1, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము



               రచన 

గోపాలుని మధుసూదన రావు 


మునినాథు డీ విధంబుగ 

ననినంతనె ఋష్యగణము యనుకొని రిటులన్ 

" మనకిది సాధ్యమె దలచగ 

ఘనులౌ త్రయమూర్తులందు ఘనుడిని యెంచన్ 8


మువ్వురు మూర్తుల యందున 

యెవ్వరు యెధికుండొ దేల్చ నెవ్వరి తరమౌ 

మువ్వురు యెవరికి వారలె 

దివ్యులు , యత్యంత శక్తి తేజులు దలచన్ 9


మువ్వురు వ్యక్తులు లోపల 

యెవ్వరు మోక్షంబు నిత్తు రీ జగమందున్ 

మువ్వురి యందున నెంచగ 

నెవ్వనిలో సత్త్వగుణము యేర్పడియుండున్ " 10

 

మునులందఱు యీ విధముగ 

మనమున తర్కించు చుండ,మహిమాన్వితుడౌ 

ముని భృగువు ముందుకొచ్చియు 

ననియెను నీరీతి మునులు యచ్చెఱువొందన్ 11


"ఘనులగు సంయములారా !

మనమున మీకెల యింత మదనం బకటా !

చనియెద దివిభువనములకు 

ఘనుడెవ్వరొ మువ్వురందు కనుగొని వత్తున్ 12


అక్కట భయపడనేలా !

గ్రక్కున నేబోయి వారి ఘనతను జూతున్ 

మక్కువ మీరగ నిప్పుడె 

చక్కగ జన్నంబు పనులు జరుపుడు మీరల్ 13


అటజని మువ్వురు మూర్తుల 

పటుతరమగు భక్తితోడ ప్రార్థింతు మదిన్ 

యటనట దిరిగియు వారిలొ 

పటుశాంతుని జూచివత్తు పాటవమొప్పన్ 14


మువ్వురు మూర్తులయందున 

యెవ్వరు శ్రేష్టుండొ జూచి యేర్పడ వత్తున్ 

నవ్వాని పెద్ద జేసియు 

యివ్వుడు యీ యఙ్ఞఫలము విశ్వముమెచ్చన్ ". 15


--- భృగుమహర్షి త్రిమూర్తుల దర్శించుట కెళ్ళుట ---


భృగువంతట త్రయమూర్తుల 

సుగుణంబుల నెంచనెంచి సురపురములకున్ 

యగణితమౌ ధైర్యంబున 

ఖగపతి జనినంత వడిగ గడచుచు వెడలెన్. 16

కామెంట్‌లు లేవు: