జ్యేష్ఠ అమావాస్య : హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య రోజున ఇష్టదైవారాధన, సావిత్రి వ్రత పూజలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ అమావాస్య రోజున చాలా మంది ఉపవాసం ఉండటం.. దానం చేయడం.. దేవుళ్లకు పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి కుండలో వేసి సూర్య భగవానుడికి అర్పించాలి. పేదలకు దానం చేయాలి. జ్యేష్ఠ అమావాస్య రోజున మాంసాహారం తీసుకోవడం మరియు మద్యం సేవించడం వంటివి చేయకూడదు. ఈరోజున ఎవ్వరి నుండి డబ్బులు తీసుకోకూడదు. ఈరోజున కొత్త వస్తువులు కూడా కొనడం వంటివి చేయకూడదు. ఈ పవిత్రమైన రోజున గోమాత, శునకం మరియు కాకికి ఆహారం ఇవ్వాలి. ఈరోజున పూర్వీకులను పూజించాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి