23, ఫిబ్రవరి 2021, మంగళవారం

శ్రీవిష్ణు_సహస్ర_నామ_స్తోత్ర_పారాయణ_విశిష్టత

 *#శ్రీవిష్ణు_సహస్ర_నామ_స్తోత్ర_పారాయణ_విశిష్టత*

🌹🌷🐚🔔🛕🐚🌷🌹

*"ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటి? " అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు.. భీష్మపితామహులు  మానవ జాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.*

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలుంటాయి. సహస్రం అంటే "వెయ్యి (1000)" అని అర్థం. వెయ్యి నామాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి. ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది. అందుకే...*

**ధనాభివృద్ధికి - విష్ణు సహస్రనామమే..*

*మంచి ఆరోగ్యానికి - విష్ణు సహస్రనామమే..*

**విద్యాభివృద్ధికి - విష్ణు సహస్రనామమే..*

*మనశ్శాంతికి - విష్ణు సహస్రనామమే..*

*ఇంతేనా..! ఇలా నిత్య జీవితంలో మానవులేదుర్కొనే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపింది మన "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం".*

*అందుకే  ప్రపంచదేశాలలో సైతం  ఈనాడు జాతి, మత, భాషలకు అతీతంగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం నేర్పిస్తున్నారు.. పఠిస్తున్నారు.*

*కాబట్టి సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము. ఎవరి కోరికనను అనుసరించి వారు ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు  జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:*

*1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)*

**----------------------------------------*

*సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹*

**వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹*

*2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)*

**----------------------------------------*

*భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹*

**అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹*

*3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)*

**----------------------------------------*

*వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹*

**అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹*

*4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)*

**----------------------------------------*

*మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹*

**అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹*

*5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)*

**----------------------------------------*

*అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹*

**సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹*

*6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)*

**----------------------------------------*

*అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹*

**సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹*

*7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)*

**----------------------------------------*

*భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹*

**కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹*

*8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)*

**----------------------------------------*

*వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹*

**పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹*

*9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)*

**----------------------------------------*

*వైకుంఠ: పురుషః ప్రాణః   ప్రాణదః ప్రణవః పృథుః ౹*

**హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹*

*10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)*

**----------------------------------------*

*విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹*

**అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹*

 *11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)*

 **----------------------------------------*

*యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹*

**సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹*

*12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)*

**----------------------------------------*

*అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹*

**శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹*

*13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)*

**----------------------------------------*

*శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹*

**శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹*

*14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)*

**----------------------------------------*

*ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹*

**భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹*

*15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)*

**----------------------------------------*

*సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹*

**శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹*

 *16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)*

 **----------------------------------------*

*సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹*

**న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹*

*17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)*

**----------------------------------------*

*సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |*

**అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||*

*18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)*

**----------------------------------------*

*సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹*

**స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹*

*19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)*

**----------------------------------------*

*అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹*

**శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹*

*అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹*

**విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹*

*20. దుస్వప్న నాశనమునకు:(99 వ శ్లోకం)*

**----------------------------------------*

*ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹*

**వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹*

*21. పాపక్షయమునకు: (106 వ శ్లోకం)*

**----------------------------------------*

*ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹*

**దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ౹౹*

****🙏 *జై శ్రీ మన్నారాయణ* 🙏****

🌹🌷🐚🛕🔔🐚🌷🌹

      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

కామెంట్‌లు లేవు: