25, మార్చి 2022, శుక్రవారం

ఆర్తిని

 ఆర్తిని!

అదే దాహార్తిని!

తీర్చాలంటే!

నీరు కావాలి!

విద్యుత్ కావాలంటే!

నీరు కావాలి!

పైరు పండాలంటే!

నీరు కావాలి!

బువ్వ బు క్కాలంటే!

నీరు కావాలి!

పరి శుభ్రతను పాటింఛాలంటే!

అది మనిషి కై నా!

పశువు కై నా!

పక్షి కైన!

మనం కట్టే !

బట్టల కై నా!

నీరు కావాలి!

అందుకే!

నీటి విలువను గురుతెరగాలి!

బొట్టు బొట్టు నీటినీ ఒడిసి పడుతూ!

భావి తరాలకు జల సిరిని పంచాలి!

అందుకొరకు!

ధన మూల మి దమ్ జగత్!

జల మూల మి దమ్ జగత్!

అన్న నినాదంతో నేడే

మనమంతా పురోగమించాలి!

మితంగా నీటిని వాడుతూ!

మానవత తో!

మహనీయత నూ ప్రదర్శించాలి!


ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877





సువిశాల విశ్వంలో

 " పవిత్ర పృధ్విపై స్థిరీకృతమైన ప్రకృతి ప్రసాదిత నిత్య సుచైతన్య సన్మైత్రీ  భావన "                                                       సువిశాల విశ్వంలో అనాదిగా నెలకొన్న జీవకారుణ్యతా మార్గం ! చరాచర జీవజాలం, అనునిత్యం ఒండొరులకు తోడూనీడగా వర్తించే ప్రధాన భూమిక ! సృష్టి రహస్యమైన " విశ్వ మానవాళి ప్రత్యేక ఆవిర్భావ సముచిత జీవన గమనం " ! సహజ సిద్ధమైన ప్రత్యేకతలతో సృష్టి ఆరంభంలో ఆవిర్భవించిన మహోన్నత ఓషధీ సంపద ! సకల జీవ సురక్షా విధమైన పరమ పవిత్ర వేద ధర్మ నిర్దేశిత సన్మార్గ, సుహృద్భావ నిత్య చైతన్య జీవన ప్రణాళిక ! విశ్వ మానవాళి అహర్నిశలూ చేయవలసిన సకల జీవజాతి సన్మార్గ పరిరక్షణ ! తమ నిత్య జీవన పయనంలో చూపాల్సిన సకల జీవ సంరక్షణా మార్గ సత్ చింతనాత్మక సహృదయ పవిత్ర దార్శనికత ! అనుమానావమానలకు తావు లేని, ఈర్ష్యా ద్వేష భావాలు కానరాని సక్రమ ప్రశాంత నిత్య సుచైతన్య దృక్పథ జీవన పంథా ! " బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే నిత్య సత్య సుచైతన్య స్ఫూర్తిమంతమైన సత్ చింతనాత్మక జీవన విధానం ! సన్మైత్రీ భావనాత్మక జీవకారుణ్యతా సన్మార్గ జీవన ప్రణాళిక, ప్రస్తుత నిత్య జీవన గమనంలో విశ్వ మానవాళి మనోఫలకంపై  ముఖ్య భూమికై నిలవాల్సిన తరుణమిది !                                          " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ! "                                                 " సహనా వవతు ! సహనౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వి నావధీతమస్తు ! మా విద్విషావహై ! "                                                      " ఓం శాంతి శాంతి శాంతిః "                                                        రచన :                                                     గుళ్లపల్లి ఆంజనేయులు

జనార్దనుని రూపంలోను

 శ్లోకం:☝️

   *జనం జనేన జనితా*

*జనం పాతి జనేన యః |*

   *జనం జనేన హరతే*

*తం దేవం భజ సాంప్రతమ్‌ ||*

    - దేవీ భాగవతం 


భావం: ఈ జనాన్ని జనముచేత పుట్టించి, జనముచేత రక్షించి, జనముచేత చంపునట్టి భగవంతుని నీవు ఇపుడు భజింపుము. మన ప్రారబ్ధము, ప్రస్తుత కర్మ మనల్ని జనం రూపంలోను, జనార్దనుని రూపంలోను నడిపిస్తున్నాయి అని భావం.🙏

స్నేహితులకు

*_ఏ డాక్టర్లు ఇవ్వలేని... ఏ ఫార్మా కంపెనీ తయారు చేయలేని అతిగొప్ప మందేమిటంటే......_*
*~~~~~~👌👌👌 ~~~~~~*
*గుంటూరులో సెటిల్ అయిన రిటైర్డ్ ఆఫీసర్ రాజారావుకి ఆరోగ్యం బాగో లేదని హాస్పిటల్ కి తీసుకెళితే,  ఆ డాక్టర్ మెడికల్ షాప్ లో దొరకని "ఫ్రెండ్షిప్" అనే మందు రాశాడు, అది చూసి ఆయన పిల్లలు అవాక్కయితె డాక్టర్ చెప్పాడు.*

*మీ నాన్న గారు రిటైర్ అయ్యాక మీరందరూ ఆయన్ని మీ ఇంటికి పెదరాయుడుని చేసేసి నోటికి ప్లాస్టరు వేసేసారు.* 

*ప్రతీ మనిషిలో ఒక కోతి ఉంటుంది,  దాని పేరే "స్నేహితుడు,"*
*దాన్ని కట్టేస్తే కంటి మీద కునుకూ,  మోహం మీద నవ్వూ, కడుపుకు ఆకలి,  కాళ్లకు నీరసం లాంటి అన్ని రోగాలు వస్తాయి. అని హిత బోధ చేశాడు, అందరికీ.*

*వాళ్ల అబ్బాయిలు ఆయన చదివిన స్కూల్, కాలేజీ వివరాలతో  Facebook లో Account  ఓపెన్ చేశారు.* 

*దాంతో ఆయన ఇప్పుడు ఫోన్లో బిజీ బిజీ, ఎప్పుడూ ముసిముసి నవ్వులు, నెలకోసారి ఏదొక వంకపెట్టి ఊరెళ్లి స్నేహితులతో సిట్టింగులు*
 
*ఇంక ఆయనకి డాక్టర్ అవసరం రానేలేదు... ఎప్పటికీని. అప్పటి నుండి ఆ ఇంట్లో వాళ్లకి ఈయనతో ఏ టెన్షనూ లేదు.*

_అందుకే  అంటున్నారు...._ 
 *న మిత్రం న సౌఖ్యం!*
(మిత్రులు లేకపోతే సుఖం ఉండదు.) 

🙏 _ప్రాణ స్నేహితులకు అంకితం_ 🙏

పంపుసెట్టు

 నీటి ఎద్దడి – పంపుసెట్టు


అది సూర్యుడు ప్రచండంగా ఉన్న ఎండాకాలం. పల్లెల్లో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. నదులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. చాలా ఇళ్ళల్లో బావులు కూడా ఎండిపోయాయి. ఉన్న నీళ్ళనే ఊరివారందరూ పంచుకుంటున్నారు. 


అలాంటి ఒక నీటి ఎద్దడి ఉన్న గ్రామప్రజల అభ్యర్థన మేరకు మహాస్వామి వారు వచ్చి ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. ఆ ఊర్లోని పేద-ధనిక, మంచివారు-చెడ్డవారు, విధ్వాంసుడు-అవివేకి అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్వామివారి దర్శనానికి వచ్చారు. 


బాగా వయసుమళ్ళిన ఒక ముసలాయన స్వామి వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ ఉన్న వారందరూ అతనికి దారిచ్చి, ఎంతో గౌరవంతో మహాస్వామి వారి దర్శనానికి సహకరించారు. బహుశా అతను ఆ గ్రామ పెద్ద కావచ్చు. 


అతను స్వామివారికి నమస్కరించి నిలుచున్నాడు. 


మహాస్వామి వారు అతణ్ణి “నీ వయసెంత?” అని అడిగారు. 


”నాకా? చాలా ముసలివాణ్ణి. ఎనభైరెండేళ్ళు” అని ముసలాయన బదులిచ్చాడు.


”అంతా బగున్నదా? సంతోషంగా ఉన్నావా?” అని అడిగారు స్వామివారు. 

”లేదు, సామి. నాకు సంతోషానికి తావెక్కడ? మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. నేను చెప్పినది ఎవరూ వినరు? ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. ప్రాణం ఉంది కాబట్టి బతుకుతున్నాను” అని నిర్వేదంగా చెప్పాడు. ”ఐతే చాలా బాధలో ఉన్నానంటావ్”

“అవును సామి. . .”


“నువ్వు సంతోషంగా ఉండడానికి మార్గం చూపిస్తే దాన్ని పాటిస్తావా?” అని అడిగారు స్వామి వారు. ”చెప్పండి సామి” ఆత్రుతతో అడిగాడు ఆ ముసలాయన. 


”మీ తోటలో ఉన్న పంపుసెట్టుకి ముళ్ళకంచె వేసావు, ఎవరూ ఒక్క చుక్క కూడా నీళ్ళు తీసుకోరాదని. తాగడానికి, వండుకోవడానికి నీరు లేక ఇక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. నీవు నీ పంపుసెట్టు ద్వారా నీటిని నీ పొలాలకి పంటలకి మాత్రమే వాడుకుంటున్నావు. నీ ఆస్తి, నీ కుటుంబం వల్ల నీకు సంతోషం లేదని అంటున్నావు. ఆ పంపుసెట్టు చుట్టూ పెట్టిన కంచెను తొలగించు. అందరూ ఆ నీళ్ళను తీసుకోవడానికి వదులు. అందరూ ఆ నీళ్ళను వాడుకోనివ్వు. వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీస్సుల వల్ల నీకు సంతోషం లభిస్తుంది” అని చెప్పారు. 


ఇదంతా విన్న తరువాత ఆ ముసలాయన కళ్ళల్లో నుండి నీరు ధారాపాతంగా కారుతున్నాయి. 


పరమాచార్య స్వామివారి మాటలను విన్న ఆ గ్రామప్రజలు ఆశ్చర్యపోయారు. ”ఆ ముసలాయన పొలంలో పంపుసెట్టు ఉన్న విషయం గురించి స్వామివారికి ఎవరూ చెప్పలేదు. ఎవరూ నీళ్ళు తీసుకోరాదని దానికి వేసిన కంచె గురించి చెప్పలేదు. ఎవరైనా తీసుకోవడానికి వెళ్తే ఆ ముసలాడు గొడవకు వచ్చేవాడని కూడా ఎవరూ చెప్పలేదు” పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల వారి నీటి సమస్యకు పరిష్కారం లభిస్తే చాలు అని ప్రార్థించారు. 


పరమాచార్య స్వామివారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఇద్దరు యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఆ ముసలాయన పంపుసెట్టు చుట్టూ ఉన్న కంచెను తీసేసాడు” అని చెప్పారు. 


ఆరోజునుండి ఆక్కడి నీరు ఊరుమొత్తం పొంగింది. 


పంపుసెట్టుకి కంచె తీసివేసి ఊరి వారందరికి ఆ నీరు పంచడం వల్ల ఆ ముసలాయనకు కూడా సంతోషం ఉప్పొంగింది. 


పరమాచార్య స్వామివారి కరుణ అపారమైనది. వారి కరుణ వారి దయ ఎండిపోని జీవనదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం