22, ఫిబ్రవరి 2021, సోమవారం

మన మహర్షులు - 30

 మన మహర్షులు - 30


  మాండవ్య మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మాండవ్యుడు   ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు . మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,

సత్యవ్రతుడు.


 భూమి మీద ఉన్న అన్ని తీర్థాలు తిరిగి ఒక అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సంవత్సరాలు గడిచిపోతున్నా ఋతువులు మారిపోతున్నా తపస్సులోనే ఉండిపోయాడు.


అటువంటి మాండవ్యునిపై ఒక అపనింద పడింది. ఒకదారి దొంగలు కొందరు రాజభవనంలో ఖజానా

దోచుకొని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదలమాటున పొంచి ఉన్నారు.


రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడిగారు.


మౌనవ్రత మందున్న మాండవ్యుడు సమాధానం చెప్పలేదు.


భటులు ఆశ్రమమంతా వెతకి దొంగలు పాతిపెట్టిన ఖజాన బయటకు తీశారు.దొంగలను బంధించారు.ముక్కు మూసికొని తపస్సు చేసికొనే మాండవ్యుని కూడా దొంగేనని భావించి దొంగలతో పాటు బంధించి తీసికొని పోయారు.


రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి పాతివెళ్ళిపోయారు.


 మాండవ్య మహర్షి బాధని లెక్కచెయ్యకుండా నే తపస్సు చేసుకుంటుంటే మిగిలిన మునులందరూ రాత్రివేళ పక్షిరూపంలో వచ్చి ఎవరికీ అపకారం చెయ్యనివాడివి నీకీ కష్టాలేమిటని అడిగారు. 

మహర్షి కర్మఫలం అనుభవించాలి కదా! అన్నాడు


. ఈ మాటలు కాపలా వున్న రక్షకభటులు విని రాజుకి చెప్పారు

రాజు పరుగెత్తుకుంటూ వచ్చి మహాత్మా! తెలియక తప్పు చేశాను. మీరు మహర్షులని తెలియదు. మావాళ్ళు దొంగ అని చెప్తే ఆలోచించకుండా శిక్ష వేశాను క్షమించమని అతని కంఠంలో వున్న శూలాలు తీయడానికి ప్రయత్నించాడు రాజు. అవి ఊడి రాలేదు. ఆ చివర ఈ చివర కోసినా ఒక ముక్క మాత్రం మహర్షి కంఠంలో ఉండిపోయింది. 

ఆ ముక్కకి పూలబుట్ట తగిలించుకుని తిరిగేవాడు


మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి నేను చేసిన తప్పేమిటి? ఎందుకు నాకీ శిక్ష వేశావు ? అని అడిగాడు. 


చిన్నతనంలో తూనీగల్ని బాధపెట్టావు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నాడు యముడు.


అప్పుడు నా వయస్సెంత ? ఏ వయస్సు వరకూ బాల్యం అంటారు? బాల్యంలో చేసినదానికి శిక్ష వుండదంటారు కదా! అని అడిగాడు.


 పుట్టినది మొదలు పన్నెండేళ్ళ వరకూ బాల్యం అంటారు అన్నాడు యమధర్మరాజు.


 మాండవ్యుడు నేనప్పుడు బాల్యంలోనే ఉన్నా నాకు శిక్ష వేశావు కాబట్టి నువ్వు భూలోకంలో

ఒక శూద్రుడికి పుడతావని శపించాడు. అతడే విదురుడు.


జనక మహారాజుకి జ్ఞానం సంపాదించడం అంటే ఇష్టం. ఎప్పుడూ చుట్టూ మహర్షుల్ని పెట్టుకుని చర్చాకార్యక్రమాల్లో ఉండేవాడు. 


మాండవ్యుడు ఒకసారి జనకమహారాజుని కోరికలకి కారణం ఏమిటి? అని అడిగాడు.


ధనమే దీనికంతకీ మూలం. ఆవుతో పాటు కొమ్ములు పెరిగినట్లు మనిషికి కోరికలు పెరిగి దాంతో మమకారం పెరిగి అట్టలు కట్టుకుపోయినట్లయిపోయి దాంట్లోంచి బయటకు

రాలేడు. అందుకే కోరికల్ని చంపుకోవాలని అన్నాడు జనక మహారాజు .


 మరి కొన్నాళ్ళకు మాండవ్యుడు ధర్మరాజును దర్షించడం జరిగింది. మాండవ్యుడు ధర్మరాజునకు .

 అనేక విషయాలు తెలిపి శివమహిమ గురించి వివరించిచెప్పాడు. శివస్మరణ వల్ల దు:ఖములు నశించునని నిత్య శివస్మరణ చేయుమని ఉపదేశించాడు. 


మాండవ్యుడు.జనక,ధర్మరాజాదులకు జ్ఞానోపదేశం చేసి తన శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తపశ్శాలి.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కుళ్ళిపోవడానికి ఎంత సమయం

 *కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది?*


మానవుడు -- 1 వారం

పేపర్ టవల్ - 2-4 వారాలు

అరటి తొక్క - 3-4 వారాలు

పేపర్ బాగ్ - 1 నెల

వార్తాపత్రిక - 1.5 నెలలు

ఆపిల్ కోర్ - 2 నెలలు

కార్డ్బోర్డ్ - 2 నెలలు

కాటన్ గ్లోవ్ - 3 నెలలు

ఆరెంజ్ పీల్స్ - 6 నెలలు

ప్లైవుడ్ - 1-3 సంవత్సరాలు

ఉన్ని సాక్ - 1-5 

సంవత్సరాలు


మిల్క్ కార్టన్లు - 5 సంవత్సరాలు

సిగరెట్ బుట్టలు - 10-12 సంవత్సరాలు

తోలు బూట్లు - 25-40 సంవత్సరాలు

టిన్డ్ స్టీల్ క్యాన్ - 50 సంవత్సరాలు

ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు - 50 సంవత్సరాలు

రబ్బరు-బూట్ ఏకైక - 50-80 సంవత్సరాలు

ప్లాస్టిక్ కంటైనర్లు - 50-80 సంవత్సరాలు

అల్యూమినియం కెన్ - 200-500 సంవత్సరాలు

*ప్లాస్టిక్ సీసాలు - 450 సంవత్సరాలు*

*పునర్వినియోగపరచలేని డైపర్స్ - 550 సంవత్సరాలు*

*మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన 600 సంవత్సరాలు*

*ప్లాస్టిక్ సంచులు 200-1000 సంవత్సరాలు.*


మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము,దయచేసి ఈ సమాచారాన్ని మీ నెట్‌వర్క్‌లో మీకు వీలైనంతగా పంచుకోండి.


గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పడుతుంది.


- దయచేసి హరిత పర్యావరణానికి మద్దతు ఇవ్వండి.

*ప్లాస్టిక్ ను వాడడం మానేద్దాం*      

            **పర్యావరణన్నికాపాడుదాం**  🦋🐜🐞🐌🐝🐛🦨🦝🐇🕊️🐀🐿️🐁🐚💦 **damarapally narsimhareddy

suffering from Kidney disease

 A Medical Officer in the USA has sent this through to help each and everyone. Please read and take care of yourself - Dr. Okyere.


The rate at which  young people are suffering from Kidney disease is alarming. I am sharing a post which can help us. 

Please read below: 


IMPORTANT - KIDNEY DESERVES THE BEST.


Barely two (2) days ago, we all received the news of the demise of the Nigerian actor as a result of kidney disease.

ALSO OUR MINISTER OF PUBLIC WORKS, the Honorable Teko Lake is currently in the Hospital on life support with Kidney problems. I want to show you how to avert this menace of kidney disease.


*SO HERE ARE THE TOP 6 CAUSES OF KIDNEY DISEASE:*


1. Delaying going to a toilet. Keeping your urine in your bladder for too long is a bad idea. A full bladder can cause bladder damage. The urine that stays in the bladder multiplies bacteria quickly. Once the urine refluxes back to the ureter and kidneys, the toxic substances can result in kidney infections, then urinary tract infections, and then nephritis, and even uremia. When nature calls – do it as soon as possible.


2. Eating too much salt. You should eat no more than 5.8 grams of salt daily.


3. Eating too much meat. Too much protein in your diet is harmful for your kidneys. Protein digestion produces ammonia – a toxin that is very destructive to your kidneys. More meat equals more kidney damage.


4. Drinking too much caffeine. Caffeine is a component of many sodas and soft drinks. It raises your blood pressure and your kidneys start suffering. So you should cut down the amount of coke you drink daily.


5. Not drinking water. Our kidneys should be hydrated properly to perform their functions well. If we don’t drink enough, the toxins can start accumulating in the blood, as there isn’t enough fluid to drain them through the kidneys. Drink more than 10 glasses of water daily. There is an easy way to check if you are drinking

enough water: look at the colour of your urine; the lighter the colour, the better.


6. Late treatment . Treat all your health problems properly and have your health checked regularly. Let's help ourselves...God will protect you and your family from every disease this year.


(3) Avoid these Tablets, they are very dangerous:

* D-cold

* Vicks Action-500

* Actified

* Coldarin

* Cosome

* Nice

* Nimulid

* Cetrizet-D

They contain Phenyl Propanol-Amide, PPA which

causes Strokes & Are banned in USA.


Please, before deleting, HELP your friends by passing it..! It might help someone. Fwd to as many as u can. 


WhatsApp is free, soo..frwrd it plz..please read and forward this. 


Doctors in the United States have found new cancer in human beings, caused by Silver Nitro Oxide. 

Whenever you buy recharge cards, don’t scratch with your nails, as it contains Silver Nitro Oxide coating and can cause skin cancer. 


Share this message with your loved ones. 


*Important Health Tips:*


1. Answer phone calls with the left ear.


2. Don't take your medicine with cold water....


3. Don't eat heavy meals after 5pm.


4. Drink more water in the morning, less at night.


5. Best sleeping time is from 10pm to 4 am.


6. Don’t lie down immediately after taking medicine or after meals.


7. When phone's battery is low to last bar, don't answer the phone, because the radiation is 1000 times stronger.


Can you forward this to people you care about?

I just did. 

Kindness costs nothing But Knowledge is power...


Please send it to all your friends! _


*Note:*

_Do not save this message, send it now  the other groups that you belong to. _

_It is for your good and that of others, giving somebody relief is always rewarding.

భాష -- ఉచ్చారణ-

 ----------------------------భాష -------ఉచ్చారణ-------------------------- 


మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట.నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి?సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే.


సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి 


వారిని గురించి ఆరా తీస్తాడు.ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని ఆంజనేయుడిని గురించి అనుకున్నాడు.ఎదుటి వ్యక్తికి


మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.


ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతె ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు 


పడుతున్నారు కదా!స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకుతున్నాము.కదా!. ఉదాహరణకి సైకాలేజీ స్పెల్లింగ్ ఏమిటి?మనం ఎలా పలుకుతున్నాము? ఆలోచించండి.మరి.వూరికే భాషాదినోత్సవాలు జరుపుకుంటే సరిపోదు కదా!  


తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా!వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం' అని పలుకుతున్నారు.మరి ఎలా ఒప్పుకుంటున్నారు?యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు.హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు.వినడానికి సొంపుగా 


వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.


పాఠశాలలో చదివే టప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి.ఇప్పుడు ఆంగ్లము లో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు.ఇది చాలా బాధాకరమైన విషయం.


ఎదుటి వ్యక్తికి  మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠా లను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి.అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా వుండాలో  ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)


వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో 


పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్ 


గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక  చిత్తుడై


యనుపమ భక్తి  తో చదువునాతని వాచకుండండ్రు సద్బుధుల


చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు,ఆ,ఈ వూ అని అనకూడదు.విసుగు చెందకూడదు.ఒక ప్రవాహం లాగా ఆవిరళం గా సాగాలి.అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందే మిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా.ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తీ శ్రద్ధ లతో చదివేవాడిని,మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు


ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది..ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా 


తెలియదు.చెప్పేవారు కూడా లేరు.ఉపాధ్యాయులు అలాగే వున్నారు,విద్యార్థులూ అలాగే వున్నారు. 


. 'పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు,యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.అన్ని భాషలకూ వర్తిస్తుంది 


(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యం తో )


---------------------శుభసాయంత్రం  ------------------------------

హద్దు లేని ఆశ,

 🚩ఓం సాయి రాం 🙏


ఒకడికి డబ్బు అవసరం వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు.

అది గమనించిన వేరే వ్యక్తి అతన్ని ఆపి, ఒక పరిక్ష పెట్టాడు.


'' నువ్వు ఈ ఎండలో ఆ బండ మీద 10 నిమిషాలు నిలబడితే 1000 ఇస్తా అన్నాడు కనిపించే ఒక బండను చూపిస్తూ.

అవతలి వ్యక్తికి డబ్బు అవసరం గనుక కాళ్ళు కాలుతున్నా సరే అలానే నిలబడ్డాడు. 


వాడు ఈ సారి 5 నిమిషాలకే 1000 ఇస్తా నిలబడమన్నాడు.

వాడు సరే అని కాళ్ళు ఎర్రగా కందిపోతున్నా అలానే నిలుచున్నాడు.


ఈ సారి వాడు 1 నిమిషానికి 1000 అన్నాడు.

అప్పటికే అవసరమైనంత డబ్బు వచ్చేసింది, పైగ స్పృహకోల్పోడానికి సిద్దంగా ఉన్నాడు అయినా సరే డబ్బు మీదా ఆశతో బలవంతంగా అలానే నిలుచున్నాడు. . 


చివరిగా ఈ సారి సెకనుకి 100000 అన్నాడు..

ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని నిలబడటానికి ప్రయత్నించి ఆ ఎండ తీవ్రతకు తట్టుకోలేక చచ్చిపోయాడు . . . !


అవసరానికి, ఆశకి మధ్య కంటికి కనిపించేంత చిన్న దారం ఒకటి ఉంటుంది.

ఆ దారాన్ని మనం సరిగ్గా చూసుకోకుండా దాటామో . . .? 

మనల్ని ఇంకెవరో చూసుకోవల్సిన పరిస్ధితి వస్తుంది . . . !


ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేం.

పాదాలు సాగినంత వరకే మన అడుగులు వేయగలం.


అలాంటిది మన ఆశను మాత్రం హద్దు ఎందుకు దాటనివ్వాలి . . . ?

హద్దు లేని ఆశ, తెడ్డు లేని పడవ కుదురుగా ఉండలేవు.

ఏదో రోజు మనల్ని ముంచేస్తాయి . . .! ! !

మీ

DR ఎర్రం పూర్ణశాంతి గుప్తా✍️

🙏🙏🙏

రాశికొక జ్యోతిర్లింగం*

 *రాశికొక జ్యోతిర్లింగం*

🌷⚛️🌷⚛️🌷⚛️🌷⚛️🌷


మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.


వృషభరాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.


మిధునరాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.


కర్కాటకరాశి వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.


సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర  జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.


కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.


వృశ్చికరాశి వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


విశ్వేశ్వరలింగం ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.


భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.


కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.


త్ర్యంబకేశ్వర లింగం మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు.

త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.🙏

Prostate Gland

 Prostate Gland & Its Care🌹


The Prostate Gland and its effect on us, (men only).  

Read it and apply, esp the part on diet.

Useful for all MEN over-40:


A useful article / talk on Benign Prostate Hyperplasia (BPH) or in simple terms, Enlarged Prostate. Diet is the most important part of this talk which is something within our control; and it works. 


FULL TEXT OF PROSTATE HEALTH AWARENESS LECTURE


MEN MUST READ


Gentlemen,


I am here to speak with you on Prostate. The topic is misleading. Is prostate strictly for men? Yes, ONLY men have prostate and ONLY men over 40 years but the healthcare enlightenment is for everyone. There is no woman who does not know a man 40 years and above, father, uncle, brother, son, friend, neighbour, colleague...


Essentially what I will be doing today is health promotion. Responsible health promotion must provide three things:


1. Information

2. Reassurance

3. A plan of action.


Let us start with a background on prostate health.


Everyone has a pair of kidneys. The job of the kidney is to remove waste. It is the LAWMA (waste management company) of your body. Everyday your blood passes through the kidney several times to be filtered. As the blood is filtered, urine is formed and stored in a temporary storage tank called the urinary bladder.


If there were to be no urinary bladder, as a man walks on the road, urine will be dropping.


Now think of the plumbing work in your house. Think of the urinary bladder as the overhead storage tank. From the storage tank, a good plumber will run pipes to other parts of the house, including the kitchen. God in His wisdom ran pipes from our urinary bladder to the tip of the penis. The pipe is called the urethra. Just below the bladder and surrounding the urethra is a little organ called the prostate gland.


The prostate gland is the size of a walnut and weighs about 20grams. Its job is to make the seminal fluid which is stored in the seminal vesicle. 


After age 40, for reasons that may be hormonal, the prostate gland begins to enlarge. From 20 grams it may grow to almost 100 grams. As it enlarges, it squeezes the urethra and the man begins to notice changes in the way he urinates.


If you have a son under 10, if he has a little mischief like we all did at that age, when he comes out to urinate, he can target the ceiling and the jet will hit target. Call his father to do same, wahala dey. His urine stream is weak, cannot travel a long distance and sometimes may come straight down on his legs. So he may need to stand in awkward position to urinate.


Not many men will be worried their urine stream cannot hit the ceiling. Toilets are on the floor and not on the ceiling. But other symptoms begin to show.


TERMINAL DRIPPLING:

The man begins to notice that after urinating and repacking, urine still drops on his pants. This is the reason why after an older man urinates, he has to ring bell. A younger man simply delivers to the last drop and walks away. Just see an older man coming from the bathroom. Sometimes he may clutch the newspaper closely to hide the urine stains, particularly on plain colored trousers.


HESISTANCY

At this point you wait longer for the urine flow to start. There are 2 valves that must open for you to urinate – the internal and external sphincters. Both open but because of obstructions in the urethra, you wait longer for the flow to start.


INCOMPLETE EMPTYING

You have this feeling immediately after urinating that there is still something left.


As all these things happen, the bladder begins to work harder to compensate for the obstruction in the urethra. The frequency of urination goes up. Urgency sets in. Sometimes you have to practically run into the toilet. Nocturia also becomes common. You wake up more than 2 times at night to urinate. Your wife begins to complain.


Men being men may not talk to anyone even at this point. Then the more serious complications start.


Stored urine gets infected and there may be burning sensation when urinating.


Stored urine forms crystals. Crystals come together to form stone either in the bladder or in the kidney. Stones may block the urethra.


Chronic urinary retention sets in. The bladder stores more and more urine. The size of the bladder is 40 - 60cl. A bottle of coke is 50cl. As the bladder stores more urine it can enlarge up to 300cl. An overfilled bladder may leak and this leads to wetting / urinary incontinence. Also the volume may put pressure on the kidney and may lead to kidney damage.


What may likely bring the man to hospital is acute urinary retention. He wakes up one day and he is not able to pass urine.


Everything I have described above is associated with prostate enlargement, technically called benign prostate hyperplasia.


There are other diseases of the prostate like:


1. Prostatitis – inflammation of the prostate


2. Prostate cancer – cancer of the prostate.


This discussion is on prostate enlargement.


I have bad news and good news.


The bad news is that everyman will have prostate enlargement if he lives long enough.


The good news is that there are life style changes that can help the man after 40 to maintain optimum prostate health.


NUTRITION

Look at what you eat. 33% of all cancers, according to the US National Cancer Institute is related to what we eat.

Red meat everyday triples your chances of prostate disease. Milk everyday doubles your risk. Not taking fruits / vegetables daily quadruples your risk.


Tomatoes are very good for men. If that is the only thing your wife can present in the evening, eat it with joy. It has loads of lycopene. Lycopene is the most potent natural antioxidant.

Foods that are rich in zinc are also good for men. We recommend pumpkin seeds (ugbogulu).

Zinc is about the most essential element for male sexuality and fertility.


Men need more zinc than women. Every time a man ejaculates he loses 15mg of zinc. Zinc is also important for alcohol metabolism. Your liver needs zinc to metabolize alcohol.


ALCOHOL CONSUMPTION

As men begin to have urinary symptoms associated with prostate enlargement, it is important they look at alcohol consumption. More fluid in means more fluid out. 

Drink less. Drink slowly.


EXERCISE

Exercise helps build the muscle tone. Every man should exercise. Men over 40 should avoid high impact exercise like jogging. It puts pressure on the knees. Cycling is bad news for the prostate. We recommend brisk walking.


SITTING

When we sit, two-third of our weight rests on the pelvic bones. Men who sit longer are more prone to prostate symptoms. Do not sit for long hours. Walk around as often as you can. Sit on comfortable chairs. We recommend a divided saddle chair if you must sit long hours.


DRESSING

Men should avoid tight underwear. It impacts circulation around the groin and heats it up a bit. While the physiological temperature is 37 degrees, the groin has an optimal temperature of about 33 degrees. Pant is a no-no for men. Wear boxers. Wear breathable clothing.


SMOKING

Avoid smoking. It affects blood vessels and impact circulation around the groin.


SEX

Regular sex is good for the prostate.


Celibates are more pronenn to prostate illness. While celibacy is a moral decision, it is not a biological adaptation. Your prostate gland is designed to empty its contents regularly.


Thought: when someone shared something of value with you and benefit from it. You have a moral obligation to share it with others because someone in your friends list might be saved.


The subject is very important Please post the message on the largest number of your acquaintances:


"Pieces of lemon in a glass of hot water can save you for the rest of your life," says Professor Chen Horin, chief executive of the Beijing Military Hospital.


Even if you are busy, you should look at this message and pass it on to others!


Hot lemons can kill cancer cells!


Cut the lemon into three pieces and place it in a cup, then pour hot water, it will become (alkaline water), drink it every day will certainly benefit everyone.


Hot lemons can once again release an anti-cancer drug.


Hot lemon juice has an effect on cancerous tumors and


has shown treatment for all types of cancer.


Treatment with this extract will only destroy the malignant cells and will not affect healthy cells.


Second: The acids and mono-carboxylic acid in lemon juice can regulate hypertension and protect narrow arteries, adjust blood circulation and reduce blood clotting.


After reading, tell someone else and pass it on to someone you love and take care of your personal health.


Advice:


Professor Chen Horin points out that anyone who has received this letter is at least guaranteed to save someone's life ... I have done my part, I hope you will help me to spread it too..

సృష్టి రహస్యం

 ఈమాగ్ం రుద్రాయ... ఇమంమే వరుణ సృధీహవం  తత్వాయామి అని బ్రహ్మణాం అని అణువు యని  శక్తియని వేదం స్పష్టంగా దానిని ఋుక్కుగా వర్ణించెను. దానిని తెలియుట ఋషి తత్వం ఋషి అనగా ఋక్కువు దర్శించుటకు కాంకి ని దర్శించి దాని విశ్లేషణ చేయుటయే ఋషి ధర్మం. ఋుక్కు అనగా కాంతిని దాని విశ్లేషణ యే జీవమను నీటి రూపంగా తెలియును. ఈ మాం యని యితర మతస్థులు ఈ అనగా శక్తి మాం చైతన్యమై నన్ను రక్షించు గాక అనే తత్వమను తెలియుట. ఇదే ఈశ తత్వమని మాం నేనే ఆ ఈశ శక్తి యని దానిని అప్పుడు బ్రహ్మాస్మి.బ్రహ్మం అసి బ్రహ్మ మా అసి. మాట తల్లి రూపంలో గల సృష్టి రహస్యం. నేనే బ్రహ్మను అని తెలియుట ఙ్ఞానం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

జన్మ పాపవినాశకః

 🙏 *!!శుభోదయమ్!!*🙏

🌸 *!!ॐ _సుభాషితమ్_!!ॐ* 🌸


శ్లో|| జకారో జన్మవిచ్చేదః 

పకారః పాపనాశకః |

తస్మాజ్జప ఇతి ప్రోక్తో 

జన్మ పాపవినాశకః ||


||తాత్పర్యము|| 

“జ” కారము జన్మ కలుగకుండ జేయును..... 

“ప” కారము పాపమును నశింప జేయును.....

జన్మము, పాపము రెంటిని నాశము చేయునది కావున “జప” మందురు... 

పరమాత్ముని నామము లన్నింటిలో మూగవాడు కూడ పలుకదగిన నామము "ఓమ్" అనునది శ్రేష్ఠమైనది..... 

🙏✨💖🌷

మొగలిచెర్ల

 *చీకటి..వెలుగు..*


"పల్లకీసేవ లో పాల్గొనాలి..మా పేర్లు వ్రాసుకోండి..టికెట్ ఎంతో చెప్పండి.." అని ఆ దంపతులు నన్ను అడిగారు..మా సిబ్బంది దగ్గరకు వెళ్ళమని చెప్పాను..సిబ్బంది వద్దకు వెళ్లి పల్లకీసేవ కొఱకు తమ పేర్లు, గోత్రము నమోదు చేయించుకున్నారు..ఆరోజు భక్తులు ఎక్కువగా వున్నారు..పల్లకీసేవ లో పాల్గొనే వాళ్లే దాదాపు యాభై మంది పైనే తమ పేర్లు నమోదు చేసుకున్నారు..స్వామివారి మంటపం లో ఇంతమందిని వరుస క్రమం లో కూర్చోబెట్టడం..అందరి గోత్రనామాలను చెప్పించుకోవడం..అర్చకస్వాములకూ కష్టం గానే ఉంది..అందరితో పాటు ఈ దంపతులూ పల్లకీసేవ లో పాల్గొన్నారు..పల్లకీసేవ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయింది..ఆ తరువాత అన్నప్రసాద వితరణ..ఆ రాత్రికి మంటపం లోనే పడుకున్నారు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకే ఆ దంపతులు స్నానాదికాలు ముగించుకొని మందిరం లోకి వచ్చారు..అప్పుడే అర్చకస్వాములు స్వామివారి సమాధి మందిరం తలుపులు తెరచి..లోపల శుభ్రం చేసుకుంటున్నారు.."అయ్యా..మమ్మల్ని స్వామివారి సమాధి దర్శనానికి ఏ సమయం లోపంపుతారు? " అని నన్ను అడిగారు.."హారతులు అన్నీ పూర్తయ్యేసరికి సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది..ఆ తరువాత భక్తులను సమాధి దర్శనానికి అనుమతి ఇస్తాము..మీరు విశేషపూజ అని చెప్పి మా సిబ్బంది వద్ద టికెట్ కొనండి..వరుసగా అందరినీ పంపుతాము..అంతవరకూ మంటపం లో కూర్చుని..స్వామివారి సమాధికి అర్చకులు చేసే అభిషేకములు, హారతులు చూడండి.." అని చెప్పాను..సరే అని వెళ్ళిపోయి మంటపం లో కూర్చున్నారు..స్వామివారి ప్రభాతసేవ పూర్తయిన తరువాత..ఆ దంపతులు స్వామివారి సమాధి దర్శనం, స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని..మధ్యాహ్నం దాకా వుండి..మధ్యాహ్న హారతి కూడా చూసి..స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి వెళ్లిపోయారు..ఆ ప్రక్క శనివారం నాడు మళ్లీ వచ్చారు..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం స్వామివారి సమాధి ని దర్శించుకొని, తమ పేర్లతో అర్చన చేయించుకొని..మధ్యాహ్నం వరకూ మంటపం లో కూర్చుని స్వామివారి చరిత్ర పారాయణం చేసుకొని..అన్నప్రసాదం తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ మూడోవారం కూడా అదే విధంగా వచ్చి వెళ్లారు..ఇలా..వరుసగా పదివారాల పాటు ప్రతి శనివారం మధ్యాహ్నం మందిరానికి రావడం..పల్లకీసేవ లో పాల్గొనడం..రాత్రికి నిద్ర చేయడం..ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అర్చన చేయించుకొని..తిరిగి వెళ్లడం..జరుగుతున్నది..


పదకొండో వారం కూడా ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..ఆరోజు నేరుగా నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..రేపటితో  మా పదకొండువారాల నియమం పూర్తవుతుందండీ..మొట్ట మొదటి రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు..మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది..తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాము..ఏ దిక్కుతోచక..ఈ స్వామివారి గురించి విని..చిట్టచివరి ఆశగా ఇక్కడికి వచ్చాము..ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నాము..మా తోబుట్టువులే మమ్మల్ని మోసం చేశారు..ఒక్క కుమారుడు..ఒక సంవత్సరం నుంచీ ఉద్యోగం లేక ఖాళీగా వున్నాడు..పైగా అప్పుల వాళ్ళ వేధింపులతో విసిగిపోయి ఉన్నాము..ఇన్ని కష్టాల మధ్య స్వామివారి వద్దకు వచ్చాము..మొదటి వారం మేము స్వామివారి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు.."స్వామీ ఈ కష్టాలు పడలేకుండా ఉన్నాము..ఆత్మహత్య మాత్రమే దిక్కు..మమ్మల్ని కాపాడు తండ్రీ..నువ్వే దిక్కు.." అని పరిపరివిధాల మొక్కుకున్నాము..ఆరోజు మంటపం లో కూర్చుని వున్నప్పుడు.."పదకొండు వారాల పాటు స్వామివారిని కొలవండి మీకు మంచి జరుగుతుంది "అని ఇక్కడ ఉన్న ఒక ఆడమనిషి..చెప్పింది..ఎందుకో ఆ మాట స్వామివారే చెప్పించాడు అని అనిపించింది..ఇద్దరమూ పదకొండు వారాలు ఈ క్షేత్రానికి వచ్చి..స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాము..ఐదు వారాలు గడిచే సమయానికి..మా అబ్బాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో ఎంపిక అయినట్లు వార్త వచ్చింది..మంచి జీతం కూడా..స్వామివారే చూపించారు అనుకున్నాము..మా ఆర్ధిక ఇబ్బందులు అలాగే వున్నా..అవి తీరే మార్గాలు కనబడ్డాయి..అప్పులవాళ్లకు నచ్చ చెప్పుకున్నాము..ముందు నిరాశ లోంచి బైట పడ్డాము..మా వాటా ఆస్తి లో కొంతభాగం అమ్మకానికి పెట్టాము..మంచి ధర వచ్చింది..కష్టాలు తొలగిపోతాయి అనే ధైర్యం వచ్చింది..చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లుగా ఉన్నది..రేపు స్వామివారి సమాధి దర్శించుకొని..ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని..వెళ్లిపోతాము..మళ్లీ..మళ్లీ స్వామివారి వద్దకు వస్తూనే ఉంటాము.." అన్నారు..


ఆ దంపతుల కష్టాలు పూర్తిగా తొలగిపోవడానికి ఇంకా సమయం పడుతుంది..కానీ..ఆ కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని స్వామివారు కల్పించారు..జీవితం మీద విరక్తి కలిగిన తరుణం లో..జీవించడానికి మార్గాన్ని చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మన మహర్షులు - 29

 మన మహర్షులు - 29


 మార్కండేయ మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మార్కండేయుడు తన అనన్య సామాన్యమైన భక్తి ద్వారా ఆ పరమేశ్వరునుండి నుండి చిరంజీవిగా 'మరణములేని' జీవితాన్ని పొంది ఉద్దరింపబడినాడు.


మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం.


 బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.


చిన్నతనం లొనే  మార్కండేయుడికి ఉపనయనం చేశారు. 


మార్కండేయుడు కొంచెం పెద్దవాడయ్యాక ' నాయనా! నువ్వు విష్ణుమూర్తి, శివుడు ఇచ్చిన వరం వల్ల పుట్టావు కానీ, నీకు ఆయుష్షు తక్కువ' అని చెప్పాడు మృకండుడు.


తండ్రీ! మీరిచ్చిన ఈ శరీరంతోనే శివుణ్ణి మెప్పించి చిరంజీవిగా ఉంటానని చెప్పాడు మార్కండేయుడు. 


 మార్కండేయుడు తపస్సు మొదలు పెట్టాడు. ఈలోగా అతనికి పదహారేళ్ళు వచ్చాయి. యమధర్మరాజు వచ్చేశాడు. కానీ, మార్కండేయుడు తపస్సులో ఉండిపోయాడు. శివుడు వచ్చి నా భక్తుడి వైపు చూశావంటే ఊరుకోనని యముడికి చెప్పాడు. వీళ్ళిద్దరూ గొడవపడుతుండగా మార్కండేయుడు శివుడి కాళ్ళు పట్టుకుని అప్పటికి మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.


అసలు, చావే లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలని శివుణ్ణి అడిగాడు మార్కండే యుడు. విష్ణుమూర్తిని ప్రార్థించమన్నాడు శివుడు.


మార్కండేయుడు మళ్ళీ విష్ణుమూర్తి కోసం తపస్సు మొదలు పెట్టాడు. పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంద్రుడున్నాడు కదా తపస్సు భంగం చెయ్యడానికి, ఆయన ఎన్ని చేసినా మార్కండేయుడు చలించలేదు. దీన్నే దీక్ష అంటారు. దేన్నయినా సాధించాలి అనుకున్నప్పుడు అంత పట్టుదలగా ఉండాలి.


విష్ణుమూర్తి మార్కండేయుడికి ప్రత్యక్షమై  ఏంకావాలి? అన్నాడు. స్వామీ! ఎన్ని యుగాలయినా ఈ శరీరంతోనే చావు అనేది లేకుండా చెయ్యమని విష్ణుమూర్తిని బ్రతిమలాడి వరం తీసుకుని చివరికి సాధించాడు. మొత్తం లోకాలకే పేరు తెచ్చాడు.


పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు మనస్సుకి బాధ తగ్గించాలని వచ్చాడు మార్కండేయుడు. 


మార్కండేయుణ్ణి పూజించాక ధర్మరాజు మనుషుల కర్మగతుల గురించి చెప్పమన్నాడు. 


రాజా! మొదటి కల్పంలో బ్రహ్మ పవిత్రమైన ధర్మంతో కూడుకున్న శరీరాల్ని పుట్టించాడు. అందులోంచి మంచి ప్రవర్తన కలవాళ్ళు, సత్యసంకల్పం వున్న వాళ్ళు జ్ఞానవంతులు, ఎక్కువ ఆయుష్షు ఉన్నవాళ్ళు అయ్యారు. రానురాను మనుషులు అల్పాయుష్కులు, దరిద్రులు, రోగాలతో బాధపడేవాళ్ళు, మాయమాటలు చెప్పేవాళ్ళు, తయారయి వాళ్ళు వాళ్ళ పాపపుణ్యాలకి తగినట్లు పుడుతూ, చస్తూ వాళ్ళ కర్మఫలం అనుభవిస్తున్నారు. ధర్మ మార్గంలో వుండేవాళ్ళు మంచిపనులు చేస్తూ, పిల్లలో చేయిస్తూ పుణ్యం పొందుతున్నారు. మంచి చేస్తే మంచిని, చెడు చెయ్యడం వల్ల చెడుని అనుభవిస్తున్నారు. ఇదే కర్మగతి 'అన్నాడు మార్కండేయుడు.


మార్కండేయుడు ధర్మరాజుకి బ్రాహ్మణ ప్రభావం గురించి, దుంధుమారుడనే రాజు గురించి, అత్రి గౌతముల వాదన గురించి వైవస్వత చరిత్ర, వామదేవుడి చరిత్ర ఇలాంటివన్నీ చెప్పాడు. ధర్మరాజు ఎన్నో విషయాలు మార్కండేయుణ్ణి అడిగి తెలుసుకున్నాడు.


మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాక గౌరముఖ మహర్షి అక్కడికి వెళ్ళి పితృదేవతల గురించి మార్కండేయ మహర్షి నడిగి తెలుసుకున్నాడు.


నమార్కండేయుడు ధర్మ పక్షుల గురించి చెప్పిన దాన్ని 'మార్కండేయ పురాణమని” పిలుస్తారు.

మార్కండేయ పురాణం,  అష్టాదశ పురాణాలలో ఒకటి. జైమిని ముని మరియు మార్కండేయుడు మధ్య జరిగిన సంవాదముగా


వ్రాయబడింది.

 కోర్టుకి అనే ముని మార్కండేయుణ్ణి ప్రపంచ విషయాలు చెప్పమన్నాడు. బ్రహ్మ జన్మ గురించి, అన్ని ద్వీపాల గురించి, సూర్యడి గొప్పతనం గురించి అన్నీ చెప్పాడు మార్కండేయుడు.


 కఠోరదీక్షతో విష్ణుమూర్తి కటాక్షంతో మృత్యువిజయం, మహాతపశ్శక్తి సంపాదించిన మార్కండేయ మహర్షి సదా స్మరణీయులు.🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹