శివానందలహరీ
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రేవా స్తుతినటన హాస్యే ష్వచతురహ
కథం రాజ్ఞామ్ ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో
స్మ్రతి,పురాణములందు, స్తుతి,నాట్యములయందు
శకున , వైద్య , నటన శాస్త్ర మందు
సంగీత సాహిత్య సారస్వతము లందు
చతుర , హాస్య , విదూష వితతు లందు
నేర్పున్న వాడను నే గాను పరమేశ !
భావింప నన్నింట పశువు నేను
నటువంటి నా మీద నవనీపతుల కెట్లు
ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?
పశువు నగునన్ను పాలించ పరుడు లేడు
పశుపతీ ! నీవు పాలించి భవము నందు
కరుణ తోడను రక్షించి కావు మెపుడు
భక్త మందార ! శంకరా ! పాహి పాహి ! 05 @
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి