10, ఆగస్టు 2023, గురువారం

శంకరంబాడి సుందరాచారి

 *శంకరంబాడి సుందరాచారి* (10-08-1914 / 08-04-1977) *వీరి మాతృభాష అరవం. తెలుగు రాజ్యగీతమైన _మా తెలుగు తల్లికి మల్లె పూదండ_ రచయిత.*  


*నేర్వ నితర భాషల నేరమేమాత్రము కాదు*

*మరచిపోదువేని మాతృభాష తగని నేరమౌను*

*మల్లెపూవుకంటె మంచిగంధముకంటె*

*పంచదారకంటె తేనెకంటె మధురమైన*

*భాషరా, సంగీతభాషరా మన తెలుగు భాష*


*పనస తొనల కన్న పంచదారల కన్న*

*జుంటి తేనె కన్న జున్ను కన్న*

*చెఱకు రసము కన్న మధురమైన*

*మామిడి కన్న తెలుగు మాటలె తీపిరా*

*తెలుగులో మాటలాడరా తెలుంగువాడా!!*



🪔 *నేడు వారి జయంతి సందర్భంగా వారికి అందిస్తున్న ఆత్మీయ నివాళి.* 🪔

Panchaang


 

శ్రీ మహావీర్ (హనుమాన్) దేవాలయం

 🕉 మన గుడి : 





⚜ బీహార్ :పాట్నా


⚜ శ్రీ మహావీర్ (హనుమాన్) దేవాలయం


💠 ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది, ఇది ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు ధనిక దేవాలయాలలో ఒకటి. మహావీర్ మందిర్ పాట్నాలోనే కాదు, దేశంలోని ప్రధాన దేవాలయాలలో ఒకటి. ఆదాయం పరంగా ఉత్తర భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్న ఆలయం ఇది.


💠 దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి బాలాజీ ఆలయం తర్వాత 

ఆదాయంలో పాట్నాలోని మహావీర్ ఆలయం రెండవ స్థానము. 

పేరు వినగానే ఇది జైనుల మందిరం అని అనుకుంటారు అందరూ కానీ ఇది హనుమంతుని ఆలయం .

హనుమంతుని అవతారమైన సంకట్-మోచన్ విగ్రహం అందులో ఉంది. 

గత 3 నెలల్లో ఆలయ ఆదాయం విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు రోజుకు కోటిన్నరకు పైగా ఆదాయం వస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. 

 

💠 ఈ ఆలయానికి 5 మార్గాల ద్వారా ఆదాయం వస్తోంది. 

ఇందులో నైవేద్యo, పూజా రుసుములు,పొదుపు మొత్తం, స్వచ్ఛంద విరాళాల నుండి పొందిన మొత్తం,బ్యాంకు వడ్డీ వంటివి.


💠 విరాళాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా సామాజిక సేవలో తన ముఖ్యమైన బాధ్యతను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల బీహార్ పర్యటన సందర్భంగా తన సతీమణితో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి దాని ప్రత్యేకతను స్వయంగా చెప్పడంతో దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.


💠 మహావీర్ మందిర్ చరిత్ర సుమారు 300 సంవత్సరాల నాటిది.1713 మరియు 1730 మధ్య, స్వామి బాలానంద్ నేతృత్వంలో ఆలయ పునాది వేయబడింది. తొలినాళ్లలో ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. 1985లో ఈ ఆలయాన్ని భారీగా నిర్మించారు. ఆలయ నిర్మాణానికి స్థానికులు విరాళాలు ఇచ్చారు. ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ ప్రకారం, ఆలయ నిర్మాణం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిని విరాళంగా ఇచ్చింది. 


💠 ఈ దేవాలయం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం రైలు మార్గాన్ని మార్చిందని చెబుతారు. 

హౌరా నుండి పాట్నా జంక్షన్ మీదుగా వారణాసికి రైలు మార్గం కోసం ప్రతిపాదించిన మార్గం మధ్యలో మహావీర్ మందిర్ ఉంటుంది.. రైల్వే లైన్ వేయాలంటే ఆలయాన్ని కూల్చివేయాల్సిందేనని ఇంజనీర్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ వార్త ప్రజల్లోకి వెళ్లగానే ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రజలు అప్పటి జిల్లా మేజిస్ట్రేట్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ప్రభుత్వానికి తెలియజేయడంతో రైలు మార్గం మార్చారు.


💠 1987లో మహావీర్ మందిర్ కి అప్పట్లో మహావీర్ రోజువారీ ఆదాయం 11,000 రూపాయలుగా ఉండేదని, అది నేడు 10 లక్షలకు చేరుకుంది.


💠 ఆచార్య కిషోర్ కునాల్ మాట్లాడుతూ ఆలయంలో అత్యధిక ఆదాయం నైవేద్యం ప్రసాదం ద్వారానే లభిస్తుందని చెప్పారు.

మహావీర్ మందిర్‌కు అప్పట్లో భూమి లేదు, ఇప్పుడు ఆలయం పేరు మీద 125 ఎకరాలు ఉంది.


💠 కరోనాకు ముందు, ఆలయానికి రోజువారీ సందర్శనల సంఖ్య 10 ఉండేది. రాయితీపై సరైన వైద్యం, పేదలకు సహాయం చేయడం, మహావీర్ దేవాలయం ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఉచితంగా ఆహారం అందించడం వంటి దాతృత్వ పనుల వల్ల ఆలయంపై ప్రజల విశ్వాసం నిరంతరం పెరుగుతోంది.


💠 బీహార్‌లోని అనేక దేవాలయాలు మహావీర్ మందిర్ పర్యవేక్షణలో అభివృద్ధి చేయబడుతున్నాయి.వీటిలో, హాజీపూర్‌లోని ప్రసిద్ధ పౌరాణిక గజేంద్ర మోక్ష స్థల్, కొన్హారా ఘాట్‌లోని గొప్ప విశాలనాథ్ ఆలయం మరియు వైశాలి జిల్లాలోని ఇస్మాయిల్‌పూర్‌లో కొత్త ఆకర్షణీయమైన రామ్ జానకి ఆలయం నిర్మించబడ్డాయి.


💠 ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, భజరంగ్ బలి జంట విగ్రహాలు అంటే రెండు విగ్రహాలు కలిసి ఉంటాయి.

చాలా మంది భక్తులు ఈ ఆలయం లోపల హనుమాన్ చాలీసాను పఠించి , ఈ ఆలయం నుండి లభించే ప్రసాదాన్ని తింటే అన్ని రకాల రోగాలు నయమవుతాయని ప్రతీతి.

ఈ ఆలయంలో దొరికే లడ్డూలను తింటే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని చెబుతారు.


💠 బీహార్‌లోని సీతామధి జిల్లాలోని పునౌరా ధామ్‌లో శ్రీ మహావీర్ స్థాన్ న్యాస్ సమితి ఉచిత సీతా రసోయిని నిర్వహిస్తోంది. 

సీత జన్మస్థలమైన సీతామడిలో సీతా-రసోయిని విజయవంతంగా ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న దేశంలోనే ఇది మొదటి ఆలయం. ఇక్కడ యాత్రికులందరికీ ఉచితంగా ఆహారం అందజేస్తారు. జనవరి 2019 నుండి ఉచితంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉచిత భోజనం (మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం రెండూ) అందించబడతాయి.


💠 మహావీర్ ఆలయంలో, భక్తులు విరాళంగా ఇచ్చే ఆదాయం నుండి చాలా మంది సాధారణ ప్రజలు కనీస రుసుముతో చికిత్స పొందుతారు.

మహావీర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, మహావీర్ ఆరోగ్య సంస్థాన్, మహావీర్ నేత్రాలయ, మహావీర్ వాత్సల్య హాస్పిటల్‌లు ఈ పవిత్ర దేవాలయం ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సజావుగా నడుస్తున్నాయి. మీరు పాట్నా వచ్చినప్పుడల్లా మహావీర్ ఆలయాన్ని తప్పక సందర్శించండి.

Mirchi bajji


 

Aanapakaaya pachadi


 

Friends


 

Pottery


 

రాజు నారాయణ స్వామి"

 


1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్....!


1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ... స్టేట్ ఫస్ట్....!


ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....!


1989 లో చెన్నై ఐఐటీ నుంచి 

కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు... బ్యాచ్ ఫస్ట్.....!


అదే ఏడాది 'GATE' పరీక్ష... మళ్లీ ఫస్ట్ రాంక్....!


ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు... మళ్లీ ఫస్ట్ ర్యాంక్....!


ఐఏఎస్ శిక్షణలో.... మరోసారి ఫస్ట్....!


ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచీ పరిచి, 

గ్రీన్ కార్డు వీసాఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ 

మామెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో

చేరమని సీటు ఇచ్చింది!


మరి.... మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే! 

మనవాడు మాత్రం 'నా చదువుకు నాప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! 

ప్రజలడబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... 

వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, 

చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులే..... తనను చదివించాయి!'


'అలాంటిది ఆ పేదల స్వేదాన్ని..., 

జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి' అనుకున్నాడు. 


ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.


చిన్నప్పటినుంచీ నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ, 

ఏదో చేయాలన్న తపన... 

వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.


అతని పేరే-రాజు నారాయణ స్వామి"

కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు.

అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి.

ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు,

స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది!


ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.


ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని 

వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే'అడ్డుకున్నాడు 

రాజు నారాయణస్వామి. 

మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.


ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ 

భవనం కట్టుకున్నాడు. "నా అల్లుడు కలెక్టర్..., నన్నేం చేయలేరు" అనుకున్నాడు.


మన కలెక్టర్ గారు ఆభవనాన్ని కూల్చి వేయించారు.

కోపంతో మామభగ్గుమన్నాడు.

భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలివెళ్లిపోయింది.


ఆ తరువాత రాజునారాయణస్వామి పన్నులు ఎగవేసిన

ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు.

ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.


కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు. 


అంతే ...!మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...! 


కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో 

చెరువులకు, నదులకు గట్లు వేయడం, 

బిల్లులు వసూలుచేసుకోవడం ఆ తరువాత వానలు పడటం...

వానకి గట్టు కొట్టుకుపోవడం.... 


మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... 

మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది.


రాజు నారాయణ స్వామి.... దీన్ని అడ్డుకున్నారు.

'వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు.... ఇచ్చేది ' అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.


మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. 

అంతే..! మళ్లీ పాత కథ పునరావృతం అయింది.

చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని 

అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి 'అచ్యుతా నందన్' 

మన రాజునారాయణస్వామిని ఎలాంటి 

ప్రాధాన్యతాలేని ఓ విభాగంలో పారేశారు.


చివరికి ఆయన నిజాయితీని,

పని పట్ల ఆయన శ్రద్ధను చూసి 'ఐక్యరాజ్య సమితి' నుంచి 

ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. 

'మాదగ్గర పనిచేయండి' అని కోరుతూ పిలువు వచ్చింది.


ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి 

ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక 

ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవ డానికిసిద్ధమయ్యాడు!


రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు.

ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.


వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. 

ఆయన వ్రాసిన నవలకు 'సాహిత్య ఎకాడెమీ' అవార్డు కూడా వచ్చింది. 


ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై 

విజయం సాధించి ఉండొచ్చు. కానీ 

నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి"

మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.


రాజు నారాయణ స్వామి ... ......

ఈ ఘనతవహించిన భారతదేశంలో 

ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలి పోయాడు" అని 

వ్రాయడం ఎవరికి ఇష్టం.. ?


కానీ కొన్ని కొన్ని జాడ్యాలు దేశాన్ని వదలాలంటే.. 

కొందరి చరిత్రలు అలా ఒక చరిత్రగా మిగులకూడదు... !


అందుకే.. అందరికీ తెలియాలంటే.. షేర్ చేయండి.. 

రాజు నారాయణస్వామి గారిది ఫెయిల్యూర్ స్టోరీ కాకూడదు......

సీతారామాంజనేయ సంవాదము.*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*


*సీతారామాంజనేయ సంవాదము.*


*ప్రథమాధ్యాయము*


*భాగము - 5*



శా. లోకాలోక పరీతభూచర మహా; లోకోపకారంబుగా

శ్రీకల్యాణకరోరు కావ్యచయముల్; సిద్ధంబు గావించి సు 

శ్లోకుల్ పుణ్యమతుల్ జగద్గురువులై; శోభిల్లుచున్నటి వాల్మీకివ్యాసమయూర బాణకవికా; ళీదాసులంగొల్చెదన్.


తాత్పర్యము:. 


ఇహపరాలనందించ వీలుగా, తమ అద్భుత కవితాశక్తిని పురాణ - ఉప పురాణేతి లోకులనెల్ల పావనము చేయు దివ్యశక్తిమూర్తులుగా విలసిల్లి, 


తమ సనాతన సదాచార సంపత్తితో, సర్వులు తరించు అనుగ్రహమొసగిన సుశ్లోకులు, 


జగద్గురువులు శ్రీ వాల్మీకి, వ్యాస, కుమార, బాణ, కాళిదాసాది మహాకవులకు శిరసువంచి నమస్కరించి, 

ఈ గ్రంథ రచనకు వారి కరుణ నభ్యర్థిస్తున్నాను.



గీ. మహిత గురులఘువర్ణ ధర్మములు నియమ 

ములుఁ గలిత కర్తృ కర్మ క్రియలును దెలిసి నామరూపావ్యయ విలక్షణంబు లాత్మ 

నెఱిఁగిన కవీశ్వరుండె కవీశ్వరుండు.


తాత్పర్యము:. 


అసలు “కవి" అంటే, గురు లఘువులు, కావ్య ధర్మములు, కర్త కర్మ క్రియల ఉపయోగములు, విషయం చెప్పడంలో విశ్రుతానుభవము, స్పష్టత లేక "కవి"నన్నా కవిత్వము చెబుతానన్నా అది "కవి"పీడగా వుంటుంది. 


అందులో ఛందో బద్ధ వ్యాకరణాది నియమ నిబంధనలు, విషయ సరళతలు కనుపించవు. 


అలాగే సమాజిక దృష్టిలో కనుక ఆలోచిస్తే - ఈ భూమి మీద గురువులు - ముందు బ్రాహ్మాణులు. 


ఆ తదుపరి వారి వారి వర్ణ సేవస్థ లక్షణాలు, తక్కువ జాతి, ఎక్కువ జాతిగా విఖ్యాతమవ తలవడమో 


లేక ఎక్కువ జాతి వారు తక్కువ జాతి నీవంటూ తూలనాడి క్రింద పడిపోవడమో, ఇది సామాజిక వ్యవస్థకు విఘాతమయ్యే వ్యవస్థ. 


సమాజంలో అందరు ఆ దైవ ప్రియులుగా సద్ధర్మ సనాతనామూర్తులై, తమ తమ ధర్మములు సశాస్త్రీయంగా 


కులమతాల ప్రాంతీయ భేదాల అసమానతలు తొలగి "సర్వేజనాః సుఖినోభవన్తు" శాశ్వతమవుతుంది. లోకాన్ సమస్తాన్ స్సుఖినో భవన్తు" నిత్యమవుతుంది.



*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

Birthday


 

Chendrayan

https://youtu.be/cS3PXJ3q0jE 

Cell or sale


 

సామాన్య భ‌క్తుల‌కే నా ప్రాధాన్యం

 పత్రికా ప్రకటన                                                        తిరుమ‌ల‌, 2023 ఆగస్టు 10


సామాన్య భ‌క్తుల‌కే నా ప్రాధాన్యం 


- ధ‌న‌వంతుల సేవ‌లో త‌రించేవాడిని కాదు


- హిందూ ధార్మిక‌త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తాం


- స్వామివారి సేవ‌కుల‌కు సేవ‌కుడిని


- టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి


            సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం చేయించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని, ధ‌న‌వంతుల సేవ‌లో త‌రించేవాడిని కాద‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధ‌న‌వంతులు, విఐపిలు ద‌ర్శ‌నాల గురించి తాప‌త్ర‌య‌ప‌డితే స్వామివారి ఆశీస్సులు ల‌భించ‌వ‌నే వాస్త‌వం గుర్తించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 


            టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ ప్ర‌మాణస్వీకారం చేసిన అనంత‌రం గురువారం ఆయ‌న అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా త‌న‌కు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కింద‌న్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామ‌న్నారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన‌ట్టు చెప్పారు.


          ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు, కార్యనిర్వహణాధికారులు, కార్యనిర్వాహక అధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి, విశ్వాసం తో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింద‌న్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా త‌మ‌ ధర్మకర్తల మండలి ప‌నిచేస్తుంద‌న్నారు. గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన హ‌యాంలో సామాన్య భ‌క్తుల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చేలా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపామ‌న్నారు. స్వామివారి వైభ‌వాన్ని ప్ర‌జ‌ల హృద‌యాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామ‌ని చెప్పారు. హోదా, అధికారం, తాము ముఖ్య‌ల‌మ‌నే భావ‌న‌తో దేవుడి ద‌గ్గ‌రికి వ‌చ్చేవారిని ఆయ‌న క్ష‌ణ‌కాల‌మైనా చూడ‌క‌పోతే ఉప‌యోగం లేద‌న్నారు. దేశ‌విదేశాల్లోని హిందువులంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చి హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేలా టీటీడీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని చెప్పారు. తాను స్వామివారి సేవ‌కుల‌కు సేవ‌కునిగా ప‌నిచేస్తాన‌ని, అధికారం కోసం కాద‌ని అన్నారు. స్వామివారిని భ‌క్తుల ద‌గ్గ‌రికే తీసుకెళ్లి భ‌క్తిప్ర‌సాదం పంచుతామ‌న్నారు. 


ద‌ళిత గోవిందం 


          గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.  


శ్రీనివాసకళ్యాణాలు


        భాగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా  శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించిన‌ట్టు చెప్పారు.


కళ్యాణమస్తు


    పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూత నివ్వడానికి కళ్యాణమస్తు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించామ‌న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్ళి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశామ‌ని, త‌ద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్ర‌య‌త్నించామ‌ని వివ‌రించారు.


అందరికీ అన్నప్రసాదం


    2006 కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానం లో భోజనం చేసే అవకాశం ఉండేద‌న్నారు. త‌మ‌ హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించామ‌న్నారు.


నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం


    తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటానికి నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించిన‌ట్టు తెలిపారు.


చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్క నుండి ఆలయ ప్రవేశం


   చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూ లైన్లలో చాలా ఇబ్బందిపడే వార‌ని, దీన్ని గమనించి చంటిబిడ్డ తో పాటు తల్లికి మహాద్వారం పక్కన కుడివైపు నుండి ప్ర‌త్యేక లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.


పౌర్ణమి గరుడ సేవ


   బ్రహ్మోత్సవాలలో విశిష్ట మైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నామ‌న్నారు.


ఎస్వీ బీసీ


   శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారంచేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 


ఎస్వీ వేద విశ్వవిద్యాలయం


    వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాన‌ని, అప్పటి గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్‌తో అనేక సార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించామ‌ని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభించామ‌న్నారు.


108 అడుగుల అన్నమయ్య విగ్రహం


   శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్ణ నలు రచించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 600 జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించామ‌న్నారు. అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలోని శాస‌నాల‌ను వెలుగులోకి తెచ్చిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి, శ్రీ రాళ్ల‌ప‌ల్లి అనంత‌కృష్ణ‌శ‌ర్మ, శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి విగ్ర‌హాల‌తోపాటు మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టును ప్రారంభించి విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేశామ‌న్నారు. 


ఎస్సీ, ఎస్టీల‌కు అర్చ‌క శిక్ష‌ణ‌


        ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆల‌యాల్లో అర్చ‌కులుగా ప‌నిచేస్తున్న వారికి శ్వేత ఆధ్వ‌ర్యంలో అర్చ‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించామ‌న్నారు.


          మీడియా స‌మావేశంలో శాస‌న‌స‌భ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు పాల్గొన్నారు.


---------------------------------------------------------


టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

మోసపోయింది చాలు

 🙏

*మోసపోయింది చాలు ఇకనైనా* *మారండి! నేను కూడా మోసపోయాను!*

*నిజాలు తెలుసుకొన్నాను!*

*తెలివితేటలు ఉండి తెలివి లేకుండా ఉండడం అంటే ఇదే!*

👇

Sri Sri:

ముస్లిం  ఫకీర్    సాయిబ్ బాబా  నే  short Cut లో  *సాయి బాబా* అని  అంటున్నాము.సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.ముస్లిం అయినా,  సాయిబు బాబా కు,  హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..

1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,, మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను  సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం  మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం..     ఇది . ప్రధాన దేవుళ్ళ పై  జరుగుతున్న   జిహాద్..

1950 వరకు  షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే.. హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను  మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే  ముస్లిం ఫకీర్ ను హిందువులు,.  హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..(దర్గా/ సమాధి  అంటే Extention ఉండదు..  కానీ  దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు..  అందుకే 1950 తర్వాత ఈ  సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు....  అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం  ప్రారంభం అయ్యింది )సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత  అజ్ఞానము లోకి పోయిన్నారు.

*సాయి అంటే ఫకీర్*  అని* అర్ధం..*

సాయిరాం / సాయి కృష్ణ అంటే  ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ.  అని అర్ధం..  

ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ   చేస్తూ,  ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..విచిత్రం ఏమిటంటే..  ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న  హిందువులే..

1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ,  సాహిత్యం లో  కానీ ఎక్కుడ   కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి  వ్రాయలేదు..   1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో   వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు  విజయం సాధించారు..

ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా  ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు..  కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..కానీ, విచిత్రం  ఏమిటంటే,  శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది  బ్రాహ్మణులూ  ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం.. 

దేశం, ధర్మం అంటూ  ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు  చాలా మంది,   ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు  ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి..  ఇప్పుడిప్పుడే  ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..హిందువులు, ముఖ్యం గా  జాతీయ వాదులు ఈ ప్రమాదం ను   అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),

ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ     పూజించని  ఫకీర్ బాబా( ముస్లిం) ను,  "హిందూ దేవుడు"  గా  హిందువులు  పూజించడం  ఏమిటి?,,   కొంచెం అయినా  ఆలోచన   ఉండాలి కదా? 

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్,  షిర్డీ వారు  ప్రచురించిన  " శ్రీ  సాయి  సచ్చరిత్రము "ఫకీర్ కు,    సాయి అనే పేరు ఎలా వచ్చేను,,  పేజీ no.41, 42, 43సాయిబాబా కు   కోపం వచ్చినప్పుడు  భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా  తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,.  etc. 

(  దేవుడు అయితే,  కోపం వస్తే,  భక్తులపై  రాళ్లు,  ఇటుకలు  విసిరి వేయడం  ఏమిటి?,  భక్తులను  తిట్టడం  ఏమిటి?  )

" నేనొక  ముసల్మాన్ (ముస్లిం ) ",   అని,  ఒక మహమ్మదియున్ అని  సాయి బాబా నే  స్వయంగా  చెప్పినారు 

" పేజీ No. 103 &

" సాయి బాబా ఒక  మహమ్మదియున్ ( ముస్లిం ) అని  చెప్పినారు 

" పేజీ No. 112,  226, 232,  ( బాబా గారే  తను  ముస్లిం అని చెప్పిన,  హిందువుల దేవుడు ఎలా అయినారు )

సాయిబాబా,  పొగాకు పీల్చుట / తాగుట ,,  పేజీ no.48,  126,  etc.

సాయి బాబా  అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,ఫకీర్ లను పర్షియన్ భాష లో  " సాయి ' అని అంటారు,,   ఆవిధంగా  ఫకీర్ పేరు క్రమం గా  " సాయి" గా  మారినది. తన జీవితాంతం  మసీదు లోనే గడిపినారు.  ఎప్పుడు   "అల్లా మాలిక్ " అని చెప్పేవారు. ఏ ఒక్క రోజు  సాయి బాబా  హిందు దేవుళ్ళ ను  పూజించలేదు. తను ముస్లిం కాబట్టి,  మసీదు లోనే ఉండి  అల్లా  ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,త్రిమూర్తుల  అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం   ధాత్తాత్రేయ,,  

అవతారం నకు  మరో అవతారం  ఉండదు,, విష్ణు మూర్తి అవతారం  శ్రీ రాముడు,   కానీ  శ్రీ రాముడు కి  మరో అవతారం  ఉండదు.విష్ణు మూర్తి అవతారం  శ్రీ కృష్ణుడు,,   కానీ  శ్రీ కృష్ణుడు కి  మరో అవతారం  లేదు,,అదే విధంగా   దాత్తత్రేయ స్వామీ నే  ఒక అవధూత అవతారం,,  మళ్ళీ  ఒక అవతారం నకు  మరో అవతారం  ఉండదు,,కానీ,  సాయిబాబా  ధాత్తాత్రేయ   అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,,  కొంచెం అయినా  ఆలోచించాలి గదా?

ఇందులో నే   పెద్ద కుట్ర  ఉన్నది..!!

అయినా మనకు ఎంత మంది గురువు లేరు..., ఆదిశంకరాచార్యులు వారు నడయాడిన ప్రదేశాలు చూడటానికి కాలడీ వెళ్లట్లేదు, భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం చూడటానికి తిరువన్నామలై వెళ్ళటం లేదు, బేలూరు రామకష్ణ మఠంకు వెళ్లట్లేదు, శృంగేరి మఠంకు వెళ్ళటం లేదు హిందువులు అందరూ షిరిడి వెళ్ళిపోతున్నారు... ఖర్మ 😭

కావడి ఉత్సవం విశిష్టత

 కావడి ఉత్సవం విశిష్టత


ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి అఢికృతిక సందర్భంగా

🕉️🕉🕉🙏🙏🙏

కుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్‌ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారతాడు. అయితే ఇడుంబన్‌లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. *‘నాయనా , నేను కైలాసం నుంచి శివగిరి , శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా’* అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్‌. 


ఆ రాక్షసుడి అసురత్వాన్ని సుబ్రహ్మణ్యుడే పోగొడతాడని శివుడు అందుకు అడ్డు చెప్పడు. అలా కొండల్ని మోసుకుని కొంతదూరం వెళ్లిన ఇడుంబన్‌ పళని ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేదతీరతాడు. కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా , ఇంకోవైపు తేలిగ్గా ఉండటం గమనిస్తాడు. కావడిని దించి చూస్తే బరువున్న కొండపైన సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చర్యకి కోపమొచ్చిన ఇడుంబన్‌ స్వామిని వధించాలని కొండపైకి వెళతాడు. ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు అతడిని సంహరిస్తాడు. విషయం తెలిసిన అగస్త్యముని ఇడుంబన్‌ను బతికించమని వేడుకుంటాడు. శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇడుంబన్‌ను బతికించి... తన కొండ కిందకొలువై ఉండమనీ , భక్తులు ముందుగా అతడిని దర్శించుకున్నాకనే తన సన్నిధికి రావాలనీ వరమిస్తాడు.


అలానే షష్ఠినాడు పాలు , విభూతి , పూలు , తేనె , నెయ్యి... వీటిలో ఏదో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకొస్తే తనని ఆరాధించిన  ఫలితం దక్కుతుందని చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమవుతాడు. అప్పట్నుంచీ పళని కొండకి ఇడుంబన్‌ అనే పేరు వచ్చింది. స్వామి వారి మెట్ల మార్గం దగ్గర ‘ఇడుంబన్‌’ గుడి ఉంటుంది. భక్తులు ఆ మూర్తిని దర్శించుకున్నాకే వల్లీదేవసేన సమేతుడైన కుమారస్వామి సన్నిధికి వెళతారు.  ఈక్షేత్రం మదురైకి 120 కి.మీ దూరంలో ఉంది. 


హైదరాబాద్‌ నుంచి మదురైకి విమానంలో వెళ్లి అక్కణ్నుంచీ రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లొచ్చును. రైల్లో అయితే హైదరాబాద్‌ నుంచి మదురైగానీ , చెన్నై సెంట్రల్‌ వరకూగానీ వెళ్లి అక్కణ్నుంచీ చెన్నై సెంట్రల్‌ - పళని ఎక్స్‌ప్రెస్‌లో పళని చేరుకోవచ్చును. రైల్వే స్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో , బస్సుల సౌకర్యం కూడా ఉంటుంది.

హరోం హర హరోం హర హరోం హర 

హరోం హర హరోం హర హరోం హర

హరోం హర హరోం హర హరోం హర 

హరోం హర హరోం హర 


✍🏻 సర్వే జనాః సుఖినోభవంతు


పిల్లాడి రుద్రయ్య

ఒక లయానికి సమానం.

 *పూజకోటి సమం స్తోత్రం,*     

 *స్తోత్రకోటి సమో జపః* 

 *జపకోటి సమం ధ్యానం ,*          

 *ధ్యానకోటి సమో లయః* 

 

*భావం:* 

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,

కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,

కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,

కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.


    *వ్యాసమహర్షి*

Paritoshikam


 

తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది

 *🔊పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ ముప్ప*


*🔶50-60% మందిలో గుర్తింపు*


*🔷అయిదు పాఠశాలల్లో ఏఐజీ అధ్యయనం*


*🍥ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలు అడిగిందే తడవుగా బిస్కెట్లు, చాక్లెట్లు, మిఠాయిలు, నూడుల్స్‌, కూల్‌డ్రింకులు, సమోసాలు వంటి తినుబండారాలు కొనిపెడుతున్నారా..?! అయితే తస్మాత్‌ జాగ్రత్త.. ఇవన్నీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌(ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)కు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అయిదు కార్పొరేట్‌ పాఠశాలల్లోని 1,100 మంది చిన్నారులపై చేసిన అధ్యయనంలో ఈ సమస్య గుర్తించారు. 10-14 ఏళ్లలోపు చిన్నారుల్లో 50-60% మంది ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ ఉన్నట్లు తేలింది. ఇందులో 20% మందికి కాలేయం గట్టిపడి సిర్రోసిస్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. తర్వాత కాలేయ మార్పిడి ఒక్కటే శరణ్యమని వైద్యులు స్పష్టీకరించారు. ఆరు నెలలపాటు సాగిన ఈ అధ్యయనంలో అల్ట్రాసౌండ్‌, కాలేయ పరీక్షల ద్వారా ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీని గుర్తించారు.*


*💥ఏంటీ ఫ్యాటీ లివర్‌..?*


*🌀సాధారణంగా తాగుడు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మద్యం అలవాటు లేకపోయినా ఆహార ప్రభావంతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ పెరుగుతుంది. అతిగా తిన్నప్పుడు కొవ్వు రూపంలోకి మారి కాలేయంలో నిల్వ చేరుతుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు కాలేయం దీనిని వినియోగిస్తుంది. శారీరక శ్రమ లేకపోతే కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ప్యాకెట్లలో దొరికే జంక్‌ఫుడ్‌కు పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. వారి లంచ్‌ బాక్సుల్లోనూ బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్‌లు వంటివి పెడుతున్నారు. అంతేకాక చిన్నారుల్లో శారీరక శ్రమ లోపిస్తోంది. చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు అసలు ఆటస్థలాలే లేవు. ఇళ్లలో టీవీలు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఫలితంగా బరువు పెరిగి ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ బారినపడుతున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.*


*💥నాలుగు దశలు*


*💠నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌లో నాలుగు దశలు ఉంటాయి. సింపుల్‌ స్టియటోసిస్‌, స్టియటో హెపటైటిస్‌, ఫైబ్రోసిస్‌, నాలుగోది తీవ్రమైన సిర్రోసిస్‌. తుది దశ వరకు గుర్తించకపోతే కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదని వైద్యనిపుణులు అంటున్నారు.*


*💥లక్షణాలు లేకుండానే దాడి*


*✳️ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ సమస్య ఉన్నా ఎలాంటి లక్షణాలు బయటపడవని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో మాత్రం పొట్ట పెరిగి ముందుకు రావడం, కుడివైపు పొట్ట పైభాగంలో గుచ్చినట్లు నొప్పి ఉండటం కనిపిస్తాయి. ఇవి సాధారణమేనని నిర్లక్ష్యం చేస్తున్నారు. అల్ట్రాసౌండ్‌, లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు చేసినప్పుడు అసలు సమస్య బయట పడుతోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే తరం తీవ్రమైన కాలేయ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే జనాభాలో 30% మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.*


*💥ఆరోగ్యకర అలవాట్లే రక్ష*


    

*◼️మార్పు తల్లిదండ్రుల నుంచే రావాలి. జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉంటూ పిల్లలూ అనుసరించేలా చేయాలి. ఇంట్లో వండిన తాజా ఆహారమే లంచ్‌ బాక్సుల్లో అందించాలి. అధిక బరువు ఉంటే ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించాలి.*

    

*◼️రిఫైన్డ్‌ షుగర్స్‌, మైదాతో చేసిన పదార్థాలు, మిఠాయిలు తగ్గించాలి. తృణధాన్యాలతో చిరుతిళ్లు(స్నాక్స్‌) చేసి పెట్టాలి.*

    

*◼️విద్యార్థులు తరచూ ఆటలాడేలా ప్రోత్సహించాలి. పాఠశాలల్లో రోజూ కనీసం 45 నిమిషాలు క్రీడలకు కేటాయించాలి. ఇంట్లోనూ తల్లిదండ్రులు వారితో కలిసి ఆడుకోవాలి.*


*💥సమస్య తీవ్రం కాకముందే మేలుకోవాలి*


*🔆పిల్లల పరిస్థితి చేయి దాటక ముందే తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తం కావాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యమివ్వాలి. ప్యాకెట్‌ ఫుడ్‌లో వాడే ప్రిజర్వేటర్లు ఇతర పదార్థాలు జీర్ణకోశంలోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. చాలామంది పిల్లలు దంతాలు తోమి టూత్‌పేస్ట్‌ నురగ మింగేస్తుంటారు. ఇందులో ఉండే టైటానియంతోనూ మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్నప్పటి నుంచే మంచి ఆహార అలవాట్లపై అవగాహన కల్పించాలి. ప్రతిఒక్కరు ఏడాదికోసారి కాలేయ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు.*


*🎙️డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్‌, ఏఐజీ*

నాతో ఎవరూ లేరు

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

--------------------------------------------


*శ్లోకం*


ఏకోహం అసహాయోహం

 కృశోహం అపరిచ్ఛదః |

స్వప్నేప్యేవం విధా చింతా

మృగేంద్రస్య న జాయతే ||

             (సుభాషితరత్నావళి)


*తాత్పర్యం*


నాతో ఎవరూ లేరు, నేనొక్కడినే ఉన్నందున అసహాయకుడినై ఉన్నాను. చాలా కృశించి పోయాను. నావద్ద ఎలాంటి ఆయుధాలూ లేవు. నా గతి ఇక అధోగతి - ఈ రకమైన ఆలోచన మృగరాజైన సింహానికి కలలో కూడా రాదు. అది తనలోని ప్రయత్నం, పరాక్రమాల ద్వారా సాధించి గెలుస్తుంది. అలాగే మనిషి కూడా దేవుడిని స్మరిస్తూ ప్రయత్నపూర్వకంగా యుక్తిశక్తుల ద్వారా సాధించి ఫలితాన్ని పొందాలి.

రామ ప్రతిష్ఠ

 *రామ ప్రతిష్ఠ - వరద ముంపు*

              ➖➖➖✍️


*నాగాయలంక లాంచీరేవు గట్టున సంతరోజు చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీలమీద సుమారు వేయి మంది పెనుమూడి మీదుగా గుంటూరు జిల్లాకు పోతారు. దాదాపు వేయి మంది అక్కడికి వస్తారు.*


*అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి, స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది. జైపూర్ నుండి చలువరాతి విగ్రహాలు తెప్పించాము. 1964 మే నెల 31 తేదీ నాటికి ప్రతిష్ఠకు ముహూర్తం నిశ్చయించాము. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి.*


*ఇంతలో, కంచి పెద్దస్వాములు...                  శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి షష్టిపూర్తి మే నెల 25వ తేదీన కంచికి మూడుమైళ్ళ దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ, 31వ తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్ఠకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండని చెప్పి, మేము అంబికి బయలుదేరాము. అప్పుడు అక్కడికి             శ్రీ మండలీక వెంకటశాస్త్రి, శ్రీ కుప్పా లక్ష్మావధానులు, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లు కూడా వచ్చారు.*


*షష్టిపూర్తి రోజున మాకెవరికీ స్వామి వారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26వ తేదీ తీర్థం పుచ్చుకుందామనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం నేనెన్నడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామి నాకు తీర్థమిచ్చి, చేతిలో ఉన్న పెద్ద ఉద్ధరిణె కింద పెట్టి, “ప్రతిష్ఠ ఎప్పుడు?” అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. “మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది” అన్నాను. “అది కాది. నది ఒడ్డున ఏర్పాటుచేశావే, ‘రామ పాద క్షేత్రం’ అక్కడి ప్రతిష్ఠ” అన్నారు.*


*“దానిని మే 31వ తేదీన చేద్దామని అనుకున్నాము” అన్నాన్నేను.*


*స్వామి వారు వెంటనే “31వ తేదీన చేస్తారా?” అని అన్నారు.*


*స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది.*


*స్వామి మాకు అక్షింతలు, కుంకుమ, కిస్మిస్ పండు ప్రసాదంగా ఇచ్చి, యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచండని సెలవిచ్చారు.*


*ఇంతలో 28-5-1964న ప్రధానమంత్రి నెహ్రూ గారు పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్ళు, బస్సులు నడవలేదు. 29వ తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరుకున్నాము. మేము ఊరిలో లేనందున ‘గురువుగారు లేని ప్రతిష్ఠా’ అంటూ గ్రామస్తులు ఏ పనీ మొదలుపెట్టలేదు. అందుచేత మళ్ళా జూన్ 11వ తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆపని నిర్వహించాము. స్వామివారన్నది నిజమైంది.*


*మరొక విచిత్రమేమంటే, స్వామివారాస్థలాన్ని ‘రామపాదక్షేత్ర’మని ఎందుకన్నారు?* *తరువాత రెండు నెలలకు నాగార్జునడాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరద నీరు గుడిలో శ్రీరామపాదాల నంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్టయితే దివితాలూకాలో 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి.*


*వారికి భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలుసు. వారు కాలమునకు లొంగని కాలాతీతులు.*


--- శ్రీరామ శరణ్ కుందుర్తి వెంకట నరసయ్య


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।


                    

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌹🌹🙏🌹🙏🙏

ఆస్తికత్వానికి - నాస్తికత్వానికి


వాల్మీకి విరచిత శ్రీమద్రామాయాణంలో  జాబాలి-శ్రీరాముడి మధ్య సంవాదం ఉంది. అందులో శ్రీరాముడు పై అభిప్రాయాలకి చక్కటి సమాధానం చెబుతాడు. పైగా జాబాలి మీద కాస్త కోపం చూపుతాడు. శ్రీరాముడి మీద ప్రేమతోనే, అయోధ్యలోనే వుండాలి అన్న కోరికతో అలా మాట్లాడాడని వసిష్టుడు సద్ది చెబుతాడు. ఇదంతా ఎందుకంటే జీవితంలో ఆస్తికత్వానికి - నాస్తికత్వానికి మధ్య  తగిన దూరం పాటించాలి అని శ్రీరాముడు చెప్పాడు. పుట్టుకతో వొచ్చిన వర్ణ ధర్మాన్ని దేహం ఉన్నంత వరకూ పాటిస్తూనే మోక్షసాధన చేయాలి. తప్పదు.  ఇది చేసి చూపటానికే  రామావతారం-కృష్ణావతారం.


  అన్ని వున్న వాడి

గూర్చి ఆలోచించే  అవసరమే లేదు. 

   కలియుగము లో కలి ప్రభావం చాలా  వరుకు మనుష్యులను బలహీనులను చేస్తుంది.బుద్ధి ఏమాత్రము ను నిలువ నీకుండ చేస్తుంది.  అన్ని యుగాలలో లేని శక్తి వొక్క కలియుగము లోనే వుంది. అదే  ధ్యాస ద్యాన్నము. ధ్యానము అంటే పూజ  పురస్కారం కాదు . యేకాగ్రత. 

 ఎవ్వరైతో నా గురించి కొంచం ఆలో చిస్తారో వారి పూర్తి భాధ్యత నేను తీసుకుంటాను .వారిని నా త్రోవలో కి తెచ్చుకుంటాను. వారికి నేనే దాసుడవుతాను.

విష్ణు సహస్రము. 

యింకా  యే వేదాలు కావాలి యే ఉపనిషత్ లు కావాలి తరించటానికి కలియుగము లో నామ స్మరణమే ముక్తి నీ యిస్తుంది అని భాగవతం ధృవీకరించింది.

యిక ఏమి కావాలి. శ్రద్ధ సబురి బాబాగారు. 

అనీ వున్న అస్త దరిద్రాలకు పాటుబడతారు.బల హీనులు అయిన మానవులు.  అంతే

వారి కోసమే నా యీ ప్రయత్నం. 

ఓం నమఃశివాయ.


అప్పారావు అనే వ్యక్తిని చూస్తూ సుబ్బారావు అని మైకులో ప్రపంచం మొత్తం వినపడేలా అరచి పిలిచినా ఆ వ్యకి చూస్తూ ఉంటాడే తప్ప పలకడు. స్పందించడు. ఎందుకు? అతడు సుబ్బారావు కాదు కాబట్టి. ఇదే తీరులో ప్రతి మానవుడుకి పుట్టుకతోనే ఓ వర్ణం (పోనీ ఓ దేహం అనుకోండి)వొస్తుంది కదా. ఆ ధర్మం /దేహ పరిధిలోనే అతని సంచారం ఉండక తప్పదు. దాన్ని అతడు దాటలేడు..మార్చుకోలేడు.(అప్పారావు లాగా). ప్రతీ వర్ణానికీ ఆయా ధర్మ పరిధిలోనే మోక్షసాధనకు పరమాత్మ పరిపూర్ణమైన అవకాశాన్ని ఇస్తూ..చెంతనే నిలబడి "వర్ణ ధర్మాన్ని పాటిస్తూనే అందులోనే మోక్షసాధన చేయవయ్యా" అని చెబుతూనే ఉన్నాడు, చేసి చూపించాడు. రాముడిలా కృష్ణుడిలా. మనమే వినం. నాకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేశాను. అన్యధా భావించవలదు.

శివానందలహరీ

 శివానందలహరీ 


స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ 

పురాణే మంత్రేవా స్తుతినటన హాస్యే ష్వచతురహ

కథం రాజ్ఞామ్ ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే 

పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో  



స్మ్రతి,పురాణములందు, స్తుతి,నాట్యములయందు

          శకున , వైద్య , నటన శాస్త్ర మందు

సంగీత సాహిత్య సారస్వతము లందు 

           చతుర , హాస్య , విదూష వితతు లందు

నేర్పున్న వాడను నే గాను పరమేశ !

           భావింప నన్నింట పశువు నేను

నటువంటి నా మీద నవనీపతుల కెట్లు

          ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?

పశువు నగునన్ను పాలించ పరుడు లేడు

పశుపతీ ! నీవు పాలించి భవము నందు

కరుణ తోడను రక్షించి కావు మెపుడు

భక్త మందార ! శంకరా ! పాహి పాహి !        05 @


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ధర్మం ఒక్కటే అది మారదు.

 

చేవవలసిన భాధ్యత వున్న వారు చేయకుండా తప్పించుకోవాలని చూస్తే భగవత్ శ్వరూపాలయిన పంచ భూతాలు ఎవ్వరికీ ఏది చే దుతుందో వారి ఖాతాలో క్రమం తప్పకుండా వారి లెక్కలు వ్రాస్తూ ఉంటారు.,)యిది తథ్యం.

యిక యుగాల గూర్చి ఆలోచిస్తే ఏ యుగం లో నయినా ధర్మం ఒక్కటే అది మారదు.

         అయితే జన్మ వద్దు అనుకొన్న వారికి మోక్షం కావాలనుకునే వారికి

యీ పూజలు యజ్ఞాలు యాగాదులు యివి అన్ని వృధా.అందరూ భగవత్ శ్వరూపాలే 

 కోరికలు కలవారు వారి కోరికలను బట్టి వారి పూజ భక్తి వుంటుంది .

వొక్క మొక్షసాధనకు మొదటి సాధనం సర్వ పరిత్యాగం.

సంధ్యావందనము,ప్రవృత్తి నివృత్తి మార్గాలు నా లెక్కలో  వొక విధము మనస్తిమితము లేని వారికే.

ఎందుకంటే జన్మ రాహిత్యానికి ఒక్కటే త్రోవ. పరమేశ్వరుని లో ఐక్యమవటమే .

అది కావాలనుకున్న. వారికే ఏది కన్పించదు వింపించదు. వొక్క భగవంతుని రూపమే నామమె. 

అందరికీ.  యిదే  కావాలి   మోక్షం కావాలంటే.

గాలిని బంధించి దాచగ పని లేదు జీవుల హింసించే చేయగా పని లేదు

మాధవ మధుసూదన అని మనమున తలచిన చాలుగా. ప్రహ్లాదుడు.

ఏడు జన్మల భక్తి తో నన్ను చేరతారా లేదా మూడు జన్మల వైరం తో నాలో చేరతారా అంటే మూడ్ మూడు జన్మలు చాలు నీ నామం మరచి పోకుండా అని జయ విజయు ల ఖడ్గ అందరికీ సుపరిితమే.

తపోనిస్తులయి కీకా రణ్యము లో వున్న మాహారుషులు యీ సంధ్య వందనములతో యీ పూజలతో పరమ పదం చేరుకొన్నారు. వొక్క నామ స్మరణం  మాత్రం మేగమ్యాన్ని చేరుస్తుంది. . 

యిదే సత్యం యిదే నిత్యం. ఓం నమఃశివాయ.

జై గురుదేవా దత్ .శుభం భూయాత్ .

Movement


 

Snake in cauliflower


 

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 8*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 8*


పుస్తకాలు చదువులు ఎన్ని నేర్చినా, తల్లితండ్రుల జీవితాల నుండి గ్రహించిన విద్య జీవితంలో రాణించడానికి దోహదపడుతుంది. నరేంద్రుడు కూడా తన తల్లితండ్రుల నుండి ఎన్నో నేర్చుకొన్నాడు. 


సత్ప్రవర్తన అంటే ఏమిటి? దానికి కొలబద్ద ఏది? కష్టాల పరంపరతో జీవితం తల్లడిల్లిపోతున్నప్పుడు సైతం చలించక సన్మార్గంలో జీవించడం, జీవితానికి ఉత్కృష్ట ఆలంబనం భగవంతుడేనని ఎంచి ఆయనను శరణుజొచ్చి జీవించడం లాంటివి తల్లి నుండి నరేంద్రుడు నేర్చుకొన్నాడు.


ఒక రోజు భువనేశ్వరి, నరేంద్రుడితో ...

"నాయనా! సదా పునీతుడవుగా, ఆత్మగౌరవంతో మెలగు. అదే సమయంలో పరుల ఆత్మగౌరవాన్ని పరిగణించి జీవించడమూ అలవరచుకో. సరళ స్వభావిగా, సమతను పాటిస్తూ వ్యవహరించు, కాని అవసరమైనప్పుడు నీ హృదయాన్ని ఉక్కులా చేసుకోవడానికీ సంకోచించకు.” ఇవి అనుభవంతో చెప్పిన మాటలు. 


నరేంద్రుని జీవితంలో అనేక సందర్భాలలో ఈ మాటలు అతడికి మార్గదర్శకాలై ఒప్పారాయి. అందుకే కాలాంతరంలో స్వామి వివేకానంద, "తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు. నా ధీశక్తి యావత్తుకూ కారకురాలు నా తల్లి" అన్నారు.  


ఒక సంఘటన..


ఒకేకసారి తరగతిలో భూగోళశాస్త్ర పాఠం చెబుతున్నారు. ఉపాధ్యాయుడు దేశపటం ఒకటి వ్రేలాడదీసి దాన్లో ఒక ఫలానా నగరాన్ని గుర్తించమని నరేంద్రుణ్ణి ప్రశ్నించాడు. నరేంద్రుడు చూపించాడు. ఉపాధ్యాయుడు అది తప్పు అన్నాడు. దాన్ని తిరస్కరించి, తనదే ఒప్పు అన్నాడు. తన జవాబును తిరస్కరిస్తున్నాడనే కోపంతో ఉపాధ్యాయుడు అతణ్ణి చేతులు చాచమని బెత్తంతో కొట్టాడు. దెబ్బలన్నీ ఓర్చుకొన్నాడేగాని తన జవాబు తప్పు అని మాత్రం అతడు అంగీకరించలేదు.


 కాసేపటి తరువాత పుస్తకం చూసినప్పుడు తన జవాబే తప్పని ఉపాధ్యాయుడు గ్రహించాడు. వెంటనే నరేన్ ను క్షమించమని అడగడమేగాక అప్పటి నుండి అతడిపట్ల గౌరవభావంతో మెలగసాగాడు. ఈ సంఘటనను కూడా తు.చ. తప్పక తల్లితో చెప్పాడు నరేన్. భువనేశ్వరి అతణ్ణి హృదయానికి హత్తుకొని, “నా చిట్టితండ్రీ! న్యాయం నీ వైపు ఉన్నప్పుడు నువ్వు కలతచెందనవసరం లేదు.

 

న్యాయమార్గం కొన్ని సమయాలలో దుర్గమంగానూ, కష్టజనితంగాను

ఉండవచ్చు. కాని నువ్వు న్యాయమని అనుకొన్న దానిని చేయడానికి తటపటాయించవద్దు" అని చెప్పింది. ఈ ఉపదేశం నరేంద్రునికి జీవిత పర్యంతం ఏ పరిస్థితిలోనూ విస్మరించింది లేదు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-14🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-14🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *శ్రీహరి శ్వేతవరా7హ రూపము ధరించిన వృత్తాంతము* 


పూర్వకాలమందు ఒకానొకనాడు సనకసనందనాదులు వైకుంఠానికి బయలుదేరారు. శ్రీమహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనమునకై వారు వెడలసాగిరి. సనకసనందనాదులు మహాభక్తులు నిరంతరము విష్ణుకధా శ్రవణాసక్తులు భగవత్ దైవానురాగాను రక్తులు.


ఆ మునులు బాలుర వేషములో వెడలినారు. ద్వారపాలకులు వారు లోనికి వెడలుటకు అభ్యంతరము తెలిపిరి. వారు ‘‘మేము చాలా ముఖ్యులము, లోనికి వెడలి తీరవలసినదే’’ అనిరి.


 ‘‘ససేమిరా లోపలికి వెడలుటకు వీలు లేనేలేదన్నారు.’’ ఆ యిరువు ద్వారపాలకులూను.


మునులు కోపము శాపమునకు దారి తీయును గదా! వారిద్దరూ ద్వారపాలులవైపు తీవ్రముగా చూచి మీకింత కండ కావరమా! మమ్ములను శ్రీమహావిష్ణువును దర్శించకుండ చేతురా? చూచుకొనుడు మా శక్తి! మీరిద్దరూ రాక్షసులై పోయెదురుగాక అని శాపమిచ్చినారు. ద్వారపాలకులు కంపించినారు.


 ఇదేమి శాపమని విలపించి తమ్ము క్షమించవలసినది వారిని కోరారు.


అంతట మునులు కొంత అనుగ్రహించి మూడు జన్మలందు మీరు రాక్షసులుగ నుండి శ్రీమహావిష్ణువునకు శత్రవులుగ వ్యవహరించిన పిదప మరల మీ పూర్వస్థానములను పొంది శ్రీమహావిష్ణువును కొలువగలరు అనగా ఆ ద్వారపాలక భక్తులు అందుకు అంగీకరించిరి. 


తరువాత వారు తొలిజన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిరి.


హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు. అడ్డూ అదుపూ లేక అతడు చెడు పనులు చేసేవాడు, ఒకసారి భూమండలము యావత్తు చాపగా చుట్టేసి దానిని రసాతల లోకానికి తీసుకునిపోయి దాచేశాడు. దేవతలు ఈ విపత్తును చూచి వెంటనే శ్రీమహావిష్ణువు వద్దకు వెడలి ప్రార్థించారు. 


అభయమిచ్చాడు నారాయణుడు, తాను శ్వేతవరాహ రూపము ధరించాడు. హిరణ్యాక్షుని సంహరించాడు. బ్రహ్మ మున్నగువారు శ్వేత వరాహమును మనసారా స్తుతించారు. 


భూమండలాన్ని రక్షించిన నీవు భూలోకములోనే వుండవలసినదిగా కోరుతున్నామన్నారు. శ్వేతవరాహస్వామి సరేనని తనకు నివాసస్థలముగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడ ఉండసాగాడు. 


వరాహ స్వామికి చాలమంది భక్తులేర్పడిరి. అందులో వకుళాదేవి ముఖ్యురాలు.


*వకుళాదేవి కథ*


అది ద్వాపర యుగము. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారమును చాలించే సమయము ఆసన్నమవుతున్నది. ద్వారకావాసులా సంగతి తెలుసుకొని విచార సాగరములో మునిగిపోయారు. 


వారు శ్రీకృష్ణుని చెంతకేగి స్వామీ! నిన్ను వదలి మేము ఏ విధముగా నుండగలము? ఉండలేము అనిరి. శ్రీకృష్ణుడు ఓదార్చి కలియుగమందు మీరందరూ నన్ను ధ్యానించి నాయందు చేరుటకు అవకాశమున్నది’ అని వారిని పంపించినాడు.

యశోద కోరిక

యశోద శ్రీకృష్ణుని కంటికి రెప్పగా చూచుకొని పెంచినది. తన ప్రాణమే కృష్ణుడుగ ఆమె భావించుచుండెను. ముద్దుల శ్రీకృష్ణుని యెడల ఆమె మధురానురాగము మరి ఎవ్వరునూ చూపి యుండలేదు. శ్రీకృష్ణునకున్నూ యశోద అంటే అనుపమానమయిన ప్రేమ, శ్రీకృష్ణుడు అవతారము చాలించునున్నాడనే విషయము యశోదకి కూడా తెలిసింది. 


ఆమె శ్రీకృష్ణుని పిలచి ‘‘నాయనా! కృష్ణా! నీ వలన నాకు యెన్నో విధముల ఆనందము చేకూరినది. కానీ నాకు ఒక్కలోటు మాత్రము యింకనూ వున్నది. నీకు జరిగిన వివాహములలో ఒకదానిని కూడ చూడడం నాకు వీలుపడలేదు. నీ వివాహం చూడాలనే కోరిక నాలో వుండిపోయింది’’ అని యన్నది, 


శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! నీ కోరిక కలియుగములో తీరగలదు. శ్రీవేంకటేశ్వర అవతారమును కలియుగమున దాల్చెదను.


నీవిక యీ శరీరమును వీడి వకుళ మాలికవై శేషాచలమునకు వెళ్ళి వరాహస్వామిని అర్చిస్తూవుండు అన్నాడు. ఆమె అట్లే యన్నది. ఆ యశోద శరీరమును వీడి వకుళాదేవిగా మారింది. 

శేషాచలము చెంతనుండే వరాహస్వామిని అర్చించసాగింది. యామె మనస్సు వెన్న. మహాభక్తురాలు


 *శంఖచక్రధర గోవిందా, శాoగగదాధర గోవిందా, విరజాతీరస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||14||* 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

(10-08-2023) రాశి ఫలితాలు

  (10-08-2023) రాశి ఫలితాలు


మేషం


 10-08-2023



చేపట్టిన పనులు  నిదానంగా పూర్తి చేస్తారు.  దైవ చింతన పెరుగుతుంది బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.



---------------------------------------


వృషభం


 10-08-2023



వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.



---------------------------------------


మిధునం


 10-08-2023



చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన  పనులలో కార్యసిద్ది కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.



---------------------------------------


కర్కాటకం


 10-08-2023



ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం  కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు  అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.  వ్యాపారమున  ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.  నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.



---------------------------------------


సింహం


 10-08-2023



ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.



---------------------------------------


కన్య


 10-08-2023



నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. బంధు వర్గం వారితో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.



---------------------------------------


తుల


 10-08-2023



కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.    ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.



---------------------------------------


వృశ్చికం


 10-08-2023



ఆప్తులతో సఖ్యతగా  వ్యవహారిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు  మిత్రుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చుతాయి. స్ధిరాస్తి  క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 



---------------------------------------


ధనస్సు


 10-08-2023



మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.



---------------------------------------


మకరం


 10-08-2023



ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పాతరుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి.



---------------------------------------


కుంభం


 10-08-2023



ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి  ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది. 



---------------------------------------


మీనం


 10-08-2023



చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి.  చేపట్టిన పనులు  మందకొడిగా సాగుతాయి.  ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు.

---------------------------------------

🕉️AVB సుబ్బారావు 🚩

📱9985255805🇮🇳

As it is


 

Self design


 

God bless





https://youtu.be/m1hQDT80fyc 

పరమేశ్వర స్తుతికి

 శుభోదయం🙏


పరమేశ్వర  స్తుతికి  భాషా భేదాలు లేవు


                

               ఉ:  హెడ్డున  మూను , స్కిన్నుపయి  నెంతయు  డస్టును, ఫైరు నేత్రమున్ ,


                      సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని  గాంజెసు    హైరు లోపలన్ ,


                      బాడికి  హాఫెయౌచు  నలపార్వతి ,  మౌంటెను   డాటరుండ ,   ఐ


                       షుడ్డు  డివోటు ,దండములు   సోకగ  ప్రేయరు సేతు  నెప్పుడున్;


                                      ఆదిభట్ల నారాయణ  దాసుగారు.


                    బహు భాషా  కోవిదులైన  దాసుగారు  పరమేశ్వరుని  మణిప్రవాళ  శైలిలో  యీవిధంగా  నుతించారు. ఇందులో  ఆంగ్లపదాలను బహురమ్యంగా  తెలుగు పదాలకు జోడించి  తమభాషాచాతుర్యాన్ని  ప్రకటించారు.


                      సిరసున  చంద్రుడు , శరీరమునభస్మము , అగ్ని నేత్రము ,(మూడవకన్ను)  వాహనంగా నంది. తలపై గంగ , అర్ధనారీశ్వరియై పార్వతి. (హిమవంతుని పుత్రి) నేను ఒరుల నేల తలచెదను  శంకరునకే  నమస్కృతులు  చేసి  ప్రార్ధింతును.

అనిదీని భావము. 


                    ఇలా అన్సభాషాపదాలను తెలుగు పదాలతోకలిపి వ్రాయటం  శివకవులతో ప్రారంభమైనది.పాల్కురికి సోమనాధుడే

ఈవిధానమునకు ఆద్యుడు. తరువాత తరువాత తక్కిన కవులందరూ ఈపద్దతిని అనుసరిస్తూ  ఈవిధానానికి  "మణిప్రవాళశైలియని" పేరు నిర్దేశించారు.


                                                  బాగుందికదా  తరువాత  మరికొన్ని!


                                                                        స్వస్తి!🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రోగాలకు కారణం

 మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు  - 


 

     ఈ  సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం.  ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.


  విరుద్ద ఆహారపదార్థాలు - 


 *  నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.


 *  తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు . 


 *  ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు. 


 *  కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.


 *  చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.


 *  చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు . 


 *  పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు. 


 *  ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు 


 * ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.


 *  మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .


 *  మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.


 *  ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .


 *  ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.


 *  పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.


 *  పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .


 *  తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును 


 *  ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.


 *  నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.


 *  ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.


 *  తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును 


 *  రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.


 *  బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు . 


 *  అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు . 


     పైన చెప్పిన విధంగా విరుద్ద ఆహార పదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగంధరం ,గ్రహణి వంటి రోగాలు కలుగును.


 

    పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    

 *1829*

*కం*

మనమేగతి(మనమేస్థితి)యందున్నను

మనసును సంతృప్తి వైపు మలచగ నెపుడున్

మనమోదమె యాదర్శము

మనమే సద్గురువులమగు మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనం ఎటువంటి స్థితి లో ఉన్న నూ మనస్సు ను సంతృప్తి పడేలా మలచుకొనగలిగితే మన సంతోషమే ఆదర్శ కరమై మనమే ఈ భూలోకంలో మంచి గురువులము కాగలము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఐక్యత చాటుదాం

 




*భీమవరం సోమేశ్వర స్వామి* ఆలయంలో ఒక అర్చకుడి పై వైసీపీ నాయకుడు దాడి చేసి *యజ్ఞోపవీతాన్ని* తెంచిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీనికి నిరసనగా రేపు సాయంత్రం 5గంటలకు శంకర్ లాస్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరుగును కావున బ్రాహ్మణ సోదరులు అందరూ ఏకమై పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఐక్యత చాటుదాం *ఈ కార్యక్రమం ఏ పార్టీకి సంబంధం లేదు*

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:43/150 


వృత్తావృత్తకరస్తాలో 

మధుర్మధుకలోచనః I 

వాచస్పత్యో వాజసనో 

నిత్యమాశ్రితపూజితః ॥ 43 ॥  


* వృత్తావృత్తకరః = యుద్ధభూమిలో రథంలో మండలాకారం ఏర్పరచటం - వృత్తం, 

    శత్రుసైన్యాన్ని నశింపజేసి, ఎట్టి గాయం లేకుండా తిరిగిరావడం - ఆవృత్తం, 

    ఈ రెంటినీ నైపుణ్యంగా చేయువాడు, 

* తాలః = (సంగీతశాస్త్రమునందలి) తాళ స్వరూపమైనవాడు, 

* మధుః= వసంత ఋతురూపుడు, 

* మధుకలోచనః = తుమ్మెదలవంటి (నల్లని) కనుపాపలు కలవాడు, 

* వాచస్పత్యః = వాగ్దేవియొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు, 

* వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడయినవాడు, 

* నిత్యమాశ్రితపూజితః = ఎల్లప్పుడూ, తనను ఆశ్రయించినవారిచేత పూజింపబడువాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కండ్ల కలక

 


*కండ్ల కలక నివారణ మార్గాలు* 


 *  30 గ్రాముల పసుపు చూర్ణమును ,250 ml నీటిలో వేసి కలిపి ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకొనుచున్న కండ్ల కలకలు తగ్గును . కొట్టిన పసుపు మంచిది . 


 *  పంచదార 3 గ్రాములు 100 ml నీటిలో వేసి కరిగించి గంటకొకసారి ఆ నీళ్లతో కండ్లు తడుపుచున్న కండ్ల కలక హరించును . 


 *  పటిక చూర్ణము 3 గ్రాములు , కోడిగుడ్డు తెల్ల సొనతో నూరి గుడ్డకు పట్టించి నేత్రములపై పట్టి వలె వేయుచుండిన యెడల కండ్లు నీరుకారుట , కండ్ల వాపులు హరించును . 


 * నీరుల్లి ( Red onion ) రసం రెండు లేదా మూడు చుక్కలు కండ్లలో వేయుచుండిన యెడల కండ్ల కలకలు హరించును . 


 *  కలబంద మట్ట పైన పచ్చటి పోర తీసివేసి లోపలి జిగురు వంటి భాగం 11 సార్లు కడిగి పసుపు అద్ది కళ్లు మూసుకుని కనురెప్పల పైన వేసి జారకుండా శుభ్రమైన గుడ్డతో కట్టుకట్టి గంట పాటు ఉంచవలెను . ఇలా రెండుపూటలా చేయుచున్న కంటి ఎరుపులు , దురద , వాపు తగ్గును . 


    పైన చెప్పిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్నది పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


ఎక్కడ సత్యం ఉంటుందో

 శ్లోకం:☝️

*సత్యానుసారిణీ లక్ష్మీః*

  *కీర్తిస్త్యాగానుసారిణీ |*

*అభ్యయససారిణీ విద్యా*

  *బుద్ధిః కర్మానుసారిణి ||*


భావం: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ లక్ష్మి నివసిస్తుంది. త్యాగం చేసేవారికి కీర్తి ఎల్లప్పుడూ ఉంటుంది. విద్య ఎల్లప్పుడూ అభ్యసించేవారికి లభిస్తుంది (అభ్యాసము కూసు విద్య). మరియు (ప్రారబ్ద) కర్మను బట్టీ బుద్ధి తదనుగుణంగా పనిచేస్తుంది.

పంచాంగం 10.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 10.08.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: దశమి తిధి బృహస్పతి వాసర: రోహిణి నక్షత్రం ధృవ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం. 


దశమి రేపు తెల్లవారుఝామున  05:06 వరకు.

రోహిణి రేపు తెల్లవారుఝామున  04:01 వరకు.

సూర్యోదయం : 06:01

సూర్యాస్తమయం : 06:42

వర్జ్యం : రాత్రి 07:30 నుండి 09:13 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:15 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:19 నుండి 04:10 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

గురువు అనుగ్రహంతోనే

 శ్లోకం:☝️

*గురౌ న ప్రాప్యతే యత్తత్*

  *నాన్యత్రాపి హి లభ్యతే |*

*గురుప్రసాదాత్ సర్వం తు*

  *ప్రాప్నోత్యేవ న సంశయః ||*


భావం: గురువు ద్వారా లభించనిది మరెక్కడా లభించదు. నిస్సందేహంగా గురువు అనుగ్రహంతోనే మనిషి ప్రతిదీ సాధిస్తాడు.🙏

ప్రాచీన_ప్రదేశాలు_ఆధునిక_నామధేయాలు

 #ప్రాచీన_ప్రదేశాలు_ఆధునిక_నామధేయాలు_భాగవతం_మహాభారతం


1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.

2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్

5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.

13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.

14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.

17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.

18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.

20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.

23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.

24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.

25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.

32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.

34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.

36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.

39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.

40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.

42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.

43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు. రామాయణం

1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.

19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.


🚩శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం🚩


🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩