రూపం లేని శ్వాస, ఆత్మ, జీవం, శూన్యం, కుండలిని, ఆత్మ ఇలా అన్ని రూపం లేని ఒకదానికొకటి సంబంధం లేనివి మరియు అన్ని ప్రతి మానవుడిలోనూ నిక్షిప్తమై ఉన్నాయి. వీటన్నింటినీ అనుసంధానం చెసి వాటి యొక్క శక్తిసామర్థ్యాలను పొందే మార్గమే ధ్యానసాధన...
ముందుగా జీవుడు ఒక ఆలోచనతో (మనసు)శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్యస్థితికి చేరుకొని కుండలినీశక్తిని ఉత్తేజం చేసుకుని ఆత్మశక్తిని పొందుతారు. శూన్య స్థితిలోనే అధ్భుతమైన ఆలోచనలు ద్వారా కావలసినవి అన్ని పొందుతారు... కోరికలు లేని మానవులు లేరు.. ఋషులు, యోగులు,గురువులు, మునులు చేసేవి చెప్పేవి ఏదో ఒక కొరికతోనే (సంకల్పం, ఒక ఆలోచన).. ఆశలు, దురాశలు కూడా ఏమి ఉండవు... మానవ జీవితాలు దుఃఖరహిత జీవితం కొరకు ఏదైనా కోరవచ్చు, పొందవచ్చు, చేయవచ్చు.
ఆలోచనలు అద్భుతంగా ఉంటేనే జీవితాలు ఉన్నతంగా, ఆనందంగా కొనసాగుతాయి.. ఆలోచనలు అద్భుతంగా ఉండాలంటే చెడు కర్మల ద్వారా వచ్చిన సమస్యలు అడ్డంకులు, ఆటంకాలను కలుగజేస్తాయి.. దానికి దిశ, దశ బాగాలేదని ఉరుకులు పరుగులు మొదలు పెడతారు..
ముందుగా అసలు సమస్యలు చెడు కర్మల ద్వారా వచ్చినవే... అందుకే ముందుగా సరైన సాధన ద్వారా చెడు కర్మలను దగ్ధం చేసుకుంటే చాలు అన్ని అద్భుతాలే.. నిత్యం,నిరంతరం ఆనందకర జీవితాలే... బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయాలి అని ఎవరికి వారు తమ తమ సబ్కాన్సియస్ మైండ్ కు చెప్పుకోండి చాలు... మిగతా పని మొత్తం సబీకాన్సియస్ మైండ్ చూసుకుంటుంది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి