12, ఫిబ్రవరి 2026, గురువారం

దేవుడంటే ఏంటి

 ✳️*దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది?*✳️

అని...

చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్నv పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.

మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .

మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు

... మనం వాడే మాట అదే!.

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా !.

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.

తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.

దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది

ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....

 *✳️ఆచారాలు--సైంటిఫిక్*  వివరణలు

(మూఢాచారాలు కాదు) *మందిరము* 

*1. *మూలవిరాట్*  భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

*2. ప్రదక్షిణ*  మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.

 *3. ఆభరణాలతో దర్శనం*  ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.

 *4. కొబ్బరి కాయ*  ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.

 *5.మంత్రాలు*  ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.

*6. *గర్భగుడి*  గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

*7.*అభిషేకం*  విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

*8. *హారతి*  పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

*9. *తీర్థం* 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

*10. *మడి* 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..

                         *✳️సర్వే జనాః సుఖినోభవంతు*🙏

Panchangam పంచాంగం

మాఘ పురాణం - 26 వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️

*🌷శుక్రవారం 13 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 26 వ* 

      _*అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

      *13వ తేదీ శుక్రవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

మాఘ పురాణం *ఇరవై ఆరవ అధ్యాయంలో* పురాణాల ప్రకారము, మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల ..    

మన పాపాలు తొలగిపోతాయి. 

ఏ నదిలో స్నానం చేసినా, ఆ నీరు గంగమ్మ తీర్థంతో సమానమని చెబుతారు. ప్రయాగ అనేది మాఘమాస స్నానానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ గంగా యమున, సరస్వతి నదులు కలుస్తాయి. మాఘమాసంలో ఇక్కడ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. 

నదీ స్నానంతో పాటు, మూడు వందల అరవై పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. మరో ముఖ్యమైన క్షేత్రం త్రయంబకం.

పడమటి కొండల దగ్గర ఉన్న ఈ క్షేత్రంలోనే పవిత్ర గోదావరి నది జన్మించింది. మాఘమాసంలో గోదావరి స్నానం సర్వపాపాలను హరించి, ఇహపరాలలో సుఖాన్ని ఇస్తుందని నమ్మకం. 

మన దేశంలో ఎన్నో నదులు, వాటి తీరాలలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. నందిని, మందాకిని , నళిని, తామ్రపర్ణి, భీమరధి, గంగా , యమున, నేత్రావతి, పంపా, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మదా వంటివి మహానదులు. భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రా, వశిష్ఠ, కాశ్యపి, సరయు, సర్వపాపహారి, కుశాపతి, పల్గుని, పుణ్యద వంటివి పుణ్యనదులు. 

మాఘమాసంలో వీటిలో స్నానం చేయడం కానీ, పేర్లు స్మరించుకోవడం కానీ పుణ్యప్రదం. గౌతమి నదిలో కొన్ని ప్రసిద్ధ ఉపనదులు కూడా ఉన్నాయి. వరం తప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం బ్రహ్మహత్యా పాపాలను కూడా పోగొట్టగలదని చెబుతారు. పూర్వం, బ్రహ్మ మరియు శివుడు గర్వంతో యుద్ధం చేసి, బ్రహ్మ తలలను నరికివేసిన శివుడికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించింది. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శివుడు అనేక క్షేత్రాలు తిరిగాడు. చివరికి, ప్రయాగలో బ్రహ్మ, విష్ణువులు ఆయనకు స్నానం చేయించి, పాపాల నుండి విముక్తి చేశారు. అప్పటి నుండి, ప్రయాగ మాఘమాస స్నానానికి పెద్ద పవిత్ర స్థానంగా మారింది..

```

పుణ్యక్షేత్రములలో నదీ స్నానము

ఈ విధముగా అనేక పుణ్య పురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను, వశిష్టుల వారు దిలీప మహారాజునకు వివరించగా, ఆ రాజు “మహర్షి! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు, అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిండ’ని వినమ్రుడై కోరగా వశిష్టుల వారు మరల యిట్లనిరి.. “దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము..”

మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము.

ఏలననగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగా నది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.

ఇక త్రయంబకమను ముఖ్యమైన పుణ్య క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప చేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే కాక, ఇహమందు, పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో ఎన్నో నదులు ఉన్నవి, ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములు ఉన్నవి, ఆ నదులలో మహా నదులు, పుణ్య నదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నవి. అటువంటి కొన్నింటి పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును.

అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరధి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణీ, మహేద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహా నదులు. భగీరధి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణీ, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, క్పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుని కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు.

మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం, మనము ఆ నదులలో స్నానము చేయలేక పోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉప నదులు కూడా కలసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటు చున్నవి. అటులనే “వరం తప” అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము..

విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును, ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలు ఉన్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించి నందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదిగా అయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవతలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి, తాను నరికిన బ్రహ్మ తలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది.

ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి “భిక్షాందేహీ” యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, అతనికి “పురుషత్వము నశించునుగాక” అని శపించిరి. 

ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా మారినందు వలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు, శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.```

*మాఘపురాణం ఇరవై ఆరవ* *అధ్యాయము సంపూర్ణము*

         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 12 ఫిబ్రవరి 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                  1️⃣3️⃣3️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``

        *సంపూర్ణ మహాభారతము*      

                    *133 వ రోజు*                   

*వన పర్వము షష్టమాశ్వాసము*

*కృత్య దుర్యోధనుని పాతాళమునకు తీసుకువెళ్ళుట*```

రాత్రి అయ్యింది. దుర్యోధనుడి నిర్ణయం పాతాళవాసులైన దానవులకు తెలిసింది. వారు దేవతలచే ఓడించబడి పాతాళంలో ఉన్నారు. ఈ నిర్ణయం తమకు నష్టమని భావించి వారు దుర్యోధనుడిని తమ వద్దకు రప్పించుకోవాలని మంత్ర విశారదులైన బృహస్పతి, శుక్రాచార్యులు చెప్పిన మంత్రాలను తగిన విధంగా జపిస్తూ నిశ్చల దీక్షతో యజ్ఞం చేయగా ఆ అగ్ని హోత్రం నుంచి కృత్య అనే భయంకరా కారిణి ఉద్భవించి ‘నేనేమి చేయాలి?’ అన్నది. 

అంత ఆ దైత్యులు సుయోధనుడిని పాతాళానికి తీసుకు రమ్మని పంపారు. 

కృత్య సుయోధనుని పాతాళానికి తీసుకుని వచ్చింది. 

దానవులు అతనిని కౌగలించుకుని కుశల మడిగారు. వారు 

“సుయోధనా! శూరుడవై భరతకులోద్భౌడవైన నీవు ఇలా ఆత్మహత్యకు సాహసించడం తగునా. ఆత్మ హత్య చేసుకున్నచో లోకనింద, దుర్గతి, హీనత తప్పదు. నీ వంటి బుద్ధిమంతులకు ఇది తగదు. నీ నిర్ణయం మార్చుకుని ధైర్యమును, ప్రతాపమును చూపి శత్రువులను ఓడించు. నీ జన్మ వృత్తాంతం చెప్తాను వినుము. మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరం పైభాగం వజ్రసమానం. ఏ విధమైన అస్త్రములు దానిని ఛేధించలేవు. నీవు కారణ జన్ముడవు. నీకు సాయంగా అనేకమంది దానవులు క్షత్రియులుగా జన్మించారు. వారే భగదత్తుడు మొదలైన వారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దేవతాంశలతో జన్మించినా వారి భావనలో రాక్షసాంశ ఉండటం చేత యుద్ధంలో పుత్రులు, పౌత్రులు, మిత్రులు, వృద్ధులు, బాలురు, శిష్యులు అనే భేధం లేక పాండవ సైన్యాలను నాశనం చేస్తారు. అర్జునుడంటే భయపడుతున్నావు. ఏమి భయం లేదు. కృష్ణునిచే సంహరింపబడిన నరకాసురుని ఆత్మను కర్ణునిలో ప్రవేశపెట్టాము. కనుక కర్ణుడు శ్రీకృష్ణునిపై అర్జునిని పై పగబట్టి చంపగలడు. దేవేంద్రుని కుమారుడైన అర్జునిని రక్షించుటకు బ్రాహ్మణ వేషంలో కర్ణుని కవచకుండలాలను దానంగా గ్రహిస్తాడంటే అర్జునుడు కర్ణుని గెలవలేడనే కదా. లక్షల మంది రాక్షస వీరులు సంశక్తులు పేరున జన్మించారు. వారిచే అర్జునుడు ఓడింపబడతాడు. దైన్యం వీడి వెళ్ళు ఈ భూమండలాన్ని నీవు పాలించగలవు” అన్నారు. 

కృత్య దుర్యోధనుని తిరిగి స్వస్థానంలో వదిలింది. 

సూర్యోదయం కాగానే నిద్రలేచిన దుర్యోధనునికి రాత్రి జరిగినది కలో నిజమో అర్ధం కాకున్నా పాండవులను జయించ గలనన్న ఆత్మ విశ్వాసం కలిగింది.```

*సుయోధనుడు ప్రాయోపవేశ నిర్ణయాన్ని విడచుట*```

కర్ణుడు తిరిగి దుర్యోధనుని దగ్గరకు వచ్చి “సుయోధనా! చచ్చి సాధించేది ఏముంది. బ్రతికి ఉంటే శత్రువులను జయించి సమస్త సౌఖ్యములు పొందవచ్చు. అర్జునిని పట్ల నీకున్న భయం పోగొట్టుకో. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత నేను అర్జునిని సంహరిస్తానని ఈ ఆయుధంపై ఒట్టేసి చెప్తున్నాను” అన్నాడు. 

రాత్రి రాక్షస వీరుల పలుకులు ఇప్పుడు కర్ణుని ప్రతిజ్ఞ దుర్యోధనునిలో కొత్త ఆశలు నింపగా ప్రాయోపవేశ నిర్ణయాన్ని నిలిపి హస్థినకు చేరాడు. 

ఒక రోజు భీష్ముడు “సుయోధనా! పెద్దల మాటలు పెడచెవిన పెట్టి ఘోషయాత్రకు వెళ్ళి అవమానం పొందావు. చివరకు ధర్మరాజు వలన బయటపడ్డావు కాని లేకున్న గంధర్వుని చెఱలో మగ్గేవాడివి కదా. అయినా నువ్వు సిగ్గు పడవు. నువ్వు నమ్మిన కర్ణుడు నిన్ను రక్షించ లేదు, నిన్ను నీ తమ్ములను వదిలి పారిపోయాడు. అతని యుద్ధ నైపుణ్యం చూసావు కదా. పాండవులు పరాక్రమ వంతులు. వారి ముందు కర్ణుడు వీసమెత్తు కూడా చెయ్యడు. అతడు మాటల వీరుడు. నీమేలు కోరి చెప్తున్నాను కర్ణుని నమ్మి వంశనాశనం చేసుకొనక పాండవుల్తో సంధి చేసుకుని సుఖంగా ఉండు!” అని హితవు పలికాడు. 

సుయోధనుడు భీష్ముని మాటలు లెక్క చేయక శకునితో కలసి నవ్వుకుంటూ వెళ్ళాడు. 

భీష్ముడు అవమానంతో సిగ్గుతో కుదించుకుని పోయి తన నివాసానికి వెళ్ళిపోయాడు. 

కర్ణుడు దుశ్శాసనునితో కలిసి శకునితో వున్న దుర్యోధనుడితో “భీష్ముడు ఎప్పుడూ మనలను నిందిస్తూ పాండవులను ప్రశంశిస్తూ వుంటాడు. అది నేను సహించలేకుండావున్నాను. నేను సేనను తీసుకుని నలుగురు పాండవులు కలిసి గెలుచుకున్న భూమండలమంతా నేను ఒంటరిగా గెలుచుకుని నీకు సమర్పిస్తాను. అప్పుడు నా బలాన్ని చూసి భీష్ముడు తనను తాను అసహ్యించుకుంటాడు నాకు అనుమతి నివ్వు” అనగా దుర్యోధనుడు పరమానందపడి కర్ణుడి యాత్రకు కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. 

కర్ణుడు సైన్యమును తీసుకుని మహా యుద్ధం చేసి పాంచాలరాజు ద్రుపదుడిని అతడి సామంతులను ఓడించి కప్పం కట్టించాడు. తర్వాత ఉత్తర దిక్కుగా ప్రయాణించి అనేక రాజులను, భగాదత్తుడిని ఓడించాడు. హిమాలయ పర్వత ప్రాంతీయులను ఓడించి కప్పం కట్టించాడు. తూర్పు దిక్కుగా వెళ్లి అంగ, వంగ, కళింగ, శున్దిక,మిధిలా,మగధ దేశాదీశులను ఓడించాడు. తర్వాత దక్షిణ దిక్కుగా వెళ్లి మహారధులు ఎందరినో ఓడించాడు. కేరళ రాజులను, నీల రాజులను మరెందరినో ఓడించి కప్పం గైకొన్నాడు. శిశుపాల సుతుడిని, అవంతీ రాజులను ఓడించి వృష్టి వంశస్తులతో చెలిమి చేసుకుని పశ్చిమ దిశగా ప్రయాణించి అనేక రాజులను ఓడించి హస్తినాపురానికి చేరుకొన్నాడు. 

దుర్యోధనుడు ఎంతో ఆడంబరంగా కర్ణుడికి స్వాగతం పలికి పాండవులు, ఇతర రాజులూ నీముందు పదహారవ భాగానికి కూడా సరికారని ప్రశంశించాడు.```

             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

13ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

*🪷13ఫిబ్రవరి2026🪷*

  *దృగ్గణిత పంచాంగం* 

       *ఈనాటి పర్వం*

*సర్వేషాం విజయైకాదశి*

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - బహుళపక్షం*

*తిథి  : ఏకాదశి* ‌మ 02.25 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : మూల* సా 04.12 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : వజ్ర* రా 03.23 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : బాలువ* మ 02.25 *కౌలువ* రా 03.17 

*ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 09.08 - 10.54*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : మ 02.26 - 04.12 & రా 02.38 - 04.22*

*దుర్ముహూర్తం  : ఉ 08.53 - 09.40 మ 12.45 - 01.31*

*రాహు కాలం  : ఉ10.55 - 12.22*

గుళికకాళం      : *ఉ 08.01 - 09.28*

యమగండం    :*మ 03.15 - 04.42*

సూర్యరాశి : *కుంభం*                          

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.44*

సూర్యాస్తమయం :*సా 06.15*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.35 - 08.53*

సంగవ కాలం      :*08.53 - 11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31- 03.50*

*ఆబ్ధికం తిధి   :ఈరోజు శూన్య తిథి*

సాయంకాలం    :*సా03.50- 06.09*

ప్రదోష కాలం     :*సా 06.09- 08.38*

రాత్రి కాలం       :*రా 08.38 - 11.57*

నిశీధి కాలం       :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.55 - 05.44*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*

     *త్రైలోక్యజయినీ దేవీ* 

    *త్రైలోక్యవిజయోత్తమా*

            *🪷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 26 వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️

*🌷శుక్రవారం 13 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 26 వ* 

      _*అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

      *13వ తేదీ శుక్రవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

మాఘ పురాణం     *ఇరవై ఆరవ అధ్యాయంలో* పురాణాల ప్రకారము, మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల ..    

మన పాపాలు తొలగిపోతాయి. 

ఏ నదిలో స్నానం చేసినా, ఆ నీరు గంగమ్మ తీర్థంతో సమానమని చెబుతారు. ప్రయాగ అనేది మాఘమాస స్నానానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ గంగా యమున, సరస్వతి నదులు కలుస్తాయి. మాఘమాసంలో ఇక్కడ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. 

నదీ స్నానంతో పాటు, మూడు వందల అరవై పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. మరో ముఖ్యమైన క్షేత్రం త్రయంబకం.

పడమటి కొండల దగ్గర ఉన్న ఈ క్షేత్రంలోనే పవిత్ర గోదావరి నది జన్మించింది. మాఘమాసంలో గోదావరి స్నానం సర్వపాపాలను హరించి, ఇహపరాలలో సుఖాన్ని ఇస్తుందని నమ్మకం. 

మన దేశంలో ఎన్నో నదులు, వాటి తీరాలలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. నందిని, మందాకిని , నళిని, తామ్రపర్ణి, భీమరధి, గంగా , యమున, నేత్రావతి, పంపా, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మదా వంటివి మహానదులు. భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రా, వశిష్ఠ, కాశ్యపి, సరయు, సర్వపాపహారి, కుశాపతి, పల్గుని, పుణ్యద వంటివి పుణ్యనదులు. 

మాఘమాసంలో వీటిలో స్నానం చేయడం కానీ, పేర్లు స్మరించుకోవడం కానీ పుణ్యప్రదం. గౌతమి నదిలో కొన్ని ప్రసిద్ధ ఉపనదులు కూడా ఉన్నాయి. వరం తప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం బ్రహ్మహత్యా పాపాలను కూడా పోగొట్టగలదని చెబుతారు. పూర్వం, బ్రహ్మ మరియు శివుడు గర్వంతో యుద్ధం చేసి, బ్రహ్మ తలలను నరికివేసిన శివుడికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించింది. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శివుడు అనేక క్షేత్రాలు తిరిగాడు. చివరికి, ప్రయాగలో బ్రహ్మ, విష్ణువులు ఆయనకు స్నానం చేయించి, పాపాల నుండి విముక్తి చేశారు. అప్పటి నుండి, ప్రయాగ మాఘమాస స్నానానికి పెద్ద పవిత్ర స్థానంగా మారింది..

```

పుణ్యక్షేత్రములలో నదీ స్నానము

ఈ విధముగా అనేక పుణ్య పురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను, వశిష్టుల వారు దిలీప మహారాజునకు వివరించగా, ఆ రాజు “మహర్షి! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు, అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిండ’ని వినమ్రుడై కోరగా వశిష్టుల వారు మరల యిట్లనిరి.. “దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము..”

మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము.

ఏలననగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగా నది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.

ఇక త్రయంబకమను ముఖ్యమైన పుణ్య క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప చేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే కాక, ఇహమందు, పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో ఎన్నో నదులు ఉన్నవి, ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములు ఉన్నవి, ఆ నదులలో మహా నదులు, పుణ్య నదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నవి. అటువంటి కొన్నింటి పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును.

అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరధి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణీ, మహేద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహా నదులు.             భగీరధి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణీ, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, క్పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుని కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు.

మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం, మనము ఆ నదులలో స్నానము చేయలేక పోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉప నదులు కూడా కలసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటు చున్నవి. అటులనే “వరం తప” అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము..

విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును, ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలు ఉన్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించి నందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదిగా అయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవతలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి, తాను నరికిన బ్రహ్మ తలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది.

ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి “భిక్షాందేహీ” యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, అతనికి “పురుషత్వము నశించునుగాక” అని శపించిరి. 

ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా మారినందు వలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు, శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.```

*మాఘపురాణం ఇరవై ఆరవ* *అధ్యాయము సంపూర్ణము*

         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

ఆదిశంకరాచార్యుడు

 🍁🌺🍁🌺🍁🌺🍁🌺🍁

*🚩🚩 🌾ఆదిశంకరాచార్యుడు – భారత తత్వచింతనకు దీపస్తంభం🌾 🚩🚩*

*🍁🌾ఆది_శంకరాచార్యుడు (సా.శ. 788 – 820)🌾🍁*

*భారతదేశం చూసిన మహా తత్త్వవేత్త, మహాసన్యాసి, అద్వైత వేదాంత స్థాపకుడు*.

*కేరళ రాష్ట్రంలోని కలడి గ్రామంలో జన్మించారు*.

*తండ్రి –శివగురు, తల్లి – ఆర్యాంబ*.

*🍁🌾బాల్యంలోనే వేదాలు, ఉపనిషత్తులు🌾🍁*, 

*బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను సంపూర్ణంగా అవగాహన చేసుకున్న మహామేధావి*

.

*8 ఏళ్లకే సన్యాసం స్వీకరించి, గురువైన* *గోవిందభగవత్పాదులు వద్ద విద్యనభ్యసించారు*.

*☘️🌾ఆదిశంకరాచార్యుల తత్త్వబోధన🌾☘️*

*👉 “బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః”*

అంటే –

*బ్రహ్మమే నిజం, ప్రపంచం* *మాయ, జీవుడు బ్రహ్మనే*.

*ఇదే అద్వైతవేదాంతం*.

*🌾🌹భక్తి, జ్ఞానం, వైరాగ్యం🌹🌾 –* 

*మూడు కలిసినప్పుడే మోక్షం సాధ్యమని బోధించారు*.

*శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణపత్యం – అన్ని మార్గాలను సమన్వయం చేసి*

*పంచాయతనపూజ విధానాన్ని ప్రాచుర్యం చేశారు*.

*📜గ్రంథకర్తగా శంకరులు*

*ఆయన రచనలు భారతీయ తత్వశాస్త్రానికిపునాదులయ్యాయి:*

✔️ బ్రహ్మసూత్రభాష్యం

✔️ భగవద్గీతాభాష్యం

✔️ ఉపనిషద్భాష్యాలు

✔️ వివేకచూడామణి

✔️ ఆత్మబోధ

✔️ ఉపదేశసాహస్రి

*🍁🌾భక్తిరసంతో నిండిన స్తోత్రాలు కూడా రచించారు:*

🙏 #భజగోవిందం

🙏 #సౌందర్యలహరి

🙏 #కనకధారాస్తవం

🙏 #శివానందలహరి

*🛕🍁 చతురామ్నాయపీఠాల స్థాపన🍁*

భారతదేశాన్ని ఏకత్వంగా నిలబెట్టేందుకు నాలుగు పీఠాలను స్థాపించారు:

📍 శృంగేరి – దక్షిణం

📍 జ్యోతిర్మఠం (బదరీ) – ఉత్తరం

📍 ద్వారకామఠం – పశ్చిమం

📍 గోవర్ధనమఠం (పూరి) – తూర్పు

దీంతో సనాతన ధర్మం దేశమంతా విస్తరించింది.

*✨🍁సాధనలు – మహిమలు🍁*

🔹 మృతబాలుడికి ప్రాణం పోసిన కథ

🔹 మాండన మిశ్రుడితో శాస్త్రార్థం

🔹 నర్మదా నది ప్రవాహాన్ని ఆపిన ఘట్టం

🔹 కాశీలో ధర్మస్థాపన

🔹 భక్తి, జ్ఞానం సమన్వయం

32 ఏళ్లకే మహాసమాధి చెందారు.

తక్కువ వయసులోనే అనంతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మహాయోగి.

*🌸 శంకరాచార్యుల వారసత్వం ఈరోజు కూడా*

✔️ వేదాంతం

✔️ హిందూ తత్త్వచింతన

✔️ ధార్మిక ఏకత్వం

అన్నిటికీ మూలం ఆది శంకరాచార్యుల బోధనే.

🌍🌺🌍🌺🌍🌺🌍🌺🌍

బంధవిముక్తి మోక్షమార్గం*

        *బంధవిముక్తి మోక్షమార్గం*

                   ➖➖➖✍️

```

అన్ని బంధాల నుంచీ మనిషిని విముక్తం చేసేదే ముక్తి. దీన్నే‘మోక్షం’ అంటాం. అది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతోంది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి మతం వారికి సమ్మతం. వ్యక్తిగత వాదాలే మతాలుగా పరిణమించి, అనేకంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ ముక్తిని సాధించడానికి తోడ్పడేవే.

ఒక గమ్యస్థానానికి వెళ్లాలనుకొన్నప్పుడు మనిషి బయలుదేరే చోటు నుంచి ఒకే దారి ఉండదు. అన్ని దిక్కుల నుంచీ దారులెన్నో ఉంటాయి. ఎటు నుంచి వెళ్లినా చేరాల్సిన చోటు ఒకటే.

ఏ దారిలో వెళ్లినా గమ్యం చేరేవరకు విశ్రమించడు. జీవన స్వభావం ఇదే.

ఇదే విషయాన్ని మోక్షానికీ అన్వయిస్తూ ‘శివ మహిమ్న స్తోత్రం’ ఇలా ప్రబోధించింది:```

*“పరమేశ్వరా! నిన్ను చేరడానికి మనుషులు ఎన్నో మార్గాలను ఏర్పరచుకొన్నారు. కొందరు వేదమార్గంలో నిన్ను చేరుకుంటూ ఉండగా మరికొందరు సాంఖ్య మార్గంలో, ఇంకొందరు శైవ మార్గంలో, కొందరు యోగ మార్గంలో, కొందరు శైవ మార్గంలో, కొందరు వైష్ణవ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికి వారు తాము నమ్మిన మార్గాలే గొప్పవని వాదిస్తారు. ‘లోకో భిన్న రుచిః’ అన్నారు కదా…!*```

లౌకిక బంధాలనన్నింటినీ పరిత్యజించి పరమేశ్వరుడిలో లీనం కావడమే మోక్షం. అది నాలుగు విధాలని ‘శివానంద లహరి’లో శంకర భగవత్పాదులు స్పష్టం చేశారు.```

*మొదటిది సారూప్య ముక్తి.*```

భక్తుడు శివుణ్ని అర్చిస్తున్నప్పుడు తానూ శివుడిలా రూపం ధరించాలని కోరుకోవడమే ఈ ప్రక్రియలోని పరమార్థం. స్తోత్ర పఠనంలో శివుడి రూపాన్ని స్మరించడం, ఆ రూపాన్నే ఆరాధించడం అంటే శివుడితో సమానమైన రూపాన్ని కోరుకోవడమే! అందువల్ల దీన్ని ‘సారూప్య ముక్తి’గా భావిస్తాం.```

*రెండోది సామీప్య ముక్తి.*```

శివుడి కథలు ప్రవచించేవారికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం, వారు చేసే ఆరాధనల్లో పాలుపంచుకోవడం, వారితోనే స్నేహం చేస్తూ కలిసి మెలిసి తిరగడం వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆనందదాయకాలైన అంశాలే. కనుక దీన్ని ‘సామీప్య ముక్తి’ అని వ్యవహరిస్తాం.```

*మూడవది సాలోక్య ముక్తి.*```

అంటే శివుడు ఉండే లోకంలోనే ఉండాలనుకోవడం! శివుడు లేని చోటు ఏదైనా ఉందా అంటే ‘లేనే లేదు’ అని బదులిస్తుంది ప్రాచీన సాహిత్యం. చరాచరాలతో కూడిన మానవ లోకంలో ప్రతీ అణువులో శివుడున్నాడంటారు. మానవ లోకంలోని మనిషి శివుడున్నచోటే ఉన్నాడని దీని అర్థం. ఈ ప్రపంచం అంతా శివుడి శరీరమే అని వేదాలు చెబుతున్నాయి. ‘శివుడి తనువే ఈ జగత్తు’ అనే భావన ఇందులో కనిపిస్తుంది. శివుడున్న లోకంలోనే తానూ ఉన్నాననే భావనను భక్తుడికి కలిగించడమే “సాలోక్య ముక్తి”.```

*ఇక నాల్గవది “సాయుజ్య ముక్తి”.* ```‘సాయుజ్యం’ అంటే “కలిసి ఉండటం”. చరాచరాలన్నీ శివమయాలే అన్నప్పుడు అందులో చరాలు (చైతన్యం కలిగిన ప్రాణులు)గా మనుషులూ ఉన్నట్లే. అందరూ శివస్వరూపాలే ఐనప్పుడు ఆయనతో వారు నిరంతరం కలిసి ఉన్నట్లే అవుతుంది. దీన్నే ‘మనిషికి శివుడితో సాయుజ్య ముక్తి లభించడం’ అంటాము.

ఇలా ప్రతి మనిషికీ నాలుగు విధాలైన మోక్షాలు అందుబాటులో ఉంటాయి.

’ముక్తి’ఎవరికైనా సాధ్యమే! శివుడి కరుణకు ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. అందుకే ఆయన తనను అర్చించిన సాలీడు,పాము,ఏనుగును తనలో లీనం చేసుకొన్నాడు. 

శ్రీ(సాలీడు), కాళ(పాము), హస్తి (ఏనుగు) నామాలతో ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అయ్యాడని మనకు తెలుసు.

కాలు కదపనివాడికి ఏదీ లభించదు. కదిలి ముందుకు సాగేవాడికి ప్రపంచమంతా ఓ కుగ్రామంలా కనపడుతుంది. “మోక్షం” విషయంలోనూ ఇదే సూత్రాన్ని అన్వయించుకోవాలి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మందులు అంటే ఏమిటి?*

    *మందులు అంటే ఏమిటి?*

              ➖➖➖✍️```

1. త్వరగా నిద్రపోయి, త్వరగా 

    లేవడం ఒక మందు.

2. ఉదయాన్నే దేవుడిని 

    స్మరించుకోవడం ఒక మందు.

3. యోగా, ప్రాణాయామం మరియు 

    వ్యాయామం మందులు.

4. ఉదయం మరియు సాయంత్రం 

    నడకలు కూడా మందులే.

5. ఉపవాసం అన్ని రోగాలకు మంచి

    మందు.

6. సూర్యరశ్మి కూడా ఒక మందు.

7. మట్టి కుండలోని నీటిని తాగడం 

    ఒక మందు.

8. చప్పట్లు కొట్టడం కూడా ఒక 

    మందు.

9. ఆహారాన్ని బాగా నమిలి తినడం 

     ఒక మందు.

10. నీరు తాగడం మరియు శ్రద్ధగా 

    తినడం మందులు.

11. తిన్న తర్వాత వజ్రాసనంలో 

    కూర్చోవడం ఒక మందు.

12. సంతోషంగా ఉండాలని 

    నిర్ణయించుకోవడం ఒక మందు.

13. కొన్నిసార్లు, మౌనం ఒక 

    మందు.

14. నవ్వు మరియు హాస్యాలు 

    మందులు.

15. సంతృప్తి ఒక మందు.

16. మనస్సు మరియు శరీరానికి 

    శాంతి ఒక మందు.

17. నిజాయితీ మరియు సానుకూల  

    దృక్పథం మందులు.

18. నిస్వార్థ ప్రేమ మరియు 

    భావోద్వేగాలు కూడా మందులే.

19. ఇతరులకు మంచి చేయడం ఒక 

    మందు.

20. పుణ్యం కలిగించే పని చేయడం 

    ఒక మందు.

21. ఇతరులతో సామరస్యంగా 

    జీవించడం ఒక మందు.

22. కుటుంబంతో కలిసి తినడం, 

    తాగడం మరియు సమయం 

    గడపడం ఒక మందు.

23. ప్రతి నిజమైన మరియు మంచి 

    స్నేహితుడు డబ్బు లేకుండా 

    లభించే ఒక పూర్తి వైద్యశాల.

24. ప్రశాంతంగా, చురుకుగా, 

    ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా 

    ఉండటం ఒక మందు.

25. ప్రతి కొత్త రోజును పూర్తిగా 

    ఆస్వాదించడం ఒక మందు.

26. చివరగా... ఈ సందేశాన్ని 

    మరొకరికి పంపడం ద్వారా 

    మంచి పని చేసిన ఆనందం 

    కూడా ఒక మందు. 

27. ప్రకృతి గొప్పతనాన్ని అర్థం 

    చేసుకోవడం ఒక మందు.

28. ఈ మందులన్నీ ఎటువంటి 

    దుష్ప్రభావాలు లేకుండా పూర్తిగా 

    ఉచితం!!✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

    శ్లో𝕝𝕝    *యథాగ్నిః పవనోద్ధూతః*

              *సుసూక్ష్మోఽపి మహాన్ భవేత్* l

              *తథా కర్మసమాయుక్తం* 

              *దైవం సాధు వివర్ధతే* ll

                     *మహాభారతమ్*

తా𝕝𝕝 *చిన్న నిప్పురవ్వ ఐనా గాలికి పైకి ఎగిరి మహాగ్నిగా మారినట్లు పురుషప్రయత్నంతో కూడిన దైవబలం చక్కగా వర్ధిల్లుతుంది...*

✍️🌹💐🌸🙏

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*649 వ రోజు*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము

దేవతారాధన పూజకు తగిన పూలు

ధర్మరాజు " పితామహా ! దేవతలను దీప ధూప నైవేద్యములతో ఆరాధిస్తారు కదా ! ఆవిశేషములు ఏమిటో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడుసువర్ణుడు అనే మహామునికి, సువర్ణుడు నారదుడికి, నారదుడు నాకు చెప్పారు. నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఈ భూమిమీద ఓషధులు అత్యత్తమమైనవి. ఓషధీవృక్షాలలో పూలుపూసే చెట్లు ఇంకా ఉత్తమమైనవి. ఆ పుష్పములతో దేవతలను అర్చించిన మానవులకు శుభములు మనస్సు వర్ధిల్లుతాయి. అందు వలన పూలను సుమమనస్సులు అని అంటారు. పూలతో దేవతలను అర్చించిన దేవతలుహర్షించి మన కోరికలు తీరుస్తారు. అందువలన దేవతలను సుమమనస్కులు అని అంటారు. మంచిసువాసన కలిగి, మంచిరూపము కలిగి, తెలుపువర్ణము కలిగి ముళ్ళులేని చెట్లకు పూచినపూలు దేవతారాధనకు మేలైనవి. అటువంటి పూలను దేవతలు ప్రీతితో స్వీకరిస్తారు. తామరలు, సన్నజాజులు, తులసీదళాలు, దేవతలకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తాయి. యక్షులకు నీటిలోపుట్టిన పూలు అధిక ఆనందం కలిగిస్తుంది. ముళ్ళ చెట్లకు పూసినవి, ఎర్రనివి, ఘాటైనవాసనకలిగిన పూలు శత్రువులను చంపడానికి అధర్వణ వేదములో చెప్పబడిన మంత్ర, తాంత్రిక పూజలు, ప్రయోగాలలో వినియోగిస్తారు. ఘాటైనవాసన కలిగిన పూలు రాక్షసులను, భూతగణములను ఆకర్షిస్తాయి. నలుపు, తెలుపు కలిగిన మంచి పరిమళాలను వెదజల్లు పూలు మానవులు ఇష్టపడతారు. దేవాలయములలో, పితృవనంలో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకొన కూడదు. పూలవాసనతో దేవతలు, పూలనుచూసినంతనే యక్షులు, పూలవాసన ఆస్వాదిస్తూ సర్పములు ఆనందిస్తాయి. మంచిపూలతో దేవతలను అర్చించిన దేవతలు తృప్తిపొంది మానవుల కోరికలు తీరుస్తారు.

ధూపము

ఇక ధూపము గురించి చెప్తాను. సల్లకీ అనే చెట్టునుండి తీసినపొడితో వచ్చే ధూపము దేవతలకు ప్రీతి కరమైనది. అగరు ధూపము యక్షులకు, గంధర్వులకు నాగజాతికి ప్రీతికరమైనది. అన్నింటి కంటే శ్రేష్టమైనది కర్పూరముతో వేసే ధూపము. తియ్యనివాసన వచ్చే ధూపము దేవతలకు ప్రీతికరం. ఘాటైనవాసన వచ్చే ధూపం రాక్షసులకు ప్రీతికరం. కారమైన ధూపం అంటే కళ్ళ మండి నీళ్ళు వచ్చే ధూపము యక్షులకు ప్రీతికరం. కనుక దేవతలకు ప్రీతికరమైన వేసిన ధూపము మానవులకు పరమపుష్టిని ఆయుష్షును పెంచుతుంది. అలాగే యక్షులు, రాక్షసులు, నాగులు మానవులు వేసిన ధూపముతో తృప్తి చెంది వారి కోరికలను తీరుస్తారు. మంచిగంధము అగరు ధూపములు మానవుల మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి.

దీపారాధన

దేవతలను పూజించే సమయంలో దీపారాధన చేయాలి. దాని వలన అక్కడ ఉన్న భూతములు, రాక్షసులు మొదలైన కుత్సితమైన జాతులు పారిపోతాయి. దీపం వెలిగిస్తే బాహ్య అంతర చీకట్లు తొలగిపోతాయి. దీపారాధన వలన చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. మనసు ధర్మచింతన వైపు మరలుతుంది. ప్రమిదలో నెయ్యి తక్కువ ఉండకూడదు. వత్తి సన్నగా ఉండకూడదు. సగం సగం వెలిగించ కూడదు. దీపారాధన చేసిన చక్కటి వెలుగు రావాలి. చీకట్లు పూర్తిగా తొలగి పోవాలి. దేవుడి వద్ద ఉన్న దీపము దొంగిలించిన వాడికి కళ్ళుపోయి గుడ్డివాడు ఔతాడు. నలుగురు కూర్చొను చావడి లోను, కొండమీద, దేవుడిగుడిలో దీపము వెలిగించిన వాడు ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఆవునెయ్యి దీపము ఆత్యంత శ్రేష్టము. తరువాత' బర్రె, మేకల నెయ్యితో కూడా దీపము పెట్టచ్చు. జంతువుల కొవ్వుతోను, ఎముకలరసము తోను, మాంసమురసముతో దీపము వెలిగించిన మహాపాపము. దీపములను దానం చేసిన వాడికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ వేదపురీశ్వర ఆలయం

  🕉 మన గుడి : నెం 1386

⚜  తమిళనాడు : చెయ్యార్ - తిరువన్నామలై

⚜  శ్రీ వేదపురీశ్వర ఆలయం

💠 తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం సమీపంలోని తిరువన్నమలై జిల్లాలోని చెయ్యర్ నది ఉత్తర ఒడ్డున వేదపురీశ్వర ఆలయం ఒక పవిత్ర స్థలం . 

ఈ పవిత్ర స్థలాన్ని ఇప్పుడు చెయ్యర్ అని పిలుస్తారు కానీ గతంలో తిరువోత్తూర్ అని పిలిచేవారు . 

💠 ఈ ఆలయం పూర్తి పేరు శ్రీ బాలగుజాంబిగై ఉడనురై శ్రీ వేదపురీశ్వర ఆలయం.

ఇది 275 పాదల్ పెట్రా స్థలాలలో ఒకటి . 

🔆 స్థలపురాణం

💠 శివుడిని ఆహ్వానించకుండా యాగం చేసినందుకు దక్షుడిని శపించిన తరువాత, దాక్షాయణి ఇక్కడే శివుడిని ప్రార్థించి, యాగాన్ని నాశనం చేయడానికి అగ్నిలోకి దూకింది.

💠 ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్న మరో పురాణం ఏమిటంటే, ఈ ఆలయాన్ని చూసుకుంటున్న శివుని భక్తుడు, ఆలయ గోడలను కోత మరియు వరదల నుండి రక్షించడానికి చెయ్యర్ నది ఒడ్డున మరియు ఆలయ పొలాల చుట్టూ తాటి చెట్లను పెంచాడు. 

అయితే, ఈ తాటి చెట్లన్నీ మగ చెట్లే మరియు ఎటువంటి ఫలాలను ఇవ్వలేదు. 

💠 జైనులు అతనిని చూసి నవ్వి, "ఈ మగ తాటి చెట్లను ఆడ (ఫలాలు ఇచ్చే) చెట్లుగా మార్చమని మీరు మీ దేవుడిని ఎందుకు అడగరు?" అని ఎగతాళి చేయడం ప్రారంభించారు.

💠 ఈ ఆలయానికి వచ్చిన తిరుజ్ఞానసంబంథర్ అనే సాధువుకు ఈ సంఘటన గురించి సమాచారం అందింది. 

తిరుజ్ఞానసంభంథర్ కీర్తనల ఫలితంగా, అన్ని మగ తాటి చెట్లు ఆడ తాటి చెట్లుగా రూపాంతరం చెందాయని నమ్ముతారు. 

ఈ ఆలయంలో కొన్ని చెట్లను ఇప్పటికీ చూడవచ్చు.

ప్రవేశ ద్వారం యొక్క ఎడమ వైపున, రాతితో చేసిన ఒక పెద్ద తాటి చెట్లు ఉంది- దానిలో సగం మగ తాటి చెట్లును మరియు మిగిలిన సగం ఆడ తాటి చెట్లును వర్ణిస్తుంది. 

ఈ చెట్టు కింద శివుడు కూర్చుని ఉన్నట్లు చూడవచ్చు మరియు అతని పక్కన తిరుజ్ఞానసంభంధర్ అనే సాధువు విగ్రహం కూడా చూడవచ్చు. 

💠 మరో పురాణం ప్రకారం, ఒకప్పుడు, తొండైమాన్ అనే స్థానిక పాలకుడు విశ్వసువాసు రాజు రాజ్యాన్ని జయించటానికి సహాయం చేయమని శివుడిని అభ్యర్థించాడు. విశ్వసువాసును ఓడించడానికి సహాయం చేయడానికి శివుడు తొండైమాన్ తో పాటు నందిని పంపాడు, దీని జ్ఞాపకార్థం, ఇక్కడ నంది స్వామికి ఎదురుగా కాకుండా ఆలయ ప్రవేశ ద్వారం వైపు ఉంది.

💠 సాధారణంగా శివలింగానికి ఎదురుగా ఉండే నంది, దానికి వ్యతిరేక దిశలో ఉంటుంది.

ఇక్కడ నంది భంగిమ గురించి మరొక పురాణం ఏమిటంటే, శివుడు దేవతలకు మరియు ఋషులకు వేదాలను బోధించినప్పుడు, ఎటువంటి అవాంతరాలు రాకుండా ఉండటానికి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉండమని సందికి సూచించబడింది.

💠 చెయ్యర్‌లోని శ్రీ వేదపురీశ్వర ఆలయం 7 అంతస్తులతో కూడిన తూర్పు ముఖంగా ఉన్న రాజగోపురం కలిగి ఉంది మరియు మొత్తం నిర్మాణం విగ్రహాలతో నిండి ఉంది. 

💠 మూలస్థాన మండపానికి ముందు ఉర్చవమూర్తి తిరుమేణిగళ్, 63 నాయన్మార్ ఉర్చవమూర్తి విగ్రహాలు మరియు సోమస్కందర్ ఉర్చవమూర్తి విగ్రహం కనిపించే ప్రాకారాలు ఉన్నాయి. 

💠 తూర్పు ముఖంగా ఉన్న మూలస్థానంలో దిండి మరియు ముండి అని పిలువబడే ద్వార పాలకుల యొక్క రెండు భారీ విగ్రహాలు ఉన్నాయి మరియు అవి మూలస్థానానికి కాపలాగా ఉంటాయి. 

మూలస్థానానికి అభిముఖంగా చిన్న నంది వాహనం ఉంటుంది.

💠 గర్భాలయంలో శ్రీ వేదపురీశ్వరుని అధిష్టానం తూర్పు ముఖంగా ఉన్న శివలింగం రూపంలో దర్శనమిస్తుంది మరియు శివుని అవతారంగా పరిగణించబడుతుంది. ప్రధాన దేవత యొక్క కోష్టం చుట్టూ గణపతి, దక్షిణామూర్తి, మహా విష్ణువు, బ్రహ్మ, దుర్గ, ఆది కేశవ పెరుమాళ్ మరియు చండికేశ్వరర్ విగ్రహాలు ఉన్నాయి. 

దీనికి సమీపంలోనే బ్రహ్మి, మహేశ్వరి, చాముండి, కౌమారి, వారాహి, ఇంద్రాణి మరియు వైష్ణవిలతో కూడిన సప్తమాతృకల  విగ్రహాలు ఉన్నాయి. 

💠 లోపల శ్రీ వలపురి వినాయగర్, శ్రీ వల్లబ గణపతి, పరశివ పంచలింగాలు, నాగ దేవతలు మరియు శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముగర్ విగ్రహాలు ఉన్నాయి. 

💠 ఆలయ బయటి భాగంలో తూర్పు ముఖంగా ఉన్న తిరుమూలనాథర్ ఉప మందిరం (చిదంబరం, ఆకాశ లింగం), పశ్చిమ ముఖంగా ఉన్న శ్రీ కాళతినాథర్ ఉప మందిరం (కాళహస్తి, వాయు లింగం), తూర్పు ముఖంగా ఉన్న శ్రీ జంభుకేశ్వరర్ ఉప మందిరం (తిరువనైకావల్ జల లింగం), తూర్పు ముఖంగా ఉన్న శ్రీ అరుణాచలేశ్వరర్ ఉప మందిరం (తిరువణ్ణామలై అగ్ని లింగం) మరియు తూర్పు ముఖంగా ఉన్న శ్రీ ఏకాంబరేశ్వరర్ ఉప మందిరం (కాంచీపురం పృథ్వీ లింగం) మరియు దక్షిణ ముఖంగా ఉన్న చండికేశ్వరర్ ఉప మందిరం ఉన్నాయి. 

అదే బయటి భాగంలో దక్షిణ ముఖంగా ఉన్న శ్రీ ఆదవల్లన్ లేదా శ్రీ నటరాజర్ ఉప మందిరం, శ్రీ శివగామి అంబాల్ మరియు మణికావాసగర్ తో పాటు ఉన్నాయి.

💠 భక్తులు ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవం అనే పండుగను జరుపుకుంటారు. పండుగ యొక్క 6వ, 7వ మరియు 10వ రోజులను ఘనంగా జరుపుకుంటారు.

7వ రోజు వేడుకను తిరుతేర్ వైభవం అని ఘనంగా జరుపుకుంటారు. 

ఇది పండుగ యొక్క ప్రధాన రోజు. 10వ రోజు వేడుకను రాత్రిపూట జరుపుకుంటారు.

💠 కాంచీపురం నుండి చెయ్యార్ వరకు దూరం 31 కి.మీ

రచన

©️ Santosh Kumar

*ఒక మంచి పని

  1228;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀🍇M.A.176.

*మన ఆరోగ్యం…

*ఒక మంచి పని — మనమందరం చేయగలిగేది…*

             ➖➖➖✍️

```

మనమందరం నెమ్మదిగా వృద్ధాప్యం చెందుతున్నాము, కాబట్టి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.

దయచేసి ఈ సందేశాన్ని చదవడానికి ఒక నిమిషం కేటాయించండి.

ఇది మీకు, మీ కుటుంబానికి, పొరుగువారికి మరియు స్నేహితులకు ఉపయోగకరంగా ఉండవచ్చు.

పాత క్లాస్‌మేట్స్ తిరిగి కలుసుకున్నప్పుడు, ఒక గొప్ప కార్యక్రమంలో ఒక మహిళ అకస్మాత్తుగా జారిపడి పడిపోయింది.

స్నేహితులు ఆమెను వైద్యుడిని చూడమని సలహా ఇచ్చారు, కానీ ఆమె, “నేను బాగున్నాను” అని చెప్పింది.

ఆమె కొత్త చెప్పుల కారణంగా ఇటుక మీద జారిపడి ఉంటుందని అందరూ అనుకున్నారు.

వారు ఆమెను నిద్రలేపి, ఆమెకు ఒక ప్లేట్ ఆహారం ఇచ్చారు, మరియు ఆమె రోజంతా నవ్వుతూ, మాట్లాడుతూ గడిపింది.

కానీ ఆమె భర్త అందరికీ ఫోన్ చేసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పాడు. ఆమె సాయంత్రం ఆరు గంటలకు మరణించింది - ఎందుకంటే పార్టీ సమయంలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది.

ఆ సమయంలో అక్కడ ఉన్నవారు స్ట్రోక్ లక్షణాలను గుర్తించి ఉంటే, ఆమె ప్రాణాలను కాపాడి ఉండేవారు.

👉 స్ట్రోక్‌కు ముందు కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. 

సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడవచ్చు.

ఒక న్యూరో సర్జన్ చెప్పినట్లుగా, రోగిని ‘మూడు గంటల్లో’ చేరుకుంటే, రోగి పూర్తిగా కోలుకోవచ్చు.```

*స్ట్రోక్‌ను ఎలా గుర్తించాలి?*```

మూడు సాధారణ విషయాలను గుర్తుంచుకోండి: S, T మరియు R

```

*S – చిరునవ్వు:*```

రోగిని నవ్వమని అడగండి. ముఖం ఒక వైపుకు వంగి ఉంటే, అది ప్రమాదానికి సంకేతం.```

*T – చర్చ:*```

రోగిని ఒక సాధారణ వాక్యం చెప్పమని అడగండి, ఉదాహరణకు: “ఈ రోజు ఆకాశం స్పష్టంగా ఉంది.”

వారు స్పష్టంగా మాట్లాడలేకపోతే, అది కూడా ఒక సంకేతం.```

*R – పైకెత్తండి:*```

రోగిని రెండు చేతులను పైకి లేపమని అడగండి.

ఒక చేయి వంగి ఉంటే లేదా పైకి వెళ్లకపోతే, అది కూడా ప్రమాదానికి సంకేతం.```

*మరొక సంకేతం:*```

రోగిని వారి నాలుకను బయటకు చాపమని అడగండి.

నాలుక ఒక వైపుకు వంగి ఉంటే, అది కూడా స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు.

ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే అంబులెన్స్ లేదా సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించి, అన్ని లక్షణాలను స్పష్టంగా తెలియజేయండి.

ఒక కార్డియాలజిస్ట్ ప్రత్యేకంగా ఇలా అన్నారు:

ఈ సందేశాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి ఫార్వార్డ్ చేస్తే,

కనీసం ఒక ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడవచ్చు.

🙏 నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.

ఇప్పుడు మీ వంతు...

దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి.

“మీరు ఎవరికైనా గులాబీ ఇచ్చినప్పుడు, దాని సువాసన ఇంకా మీ చేతుల్లో కొంత ఉంటుంది.”

“ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి - మంచి పనుల సువాసన మీ హృదయంలో ఉంటుంది!”

🌹మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఈ గొప్ప మరియు పుణ్యకార్యాన్ని చేయవచ్చు.

మానవాళికి సేవ - అదే అత్యున్నత ప్రార్థన.

దయచేసి ఈ సందేశాన్ని చదవడానికి సమయం కేటాయించండి మరియు ఇతరులు అవగాహన పొందడానికి దీన్ని ముందుకు షేర్ చేయండి.✍️

```_Forwarded message_

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుభాషితమ్

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

    శ్లో𝕝𝕝    *అర్థాగమో నిత్య మరోగితా చ* 

              *ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ*

              *వశ్యశ్చ పుత్రో౭ర్థకరీ చ విద్యా* 

              *షడ్ జీవలోకస్య సుఖాని రాజన్* !!

తా𝕝𝕝 *రాజా! ధనముల రాబడి, ఎప్పుడును చెడని ఆరోగ్యము, ప్రియములు పలికెడు ప్రియమైన భార్య, అదుపులో మెలగు కొడుకు, ప్రయోజనవంతమైన విద్య అను నీ యారును ప్రాణికి సుఖములు....*

✍️🌹💐🌸🙏

ఋణానుబంధ రూపేణ

 సుభాషితమ్

    శ్లో:-ఋణానుబంధ రూపేణ 

          పశు పత్ని సుతాలయా: 

          ఋణ క్షయే క్షయం యాంతి

          తత్ర  కా పరిదేవనా ? 

వసుధ ఋణానుబంధమున 

      వర్తిలు పుత్ర కళత్ర వాసముల్ 

పశువులు మానవాళికిని 

      పాయక యుండుగ నెల్ల వేళలన్ ,

వసుధ ఋణంబు దీరగను 

      వాటికవే మరి వీడు చుండ , యా 

మసలిన బంధమున్ దలచి

        మానవు  డేలను చింత చెందగన్?

12ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌷గురువారం🌷*

*🌹12ఫిబ్రవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం*                

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*

*తిథి  : దశమి* ‌మ 12.22 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం  : జ్యేష్ఠ* మ 01.42 వరకు ఉపరి *మూల*

*యోగం : హర్షణ* రా 03.06 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : భద్ర* మ 12.22 *వణజి* రా 01.27 ఉపరి *బల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : రా 10.32 - 12.18*

*దుర్ముహూర్తం  : ఉ 10.26 - 11.12 మ 03.04 - 03.50*

*రాహు కాలం  :మ01.48- 03.15*

గుళికకాళం      : *ఉ 09.28 - 10.55*

యమగండం    : *ఉ 06.35 - 08.01*

సూర్యరాశి : *మకరం*               

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.45*

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.35-08.53*

సంగవ కాలం     :*08.53 -11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.31*

అపరాహ్న కాలం  :*మ 01.31- 03.50*

*ఆబ్ధికం తిధి  :మాఘ బహుళ ఏకాదశి*

సాయంకాలం     :*సా 03.50- 06.09*

ప్రదోష కాలం      :*సా 06.09- 08.38*

రాత్రి కాలం         :*రా 08.38 - 11.57*

నిశీధి కాలం       :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.55 - 05.45*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*!!.ఓం శ్రీ సద్గరుభ్యోనమహ.!!*

      *ఙ్ఞానశక్తిసమారూఢః* 

   *తత్త్వమాలావిభూషితః*

     *భుక్తిముక్తిప్రదాతా చ*

     *తస్మై శ్రీగురవే నమః*

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*

🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 25 వ* _*అధ్యాయము*_

_*మాఘ పురాణం - 25 వ* 

      _*అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

     *12వ తేదీ గురువారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు* 

మాఘ పురాణం ఇరవైఐదవ అధ్యాయంలో, కలింగ దేశంలో ధనవంతుడైన ఓ కిరాతుడు ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్లిన అతను, నర్మదానది స్నానం చేసి వెళుతున్న బ్రాహ్మణుడిని చూసి, అతని ధనం లాక్కుకోవాలని దురాశ పడతాడు. ధనం లేదని తెలిసినా కోపంతో ఆ బ్రాహ్మణుడిని చంపి, తరువాత బాటసారులను దోచుకుంటూ దుర్మార్గ జీవితం గడుపుతాడు. అతనికి బంగారపు నగలు చేసే వాడూ, ఒక శూద్రుడూ స్నేహితులుగా ఉండి, వీరంతా కలిసి పాపకార్యాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో, కిరాతుడు తన బ్రాహ్మణ స్నేహితుడితో కలిసి పాపాలు చేయిస్తూ, జ్ఞానియైన వీరవ్రతుడిని కలుసుకుంటాడు. వీరవ్రతుడు వారి పాపాలను తెలియజేసి, వాటి నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరిస్తాడు.

తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిన కిరాతుడు, అతని స్నేహితులు వీరవ్రతుని చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కిరాతుడు గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మమార్గంలో నడుచుకుంటూ, సుఖశాంతులతో జీవితాన్ని ముగిస్తాడు.ఈ కథ ద్వారా, ఎంతటి పాపాత్ముడైనా పశ్చాత్తాపపడి, ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపాల నుండి విముక్తి పొందవచ్చు. మాఘమాస స్నానం పుణ్యాన్ని చేకూర్చి, పాపాలను హరిస్తుంది. సజ్జన సాంగత్యం మంచి జీవితానికి దారి తీస్తుంది, అదే సమయంలో దుష్ట సాంగత్యం మనల్ని చెడు దారిలో నడిపిస్తుంది. ధర్మమార్గంలో నడవడమే సుఖశాంతులకు దారి. పాపం యొక్క పరిణామాలు భయంకరమైనవి కాబట్టి, వాటి నుండి ప్రాయశ్చిత్తం ద్వారా బయటపడే మార్గాన్ని ఈ కథ చూపిస్తుంది. మాఘ పురాణం – 25 వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా …

*కలింగ కిరాతుడు – మిత్రుల కథ*```

గృత్నృమద మహర్షి జహ్ను మునితో మరల నిట్లు పలికెను. ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరి ఒక కథను చెప్పెదను శ్రద్దగా వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించి పాప విముక్తుడు ఆగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును.

పూర్వము ఓక కలింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఓకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే ఒక మఱ్ఱి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడు ఆతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగు వాటిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటిని బలవంతముగ తీసికొనెను.

ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును ‘నేను దరిద్రుడను నా వద్ద ధనము ఏమియూ లేదని సమాధానము ఇచ్చెను. అతని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచు ఉండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. అతనికి ధనమును సంపాదింప వలయునని  కోరిక విపరీతముగా పెరుగుతూ ఉండెను. 

ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయు వాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనా పరుడు, బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకి ఇచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ ఉండెను. అతని వాని తల్లియును అట్టిదే, భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చా వర్తనురాలు అయ్యెను. ఈ విధముగ ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. అతని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలు అయిన తనకి ఇష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయని అనుకొనెను, వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అని అనుకొన్నది.

ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఏరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరిని ఒకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలనను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. 

నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడు అగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహా పాపములు ఒక చోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించిన వాడు, గురుపత్నితో రమించిన వాడు వీరు ఐదుగురును పంచ మహా పాతకులు.

బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఒకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్ష మాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాత మిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడిని అని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి ఇట్లనెను.

ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మొదలగు పాపములను చేసినవాడు మరియు హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించిన వాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచ మహా పాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును వారివలె పాపాత్ముడగును. అటువంటి వారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసిన వాడు, గురుతల్పగమనము చేసిన వాడు, బంగారమును దొంగలించిన వాడు, వీరితో స్నేహము చేసిన వాడు వీరైదుగురు పాపులే. ఇట్టి వారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.

నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి యెట్లు కల్గును? సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని, దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము.

ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ, సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. 

గోవుతినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము, ఈ ప్రకారము ఒక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింప తగినదని చెప్పెను.

నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మమును ఉపదేశింప కోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.

నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును, పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరు వేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలం ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును అచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.

వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్ర జలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.

వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ! నిరంతరము సంతోషముగ ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకుము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము, సంధ్యా వందనము మొదలగు నిత్యకర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచార పడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృ దినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరి నామమును కీర్తింపుము.

పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్ష మాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్య దళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము, యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోదాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకుము, మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము, అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరల కాశీ నగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.```

*మాఘపురాణం ఇరవై ఐదవ* *అధ్యాయము సంపూర్ణము*

         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

ఆలోచనలను

 🙏మన *ఆలోచనలను* చంపే *ఆవేశం* కంటే, మనలో ఉన్న *అహంకారాన్ని* అణిచివేసే *సహనం* చాలా గొప్పది.

కోపంలో *మౌనాన్ని*

కష్టాల్లో *నిజాయితీని* అంటిపెట్టుకొని ఉంటేనే

*భవిష్యత్తులో* ఒకరి వేలు మన *వైపు* చూపించే *పరిస్థితి* రాదు.

ఎదుటి వారి ముందు *తగ్గి* ఉండటం అంటే మనం *తప్పు* చేశామని కాదు, మనమధ్య *మానవ సంభంధాలు, బంధుత్వాలు కాపాడటం కోసం* మరొక అడుగు ముందుకు వేసేందుకు మనం సిద్ధపడుతున్నామని అర్ధం.🙏 

శుభ గురువారం 🌹Happy Thursday.

12ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌷గురువారం🌷*

*🌹12ఫిబ్రవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం*                

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*

*తిథి  : దశమి* ‌మ 12.22 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం  : జ్యేష్ఠ* మ 01.42 వరకు ఉపరి *మూల*

*యోగం : హర్షణ* రా 03.06 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : భద్ర* మ 12.22 *వణజి* రా 01.27 ఉపరి *బల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : రా 10.32 - 12.18*

*దుర్ముహూర్తం  : ఉ 10.26 - 11.12 మ 03.04 - 03.50*

*రాహు కాలం  :మ01.48- 03.15*

గుళికకాళం      : *ఉ 09.28 - 10.55*

యమగండం    : *ఉ 06.35 - 08.01*

సూర్యరాశి : *మకరం*               

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.45*

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.35-08.53*

సంగవ కాలం     :*08.53 -11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.31*

అపరాహ్న కాలం  :*మ 01.31- 03.50*

*ఆబ్ధికం తిధి  :మాఘ బహుళ ఏకాదశి*

సాయంకాలం     :*సా 03.50- 06.09*

ప్రదోష కాలం      :*సా 06.09- 08.38*

రాత్రి కాలం         :*రా 08.38 - 11.57*

నిశీధి కాలం       :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.55 - 05.45*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*!!.ఓం శ్రీ సద్గరుభ్యోనమహ.!!*

      *ఙ్ఞానశక్తిసమారూఢః* 

   *తత్త్వమాలావిభూషితః*

     *భుక్తిముక్తిప్రదాతా చ*

     *తస్మై శ్రీగురవే నమః*

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*

🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 25 వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️

*🌷గురువారం 12 ఫిబ్రవరి 2026🌷*