5, జులై 2024, శుక్రవారం

జూలై 06, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *శనివారం* 🍁 

   🌹 *జూలై 06, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                 

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి : పాడ్యమి* రా 04.26 తె వరకు ఉపరి *విదియ*

వారం :*శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : పునర్వసు* (07) తె 04.48 వరకు ఉపరి *పుష్యమి*

*యోగం : వ్యాఘాత* రా 02.47 వరకు ఉపరి *హర్షణ*

*కరణం : కింస్తుఘ్న* సా 04.22 *బవ* రా 04.26 తె వరకు

*సాధారణ శుభ సమయాలు* 

*ఉదయం 10.30 - 12.00 వరకు*

అమృత కాలం :*రా 02.20 - 03.58*

అభిజిత్ కాలం :*ప 11.46 - 12.38*

*వర్జ్యం : సా 04.27 - 06.06*

*దుర్ముహుర్తం : ఉ 05.40 - 07.25*

*రాహు కాలం : ఉ 08.56 - 10.34*

గుళిక కాలం :*ఉ 05.40 - 07.18* 

యమ గండం :*మ 01.50 - 03.28*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.40*

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.40 - 08.17*

సంగవ కాలం :*08.17 - 10.54*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.51 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.57*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   🍁 *ఆంజనేయ స్వామి*🍁  

 🙏 *ఆయన అష్టసిద్ధులు*🙏


1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.


2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.


3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.


4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.


5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.


6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.


7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.


8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి. 

            🍁 _*ఓం శ్రీ*_🍁 

🍁 *_ఆంజనేయయా నమః*_🍁


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

           🌷 *సేకరణ*🌷

      🍁🌿🌹🌹🌿🍁

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🍁🌷🍁🌷🍁🌷🌹

వారాహీ నవరాత్రులు

 🙏🏻 *వారాహీ నవరాత్రులు జూలై 6 నుండి ప్రారంభం*🙏🏻

**************************



వారాహీ దేవిని పంచమీ అనే నామంతో అర్చిస్తారు. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీ దేవి యొక్క నవరాత్రులు. `భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం' అని శ్యామలా వారాహీ సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీ దేవి.

**************************

ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి, వారాహీ దేవికి సంబంధించినవి. సుభద్రా దేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియా శక్తికి ప్రతీక అయిన వారాహీ దేవిగా కొలుస్తారు. అంతే కాక జగన్నాథస్వామి కాళీ దేవి రూపం కూడా. 

**************************

శ్రీ కృష్ణుడు కూడా కాళీదేవియొక్క రూపమే కదా.."కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో" అని భగవద్గీతలో చెప్పినట్లు. ఇక బలభద్రుడు బలరాముని రూపం. వారాహీదేవికి లాగే బలభద్రునికి కూడా హలము (నాగలి) ఆయుధం. ఈ 9 రోజులు పూరీలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో ఇవాళ (పంచమి) వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతే కాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరీలో బలభద్రుని ధ్యానశ్లోకంలో " శాంతం చంద్రాదికాంతం ముసల హల ధరం" అని వారాహి యొక్క ముసలము, హలము రెండిటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది.

**************************

*విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్!*

*అనేక రూపదైత్యాన్తం నమామి పురుషోత్తమమ్!!*

**************************

విశ్వవ్యాపకుడు, జయశీలుడు, మహావిష్ణువు, ప్రకాశశీలుడు, సర్వ శాసకుడు, అనేక రూపములతోనున్న దైత్యులను నశింపజేసే బహు అవతార స్వరూపు డైన పురుషోత్తముని నమస్కరించుచున్నాను.                  ***************************వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు*

**************************

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు  రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

**************************

 నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. 

**************************


                                   **************************🕉️ *శ్రీ మాత్రే నమః*🕉️

----------------------------------------                 🔯 *వారాహీదేవి*🔯                       **************************

కదిలే దేవత... వారాహీ...

👉కాశీ పట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.

🙏🏻జై మాతా🙏🏻                          **************************

ఆషాఢమాసం

 _*రేపటి నుండి ఆషాఢమాసం ప్రారంభం , ఆషాఢమాసం విశిష్టత*_ 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ,  వ్రతం,  పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి *చాతుర్మాస్య వ్రతం* ప్రారంభిస్తారు.


దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసం లోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.


ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.


తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన (బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.


అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢం లోనే. ఈ మాసంలో *శాకంబరీ నవరాత్రులు* కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు , మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.


కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకు వెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో (మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.


ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా , కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే , చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.


శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు , శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

Panchaag

 


Help line


 

*శ్రీ గలగేశ్వర శివాలయం*

 🕉 *మన గుడి : నెం 369*





⚜ *కర్నాటక  : గలగనాథ - హావేరి*


⚜ *శ్రీ గలగేశ్వర శివాలయం*



💠 గంగా మరియు యమునా సంగమించే అలహాబాద్ త్రివేణి సంగమం మరియు కర్ణాటకలోని మడికేరి జిల్లాలోని బగమండల వంటి నదులు సంగమించే ప్రదేశాలను హిందువులు పవిత్రంగా భావిస్తారు.  

అలాంటి సంగమ ప్రదేశంలో వెలసిన గళగేశ్వర దేవాలయం చాలా మంది శైవులకు ప్రత్యేకం.


💠 గలగేశ్వర ఆలయం అసాధారణమైన పిరమిడ్ రూపంతో కర్ణాటకలో అత్యంత అలంకరించబడిన దేవాలయాలలో ఒకటి.  చాళుక్య రాజు విక్రమాదిత్యుడు నిర్మించాడు, ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది, ఇక్కడ రెండు నదులు (తుంగ మరియు వరద) కలుస్తాయి.  ఈ సమ్మేళనం కారణంగా హిందువులు ఈ స్థలాన్ని గౌరవిస్తారు మరియు అలహాబాద్‌లోని త్రివేణి సంగమం వలె భావిస్తారు.


💠 కర్ణాటకలోని హవేరి జిల్లాలోని గలగేశ్వర దేవాలయం తూర్పు ముఖంగా ఉన్న శివాలయం మరియు శైవులకు చాలా ప్రత్యేకమైనది.  



💠 ఆలయం చుట్టూ మరియు నది ఒడ్డున దాదాపు 101 శివలింగాలు ఉన్నాయని నమ్ముతారు, వాటిలో కొన్ని నది వైపున ఉన్న కట్టపై చూడవచ్చు.

శివాలయంలో ఒక లింగం ఉంది, దీనిని స్పర్శ లింగం అని కూడా పిలుస్తారు


💠 గలగేశ్వర దేవాలయం గలగనాథ దేవాలయం అని కూడా పిలువబడుతుంది మరియు ఇది గతంలో పల్లుని అని పిలువబడే గలగనాథ్ అనే చిన్న గ్రామంలో ఉంది. 


💠 ఇది దాదాపు 11వ శతాబ్దంలో చాళుక్యుల పాలనలో నిర్మించబడింది.  

ఇది శిల్పాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో ఉత్కంఠభరితమైన శివాలయం.


💠 కాదంబరీ పితామహ అని కూడా పిలువబడే దివంగత శ్రీ వేంకటేష్ గలగనాథ్ ఇక్కడ శివుడిని పూజించినట్లు చెబుతారు.   ఆలయ ప్రాంగణంలో కూర్చొని తన పుస్తకాలు రాశాడని, అందుకే ఆ దేవుడికి గలగేశ్వర అని పేరు వచ్చిందని చెబుతారు.  

అందుకే పల్లుని నుండి గలగేశ్వర అని పేరు మార్చబడింది.


💠 ఈ ఆలయంలో చాళుక్యుల సంప్రదాయానికి విలక్షణమైన సాధారణ విస్తృతమైన నిర్మాణాలు, క్లిష్టమైన రాతి పని మరియు చెక్కడాలు ఉన్నాయి. 


💠 శాసనాలు చాళుక్య రాజవంశానికి చెందిన రాజు విక్రమాదిత్యుడు మరియు అతని ఆధ్వర్యంలో కళలు మరియు సంగీతం అభివృద్ధి చెందడం గురించి మనకు తెలియజేస్తాయి.


💠 సమీప విమానాశ్రయం బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది 360 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గలగనాథ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవేరిలో సమీప రైల్వే స్టేషన్ ఉంది.

ధ్యానసాధన

 రూపం లేని శ్వాస, ఆత్మ, జీవం, శూన్యం, కుండలిని, ఆత్మ ఇలా అన్ని రూపం లేని ఒకదానికొకటి సంబంధం లేనివి మరియు అన్ని ప్రతి మానవుడిలోనూ నిక్షిప్తమై ఉన్నాయి.   వీటన్నింటినీ అనుసంధానం చెసి వాటి యొక్క శక్తిసామర్థ్యాలను పొందే మార్గమే ధ్యానసాధన... 


ముందుగా జీవుడు ఒక ఆలోచనతో (మనసు)శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్యస్థితికి చేరుకొని కుండలినీశక్తిని ఉత్తేజం చేసుకుని ఆత్మశక్తిని పొందుతారు. శూన్య స్థితిలోనే అధ్భుతమైన ఆలోచనలు ద్వారా కావలసినవి అన్ని పొందుతారు... కోరికలు లేని మానవులు లేరు.. ఋషులు, యోగులు,గురువులు, మునులు చేసేవి చెప్పేవి ఏదో ఒక కొరికతోనే (సంకల్పం, ఒక ఆలోచన).. ఆశలు, దురాశలు కూడా ఏమి ఉండవు... మానవ జీవితాలు దుఃఖరహిత జీవితం కొరకు ఏదైనా కోరవచ్చు, పొందవచ్చు, చేయవచ్చు.

     ఆలోచనలు అద్భుతంగా ఉంటేనే జీవితాలు ఉన్నతంగా, ఆనందంగా కొనసాగుతాయి.. ఆలోచనలు అద్భుతంగా ఉండాలంటే చెడు కర్మల ద్వారా వచ్చిన సమస్యలు అడ్డంకులు, ఆటంకాలను కలుగజేస్తాయి.. దానికి దిశ, దశ బాగాలేదని ఉరుకులు పరుగులు మొదలు పెడతారు..



     ముందుగా అసలు సమస్యలు చెడు కర్మల ద్వారా వచ్చినవే... అందుకే ముందుగా సరైన సాధన ద్వారా చెడు కర్మలను దగ్ధం చేసుకుంటే చాలు అన్ని అద్భుతాలే.. నిత్యం,నిరంతరం ఆనందకర జీవితాలే... బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయాలి అని ఎవరికి వారు తమ తమ సబ్కాన్సియస్ మైండ్ కు చెప్పుకోండి చాలు... మిగతా పని మొత్తం సబీకాన్సియస్ మైండ్ చూసుకుంటుంది..

బ్రహ్మలోక ప్రాప్తి

 *బ్రహ్మలోక ప్రాప్తి ఎలా వస్తుంది...?*

    కర్మ మూడు విధాలుగా ఉంటుంది. సంచితకర్మ, ఆగామికర్మ, ప్రారబ్దకర్మ అని మూడురకాలు. ఆధికారిక పురుషులకు సంచిత, ఆగామికర్మలు లేవు. ప్రారబ్ధకర్మ మాత్రం ఉంటుంది. అదే బాధ్యతగా ఇవ్వబడిన కర్మ, బాధ్యత పూర్తికాగానే దేహంనుండి విముక్తి కలగటమే ఆలస్యం, మోక్షం లభిస్తుంది - బ్రహ్మత్వాన్ని పొందుతారు అని చెప్పబడింది.

ఉత్తరరామాయణంలో ఒక ఉదాహరణ కలదు - మరణించిన ఉపాసకునికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. వారు తిరిగి జన్మను పొందరు. దక్షిణాయంలో మరణించిన వారు పునర్జన్మను పొందుతారు అని చెప్పుకోవటం వున్నది. ఇది ఎంత వరకు సమంజసం? అంటే ఇది సామాన్య కర్మిష్ఠికే. జ్ఞానికి అట్లా కాదు. జ్ఞానికి మోక్షం కలుగుతుంది. అటువంటి సందర్భంలో భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎందుకు ప్రతీక్షించాడు? అంటే భీష్మునికి తండ్రియైన శంతనుడు - భీష్ముని త్యాగ

నిరతికి, నిష్టకు మెచ్చి ఒక వరమును ప్రసాదించాడు. ఆ వర ప్రభావం వలన స్వేచ్ఛా మరణమును పొందవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహత్యాగం చేసి ముక్తిని పొందవచ్చు. అందుచేత భీష్మునకు తన తండ్రి ఇచ్చిన వరం యొక్క శక్తిని లోకానికి వెల్లడించటానికి కొంత కాలం అంపశయ్యపై వుండి తాను చేయవలసిన బాధ్యత పూర్తియైనదని తలచిన తరువాత ఉత్తరాయణంలో దేహత్యాగం చేశాడు.


జ్ఞానులైన వారు ఉత్తరాయణంలో పోయినా దక్షిణాయణంలో పోయినా వారికి ముక్తి వుంది. ఉత్తరాయణ, దక్షిణాయన శబ్దాలను ఆధారంగా చేసుకొని ఉత్తరాయణంలో మరణించిన వారికి మోక్షమని దక్షిణాయణంలో మరణించిన వారికి లేదని భావించటం భ్రమ మాత్రమే. కాబట్టి జ్ఞానం అనేది మాత్రమే మోక్షమును నిశ్చయంగా పాంద కలిగేటట్లు చేస్తుంది. అలా భావన చేస్తూ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించి భగవత్పాదులు రచించిన భాష్యగ్రంధాలను శ్రవణమననాదులు చేసి జ్ఞాన సముపార్జన చేయవలెను.


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు*

ఆన్వేషణ

 *దైవ ఆన్వేషణ*

                   

ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు,

అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు...

కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు, ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు...

*అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది...*

*స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉంటాడు? అని అడిగాడు...*

అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ..నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన... అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు...

అది వృక్షం...

ఓహో వృక్షమా! ఎలా వచ్చింది?

విత్తనం ద్వార వచ్చింది స్వామి

సరే అక్కడ పలుగు ఉంది. 

తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.

ఎందుకు స్వామి? మహావృక్షం కదా! త్రవ్వితే చచ్చిపోతుంది,

చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందొ చూడాలని ఉంది...

అయ్యో స్వామి! అదెలా సాధ్యం అవుతుంది?

విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు విత్తనం చూడలేమా?

విత్తనమే చెట్టు...

చెట్టుకి విత్తనానికి తేడా లేదు, విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా!!!

ఇదే నాయన నీ సందేహానికి సమాధానం...

అదెలా స్వామి?

విత్తనం అనేది పరమాత్మ

ఆ పరమాత్మే వృక్షం. 

అనగా సృష్టి , సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు, ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు...

సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము...

*మరి విగ్రహారాధన ఎందుకు స్వామి?*

పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి... సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు? ఏమి అర్థం కాదు.ఆదిత్యయోగీ..

అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. 

ధ్యానం నిలబడుతుంది, అంతేతప్ప శూన్యం లోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. 

అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. 

కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు, అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు, సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.

సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. 

భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. 

ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు, సాధ్యం కాదు, అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. 

అది ఒక మార్గం, దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు...

*స్వామి! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు?*

భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు...

 ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు, మరొకడు గుడి కట్టాడు. 

మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు, మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. 

భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం...

 పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు, ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు.

దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు, తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు….

.


పుట్టిన ప్రతిజీవి యొక్క శరీరము మార్పుచెందుతూ తుదకు నశిస్తుంది. మార్పుచెందనిది, శాశ్వతమైనది, ఆత్మ మాత్రమే. ఈ నిత్యసత్యమైన ఆత్మ ప్రతిజీవిలో నెలకొనివుంది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమే.


అన్ని జీవరాసులలో కెల్లా మనిషి సహజంగా అత్యంత జ్ఞానసంపన్నుడు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని సమన్వయ పరుచుకొని ఆత్మజ్ఞానంతో ఎంతో ఆనందంగా జీవించే తెలివికలవాడు. అలాగే అంతర్గత శత్రువులను రూపుమాపలేకా, వాటిని నేర్పుతో సమన్వయ పరుచుకోలేక తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవితాన్ని కష్టాలపాలు చేసుకునే తెలివితక్కువ వాడు కూడా మనిషే.


పరమాత్మ ప్రసాదంగా తనకు లభించిన జ్ఞానాన్ని, తనలో నెలకొనివున్న ఆత్మను తెలుసుకొనే సాధన చెయ్యడమే ఆధ్యాత్మికము.ఆదిత్యయోగీ..


స్వయంభువుగా (తనంతట తానుగా) వ్యక్తమై, తననుండి పంచమహాభూతములను (ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి) సృష్టించి, వాటి సమ్మేళనంతో ప్రాణరూపమును దాల్చి, మొదటిగా పరమేష్ఠిని జనింపజేసి, తద్వారా సకల జీవకోటిని ఉద్భవింపజేసి, విశ్వమును విస్తరించి, అవసరమగు స్థితిని కల్పించి, మరలా సమస్తమును తనలో లయం చేసుకుంటూ, అన్నింటికీ ఆధ్యునిగా, ఎల్లప్పుడూ సచ్చిదానందస్వరూపంతో వెలుగొందే సర్వశ్రేష్ఠుడు ఆ పరమాత్మ...


ఉపనిషత్తులు “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ!” అని పరమాత్మను వర్ణించేయి. అంటే అంతటా, అన్నింటా వ్యాపించియున్న ఆత్మస్వరూపము “నిజమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది” అన్నమాట! అంటే దానిని గ్రహిస్తే, ఇక గ్రహించవలసినది ఏమీ వుండడని భావము! ఆదిత్యయోగీ..


ఏ భావంతో సాధన చేస్తామో అదే సిద్ధిస్తుందని, అటువంటి శక్తిని జీవునికి ఆ పరమాత్మ ప్రసాదించేడని, కాబట్టి తత్వసాధనకు మనోభావన స్వచ్ఛమైనదిగా వుండాలని, ఈ భావమే బాహ్యకర్మలుగా వ్యక్తమౌతుందని, అందుకే జీవుడు ముందుగా మనస్సును తన ఆధీనంలోకి తెచ్చుకునే సాధన చెయ్యాలని భగవద్గీత బోధించింది.


ఎచ్చటనుండి జీవుడు వచ్చేడో, అక్కడికి చేరుకోవలసిందే! కారణం పరమాత్మే జీవాత్మగా ఒక ఉపాధిని కల్పించుకొని వ్యక్తమయ్యేడు! అదే జీవాత్మ అసలు స్వరూపము!


ఈ ధరణిలో జీవమునకు సరివాడే వాతావరణాన్ని ఋతువులతో కల్పించి, జీవులన్నింటినీ తన అంశగా సృష్టించి, వాటిలో నివాసముంటూ, వాటికి జ్ఞానాన్ని ప్రసాదించి, మనుగడకోసం వాటితో కర్మలు చేయిస్తూ, మృత్యురూపమున వాటికి విశ్రాంతిని కలుగజేస్తూ, మరల వాటి కర్మానుసారం పునర్జన్మను ప్రసాదిస్తూ, ఈ సత్యమును గ్రహించినవారికి మనోహరమైన ఆత్మదర్శనాన్ని కలుగజేస్తూ, ధర్మపరిరక్షణకై అప్పుడప్పుడు ఉగ్రరూపం దాలుస్తూ ఎంతో దక్షతతో విశ్వాన్ని నడిపించే జగన్నాధుడతడు!..


సత్యమైన బ్రహ్మమే అన్ని జడ-జీవ పదార్ధాలలో వ్యాపించివుంది. వీటి పరస్పర సంబంధమే ఈ సృష్టి. దీని వెనుకనున్న పరతత్వాన్ని శోధించి ఉపనిషత్తుల ద్వారా మనకు అందించారు ఎందరో తపఃసంపన్నులు. అన్ని ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భవ్య భగవద్గీతలో పేర్కొన్న పరమాత్మ విభూతిని విష్ణు సహస్రనామ స్తోత్రంగా మనకు అందించేడు భీష్ముడు.ఆదిత్యయోగీ..


సత్యమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది ఏదైతేవుందో దానికే భగవంతుడని, పరమాత్మయని పేరుపెట్టారు. ప్రతీ జడజీవ పదార్ధము పరమాత్ముని స్వరూపంగా వర్ణించేరు. పరమాత్మనుండి బయటపడి మళ్ళీ పరమాత్మలోనే ఐక్యమయ్యేదే సృష్టి అని పేర్కొనటం జరిగింది.


స్థాణువుగా ఒకేచోటయుంటూ, సచ్చిదానందస్వరూపునిగా, అన్ని ప్రమాణములతో విశ్వమంతటా వ్యాపించి, క్షయములేని బీజరూపంలో జీవులుగా వ్యక్తమై, అన్నమయాది పంచకోశములుగా వాటి దేహములను ఆవరించి, కర్మ-జ్ఞానాలుగా అష్టైశ్వర్యరూపేణ వాటి మనుగడకు దోహదపడుతూ, అందరిచే ఆశింపబడుతూ, తానుమాత్రం వైరాగ్యంతో దేనిని ఆశింపకా, సాక్షీభూతంగా అన్నింటినీ గమనించే విశ్వాత్ముడే ఆ పరమాత్మ!..

.


*'జ్ఞానము'*  అంటే మననము, చింతన, నిర్మలమైన విచక్షణ తప్ప ఇంకేమీ కాదు. వివిధ వస్తువుల, విషయాల మధ్య గల తారతమ్యాన్ని చూపించుట. అభిప్రాయ బేదములకు హద్దులు గీయుట. వివాదంశములనూ, లేదా విశేషాంశములను నిర్ధారించుట - ఈ *జ్ఞానమే కేవలం మనసు యొక్క సహజ తత్వము. *'వివేకము'* అంటే విచక్షణ, *అంటే మంచి చెడ్డలను నిర్దించుకునే శక్తి. రెండు వేరువేరు స్థితుల మధ్య మనస్సు నిలిచినప్పుడు, దానిలో ఆలోచనలు స్పందిస్తాయి. ఈ రెండు విభిన్న స్థితుల కలయిక (*నచ్చిన భావాలను కలుపుట*), వ్యత్యాసాల (*నచ్చని భావాలను వేరుపరచుట*), *నడుమనున్న పరిధిలోనే ఆలోచన స్థానం ఉంటుంది.* 

*ఆ పరిధి పైననే, అందులోనే నిలచి, మనస్సు *'జ్ఞాని'* *యొక్క లక్షణము ఆలోచించడము.....*

.

64 కళల పేర్లు

 64 కళల పేర్లు ఏంటో మీకు తెలుసా?


1. ఇతిహాసము


2. ఆగమనము


3. కాద్యము


4. అలంకారము


5. నాటకము


6. గాయకము


7. కవిత్వము


8. కామశాస్త్రము


9. దురోదరము


10. దేశభాష లిపిజ్ఞానము


11. లిపికర్మము


12.వాచకము


13. అవధానము


14. సర్వశాస్త్రము


15. శాకునము


16. సాముద్రికము


26. జలవాదము


51. దారుక్రియ


27. అగ్ని స్తంబము


52. వేణు క్రియ


28. ఖడ్గ స్తంబము


53. చర్మ క్రియ


29. వాక్ స్తంబము


54. అంబరక్రియ.


30.వాయి స్తంబము


31.వశ్యము


55. ఆదృశ్య కరణము


56.దుతే కరణము


32. ఆకర్షణము


57. వాణిజ్యము


33. మోహనము


34. విద్వేషణము


35. ఉచ్ఛాటనము


36. మారణము


37.కాలవంచము


38. పరకామ ప్రవేశము


39.పాదుకాసిద్ది


40. వాక్సిద్ది


41. ఇంద్రజాలికము


58. పాశుపల్యము


59.క్రుషి


60. అసవకర్మం


61. ప్రాణిదూత్య కౌశలము


62. జలస్తంబము


63. మంత్రసిద్ది


64. ఔషధసిద్ది


17. రత్యశాస్త్రము


42. అంజనము


18. రధాశ్వ గజకౌశలము


43. దృష్టి వంచనము


19. మల్లశాస్త్రము


44. సర్వ వంచనము


45.మణి సిద్ది


46. చోరకర్మం


20. సూదకర్మము


21. దోహదము


22. గంధవాదము


23. ధాతువాదము


24. ఖనివాదము


25. రసవాదము


47. చిత్ర క్రియ


48. లోహ క్రియ


49. అశ్వ క్రియ


50. మృత్రియ

స్త్రీమూర్తుల వైశిష్ట్యం

 *స్త్రీమూర్తుల వైశిష్ట్యం - ప్రభావం!*

    

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ ఆదర్శవంతంగా ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనంగా కాలానికి అతీతంగా నిలిచారు అంటే అది వారి గొప్పతనం కానేకాదు. అలా బ్రతకగలిగేలా అవకాశమిచ్చిన వారి భార్యలు - సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అనే స్త్రీమూర్తులే. వారి సహాయ సహకారాలందించడం వలననే రామ లక్ష్మణ భరత శతృఘ్నులు అలా సఖ్యతతో ఉండడానికి ప్రధానకారణం.  


కానీ ప్రస్తుత సమాజంలో అన్న దమ్ములు పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని, సంతోషంగా చిన్నప్పు డెంత ప్రేమగా మెలిగారో అలా  కలిసిమెలసి ఇప్పుడు మెలగ గలరా? 


గృహస్తాశ్రమం స్వీకరించిన పిదప క్రమేపీ బహు కుటుంబాలలో అన్నయ్య ఇంటికి తమ్ము డెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య రాడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరికే సొంతం కదా. 


అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కలేసు కున్నా ఈ శరీరం ఉండగా యెన్ని సార్లు తమ్ము డింటికి లేదా అన్న ఇంటికి వెళ్ళగలరు. ఈ మాత్రం దానికి ఎందుకు కొట్టుకుంటున్నారు? నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా? పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి?


ఈ పరిస్థితులకు కుటుంబంలోకి వచ్చిన స్త్రీమూర్తులు వారి పుట్టినింటివారి ప్రభావం ప్రబలంగా వుంటుందనేది నిర్వివాదాంశం.

స్త్రీమూర్తులు తాము ఎంత శక్తిమంతులో స్వయంగా తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలు సుకున్న తరువాత తన కుటుంబం కోసం స్వలాభాపేక్ష త్యజించి సహాయ సహకారాలందిం

చడం మరో ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు సమిష్టి కుటుంబాలు లేదా దాయాది కుటుంబాలు పది కాలాలు ప్రశాంతంగా జీవనం చేసే అవకాశం కలుగుతుంది.

అమావాస్య వటసావిత్రి వ్రతం :

 అమావాస్య వటసావిత్రి వ్రతం :


మన సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సృష్టిలో అణువణువులో భగవత్ చైతన్యాన్ని దర్శించడం మన సంప్రదాయ ప్రత్యేకత. సమస్త వృక్ష , జీవరాశిని భగవంతుని అంశంగా పూజించడం అనాదిగా కొనసాగుతోంది. మనలో ప్రాణశక్తిగా ప్రవహించే జీవత్వానికి దైవ స్పర్శ ప్రధాన అంశం. ఆ ప్రాణశక్తి చెట్లు, మొక్కల ద్వారా లభిస్తుందని నమ్ముతారు. అందుకే మనవారు వృక్షాలను పూజిస్తారు. వటవృక్షమంటే మర్రిచెట్టు. ఈ వటవృక్ష మూలంలో ఆదిగురువైన దక్షిణామూర్తి నెలకొని ఉంటాడు. ఊడలతో విస్తరించి పెరిగే మర్రిచెట్టు సుదీర్ఘకాలం జీవిస్తుంది. అందుకే మనవారు దీనిని దీర్ఘాయుష్షుకు ప్రతీకగా తీసుకున్నారు. యమునితో పోరాడి భర్తప్రాణాలను దక్కించుకున్న సావిత్రి కథను మర్రిచెట్టుతో ముడిపెట్టారు. ప్రయాగకు సమీపంలో ఒక మర్రిచెట్టు ఉంది. ప్రళయ వేళలో వటపత్ర శాయియై విష్ణువు ఆ మర్రిచెట్టు ఆకుపైనే పవళిస్తాడని ప్రతీతి.

జ్యేష్ఠ అమావాస్య

 జ్యేష్ఠ అమావాస్య : హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య రోజున ఇష్టదైవారాధన, సావిత్రి వ్రత పూజలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ అమావాస్య రోజున చాలా మంది ఉపవాసం ఉండటం.. దానం చేయడం.. దేవుళ్లకు పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి కుండలో వేసి సూర్య భగవానుడికి అర్పించాలి. పేదలకు దానం చేయాలి. జ్యేష్ఠ అమావాస్య రోజున మాంసాహారం తీసుకోవడం మరియు మద్యం సేవించడం వంటివి చేయకూడదు. ఈరోజున ఎవ్వరి నుండి డబ్బులు తీసుకోకూడదు. ఈరోజున కొత్త వస్తువులు కూడా కొనడం వంటివి చేయకూడదు. ఈ పవిత్రమైన రోజున గోమాత, శునకం మరియు కాకికి ఆహారం ఇవ్వాలి. ఈరోజున పూర్వీకులను పూజించాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

జీవితమంతా నిత్య సమరమే

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 ఆయన జీవితమంతా నిత్య సమరమే. ఒక అతి సాధారణ కుటుంబంలోంచి వచ్చి, స్కూలు చదువు దాటకపోయినా 

 స్వయం కృషితో సాహిత్యాన్ని ఔపోసన పట్టి, సమకాలీన సాహితీ వేత్తలందరినీ దాటుకుంటూ అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారంటే ఆ మనిషిని ఋషి కాక ఏమి అనగలం! పాకుడురాళ్ళు వంటి గొప్ప నవలను అందించిన రావూరి భరద్వాజ 97వ జయంతి సందర్భంగా ఆ విశేషాలు  అందించారు ప్రముఖ సాహితీవేత్త డా. టి. గౌరీశంకర్ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఔషధాల విభజన -

 ఆయుర్వేదం నందు ఔషధాల విభజన -


         ఆయుర్వేదం నందు కొన్ని రకాల ఔషధాలు శరీరం పైన అనేకరకాలుగా పనిచేయును . సాధారణంగా ఆయుర్వేద గ్రంథాలలో వాటి గురించి క్లుప్తంగా వివరిస్తారు. చరక మహర్షి వంటివారు అక్కడక్కడ కొంత వివరణ ఇచ్చారు . ఆయన ఔషధాలు పనిచేయు విధానాన్నిబట్టి యాభై గణాలుగా వర్గీకరించారు. 


           అటువంటి వర్గీకరణలు అందరికి అర్ధమయ్యేవిధముగా మీకు తెలియచేస్తాను.


 ఔషధ వర్గీకరణలు -


 * జీవనీయము -


           జీవమును వృద్ధిచెందించునవి.


 * బృoహ్మణీయము - 


           శరీరమును వృద్ధిపరచునవి.


 * లేఖనీయము - 


          శరీరం నందు వ్యర్ధపదార్ధాలను నివారించునవి.


 * బేధనీయము -


          గడ్డకట్టుకు పోయిన మలాదులు వంటి వ్యర్దాలను విడగొట్టునవి.


 * సంధానీయము -


          విడిపోయిన అవయవాలను అతుక్కొనే విధముగా చేయునవి .


 * దీపనీయము -


          జఠరాగ్నిని వృద్దిచెందించునవి .


 * బలీయము -


         బలమును వృద్దిచెందించునవి .


 * వర్ణ్యము - 


          శరీరముకు కాంతిని కలిగించునవి.


 * కంఠ్యము -


         కంఠమునకు మేలుచేయునవి .


 * హృద్యము -


         హృదయమునకు మేలుచేయునవి .


 * తృప్తిఘ్నము -


         శరీరంలో శ్లేష్మం వలన కలుగు వికారాలను నివారించునది.


 * ఆర్షోఘ్నము -


          మూలవ్యాధిని హరించునవి.


 * కుష్ఠఘ్నము -


          కుష్ఠు వ్యాధిని హరించునది.


 * కండుఘ్నము -


          దురదని హరించునది.


 * క్రిమిఘ్నము -


          క్రిములను నశింపచేయునది .


 * విషఘ్నము -


          విషాదోషములను హరించునది.


 * స్తన్యజననము -


          స్తన్యమును కలిగించునది.


 * స్తన్య శోధనము -


           స్తన్యమును శుభ్రపరచినది.


 * శుక్ర జననము -


           శుక్రమును అనగా వీర్యమును పుట్టించునది.


 * శుక్ర శోధనము -


          శుక్రమును శుద్ధిచేయునది .


 * స్నేహోపగము - 


          తైలకర్మకు ఉపయోగించునది .


 * స్వేదోపగము -


         స్వేదకర్మ యందు ఉపయోగపడునది.


 * వమనోపగము -


         వమనకర్మ అనగా వాంతి చేయుటకు ఉపయోగపడునది .


 * విరేచనోపగము -


         విరేచనం చేయుటకు ఉపయోగపడునది .


 * ఆస్థానోపగము -


         వస్తికర్మ యందు ఉపయోగించబడునది .


 * అనువాసనోపగము -


         అనువాసనవ వస్తికర్మకు ఉపయోగపడునది .


 * శిరోవిరేచనము -


          దగ్గును హరించునది.


 * ఛర్ధి నిగ్రహము -


         శ్వాస కర్మ యందు ఉపయోగించునది .


 * తృష్ణనిగ్రహము -


          తృష్ణ కర్మ యందు ఉపయోగించతగినది.


 * హిక్కా నిగ్రహము -


         వెక్కిళ్ళను పోగొట్టునది.


 * పురీష సంగ్రహాణీయము -


         మలమును గట్టిపరుచునది.


 * పురీషవిరజనీయము -


         మలాశయం నందలి దోషములను నివారించునది .


 * మూత్రసంగ్రహనీయము -


          మూత్రమును ఆపునది.


 * ముత్ర విరజీయనీయము -


        మూత్రదోషములను పోగుట్టునది.


 * మూత్రవిరేచనము -


        మూత్రమును విడుదల చేయునది .


 * కాసహరము - 


         దగ్గును పోగొట్టునది .


 * శ్వాసహరము -


        శ్వాసను హరించునది .


 * శోథ హరము -


       వాపును నాశనం చేయునది .


 * జ్వర హరము -


       జ్వరములను పోగొట్టునది .


 * శ్రమ హరము -


       శరీరం అలసటను పోగొట్టునది .


 * దాహ ప్రశమనము -


        తాపమును హరించునది.


 * దాహప్రశమనము -


        తాపమును హరించునది.


 * శీత ప్రశమనము -


       శీతమును నివారించునది.


 * ఉదార్ధ ప్రశమనము -


       శరీరం పైన ఎర్రని దద్దుర్లను నివారించునవి.


 * అంగమర్ద ప్రశమనము -


        బడలిక నొప్పులను పోగొట్టునది .


 * శూల ప్రశమనము -


        శూలను హరించునది.


 * శోణిత స్థాపనము -


        రక్తమును నిలుపునది .


 * వేదనాస్థాపనము -


        భాధను తొలగించునది .


 * సంజ్ఞా స్థాపనము -


       స్మృతిని కలుగచేయునది అనగా మూర్ఛపోయిన వారికి తెలివితెప్పించునది .


 * ప్రజాస్థాపనము -


       సంతానమును కలిగించునది.


 * వయస్దాపనము -


       వయస్సును స్థాపించునది . అనగా వయస్సును నిలుపునవి.


        పైన చెప్పినటువంటి పద గణములు అన్నియు తరచుగా ఆయుర్వేద గ్రంథాలలో తరచుగా వినిపించును. కావున వీటిపైన అవగాహన కలిగి ఉండవలెను .


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

స్త్రీ_వైశిష్ట్యం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *స్త్రీ_వైశిష్ట్యం!*

             ➖➖➖✍️


55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరి తోటే కదా..!


55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే.. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో...! అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్ది సార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు?


అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ  సంతోషంగా కలిసి మెలగలేరా..? 

నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ?


రాముడు పుష్పక విమానం లోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే...   విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు... “నా అన్న రావణుడు కూడా మహానుభావుడు.. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు.. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడ లాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర కూచుని ‘అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడీ.?  అన్నయ్యా! చెప్పులేసుకో! అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడీ..? చంపించేసాను.” అని తలచుకుని ఆవేదన చెందాడు.


సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. “నా అన్న వాలి. ఎదుటి వారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడి తోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను... అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి”    అని వేదనా భరితుడయినాడు.


రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు. అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి, బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు.


”మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు... అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు, వెడుతున్నాడు... మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది..                14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?”అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా..! 


అడగలేదు... అంటే ఆయన ధర్మాత్ముడు...  అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి.. ?”  అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు.


ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం.


స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు.., అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు..!


అది ఆచరణాత్మకమైన నాడు పది మంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది.✍️


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జూలై 05, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌹 *శుక్రవారం*🌹

  🪷 *జూలై 05, 2024*🪷

     *దృగ్గణిత పంచాంగం*                 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి  : అమావాస్య* రా 04.26 తె వరకు *ఆషాఢ మాసం ప్రా 𝕝𝕝*

వారం :*శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : ఆరుద్ర* (06) తె 04.06 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : ధృవ* రా 03.49 తె వరకు ఉపరి *వ్యాఘాత* 

*కరణం : చతుష్పాద* సా 04.38 *నాగ* రా 04.26 తె వరకు

*సాధారణ శుభ సమయాలు* 

         *—ఈరోజు లేవు—*

అమృత కాలం :*సా 06.01 - 07.38*

అభిజిత్ కాలం :*ప 11.46 - 12.38*

*వర్జ్యం : మ 12.23 - 01.59*

*దుర్ముహుర్తం : ఉ 08.17 - 09.09 మ 12.38 - 01.31* 

*రాహు కాలం : ఉ 10.34 - 12.12*

గుళిక కాలం :*ఉ 07.18 - 08.56*

యమ గండం :*మ 03.28 - 05.06*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.40* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.40 - 08.17*

సంగవ కాలం :*08.17 - 10.54*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ అమావాస్య*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.56* 

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🌹


*రక్షత్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే /*

*దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి //*


*సమస్త్రైలోక్య జననీ నమస్తుభ్యం జగద్దితే /*

*అర్తిహంత్రి నమస్తుభ్యం సమృద్దిం కురు మే సదా //*


*అబ్జవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః /*

*చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః //*


*నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః /*

*పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ //*


*శరణ్యే త్వాం ప్రసన్నో2స్మి కమలే కమలాలయే /*

*త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే //*


🪷 *ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః*🌹


           🌷 *సేకరణ*🌷

        🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

Gotram


 

నిజమైన స్నేహితుడు.

 శ్లోకం:☝️

*ఆపత్కాలే తు సమ్ప్రాప్తే*

 *యన్మిత్రం మిత్రమేవ తత్ ।*

*వృద్ధికాలే తు సమ్ప్రాప్తే*

 *దుర్జనోఽపి సుహృద్భవవేత్ ॥*

(పఞ్చతంత్రం, మిత్రసంప్రాప్తిః)


భావం: సుఖంగా ఉన్నప్పుడు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పుడు దుష్టులతో సహా అందరూ స్నేహంగానే ఉంటారు. కాని కష్టకాలంలో కూడా స్నేహంగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు.

యుగానుసారం

 🌷 *యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు🌷* 


కృతయుగం – మనుస్మృతి

త్రేతాయుగంలో – గౌతమ స్మృతి

ద్వాపరంలో – శంఖు స్మృతి

కలియుగం – పరాశర స్మృతి


ఇవీ యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు ( ధర్మ స్మృతులు )


ఏరోజైతే భగవంతుని గురించిన ఙ్ఞానం తెలుసుకోవాలనే తపన మనలో మొదలైతే ఆ కృష్ణపరమాత్ముడు తప్పకుండా తగు ఏర్పాట్లు చేస్తాడు అది ఏవిధమైన ఏర్పాటైనా కావొచ్చు !! అందుకే అంటారు మనం భగవంతుని వైపు ఒక అడుగు ముందుకేస్తే ఆయన పదడుగులు వేయడానికి ఏమాత్రం సంకోచించడు పైగా ఎంతో ఆదుర్దగా వస్తాడు !! ఉదా: శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం


*******************************************


పరాశర స్మృతి


ధర్మశాస్త్రాలు(స్మృతులు) అన్ని యుగాలకి ఒకే స్మృతి నిర్దేశంచబడలేదు.!! ఆ వివరాలు పరాశర మహర్షి విరచిత “పరాశర స్మృతి” లో వివరించారు


సత్య (కృత) యుగం – మనుస్మృతి

త్రేతా యుగం – గౌతమ స్మృతి

ద్వాపర యుగం – శంఖ స్మృతి

కలియుగం – పరాశర స్మృతి

కావున కలియుగానికి అనుసరణీయమైన ధర్మ శాస్త్రం “పరాశర స్మృతి”


ఇంకా పరాశర స్మృతిలో ఏయే యుగంలో ధర్మాచరణ ఏయే విధంగా జరగాలో ఈ కింది విధంగా వివరించబడింది


“తపః పరం కృతయుగే

త్రేతాయాం ఙ్ఞానముచ్యతే

ద్వాపరే యఙ్ఞమిత్యుహ

దానమేకం కలౌ యుగే” అనగా


కృతయుగం – తపస్సు చేయడం

త్రేతాయుగం – ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని పొందడం

ద్వాపరయుగం – యఙ్ఞ, యాగాదులు చేయడం

కలియుగం – భగవత్సంబంధిత కార్యాలకై దాన దర్మాలు చేయడం


ఇంకా దానం కూడా ఏయే యుగాలలో ఏయే విధంగా చేసేవారో కూడా పరాశర స్మృతి వివరిస్తుంది


కృత యుగం – దాత (donar) దాన గ్రహీత అందుకు అర్హుడేనా అని విచారించి

త్రేతాయుగం – దాత దానగ్గహీతను అభ్యర్థించి (request)

ద్వాపర యుగం – దాన గ్రహీత కోరినది దానం చేయడం

కలియుగం – ప్రత్యక్షంగా సహాయం చేయలేని పక్షంలో బదులుగా ద్రవ్య రూపకంగా

(charities are provided in the lieu of service rendered)


*****************************************

విష్ణు పురాణం


పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి బోధించిన పురాణమే “విష్ణు పురాణం”

వీరు సాక్షాత్తు వేద వ్యాసుల వారికి తండ్రి గారు మరియు శక్తి మహర్షి పుతృడు మరియు వసిష్ఠుల వారి పౌతృడు ( మనుమడు)

*******************************************


హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ

పై శ్లోకము కృష్ణయజుర్వేదాంతర్గత కలిసంతరణ ఉపనిషత్ లోనిది

కవితా మందారాలు!

 శు  భో  ద  యం🙏


పోతనగారి కవితా మందారాలు!!


మందార మకరంద...


మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు

రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు

కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక

మరుగునే సాంద్ర నీహారములకు


అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!

వినుత గుణశీల, మాటలు వేయునేల?


పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!

కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!


పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).


అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!

ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రామాయణాన్ని

 🌷 జై శ్రీ రామ్ 🌷


           రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థం బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ. సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహం లంకా నగరం. ఈ లంకాద్వీపమనే దేహంలో బంధింపబడిన సీతమ్మ అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంటుంది.


కాని రాక్షసులు దానిని జరుగనీయరు. రాక్షసులు అంటే మానవునిలోని రజో, తమో గుణాలు. ఈ రజో, తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచాయి. అలా బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతమ్మ వద్దకు హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపు మాపే బ్రహ్మజ్ఞానమే ఆ అంగుళీయకం.


ఈ విధంగా శ్రీరాముని చేరడానికి సీతమ్మకు మార్గమేర్పడుతుంది. అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది...


🙏 జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ 

🙏

05.07.2024 వారం:శుక్రవారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

05.07.2024

వారం:శుక్రవారం 

(భృగువాసరే)


*🐄 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి 🐄*




ఈరోజు జ్యేష్ట అమావాస్య ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట మాసంలోని అమావాస్య తేదీ ఈరోజు ఉదయం 04:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 05:29 గంటలకు ఉంటుంది. అమావాస్య తిథి రేపు 6వ తేదీ తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది. రేపు 6 న అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ముగుస్తుంది. కనుక ఈ రోజు శుక్రవారం  జ్యేష్ట అమావాస్య.


 *రేపటి నుంచి వారాహీ అమ్మవారి నవరాత్రులు*

*06.07.2024, (శనివారం) నుండి 15.07.2024  ( సోమవారం )వరకు..* 


ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటూ వారాహీ నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నరవాత్రులు, మాఘ గుప్త నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాడమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిదిరోజుల పాటూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు..ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు..


వారాహి దేవి రూపం ఇంచు మించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘ వర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశము, హలము, వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. 


ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహా పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది...


వారాహి మాతను నేపాల్‌లో బరాహి అంటారు రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఆమెను దండినిగా కొలుస్తారు. హిందూ దేవతైన వారాహి మాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్రవరాహి, మరీచిలో ఉన్నాయి. వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు. ఇది సెల్టిక్‌, జపనీస్‌, చైనీస్‌, గ్రీక్‌, అమెరికన్‌, ఇండియన్‌, ఈజిప్షియన్‌ సంస్కృతులలో కూడా ఉన్నది. చైనాలో వరాహం అటవీ సంపదను సూచిస్తుంది. జపాన్‌లో వరాహం ధైర్యానికి ప్రతీక. మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహి మాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా చూస్తారు. వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించటం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు...

బక జపమాచరించుటయె

 *బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్*

ఈ సమస్యకు నాపూరణ. 


సకలము నాదిదేవుడగు సాంబుడు కోరినవెల్ల నిచ్చుచున్


నికటము నుండు ధైర్యమిడు నిత్యము తాండవ కేళి దేలుచున్


ప్రకటితమైన యంశమిది ప్రాజ్ఞులు చూపిన బాటలో త్రయం


బక జపమాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్.


(నికటము= సామీప్యము) 


అల్వాల లక్ష్మణ మూర్తి.