5, జులై 2024, శుక్రవారం

05.07.2024 వారం:శుక్రవారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

05.07.2024

వారం:శుక్రవారం 

(భృగువాసరే)


*🐄 గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి 🐄*




ఈరోజు జ్యేష్ట అమావాస్య ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట మాసంలోని అమావాస్య తేదీ ఈరోజు ఉదయం 04:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 05:29 గంటలకు ఉంటుంది. అమావాస్య తిథి రేపు 6వ తేదీ తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది. రేపు 6 న అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ముగుస్తుంది. కనుక ఈ రోజు శుక్రవారం  జ్యేష్ట అమావాస్య.


 *రేపటి నుంచి వారాహీ అమ్మవారి నవరాత్రులు*

*06.07.2024, (శనివారం) నుండి 15.07.2024  ( సోమవారం )వరకు..* 


ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటూ వారాహీ నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నరవాత్రులు, మాఘ గుప్త నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాడమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిదిరోజుల పాటూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు..ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు..


వారాహి దేవి రూపం ఇంచు మించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘ వర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశము, హలము, వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. 


ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహా పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది...


వారాహి మాతను నేపాల్‌లో బరాహి అంటారు రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఆమెను దండినిగా కొలుస్తారు. హిందూ దేవతైన వారాహి మాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్రవరాహి, మరీచిలో ఉన్నాయి. వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు. ఇది సెల్టిక్‌, జపనీస్‌, చైనీస్‌, గ్రీక్‌, అమెరికన్‌, ఇండియన్‌, ఈజిప్షియన్‌ సంస్కృతులలో కూడా ఉన్నది. చైనాలో వరాహం అటవీ సంపదను సూచిస్తుంది. జపాన్‌లో వరాహం ధైర్యానికి ప్రతీక. మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహి మాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా చూస్తారు. వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించటం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు...

కామెంట్‌లు లేవు: