక్తియని. సత్యం శక్తియైన ఆశక్తికి గరిమనాభి థృవమని అది నారాయణతత్వ నిరూపణయే. ధృవ చరిత్ర అనగా అది ఆదినుండి యున్నదియే ధృవుని వలన దాని శక్తి లక్షణము పదార్ధ రూపంలో అనగా సూత్ర రూపంలో మనకు అందించుటకు మాత్రమే. భక్తి అనేది దృఢంగా వుండిన గాని ఫలించదు. లేనియెడల దానిని మాయ ఆవరించి   అహంకారము తో భక్తి నశించును. డం ఢాం చైతన్య లక్షణము జీవుడు గా అయినది. యీ  డ అనే అక్షర శక్తిని పూర్ణ లక్షణము ఢాం అనే చైతన్య సూత్రరూపంలో ధృవం అని పూర్ణమైన వెలుగుగా  భాసయతి ప్రకాశించుచున్నది. అది ఫల రూపం దాల్చింది. బ్రహ్మాండమంతా వ్యాప్తమైనది. దత్త సత్తు యని దాని కిరణ శక్తి త్రిగుణాత్మకమైన జగత్తు యని భ అనే భూమి శక్తి దాని అణు పదార్ధ లక్షణముగా మారి ధారయతి ధరణియై ధరించినది. అది ధృడమని  అది పదార్ధ లక్షణముగా  ధృఢ మని సత్యమని ఢ లక్షణమని ఆత్మ శక్తి లేక అణువు ధృఢమని తెలియును. ఈశ్వర ధ్యానశ్లోకశక్తి ద్వారా ఏమీ తెలియని తత్వం యిదం ధ్యావాం...వ్యాప్తి యని బ్రహ్మాండ వ్యాప్తిని ధృవ పదమని తత్ శక్తియే ప్రకాశించుచున్నది. దాని పదార్ధ లక్షణము ధ్యాయేత్ ఈప్సిత సిధ్దయే ధృవపథం విప్రోభిషించేత్ శివం.అయిననూ దాని లక్షణము పూర్తిగా తెలియలేదు. అప్పుడు దాని రూపమును పదార్ధ ముగా తెలుపుటకు బ్రహ్మాండ వ్యాప్తదేహా అని రూప వర్ణన వలన శివ లక్షణము తెలిసినది. యిది అంతయు శక్తి యెుక్క వ్యాప్తి లక్షణ సూత్రమే గాని మరి యెుకటిగాదు. పురాణ మనగా అణువు యెుక్క చైతన్య లక్షణ మైన నీటి తత్వమను గ్రహించు సాధనా మార్గం. సాధనకు కొంత కర్మ కావలె. ఆ కర్మ ధృవమని, ధృఢమని ధృవశక్తివలె సత్యమని తెలియుటయే ఙ్ఞానం అందుకే పై వివరణ ఙ్ఞానులచే తెలపబడింది. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: