*🙏శ్రీఅన్నమాచార్య గానామృతం🙏*
🌻🍀🌺🌻🍀🌺🌻🍀🌺🌻🍀
*🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵*
*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*
తాళ్ళపాక పెద్దతిరుమలాచర్య సంకీర్తన
*గానం. ప్రియ సిస్టర్స్*
*రాగం. కాపీ*
రేకు : 29 - 4
సంపుటము : 15 - 168
రేకు రాగము : బౌళి
మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ
నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ
కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన
మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
భావము :
- శ్రీ అమరవాది సుబ్రమణ్య దీక్షితులు గారు
ఓ మత్స్యావతారా! కూర్మరూపా! వరాహమూర్తీ! నారసింహా! వామనాకారా! పరశురామా! శ్రీరామా! బలరామదేవా! ( శ్రీకృష్ణా! ) హితమును బోధించిన బుద్ధ భగవానుడా! కలికీ! ( నీకు వందనములు )
1. ఓ కేశవా! నారాయణా! మాధవా! నన్ను రక్షింపుము తండ్రీ! ఓ గోవిందుడా! విష్ణుమూర్తీ! మధుసూదనా! నన్ను మన్నింపుము. అనేక వర్ణములతో విరాజిల్లిన త్రివిక్రమా! వామనరూపా! శ్రీధరా! నిన్ను సన్నుతించెదను. ఓ హృషీకేశా! పద్మనాభా! మాటిమాటికీ నిన్ను స్మరించెదను.
2. ఓ దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నిన్ను కనుగొన్నాము. ప్రద్యుమ్నా! అనిరుద్దా! అంటే చాలు, మా పాపాలు పటాపంచలైపోతాయి. ఆది పురుషోత్తమా! అధోక్షజా! నరసింహ స్వరూపా! నీకు అనేక నమస్కారములు. ఓ అచ్యుతా! జనార్దనా! ఏనాటికీ నా తోడు విడిచిపెట్టవద్దు ప్రభూ!
3. ఓ ఉపేంద్రా! శ్రీహరీ! మోహన శ్రీకృష్ణా! నీకు మ్రొక్కెదము దేవా! ఓ ఇందిరా రమణా! శ్రీవేంకటాద్రినెక్కి నీ జాడ కనుగొని నీయొక్క నామములను నా జపముగా గానము చేయుచున్నాను. ఓ ఆనంతా! నీవు సర్వేశ్వరుడవు. అందుకే నీ దాసులమైన మమ్ము చక్కగా పరిపాలింపుము తండ్రీ!
*🌹🙏ఓం నమోవేంకటేశాయా🙏🌹*
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి