16, నవంబర్ 2022, బుధవారం

కాలభైరవ స్వరూపం

 కాలభైరవ స్వరూపం


ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘అదేమిటి? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా! నా అంతవాడిని నేను అంటున్నావు. నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదములని పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. యజుర్వేదమును పిలిచారు. ఆసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతు తనలో తాను రమిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలిచారు. ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై, శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.

బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా! నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.

ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.

ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళితే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.

ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంక ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.

ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

Srimadhandhra Bhagavatham

 [15/11, 5:42 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 74 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అఘాసుర వధ

ఒకనాడు కృష్ణపరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఒక ఊహ వచ్చింది. ‘రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. రేపు పొద్దున్న మీరందరూ బయలు దేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని, అందులో మీకిష్టమయిన మధుర మధురమయిన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము’ అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెపితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధరకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. కొలనులలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునే వారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వానిపేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. ‘నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికి ప్రాణ సమానమయిన వాడు కృష్ణుడు. ఈ కృష్ణుని చంపి తినేస్తాను’ అనుకున్నాడు.

వాడు వచ్చి కొండచిలువరూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు. అది పట్టింది అంటే మ్రింగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. అఘాసురుడనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉన్నది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమిమీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడివున్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగిచూశారు. వెనక చిన్నికృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు ‘బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ ఉంటే మనకేమిటి భయం! మనం వెళ్ళిపోదాం’ అని వారు నవ్వుకుంటూ, వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని, అన్నింటిని ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడని కృష్ణుడికి తెలుసు. ‘దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. నా కోసమే ఇంకా దవడలను మూయలేదు. వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి’ అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్లేసరికి, వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మ్రింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వారు మరణించారు.

కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మ్రింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్దస్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభంలాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. డానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు గిలగిల కొట్టుకుంది. అటు తిరిగి ఇటు తిరిగి తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసురసంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశమునందు ప్రకాశిస్తున్న చంద్రబింబములా కేవలము తన కన్నులనుండి కారుణ్యామృత దృష్టిని చిన్నికృష్ణుడు వాళ్ళమీద ప్రసరింప చేసాడు. ఆయన కారుణ్యామృతదృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొనప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి పైకిలేచి చిన్నికృష్ణుడి లోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి.

ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మనుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. ‘నేను పాపము చేయను’ అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డపనిని చేయించలేదు. మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. కొండచిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ, పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలన్నా, సత్కర్మకీ, దుష్కర్మకీ భేదం తెలియాలంటే వేదము తెలియాలి. ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. వెడుతున్నప్పుడు ఒకపని చేశారు. ‘వెనక కృష్ణుడు ఉన్నాడు’ అని కృష్ణ భగవానుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా! పుణ్యమా! అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి పాపమును చేస్తే ఆ పాపఫలితమును అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుందని చెపుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాలమృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్యచేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్యనదీ స్నానం చేసినప్పుడు ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. ప్రతిజీవికీ మరణం తథ్యం. చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి’ అని పెద్దలు అంటారు. వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ప్రవరించగలిగితే చాలు. చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడయినా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది.

అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమయిన కథ ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజూ భగవంతుని యందు పూనికను పెంచి, ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.

బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్దానంబు చేయుట

శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెపుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని ‘కౌమార పౌగండ లీల’ అంటారు అని చెప్పారు. మొదటి అయిదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి అయిదేళ్ళను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ అయిదవ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. ఈ లీలను శుకుడు ‘కౌమారపౌగండలీల’ అని చెప్పారు. పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది’ అని మహర్షిని ప్రార్థించాడు.

ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. శుకమహర్షి నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తున్నది వినవలసింది’ అని దానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. గోపాలురను బ్రతికించిన కృష్ణపరమాత్మ వీరినందరినీ తీసుకొని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉన్నది. అపుడు కృష్ణుడు గోపబాలురతో

“ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపఁగా

రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ

దండన్ లేగలు నీరు ద్రావి యిర వందం బచ్చికల్ మేయుచుం

దండం బై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?”

మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు బాగా ఆకలివేస్తోంది, దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా! నీడలో కూర్చుని వాటిని తిందాము’ అన్నాడు.

జలజాంతస్థితకర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే

కుల చందంబున గృష్ణునిం దిరిగిరా గూర్చుండి వీక్షించుచున్

శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా

కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!

గోపాలబాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామరపువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలనీ ఒకదానిమీద ఒకటి ఉండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండ చేసారు. గోపబాలురు కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొన్న పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివిపువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.

మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొక్క

డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి చూడు లేదని నోరు చూపునొక్క

డేగు రార్గురి చల్దు లెలమి బన్నిద మాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్క

డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడునొకఁడు

కృష్ణు జూడు మనుచుఁ గికురించి పరుమ్రోల, మేలి భక్ష్యరాశి మెసగు నొకడు

నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు మురియు నొకఁడు.

ఒకడు వాని ఇంటినుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూటనుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితే నోరు చూపించి ‘నేనెక్కడ తిన్నాను?’ అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళనుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి ‘ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా’ అనేవాడు పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.


: Srimadhandhra Bhagavatham -- 75 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి

విమల శృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి

మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి, నర్మభాషణముల నగవు నెఱపి

యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె!

అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టికున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవున్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ‘ఓం నమోనారాయణాయ స్వాహా’ అని మంత్రం చెప్పి స్రుక్కు, సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకములనుండి వచ్చేశారు. ‘ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలురతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలిచేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము’ అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో ‘గోవిందా గోవిందా’ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకంనుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ‘ఈ ఎంగిలి ముద్దలు ఎడమచేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఇంత సులభుడయినాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు’ అని అనుకున్నాడు.

‘నేను చతుర్ముఖ బ్రహ్మను ఇంటి పెద్దను. నాలుగు ముఖములు కలవాడిని. వేదములు చదివినవాడిని. నామాయ తప్పించుకోలేడు’ అని వెంటనే ఒక మాయ చేసాడు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేసాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులను దూడలు కనపడటము లేదని చెపితే నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ ఉండండి’ అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాలబాలురు లేరు. అక్కడ ఆవులు, దూడలు, ఎద్దులు లేవు. సాయంకాలం అవుతున్నది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవని అడుగుతారు. అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూసాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మోహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేసాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయొ అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి ఇంటికి వెళ్ళాడు.

ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాలబాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలా గే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాలబాలురు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను.నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా’ అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉన్నది. తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. ‘నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో ఆతడు చిన్నికృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముండు నా మాయ తుత్తునియలయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను’ అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ది విడిపోయింది. చిన్నికృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూసాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజములతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను’ అనుకుని ‘స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు’ అని ప్రార్థించాడు. ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు.

ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి

శంపాలతికతోడి జలదంబు కైవడి మెఱుగు టొల్లియతోడి మేనివాని

కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబుల వెలయువాని

గుంజా వినిర్మిత కుండలంబులవాని శిఖిపింఛవేష్టిత శిరమువాని

వనపుష్పమాలికా వ్రాత కంఠమువాని నలినకోమల చరణములవాని

గరుణ గడలుకొనిన కడకంటివాని గో, పాలబాలుభంగి బరగువాని

నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని, నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!

శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లనిమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉన్నది. ఎడమచేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉన్నది. ఎడమచంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉన్నది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మెడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదములమీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారు.

ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని

న్నీలోకంబున నీ వనాంతరమునం దీమందలో గృష్ణ యం

చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ

వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?

నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీ కృతమయిన నీవు, ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతోకలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు’ అన్నాడు.

ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా, సంతోషముతో చూస్తూ, తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈవిధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాదిపాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

Sri Siva Maha Puranam

 Sri Siva Maha Puranam -- 21 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అరుణాచలేశ్వరుడు


మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతా గుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. ఇవి కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉన్నది. జీవకోటి యాత్రలో ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశమునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసి, చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. అరుణాచల శివుడని తలచుకుంటే చాలు పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉన్నది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆ కొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచల ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమలింగమునకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. .

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైఋతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైఋతి లింగం అని చెప్తారు. నైఋతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైఋతి లింగస్థానం. నైఋతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉన్నది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉటుంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును, మోక్షమును ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాము. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉన్నది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా! నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అనుకుని ప్రతి ఇంటికి వెళ్ళి చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు. ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు అమ్మవారు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు పరిహాసమునకు వెనక నుంచి వచ్చి మూసింది. ఆ కారణం చేత లోకమంతా చీకటి అలుముకున్నది. తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నానని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉన్నది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉన్నది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉన్నది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుందని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును పొందుతాము.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కాశీ కి వెళితే

 కాశీ కి వెళితే...

కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... 

అందులో మర్మమేమిటి 


అసలు శాస్త్రం లో 

ఎక్కడ కూడా.. 

కాశీ కి వెళితే 

కాయో, పండో వదిలేయాలి 

అని చెప్పలేదు..


శాస్త్రం చెప్పిన విషయాన్ని.. 

కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చు కున్నారు.


కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... 

కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి 

"కాయా పేక్ష మరియు ఫలా పేక్ష"  ను

గంగలో వదిలి,

ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.


ఇక్కడ 

కాయాపేక్షా,

ఫలాపేక్ష

అన్నారు...

అంటే...

ఈ కాయము పై

(శరీరము పై అపేక్షని ) ,


ఫలా పేక్షా 

(కర్మ ఫలము పై అపేక్ష ని)

పూర్తిగా వదులు కొని...

కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.


కాలక్రమేణా...

అది కాస్తా 

కాయ, పండు  

గా మారి పోయింది.


అంతే కానీ...  

కాశీ వెళ్లి ఇష్టమైన 

కాయ గూరలు,

తిండి పదార్థాలు 

గంగ లో వదిలేస్తే...

మనకు వచ్చు భక్తి కానీ,

అందులో నిజమైన

పుణ్యం ఎం ఉంటుంది.


కనుక.... 

శాస్త్రం నిజంగా 

ఎలా చెప్తుందో 

అర్థం చేసుకొని... 

ఆ క్షేత్ర దర్శనము, 

ఆ సంప్రదాయం పాటిస్తే..

నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది...

అంతే కాని 

మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.


కనుక...

ఈసారి మీరు కాశీ వెళితే....

మనకి శత్రువులు అయిన

ఈ శరీరం పై 

ఎక్కువ ప్రేమని, 

మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....

ఆ విశ్వనాథ దర్శనం చేసి, 

నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం.

వ్యక్తం - అవ్యక్తం

 శ్లోకం:☝️

  *వ్యక్తావ్యక్త గుణేతరం*

*సువిమలం షట్త్రింశతత్వాత్మకం*

  *తస్మాదుత్తర తత్త్వమక్షర-*

*మతి ధ్యేయం సదా యోగిభిః l*

  *వందే తామసవర్జితం*

*త్రిణయనం సూక్ష్మాతిసూక్ష్మాత్పరం*

  *శాంతం పంచమమీశ్వరస్య*

*వదనం ఖవ్యాపి తేజోమయం ll*

  - ఈశాన ముఖధ్యానం


శ్లోకం: వ్యక్తం (manifested), అవ్యక్తం (unmanifested) అనే రెండు లక్షణాలకంటే భిన్నమైనది, శుద్ధమైనది, ముప్పై ఆరు తత్వాలకు ఆధారమైనది, ఎల్లప్పుడు యోగులచేత ధ్యానించబడేది, తమోగుణ రహితమైది, మూడు నేత్రములు కలది, సూక్ష్మాతిసూక్ష్మమైన దాని కంటే పరమైనది, శాంతమైది, ఆకాశామంతా వ్యాపించు తేజమే తన రూపముగా కలది అయిన ఈశ్వరుని ముఖమునకు నమస్కరిస్తున్నాను.🙏

కార్తీక పురాణం - 22 వ అధ్యాయము

 _*🚩కార్తీక పురాణం - 22 వ అధ్యాయము🚩*_


🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️


 *పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*


☘☘☘☘☘☘☘☘☘


మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.

పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి , స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని , యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*


ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !


హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.


శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావింశోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

ట్రాఫిక్ చాలాన్లు

 *శుభవార్త.....* 

*ట్రాఫిక్ చాలాన్లు మరియు వాటి చార్జీల గురించి ప్రజా అవగాహన.*


భారత మోటార్ వాహన (Amendment ) చట్టం 2019 ప్రకారం.


🚫  *కేవలం ₹100 మాత్రమే  చెల్లించాలి.*🚫


*అవును.*😊😊


మీరు ఏదైనా ట్రాఫిక్ రుల్ ని అతిక్రమిస్తే,పోలీస్ గాని, RTO సిబ్బంది అడ్డుకుని మీకు చాలన్ రాసి రసీదు ఇస్తే మీరు వెంటనే 

*ఆ డబ్బును చెల్లించనవసరం లేదు.*  


మీకు ఆ డబ్బు చెల్లించడానికి 

*15 రోజుల సమయం వుంటుంది,ఈ 15 రోజుల సమయం లో మీరు ఏ రుల్ నిఅతిక్రమిస్తే మీకు చాలాన్ విధించారో*  (ఊదా : మీకు లైసెన్స్ లేదని ₹10000 చలాన్ రాసి రసీదు ఇస్తే )

మీరు ఆ రసీదు తో పాటు మీరు ఆ సమయంలో చూపించ లేని లైసెన్స్ మరే ఇతరత్రా పత్రాలను తీసుకెళ్ళి సంబధిత అధికారికి,లేదా పోలీస్ స్టేషన్లో చూపించిన యెడల *మీకు ఆ చాలాన్ యొక్క ₹ 10000 మాఫీ చేసి కేవలం ₹100 (అవును వందే) మాత్రమే చెల్లించుకుంటారు.*        


*అది 4 రూల్స్ అతిక్రమిస్తే 4 పెనాల్టీలు వేసినా అంతా మాఫీ చేసి కేవలం ₹100 చెల్లించుకుంటారు.*            


ఏ అధికారికి వాహనాన్ని on the spot 

*సీజ్ చేసే అధికారం లేదు,*

*వాహనం స్టేషన్ కు తీసుకెళ్లే అధికారం కూడా లేదు. అసలు చట్టం ఇదే.*


*15 రోజుల తరువాత మీరు సంబంధిత పత్రాలు చూపించని యెడల చాలాన యొక్క మొత్తం డబ్బు కట్టవలసి వుంటుంది.*


పోలీస్ లు RTO అధికారులు,ప్రజలు కూడా అవగాహన లేక వేలకు వెలు పెనాల్టీలతో వాహనాలు వదిలేసి, *అక్కడే తగలబెట్టి, ధ్వంసం చేసి వెళ్ళడం చూసాం,* 


అందరికీ తెలిసేలా ఒక *సునామీ లా ఈ మెసేజ్ ని share చేయండి.*


*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

జీవత సత్యo

 నమస్కార్ 🙏🏻

*నలభై ఏళ్ల వయసులో..*

ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. 

*సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.*


*యాభై ఏళ్ల వయస్సులో..*

అందమైన దేహం.. అందవిహీనం..

మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. 

*ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.*


*అరవై ఏళ్ల వయసులో..*

ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. 

*పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.*


*డెబ్బై ఏళ్లవయస్సులో..*

విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...

*కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.*


*ఎనభైఏళ్ల వయస్సులో..*

ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. 

*ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.*


*తొంభైఏళ్ల వయస్సులో..*

నిద్ర మెలుకువ రెండూ ఒకటే. 

*సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.*


అందంతో వచ్చే మిడిసిపాటు...

ఆస్తులతోవచ్చే అహంకారం...

పదవులతో గౌరవాన్ని ఆశించటం...

కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.


*సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.*


అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ...

అనుబంధాలను  పదిలపరుచుకుంటూ...

జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!


నాకు చాలా బాగా నచ్చింది. మీతో పంచుకో వలనిపించి పంపిస్తున్న.మీకూ నచ్చితే అందరిక పంపండి ఎందుకంటే ఇది నమస్కార్ 🙏🏻

*నలభై ఏళ్ల వయసులో..*

ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. 

*సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.*


*యాభై ఏళ్ల వయస్సులో..*

అందమైన దేహం.. అందవిహీనం..

మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. 

*ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.*


*అరవై ఏళ్ల వయసులో..*

ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. 

*పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.*


*డెబ్బై ఏళ్లవయస్సులో..*

విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...

*కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.*


*ఎనభైఏళ్ల వయస్సులో..*

ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. 

*ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.*


*తొంభైఏళ్ల వయస్సులో..*

నిద్ర మెలుకువ రెండూ ఒకటే. 

*సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.*


అందంతో వచ్చే మిడిసిపాటు...

ఆస్తులతోవచ్చే అహంకారం...

పదవులతో గౌరవాన్ని ఆశించటం...

కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.


*సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.*


అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ...

అనుబంధాలను పదిలపరుచుకుంటూ...

జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!


నాకు చాలా బాగా నచ్చింది. మీతో పంచుకో వలనిపించి పంపిస్తున్న.మీకూ నచ్చితే అందరిక పంపండి ఎందుకంటే ఇది జీవత సత్యo .... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

రెండు డైరీలు* భార్యాభర్తల కధ

 *రెండు డైరీలు*  

(హృదయానికి హత్తుకునే ఒక భార్యాభర్తల కధ )


*ఆ రోజు ఆ దంపతుల పెళ్లి రోజు*,ఇద్దరూ కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు! తెలిసినవారందరికి ఆ ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దంపతులు  ! వారిద్దరి మధ్య ఎంతో  ప్రేమ  ఉండేది, అందరూ అనుకుంటున్నట్లుగానే, కానీ ప్రస్తుతం రాను రాను ఇద్దరి మధ్య కొంచెం కొంచెం దూరం పెరుగుతోంది, ఒకరి తీరు రెండో వారికి నచ్చకపోవటమే దానికి కారణం! 

     

       ఆ రోజు ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణాక్రమంలో అకస్మాత్తుగా భార్య, భర్తతో "  మన  ఇద్దరం చాలా మాట్లాడుకోవాలి , కానీ ఇద్దరికీ సమయం సరిగ్గా అనుకూలించటం లేదు,అందుకే నాకు 

ఒక  ఆలోచన వచ్చి ఇద్దరి  గురించి రెండు  డైరీలు  కొనుక్కుని  వచ్చాను, ఆ  డైరీలో, ఒకరిమీద ఒకరం పరస్పరం ఏమి  అనుకుంటున్నామో, అంటే మీరు ఈ డైరీలో నాగురించి తమరి మనసులో  ఏమనుకుంటున్నారో ఓ  సంవత్సరం పాటు ఎప్పటికప్పుడు రాస్తూండండి, నేనుకూడా అలానే రాస్తాను , సంవత్సరం అయ్యేక మళ్ళా వచ్చే మన పెళ్ళి రోజున ఒకరి డైరీ ఒకరు చదువుదాం, అప్పుడు మనకు అసలు లోపం యేమిటో అర్ధం అవుతుంది కదా" అని అంది,భర్తకు కూడా ఆ ఆలోచన నచ్చి ఒప్పుకున్నాడు ! 

  

    రోజులు,నెలలు గడచి పోయి, ఆ పెళ్లి రోజు రానే వచ్చేసింది, ఇద్దరు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు, ముందు భర్త, భార్య రాసిన డైరీ చదవటం మొదలు పెట్టాడు ... 


మొదటి రోజు .. 

మీరు నాకు ఈ పెళ్లిరోజు సందర్భంగా మంచి గిఫ్ట్ తేలేదు! 


రెండో రోజు .... 

ఈరోజు  హోటల్ కు  వెళ్లి డిన్నర్  చేసేసి వద్దాం అని అన్నా తీసుకెళ్ల లేదు! 


మూడవ రోజు.... 

ఈరోజు ఇద్దరం సినిమాకు వెళదాం అనిచెప్పి, తీరా సాయంత్రం అయ్యేటప్పటికి ,"నేను చాలా అలసి పోయాను,ఇప్పుడు కాదులే ఇంకోరోజు చూద్దాం అని అనేసారు " 


... మా  రెలెటివ్స్ ఇంటికి వస్తేవారితో సరిగ్గా మాట్లాడలేదు ! 


... ఈరోజు మీరు నా గురించి తెచ్చిన డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు, బాగా ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్ అది ! 


     ఈవిధమైన పితూరీలే ఉన్నాయి సంవత్సరం అంతా ఆ డైరీ నిండా ! అలా భార్య రాసినది అంతా చదివేసరికి, అతగాడికి కళ్ళల్లో నీళ్లుపైకి ఉబికేయి, " అయ్యో నేను ఇంతగా నిన్ను బాధ పెట్టానని గ్రహించలేదు డియర్, నాకు విషయం అర్ధం అయ్యింది కదా, ఇక ఇప్పటి నుంచి మళ్ళా అలా నిన్ను బాధ పెట్టను, ఇటువంటి  బాధాకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను , ప్రామిస్ " అని నిజాయితీ గానే చెప్పాడు అతగాడు భార్యతో ! 


  ఇక భార్యవంతు వచ్చింది, చదవటానికి తన భర్త రాసిన డైరీ తెరిచిందామె ! 


..మొదటి పేజీ ... ఖాళి ఏమీ రాయలేదు  


 ..రెండో పేజీ , మూడో పేజీ అంతే !


తరువాతి యాభై అరవై పేజీలు గబ గబా తిప్పేసి చూసేస్తోందిగాని అన్నీ అంతే ఏమీ రాయలేదు వాటిలో ! 

      ఇంతలో ఆమె భర్త నవ్వుతూ "నేను రాయాలననుకున్నదంతా ఆఖరి పేజీలో రాసేసాను, చదువు"  అనటంతోనే ఆఖరి పేజీ తెరిచి చూసింది ఆతృతతో  ! 

  

" నాకు నీమీద కోపంవచ్చినన్నిసార్లు, తిట్టేద్దాం అనుకునే వాడిని కానీ....నీముఖం చూసేటప్పటికి....నువ్వు నా తల్లిదండ్రులను వారి చరమాంకం వరకూ చేసిన సేవా,చూపించిన నీ అనిర్వచనీయమైన ప్రేమా  అదే కాకుండా సంవత్సరాలపాటు మా కుటుంబంపట్ల అలుపులేని నీ భాద్యత,ప్రేమాభి మానాలు గుర్తుకొస్తూ ఉంటే, నాకు నీమీద ఉన్న పిర్యాదులు ఎంత అల్పమైనవో అనిపించి ఈ డైరీలో నేనేమీ రాయలేక  పోయాను !  అలా అని లోపాలు లేకపోలేదు కానీ నీ సహనం, నీ త్యాగం,నీ ప్రేమాభిమానాలముందు అవన్నీ సముద్రంలో నీటి బొట్టు లాంటివేనని ఏమీ రాయలేదు ! నేను నీ యెడల బాధ్యత లేకుండా ఎన్ని సార్లు క్షమించరాని తప్పులు చేసినా నువ్వు నాకు ప్రతి విషయంలోనూ తోడుగా, ఓ నీడలా ఉంటూ సహకరిస్తూనే ఉన్నావు , అలాంటి నా నీడనే నేను ఎలా చీదరించు కుంటాను ?" 


తనభర్త రాసింది చదివే సరికి ఆమెకి  దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెగిన నదిలా పెల్లుబికి పోయింది, కాసేపటికి ఆ దుఃఖం ఉపశమించేక ఒక్కసారిగా లేచి ఆ డైరీలు రెండూ తగల బెట్టేసింది, ఆ పిర్యాదులు, ఆ ఆవేశాలు ఆ అపార్థాలు,ఆ కోపాలు, ఆ తాపాలూ అన్నీ కూడా వాటితోపాటు కాలి బూడిద అయిపోయాయి ! 

 

   వారి మధ్య మళ్ళా ప్రేమ చిగురించింది కొత్తగా పెళ్ళైన దంపతులకు మల్లే !


*ఆంగ్ల మూలంలో వచ్చిన ఒక కధకు తెలుగులో  స్వేచ్ఛానువాదం !*