*స్త్రీమూర్తుల వైశిష్ట్యం - ప్రభావం!*
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ ఆదర్శవంతంగా ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనంగా కాలానికి అతీతంగా నిలిచారు అంటే అది వారి గొప్పతనం కానేకాదు. అలా బ్రతకగలిగేలా అవకాశమిచ్చిన వారి భార్యలు - సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అనే స్త్రీమూర్తులే. వారి సహాయ సహకారాలందించడం వలననే రామ లక్ష్మణ భరత శతృఘ్నులు అలా సఖ్యతతో ఉండడానికి ప్రధానకారణం.
కానీ ప్రస్తుత సమాజంలో అన్న దమ్ములు పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని, సంతోషంగా చిన్నప్పు డెంత ప్రేమగా మెలిగారో అలా కలిసిమెలసి ఇప్పుడు మెలగ గలరా?
గృహస్తాశ్రమం స్వీకరించిన పిదప క్రమేపీ బహు కుటుంబాలలో అన్నయ్య ఇంటికి తమ్ము డెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య రాడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరికే సొంతం కదా.
అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కలేసు కున్నా ఈ శరీరం ఉండగా యెన్ని సార్లు తమ్ము డింటికి లేదా అన్న ఇంటికి వెళ్ళగలరు. ఈ మాత్రం దానికి ఎందుకు కొట్టుకుంటున్నారు? నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా? పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి?
ఈ పరిస్థితులకు కుటుంబంలోకి వచ్చిన స్త్రీమూర్తులు వారి పుట్టినింటివారి ప్రభావం ప్రబలంగా వుంటుందనేది నిర్వివాదాంశం.
స్త్రీమూర్తులు తాము ఎంత శక్తిమంతులో స్వయంగా తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలు సుకున్న తరువాత తన కుటుంబం కోసం స్వలాభాపేక్ష త్యజించి సహాయ సహకారాలందిం
చడం మరో ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు సమిష్టి కుటుంబాలు లేదా దాయాది కుటుంబాలు పది కాలాలు ప్రశాంతంగా జీవనం చేసే అవకాశం కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి