🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
శ్లో:- *శ్లోకార్థేన ప్రవక్ష్యామి ౹*
*యదుక్తం గ్రంథకోటిభిః ౹*
*పరోపకారః పుణ్యాయ ౹*
*పాపాయ పరపీడనమ్ ౹౹*
*****
*భా:- వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు , భగవద్గీత ఇత్యాది కోటి గ్రంథాలలోని సారాంశాన్ని ఒక్క అర శ్లోకంలో చెబుతాను అని నొక్కి వక్కాణిస్తున్నాడు కవివతంసుడు. పరులకు మేలు చేయడమే పుణ్యము. ఇతరులకు కీడు చేయడమే పాపము అని సారాంశము. ఎలా? తరువులు పూలను, పండ్లను, కలపను; ఇనుడు వెలుగును; ఘనుడు వర్షమును; గోవులు, గేదెలు నిస్స్వార్థంగా పాలను ఇవ్వడం పరోపకారమే. కర్ణుడు,శిబి. రంతిదేవుడు దానంలోను, త్యాగంలోను మెరిసిపోయారు. ఆధునిక కాలంలో మదర్ థెరీసా పవిత్ర ప్రేమ, సేవలు విశ్వవ్యాప్తంగా కీర్తించబడినాయి. అన్నదానంలో డొక్కా సీతమ్మ బ్రిటిష్ పాలకుల గుండె గుడిలో కొలువైన సాధ్వీశిరోమణి. ఇక దుర్యోధనుడు, రావణుడు, కీచకుడు ఇత్యాది వీరాగ్రేసరులు చేసిన పాప కృత్యాలకు ఫలితం అనుభవించారు గదా! అందుకనే " రక్షంతి పుణ్యాని పురాకృతాని" అంటారు పెద్దలు. కాన మన జీవిత కాలములో దాన ధర్మాలు చేసి కొంచెం పుణ్యం మూట కట్టుకుంటే అది మనకు, మన సంతతికి శ్రీరామరక్ష అవుతుంది*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి