1, అక్టోబర్ 2020, గురువారం

డాక్టర్ శ్రీ రేమెళ్ళ అవధానులు గారు.

 








ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని పొడగట్లపల్లిలొ సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు .25 సెప్టెంబరు 1948 తేదీనజన్మించారు. 1969 లో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసారు. రాజోలు డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవారు. కానీ 1971 లో హైదరాబాదులో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాదు వచ్చేశారు. ఇ.సి.ఐ.ఎల్. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలొ భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, ఎప్లస్ బిహోల్ స్వేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్.లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించారు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్యరూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించారు. 

కంప్యూటరులోకి తెలుగు :-

1976 నాటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరులో ప్రవేశపెట్టారు. ఆ విధంగా 1976 లో భారతదేశంలొ కంప్యూటరులోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి అభినందనలతో కంప్యూటరులో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరులోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమపై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడా కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.

నిమ్స్ కంప్యూటరీకరణ :-

అవధానులకు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు కాకర్ల సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పనిచేశారు.

వేదాల కంప్యూటరీకరణ :-

NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్థించింది అవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి ఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడా అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థమయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే.... కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్రలో ఒకాయన ఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టారు.

అఖిలభారత వేదసమ్మేళనంలో :-

అదే సమయానికి తి.తి.దే. వారు తిరుపతిలో అఖిల భారతవేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారతదేశ అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా తి.తి.దే. వారు కోరగా 'నమకం' లోని మూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ 'సీ లాంగ్వేజి ' సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మ చాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవధానికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్తోమత అవధానులకు లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు ఆ విషయాన్ని 'అశ్విని హెయిర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుకు తెలుపగా,... సుబ్బారావు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునాతన కంప్యూటర్ కొన్నారు అవధాని. కంప్యూటరు మీద పనిచేస్తున్న వారికి జీతభత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయారు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్టు ను ప్రారంభించారు. చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో అందరితో కలిసి తాను కూడా రాత్రుళ్ళు పనిచేసేవారు.

యజుర్వేద అనుక్రమణికలు :-

ఆ సందర్భంలో వేదాలలో సైన్స్, లెక్కలు, వైద్యం, అంతరిక్షశాస్త్రం మొదలగు శాస్త్రాలన్నీ కనబడ్డాయి అవధానికి. ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు చూపించారు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించి ప్రశంసించారు. ఆ విధంగా అవధాని చిరకాలకోరిక కొంతవరకైనా నెరవేరింది. వేదభారతి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు. అందుకు అవధాని ఒక్కనితో అది సాధ్యమయ్యే పనికాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూతనిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారు అవదాని. ఆవిధంగా మన వేదవిజ్ఞానాన్ని పరిరక్షించుకున్న వాళ్ళమౌతాము.

ఇతరరంగాలలో సేవలు :-

పరమాణు భౌతికశాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మీమాంస ' శాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం చేశారు. అదే విధంగా వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిషం అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశారు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, సంస్కృతమిత్ర బిరుదుతో సత్కరించింది.

జ్యోతిజ్వల ఫలితాలు*

 *వివిధ దీప ప్రమిదలు- జ్యోతిజ్వల ఫలితాలు*


🪔🪔🪔🪔🪔🪔

🟩🟧🟥🟨🟪🟦


*ధక్షిణాయణ మైన ఉత్తరాయణ మైన*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*బంగారు ప్రమిద:  గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా జ్యొతి వెలిగించిన ఆరోగ్యమ్ ధనసమృద్ధి, విశేషబుద్ధి చాతుర్యం లభిస్తుంద*


*వెండి ప్రమిద:  బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా జ్యోతి వెలిగిస్తే శుక్ర గ్రహ ప్రితీ గలిగి దాంపత్యనురాగము తో ధనసంపద వృద్ధి చెందుతుంది*


*రాగి ప్రమిద: ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి నువ్వుల నూనెతో దక్షిణాభి ముఖంగా వెలిగిస్తే కుజగ్రహ ప్రీతి గలిగి మనోబలం కలుగుతుంది. ధణ అరీష్టాన్ని ఆపు తుంది*.


*కంచుప్రమిద: దీనిని శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి ఉత్తరాభి ముఖంగా నువ్వులనూనెతో వెలిగిస్తే బృహస్పతి కృప గలీగీ ధనానికి, జ్ఞాన స్థిరత్వం ఉంటుంది*


*మట్టీ ప్రమిద: ను ,ఉప్పు పై వుంచి నువ్వుల నూనె వేసి పడమర దిక్కు గా జ్యోతి వెలిగించిన,ధణ నిలకడ తొపాటు శనిగ్రహ ప్రీతీ గలిగి దుష్ట పీడ,శత్రుభాదలు తొలగుతాయి*

 


*మట్టిప్రమిద: ఆవునెయ్యితో తులసికోట వద్ద వెలిగించిన జ్యోతి వల్ల,నిత్య సౌభాగ్యం దుష్టశక్తుల వినాశనం పాపహరణం జరుగును*


*గోదుమ పిండి,బెల్లం ప్రమిద: పిండితో దేవుడి పీఠం నలుగు వైపుల దీపం వెలిగిస్తే ధణ లక్ష్మి కృప ద్వార నాలుగు విధాలా లాభం కలుగుతుంది*


*అమావాస్య రొజున ప్రాతః/సంధ్యా సమయం లో ఆవునేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు*


*ఆవనూనెతో రావిచెట్టు కింద నలభైఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతుంది*


**నువ్వులనూనెతో నలభైఒక్క రోజులు నవగ్రహాల వద్ద దీపం వెలిగిస్తే నవగ్రహ దోషం,ధిక్పలక అనుగ్రహం,ఇంక సమస్త రోగాలు తొలగుతాయి*


*గురువారం నాడు అరటిచెట్టుదగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకి శీఘ్రమే వివాహప్రాప్తి కలుగుతుంది*


🪔🪔🪔🪔🪔🪔🟥⬜🟩⬛🟨🟫

🟩🟨🟦🔲🟪🟧

This is the link for enrollment of graduates. Telangana

 https://ceotserms1.telangana.gov.in/MLC/Form18.aspx      


🔶 *రత్నాల్లాంటి మాటలు* 🔷

 


🔷 జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.


🔶 నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.


🔷 అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.


🔶 ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.


🔷 నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.


🔶 జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.


 🔷 నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.


🔶 జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.


🔷 కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.


🔶 ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

*దేవుడు ఎక్కడుంటాడు ?* 🥀


      *విగ్రహారాధన ఎందుకు ?*



ఒక వ్యక్తి దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. 

అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. 

కానీ అతని మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. 

ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. 

అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.


స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? 

ఎలా ఉంటాడు ? 

అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. 

నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి 

అది ఏమిటి నాయన అన్నాడు.


అది వృక్షం.


ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?


విత్తనం ద్వారా వచ్చింది స్వామి.


సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు.


 అయ్యో ఎందుకు స్వామి ? వృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.


చచ్చిపోతుంది, కానీ ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !


అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?


_విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు కదా ? విత్తనం చూడలేమా ?


 అదేంటి స్వామి విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా అన్నాడు ఆ భక్తుడు.


 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.


అదెలా స్వామి ?

విత్తనం అనేది పరమాత్మ. ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.


మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?


పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. 

సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? 

ఏమి అర్థం కాదు.

 అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. 

అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. 

అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనుగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.

సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. 

అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు. 


మన పురోహితులు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి అందులోకీ ఆ పరమాత్మను సూక్ష్మ రూపంలో తీసుకురాగలరు.

అప్పుడు విగ్రహంలో ఆ తండ్రి పరమాత్మ సూక్ష్మ రూపంలో దర్శనమిస్తారు. 

మనం స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో కోరుకున్న కోర్కెలు తీరుస్తాడు. 

విగ్రహారాధన అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !


స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?


భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడుకోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడాలేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.


తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు. 

అర్థమైంది స్వామి ధన్యోస్మి. 


*అతనికి అర్థమైంది మరి మీకు అర్థమైందా ?*

🥀 *రాయి - నాణెం - కథ* 🥀




ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు.  

అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. 

నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది.   

అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. 

పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది.

అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది.  

‘‘నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు.  

నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. "ధనమూలం ఇదం జగత్‌" అంటారు తెలుసుగా?’ అంటూ గొప్పలు పోయింది.

రాయి ‘అలాగా’ అన్నట్లుగా ప్రశంసగా చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తను ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారిందీ, తనతో కొనుక్కో దగిన వస్తువులెన్ని ఉన్నాయో వినిపించింది. అన్నింటినీ ప్రశాంతంగా వినసాగింది రాయి.

ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న కమ్మటి వాసన వచ్చింది.

‘‘ఈ రైతు నన్ను ఆ బండి వాడికిచ్చి ఓ కండె కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లా పెట్టెలో నా స్నేహితులతో కలిసి పోతాను. మురికిగా ఉన్న నీతోఉండలేకపోతున్నాను’అంది నాణెం బడాయిగా.

‘ నిజమే ’ ఒప్పుకుంది రాయి నిజాయతీగా. కానీ రైతు నడక ఆగకుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ కూర్చుని తెచ్చుకున్న మూటవిప్పి గోంగూర పచ్చడి నంచుకుంటూ పెరుగన్నం తిన్నాడు. కాసేపు నడుం వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో

మాట్లాడసాగాడు.

ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకు వస్తున్న అతడి మిత్రుడొకడు ఎదురు పడినట్లుగా నాణేనికి, రాయికి అర్థమైంది.

‘‘lనీ కోసమే పట్నం బయలుదేరాను మిత్రమా! నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్నుమూశాడు. ఇదేపాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా’’ అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు.

దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ‘‘ఇది ముడి వజ్రం. సానబెడితే ఈ చుట్టుపక్కల వూళ్లన్నీ కొనేయగలవు’’ అన్నాడు.

ఆ మాటల్ని జేబులోంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్లు సంభ్రమంతో మెరిశాయి. వజ్రాన్ని కళ్లకద్దుకుని తిరిగి జేబులో వేసుకున్నాడు.

జేబులో చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా దూరం జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణేన్ని స్నేహంగా చూస్తూ ‘‘మౌనంగా ఉండిపోయావేం మిత్రమా? నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంది’’ అంది.

నాణెం సిగ్గుతో ‘‘నీ విలువ తెలియక బడాయి పోయాను. నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా?’ అంది.

తెలుసన్నట్లు తలూపింది రాయి.

‘‘మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేలా అసలు విషయం చెప్పలేదెందుకు?’’ అంది నాణెం.

‘ఇదిగో, ఇందుకే. నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు. ఇప్పుడు ఎలా వినయంగా, బిడియంగా ఉన్నావో? కృత్రిమత్వం నాకు నచ్చదు. నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు. మన నిజమైన విలువ స్నేహంగా, నిజాయతీగా ఉండే మన ప్రవర్తనని బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించు కోదు’’ అంది రాయి.

వజ్రపు ఆలోచనా ధోరణికి ముగ్ధురాలైంది నాణెం. చేరువగా వచ్చిన నాణేన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్లీ మునుపటిలానే ఎడతెగకుండా నాణెం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం!

ఏవరూ కూడా సంపదను చూసి స్నేహం చేయకండి! 

మనసుచూసి స్నేహం చేయండి.

*నీ జీవిత సహచరి ఎవరు?*

 

అమ్మనా?

నాన్ననా?

భార్యనా?

భర్తనా?

కొడుకా?

కూతురా?

స్నేహితులా?

బందువులా?

లేదు.ఎవరూ కాదు.!

నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?

*నీ శరీరమే!* 

ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!

నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!

నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.

నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.

నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.

నీవేమి తినాలి?

నీవేమి చేయాలి?

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?

అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో.!

నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!

నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.

వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.

నీ శరీరం నీ భాద్యత.!

ఎందుకంటే?

నీవే నిజమైన సహచరివి.!

కనుక జాగ్రత్తగా ఉండు.

నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.

డబ్బు వస్తుంది.వెళ్తుంది.

బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.

గుర్తుంచుకో.!

నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.

ఒక్క నీవు తప్ప.!

ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.

మనసుకు-ద్యానము.

శరీరానికి-యోగా.

గుండెకు-నడక.

ప్రేగులకు-మంచి ఆహారం.

ఆత్మకు-మంచి ఆలోచనలు.

ప్రపంచానికి-మంచి పనులు.

🙏💐🙏💐🙏

ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం

 ఆదివారం ఏడు చేపల కథ గూర్చిన ప్రత్యేక కథనం అందరి కోసం 👍👇👌


ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం🐟


వీలైనంత ఓపికగా తప్పకుండా చదవండి...!


ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. 


అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. 


ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.


వేటాడిన చేపలను ఎండబెట్టారు.


అందులో ఒక చేప ఎండలేదు. 


చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. 


గడ్డిమేటు అడ్డొచ్చింది అంది. 


గడ్డిమేటు ?


గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు. 


ఆవు మేయలేదు అంది. 


ఆవా, ఆవా ఎందుకు మేయలేద అని అడిగారు?


గొల్లవాడు నన్ను మేపలేదు అంది.


గొల్లవాడా⁉️


గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు. 


అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.


అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు❓అని అడిగారు. 


పిల్లవాడు ఏడ్చాడు అంది. 


పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ ❓

అని అడిగారు. 


చీమ కుట్టింది అన్నాడు. 


చీమా చీమా ఎందుకు కుట్టావ్‌❓అన్నారు.


నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.


ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా,రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ. 


నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.


అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా! 


అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.


చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం. 


వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉️


నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న.అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. 


ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు. 


అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి. 


రాజుగారు అంటే మనిషి. 


ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు. 


కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.


జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.


రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే 


మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )


1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు 


వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.

అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

 


అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు. 


రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.


ఏమిటా చేప. అది మనస్సు  


దీన్ని జయించడం చాలా కష్టం. 


ఎంత ప్రయత్నించినా అది ఎండదు. 


మనస్సు అంటే ఏమిటి❓


మనస్సు అంటే సంకల్ప వికల్పాలు 


ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.


మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.


కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.


మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.

 

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. 


ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓

గడ్డిమేటు.


గడ్డిమేటు అంటే ఏమిటి❓


కుప్పపోసిన అజ్ఞానం.


గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా❓


మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.


కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️


ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.

 

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.


మరి అది పోవాలంటే ఏం చేయాలి❓


ఆవు వచ్చి మేయాలి.


ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓


ఆవు అంటే జ్ఞానం.


జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.


లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.


అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు

(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) 


జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. 


ఈ గోవును ఎవ్వరు మేపాలి. 


గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓


సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.


జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️


అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. 


ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.


ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. 


ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓


అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.


ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. 


ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.


ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు. 


ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓


వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.


సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.


ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.


మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా? లేదు. 

అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.


చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. 


చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓


మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట. 


ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను

*గోసేవ కు వరం*



💙💛💜💚❤️🧡 


🐄🐄🐄🐄🐄🐄


❤️🧡💜💛💙💚


*ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు సమాజ సేవ చేసుకుంటు ఈ లోకం లో ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి కాస్తో కూస్తో పుణ్యం సంపాదించేది ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది*.


*అ పుణ్య ప్రభావం తోనె ,తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది కన్నయతో పాటు ధర్మశ్రేష్ఠుడైన దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది*


*ఆ రొజు వచ్చిన అతిథి దేవునితో సమానం అంటారు అలాంటిది ఏకంగా దేవాధి దేవుడే అతిథిగా వచ్చాడు. కనుక అమే సంతోషం అధికమైన ఆమె తన ఆవు ఇచ్చిన పాలు ఇతరుల పిల్లల కు ఇవ్వగా వచ్చిన ఆహార పదార్థాలను అన్నిటినీ ఆరోజు కృష్ణార్జునులకు నివేదించింది*


*శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తరువాత ఆ నర నారాయనులు వెళ్లిపోయారు బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు*"


*దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు అర్జునా నాభక్తులెవరు అయాచిత ధణాన్ని కలలో కూడ ఆశించరు. ధణం ఐతె నేను ఆమెకు ఎప్పుడో ఇచ్చెవాడినె.కాని ఆమె ఏ రోజు నన్ను అడగలెదు.ఇచ్చిన తిసుకోదు కూడ ఎందుకంటె అది మితి మిరీన ప్రాణ హాని కూడ అనీ విజ్ఞుల కు విధితమె,నన్ను ప్రేమించే తనకు ఆ ఆవుకు కామధేనువు వరాన్ని ప్రసాదించాను.. ఆ గోవు అక్షయ పాత్ర లా క్షీరం లెదనక కాదనక ఎప్పుడు ప్రసాదిస్తుంది.దాని గోష్ణాన్నీ తాగిన ఆ వూరి పిల్లలంతా మహ బలవంతులౌతున్నారు వారిని కన్నవారు చాల సంతోష పడి, అలా అందరి ఆశీస్సులు ఆమెకు అందేవి.అది చాలాదా,విజయ మానవజన్మకు*


*సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో " మాధవా గోవు కామధేనువు ఎలా అవుతుంది అని*


*మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు[ నా ] గురించే ఎక్కువగా ఆలోచించి చేసే సేవ నా వక్కడికె చందదు. ముక్కోటి దేవతలకు ఈ సెవ గోవు ద్వార ఆమెకు సమకూరుతుంది ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచించడం వలన, నన్ను పదె పదె స్మరించడ మవుతుందనేది నికు తెలుసు కదా అర్జునా* 


*అదే ఆ ఆవు ను కామధేనువు చేస్తె మెపే పనే వుండదు.ఆ పనే గనుక లేకపోతే, ఆ భక్తురాలు రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ నా గురించి ఇతరులకు చెబుతూనె పాల ను దానం చేస్తూనె వుంటుంది కదా ఆ పుణ్యకర్మ తోనె తుది సమయం వచ్చినప్పుడు నేను తనని [ఇహలొకం] భూమి నుంచి దాటి నా లోకము [పరలోకం ]తీసుకు వెళ్ళిపోతాను.. నా శాశ్విత సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. ఈ జన్మాంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది. వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు. చూశారా మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు*.

..

🟦🟪🟨🟧🟥🟩

ప్రవచనములు


 

దేముడు














 

వృద్ధాప్యం


 

ప్రవచనములు


 

Affectionately


 

Skipping


 

Copied


 

Hindu


 

Good idea


 

Dear Citizen

: Government of Telangana is launching Dharani portal for non agricultural properties in Grama Panchayat, Municipalities and Municipal Corporations including GHMC and also going to issue Non Agricultural Pass Books to property owners. All citizens are requested to update their property details, Aadhar number and perform EKYC against your property by visiting GHMC Citizen Service Centers, Mee Seva or by clicking below link: https://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/UserInterface/Citizen/RevenueServices/SMSSendOTP.aspx

-Commissioner, GHMC

భగవంతుడు అంటే ఏమిటి...?



*రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... భగవంతుడు అంటే ఏమిటి...??? అంటే... ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు...*


*కాబట్టి ఓపిక చేసుకుని... ఈ చిన్న కథను చదవండి...*


*ఓ దేశాన్ని పాలించే రాజుకు మనసులో... ముఖ్యంగా మూడు అర్థంకాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి అవి...*


*1. దేవుడు ఏ వైపు చూస్తుంటాడు...???*

*2. దేవుడు ఎక్కడ ఉంటాడు...???*

*3. దేవుడు ఏం చేస్తాడు...???*


*ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు ఆ రాజు గారికి...*


*తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, శాస్త్రాధికారులను, మేధావులను ఆహ్వానించాడు... తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవర కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది...*


*ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. రాజు గారి ఆస్థానం చేరుకున్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చున్నారు...*


*పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు... రాజుకో విషయం నిర్దేశం చేసాడు...*

*చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి అని కండీషన్ పెట్టాడు...*


*దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు...*


*మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి...* 


*మొదటి ప్రశ్న...*

*దేవుడు ఏ వైపు చూస్తుంటాడు...???*

*దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు...*


*వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు...*


*మహారాజా...!!! ఈ దీపం ఎక్కడ చూస్తుంది??? నావైపా??? నీవైపా??? తూర్పువైపా??? పశ్చిమానికా??? పైనకా??? క్రిందకా??? ఎక్కడ చూస్తుందో చెప్పండి??? అని ప్రశ్నించాడు. అన్నివైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు...*


*ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా...??? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే...*


*మరి ఇక రెండవ ప్రశ్న...*

*దేవుడు ఎక్కడ ఉంటాడు...???* 

*అన్నాడు రాజు...*


*సరే...!!! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా...!!! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా? అని అడిగాడు...*


*పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది.తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు...*


*సరిగ్గా చెప్పారు మహారాజా...!!! అలాగే హృదయం అనే పాలను గురువు బోధ అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సులో తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి...*


*ఇక చివరి ప్రశ్న...*

*దేవుడు ఏం చేస్తాడు...??? అని...*


*నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంపించడమే పరమాత్మ పని’ అన్నాడు...*


*సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు....*


*శుభం భూయాత్*


*మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాం*

*మంచిని నేర్చుకుందాం*

*మంచిని ఆచరించుదాం*

*మంచిని అందరికి పంచుదాం*

*మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా*

 

*🙏శ్రీఅన్నమాచార్య గానామృతం🙏*

🌻🍀🌺🌻🍀🌺🌻🍀🌺🌻🍀

*🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵*

*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*


తాళ్ళపాక పెద్దతిరుమలాచర్య సంకీర్తన


*గానం. ప్రియ సిస్టర్స్*

*రాగం. కాపీ*


రేకు : 29 - 4

సంపుటము : 15 - 168

రేకు రాగము : బౌళి


మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా

యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ


నన్నుగావు కేశవ నారాయణ మాధవ

మన్నించు గోవింద విష్ణు మధుసూదన

వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా

సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ


కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ

అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా

తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా

జంటవాయుకు మచ్యుత జనార్దన


మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ

యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ

యిక్కువ నీ నామములు యివియే నా జపములు

చక్కగా నీ దాసులము సర్వేశ అనంత


🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺


భావము : 


- శ్రీ అమరవాది సుబ్రమణ్య దీక్షితులు గారు


     ఓ మత్స్యావతారా! కూర్మరూపా! వరాహమూర్తీ! నారసింహా! వామనాకారా! పరశురామా! శ్రీరామా! బలరామదేవా! ( శ్రీకృష్ణా! ) హితమును బోధించిన బుద్ధ భగవానుడా! కలికీ! ( నీకు వందనములు )


1. ఓ కేశవా! నారాయణా! మాధవా! నన్ను రక్షింపుము తండ్రీ! ఓ గోవిందుడా! విష్ణుమూర్తీ! మధుసూదనా! నన్ను మన్నింపుము. అనేక వర్ణములతో విరాజిల్లిన త్రివిక్రమా! వామనరూపా! శ్రీధరా! నిన్ను సన్నుతించెదను. ఓ హృషీకేశా! పద్మనాభా! మాటిమాటికీ నిన్ను స్మరించెదను.


2. ఓ దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నిన్ను కనుగొన్నాము. ప్రద్యుమ్నా! అనిరుద్దా! అంటే చాలు, మా పాపాలు పటాపంచలైపోతాయి. ఆది పురుషోత్తమా! అధోక్షజా! నరసింహ స్వరూపా! నీకు అనేక నమస్కారములు. ఓ అచ్యుతా! జనార్దనా! ఏనాటికీ నా తోడు విడిచిపెట్టవద్దు ప్రభూ!


3. ఓ ఉపేంద్రా! శ్రీహరీ! మోహన శ్రీకృష్ణా! నీకు మ్రొక్కెదము దేవా! ఓ ఇందిరా రమణా! శ్రీవేంకటాద్రినెక్కి నీ జాడ కనుగొని నీయొక్క నామములను నా జపముగా గానము చేయుచున్నాను. ఓ ఆనంతా! నీవు సర్వేశ్వరుడవు. అందుకే నీ దాసులమైన మమ్ము చక్కగా పరిపాలింపుము తండ్రీ!


*🌹🙏ఓం నమోవేంకటేశాయా🙏🌹*

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*

శ్రీసుబ్రహ్మణ్యపంచరత్నం

  


1) ద్విషడ్బాహుకమలనేత్ర శక్త్యాయుధధారిణం 

    పన్నగారివాహపూజ్య పన్నగారివాహనం 

    దేవసేనాధిపత్య దేవసేనవల్లభం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||


2) సామవేదగానలోల పరబ్రహ్మరూపం 

   సంభ్రమాశ్చర్యజనక శ్రీస్వామినాథం 

   కుండలినీసర్పరూప సంతానదాయకం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||




3) అపర్ణాశివపుత్ర విఘ్నరాజానుజం 

   ప్రణవార్థదివ్యబోధ గురుమండలరూపం 

   తారకసురాదిహంత ప్రచండవిక్రమం  

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||  


4) బ్రహ్మేంద్రనారదాది దేవగణపూజితం 

   సంగీతజ్ఞానప్రద మోక్షమార్గబోధకం 

   తాపత్రయదహన సంసారతారకం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||







5) షష్ఠీతిధిప్రియ వల్లీవల్లభం 

   కర్కటిమశూచ్యాది విషరోగభంజనం 

   అగ్నిగర్భసంభూత శ్రీగంగాత్మజం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||


     సర్వం శ్రీసుబ్రహ్మణ్యదివ్యచరణారవిందార్పణమస్తు

*ధార్మికగీత - 36*

 

                             *****

శ్లో:- *శ్లోకార్థేన ప్రవక్ష్యామి ౹*

            *యదుక్తం గ్రంథకోటిభిః ౹*

            *పరోపకారః పుణ్యాయ ౹*

            *పాపాయ పరపీడనమ్ ౹౹*

                                              

ఉత్పలమాల ( పంచపాది )


పాపము పుణ్యమంచనియు

        భావమునందున నుండుబేధమున్ 

తా పలు కావ్య గ్రంధముల 

         తప్పక జూపియు నెంత జెప్పినన్ 

నేపుగ నర్థ శ్లోకమున 

         నేర్పడ సెప్పెద తీర్పు జేసియున్ ,

పాపమనంగ నందరికి 

          పాయక పెక్కుగ కీడొనర్చుటే !

పాపముగాక పుణ్యమన 

         పాయక పెక్కుగ మంచి సేయుటే !


గోపాలుని మధుసూదన రావు

భాగవతామృతం

 **

విష్ణువు గర్భస్థకుని రక్షించుట


1-281-ఉ.ఉత్పలమాల


"కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది

క్కెయ్యది దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే

డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే

యయ్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!

కుయ్యడన్ = కుయ్ అని ఏడ్చుటకు; శక్తి = నేర్పు; లేదు = లేదు; ఉదర = కడుపులోని; గోళము = పిండము; లోపలన్ = లోపల; ఉన్నవాఁడన్ = ఉన్నవాడిని; దిక్కు = శరణు; ఎయ్యది = ఏది; అనాథను = దిక్కులేని వాడను; అని = అని; ఎప్పుడున్ = ఎప్పుడు; తల్లి = తల్లి; గణింప = ఎంచుతుండగ; విందున్ = వినుచుందును; నేడు = ఇవేళ; ఈ = ఈ; ఇషు = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నిని; పాయుట = దూరము చేయుట; కున్ = కు; ఏయ్యది = ఏది; మార్గము = దారి; నన్నున్ = నన్ను; కావన్ = కాపాడుటకు; ఏ = ఏ; అయ్య = మహాత్ముడు; కలండు = ఉన్నాడు; గర్భ = గర్భములో; జనిత = కలుగుతున్న; ఆపదన్ = ప్రమాదమును; ఎవ్వఁడు = ఎవడు; ఎఱుంగున్ = తెలిసికొనగలవాడు; దైవమా = దేవుడా.

"ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి; ఈ అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో; తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా! (తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.)

1-282-క.కంద పద్యము


చిచ్చఱకోలవశంబునఁ

జచ్చి బహిర్గతుఁడఁ గాని సమయమునను దాఁ

నుచ్చలితగర్భవేదనఁ

జచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్.

చిచ్చఱ = అగ్నిమయమైన, చిచ్చు+ఉఱ; కోల = బాణము; వశంబునన్ = వలన; చచ్చి = చనిపోయి; బహిర్గతుఁడన్ = బయటపడువాడు; కాని = కానట్టి; సమయమునను = సమయములో; తాన్ = తను; ఉచ్చలిత = చెదరిపోయిన; గర్భ = గర్భమువలని; వేదనన్ = బాధతో; చచ్చును = చనిపోవును; మా = మాయొక్క; తల్లి = తల్లి; ఘోర = ఘోరమైన; సంతాపమునన్ = శోకముతో.

అయ్యో ఈ చిచ్చులు చిమ్మే భయంకరబాణం వల్ల నేను చచ్చిపోవటం తథ్యం. కడుపులోని మృతశిశువును కనలేక అతిశయించిన గర్భవేదనతో అల్లాడి, అమ్మకూడా మరణించటం తప్పదు.

1-283-క.కంద పద్యము


చెచ్చెర బాణజ్వాలలు

వచ్చిన విష్ణుండు గావవచ్చు ననుచుఁ దా

ముచ్చటలు సెప్పు సతులకు

నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో.

చెచ్చెర = గబగబా; బాణ = బాణముయొక్క; జ్వాలలు = మంటలు; వచ్చినన్ = వచ్చినచో; విష్ణుండు = హరి; కావన్ = కాపాడుటకు; వచ్చున్ = వచ్చును; అనుచున్ = అంటూ; తాన్ = తను; ముచ్చటలు = కబుర్లు; చెప్పు = చెప్పును; సతులు = చెలికత్తెలు; కున్ = కి; నిచ్చలు = నిత్యమును; మా = మాయొక్క; అవ్వ = తల్లి; నేఁడు = ఇవేళ; నిజము = నిజము; అయ్యెడినో = అవుతుందోలేదో.

అమాంతంగా అస్త్ర జ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి నన్ను రక్షిస్తాడని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది. అమ్మ చల్లని మాట యథార్థమౌతుందా?

1-284-శా.శార్దూల విక్రీడితము


రాఁడా చూడ సమస్తభూతములలో రాజిల్లు వాఁ డిచ్చటన్

లేఁడా? పాఱుని చిచ్చఱమ్ముఁ దొలఁగన్ లీలాగతిం ద్రోచి నా

కీఁడా? నేఁ డభయప్రదాన మతఁ డూహింపన్ నతత్రాత మున్

గాఁడా? యెందఱిఁ గావఁ డీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో?"

రాఁడా = రాకపోతాడా; చూడన్ = చూచుటకు / కాపాడుటకు; సమస్త = అన్ని; భూతముల = జీవుల; లోన్ = లోను; రాజిల్లు = ప్రకాశించే; వాఁడు = వాడు; ఇచ్చటన్ = ఇక్కడ; లేడా = లేకపోతాడా; పాఱుని = బ్రాహ్మణుని; చిచ్చఱ = అగ్నిమయమైన; అమ్మున్ = బాణమును; తొలఁగన్ = తొలగించుటకు; లీలా = లీలతోకూడిన; గతిన్ = విధముగ; త్రోచి = తోసేసి; నాకు = నాకు; ఈఁడా = ఇవ్వడా; నేఁడు = ఇవాళ; అభయ = అభయమును; ప్రదానము = ప్రసాదించుట; అతఁడు = అతడు; ఊహింపన్ = ఆలోచించిన; నతన్ = మ్రొక్కినవారిని; త్రాత = సంరక్షించువాడు; మున్ = ఇంతకు ముందు; కాఁడా = అయి ఉండడా; ఎందఱిన్ = ఎందరిని; కావఁడు = కాపాడలేదు; ఈ = ఈ; ఎడల = విషయములో; మత్ = నాయొక్క; కర్మంబు = కర్మ; తాన్ = తాను; ఎట్టిదో = ఎలాంటిదో.

అఖిల ప్రాణులో అంతర్యామిగా ప్రకాశించే ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా? నన్ను రక్షించటానికి రాడా? నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయడా? ఆపన్నుడనైన నాకు అభయమీయడా? కాపాడమని కైమోడ్చేవాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొరలాలించి నన్ను లాలించి పాలించడా? ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో?

1-285-వ.వచనము

అని గతాగతప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున.

అని = అని; గత = ఉండినది; అగత = ఉండనిది యైన; ప్రాణుండు = ప్రాణము కలవాడు; ఐ = అయి; భ్రూణ = పిండము; గతుండు = వలె ఉన్నవాడు; ఐన = అయినట్టి; శిశువు = పిల్లవాడు; చింతించు = బాధపడుతున్న; సమయంబునన్ = సమయమున.

ఇలా వస్తూపోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడుపులో పిండ రూపంలో ఉన్న చిన్నారి ఎన్నో విధాల చింతించసాగాడు.

1-286-సీ.సీస పద్యము


మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని;

పై నున్న పచ్చని పటమువాఁడు;

గండభాగంబులఁ గాంచన మణి మయ;

మకరకుండలకాంతి మలయువాఁడు;

శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి;

కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు;

బాలార్కమండల ప్రతిమాన రత్న హా;

టక విరాజిత కిరీటంబువాఁడు;

1-286.1-తే.

కంకణాంగద వనమాలికా విరాజ

మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ

డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ

విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.

మేఘంబు = మేఘము; మీఁది = మీద ఉన్న; క్రొమ్మెఱుఁగు = క్రొత్త మెరుపుతీగ; కైవడిన్ = వలె; మేని = శరీరము; పైన్ = మీద; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చనిరంగు కల; పటమువాఁడు = వస్త్రము కలవాడు; గండభాగంబులన్ = చెక్కిళ్ళయందు; కాంచన = బంగారపు; మణి = రత్నములు; మయ = తాపింపబడిన; మకరకుండల = మకరకుండలములయొక్క; కాంతి = వెలుగు; మలయువాఁడు = పరచబడినవాడు; శర = బాణముల యొక్క; వహ్నిన్ = అగ్నిని; అడఁగించు = అణచివేయు; సంరంభమునన్ = ఆత్రుత / వేగిరిపాటు; చేసి = వలన; కన్నులన్ = కళ్ళలో; నును = చిక్కటి; కెంపు = ఎరుపురంగు; కలుగువాఁడు = కలవాడు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; మండల = చక్రమును; ప్రతిమాన = పోలిన; రత్న = రత్నములతోను; హాటక = బంగారముతోను; విరాజిత = వెలుగొందుచున్న; కిరీటంబు = కిరీటము; వాఁడు = కలవాడు;

కంకణ = కంకణములు / మురుగులు; అంగద = భుజకీర్తులు; వనమాలికా = ఆకులు పువ్వులుతో కట్టిన మాలలతో; విరాజమానుడు = ప్రకాశించువాడు; అసమానుడు = సాటిలేనివాడు; అంగుష్ట = వేలెడు; మాత్ర = అంతమాత్రమే; దేహుడు = దేహము కలవాడు; ఒక్క = ఒక; గదన్ = గదను; చేతన్ = చేతిలో; దాల్చి = ధరించి; నేత్ర = నేత్రములకు; ఉత్సవముగన్ = పండుగ అగునట్లు; విష్ణుడు = హరి; ఆవిర్భవించెన్ = ప్రభవించెను / పుట్టెను; ఆ = ఆ; వేళ = సమయ; అందున్ = లో.

అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి కనలుతున్నాడు. శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగుష్ఠ మాతృడై గదాధారియై ఇలా ఆవిర్భవించి గర్భస్త బాలకుడిని కాపాడేడు. మేఘంమీద మెరుపుతీగలా, నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు, చెక్కిళ్ళపై మణులు పొదిగిన మరకకుండలాల పసిడికాంతుల ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్ని జ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత జేవురించిన వాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో, భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లేవాడు, అంగుష్ఠమాత్ర దేహుడు అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా ఆ సమయంలో గర్భంలోని అర్భకుని ముందు అవిర్భవించాడు.

1-287-వ.వచనము

ఇట్లు భక్తపరాధీనుం డయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలం దనచేతి యఖండిత మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి విప్రుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁజెఱచి డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి గర్భంబు గందకుండ నర్భకునికి నానందంబు గల్పించిన.

ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తుల; పర = పరముగ; ఆధీనుండు = లొంగి ఉండువాడు; అయిన = అయినట్టి; పరమేశ్వరుండు = హరి; ఆవిర్భవించి = ప్రభవించి; మంచు = మంచును; విరియించు = విరిచేసే; మార్తాండు = సూర్యుని; చందంబునన్ = వలె; శిశువు = శిశువు; కున్ = కు; దశదిశలన్ = పది దిక్కులను {దశదిశలు - 4దిక్కులు 4మూలలు కింద పైన మొత్తం 10, తూర్పుదిక్కు, ఆగ్నేయమూల, దక్షిణదిక్కు, నైరుతిమూల, పడమరదిక్కు, వాయవ్యమూల, ఉత్తరదిక్కు, ఈశాన్యమూల, అథో, ఊర్థ్వములు}; తన = తనయొక్క; చేతి = చేతి; అఖండిత = అఖండమైన; మహా = మిక్కిలి పెద్దదైన; ఉల్కా = ఉల్కతో; సన్నిభంబు = సమానమైనట్టిది; ఐన = అయినట్టి; గదాదండంబున్ = గదాదండము; మండల = గుండ్రని; ఆకారంబుగన్ = ఆకారముగా; జిఱజిఱన్ = మిక్కిలి వేగముగ; త్రిప్పి = తిప్పి; విప్రుని = బ్రాహ్మణుని; చిచ్చఱ = అగ్నిమయమైన; అమ్ము = బాణముయొక్క; వేఁడిమిన్ = తాపముయొక్క; పోఁడిమిన్ = ఉద్రిక్తతను; చెఱచి = చెదరగొట్టి; డింభకుని = పిల్లవాని; పరితాప = పరితాపముయొక్క; విజృంభణంబు = చెలరేగుటను; నివారించి = అరికట్టి; గర్భంబున్ = గర్భమును; కందకుండన్ = కందిపోకుండగ; అర్భకుని = పసిబిడ్డ; కిన్ = కు; ఆనందంబున్ = ఆనందమును; కల్పించినన్ = కలుగజేయగా.

ఈ విధంగా సాక్షాత్కరించి భక్తపరాధీనుడైన భగవానుడు భానుడు మంచును పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్కవంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశదిశలా గిరగిర త్రిప్పుతూ, సెగలు పొగలు గ్రక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు. కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి అపరిమితానందం కలిగించాడు.

1-288-మ.మత్తేభ విక్రీడితము


గదఁ జేఁబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ

ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ

సదయుం డెవ్వఁడొకో యటంచు మదిలోఁ జర్చించుచున్ శాబకుం

డెదురై చూడ నదృశ్యుఁ డయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా!

గదన్ = గదను; చేన్ = చేతితో; పట్టి = పట్టుకొని; పరిభ్రమించుచున్ = వేగముగ తిరుగుతూ; గదా = గదయొక్క; ఘాతంబులన్ = దెబ్బలచేత; దుర్భయ = మహచెడ్డభయమును; ప్రదము = పుట్టించునది; ఐ = అయి; వచ్చు = వచ్చుచున్న; శర = బాణమువలని; అగ్నిన్ = అగ్నిని; తుత్తుమురుగాన్ = తురుము+తురుముగ, ముక్కలుముక్కలుగా; భంజించి = విరిచేసి; రక్షించు = రక్షించుచున్న; ఈ = ఈ; సదయుండు = మంచి దయ కలవాడు; ఎవ్వఁడొకో = ఎవరో; అటంచు = అనుకొనుచు; మది = మనసు; లోన్ = లోపల; చర్చించున్ = తర్కించుకొనుచు; శాబకుండు = శిశువు; ఎదురు = ఎదురుగ; ఐ = అయి; చూడన్ = చూడబోగా; అదృశ్యుఁడు = మాయమైనవాడు; అయ్యెన్ = ఆయెను; హరి = హరి; సర్వేశుండు = సమస్తమునకు ఈశ్వరుడు, కృష్ణుడు; విప్ర = బ్రాహ్మణులలో; ఉత్తమా = ఉత్తముడా.

అరే ఎవరీ కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ, భయంకరంగా పైనబడి బాధిస్తున్న బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి, నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు ఆంటూ తర్కించుకొంటూ గర్భస్థశిశువు పరీక్షించేలోగా భగవంతుడు అంతర్హితుడైనాడు.

శ్రీసుబ్రహ్మణ్యపంచరత్నం

  


1) ద్విషడ్బాహుకమలనేత్ర శక్త్యాయుధధారిణం 

    పన్నగారివాహపూజ్య పన్నగారివాహనం 

    దేవసేనాధిపత్య దేవసేనవల్లభం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||


2) సామవేదగానలోల పరబ్రహ్మరూపం 

   సంభ్రమాశ్చర్యజనక శ్రీస్వామినాథం 

   కుండలినీసర్పరూప సంతానదాయకం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||




3) అపర్ణాశివపుత్ర విఘ్నరాజానుజం 

   ప్రణవార్థదివ్యబోధ గురుమండలరూపం 

   తారకసురాదిహంత ప్రచండవిక్రమం  

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||  


4) బ్రహ్మేంద్రనారదాది దేవగణపూజితం 

   సంగీతజ్ఞానప్రద మోక్షమార్గబోధకం 

   తాపత్రయదహన సంసారతారకం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||







5) షష్ఠీతిధిప్రియ వల్లీవల్లభం 

   కర్కటిమశూచ్యాది విషరోగభంజనం 

   అగ్నిగర్భసంభూత శ్రీగంగాత్మజం 

   భక్తవందితాంఘ్రియుగళ శ్రీ సుబ్రహ్మణ్యం ||


     సర్వం శ్రీసుబ్రహ్మణ్యదివ్యచరణారవిందార్పణమస్తు

నేేేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో

 భ్రమ... నేేేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో...నేను కాబట్టి చేయగలిగాను నేనే గొప్ప అనుకుంటూ ఉంటాం ...అదంతా ఒట్టి భ్రమ ....


చేసేవాడు చేయించేవాడు అంతా ఆ పరమాత్ముడే .... మనం నిమిత్తమాత్రులం మాత్రమే 🙏


పట్టాభిషేకం జరిగింది, శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు.. హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు...


ప్రభూ! లంకలో విభీషణుడి ఇంటికి వెళ్ళేంత వరకు , నాకు లంకలో అసలు మహా పురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది.... ప్రభూ! భక్తులు, సాధువులు, సంతులు కేవలం భరతభూమి లోనే ఉంటారనీ పృథ్విలో ఇంకా ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. 


కానీ లంకలో ఎంత వెతికినా సీతామాత ను కనుగొనలేక పోయిన వేళలో విభీషణుని సలహా మేర తల్లి దర్శనం కలిగిన తరువాత అనిపించింది... స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధు పురుషుని ద్వారా తెలియజేయబడిందే.... బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుక పరచడానికి పంపాడేమో అని అనుకున్నాను... 


అశోకవనంలో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాత ను వధించేందుకు కత్తి దూసిన క్షణంలో ,ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది.... కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడిని వారించి వాడి నుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది...


ప్రభూ! ఎంత చక్కని అనుభవమిచ్చావు, అక్కడ కూడా మంచి వారి రూపంలో మండోదరి తల్లిని చూపించావు... నేనే లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది... చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాకూడ కలిగి ఉండేేది...


కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయంగా రావణుని పత్ని మండోదరి చేత చేయించావు.... దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించాలి అనుకుంటావో వారితో ఆ పని నెరవేర్చుకుంటావు... ఇందులో మా మహత్యమేమీ లేదు. 


దేవా..! త్రిజట తన స్వప్న వృత్తాంతం తోటి రాక్షస స్త్రీలకు చెబుతూ లంక లోకి ఒక కోతి వస్తుందనీ.., ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను..... ప్రభు శ్రీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెబుతుందే మరేం చేయాలి అని.. 


రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించావని అర్ధమైంది. 


ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది ...రావణుడు తమ్ముని మాట మన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...


లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవు తున్నందుకు... లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....


ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణున్నే ఉపయోగించుకొని కార్యం నడిపావు.., అటువంటిది నాచే చేయించు కోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!🙏🙏


దీనిని బట్టి నేను నిమిత్త మాత్రున్ని , మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, అని అర్థం అయింది..,


నీతి


అందుచేత జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే...


మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో, మన సాధకత్వమో కాదు..

*అందుకని నేనే కనక లేకపోతే ఏమీ జరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు...


ఆంజనేయ స్వామి అంతటి మహాను భావులే అలా అనుకున్నప్పుడు... మానవ మాత్రులం.. ఎగిరి పడుతూ ఉంటాము.. నా అంతటి వాడు లేడని.. నేను కాకపోతే ఎవరు చేయగలరని.

Work Man Compensation Act

 Civil Appeal 7220/2011 Beli Ram Vs Rajinder Kumar Apex Court 23 September 2020 

1. The Driver of a Truck claimed compensation under Work Man Compensation Act for injuries arising out of Accident impleading Owner as well as the Insurance Company.

2. The insurance company pleaded that the driver at the time of accident was not having a valid licence as his licence had not been renewed for the last three years and therefore owner was liable.

3. It has been held that as the owner has permitted to let the driver drive the truck with an expired licence for almost three (3) years therefore it is clearly a case of lack of reasonable care on the part of owner.

4. It was the duty of the owner to ensure that an employee gets his licence renewed and further if the original licence is verified by the owner himself at the time of employment then certainly the employer would know when the licence of the Driver expires.

5. The driver though himself at fault has been allowed Compensation under the Compensation Act from the owner absolving Insurer of the Liability.

బ్రాహ్మణులంటే ఎవరు ?

 


 


వనం జ్వాలా నరసింహారావు గారి రచన 


ఆంధ్రభూమి దినపత్రిక

06.12.2015


నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన కలుగజేయాలి. హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం.


"బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" - అంటే "యజ్ఞం” అనే పదం నుంచి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.


అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణకమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.


వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.


వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని


రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. పౌరోహిత్యం వ

ృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు. వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.


వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?


చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!


కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చ


ేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణు.

లు.


ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం !


అది కేవలం వక్రీకరణ, బ్రాహ్మణుడు స్వతాహ గా సాత్వీకుడు, రాజుల కాలంలో లేనివన్నీ బ్రిటీష్ కాలంలో వచ్చాయి, అధికారులు చేసినవాన్ని బ్రాహ్మణుడు మీద పడ్డాయి జరిగినది ఇది..... 🙏🙏🙏🙏🙏 🙏



శివానందలహరి 13 వ శ్లోకం

 *దశిక రాము**




" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

అవతారిక:
తన అంతఃకరణాన్ని ఈశ్వర పాద పద్మము లందు లగ్నము చేయలేక
అసారమైన సంసారంలోపడి, కొట్టుమిట్టాడుతున్న తనకు , జ్ఞానము
నిచ్చి రక్షించడం, దీనజన పాలకుడైన పరమేశ్వరుని భరమయి యున్నదని,
శంకరులు ఈశ్లోకంలో ఈశ్వరునకు విన్నవించారు. 

శ్లో"  
**అసారే సంసారే**

**నిజభజనదూరే జడధియా**
        
**భ్రమంతం మా మంధం** 

**పరమకృపయా పాతు ముచితం**
        
**మదన్యః కో దీన _ స్తవ కృపణరక్షాతి నిపుణః**

**త్వదన్యః కోవామే**

**త్రిజగతి శరణ్యః పశుపతే !!**

పదవిభాగం:
అసారే , సంసారే _  నిజభజనదూరే _ జడధియా _ భ్రమంతం _ 
మామ్ _ అంధం  _ పరమకృపయా  _  పాతుమ్ _ ఉచితమ్ _ మదన్యః _ 
కః _ దీనః _ తవ _ కృపణరక్షాతినిపుణః _ త్వదన్యః  _ కః _ వా _ మే _ 
త్రిజగతి _ శరణ్యః _ పశుపతే.

తాత్పర్యం:
ఓ పశుపతీ ! ఈశ్వరా ! నీ భజనకు దూరమైనదియూ, సారహీనమైనదియూ
అయిన సంసారమందు పరిభ్రమిస్తూ , గ్రుడ్డి వాడనైయున్న నన్ను అత్యంత
దయతో రక్షింౘడం, నీకు తగినపని. ఎందుకంటే, నీకు నాకంటే రక్షింప 
దగిన దీనుడు ఇంకెవడున్నాడు?  మఱి నాకో, నీకంటే దీనుల రక్షింౘుట
యందు మిక్కిలి నేర్పుగల రక్షకుడు  ఇంకెవడున్నాడు? నేను అత్యంత
దీనుడిని.  నీవు దీన రక్షణలో అత్యంత నిపుణుడివి.  అందుచేత నన్ను
నీవు తప్పక రక్షింౘాలి.

వివరణ:  
శివానుగ్రహం లేకపోతే , మన అంతఃకరణాన్ని అనగా మనస్సును 
పరమేశ్వర పాద ధ్యానంపై మనం నిలబెట్టలేము. అందుకే శంకరులు
దీనుడైన  తనను రక్షింౘుమని శరణమును కోరదగిన పరమేశ్వరుని
ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు...

ముల్లోకాలలో నూ, ముక్కంటి ని మించిన ముక్తిప్రదాతా, దీనజన
రక్షకుడూ, మఱొకడు లేడని శంకరులు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించారు.

            " అపిచేత్సుదురాచారో, భజతే మామనన్యభాక్
               సాధురేవ సమంతవ్యః, సమ్యక్ వ్యవసితో హిసః "

                                                                 (భగవద్గీత)
        
తాత్పర్యం: 
గొప్ప దురాచారుడు  అయినా నన్ను భజిస్తే , అతణ్ణి సత్పురుషుని గానే
పరిగణింౘాలి, ఎందుకంటే అతడు నిశ్చయ బుద్ధి కలవాడు. అనగా
పరమాత్మ సేవతో సమానమైనది మరొకటి లేదని నిశ్చయింౘు 
కొన్నవాడు.
🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**

మూకపంచశతి

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌹 🌹


🌹 ఆర్యాశతకము🌹

       

🌹13.


ఆమ్రతరుమూలవసతేః


ఆదిమపురుషస్య నయనపీయూషమ్౹


ఆరబ్ధయౌవనోత్సవం


ఆమ్నాయ రహస్యమన్తరవలమ్బే౹౹


🌺భావం:కాంచీక్షేత్రమున మామిడి చెట్టుయొక్క మూలము నివాసముగా గల ప్రధమపురుషుడు పరమేశ్వరుడు.ఆరబ్ధయౌవనోత్సవ అయిన కామాక్షీ దేవి, ఆ ఏకామ్రేశ్వరుని నేత్రములకు అమృతముగా శోభిల్లుచున్నది. వేదములకే ఆమ్నాయమనిపేరు. వేదరహస్య స్వరూపమయిన భువనేశ్వరి ని నా అంతఃకరణమున అవలంబించెదను(పట్టుకొందును).


💮కామాక్షీ దేవిచే ఆమ్రవృక్షమూలమున ఆరాధించబడిన కామేశ్వరుడు ఏకామ్రేశ్వరుడైనాడు.యౌవ్వనోత్సవముమొనర్చుకొనుచున్న కామాక్షి ,మహదేవుని కన్నులకు అమృతతుల్యమైనది.ఆమ్నాయముల అర్థమెరుగుటయేకష్టతరము.అటువంటి దుర్లభమైనటువంటి ఆమ్నాయ(వేదరహస్యము) గుహ్యస్వరూపమైన ఆపరాత్పరిని నా హృదయ మందే పట్టుకొనెదనని మూకకవీంద్రులు వచించుచున్నారు. 🙏


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ

ధర్మము-సంస్కృతి

సాయం


 




శ్రీరామస్తుతిః

 నారదకృత " శ్రీరామస్తుతిః "*


*శ్రీరామం మునివిశ్రామం జనసద్ధామం హృదయారామం*


*సీతారంజన సత్యసనాతన రాజారామం ఘనశ్యామమ్*


*నారీ సంస్తుత కాళిందీనత నిద్రాప్రార్థిత భూపాలం*


*రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలమ్* 





దత్తు





 

Modern technology


 

Hindu


 

Vehicles inspection






 

**హిందూ ధర్మం** 54

 **దశిక రాము**




 (సత్యం)


#త్రికరణ శుద్ధిగా సత్యాన్ని ఆచరించడం ధర్మం. అంటే మనసులో ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనుల్లో కూడా సత్యం ఉండాలి. అంటే నీతీగా, నిజాయతీగా బ్రతకాలి, లంచాలు తీసుకోకుండా బ్రతకాలి, అక్రమసంపాదన ఉండకూడదు, ఎవరినీ మోసగించకూడదు. అప్పుడే సత్యాన్ని పాటిస్తున్నాడని అర్దం.


ఉపనిషత్తులు చాలా గొప్పమాటలు చెప్తాయి. అక్రమంగా డబ్బు సంపాదించినవాడు, దుర్మార్గుడు వద్ద నుంచి డబ్బు తీసుకుని బ్రతికేవాడు, దుర్మార్గులని, అక్రమార్కులని ప్రోత్సహించేవారు పాపాత్ములు. వారు మోక్షానికి అనర్హులు. మనం తినే ఆహారం వలన మనసులో మంచి భావనలు ఏర్పడతాయి. అక్రమసంపాదన వలన, తినే ఆహారం కూడా కలుషితమవుతుంది, దొంగ బుద్ధి పెరుగుతుంది. అటువంటి ఆహారం మనసును అపవిత్రం చేస్తుంది. అపవిత్రమైన మనసు చెడు సంకల్పాలు చేస్తుంది, ఫలితంగా మనిషి దుర్మార్గుడిగా మారి లోకకంఠకుడవుతాడు. దైవానికి దూరం అవుతాడు. అట్లాగే అవినీతిపరుల సొమ్ము తినే బ్రతికేవారికి, అతడి వద్ద పనిచేసే ఉద్యోగులకు ఈ దోషం ఉంటుంది. వారు ఎన్ని కర్మలు చేసినా, అవినీతిపరుడి వద్ద నుంచి వచ్చిన ధనంతో ఆహారం తిన్నారు కనుక వారు కూడా అధోగతి పాలవుతారు.    


సమాజంలో అవినీతిని, అక్రమాలను, లంచగొండితనాన్ని ప్రోత్సహించడం సత్యవ్రతానికి విరుద్ధం. పరిపాలించే రాజు సత్యవంతుడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, అదే అతడు అధర్మాత్ముడు, దొంగ అయితే దేశానికి సర్వ అరిష్టాలు చుట్టుకుని జనం నశించిపోతారని శాస్త్రమే చెప్తున్నది. కనుక సమాజంలో మంచిని పెంచడం, నీతి, నిజాయతీలను ప్రోత్సహించడం సత్యవంతుని లక్షణం. మనసులో కూడా ఇతరుల సొమ్మును ఆశించకపోవడం సత్యం.   


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః 🙏

 ౧౦౮. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః 🙏


కం. ప్రాపువు మాకున్ షట్చ


క్రోపరి సంస్థిత! శుభాళి కోరకనే నీ


వే పలు విధముల గొలుపుచు


మాపయి దయచూపుదుగ మంజుల వాణీ!🙏


అమ్మకు పాదాభివందనములతో🙏

చింతా రామకృష్ణారావు

రాధే బృందావనేశ్వరి

 🌹🥀🌹🌹🥀🌹


తప్త కాంచన గౌరంగి!

రాధే బృందావనేశ్వరి!

వృషభాను సుతే దేవి!

ప్రణమామి హరి ప్రియా!


*భావం:-*

మెరిసే బంగారు వర్ణం శరీరం కలది, బృందావన రాణి, కృష్ణుడికి ప్రియమైనది, వృషభానుని కుమార్తె అయిన శ్రీ రాధాదేవికి ప్రణామము.......


🌷🥀🌷🌷🥀🌷


*జ్ఞాన యోగం/బ్రహ్మవిద్య/సాధన/ఆత్మజ్ఞానం సంబంధ 78 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

78 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/jnanayogam-pdf


               (OR)

 

బ్రహ్మవిద్యా రత్నాకరము-1 నుంచి 2 భాగాలు www.freegurukul.org/g/JnanaYogam-1


జీవిత పరమార్ధము - వేదాంత శాస్త్రము www.freegurukul.org/g/JnanaYogam-2


అద్వైత సిద్ధి www.freegurukul.org/g/JnanaYogam-3


ఆత్మానాత్మ వివేక దర్శిని www.freegurukul.org/g/JnanaYogam-4


బ్రహ్మ విద్యాసుధార్ణవము www.freegurukul.org/g/JnanaYogam-5


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-6


విశ్వ వేదన www.freegurukul.org/g/JnanaYogam-7


సత్య ధర్మ విచారణ - ధర్మ చర్చ www.freegurukul.org/g/JnanaYogam-8


ఆత్మ అనగా ఏమిటి www.freegurukul.org/g/JnanaYogam-9


ఆత్మబోధ www.freegurukul.org/g/JnanaYogam-10


బ్రహ్మ జిజ్ఞాస-1 www.freegurukul.org/g/JnanaYogam-11


బ్రహ్మ జిజ్ఞాస-2 www.freegurukul.org/g/JnanaYogam-12


బ్రహ్మ జిజ్ఞాస-3 www.freegurukul.org/g/JnanaYogam-13


బ్రహ్మ జిజ్ఞాస-4 www.freegurukul.org/g/JnanaYogam-14


త్రిపురా రహస్య దీపిక-జ్ఞాన ఖండము www.freegurukul.org/g/JnanaYogam-15


ఆత్మ సాక్షాత్కారము www.freegurukul.org/g/JnanaYogam-16


బ్రహ్మవిద్య www.freegurukul.org/g/JnanaYogam-17


వేదాంత విద్యాసారధి www.freegurukul.org/g/JnanaYogam-18


బ్రహ్మవిద్యానుసంధాన దర్పణం www.freegurukul.org/g/JnanaYogam-19


జ్ఞానామృత సారము www.freegurukul.org/g/JnanaYogam-20


బ్రహ్మ విద్యా దర్పణము www.freegurukul.org/g/JnanaYogam-21


శంకరాద్వైత వ్యాసమాల-1 www.freegurukul.org/g/JnanaYogam-22


శంకరాద్వైత వ్యాసమాల-3 www.freegurukul.org/g/JnanaYogam-23


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-24


పరిపూర్ణ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-25


ఆత్మ తత్వ వివేకము www.freegurukul.org/g/JnanaYogam-26


వివర్త వాద వివేకము www.freegurukul.org/g/JnanaYogam-27


బ్రహ్మ విద్యా వైభవము www.freegurukul.org/g/JnanaYogam-28


ఆత్మ తత్వము www.freegurukul.org/g/JnanaYogam-29


అద్వైత బోధిని www.freegurukul.org/g/JnanaYogam-30


బ్రహ్మవిద్య ప్రాధమిక సూత్రములు www.freegurukul.org/g/JnanaYogam-31


సత్యార్ధ ప్రకాశము www.freegurukul.org/g/JnanaYogam-32


మానవ జన్మ సాఫల్యము-ముక్తి మార్గము www.freegurukul.org/g/JnanaYogam-33


జీవన్ముక్తి వివేకః www.freegurukul.org/g/JnanaYogam-34


భగవదన్వేషణ-కొన్ని మంచి మాటలు www.freegurukul.org/g/JnanaYogam-35


సర్వ వేదాంత శిరోభూషణం www.freegurukul.org/g/JnanaYogam-36


మోక్షస్వరూప నిర్ణయము www.freegurukul.org/g/JnanaYogam-37


ఆత్మ దర్శనము www.freegurukul.org/g/JnanaYogam-38


సర్వోపనిషత్ సార సంగ్రహము www.freegurukul.org/g/JnanaYogam-39


ముముక్షు ధర్మము www.freegurukul.org/g/JnanaYogam-40


విజ్ఞాన వీచికలు-ఆధ్యాత్మికతరంగాలు www.freegurukul.org/g/JnanaYogam-41


సాధన www.freegurukul.org/g/JnanaYogam-42


ఆత్మా- చిత్ ప్రవచనములు www.freegurukul.org/g/JnanaYogam-43


ఒకటి సాధిస్తే అన్ని సాధించినట్లే www.freegurukul.org/g/JnanaYogam-44


సాధన సోపానాలు www.freegurukul.org/g/JnanaYogam-45


తత్వబోధ www.freegurukul.org/g/JnanaYogam-46


వివేక చింతామణి www.freegurukul.org/g/JnanaYogam-47


సనత్సు జాతీయము www.freegurukul.org/g/JnanaYogam-48


వేదాంతపు కథలు www.freegurukul.org/g/JnanaYogam-49


గురుప్రభోద తారావళి www.freegurukul.org/g/JnanaYogam-50


జగన్మిధ్యా - తత్వ పరిశీలనము www.freegurukul.org/g/JnanaYogam-51


అద్వైతం www.freegurukul.org/g/JnanaYogam-52


అధ్యాత్మ జడ్జిమెంట్ www.freegurukul.org/g/JnanaYogam-53


మోక్ష సాధన www.freegurukul.org/g/JnanaYogam-54


జ్ఞానదీపిక www.freegurukul.org/g/JnanaYogam-55


సద్గురు తత్త్వభోధ www.freegurukul.org/g/JnanaYogam-56


జ్ఞానకైవల్య సిద్ధి www.freegurukul.org/g/JnanaYogam-57


ప్రశ్నోత్తర మాణిక్యమాల www.freegurukul.org/g/JnanaYogam-58


మానస బోధ www.freegurukul.org/g/JnanaYogam-59


మోక్ష మార్గము www.freegurukul.org/g/JnanaYogam-60


మోక్షసాధన రహస్యము www.freegurukul.org/g/JnanaYogam-61


కైవల్య సాధని www.freegurukul.org/g/JnanaYogam-62


ఆచరణ - అనుభవము www.freegurukul.org/g/JnanaYogam-63


భక్తి - వైరాగ్యము www.freegurukul.org/g/JnanaYogam-64


భక్తి వైరాగ్య కథలు www.freegurukul.org/g/JnanaYogam-65


జ్ఞాన కథలు www.freegurukul.org/g/JnanaYogam-66


యధార్ధ బోధిని www.freegurukul.org/g/JnanaYogam-67


సాధన రహస్యము www.freegurukul.org/g/JnanaYogam-68


శాంతి సామ్రాజ్యము www.freegurukul.org/g/JnanaYogam-69


చిత్త ప్రభోధ www.freegurukul.org/g/JnanaYogam-70


సాధన సమన్వయము www.freegurukul.org/g/JnanaYogam-71


స్వీయ జ్ఞానం www.freegurukul.org/g/JnanaYogam-72


తత్త్వ సూక్తి సాహస్రి www.freegurukul.org/g/JnanaYogam-73


మోక్ష మార్గదర్శి www.freegurukul.org/g/JnanaYogam-74


ఆదిశంకరుల అపరోక్షానుభూతి -బ్రహ్మ విద్యా విధానము www.freegurukul.org/g/JnanaYogam-75


జీవన్ముక్తి వివేకః - భావప్రకాశిక www.freegurukul.org/g/JnanaYogam-76


జీవన్ముక్తి ప్రకాశిక www.freegurukul.org/g/JnanaYogam-77


చిత్ శక్తి విలాసము www.freegurukul.org/g/JnanaYogam-78



బ్రహ్మవిద్య/జ్ఞాన యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123