5, జులై 2024, శుక్రవారం

అమావాస్య వటసావిత్రి వ్రతం :

 అమావాస్య వటసావిత్రి వ్రతం :


మన సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సృష్టిలో అణువణువులో భగవత్ చైతన్యాన్ని దర్శించడం మన సంప్రదాయ ప్రత్యేకత. సమస్త వృక్ష , జీవరాశిని భగవంతుని అంశంగా పూజించడం అనాదిగా కొనసాగుతోంది. మనలో ప్రాణశక్తిగా ప్రవహించే జీవత్వానికి దైవ స్పర్శ ప్రధాన అంశం. ఆ ప్రాణశక్తి చెట్లు, మొక్కల ద్వారా లభిస్తుందని నమ్ముతారు. అందుకే మనవారు వృక్షాలను పూజిస్తారు. వటవృక్షమంటే మర్రిచెట్టు. ఈ వటవృక్ష మూలంలో ఆదిగురువైన దక్షిణామూర్తి నెలకొని ఉంటాడు. ఊడలతో విస్తరించి పెరిగే మర్రిచెట్టు సుదీర్ఘకాలం జీవిస్తుంది. అందుకే మనవారు దీనిని దీర్ఘాయుష్షుకు ప్రతీకగా తీసుకున్నారు. యమునితో పోరాడి భర్తప్రాణాలను దక్కించుకున్న సావిత్రి కథను మర్రిచెట్టుతో ముడిపెట్టారు. ప్రయాగకు సమీపంలో ఒక మర్రిచెట్టు ఉంది. ప్రళయ వేళలో వటపత్ర శాయియై విష్ణువు ఆ మర్రిచెట్టు ఆకుపైనే పవళిస్తాడని ప్రతీతి.

కామెంట్‌లు లేవు: